సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు | Sub plan funds diverting | Sakshi
Sakshi News home page

సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు

Feb 7 2017 2:36 AM | Updated on Oct 9 2018 5:22 PM

సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు - Sakshi

సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు

సీఎం కేసీఆర్‌ రెండున్నరేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.17,500 కోట్లను దారి మళ్లించారని...

మంద కృష్ణ ధ్వజం...
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌ రెండున్నరేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.17,500 కోట్లను దారి మళ్లించారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరో పించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ.. నిధుల దారి మళ్లింపుపై సమాధానం ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పేరును ప్రగతినిధిగా మార్చి నాటకాలు ఆడు తున్నారన్నారు.

పేరు మార్చడం ఒక ఘనకార్యంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌ చెప్పుకుంటున్నారన్నారు. 22 ఏళ్లలో ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన రూ.67వేల కోట్ల నిధులు దారి మళ్లించారన్నారు. వీటన్నిం టినీ రికవరీ చేస్తే దళితులు, గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement