‘తెలంగాణ ఏర్పడ్డాకే ఎక్కువ నష్టపోయాం’
‘తెలంగాణ ఏర్పడ్డాకే ఎక్కువ నష్టపోయాం’
Published Tue, Jan 24 2017 4:08 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
యాదాద్రి: కేసీఆర్ ముమ్మాటికీ దళిత వ్యతిరేకి అని మందకృష్ఱ మాదిగ అన్నారు. సమైక్య ఆంధ్రలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కువగా నష్టపోయామని, తెలంగాణ వస్తే దళితుల పట్ల వివక్ష తొలగిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలేదని, అందుకు భిన్నంగా పనిచేస్తున్నాడని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై నేటివరకు సమీక్ష చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. రూ.10 వేల కోట్లకు రూ.4,250 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలింది దారి మళ్లించారని అన్నారు. రాజకీయంగా కూడా వివక్షకు గురైయ్యామంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తానని దళితులను మోసబుచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఆయన అన్నారు.
Advertisement