మాకు వెన్నుపోటు పొడిచారు: మందకృష్ణ
మాకు వెన్నుపోటు పొడిచారు: మందకృష్ణ
Published Mon, Apr 17 2017 5:36 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
హైదరాబాద్: ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు, బలహీనవర్గాలకు పెంచకపోవడం వెన్ను పొడవడమే అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దుయ్యబట్టారు. ఓయూలో విలేకరులతో మాట్లాడుతూ.. దళిత వ్యతిరేక విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోకపోతే రాజకీయంగా దళితులు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. దళితులపై దాడులు నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల పాటు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేస్తే కేసిఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Advertisement