
త్వరలో ఎస్సీ కమిషన్ : హరీశ్‌రావు
సంగారెడ్డి/గజ్వేల్/సిద్దిపేట: త్వరలో ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. విభజన సమస్యల వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు గజ్వేల్, సిద్దిపేటలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి సభల్లో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లే అవకాశం లేకుండా తమ ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ మండలి ద్వారానే సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. భూపంపిణీ కోసం రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో 587 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు.