sc commission
-
ఎస్సీ వర్గీకరణకు వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ ప్రక్రియను అధ్యయనం చేసేందుకు వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) నిర్ణయించింది. చట్ట సంబంధ చిక్కుల్లేకుండా అత్యంత పారదర్శ కంగా కమిషన్ అధ్యయనం చేయాలని కమిటీ తీర్మానించింది. కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఏర్పాటుకు ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ముసా యిదా సైతం అందింది. ఈ నేపథ్యంలో పలు సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కావడం తెలిసిందే. ఈ కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, పార్లమెంటు సభ్యులు మల్లు రవితోపాటు సీఎస్ శాంతికుమారి, ఏజీ సుదర్శన్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ నుంచి 30%సమాచారం: ఉత్తమ్ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియను 2011 జనగణన ఆధారంగా చేపట్టాలని కమిటీ దాదాపు నిర్ణయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రంలోని ఉద్యోగ నియామక బోర్డుల నుంచి ఎస్సీ ఉపకులాలవారీగా నియామకాల సమాచారాన్ని స్వీకరించామని, ఆర్థిక శాఖ నుంచి 30 శాతం సమాచారం వచ్చిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. గత నెల 30 నుంచి విజ్ఞాపనల స్వీకరణ ప్రారంభించగా ఇప్పటివరకు 1,082 సూచనలు వచ్చినట్లు చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల్లో వన్‌మెన్ కమిషన్.. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న పంజాబ్, తమిళనాడులలో అధికారుల బృందం అధ్యయనం చేసిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో హరియాణాలో అధ్యయనం చేయలేదన్నారు. పంజాబ్‌లో ఎస్సీ కేటగిరీలో రెండు గ్రూపులుగా వర్గీకరణ చేశారని, తమిళనాడులో విద్య, ఉపాధిలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఆ రాష్ట్రంలో 76 ఎస్సీ ఉపకులాలు ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు. ఆ రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రక్రియ చట్టపరమైన చిక్కుల్లేకుండా అమలు చేసేందుకు వన్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వర్గీకరణ అధ్యయనాన్ని సకాలంలో పూర్తి చేయడానికి కమిషన్‌కు కాలపరిమితి విధించాలని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా పర్యటించి ఎస్సీ వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. దీంతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ వర్గీకరణపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఉపసంఘం సభ్యులు త్వరలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. వర్గీకరణ ప్రక్రియలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) వంటి ప్రసిద్ధ ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. -
ఉపసంఘం పేరిట కాలయాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉపసంఘం పేరిట కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రైతులను మోసగించిన తరహాలో మాదిగలను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో కలసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సుంకె రవిశంకర్, పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.ఇతర రాష్ట్రాలకంటే ముందుగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారన్నారు. లోక్‌సభ ఎంపీ టికెట్లు, మంత్రివర్గంలో మాదిగలకు ప్రాతినిథ్యం లేకుండా పోయిందని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాలలకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే డీఎస్సీ తాజా నియామకాల్లో 1,200 ఉద్యోగాలు మాదిగ సామాజికవర్గానికి దక్కేవన్నారు. సీఎం రేవంత్‌కు హైడ్రాపై ఉన్న ప్రేమ మాదిగలపై లేదని, ఆయన మాదిగ ద్రోహిగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో మాదిగలకు మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ నియంతలా వ్యవహరిస్తూ మాదిగలను మోసం చేయాలని భావిస్తున్నారని గువ్వల బాలరాజు విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుంటే జాతీయస్థాయిలో మాదిగ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించకుంటే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను అడ్డుకోవాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. ఎస్సీకమిషన్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం బుధవారం(ఆగస్టు14) ఢిల్లీలో కలిసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద టీడీపీ శ్రేణుల దాడిపై నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు నేతలు కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు, సీసీ కెమెరాలు ఆపేసి అంబేద్కర్ విగ్రహంపై దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీకమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఏ. సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎంఎల్సీ అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులున్నారు. కమిషన్ చైర్మన్‌ను కలిసి బయటికి వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ సిద్ధాంతాలపై దాడి: గురుమూర్తి,ఎంపీజాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానను కలిశాంఅంబేద్కర్ విగ్రహం పై దాడి అంటే ఆయన సిద్ధాంతాలపై దాడిఇది దళిత సమాజాన్ని అవమనపరచడమేఈ ఘటనపై ఎస్సీ కమిషన్ దర్యాప్తు చేయాలిఓర్వలేకపోతున్నారు: మేరుగ నాగార్జున, మాజీ మంత్రిఅంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఓర్వ లేక పోయారుపలుగులు, గుణపాలతో పొడిచి దాడి చేశారు.దీనిపై చర్యలు తీసుకోవాలని ధర్నాలు, నిరసనలు చేశాం.కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.ఎవరిపైనా కేసు పెట్టలేదు.పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు.అందుకే ఎస్సీ కమిషన్ ను కలిసి పరిస్థితి వివరించాం.చంద్రబాబు ప్రభుత్వం పై నమ్మకం లేదు.కేంద్ర బలగాలతో అంబేద్కర్ విగ్రహానికి భద్రత కల్పించాలి.రెండు నెలల నుంచి రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి.వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంబేద్కర్ విగ్రహం నిలబెట్టిన వేదికను పగలగొడితే దాడి కాదా ?త్వరలో ఏపీకి ఎస్సీ కమిషన్: ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రిటీడీపీ నాయకుల ప్రోద్బలంతో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది.దాడిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.వైఎస్ జగన్ పేరు తీసేస్తే.. చెరిగిపోయే పేరు జగన్‌ది కాదు.ఏపీ ప్రజల గుండె చప్పుడు వైఎస్ జగన్.రెండునెలల నుంచి జరుగుతున్న దాడులకు పరాకాష్ట అంబేద్కర్ విగ్రహం పై దాడిత్వరలోనే ఎస్సీ కమిషన్ ఏపీకి వస్తుంది.విగ్రహానికి కేంద్ర బలగాల భద్రత కల్పించాలి.పోలీసుల నిర్లక్ష్యం పై విచారణ జరపాలి.ప్రాణాలు అడ్డుపెట్టి విగ్రహాన్ని కాపాడుతాం.ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు: నందిగం సురేష్, మాజీ ఎంపీఅంబేద్కర్ విగ్రహం దాడి చేస్తే టీడీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.ఎస్సీ కమిషన్ కు అన్ని వివరించాం.దాడులు చూస్తే ఏపీ అంటేనే జనం హడలిపోతున్నారు.ఏపీని చంద్రబాబు అరాచకం వైపు నడిపిస్తున్నారు.బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలెక, దాడులకు పాల్పడుతున్నారు.దాడులకు భయపడేది లేదు.రెండు నెలలో టీడీపీ ఓటు బ్యాంకు అయిదు శాతం పడిపోయింది.దాడులు జరిగితే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి? -
దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం: విక్టర్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల డా. బీఆర్.అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.400 కోట్లతో స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని బడుగు, బలహీనవర్గాలవారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిఒక్కరూ కుల, మత, పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అందరివాడైన అంబేద్కర్ స్మృతి వనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా డా.బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండగ వాతావరణంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. -
చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉందని సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో పాటు దీనిపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఒకవేళ కోర్టు ద్వారా ఇది సాధ్యం కాకపోతే చట్ట పరంగా చేసేందుకు కూడా బీజేపీ, కేంద్రం కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. తాజాగా కేంద్రం ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్ కమిటీ వర్గీకరణ చేయాలా..? వద్దా..? అన్న అంశంపై కాదని, వర్గీకరణపై కోర్టు కేసులు, ఇతర ప్రాధాన్యతాంశాలను రోజువారీ పర్యవేక్షించేందుకేనని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్సే మొదటి ముద్దాయి సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని న్యాయం, ధర్మం గురించి మాట్లాడిన తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఒక సమస్యపై చొరవ తీసుకుని చర్చిస్తే దానిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్టుగా ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లలో ఎస్సీ వర్గీకరణపై వివిధ కమిటీలు వేయగా, అనేక పోరాటాలు జరిగాయని చెప్పారు. దీనికి అనుకూలమంటూ కంటి తుడుపు చర్యలు చేపట్టడమే తప్ప ఎవరూ దీని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్సే మొదటి ముద్దాయి అని పేర్కొన్నారు. ఉషా మెహ్రా కమిషన్ సమర్పించిన నివేదికను కనీసం చదవకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని ధ్వజమెత్తారు. తీర్మానంతో చేతులు దులుపుకున్న బీఆర్ఎస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి దీని సాధనకు ఎలాంటి కృషి చేయలేదని, పార్లమెంట్లో సైతం బీఆర్ఎస్ ఎంపీలు ఏనాడూ ఈ అంశాన్ని లేవనెత్తలేదని ధ్వజమెత్తారు. ఈ సమస్యపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించిందని, ప్రధాని మోదీ సూచనలతో గతనెల 2న ఢిల్లీలో ఎమ్మారీ్పఎస్ నేతలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులతో అమిత్‌షా భేటీ అయ్యాక ఈ అంశంపై కదలిక వచ్చిందని చెప్పారు. కేంద్రం వర్గీకరణకు సానుకూలంగా ఉందని గతనెల 2న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారని, ఏడుగురు జడ్జీల బెంచ్‌ను వేయాలని కోరగా గతనెల 10న సీజే రాజ్యాంగ ధర్మాసనాన్ని వేశారని తెలిపారు. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమనే దానికి ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్, రామజన్మభూమి ఆలయ నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ నుంచి భారతీయుల సురక్షిత తరలింపు వంటివి నిదర్శనమని కిషన్‌రెడ్డి చెప్పారు. -
ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోరిక అత్యంత న్యాయమైనదని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేస్తున్న ఉద్యమం సరైనదని, త్వరలో మాదిగల ఆకాంక్షను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాదిగ ఉప కులాల ఉద్యమానికి బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉందని, ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలు, మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతోందని, ఎస్సీ జాబితాలో ఉన్న కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికే కట్టుబడి ఉందని చెప్పారు. దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమన్నారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్లు కొనసాగించనున్నట్లు తెలిపారు. తెలుగు కవి గుర్రం జాషువా కవితల ప్రేరణతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారని, వన్ లైఫ్.. వన్ మిషన్లా చేస్తున్న ఈ ఉద్యమం స్పూర్తినిచ్చిందని తెలిపారు. తెలంగాణలో దళితులకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటిరోజే దళిత ముఖ్యమంత్రి హామీని తొక్కేశారని, సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని అన్నారు. దళితబంధు అంటూ వేలకోట్ల రూపాయలను వారి పార్టీ నేతల విధేయులు, కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఎన్నోరకాలుగా అవమానపర్చిందని, అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిందని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని చెప్పారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ను కాంగ్రెస్ వేధించిందన్నారు. మా ఆకాంక్షలు నెరవేర్చేది మోదీయే: మంద కృష్ణ దళితుల ఆకాంక్షలు నెరవేర్చేది ప్రధాని మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ వ్యక్తి లేరని మండిపడ్డారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కూడా పరిష్కరించాలని మోదీని కోరుతున్నానంటూ మంద కృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. మోదీ మంద కృష్ణను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనను క్రైస్తవ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న విషయం మీకు కూడా తెలిసిందేనన్నారు. కాగా చాలాచోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందని.. దీన్ని పరిష్కరించాలని క్రైస్తవ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని చెప్పారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని కొనియాడారు. పారదర్శకంగా, వివక్షలేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ వల్ల చివరి లబ్ధి దారుడికి సైతం పథకాల మేలు లభిస్తోందని ప్రశంసించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్నును మినహాయించాలని విన్నవించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని సీఎంను కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. దీనికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్‌ను, సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా మెదక్‌కు చెందిన బక్కి వెంకటయ్య నియామకమయ్యారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ(కరీంనగర్), జిల్లా శంకర్ (నల్గొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్ (ఆదిలాబాద్)ను నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. -
ఎస్సీ కమిషన్‌కు ఆ అధికారం లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీస్ అంశాలపై విచారణ జరిపే అధికారం ఎస్సీ కమిషన్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన రూపొందించాలని 2001లో సర్కార్ జీవోలు జారీ చేసింది. అయితే ఈ జీవోలను నిలిపివేయాలని విద్యుత్ సంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. స్పందించిన కమిషన్ 2022, నవంబర్ 29న జీవోలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఉత్తర్వుల కారణంగా బీసీ, ఓసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కొండెపాక కుమారస్వామి, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫున సుంకర చంద్రయ్య వాదనలు వినిపించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేశారు. ప్రభుత్వసంస్థల ఉద్యోగుల సర్వీసు అంశాలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు విచారణ జరిపే అధికారం లేదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వివరాలను సమర్పించండి విద్యుత్‌సంస్థల్లో పదోన్నతుల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన ప్రమోషన్లు అన్నింటిని సమీక్షించాలని 2019లో హైకోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అయినా ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతన్యాయస్థానం ఫిబ్రవరి 8న వివరాలను సమర్పించాలని యాజమాన్యాలను ఆదేశించింది. -
జాతరలో బీఫ్ బిర్యానీకి నో.. కలెక్టర్‌కు నోటీసులు
చెన్నై: సంప్రదాయంగా వస్తున్న అంబూరు బిర్యానీ జాతరలో.. పంది, గోడ్డు మాంసానికి అనుమతి నిరాకరించడంపై తమిళనాడు ఎస్సీఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు తిరుపత్తూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తన చర్యలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో కలెక్టర్‌ను కోరింది కమిషన్. అంబూర్ బిర్యానీ ఫెస్టివల్..అనాదిగా జరుగుతున్న ఈ జాతరలో 20 రకాల బిర్యానీలు వండి వడ్డిస్తారు. షెడ్యూల్ ప్రకారం.. మే 13-15 తేదీల మధ్య ఈ జాతర జరగాలి. అయితే భారీ వర్షాల కారణంగా ఈ జాతరను తాత్కాలికంగా రద్దు చేసింది జిల్లా పరిపాలక విభాగం. కానీ, అంతకు ముందు జిల్లా కలెక్టర్, అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బిర్యానీ ఫెస్టివల్లో బీఫ్ (గొడ్డు), పోర్క్(పంది)కు అనుమతి లేదని, వాటి బిర్యానీల స్టాల్స్ పెట్టొద్దంటూ జిల్లా కలెక్టర్ అమర్ ఖుష్వాహ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై పలు అభ్యంతరాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. తమిళనాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించింది. అలా ఎందుకు ఆదేశించారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది కమిషన్. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కమ్యూనిటీలపై వివక్ష కిందకే వస్తుందని, దీనిని అంటరానితనంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న కమిషన్.. కలెక్టర్‌కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. -
ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా విక్టర్ ప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మారుమూడి విక్టర్‌ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. గతేడాది జనవరిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. చదవండి: దళితులపై దాడులకు చంద్రబాబే గ్యాంగ్ లీడర్ దీంతో ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన న్యాయవాది, దళితుల సమస్య లపై 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసిన మారుమూడి విక్టర్ ప్రసాద్‌ను ప్రభు త్వం నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. విక్టర్ ప్రసాద్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొన సాగుతారు. -
ఏపీకి సంబంధించి 2 కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కోసం వేర్వురు కమిషన్లు ఏర్పాటు చేస్తూ.. బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్‌కు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు శానసమండలి కొన్ని సవరణలు చేసి వెనక్కు పంపింది. అయితే ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావన్న శాసన సభ.. బిల్లును జనవరి, 2020 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యథాతథంగా ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ అందుబాటులోకి రానుంది. -
చట్టం ఎవరికీ చుట్టం కాదు
హన్వాడ (మహబూబ్‌నగర్): ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు.. పోలీసులు చట్టప్రకారం తమ విధినిర్వహణ సరిగ్గా చేయకపోతే వ్యవస్థ బ్రష్టు పడుతుంది.. పోలీసుల మీద ముందే బద్నాం ఉంది.. చార్జీషీట్లో పేర్లు ఎందుకు నమోదు చేయలేదు.. బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్న వారిని ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు..’ అని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు పోలీసులను ప్రశ్నించారు. మండలంలోని యారోనిపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి అరుణ్‌చంద్ర ఆత్మహత్యపై విచారణ నిమిత్తం మంగళవారం గ్రామానికి వచ్చిన ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచాయతీ అధికారుల తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ మినిట్స్ పుస్తకాల్లో పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండా సంతకాలు, సభ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించిన ఆయన జిల్లా, మండల పంచాయతీ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మండల ఎంపీఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డిలను విచారించారు. అరుణ్ ఆత్మహత్యకు గల కారణాలు, విభేదాలు తదితర అంశాలపై వారి నుంచి విషయాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. అంతకుముందు ఉపాధి హామీ మేటీ మైబమ్మ, పంచాయతీ వాటర్‌మెన్ కృష్ణయ్యలను ప్రశ్నించారు. వారితో పంచాయతీ కార్యదర్శి అరుణ్ ఎలా ఉండే వారని తదితర విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. వారు సరైన సమాధానం ఇవ్వకపోడంతో కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు. వారితోపాటు సర్పంచ్ సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి, ఎంపీఓ వెంకట్రెడ్డిలను పోలీసులు విచారించి వివరాలను రాబట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్‌లాల్, సోషల్ వెల్ఫేర్ డీడీ యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్, ఎంపీపీ బాలరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నటరాజు, సీఐ మహేశ్వర్, ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జూనియర్ పంచాయతీ కార్యదర్శి అరుణ్‌చంద్రను ఆత్మహత్యకు ప్రేరేపించి ఆయన మృతికి కారణమైన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అన్నారు. మంగళవారం స్థానిక రెవెన్యూ హాల్లో అరుణ్‌చంద్ర మృతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ్ మృతిచెంది 12 రోజులు గడిచినా ఇప్పటి దాకా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. చనిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలన్నారు. గ్రామ సర్పంచ్ భర్త వేధింపులతోనే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, సర్పంచ్ భర్త ఫోన్లో సైతం వేధించినట్లు ఫోన్ సంభాషణ రికార్డు కూడా ఉందన్నారు. వీటన్నింటిని పరిశీలించి ముందుగా బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రత్యేక బృందంతో విచారణ కలెక్టర్ వెంకట్రావ్ అరుణ్ మృతిపై ఎస్పీతో మాట్లాడానని, ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తామని ఎస్పీ చెప్పారన్నారు. జిల్లాలో కరోనా లాకడ్డౌన్ ఉన్నందున విచారణలో కొద్దిగా ఆలస్యమైందని, ఇకపై జాప్యం లేకుండా తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడుతూ నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మోహన్‌లాల్, సీతారామారావు, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పరామర్శ.. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని అరుణ్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, పద్మావతిలను కమిషన్ సభ్యుడు రాములు పరామర్శించారు. తమ కుమారుడు చాలా చురుకైన వాడని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో చేరాడని, సర్పంచ్ భర్త వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, చట్టప్రకారం చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని కమిషన్ సభ్యుడు రాములు వారికి హామీ ఇచ్చారు. -
ఎస్సీ కమిషన్ బిల్లు యథాతథంగా ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ బిల్లును శాసనసభ మంగళవారం ఆమోదించింది. గతంలో అసెంబ్లీలో ఆమోదించి పంపిన ఈ బిల్లును శాసన మండలి సవరణలు సిఫార్సు చేసి వెనక్కి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా శాసనసభలో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. శాసనమండలి చేసిన సవరణ సిఫార్సులు ఆమోద యోగ్యం కావని, అందువల్ల బిల్లును యథాతథంగా ఆమోదించాలని, ఎలాంటి సవరణలు అవసరం లేదని మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. ఈ బిల్లు చరిత్రాత్మకం అని ప్రశంసిస్తూ పలువురు వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడగా, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మాత్రం పోడియంలోకి వెళ్లి నిరసనకు దిగారు. బిల్లును ఆమోదించినందుకు ఎస్సీ, ఎస్టీ మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు సభలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడారు. ఎస్టీ, ఎస్టీలపై చంద్రబాబు వివక్ష ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన బిల్లు చరిత్రాత్మకమని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. ఈ బిల్లును శాసన మండలిలో ఆమోదించకపోవడం సరికాదని చెప్పారు. తద్వారా ఆయా వర్గాల పట్ల చంద్రబాబు తన వివక్షను చాటుకున్నారని విమర్శించారు. ‘ఎస్సీల సంక్షేమంపై మా నేత వైఎస్ జగన్ చిత్తశుద్ధి ఎంత? మీ నేత చంద్రబాబు చిత్తశుద్ధి ఎంత? చర్చకు రండి’ అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు జగన్మోహన్రావు, జోగులు, బాలరాజు బిల్లును సమర్థిస్తూ మాట్లాడారు. సభను టీడీపీ అడ్డుకోవడం దారుణం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సమర్థించాల్సిన టీడీపీ దీనికి విరుద్ధంగా సభను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణమని ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. గతంలో దిశ, బీసీ కమిషన్ బిల్లుల సమయంలోనూ టీడీపీ ఇలాగే రాద్ధాంత చేసిందని ధ్వజమెత్తారు. దళితుల పట్ల టీడీపీ వివక్ష చూపుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు జగన్ సర్కారు పెట్టిన బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన (స్వగ్రామం ఉన్న) చంద్రగిరిలో దళితులను 40 ఏళ్లుగా ఓట్లు వేయనీయడం లేదని విప్ కొరుముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. -
ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా?
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు బిల్లుపై చర్చ జరగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడటం మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దళితుల హక్కులను కాలరాసేలా వ్యవహరించడంపై వైఎస్సార్ సీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ అనుమతితో మంత్రి విశ్వరూప్ ఈ బిల్లును సభ ముందుంచారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు దళిత ద్వేషి: వరప్రసాద్ బిల్లుపై చర్చను అడ్డుకుంటూ టీడీపీ ఆందోళనకు దిగడంపై ఎమ్మెల్యే వరప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చులకనగా మాట్లాడిన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడేనా అని ప్రశ్నించారు. నవరత్నాలు పేదలకు ఎలా ఉపయోగపడుతున్నాయో టీడీపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పేరుతో టీడీపీ ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి అనిల్ అన్నారు. ఎస్సీలను తొలగించిన చరిత్ర బాబుది: పుష్ప శ్రీవాణి దళితులంటే టీడీపీకి ఎంత వ్యతిరేకత ఉందో బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా తెలుస్తోందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పారు. మంత్రివర్గం నుంచి ఎస్సీలను తొలగించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని, ఎస్టీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. కాగా, దళితుల సంక్షేమం టీడీపీకి పట్టదని ఎమ్మెల్యే నాగార్జున విమర్శించారు. మహిళా మంత్రులను అవమానిస్తున్నారు: రోజా ఎస్సీ ఎస్టీ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా మంత్రిని అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఎందుకు శాశ్వత కట్టడాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను కేసీఆర్ పొగిడినట్లు చంద్రబాబు చెబుతున్నారని అయితే నిజానికి చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ లేరని ఆయన అన్నారని తెలిపారు. మహిళా మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు బతికే దాన్ని సామాజిక రాజధాని అంటారని, సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని వీళ్లు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, నక్కా ఆనంద్‌బాబు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. అనంతపురం నుంచి వచ్చి పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని, కానీ యామినిబాల ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీశారు. బిల్లుకు అడ్డుపడుతున్న టీడీపీ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.కన్నబాబు, సుధాకర్‌బాబు, గొల్ల బాబూరావు, జోగారావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
టీడీపీది దిక్కుమాలిన వైఖరి
సాక్షి, అమరావతి: ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి విభజించడం ద్వారా లబ్ధిపొందాలని చంద్రబాబునాయుడు దిక్కుమాలిన నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంలోకి వెళ్లి నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా వైఎస్ జగన్ జోక్యం చేసుకుని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటుచేయాలని తమ సర్కారు చరిత్రాత్మక బిల్లులు తెస్తే ఎస్సీ కమిషన్ బిల్లును శాసన మండలి తిప్పి పంపిందని.. మళ్లీ అసెంబ్లీలో దీనిని యథాతథంగా పెడితే ఇక్కడ బలం లేనందున టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంలోకి వెళ్లి రచ్చచేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ‘జైజై అమరావతి’ అనే నినాదాలతో ఎందుకు పోడియంలోకి వెళ్లారో? ఎందుకు జైజై అమరావతి అంటున్నారో వారికే అర్థం కావడంలేదన్నారు. ఇదీ విపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని.. ఇందుకు తమ చర్యలే నిదర్శనాలని.. ఎస్సీలను కలిపి ఉంచడం ద్వారానే అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న వారిని విడదీయడం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం ఇంకా ఏమన్నారో సంక్షిప్తంగా ఆయన మాటల్లోనే.. మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటుచేశాం రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మాలలకు ఒకటి, మాదిగలకు మరొకటి, రెల్లి ఇతర కులాలకు వేరొకటి కలిపి ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేశాం. అందరినీ ప్రగతిపథంలో నడపాలన్నది మా విధానం. దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉంటే, వారి డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుంది. అందువల్ల విడగొట్టాలన్న దుర్బుద్ధితో చంద్రబాబు వ్యవహరించారు. మేం మాత్రం ఎస్సీలంతా సమిష్టిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేశాం. మరింత మేలు చేసేందుకు కమిషన్లు ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా, సామాజికంగా మరింత ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారికి వేర్వేరు కమిషన్లు ఏర్పాటుచేయాలని బిల్లు పెట్టాం. మా పట్ల ఎస్సీ, ఎస్టీలు ఎంతో అభిమానం చూపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో రెండు మినహా మొత్తం వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ వర్గాలకు చెందిన స్థానాల్లో టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి మరొకరు మాత్రమే గెలిచారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి సమయానుగుణంగా మద్దతు ఇస్తున్నారు. టీడీపీ.. వారికి ఉన్న ఏకైక ఎస్సీ సభ్యుణ్ణి ముందు పెట్టి నీచ రాజకీయాలు చేస్తోంది. ఆయన వైఖరిని చూసి ఎందుకు గెలిపించామా? అని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. కీలక శాఖలు కేటాయించాం గతంలో ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఆరు మంత్రి పదవులు ఇచ్చింది. వారిలో ఇద్దరు (ఒక ఎస్సీ, ఒక ఎస్టీ) ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అంకెల్లోనే కాదు. కీలక శాఖలు కూడా ఈ వర్గాల వారికి ఇచ్చాం. కీలకమైన విద్య, హోంశాఖలకు ఎస్సీ మంత్రులే ఉన్నారని గర్వంగా చెప్పగలం. రెవెన్యూ ఆర్జనలో కీలకమైన ఎక్సైజ్ శాఖను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం మరోసారి అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. -
టీడీపీది హీనమైన చరిత్ర : సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది ఒక చరిత్రాత్మక నిర్ణయమని, కానీ ఆ బిల్లును శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని, ఇది విపక్షనేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందుకే సభలో మంగళవారం మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకే మంత్రి పదవుల్లో ఆరుగురిని నియమించామని, అయిదుగురు ఉప ముఖ్యమంత్రులలో ఇద్దరు ఆ వర్గాలకు చెందిన వారున్నారని తెలిపారు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను విడదీసి లబ్ధి పొందాలని చూశారని సీఎం ఆక్షేపించారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం మరోసారి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పలువురు సభ్యుల మాట్లాడిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. టీడీపీది దిక్కుమాలిన చరిత్ర ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసే చరిత్రాత్మక బిల్లును గతంలో శాసన మండలిలో ఆమోదం పొందకుండా చేసిన దిక్కుమాలిన చరిత్ర తెలుగు దేశం పార్టీది అని, ఇదీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, పార్టీ ఎమ్మెల్యేల వైఖరి అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. దీంతో మరోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టామని, ఈసారి మండలిలో అడ్డుకోవడం సాధ్యం కాదు కాబట్టి, సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ విధంగా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విపక్షం వ్యవహరిస్తోందని తెలిపారు. మూడు కార్పొరేషన్లు రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. మాల, మాదిగతో పాటు, రెల్లి ఇతర కులాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ అదే ఎస్సీలను విడదీసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు కుట్ర చేశారని, వారిని విభజించి పాలించాలని దుర్భుధ్ధితో వ్యవహరించారని ఆక్షేపించారు. దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉంటే, వారి డిమాండ్‌కు తలొగ్గాల్సి వస్తుందన్న దుర్భుద్ధితో వారిని విడగొట్టాలని చంద్రబాబు అడుగులు వేశారని ఆరోపించారు. దాన్ని సరిచేస్తూ, ఎస్సీలంతా ఒక్కటై ఉండాలన్న లక్ష్యంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మరింత మేలు చేసేలా.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేంగా వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయాలని ప్రయత్నిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రస్తావించిన ఆయన, వాటిలో రెండు మినహా అన్నింటినీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుందని గుర్తు చేశారు. టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి మరొకరు గెలిచారని తెలిపారు. కాగా, జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే, తాము చేస్తున్న మంచి పనులు చూసి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తమకు ఉన్న ఏకైక సభ్యుడిని ముందు పెడుతున్న టీడీపీ, రాజకీయం చేస్తోందని, ఆయన వైఖరి చూస్తుంటే ఎందుకు గెలిపించామని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్య పోస్టులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 6 మంత్రి పదవులు ఇచ్చామన్న సీఎం వైఎస్ జగన్, వారిలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. ఇంకా కీలకమైన విద్యా మంత్రి, హోం మంత్రి కూడా ఎస్సీలని, దీన్ని గర్వంగా చెప్పగలమని అన్నారు. ఇదే కాకుండా ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. ఆ విధంగా ఎస్సీలను ముఖ్యమైన పదవుల్లో నియమించామని వివరించారు. ఇప్పుడైనా మద్దతు ఇవ్వండి వీటన్నింటితో పాటు, ఎస్సీ, ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, గతంలో ఆ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకుందని, కాబట్టి శాసనసభలో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. చదవండి: ‘సీఎం జగన్‌కు గిరిజనుల తరుపున ధన్యవాదాలు’ ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సంక్షేమ పథకాలు వదిలేద్దామా! రాజధానులిక అందరివీ.. -
ఇంత దారుణమా చంద్రబాబూ..!
సాక్షి, అమరావతి: దళితుల విషయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి దళితుల గురించి చంద్రబాబు గతంలో చులకనగా మాట్లాడారని, దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ నాడు సీఎం హోదాలో చంద్రబాబు పేర్కొన్నారని, ఒక సీఎం స్థాయి వ్యక్తులే ఈరకంగా మాట్లాడితే ఇక కిందిస్థాయి వ్యక్తులు ఎలా దళితులను గౌరవిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. బాబు కేబినెట్లోని మంత్రే దళితులు స్నానం చేయరు, వారి వద్ద వాసన వస్తుందని అనుచితంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చంద్రబాబు ఏరకంగా అన్యాయం చేశారో గణాంకాల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ సభకు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేసే బిల్లుపై సభా నాయకుడిగా, సీఎంగా వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. అయితే, ఈ సమయంలో టీడీపీ సభ్యులు అల్లరి చేస్తూ.. సీఎం ప్రసంగిస్తుండగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. తన మాటలు ప్రజల వద్దకు వెళ్లవద్దనే దురుద్దేశంతోనే టీడీపీ సభ్యులు అరుస్తున్నారని, ఇటువంటి దారుణమైన పనులు చేయిస్తున్న వ్యక్తి చంద్రబాబు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండబోరేమోనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే మాటలు రావని, ఏపీ స్టేట్ కమిషన్ గురించి బాబు మాట్లాడుతూ.. 2003లోనే తాము ఎస్సీ కమిషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్ 1992లోనే వచ్చిందని, 1994-95 మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2004 ఎన్నికలకు ముందు రాజకీయ ఆలోచనతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను తీసుకొచ్చారని, 1992లో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వస్తే.. 200 3దాకా రాష్ట్రంలో అలాంటి కమిషన్ తీసుకురావాలన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు అప్పట్లో పరిపాలించారని మండిపడ్డారు. ‘ఎంచి చూడగా మనుషులందున మంచిచెడులు రెండే కులములు మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనవుతాను’ అని వంద సంవత్సరాల కిందట గురజాడ అప్పరావు అంటే.. దళితులుగా పుట్టాలని ఎవరునుకుంటారంటూ ఇప్పడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు సీఎం అయిన తర్వాత పేర్కొన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేదని దుయ్యబట్టారు. రాజధాని కోసం సీఆర్డీఏ సేకరించిన భూముల విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు చంద్రబాబు దారుణమైన అన్యాయం చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు ఎక్కువ భూమి కేటాయించి.. దళిత, బీసీ, మైనారిటీలకు సంబంధించిన అసైన్డ్‌భూములకు మాత్రం తక్కువ భూమి పరిహారంగా కేటాయించిన విషయాన్ని వివరించారు. దళిత, బీసీ, మైనారిటీలపై ఇంత దారుణమైన వివక్ష చూపించడం వల్లే.. రాష్ట్రంలో 36 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో ఒక్కటి మాత్రమే టీడీపీ గెలుచుకుందని తెలిపారు. రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీల కోసం తమ ప్రభుత్వం మరో విప్లవాత్మక బిల్లును తీసుకొచ్చిందని సీఎం జగన్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల మీద సమగ్ర అధ్యయనం చేసి.. పరిష్కారం దిశగా కృషిచేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర కేబినెట్లో 60శాతం మంత్రి పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీలే ఉన్నారని, రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీ వర్గాలకు చెందిన వారని, ఇది తమ ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రిగా ఒక దళిత మహిళ ఉందని, గత హయాంలో ఎన్నికలు వచ్చే వరకు కనీసం ఒక్క ఎస్టీకి మంత్రి పదవి కూడా చంద్రబాబు ఇవ్వలేదని, ఇప్పుడు ఒక ఎస్టీ మహిళను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశామని సీఎం జగన్ అన్నారు. నామినేటెడ్ పదవులు, నామినెటెడ్ పనుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. గ్రామ సెక్రటేరియట్లలో లక్షా28వేలకుపైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించగా.. అందులో 82.5శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీ ఉద్యోగులే ఉన్నారని వివరించారు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు విప్లవాత్మక అడుగులు వేస్తున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలు, ఎస్టీల కోసం ఇంకొక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు దిక్కుమాలిన రీతిలో, సిగ్గులేనిరీతిలో ప్రవర్తిస్తున్నారని, వారిని సస్పెండ్ చేసినా తప్పులేదని అన్నారు. -
కేసులపై ఇంత నిర్లక్ష్యమా..?!
సాక్షి, మంచిర్యాల: ‘కమిషన్ సమీక్ష సమావేశం అంటే కాగితాలు ఇస్తే సరిపోతుంది.. కేసుల వివరాలు వివరించాల్సి అవసరం లేదనుకున్నారా..? రాష్ట్రంలోని 28 జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మంచిర్యాలలో పెండింగ్ ఉన్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం..’ అంటూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ పోలీస్, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంచి ర్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ భారతి హోళీకేరి, జేసీ వై.సురేందర్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, ఎస్సీ కమిషన్ సభ్యులు నీలాదేవి, డీసీపీ రక్షిత కే.మూర్తితో కలిసి ఎస్సీ, ఎస్టీ విచారణ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు 20శాతం కేసులు కూడా పూర్తి చేయలేదని, వారికి ఎలాంటి న్యాయమూ చేయడం లేదని పేర్కొన్నారు. ‘జిల్లా నుంచి 81 ఎస్సీ, ఎస్టీ కేసులు నా వద్దకు వచ్చాయి. వీటిపై విచారణ ఎంత వరకు వచ్చిందని అడిగితే సమా«ధానం లేదు. ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియానే ఇస్తుంది. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్, రెవెన్యూ అధికారులపైనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలసాకుతో నిందితులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు..’ అంటూ ప్రశ్నించారు. నెలల తరబడి ‘బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. వారి బాధలు మీకు పట్టవా.. ఇలాగైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పేద బాధితులు పోలీసులపై ప్రభుత్వంపై నమ్మకం పోతుంది..’ అన్నారు. ‘నేను పిహెచ్డీ చేశాను. ఉద్యమంలో పాల్గొన్నాను. ప్రతి గ్రామం, గూడెం, తండాలను సందర్శించాను. ఎస్సీ, ఎస్టీలకు జరిగే అన్యాయాలను ప్రత్యేకంగా చాశా. బాధితులకు పోలీస్, రెవెన్యూ అధికారులు అండగా ఉండాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కమిషన్ అంటే కార్యాలయానికే పరిమితం అయ్యింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నేను కమిషన్ అయినప్పటి నుంచి ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్టేషన్లో, ఇతర కార్యాలయాల్లో కేసులను బట్టి ఎక్స్‌గ్రేషియా వివరాలు, శిక్షలు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్స్‌గ్రేషియా కాదు.. శిక్ష పడాలి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కేసులకు సంబంధించి 5 వేల మంది బాధితులకు రూ.41.33 కోట్ల ఎక్స్‌గ్రేషియా అందించిందన్నారు. ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తుంది కాని నిందితులకు శిక్షపడేలా చేయాల్సింది పోలీస్ అధికారులదే బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బాధితుల సమస్యలు తెలసుకుని పరిష్కరించేందుకు కలెక్టర్ల అధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. 2018 జనవరి 18న బాధితుల సరైన న్యాయం అందించేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియమించిందని, బాధితుల పట్ల పూర్తి భరోసా ఇచ్చి మనోధైర్యం నింపి అండగా నిలుస్తుందన్నారు. అట్రాసిటి కేసులు, భూ వివాదాలు తదితర అంశాలపై పోలీసు అధికారులు కేసుల వివరాలు నమోదు చేసి కలెక్టర్ సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించాలని, బాధితులకు తగిన న్యాయం జరిగేలా కమిషన్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే 28 జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా బాధితుల సమస్యలను తెలసుకుని వాటి పరిష్కరానికి కృషి చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో పనిచేస్తూ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు సామాజిక భద్రత కల్పించేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. కేసులపై ఇప్పటివరకు రిమైండర్లు పంపించామని, మూడు రిమైండర్లు జారీ చేసిన తరువాత విచారణ చేసి శిక్షించే అధికారం కమిషన్‌కు ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మరోసారి నిర్వహించే సమీక్ష సమావేశం నాటికి ప్రతి కేసు వివరంగా, క్షుణ్ణంగా ఉండాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన బాధితులు రోదిస్తూ.. ఫిర్యాదులు అందించారు. కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వర్, ఏసీపీలు గౌస్‌బాబ, బాలు జాదవ్, వెంకటరెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ కో–ర్డినేటర్ అత్తిసరోజ, ఆర్డీవో సురేష్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా అధ్యక్షులు జిల్లపెల్లి వెంకటస్వామి పాల్గొన్నారు. మంచిర్యాల అంటే నమ్మకం రాష్ట్రంలో అన్ని జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించాం. కేసులు పెండింగ్ ఈ జిల్లాలో ఉన్నట్లు ఎక్కడా లేవు. మంచిర్యాల అంటే ఎంతో మంచి జిల్లాగా గుర్తించాను. ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసిన వారిపై తక్షణమే స్పందించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్ కేసులు ఉండకుండా అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. – లీలాదేవి, ఉమ్మడి జిల్లా ఎస్సీ,ఎస్టీ కమిషన్ మెంబర్ సాక్ష్యులకు రవాణా ఖర్చులు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో సాక్ష్యులను తీసుకొచ్చే వారికి ప్రభుత్వం రవాణా, భోజన చార్జీలు చెల్లించాలి. పేద ఎస్సీ, ఎస్టీ బాధితులు సాక్ష్యులను నిందితులు మచ్చిగా చేసుకుని వారే రవాణాచార్జీలు, ఇతర ఖర్చులు చెల్లిస్తుండడంతో కేసు నమోదు సమయంలో ఒక రకంగా.. కోర్టులో మరోరకంగా సాక్ష్యం చెబుతున్నారు. ప్రభుత్వమే ఖర్చులు చెల్లిస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. – రమణారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ, పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ -
వివాదాస్పద స్థలం పరిశీలన
సాక్షి, కావలి: నెల రోజులుగా కావలి పట్టణంలో గుడిసెలు కూల్చివేత వివాదాన్ని పరీశీలించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య తల్లోజు శుక్రవారం కావలి పట్టణానికి వచ్చి, స్థానిక బాలకృష్ణారెడ్డినగర్ పక్కన ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అప్పటికే అక్కడ ఉన్న మూడు వర్గాల వాదనలను రెండు జాతీయ కమిషన్ సభ్యులు ఉమ్మడిగా విన్నారు. బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి ఇచ్చిన స్థలాల్లో గుడిసెలు నిర్మించుకుంటే వాటిని కూల్చేశారని ఒక వర్గానికి చెందిన బాధితులు కమిషన్ సభ్యులకు తెలిపారు. రెండో వర్గం బాధితులు మాట్లాడుతూ బీజేపీ నాయకురాలు పత్తిపాటి వరలక్ష్మి తమ వద్ద వేలాది రూపాయాలు తీసుకుని, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలకు నకిలీ పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆమెవల్ల నిండా మునిగి పోయామని కన్నీటిపర్యంతమయ్యారు. మూడో వర్గానికి చెందిన స్థలం యజమానులు తాము పైసా పైసా కూడబెట్టి పిల్లల భవిష్యత్‌కు అండగా ఉంటుందని ఆశతో ప్లాట్లను కొనుగోలు చేశామని కమిషన్ సభ్యులకు చెప్పారు. ముగ్గురి వాదనలను ఆలకించిన జాతీయ కమిషన్ సభ్యులు ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లోనే అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఇంత వరకు వచ్చిందన్నారు. ఇళ్లు కూల్చేయడంతో నిరాశ్రయులైన పేదలకు మూడు నెలలకు సరిపడే నిత్యాసరవర సరుకులు వెంటనే అందజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇళ్లు కూల్చేయడంతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వ భూమిని గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే ఆ స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పేదలకు తాత్కాలికంగా నీడ కల్పించాలన్నారు. పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తుల చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కావలి డీఎస్పీని ఆదేశించారు. కార్యక్రమంలో కావలి సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్, బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ, ఆర్.డేవిడ్ విల్సన్, జి.భరత్‌కుమార్, సి.వి.సి.సి.సత్యం, మాల్యాద్రి పాల్గొన్నారు. -
జాతీయ కమిషన్ ముందు హాజరైన జిల్లా పోలీసులు
సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : గతేడాది పట్టణంలో పెంపుడుకుక్క తరమడంతో కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన కేసు విషయంలో డీఐజీ, డీఎస్పీ, సీఐలు ఈనెల 9,11 తేదీల్లో ఢిల్లీలోని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క తరమడంతో పంట కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ (ఢిల్లీ) అమలాపురం డీఎస్పీ, సీఐలకు నోటీసులు జారీ చేసింది. దాంతో అమలాపురం డీఎస్పీ ఆర్.రమణ, ఈ కేసు అప్పటి ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో) పట్టణ సీఐ సీహెచ్ కోటేశ్వరరావు, ఇప్పటి ఐవో, ప్రస్తుత పట్టణ సీఐ సురేష్‌బాబు ఈనెల 9,11 తేదీల్లో ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు హాజరయ్యారు. పెంపుడు కుక్క వల్ల బాలుడు మృతి చెందటానికి దారి తీసిన కారణాలను కమిషన్ అడుగుతూనే ఈ కేసు ఎంత వరకూ వచ్చింది? మీరు తీసుకున్న చర్యలేమిటి? అని వారిని ప్రశ్నించినట్టు తెలిసింది. అప్పట్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు స్వయంగా అమలాపురం వచ్చి ఈ ఘటనను కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులపై చర్యలు చేపడతామని చెప్పారు. అంతే కాకుండా బాలుడి మరణానికి కారణమైన పెంపుడు కుక్క యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాములు అప్పట్లో పోలీసులకు సూచించారు. దీనికితోడు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఈ కేసు విషయమై కొద్ది రోజుల కిందట జిల్లా కలెక్టర్‌కు కూడా నోటీసులు పంపించింది. డీఐజీని కూడా కమిషన్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించడంతో డీఐజీతో పాటు డీఎస్పీ, సీఐలు ఢిల్లీ వెళ్లి హాజరయ్యారు. మాజీ ఎంపీ హర్షకుమార్కు కూడా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆయన కూడా ఢిల్లీ వెళ్లినప్పటికీ కమిషన్ సూచించిన రోజుకు వెళ్లకపోవడంతో ఆయనను విచారించలేదు. బాలుడి మృతి కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్‌లో 15వ కాలమ్‌లో మరణానికి కారణం (కాజ్ ఆఫ్ డెత్)లో కాలువలో నీళ్లు తాగడం వల్ల బాలుడు మృతి చెందాడని రాసిన వైనంపై అప్పట్లో దళిత సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పెంపుడు కుక్క తరవడం వల్లే బాలుడు భయపడి కాలువలోకి దూకి మృతి చెందాడని ఎందుకు రాయలేదని ప్రశ్నించిన విషయమూ విదితమే. కాగా పట్టణ సీఐ సురేష్‌బాబును ‘సాక్షి’ వివరాలు కోరగా ఆ కేసులో మానవహక్కుల కమిషన్ ముందు హాజరయ్యేందుకు వెళ్లామని, కమిషన్ ముందు హాజరై ఢిల్లీ నుంచి తిరిగి వచ్చామని చెప్పారు. -
చింతమనేని దిష్టిబొమ్మలతో శవయాత్ర, దహనం
-
భగ్గుమన్న దళితులు
సాక్షి,నెట్వర్క్: ‘మీరు దళితులు.. మీకెందుకు రా.. రాజకీయాలు’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దళిత, ప్రజా సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయితో మండిపడ్డాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాయి. చింతమనేని దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చిత్తూరు బంగారుపాళ్యం రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగారు. విజయపురం మండలం పన్నూరు సబ్‌స్టేషన్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేని కేçశవులు ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్ ఫోటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. బి.కొత్తకోటలో చింతమనేని వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ అంబేడ్కర్ సేవ (బాస్) కార్యకర్తలు రాస్తారోకో చేశారు. పుంగనూరులోని అంబేడ్కర్ కూడలిలో చింతమనేనికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో హైవేపై బైఠాయించారు. ఏయూలో చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర చేస్తున్న దళిత, బీసీ, ఎస్టీ సంఘాల నాయకులు ఏయూలో చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర.. ఆంధ్ర యూనివర్సిటీలో దళిత, బీసీ సంఘాలు నిరసన తెలిపాయి. ఏయూలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నాయకులు ధర్నా చేసి చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపారు. చింతమనేనిని తక్షణం అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దిష్టిబొమ్మతో నిరసన తెలపడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిశోధకులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో ఆరేటి మహేష్, డాక్టర్ మోహన్ బాబు, మండే సురేష్, కోటి రవికుమార్, కుమారస్వామి పాల్గొన్నారు. చింతమనేనిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పదవుల నుంచి తొలగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చింతమనేని ప్రభాకర్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. చింతమనేని ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుందని మండిపడ్డారు. చింతమనేనిపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు.. ఎస్సీ సామాజిక వర్గాన్ని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దూషించడంపై జాతీయ ఎస్సీ కమిషన్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) బుధవారం ఫిర్యాదు చేసింది. ఎస్సీ కమిషన్ సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.అనిల్‌కుమార్ ఈ ఫిర్యాదు అందజేశారు. చింతమనేనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఏలూరులో ఉద్రిక్తత సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతమనేని వ్యాఖ్యలపై పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో దళితులు ఆందోళనలు నిర్వహించారు. ఏలూరులో చింతమనేని ప్రభాకర్ వర్గం నేతలు కూడా పోటీ నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలను అరెస్ట్ చేశారు. వైఎస్సార్ సీపీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నారని, సోషల్ మీడియాలో వైరల్ చేసి తన పరువుకు నష్టం కలిగించిన వారిని అరెస్ట్ చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి చింతమనేని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి వినతిపత్రమిచ్చారు. ‘సాక్షి’పై చింతమనేని అక్కసు... చింతమనేని వ్యాఖ్యలపై ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంతో ఆయన బుధవారం ఉదయం ఏలూరులోని సాక్షి జిల్లా కార్యాలయానికి వచ్చారు. ‘నా గురించి పిచ్చిపిచ్చి వార్తలు రాస్తున్నారు...ఆ వార్త రాసిన విలేకరి ఏడీ’ అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంకా రాలేదని చెప్పడంతో వస్తే నన్ను కలవమని చెప్పండంటూ అక్కడి నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు వెళ్లారు. కొద్దిసేపట్లో అక్కడ వైఎస్సార్సీపీ దళిత సంఘాలు ఆందోళన నిర్వహిస్తాయని సమాచారం అందుకుని పోటీ ధర్నా చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సోషల్ మీడియాలో తన వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ, అదనపు ఎస్పీలకు వినతిపత్రమిచ్చారు. ఈలోగా ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులు ధర్నా చేసేందుకు ఉపక్రమించారు. అక్కడ చింతమనేని అనుచరులు పోటీ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ టూటౌన్ పోలీసు స్టేషన్ ముందు వైఎస్సార్ సీపీ నేతలు ధర్నా చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ వీరికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఇరువర్గాలను పోలీసులు విడిచిపెట్టారు. చింతమనేని తన అనుచరులతో పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నాకు దిగారు. తన మాటలను వక్రీకరించారని, తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. హౌస్ అరెస్టులపై అభ్యంతరం.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం వివాదానికి దారి తీసింది. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం ప్రదర్శనగా ఏలూరుకు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు ఈ నెల 22 నుంచి బీసీ సంఘం తరపున నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. దీనికి మాదిగ మహాసేన దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొవ్వలిలో మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో మాలమహానాడు, వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. అక్కిరెడ్డిగూడెంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు టి.శేఖర్ ఆధ్వర్యంలో ఆందళోన చేశారు. చింతమనేని వ్యాఖ్యలను ఖండిస్తూ మార్టేరు సెంటర్లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చింతమనేని ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. చింతలపూడి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వీఆర్.ఎలిజా, గోపాలపురం సమన్వయకర్త తలారి వెంకట్రావు నేతృత్వంలో ఆయా ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చింతమనేనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. -
ఎస్సీ యువతకు ఉపాధి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ ట్రేడుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ (టీఎస్సీసీడీసీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకుండా 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపింది. జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఫేష్ ట్రైనింగ్, పంచకర్మ, ఆయుర్వేద స్పా, రెస్టారెంట్ సర్వీ సులో శిక్షణ ఇస్తామని, శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నామని పేర్కొంది. ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్‌లోని జాతీయ, పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థలో కానీ జిల్లా ఎస్సీ కో ఆపరేటివ్ సంస్థను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
మీ కాళ్లు పట్టుకుంటాం.. ఓటు కల్పించండయ్యా
రామచంద్రాపురం: మీ కాళ్లు పట్టుకుంటాం, మీకు దణ్ణం పెడుతామంటూ దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు ముందు బోరున విలపించారు. ముప్పై ఏళ్లుగా మా ఓట్లు అగ్రవర్ణాల వారే వేసుకుంటున్నారని వాపోయారు. రామచంద్రాపురం మండలానికి చెందిన ఆరు గ్రామాల దళితవాడల ప్రజలు తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం శ్రీరాములు రెవెన్యూ, పోలీసు అధికారులను వెంటబెట్టుకుని వచ్చి గెరికచేనుపల్లి, బ్రాహ్మణకాల్వ దళితవాడల ప్రజలను కలిశారు. గెరికచేనుపల్లిలో కమ్మకండ్రిగ, రావిళ్లవారిపల్లి, కొత్తకండ్రిగ, గణేశ్వరపురం, కమ్మపల్లి, ఎన్ఆర్ కమ్మపల్లి, టీటీకండ్రిగ, పారకాల్వ పోలింగ్‌బూత్‌లలో ఓట్లు వేసుకోలేకపోతున్నామని దళితులు ఆయన దృష్టికి తెచ్చారు. అగ్రవర్ణాల వారు తమ పంచాయతీకి తాగునీటిని నిలిపివేశారని, శ్మశానానికి కూడా నోచుకోక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 3 కిలోమీటర్ల దూరం నడిచి రావిళ్లవారిపల్లికి వెళ్లినా వేలుపై ఇంకుముద్ర వేసి పంపిస్తున్నారే కానీ ఓట్లు వేయనీయడం లేదని బ్రాహ్మణకాల్వ గ్రామస్తులు వాపోయారు. 11.42 సెంట్ల భూమిని అగ్రవర్ణాల వారు ఆక్రమించుకుని గుడి కట్టనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. శ్రీరాములు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమా అంటూ విస్తుపోయారు. దళితులను ఓటు వినియోగించకుండా అగ్రవర్ణాలు ఆపుతుంటే పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. ఓటు వేయనీయట్లేదంటే గ్రామ బహిష్కరణ చేసినట్లేనన్నారు. బాధితులకు తక్షణమే ఓటు హక్కు కల్పించాలని కోరారు. జేసీ మహేష్‌కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణకాల్వలో పోలింగ్‌బూత్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీరాములు వెంట ఆర్డీవో మల్లికార్జున, ఎమ్మార్వో జయరాములు, తదితరులు ఉన్నారు.