సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మారుమూడి విక్టర్‌ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. గతేడాది జనవరిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
చదవండి: దళితులపై దాడులకు చంద్రబాబే గ్యాంగ్ లీడర్
దీంతో ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన న్యాయవాది, దళితుల సమస్య లపై 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసిన మారుమూడి విక్టర్ ప్రసాద్‌ను ప్రభు త్వం నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. విక్టర్ ప్రసాద్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొన సాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment