Prasad
-
గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతం
ఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి. పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది. 1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి. అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు. 400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు. -
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ సెవెన్ డైవర్షన్స్..
-
తల్లులకు వందనం లేదు.. అన్నదాతకు సుఖీభవ లేదు
-
బాబు, లోకేష్ కన్నింగ్ ఫెయిల్.. ఆఖరికి పవనే దిక్కు..
-
టీటీడీలో దోపిడీ దందా.. పక్కా ఆధారాలతో బయటపెట్టిన టీడీపీ నేత
-
Big Question: తొక్కిసలాట వెనుక జనసేన కార్యకర్తలు.. ప్రజా శక్తిలో సంచలన వార్త!
-
సర్వదర్శనం ఎందుకు రద్దు చేశారు..! హిందూ మేధావులు నోరు ఏమైంది ?
-
బైక్ స్టంట్లు చేయమంటావా.. అన్యాయంగా ఇద్దరిని చంపేశావ్.. నీతులు చెప్తాడు.. పాటించడు..
-
Big Question: బండి సంజయ్ తోలు తీసేశాడు
-
ఏం పవన్.. తోలు తీస్తావా.. మురళీమోహన్ పూనాడా?
-
నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్‌కు పెళ్లి కూడా అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్‌తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. -
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.కాగా.. ప్రసాద్ బెహరా యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.అసభ్యంగా తాకుతూ..ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలాసార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరిముందే సెట్లో తన బ్యాక్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరిముందు తనను అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. -
Big Question: ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కన్నీళ్ల డ్రామాలెందుకు చెల్లెమ్మా
-
చెల్లెమ్మా ఇంత పనిచేస్తావా..! జగనన్న మనసు నీకు తెలియదా ?.. చంద్రబాబు ఉచ్చులో పడి..!
-
రాజకీయ వేదికగా తిరుమల.. బోర్డులు ఎత్తేస్తున్నారు.
-
రూలర్స్..రూల్స్ బ్రేక్
ఈ ఫొటోల్లో రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి... హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.1,030 అపరాధ రుసుం విధించడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.ఈ ఫొటోల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చొని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ను పరిశీలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి గానీ వెనుక కూర్చున్న కలెక్టర్, గణబాబు గానీ హెల్మెట్ ధరించలేదు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్లు ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తుంగలో తొక్కుతున్నా.. అటువైపు కనీసం రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. చట్టం అధికారం ఉన్న వాడికి చుట్టమనే నానుడి ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల మరింత బలపడినట్టయింది.గోపాలపట్నం: జిల్లాలో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారంటూ... ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు 1,199 మందికి రూ.1,035 అపరాధ రుసుం విధించడంతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేశారు. మూడు నెలల వరకు వీరెవ్వరూ వాహనాన్ని నడిపేందుకు అవకాశం లేదు. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే సాధారణ ప్రజలకు ఒక విధంగా.. అధికారం ఉన్న వారి పట్ల మరో విధంగా ప్రవర్తించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విస్తృతంగా తనిఖీలుద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి రూ.1035 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. వీరు మూడు నెలల తరువాత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి జరిమానా విధించిన రశీదు, ఆధార్ కార్డు అందజేస్తే లైసెన్సును పునరుద్ధరిస్తారు.హెల్మెట్ ధారణ తప్పనిసరిహెల్మెట్లు లేకుండా ప్రయాణించడంతోనే చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని కొద్ది రోజులుగా అవగాహన కల్పించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిబంధనలను అమలు చేస్తున్నాం. ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను రద్దు చేశాం. పోలీసుల వద్ద సుమారు 3 వేల వరకు ఈ రశీదులున్నాయి. వాటిని కూడా సేకరించి రద్దు చేసే చర్యలు చేపడతాం.– రాజారత్నం, ఉప రవాణా కమిషనర్, విశాఖ -
అర్ధరాత్రి పచ్చ మూక అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పచ్చ బ్యాచ్ దాడుల్లో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందాడు. పది మంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.కాగా, పచ్చటి పల్లెలో రాజకీయ చిచ్చు రేగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో రాత్రి 11.15 గంటల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు.. ప్రసాద్ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అర్దరాత్రి అరాచకం.. టీడీపీ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబా హోటల్లో బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కూన ప్రసాద్ తన బండిపై రామ చెరువు వైపు వెళ్తూ.. వారికి ఎదురుపడడంతో వారంతా ఒక్కసారిగా బైక్ ఆపి తాళం తీసుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పది మంది కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ భయంతో పరుగులు తీశాడు. అయినా వదలకుండా వెంటాడి మరీ కొట్టారు. చివరకు బీసీ కాలనీలోని సూర కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పైకి ఎక్కితే.. అక్కడకూ వచ్చి దాడి చేశారు. దాడిలో దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితికి చేరటంతో విడిచి పెట్టి వెళ్లిపోయారు.అనంతరం గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ ఆధ్వర్యంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ బందోబస్తు సిబ్బంది సంఖ్య పెంచారు. -
భలే మంచి 'చౌక' బేరం!
పేదల కడుపు నింపే రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే ముఠాకు అండగా నిలిచి కాలు కదపకుండా కోట్ల రూపాయలు కూడబెట్టుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పథకం రచించారు. ఈ మేరకు రేషన్ బియ్యం తరలించే ముఠా సభ్యులతో బేరం కుదిర్చే పనిని తన మామకు అప్పగించారు. ఆయన రంగంలోకి దిగి అనంతపురం టౌన్లో బియ్యం కొనుగోలు చేసి వాటిని గోదాములకు చేర్చి, జిల్లా సరిహద్దులు దాటించి నల్లబజారులో అమ్ముకునేదాకా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ముఠా సభ్యులకు భరోసా ఇస్తున్నారు. తమను కాదంటే కేసులు పెట్టించి లోపలేయిస్తామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి స్వయాన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మామ గంగారాం చౌక బియ్యాన్ని కార్డుదారులు, డీలర్ల నుంచి సేకరించి నల్లబజారుకు తరలించే ముఠాకు సహకరిస్తున్న ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. – అనంతపురం క్రైంఈ ఆడియోలోని సంభాషణ ఇలా...ఎమ్మెల్యే మామ: ఏమ్మా మీరు ఒకసారి ఎమ్మెల్యే ఆఫీసుకు వచ్చి రేటు మాట్లాడుకుని వెళ్లండి. మీరు మొత్తం నలుగురు ఉన్నారు కదా? రేపు ఆఫీసుకు నలుగురు కలిసి రావాల్సి ఉంటుంది. మహిళ: అన్నా.. అప్పుడే(కౌంటింగ్ అయిన తర్వాత) పరిటాల సునీతమ్మక్క ఇంటి వద్దకు రమ్మంటే వెళ్లాము. సోమందేపల్లి వాళ్లు అక్కడే మాట్లాడుకున్నారు. సరుకు వాళ్లు కదా తీసుకెళ్లేది! మీరు వాళ్లతోనే మాట్లాడండి. మాతో ఎందుకు? ఎమ్మెల్యే మామ: అలా కాదు... అనంతపురం అర్బన్‌లోని రేషన్ షాపులు వారందరికీ మేం అప్పుడే అలర్టు చేసినాం. మా ఆ«దీనంలోనే ఉన్నాయి. ఇక్కడ మీరు సరుకు నిల్వ ఉంచుకుని పంపుతున్నారు. కావున మీరు మాతో మాట్లాడాలి. అలాకాదని పరిటాల సునీత, శ్రీరాము, బాలాజీ... అంటే ఎలా? పైగా నేను కూడా బాలాజీకి బావే. బాలాజీతో నేను మాట్లాడతాను. సోమందేపల్లి, పెనుకొండ మంత్రి సవితమ్మ ఎవరైనా కానీ.. మీ సరుకు వెళ్లాలంటే అనంతపురం నగరంలో మా అనుమతి తప్పనిసరి. నువ్వు, సుబ్బు, రామకృష్ణ, జయపాల్‌రెడ్డి, జగదీష్ కలసి సాయంత్రం మూడు గంటలకు ఆఫీసుకు రండి. మీరు చాలా కరెక్టు మనిషి అని మా పిల్లలు చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నా. మహిళ: నేను ఒక్కదాన్నే రావాలా అన్నా? ఎమ్మెల్యే మామ: వద్దు.. మీరు నలుగురు కలిసి రండి. అప్పుడే మాట్లాడతాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పకుండా సరుకు పంపొద్దు. సోమందేపల్లి వాళ్లు, పెనుకొండ వాళ్లు వచ్చినా వారికి సరుకు ఇవ్వొద్దు. అలా ఇచ్చారంటే మీ ఇష్టం. చాలా సీరియస్ అవుతుంది. లేదు.. మేము చేసుకుంటామంటే మాత్రం అందరినీ లోపలేపిస్తాం. మహిళ: లేదులే అన్న మాకేముంది? లోకల్లో ఎవరొచ్చినా సరుకు ఎత్తిచ్చేవాళ్లము కదా? ఎమ్మెల్యే మామ: అలా కాదు... మీరు ఇంకా ఐదు సంవత్సరాలు ఈ వ్యాపారం బాగా చేసుకోవాలంటే నేను ఫుల్ ష్యూరిటీ ఇస్తున్నా. మీకెలాంటి ఇబ్బందీ రానివ్వను. చాలారోజులుగా మీ విషయం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వచ్చి ‘మామ ఇంక అదేందో నువ్వే వాళ్లని పిలిపించుకుని మాట్లాడు’ అంటే నేను బాధ్యత తీసుకున్నా. మీ అందరి గురించి తెలుసుకుని నంబర్లు తీసుకునేలోపు లేటయ్యింది. సాయంత్రం 3 నుంచి 3.30 గంటల మధ్య రండి. మహిళ: సరే సార్ వస్తాం. ఎమ్మెల్యే మామ: ఇదే కాదు... భవిష్యత్‌లో కూడా పరిటాల, సవితమ్మ, ఇంకా పార్టీ లీడర్లు... ఇలా ఎవరి నుంచి ఏ ఇబ్బందీ రాకుండా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో మా కమ్మాస్ అతనే సీఐ సాయినాథ్ అని వస్తున్నాడు. కావాలనే మనం తీసుకుంటున్నాం. ఇంకా ఎస్ఐలు కూడా మా వాళ్లే వస్తారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి. డీఎస్పీ నుంచి సీఐలు, ఎస్ఐలు అంతా మా వాళ్లే ఉండాలని తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో వస్తారు. మీకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వము. అనంతపురం టోటల్ జిల్లాలో మిమ్మల్ని మాట్లాడించే వారుండరు. అలా ఎవరైనా మాట్లాడితే నాతో ఫోన్లో మాట్లాడించండి. నేను చూసుకుంటాను. ఎంతటి వారినైనా వదిలిపెట్టం.మహిళ: ఇంతకుముందు మా నుంచి ఎవరూ తీసుకోలేదు అన్నా! ఎమ్మెల్యే మామ: మీరు ఇంకొకరి గురించి చెప్పొద్దు. అలా ఊరికే ఇడిసిపెట్టేది ఉండదు. వాళ్లు వదిలి పెట్టారని మేము ఎలా విడిచి పెడతాము? మీరేమో తప్పుడు పని చేస్తూ ఇంకొకరికి సరుకు ఇస్తున్నారు. మీ నుంచి మేము తీసుకోకూడదంటే ఎలా? వదిలే ప్రసక్తే లేదు. బయట ఎక్కడో మీరు మాట్లాడుకుని మమ్మల్ని ఎవరూ అడగలేదంటే ఎట్లా? ఆఫీసుకు రండి.. ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. -
‘బాబుతో మాట్లాడతా.. పేకాట ఆడిస్తా..’!
సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలుఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు. -
ఎక్కడ ఈ నిధులు..? బడ్జెట్ పై KS ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..
-
మోదీ మైండ్ గేమ్ ఆ రాష్ట్రాలకే నిధులు..
-
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్యుస్క్రిప్ట్లజీపై రెండురోజుల శిక్షణ కార్యక్రమం 20 జూలై 2024న ముగిసింది. భారతదేశంలోని వివిధ స్క్రిప్ట్‌ల గురించి విజ్ఞానాన్ని అందించడం ద్వారా పండితులకు వైద్య వ్రాత ప్రతులను సులభంగా అనువదించడం దీని లక్ష్యం. మాన్యుస్క్రిప్ట్లజీ లో నిపుణులు మాన్యుస్క్రిప్టులజీ యొక్క వివిధ అంశాలను అనగా వాటిలో ఉన్న వైద్యజ్ఞానాన్ని తెలుసుకోవడం పురాతన లిపి అందులోని అర్థాన్ని తెలుకోవడం మొదలగు వాటి గురించి తెలియజేసారు.వీరిని హైదరాబాద్‌లోని ఎన్ఐఐఎంహెచ్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ సత్కరించారు. దాదాపు 100 మంది మేధావులు ఇన్స్టిట్యూట్లో జరిగిన మేధోమథన సెషన్లకు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా హాజరయ్యారు. వారు గ్రంథ, వట్టెఝుత్తు, కన్నడ, నగరి మరియు తెలుగు వంటి ప్రాచీన భారతీయ లిపిల గురించి తెలుసుకున్నారు. ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ సినిరుద్ధ దాష్, మాజీ ప్రొఫెసర్ మరియు హెడ్, మద్రాస్ విశ్వవిద్యాలయం, సంస్కృత శాఖ, డాక్టర్ కీర్తికాంత్ శర్మ, మాజీ రీసెర్చ్ ఆఫీసర్, I.G.N.C.A., శ్రీ షాజీ, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ మాజీ మాన్యుస్క్రిప్ట్ అసిస్టెంట్, ప్రొఫెసర్ M. A. అల్వార్, మహారాజా సంస్కృత కళాశాల, మైసూర్, డాక్టర్ ఉత్తమ్ సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, త్రిపుర, డాక్టర్. V. S. కంచి అసోసియేట్ ప్రొఫెసర్, ముల్జీ జైతా కళాశాల, మహారాష్ట్ర, Mr. N.R.S. నరసింహ, సీనియర్ అసిస్టెంట్, TTD మ్యూజియం, తిరుపతి, ప్రొఫెసర్ డా. రంగనాయకులు, మాజీ డైరెక్టర్ – చరిత్రకారుడు, TTD మ్యూజియం, ఆంధ్రప్రదేశ్, మాన్యుస్క్రిప్ట్లజీపై లోతైన అవగాహన కల్పించారు. డాక్టర్ వి.కె. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుండి డా.లావనియా,RO (Ayu.), డాక్టర్ రాకేష్ నారాయణన్,RO (Ayu.) మరియు డాక్టర్ ముఖేష్ చించోలికర్, RO (Ayu.) మరియు NIIMH అధికారులు డాక్టర్ V. శ్రీదేవి, RO ( ఆయు.), డాక్టర్ అష్ఫాక్ అహ్మద్, RO (యునాని), డాక్టర్ ఖీ .సాకేత్ రామ్, RO (Ayu.), ఈట సంతోష్ మానె, RO (Ayu.) ఈట. బిస్వో రంజన్ దాస్, RO (Hom.) Dr. Chris Antony, RO (Ayu.) వైద్య మాన్యుస్క్రిప్ట్‌లపై పరిశోధనలు చేపట్టడం కోసం పాల్గొనే వారితో వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. -
ఏపీలో పచ్చ రాజ్యాంగం.. నారా వారి రాక్షస పాలన
-
సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలులో భాగంగా కొత్త ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్దిదారుల ఇంటి వద్దే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 65,18,496 మందికి పెంచిన మొత్తాన్ని ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి ఇచ్చి న హామీ మేరకు ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1న రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే జూన్‌కు సంబంధించిన ఎరియర్ల సొమ్ము నెలకు రూ.వెయ్యి చొప్పున మూడునెలల ఎరియర్స్ మూడువేలతో కలిపి మొత్తం రూ.7,000లను పంపిణీ చేయాలని సీఎస్ ఆదేశించారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు, నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన పింఛను సొమ్మును పంపిణీ చేయాలని ఆయన సూచించారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలోలాగే ఎలాంటి మార్పులేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలన్నారు. 1వ తేదీనే పంపిణీఇక పెంచిన పింఛన్లను జూలై 1న రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది పింఛనుదారులకు ఒక్కరోజులోనే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని నీరబ్‌కుమార్ చెప్పారు. ఇందులో రూ.4,369.82 కోట్లను 64.75 లక్షల మంది పింఛనర్ల ఇళ్ల వద్ద, మిగిలిన సొమ్ము రూ.30.05 కోట్లను రాష్ట్రం వెలుపల ఉండే 0.43 లక్షల పింఛనర్లు.. బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును శనివారమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జూలై 1న ఉ.6.00 గంటల నుండి పింఛనర్ల ఇంటివద్దే పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలనూ వినియోగించుకోవాలని సీఎస్ చెప్పారు. అలాగే, ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున అప్పగించేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారంకల్లా పూర్తిచేయాలన్నారు.సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని.. అవసరమైతే రెండోరోజు కొనసాగించాలన్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డి్రస్టిబ్యూషన్ సరి్టఫికెట్ కూడా జారీచేయాలని నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శులు సౌరబ్ గౌర్, సత్యనారాయణ.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్
-
ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్
-
సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..
-
రారండోయ్.. వేడుక చూద్దాం.. (ఫోటోలు)
-
ఇష్టం లేని బలవంతపు పెళ్లి.. పవన్,చంద్రబాబు,మోదీపై KS ప్రసాద్ కామెంట్స్
-
బండరాయి టీడీపీ..గునపం బీజేపీ..
-
ప్రతిపక్షాలను సీఎం జగన్ ర్యాంప్ అడిస్తున్నాడు
-
ప్రతిపక్షాలను సీఎం జగన్ ర్యాంప్ ఆడిస్తున్నాడు
-
యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’
సమాజ్‌వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ పేరు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ (ఆర్ఎస్ఎస్పీ). పార్టీ జెండా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడి ఉంటుంది. అయితే ప్రసాద్ మౌర్యను బుజ్జగించి, ఆయన ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఎస్పీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ? -
ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్ మోసం చేశాడని ఓ యువతి..
కరీంనగర్: ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఎస్పీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన యువతిని కొడిమ్యాల మండలానికి చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేశాడు. దీంతో ఆ యువతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలిని పట్టణ ఎస్సై మన్మధరావు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇవి చదవండి: పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. -
భర్తే శాసిస్తున్నాడా !..కేఎస్ ప్రసాద్ సంచలన కామెంట్స్
-
క్వాష్ పిటిషన్ రద్దు..షర్మిల ఎఫెక్ట్ ?
-
ముద్రగడ దారెటు ?..కేఎస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
-
గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే!
ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీతీర్థం, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించడంలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం ఎంతటి పుణ్యఫలమో, అంతటి ఆరోగ్యబలం కూడా. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్దేశించి ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. తీర్థం.. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వీటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధగుణాలున్నాయి. తులసి తీర్థంతో మానసిక బలం ఆలయాల్లో దేవుడ్ని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసీతీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరం.. యాలిక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్థమా, చర్మవ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయయి. కడుపులో క్రిముల నివారణవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. పరమాన్నం.. పరమ ఔషధం.. పాలు, బియ్యంలో బెల్లం లేదా పంచదార వేసి చేసేదే పరమాన్నం. ఇందులో బాదంపప్పు, యాలకులు, పచ్చికొబ్బరి వేస్తారు. దేహానికి బలం, చక్కని కాంతిని ఇస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 11.4 మిల్లీ గ్రాముల కేలరీలు, ఇనుము ఉన్నాయి దీనికి పుష్టిని ఇచ్చే గుణం ఉంది. వాత రోగాలు నివారణవుతాయి. బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉంది. ఉత్సాహం పెరగడంతో పాటు నరాల బలహీనత, రక్తపోటును తగ్గుతుంది. జ్వరాలు రాకుండా దద్దోజనం తాళింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం, ఆవు పాలను మరగకాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, శొంఠి మొదలైన వాటిని అన్నంలో కలుపుతారు. దానిని ఆవునెయ్యితో పోపుపెడతారు. ధనుర్మాసంలోని రెండోపక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం తీసుకోవటం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. అరుగుదలకు పులిహోర.. బియ్యంతో అన్నం వండిన తర్వాత దానికి పసుపు, నూనె, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, శెనగపప్పు తదితరాలని కలిపి చేస్తారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. కాలేయానికి మంచిది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. కట్టె పొంగలితో కీళ్లజబ్బులు నయం ధనుర్మాసంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు తగ్గుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. చక్కటి ఔషధం చక్కెర పొంగలి బియ్యం, పెసరపప్పు సమానంగా పోసి ఆవునేతితో ఉడికించి అందులో పంచదార, ద్రాక్ష, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసే చక్కెర పొంగలిని సేవించడం వల్ల దేహపుష్టి కలుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శూల (నొప్పి)ని, జ్వరాన్ని హరిస్తుంది. పచ్చకర్పూరం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. కఫాన్ని, శరీరంలోని మంటల్ని నిరోధిస్తుంది. -
రామ్ గోపాల్ వర్మపై కొలికపూడి వ్యాఖ్యలు..కేఎస్ ప్రసాద్ విశ్లేషణ
-
ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు
సాక్షి కామారెడ్డి/కామారెడ్డి క్రైం: ఇంటి కోసం ఒకే కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులోని నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన పూనే ప్రసాద్ (36)కు భార్య శాన్విక అలియాస్ రమణి (29), కవల పిల్లలు చైత్రిక (8), చైత్రిక్ (8), తల్లి సుశీల, ఇద్దరు చెల్లెళ్లు స్వప్న (26), శ్రావణి (23) ఉన్నారు. ఓ యువతి ఆత్మహత్య కేసు నేపథ్యంలో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాక ప్రసాద్ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకు మకాం మార్చాడు. ఆ కేసు నిమిత్తం డబ్బులు అవసరమై గతంలో తన స్నేహితుడు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్యన ప్రశాంత్ తనకు రావాల్సిన డబ్బులను ప్రసాద్‌ను అడగగా స్వగ్రామం మాక్లూర్‌లోని ఇంటిని తాకట్టు పెట్టి చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రూ.25 లక్షలు విలువ చేసే ప్రసాద్ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ పథకం పన్నాడు. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్చేసిస్తే లోన్ తీసుకుని తనకివ్వాల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన మొత్తం ఇస్తానని ప్రసాద్‌ను నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని రిజిస్ట్రేషన్చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోగా, చివరికి హత్య చేయాలని భావించాడు. రూ.60 వేలకు సుపారీ.. ప్రసాద్‌ను హత్య చేసేందుకు మాక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన బానోత్ వంశీ, గుగులోత్ విష్ణులకు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రశాంత్ ఒప్పందం చేసుకున్నా డు. గత నెల 29న మాట్లాడుకుందామని నమ్మించి ప్రశాంత్, వంశీ, విష్ణులతో కలిసి ప్రసాద్‌ను కారులో మదనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడే గోతిని తవ్వి పాతి పెట్టారు. ఈనెల 1న పోలీసుల భయంతో ప్రసాద్ ఓ చోట దాక్కున్నాడని, అతను రమ్మన్నాడని చెప్పి భార్య శాన్విక (గర్భవతి), ప్రసాద్ చెల్లెలు శ్రావణిను వెంట తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఓ చోట ఉంచి శాన్వికను బాసర బ్రిడ్జి సమీపంలోకి తీసుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి నిందితులందరూ కలిసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని నదిలో పడేశారు. ఆ వెంటనే శ్రావణి దగ్గరకు వెళ్లి ఆమె ను కారులో ఎక్కించుకుని చేగుంట మండలం వడియారం ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మళ్లీ పాల్వంచకు వచ్చి ప్రసాద్ తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఇద్దరు పిల్లలను ఈనెల 4 న అదే కారులో తీసుకువెళ్లి నిజామాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లి వడ్డెమ్మతో చెప్పి సహకరించాలని కోరాగా ఆమె ఒప్పుకుంది. తప్పించుకున్న తల్లి ప్రసాద్ పిల్లల్ని చూడాలని అంటున్నాడని సుశీలను, స్వప్నను నమ్మించారు. సుశీల, స్వప్నలను లాడ్జిలోనే ఉంచి ఇద్దరు పిల్లలను ప్రశాంత్, అతని తమ్ముడు తీసుకుని వెళ్లారు. నిర్మల్ వెళ్లే దారిలో ఉండే సోన్ బ్రిడ్జి వద్దకు వెళ్లేలోగా కారులోనే ఇద్దరు పిల్లలను తాడుతో ఉరి బిగించి హత్య చేసి గోనె సంచుల్లో కట్టి వాగులో పడేశారు. ఈ నెల 13న లాడ్డి నుంచి స్వప్నను కారులో తీసుకువెళ్లిన ప్రశాంత్, మై నర్ బాలుడు, వంశీ కలిసి సదాశివనగర్ మండలం భూంపల్లి సమీపంలోని ప్రధాన రహ దారి పక్కన హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిందితులు ప్రసాద్ తల్లిని కూడా చంపేయాలని ప్లాన్ చేసినా చివరగా ఆమెకు అనుమానం వచ్చి లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయి తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల గుర్తింపు.. భూంపల్లి వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని మరుసటి రోజు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పక్షం రోజుల వ్యవధిలోనే ఒకే తరహా హత్యలు చేగుంట, సదాశివనగర్, మెండోరా (సోన్ బ్రిడ్జి) పీఎస్‌ల పరిధిలో వెలుగు చూడటంతో వాటి మధ్య ఏదైనా లింక్ ఉన్నదా అనే కోణంలో విచారించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు. సెల్‌ఫోన్ టవర్ డంప్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని మాక్లూర్ కు చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. మంగళవారం నిందితులంతా కలిసి కారులో ప్రసాద్ తల్లిని వెతుకుతూ పాల్వంచకు వెళ్తుండగా పద్మాజీవాడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. -
350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణమిదే!
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్‌లోని రాజసమంద్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. -
నా ఎనిమిదేళ్ల కల నెరవేరింది
విరాజ్ అశ్విన్, పూజితా పోన్నడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల నిర్మించిన చిత్రం ‘జోరుగా హుషారుగా..’. ఈ చిత్రం నేడు విడుదలవు తోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్లతో అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తూర్పుగోదావరిలోని పెద్దాపురం స్వస్థలం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. జూనియర్ ఆర్టిస్టు, లైట్‌మేన్‌గా చేశాను. ఎడిటింగ్‌లో నైపుణ్యం ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ చూసి, నిరీష్‌గారు చాన్స్ ఇచ్చారు. అలా దర్శకుడ్ని కావాలనుకున్న నా ఎనిమిదేళ్ల కల ‘జోరుగా హుషారుగా’తో నెరవేరింది. నా మిత్రుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. ఓ గ్రామం నుంచి పట్నానికి వచ్చిన సంతోష్ (విరాజ్ పాత్ర) జీవితంలో జరిగన ఓ ఘటన అతని జీవితాన్ని ఏ విధంగా మార్చింది? తన కుటుంబాన్ని సంతోష్ ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నది ఈ సినిమా. మంచి హాస్యం, భావోద్వేగం, సంగీతం ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
జనసేనకు ఐదోతనం లేదని తేల్చేశారు..
-
ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే బెయిల్ తర్వాత... చంద్రబాబుకి అసలైన సినిమా..
-
మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన దీపావళివేళ భక్తులు పూజించే లక్ష్మీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తన భార్యను పూజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్‌గా మారిన ఈ ఫొటోలపై మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్పీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో దీపావళి సందర్భంగా తన తన భార్యను పూజిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని ఏ మతం, కులం, జాతి, వర్ణం, వ్యవస్థలో పుట్టిన ఏ బిడ్డకైనా రెండు చేతులే ఉంటాయన్నారు. రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు ఉన్న మహిళకు.. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు కలిగిన శిశువు ఇప్పటి వరకు పుట్టలేదన్నారు. నాలుగు చేతులతో లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఎవరైనా లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, దేవతలాంటి భార్యను పూజించండి. గౌరవించండి.. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ కోసం పనిచేస్తూ, ఆనందం, శ్రేయస్సు అందిస్తూ, ఆహారం సంరక్షణ బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే! दीपोत्सव के अवसर पर अपनी पत्नी का पूजा व सम्मान करते हुए कहा कि पूरे विश्व के प्रत्येक धर्म, जाति, नस्ल, रंग व देश में पैदा होने वाले बच्चे के दो हाथ, दो पैर, दो कान, दो आंख, दो छिद्रों वाली नाक के साथ एक सिर, पेट व पीठ ही होती है, चार हाथ,आठ हाथ, दस हाथ, बीस हाथ व हजार हाथ वाला… pic.twitter.com/CP5AjKODfq — Swami Prasad Maurya (@SwamiPMaurya) November 12, 2023 -
చంద్రబాబు జీవితం ఓటమితో మొదలై ఓటమితో ముగియడం ఖాయం..!
-
సీఎంని రుషికొండకు వెళ్లొద్దంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ పిటిషనర్‌ను నిలదీసింది. రాజీకీయ పరిష్కారాలకు కోర్టుకు ఎందుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు పలు ప్రశ్నలు వేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ సీజేఐ ఘాటుగా స్పందించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ పరిష్కారాలకు కోర్టు వేదిక కారాదని వ్యాఖ్యానించారు. రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు, జాతీయ హరితట్రిబ్యునల్ ఆదేశాలపై సీజేఐ ఆరా తీశారు. ఈ తరహా కేసులను హైకోర్టు తేల్చగలదని అన్నారు. హైకోర్టు లేదా ఎన్జీటీలకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించారు. హైకోర్టుకు వెళ్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
బెయిల్ నిజం.. రోగం పచ్చి అబద్ధం
-
లోకేష్ ని వాడుకుంటున్న పవన్...అడ్డంగా బుక్కైన బాబు
-
లోకేష్ ను వాడుకుంటున్న పవన్ అడ్డంగా బుక్కైన బాబు
-
రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్‌గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్‌బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్‌వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
జనసేనకు ‘మేడా’ గుడ్‌బై
మధురపూడి: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. కోరుకొండలో ఆదివారం ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్.. ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని, ఈ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజారాజ్యం, తరువాత జనసేన పార్టీలో కలిపి 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని చెప్పారు. పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, ఈ కారణంతోనే మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, రాజురవితేజ, జయలలిత వద్ద చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు జనసేనకు గుడ్‌బై చెప్పారని గుర్తుచేశారు. వారితో పోలిస్తే తాను చాలా చిన్నవాడినన్నారు. తనను నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు తనకు తెలియజేయలేదని, అధిష్టానం అపాయింట్మెంట్ కోసం 87 రోజులుగా వేచి చూశానని.. చివరకు ఈ అవమానం భరించలేక రాజీనామా చేస్తానని గత నెల 30న లేఖ రాసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు జనసేన కోరుకొండ మండలాధ్యక్షుడు మండపాక శ్రీను, రాజానగరం మండలాధ్యక్షుడు బత్తిన వెంకన్నదొర, ఉపాధ్యక్షుడు నాగారపు భానుశంకర్, నాయకులు అడబాల సత్యనారాయణ, కొచ్చెర్ల బాబీతోపాటు 100 మంది జనసేనకు గుడ్‌బై చెప్పారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు. స్థానిక నాయకత్వం వన్‌మ్యాన్ షోలా వ్యవహరించడం, ఇతర సమస్యల కారణంగా రాజీనామాలు తప్పవన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. -
బండారు సత్యనారాయణ పరిస్థితి కూడా అదే...
-
పంచాయతీరాజ్‌లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో పనిస్తున్న ఎంపీడీవోలకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) గా, మరో 167 గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి 2007 గ్రూపు–1 నోటిఫికేషన్ ద్వారా ఎంపీడీవోలుగా ఉద్యోగాలు పొందిన మొత్తం 66 మంది సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదం తెలిపినట్టు పంచాయతీరాజ్ శాఖ ఇన్చార్జి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం వెల్లడించారు. కాగా.. 66 మంది ఎంపీడీవోల సీనియారిటీ జాబితాల్లో 14 మందిపై వివిధ శాఖాపరమైన అభియోగాలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. సీనియారిటీ జాబితాలో శాఖాపరమైన అభియోగాలు పెండింగ్ లేని ఎంపీడీవోల పదోన్నతులకు పూర్తి స్థాయిలో అర్హులుగా వివరించారు. కాగా.. పూర్వం మేజర్ గ్రామ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ అధికారులు(ఈవో)గా, గతంలో విలేజి డెవలప్మెంట్ అధికారులు(వీడీవో)గా పనిచేసి ప్రస్తుతం గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారితోపాటు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాలు, డీపీవో కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న 167 మందికి ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి ఆమోదం తెలిపారు. ఈవోపీఆర్డీలుగా పదోన్నతులు కల్పించినందుకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ ఒక ప్రకటనలో సీఎం జగన్మోహన్రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్‌కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ సుధీర్‌కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
అందుకే గాండీవధారి అర్జున చేశాను – వరుణ్ తేజ్
‘‘ప్రవీణ్ సత్తారు ‘గాండీవధారి అర్జున’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. ఓ సమస్య గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యత అనిపించింది.. అందుకే ఈ మూవీ చేశాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బాపినీడు .బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోవద్దు.. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటి? అనేది చూపించాం’’ అన్నారు. ‘‘వరుణ్ తేజ్‌తో మేం చేసిన మొదటి సినిమా ‘తొలి ప్రేమ’, సాయితేజ్‌తో చేసిన ‘విరూ పాక్ష’ హిట్ అయ్యాయి. ఇప్పడు ‘గాండీవధారి అర్జున’ కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘భూమిపై ఉన్న వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదు. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమా తీశాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
సాక్షి డైరెక్టర్ పీవీకే ప్రసాద్‌కు పితృవియోగం
మంగళగిరి: సాక్షి దినపత్రిక డైరెక్టర్ పీవీకే ప్రసాద్ తండ్రి పాలడుగు మాధవరావు(92) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొండపనేని టౌన్షిప్లోగల కుమారుని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన స్వగ్రామం కృష్ణాజిల్లా ముస్తాబాద. పశ్చిమగోదావరి జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకులో కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మాధవరావు భార్య హైమావతి 2019లో కాలం చేశారు. ఆయనకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శనివారం మంగళగిరిలో పాలడుగు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
టాలీవుడ్లో విషాదం.. క్యాన్సర్‌తో దర్శకుడు కన్నుమూత!
టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్సార్ ప్రసాద్(49) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ‘సీతారామ్’ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్.. ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ‘నిరీక్షణ’తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌తో ‘శత్రువు’, నవదీప్‌తో ‘నటుడు’ అనే చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెక్కి’ విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేశాడు. సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం. -
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్‌పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
కోల్ ఇండియా చీఫ్‌గా పీఎం ప్రసాద్!
రాంచీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బాధ్యతలకు తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక వ్యవహారాల బోర్డ్ (పీఈఎస్బీ) ఏడుగురు అధికారులను ఇంటర్వ్యూ చేసి పీఎం ప్రసాద్ పేరును సిఫారసు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసుకు ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రసాద్ ప్రస్తుతం రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) సీఎండీగా పనిచేస్తున్నారు. 2019లో ఆయన భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) సీఎండీగా కూడా ఎంపికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఈ మైనింగ్‌లో గ్రాడ్యుయేటింగ్ తదుపరి 1984లో ఆయన సీఐఎల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అటు తర్వాత అంచెలంచెలుగా విభిన్న హోదాల్లో పనిచేస్తూ, కోల్ ఫీల్డ్స్‌లోని వివిధ రంగాల్లో అపార అనుభవాన్ని గడించారు. -
ట్రోలింగ్ సామాజిక జబ్బు!
సాక్షి, హైదరాబాద్: సెలెబ్రిటీలకే కాదు. క్రమంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులకు సైతం ట్రోలింగ్ తప్పడం లేదు. ఎదుటి వారి ప్రతిష్టను సోషల్ మీడియాలో దెబ్బతీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొందరు శాడిస్టులు. మరికొందరేమో పిచ్చి, ‘పచ్చి..’వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తాము ఫేమస్ అయ్యేందుకు దిగజారుతున్నారు. వ్యూస్, లైక్, కామెంట్లు , షేర్లతో సొమ్ము చేసుకునేందుకు ఇంకొందరు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడుతున్న దుర్మార్గపు ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎదుటి వారికి ఎలాంటి సంబంధం లేని విషయాలను వారికి అంటగట్టి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా కొందరు డబ్బు ఖర్చు చేసి మరీ ఇతరులతో ట్రోలింగ్‌లకు పాల్పడుతున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎదుటివారు ప్రయోగించే ‘ట్రోలింగ్’అ్రస్తాన్ని ఎలా తిప్పికొట్టాలి..ఎలా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన ఉండాలంటున్నారు సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డా.పాటిబండ్ల ప్రసాద్. ట్రోలింగ్ అంటే.. ఆన్లైన్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం లేదా కలవరపెట్టడాన్ని మనం స్థూలంగా ట్రోలింగ్ అనవచ్చు. ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశాలను సైతం అంటగడుతూ వారి సామాజిక హోదాను దెబ్బతీయడం, తద్వారా వారిని తీవ్ర ఆందోళనలో నెట్టడమే ట్రోలింగ్చేసే వారి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ట్రోలింగ్ రకాలు... ఫ్లేమ్ ట్రోలింగ్ నిందారోపితమైన ఆరోపణలు, ద్వేషాన్ని, ఇతరులను కించపర్చే అంశాలపై ట్రోలింగ్. ఉదాహరణకు మతపరమైన విద్వేష పూరిత భావజాలం పెంచేలా ట్రోలింగ్. ఆఫ్–టాపిక్ ట్రోలింగ్ అసందర్భమైన వ్యక్తులను, ప్రదేశాలను, స్థలాలను వివాదాల్లోకి లాగేలా చేసే ట్రోలింగ్. ఉదాహరణకు..పాత తరం రాజకీయ నాయకులను ప్రస్తుత రాజకీయాల్లోకి లాగడం..ప్రాంతాలు, మతపరమైన పాత వివాదాలు లేవనెత్తేలా ట్రోలింగ్. కన్సర్న్ ట్రోలింగ్ ఏదైన ఒక అంశాన్ని బా గా సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఆ విషయంపట్ల ఆందోళన చెందుతున్నట్టుగా నటిస్తూ వ్యాఖ్య లు.. ట్రోలింగ్ చేయడం.. ఉదాహరణకు.. మతపరమైన అంశాలపై మద్దతు పెంచడం, రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందేలా ట్రోలింగ్.. సోక్ పప్పెట్ ట్రోలింగ్... పెద్ద సంఖ్యలో ఫేక్ అకౌంట్లను సృష్టించి వాటి ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి మద్దతు ఇచ్చేలా లేదా కించపర్చేలా ట్రోలింగ్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం.. ఉదాహరణకు..రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల గురించి, మతపరమైన అంశాల గురించి డబ్బులు తీసుకుని ట్రోలింగ్ చేయడం. ట్రోలింగ్ దుష్ప్రభావాలు.. భావోద్వేగాలు రెచ్చగొట్టి బాధించడం: మానసిక క్షోభకు ట్రోలింగ్ దారితీస్తుంది. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తెచి్చపెడుతుంది. నమ్మకాన్ని పోగొట్టడం: ట్రోలింగ్ అనేది ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నిజమైన, అర్థవంతమైన సంభాషణల్లోనూ పాల్గొనకుండా స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. చిల్లింగ్ ఎఫెక్ట్: ట్రోలింగ్ లేదా వేధింపులు భయాన్ని పెంచుతాయి. ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తి ఆన్లైన్లో తన అభిప్రాయాలు స్వేచ్ఛ చెప్పడానికి భయపడే పరిస్థితికి వస్తాడు. తప్పుడు సమాచారం: ట్రోల్లు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చు. ఇది ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే బాధితులు.. ట్రోలింగ్‌కు పాల్పడాలనుకునే వారు టార్గెట్ చేసుకునేది ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే ఎక్కువ ఉంటున్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారిపైనే అందరిలో ఆసక్తి ఉంటుంది. అందుకే అలాంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్పందించకపోవడమే అసలు మందు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రోలింగ్ పాల్పడే వారి లక్ష్యం ఒక్కటే మనల్ని అన్ని రకాలుగా వేధించడం. అందుకే ట్రోలింగ్‌లో చేసే వారి కామెంట్లు పట్టించుకోకపోవడం అనేది ఉత్తమం. వీలైనంత వరకు సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. అది ట్రోలింగ్‌కు వాడే ప్రమాదం ఉంది. అలానే ట్రోలింగ్ శ్రుతి మించితే మాత్రం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి, ఆ కంటెంట్ డిలీట్ చేయించవచ్చు. అదేవిధంగా ట్రోల్ చేసే వారిని బ్లాక్ చేయడం, మ్యూట్ వంటి ఆప్షన్లు వాడాలి. ఇలా ఎదుర్కోవచ్చు... ట్రోల్‌ను తప్పక రిపోర్ట్ చేయాలి.. మనపై ట్రోలింగ్ చేస్తూ మనల్ని కించ పర్చే వ్యాఖ్యలు ఉంటే వెంటనే ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి ఆ కామెంట్లు డిలీట్ చేయించవచ్చు. ఈ టూల్స్ వాడొచ్చు.. సోషల్ మీడియా ఖాతాల్లో ఆయా ప్లాట్‌ఫామ్‌లు కొన్ని టూల్స్ ట్రోలింగ్‌ను ఎదుర్కొనేలా ఇస్తున్నాయి. ట్రోలింగ్ చేసే వారిని బ్లాక్ చేయ డం, మ్యూటింగ్ యూజర్స్ ఆప్షన్ పెట్టడం, ఫిల్టరింగ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ ఆప్షన్ పెట్టుకోవడం వంటివి వాడుకోవాలి. -
కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ఈనాడు రామోజీ కంకణం కట్టుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న లేఖ, సెల్‌ఫోన్‌ను వెంటనే ఎందుకు పోలీసులకు స్వాధీనం చేయలేదనే అంశాన్ని ఏనాడైనా రాశారా రామోజీ? ఈ కేసులో తొలి నుంచీ ప్రతి విషయంలో మీ వక్రీకరణ కనిపిస్తూనే ఉంది. ఎప్పుడు ఏ చిన్న విషయం తెలిసినా.. దానిని ప్రభుత్వానికి, ఎంపీ అవినాశ్రెడ్డికీ ముడిపెట్టి లేనిపోని విషయాలు కలిపి చెలరేగిపోతూ వండివార్చడమే మీరు పనిగా పెట్టుకోవడం నిజం కాదా? అసలు వివేకా కేసులో ఇంత గందరగోళానికి కారణం ఏమిటని ఏనాడైనా తొంగి చూశారా? వైఎస్ వివేకానందరెడ్డిపై తీవ్రంగా దాడి చేసిన ఆగంతకులు ఆయనతో బలవంతంగా ఓ లేఖ రాయించారు. తనను డ్రైవర్ ప్రసాద్ తీవ్రంగా గాయ పరచినట్టుగా ఆ లేఖలో వివేకా రాసినట్టుగా ఉంది. ఆ లేఖ ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ రోజే అంటే 2019 మార్చి 15న ఉదయమే గుర్తించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని మొదటగా చూసింది ఆయనే. ఆ లేఖతోపాటు వివేకానందరెడ్డి సెల్‌ఫోన్‌ను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. వివేకానందరెడ్డి మరణించిన సమాచారాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డిలకు ఫోన్ చేసి చెప్పారు. వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను కూడా వాట్సాప్ చేశారు. ఆ ఫొటోలు చూస్తే ఎవరికైనా అది హత్య అని సులువుగా తెలుస్తుంది. ఆ లేఖను తాము వచ్చే వరకు ఎవరికీ ఇవ్వొద్దని.. ఆ విషయం బయటకు చెప్పొద్దని వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. దాంతో ఆ లేఖ విషయం ఆయన పోలీసులకుగానీ ఇతరులకుగానీ చెప్పనే లేదు. ఆ తర్వాత కాసేపటికే సమీప నివాసాల్లోని వారు, పార్టీ కార్యకర్తలువచ్చారు. అనంతరం వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పడంతో ఎంపీ అవినాశ్‌రెడ్డికి విషయం తెలిసింది. దాంతో ఎన్నికల ప్రచారానికని బయలు దేరిన ఆయన వెనుదిరిగి వివేకా నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా వివేకానందరెడ్డి రాసిన లేఖ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి ఎవరికీ చెప్పనే లేదు. ఆ లేఖ విషయం అప్పుడే చెప్పి ఉంటే వివేకానందరెడ్డిది హత్య అని వెంటనే తెలిసేది. ఈ విషయం కదా తొలుత తేలాల్సింది. అది తేలితే తర్వాత కథ వేరుగా ఉండేది. ఈ విషయాలపై దర్యాప్తు సాగాలని ఏనాడైనా ఈనాడు రాసిందా? అంటే మీ ఉద్దేశం అసలు దోషులను తప్పించి.. ఇంకెవరినో ఇరికించాలనేగా! ఆ దిశగా దర్యాప్తు సాగేలా.. దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలు వండివార్చుతున్నది అందుకేగదా.. ఇది మీకు కనిపించలేదా? సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి ఆ రోజు అంటే 2019 మార్చి 15న మధ్యాహ్నం 12 – ఒంటి గంట మధ్య పులివెందులకు చేరుకున్నారు. అప్పుడు పీఏ కృష్ణారెడ్డి ఆ లేఖను వారికి అందించారు. వారు దానిని సాయంత్రం 5 గంటల వరకు వారి వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వాటిని కృష్ణారెడ్డి ద్వారా పోలీసులకు అందించారు. ఆ సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు, ఇతర డాటాను డిలీట్ చేసి మరీ పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. సహజంగా ఆ లేఖ విషయాన్ని వెంటనే చెప్పకుండా గోప్యంగా ఉంచిన పీఏ కృష్ణారెడ్డిని తొలుతే ఎందుకు ప్రశ్నించలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆ లేఖ విషయాన్ని రహస్యంగా ఉంచారో ఎందుకు తెలుసుకోలేదని.. అందువల్లే ఈ కేసులో కీలకమైన చిక్కుముడి విడిపోవడం లేదని ఎందుకు మీ రాతల్లో కనిపించదు రామోజీ? విషయం అందరికీ తెలిశాక.. ఘటనా స్థలానికి చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. వారిని దోషులుగా చూపుతూ దుష్ప్రచారం చేయడం మీకే చెల్లింది. వివేకా హత్య జరిగిన రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి అవినాశ్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లానని ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆ రోజూ చెప్పారు. ఈ రోజూ అదే చెబుతున్నారు. ఓ పని కోసం ఎంపీ ఇంటికి వెళ్లానని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ కూడా ఆరోజు, ఈ రోజు అదే చెబుతోంది. ఎంపీ ఇంటి వద్ద ఉన్నామని వాళ్లే స్వయంగా చెబుతున్నప్పుడు.. ఆ విషయం కొత్తగా కనిపెట్టినట్లు మీరు చెప్పడం ఏమిటో! ఉదయ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వండి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. శుక్రవారం ఆయన్ను కడపలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. -
తేనె పూసిన కత్తులు! హనీ ట్రాప్‌లు ఎన్నో రకాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్‌లు భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్బుక్ అకౌంట్‌తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్‌లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్‌రెడ్డిని 2022 జూన్‌లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హనీ ట్రాప్‌లు.. ఎన్నో రకాలు సోషల్ మీడియా ఆధారిత ట్రాప్‌లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్‌కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం సేకరిస్తారు. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫాంల ద్వారా: ఆన్లైన్లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్‌ల ద్వారా మెసేజ్‌లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్ల ఆధారిత హనీ ట్రాప్‌లు: అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్‌లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు. ఈ మెయిల్లో లింక్‌ల ద్వారా..: ఈ మెయిల్స్‌లో లింక్‌లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్‌లతో: డేటింగ్ యాప్‌లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. ♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు. ♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం. ♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు. అలా అడిగితే అనుమానించాల్సిందే హనీ ట్రాప్‌ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్‌ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
ఏపీ స్ఫూర్తితో సాగుతాం :కేరళ మంత్రి
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ ప్రశంసించారు. ఏపీ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సాగుదారుల హక్కు చట్టం (సీసీఆర్సీ) తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆర్బీకేల తరహాలో వన్‌స్టాప్ సొల్యూషన్ సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందడంపై వైగా–2023 ఇంటర్నేషనల్ సెమినార్ కేరళలోని తిరువనంతపురంలో ఆదివారం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరగనున్న సెమినార్‌ను ఏపీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.ప్రసాద్, చందర్ కుమార్ ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ దూసుకెళుతోందని ఈ సందర్భంగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి కొనియాడారు. ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలు అద్భుతమన్నారు. ల్యాబ్ టూ ల్యాండ్ కాన్సెప్ట్ కింద ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నామని, తమ రాష్ట్రంలోనూ ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఆలోచనల ఫలితమే ఆర్బీకేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలని సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆర్బీకేల ద్వారా పాడి, మత్స్య,డెయిరీ, బ్యాంకింగ్ సేవలన్నీ అందిస్తున్నామన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ నెలకొల్పామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆక్వా రంగానికి సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉచిత పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ), రైతు క్షేత్రం వద్దే పంట ఉత్పత్తుల కొనుగోలు చేపట్టామన్నారు. రైతులను ఆదుకునేలా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ వైగా–2023 ఇంటర్నేషనల్ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్బీకే నమూనాతో పాటు వ్యవసాయ–అనుబంధ రంగాలలో తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలను కళ్లకు కట్టినట్టుగా స్టాల్ ద్వారా ప్రదర్శించారు. సెమినార్‌కు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఏపీ స్టాల్‌ను సందర్శించి ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మంత్రి కాకాణితో పాటు ఏపీ ఉద్యాన, మార్కెటింగ్ శాఖ కమిషనర్లు డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, రాహుల్ పాండే, ఏపీసీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఓపెన్ హార్ట్ సర్జరీల అవసరం లేదు
సాక్షి, విశాఖపట్నం: గుండెకు నిబ్బరాన్నిచ్చే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ హృద్రోగులకు వారి పరిస్థితిని బట్టి స్టెంట్లు వేస్తున్నారు. అందుకు వీలుకాని పరిస్థితి ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సర్జరీకి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. పైగా వారం, 10 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీలు రోగికి నొప్పితోపాటు వైద్యులకు ప్రయాసతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తాజాగా పర్క్యూటనస్ వ్యాడ్స్ (వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైసెస్) వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం అందుబాటులోకి వచ్చిందని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు ప్రసాద్ చలసాని తెలిపారు. విశాఖపట్నంలో ఏఏఐపీ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. గుండెపోటుకు గురైన వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చిన్నపాటి సర్జరీ ద్వారా ఈ వాల్వులను రీప్లేస్ చేస్తారన్నారు. హృద్రోగికి ఈ వాల్వుల అమరిక కేవలం అర గంట నుంచి గంటలోపే వైద్యులు పూర్తి చేస్తారని చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోపే రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చన్నారు. దీని సక్సెస్ రేటు 99.9 శాతం ఉందని తెలిపారు. అమెరికాలో పర్క్యూటనస్ వ్యాడ్ వాల్వుల వినియోగం జరుగుతోందని, భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ విధానం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఇప్పటివరకు విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో అతి కొద్దిమందికి మాత్రమే వీటిని అమర్చారన్నారు. ఇందుకయ్యే ఖర్చు రూ.20 లక్షల వరకు ఉందని, అందువల్ల ప్రస్తుతానికి సామాన్యులకు భారమేనన్నారు. మున్ముందు ఖర్చు తగ్గే అవకాశముందని తెలిపారు. 35 ఏళ్లు దాటిన వారెవరైనా హైకొలె్రస్టాల్, మధుమేహం, రక్తపోటు, కాల్షియం, పరీక్షలను విధిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదీ చదవండి: ‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’ -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా..
నవ్వించడం అందరికీ చేతకాదు.. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. చిన్న నవ్వు.. కష్టాలను, ఒత్తిడిని మర్చిపోయేలా చేసి స్వాంతన చేకూర్చుతుంది. కానీ అలా నవ్వించేవారి జీవితాల్లో ఎంతో విషాదం ఉంటుంది. అయినా దాన్ని పెదాల చాటునే బిగబట్టుకుని ఆపేస్తారు. వారి కష్టాలను కూడా కామెడీ చేసి నవ్విస్తారు. కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆ కోవలోకే వస్తాడు. ఓపక్క తనకున్న వ్యాధితో పోరాడుతున్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉన్నాడు. తాజాగా అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. కనీసం తనంతట తానుగా నాడవలేకపోతున్నాడు. ఇంతకీ పంచ్ ప్రసాద్‌కు వచ్చిన వ్యాధి ఏంటి? ఎంతకాలం నుంచి దానితో పోరాడుతున్నాడనే విషయాలను ఈ కమెడియన్ కొంతకాలం కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందులో ఆయన ఏమన్నాడంటే.. 'మాది లవ్ మ్యారేజ్. నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కిడ్నీ సమస్య బయటపడింది. నాతో సహా మా ఇంట్లో వాళ్లు కూడా ఈ పెళ్లి వద్దని అమ్మాయికి నచ్చజెప్పాం. కానీ ఒక్కరోజు నాతో ఉన్నా చాలని చెప్పి అందరినీ ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక మేము మణికొండలో అవినాష్ వాళ్ల ఇంటిపై పోర్షన్లో ఉండేవాళ్లం. ఓసారి పైన ఉన్నప్పుడు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అప్పుడు నా భార్య గర్భవతి. ఆమెకు చెప్తే కంగారు పడుతుందని కిందకు వచ్చి కూర్చున్నా. నా ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. అప్పుడే అటుగా వచ్చిన గెటప్ శ్రీను నా భార్యను పిలిచి రూ.50 వేలిచ్చి వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. నేను ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఆస్పత్రిలోనే ఉండిపోయేది. ఒకానొక సమయంలో ఈ ఖర్చులు, నొప్పి భరించడం నావల్ల కాదని చనిపోదామనుకున్నా. కానీ నాకు కిడ్నీ ఇవ్వడానికి కూడా నా భార్య సిద్ధమైంది. ఇప్పటికీ నా ఆరోగ్యం గురించి పూర్తిగా ఆవిడే చూసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. పంచ్ ప్రసాద్‌కు కిడ్నీలు పాడయ్యాయని తెలిసినా పెళ్లి చేసుకుని అతడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందంటే ఆ ఇల్లాలు నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. చదవండి: నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్ పబ్లిక్‌గా అసభ్యంగా తాకాడు, అప్పుడు ఏం చేశానంటే: సుష్మితా సేన్ -
ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..
తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు. కాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో ప్రసాద్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. తనదైన స్పాంటేనిటి పంచ్‌లతో ‘పంచ్’ ప్రసాద్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్లో వాడి అందరిని నవ్వించాడు. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ఎప్పుడు ఏ షోలో కనిపించినా ఫుల్ కామెడీ చేస్తూ కడుబ్బా నవ్వించే ప్రసాద్‌ను గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్ ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో అతడు ఉన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానల్ షేర్ చేసిన వీడియోలో పంచ్ ప్రసాద్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్లో కమెడియన్ జోడీ నూకరాజు వ్లాక్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. చదవండి: నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న రష్మిక మూవీ! అప్పటి నుంచి స్ట్రీమింగ్? ఇందులో తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పేందుకు పంచ్ ప్రసాద్ ఇష్టం చూపించలేదు. అయినా చాటుగా ఈ వీడియో తీసి ఆయన ఆరోగ్య పరిస్థిని చూపించాడు నూకరాజు. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రసాద్‌కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని కోరాడు. -
రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
గుంతకల్లు: తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఠా కొంతకాలంగా కిడ్నాప్లతో హల్చల్ చేస్తోంది. స్థానిక యువతను ముఠాలో చేర్చుకోవడం, వారికి సమాచారం, సహకారం అందించడం, కిడ్నాప్‌లు, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఈ ముఠా లక్ష్యం. దీనికి నాయకుడు సుంకర ప్రసాద్‌నాయుడు. ఎవరీ సుంకర ప్రసాద్? ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు. క్రిమినల్ చరిత్ర చాలా పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 33 హత్య కేసుల్లో నిందితుడు. జైళ్లు, పోలీసులు, కేసులంటే లెక్కలేదు ఇతనికి. తాను చేసిన హత్యల గురించి ఒక్కొక్కటిగా విడమరిచి మరీ మీడియాకు వెల్లడించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇతని భార్య ఓ మాజీ నక్సలైట్. ప్రసాద్‌కు సుమారు రెండు దశాబ్దాల క్రిమినల్ చరిత్ర ఉంది. ఇంతటి నేర చరిత్ర కల్గిన ఇతని కన్ను ఇటీవల గుంతకల్లు ప్రాంతంపై పడింది. గుంతకల్లు వాసులతో కలసి.. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు, నలుగురు వ్యక్తులతో సుంకర ప్రసాద్ జతకట్టాడు. వీరిలో ముఖ్యుడు జి.కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. అతను ఇచ్చిన సమాచారం మేరకు జి.కొట్టాలకు చెందిన ఓ స్వామీజీని గత నెల 29న కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి రూ.26 లక్షల వరకు దండుకున్నట్లు సమాచారం. ఇందులో రూ.10 లక్షలు వాటాగా జి.కొట్టాలకు చెందిన వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. ఈ దందా బాగుందని భావించిన జి.కొట్టాల వాసి తన గ్రామానికే చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ వివరాలను సుంకర ప్రసాద్ ముఠాకు చేరవేశాడు. దీంతో సుంకర ప్రసాద్ ముఠా ఈ నెల 20న ఆకుల వ్యాపారిని కిడ్నాప్ చేసింది. అతని కుమారుడు సాయికుమార్‌కు ఫోన్‌చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసింది. సాయంత్రంలోగా సమకూర్చకపోతే వెంకటేష్‌ను చంపుతామని బెదిరించింది. బెంబేలెత్తిన అతను గ్రామస్తుల సహకారంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇంటర్వ్యూలు చూసి.. ఇక సుంకర ప్రసాద్ ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో చూసి జి.కొట్టాలకు చెందిన వ్యక్తి అతన్ని సంప్రదించినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడిన ఆ వ్యక్తికి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సుంకర ప్రసాద్ సహకారంతో తొలుత స్వామీజీని కిడ్నాప్‌చేసి విజయవంతమయ్యారు. ఇదే క్రమంలో రెండో కిడ్నాప్‌కు యత్నించి పోలీసులకు దొరికిపోయారు. ముఠా ఆటకట్టు ఇలా.. పోలీసుల సూచన మేరకు కిడ్నాపర్లకు సాయికుమార్ ఫోన్‌చేసి డబ్బులు సిద్ధం చేశానని, తమ గ్రామానికి వచ్చి తీసుకువెళ్లాలని కోరాడు. దీంతో గ్రామానికి చేరుకున్న కిడ్నాపర్లు ఒక కారు ఏర్పాటుచేశామని, అందులో డబ్బు పెట్టాలని సాయికుమార్‌కు చెప్పారు. అదే సమయంలో పోలీసులను గమనించిన కిడ్నాపర్లు కారు వదిలేసి పరారయ్యారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ వద్ద వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెర నుంచి విడుదల చేయించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో జి.కొట్టాల వాసితోపాటు సుంకర ప్రసాద్, మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. -
'నన్ను టీడీపీ నేతలు హతమార్చాలని చూశారు.. ఇవిగో ఆధారాలు'
సాక్షి, ఏలూరు: జి.కొత్తపల్లిలో తనపై తెలుగుదేశం పార్టీ నేతలే దాడి చేశారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ నేతలే నాపై దాడి చేశారనేందుకు నా వద్ద ఆధారాలున్నాయని మీడియాకు చూపెట్టారు. టీడీపీ నాయకుల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. నన్ను హతమార్చి రాజకీయ హత్యగా చిత్రీకరించాలని చూశారని వెంకట్రావు అన్నారు. మా నాయకుడు గంజి ప్రసాద్ కుటుంబానికి మా ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న పాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ మండిపడ్డారు. చదవండి: (గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం) -
గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం
సాక్షి, ఏలూరు: జిల్లాలో జరిగిన గంజి నాగప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బజారయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసరపల్లి టోల్గేట్ వద్ద బజారయ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. హత్య కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై 120బి, 302 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, గంజి నాగప్రసాద్‌కు, గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారియ్యకు పాతకక్షలు ఉన్నాయి. వీరు పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్నారు. ఇటీవల బజారియ్య వర్గంలోని మండవల్లి సురేష్‌కు చెందిన మిఠాయి బండిపై కొందరు దాడిచేశారు. ఇది గంజి ప్రసాదే చేయించాడని సురేష్, అతని స్నేహితులు ఉండ్రాజవరపు మోహన్, శానం హేమంత్, మరికొందరు భావించారు. ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతున్న నాగప్రసాద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సురేష్, మోహన్, హేమంత్ నిర్ణయించుకున్నారు. చదవండి👉 గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి ఈ నేపథ్యంలో.. శనివారం ఉ.7.30కు నాగప్రసాద్ పాల కోసం తన ఇంటి నుంచి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని జి.నాగరాజు అనే వ్యక్తి నిందితులకు సమాచారం అందించాడు. దీంతో సురేష్, మోహన్, హేమంత్లు బైక్‌పై నాగప్రసాద్‌కు ఎదురెళ్లి, పాఠశాల వద్ద అతడి వాహనాన్ని ఆపారు. అనంతరం ముగ్గురూ ఒక్కసారిగా నాగప్రసాద్‌పై కత్తులతో దాడిచేశారు. ముందుగా అతడి చేతిని నరికేశారు. ఆ తరువాత మెడపై, కాలిపై నరికారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక వారు ద్వారకా తిరుమల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. చదవండి👉 వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య -
వారం రోజుల్లో విదేశాలకు.. కారం, కత్తి, ఐరన్ రాడ్‌తో కొట్టి..
సాక్షి, గాజువాక (విశాఖ): గాజువాకలోని గోపాలరెడ్డినగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడిని కిరాతకంగా హతమార్చారు. కారం, కత్తి, ఐరన్ రాడ్‌తో కొట్టి హత్య చేశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... గోపాలరెడ్డినగర్‌కు చెందిన ఛత్రబోయిన ప్రసాద్ (32) సింగపూర్‌లో వెల్డర్‌గా పని చేసి వచ్చాడు. మరో వారం రోజుల్లో మస్కట్‌కు వెళ్లేందుకు వీసా సంపాదించాడు. కాగా, సమీప బంధువులైన శ్రీను, చిన్న, పోతురాజు వద్ద కొద్దికాలం క్రితం రూ.80వేలు అప్పుగా తీసుకున్నాడు. తమ అప్పు తిరిగి చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి చెల్లించేస్తానని ప్రసాద్ అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రసాద్ మళ్లీ విదేశాలకు వెళ్లిపోతున్నాడన్న విషయం తెలుసుకొని శ్రీను, చిన్న, పోతురాజు మరింత ఒత్తిడి పెంచారు. చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..) ఆదివారం సాయంత్రం తమ కాలనీ సమీపంలో జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లిన ప్రసాద్‌ను ముగ్గురు వ్యక్తులు కారం, కత్తి, ఐరాన్ రాడ్‌తో హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. నిందితులు ముగ్గురు మృతునికి దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన వెంటనే నిందితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. సోదరుడు కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఏడీసీపీ రాజ్‌కమల్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చదవండి: (వాట్సాప్ మెసేజ్: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..) -
సీనియర్ పాత్రికేయుడు ప్రసాద్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్ (88)కన్నుమూశారు. కొద్ది రోజులుగా లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో మృ తిచెందారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మ హాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించా రు. ప్రచార ఆర్భాటాలకు, పురస్కారాలకు దూరంగా ఉన్న ప్రసాద్ నడుస్తున్న నిఘం టువు వంటి వారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆయన విద్యాభాసమంతా మద్రాస్ లోనే జరిగింది. పాత్రికేయులుగా, ఆంధ్రప త్రిక ఎడిటర్‌గా పని చేసి, పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రోషనారా, అక్బర్, ఆర్య చాణక్య, పృథ్వీరాజ్, షాజహాన్ వంటి చారిత్రక నవలలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. మితభాషి అయిన ప్రసాద్ మృతితో ఒక మంచి రచయితను, గొప్ప పాత్రికేయుడిని కోల్పోయామని పలు వురు పాత్రికేయులు, సాహిత్యాభిమానులు తమ సంతాపాన్ని తెలియజేశారు. -
రైతు భరోసా పథకం భేష్
చింతలపూడి: ఏపీలో అమలవుతున్న రైతు భరోసా పథకం కాన్సెప్ట్ చాలా బాగుందని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని తన బృందంతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సాగు పద్ధతులు, దిగుబడి, లాభనష్టాల గురించి రైతులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడి రైతులు రైతు భరోసా పథకం వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాల్ని కేరళ మంత్రికి వివరించారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్నిరకాల సేవలనూ ఒకేచోట అందుబాటులోకి తెచ్చారని వివరించారు. దీంతో ఆయన రైతు భరోసా కేంద్రాలు, వాటి పనితీరును గురించి స్థానిక అధికారులను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలతో పాటు జిల్లాలోని నవధాన్యాలు, వరి, ఆయిల్‌పామ్ తోటలను కూడా పరిశీలించారు. ఇక్కడి రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను తెలుసుకున్నారు. ఆయన వెంట స్టేట్ హెడ్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) అంబేడ్కర్, జేడీఏ ఎం.జగ్గారావు, సర్పంచ్ పార్థసారథి, ఏడీ పీజీ బుజ్జిబాబు తదితరులు ఉన్నారు. -
కాకినాడ మేయర్ పావని తొలగింపు
సాక్షి, కాకినాడ: నాలుగేళ్ల ‘మేయర్’ గిరికి బ్రేక్ పడింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూటగట్టుకుని కార్పొరేటర్ల ‘విశ్వాసం’ కోల్పోయిన మేయర్ సుంకర పావని పదవిని కోల్పోయారు. ఈ మేరకు ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 129 ద్వారా పురపరిపాలనాశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టింగ్ మేయర్‌గా చోడిపల్లి డిప్యూటీ మేయర్ చోడిపల్లి ప్రసాద్ ‘యాక్టింగ్ మేయర్’ కానున్నారు. కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మేయర్ పదవిని కోల్పోతే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్‌కు అన్ని అధికారాలు దాఖలు పడతాయి. మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్–1 కూడా పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ మేయర్–2గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ తదుపరి మేయర్ ఎన్నిక జరిగే వరకు ‘యాక్టింగ్ మేయర్’గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదన పంపనున్నారు. అక్కడి నుంచి తేదీ ఖరారైన వెంటనే కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. -
ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా విక్టర్ ప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా మారుమూడి విక్టర్‌ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. గతేడాది జనవరిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. చదవండి: దళితులపై దాడులకు చంద్రబాబే గ్యాంగ్ లీడర్ దీంతో ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన న్యాయవాది, దళితుల సమస్య లపై 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసిన మారుమూడి విక్టర్ ప్రసాద్‌ను ప్రభు త్వం నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. విక్టర్ ప్రసాద్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొన సాగుతారు. -
శాశ్వతంగా తప్పుకున్న ఇళయరాజా
సాక్షి, చెన్నై: ప్రసాద్ స్టూడియో యాజమాన్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి సోమవారం తెరపడింది. ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరుపక్షాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఖాళీ చేయాలని స్టూడియో యాజమాన్యం ఇళయరాజాను కోరింది. ఇందుకు ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు. అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజ తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వీడియోలో అన్ని దృశ్యాలు చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే సామగ్రిని తీసుకెళ్లారు. (చదవండి: తానే సీఎం అభ్యర్థి అంటున్న కమల్ హాసన్) -
అతడి ఇంటికి 12 సార్లు గంజాయి సప్లై
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను ఆదివారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు ఎన్సీబీ అధికారులు. ఈ సందర్భంగా మరో తొమ్మిది రోజులు.. అక్టోబర్ 5వ తేదీ వరకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. షోవిక్, రియా చక్రవర్తికి గంజాయి సప్లయ్ చేసిన వారితో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో శనివారం ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శుక్రవారం ప్రసాద్ ఇంట్లో జరిపిన సోదాలలో వాడిపడేసిన గంజాయి లభించినట్లు వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. ( డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, శ్రద్ధా ఫోన్లు సీజ్ ) కాగా, డ్రగ్ డీలర్ సంకేత్ పాటెల్ విచారణలో ప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ ఇంటికి గంజాయి సప్లయి చేసినట్లు విచారణ సందర్భంగా పాటెల్ తెలిపాడు. మే నుంచి జులై వరకు దాదాపు 12 సార్లు ప్రసాద్ ఇంటికి గంజాయి పంపినట్లు, గంజాయి పంపిన ప్రతిసారి 3,500 రూపాయల డబ్బు ముట్టజెప్పినట్లు వెల్లడించాడు. -
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం : అశోక్ గజపతిరాజుపై సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండికూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) స్కీమ్‌కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా.. గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేనది నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రిచంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సంచయిత.. మన్సాస్ అభివృద్ధిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. (సంచయిత గజపతి రాజుకు కేంద్రం ప్రశంసలు) ప్రధాని, సీఎంకు కృతజ్ఞతలు.. నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ‘దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయిలిచ్చే స్కీమ్‌ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు అప్పట్లో నిర్లక్ష్యం చేశారు. ప్రసాద్ స్కీమ్‌లో సింహాచలం దేవస్ధానాన్ని చేర్చాలని ఎందుకు ప్రతిపాదించలేదు. సింహాచలం దేవస్ధానంలో వృధాగా ఉన్న వేలాది ఎకరాలలో ఈ పధకం క్రింద అభివృద్ది చేసే అవకాశాన్ని అశోక్ గజపతిరాజు ఎందుకు పట్డించుకోలేదు. ఉత్తరాంద్రతో పాటు సింహాచలంపై చంద్రబాబు, అశోక్ గజపతిల కపటప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి. అతి పురాతనమైన మోతీ మహల్‌ని రాత్రికి రాత్రే కూల్చేశారు. (అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ) అన్ని విమర్శలకి సమాధానం చెబుతా మోతీ మహల్ లాంటి పురాతన కట్టడాల అభివృద్దికి కేంద్రం నిదులిచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు కూల్చేశారు. కేంద్ర, రాష్డ్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాను. ప్రసాద స్కీమ్ లో సింహాచలం దేవస్ధానం ఎంపికకావడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపటం వల్లే కేంద్రం ఈ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానానికి అవకాశం కల్పించింది. మార్చ్ నెలలో కేంద్ర పర్యాటక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలని ఫాలో అప్ చేశా. ఈ పధకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. గత చైర్మన్ అశోక్ గజపతిరాజు సింహాచలంపై భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతాను. (మళ్లీ తెరపైకి విజయనగర సామ్రాజ్యం) -
సంచయితపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: చారిత్రాత్మక దేవాలయమైన సింహాచలం అప్పన్న ఆలయ అబివృద్దికి కృషి చేస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజుపై కేంద్రం బుధవారం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయ అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కలిసి అభివృద్ది చేద్దాం.. కేంద్రం నిర్ణయంపై సంచయిత గజపతి రాజు సంతోషం వ్యక్తం చేశారు 'ప్రసాద్' పథకంలో సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసినందుకు ప్రదాని మోదీ, కేంద్ర పర్యాటక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. "ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ఆలయాల్లో సింహాచలం దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానాన్ని కలిసి అభివృద్ది చేద్దాం.." అంటూ కేంద్రమంత్రికి రీట్వీట్ చేశారు. కాగా దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలు అభివృద్ది చేసేందుకు కేంద్రం "ప్రసాద్" పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలో శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలను ఇప్పటికే ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తున్నారు. ('ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం') చదవండి: 2024 నాటికల్లా విశాఖ మెట్రో.. -
27 ఏళ్ల తర్వాత ఇంటికి: ‘తప్పు చేశా’..
లక్నో : తండ్రితో ఏర్పడ్డ మనస్పర్థల వల్ల ఇళ్లు వదలి పెట్టి వెళ్లిపోయిన ఓ వ్యక్తి కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా 27 ఏళ్ల తర్వాత కుటుంబం వద్దకు చేరుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మెహంగీ ప్రసాద్ తండ్రితో మనస్పర్థల కారణంగా 1993లో తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని వదలి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అప్పుడు అతడి వయసు 36 ఏళ్లు. ప్రసాద్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎంత గాలించినా దొరకలేదు. ముంబై చేరుకున్న ప్రసాద్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవాడు. కానీ, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా పనుల్లేకపోవటంతో అతడి మనసు ఇంటివైపు మళ్లింది. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. మే 6న 1100 కిలోమీటర్లు ప్రయాణించి ఊరికి చేరుకున్నాడు. ( ముఖానికి నల్లరంగు: మెడలో చెప్పుల దండ..) అయితే కుటుంబసభ్యుల ఆచూకీ కనుక్కోవటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో గ్రామంలో క్వారెంటైన్లో ఉండాల్సి వచ్చింది. చివరకు క్వారెంటైన్ తర్వాత కుటుంబసభ్యుల్ని కలుసుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత 63 ఏళ్ల తండ్రిని చూసేసరికి అతడి కూతురు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అయితే తల్లిదండ్రులు, భార్య మరణించారని తెలుసుకుని అతడు చాలా బాధపడ్డాడు. కోపంలో ఇంటినుంచి వెళ్లిపోయి పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపపడ్డాడు. -
సుకుమార్ భావోద్వేగ పోస్ట్..
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన వాళ్లను ఎంతగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే. అలాగే తన వద్ద పనిచేసే వాళ్లకు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటారు. అందుకోసమే సుకుమార్ రైటింగ్స్‌ను ఏర్పాటు చేసి తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసే వారిని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. అలాంటి సుకుమార్.. కొద్ది రోజుల క్రితం మరణించిన తన స్నేహితుడు ప్రసాద్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసాద్ మరణించినప్పటికీ నేడు అతని బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన సుకుమార్.. వారి ఇద్దరి మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఓ చిన్న కథను రాశారు. (చదవండి : బన్ని చిత్రంలో దిశా.. సుక్కు మాస్టర్ ప్లాన్) తొలుత లేకపోవడం అంటే ఏంటీ అని ప్రస్తావించిన సుకుమార్.. చివరకు తనకు ఆ పదం అర్థమైందని పేర్కొన్నారు. లేకపోవడం అంటే.. మనం ‘ఈ బతుకు’ అనే లాక్డౌన్లో బందీగా ఉండటమే అని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్లో కూడా నా జ్ఞాపకాల్లో స్వేచ్చగా తిరుగుతున్న ‘బావగాడికి(ప్రసాద్)’ జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. కాగా, సుకుమార్‌కు అత్యంత సన్నిహతుడై ప్రసాద్ మార్చి 28వ తేదీన గుండెపోటుతో కన్నుమూశారు. ప్రసాద్ సుకుమార్ వద్ద మేనేజర్ కూడా పనిచేసేవారు.(చదవండి : ఛాలెంజ్ పూర్తిచేసిన సుకుమార్, కీరవాణి) సుకుమార్ సతీమణి తబిత కూడా ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రసాద్ అన్నయ్య నువ్వు మమల్ని విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయిన నిజాన్ని.. జీర్ణించుకోవడం చాలా కష్టం. నీ స్వచ్ఛమైన చిరునవ్వును మరిచిపోవడమనేది జరగని పని. నిన్ను ప్రతిరోజు మేము గుర్తుచేసుకుంటూనే ఉంటాం.. మరీ ముఖ్యంగా ఇవాళ నీ పుట్టిన రోజునా. నువ్వు ఎప్పుడూ మా గుండెల్లో ఉంటావు’ అని పేర్కొన్నారు. -
నిర్మాత ప్రసాద్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, ఆయన మేనేజర్ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రసాద్ ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమా నిర్మించారు. ఆయనకు భార్య పద్మజ, కుమార్తెలు సాయి ప్రణీత, సత్య ప్రజీత ఉన్నారు. ప్రసాద్ మరణ వార్త విన్న సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను ఏ కాస్త నిరుత్సాహంలో ఉన్నా ప్రసాద్‌తో మాట్లాడగానే ఎనర్జీ వచ్చేది. తన మరణం నాకు చాలా లోటు. తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’’ అంటూ ప్రసాద్ కుటుంబానికి సుకుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
‘వారి ప్రమేయం ఉన్నా వదలం’
సాక్షి, విజయవాడ : నిబంధనలకు విరుద్ధంగా బిఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి అక్రమ ధ్రువ పత్రాల ద్వారా ఆంధ్రపదేశ్‌లో తిప్పడంపై ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. బిఎస్-౩ వాహనాలు 31-03-2017 తరువాత అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని అన్నారు. అశోక్ లైల్యాండ్ నుంచి బీఎస్-3 వాహనాలు కొనుగోలు చేసి తిప్పుతున్నట్లు తెలిసిందన్నారు. 66 వాహనాలు స్క్రాప్‌గా అమ్మడం జరిగిందని, అశోక్ లైల్యాండ్ వాళ్లు తెలిపారని చెప్పారు. దేశంలో తిరగడానికి వీలులేని వాహనాలను తిప్పుతున్నారని, పోలీసుల సర్టిఫికెట్లు కూడా దొంగవి పెట్టారన్నారు. పోలీస్ శాఖ కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టిందని తెలిపారు. 25 వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా లావాదేవీలు నిలిపివేయాలని కోరామన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ అక్రమ ధ్రువ పత్రాలు ఉన్న వాహనాలను సీజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టాం. ఇప్పటికి 23 వాహనాలు సీజ్ చేసాం.వాహనాలు కొని మోసపోయిన వారు అమ్మిన వారిపై కేసులు పెట్టాలని సూచించాం. జఠాధర ఇండస్ట్రీస్, సి గోపాల కృష్ణ కంపెనీకి చెందిన 80 బస్సులు ఉన్నాయి. లారీలు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం. 88 వాహనాలకు సంబంధించి 3 కేసులు నమోదు అయ్యాయి. 23 వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారుల ప్రమేయం ఉన్నా వారిని వదిలే ప్రసక్తి లేదు. ఆగష్టు 2018న నాగాలాండ్‌లో ఈ వాహనాలు రిజిష్టర్ చేశారు. 45 వాహనాలు ఏపీలోనే ఉన్నాయని తెలిసింది. గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ పేరిట 45 వాహనాలు, మిగిలినవి జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిష్టర్ చేశారు. పీఆర్ హిల్ కోహిమా అని అడ్రస్ ఇచ్చారు, తాడిపత్రిలో పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు. జె.సి.ఉమారెడ్డి నాలుగు వాహనాలకు సంతకం చేశారు. సి.గోపాల్ రెడ్డి రెండు వాహనాలకు సంతకం చేశారు. నాగాలాండ్‌లో రిజిష్టర్ చేస్తే పట్టుబడమని అనుకున్నారు. అక్కడి నుంచి ఎన్ఓసీ కింద ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి. అనంతపురంలో ఒక క్రిమినల్ కేసు వేశాము. ఇన్సూరెన్స్ కూడా దొంగ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 2020 నుంచీ బీఎస్ - 6 కాకపోతే తిగడానికే వీలు లేదు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 182 ప్రకారం మేనుఫ్యాక్చరర్ తప్పుంటే చర్యలు తీసుకుంటాం. తప్పుడు పత్రాలు కనుక.. రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఇతర రాష్ట్రాలకు కూడా తెలిపాం. చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న వాహనాలు కనుక ఇప్పటి వరకూ 23 వాహనాలు సీజ్ చేశాం. లారీలను బస్సులుగా మార్చడంతో క్రిమినల్ కేసు నమోదు. ఏపీలోనే 29 రిజిష్టర్ కావడంతో, ట్రాన్స్పోర్ట్ అధికారులెవరైనా చర్యలు తప్పవు. అనంతపురంలోనే 29వాహనాలు రిజిష్టర్ అయ్యాయి. లారీ ఛాసిస్ తో మూడు బస్సులుగా మార్చారు. వాహనాలన్ని సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ, జఠాధర కంపెనీ కింద రిజర్వేషన్లు అయ్యాయి. 6 వాహనాలకు సంబంధించి వాహన యజమానులతో పాటు అశోక్ లైలాండ్ కంపెనీపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశాం. దొంగ ఇన్సూరెన్స్‌లు పెట్టారు. యునైటెడ్ చీఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నాం . ఈ వ్యవహారంపై జాయింట్ కమిషనర్ నేతృత్వంలో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశార’ని తెలిపారు. -
కెనడా చట్టసభలో తెలుగు తేజం
తెనాలి : పండా శివలింగ ప్రసాద్.. కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రంలో మౌలిక వసతుల మంత్రి. కాల్గరీ–ఎడ్మాంటన్ ఎమ్మెల్యే. గత ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. ఆల్బర్టాను అప్పుల బారినుంచి గట్టెక్కించాలనేది తన మొదటి ప్రాధాన్యతగా చెబుతున్నారు. ఆయన విజయ ప్రస్థానంలోకి వెళితే.. శివలింగప్రసాద్ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగజాగర్లమూడి. తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, వెంకట సుబ్బయ్య. ప్రసాద్‌కు ముగ్గురు అక్కలు, అన్నయ్య. ప్రసాద్ ఉయ్యూరులో అన్నయ్య వద్ద ఉంటూ ఇంటర్, విజయవాడలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. హైదరాబాద్‌లో ఆల్విన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ స్కూటర్స్ లిమిటెడ్‌లో ఓ ఏడాది, ఆ తరువాత ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 1988 నుంచి 16 ఏళ్లు పనిచేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన జామ్‌నగర్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్‌ను ఆయిల్ నిక్షేపాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రం ఆకర్షించింది. దీంతో అక్కడి సంతూర్ ఎనర్జీలో చేరారు. పదకొండేళ్ల అనుభవం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల వైపు చూశారు. ప్రతిపక్ష వైల్డ్ రోజ్ పార్టీలో చేరి, పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆ తరువాత కాల్గరీ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉంటూ ఎకనమిక్ డెవలప్మెంట్, ట్రేడ్‌కు షాడో మంత్రిగా వ్యవహరించారు. భారతీయులు 2 శాతం కూడా లేనిచోట.. 2019 ఏప్రిల్ 16న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాల్గరీ–ఎడ్మాంటన్ నుంచి గెలుపొందిన ప్రసాద్ మౌలిక వసతుల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ నియోజకవర్గంలో 75 శాతం ప్రజలు తెల్లవాళ్లు. 16 శాతం చైనీయులు. ఇండియా నుంచి రెండు శాతం కూడా ఉండరు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయిల్, గ్యాస్ రంగ నిపుణుడిగా సుదీర్ఘకాలం అక్కడ పనిచేసిన అనుభవంతో స్థానికులు తనను ఆదరించారని చెప్పారు. కుల మతాలు, ప్రాంత వ్యత్యాసాలను ప్రజలు చూడరని, అభ్యర్థుల చరిత్ర, సమర్థతలను బేరీజు వేసుకుని, సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని వివరించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టటం, అప్పులు తగ్గించి, బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నామని చెప్పారు. -
బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్
సాక్షి, ముంబై: బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. కేసు నమోదుచేసిన స్థానిక సైన్ పోలీసులు అజ్ఞాత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీ రావడంతో ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ సోమవారం సాయంత్రం సైన్ ప్రాంతంలో విజయోత్సవాలు నిర్వహించారు. అందుకు భారీ వేదిక, ప్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపకపోయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది ప్రచార సభలు నిర్వహించారు. ప్రచారం చేసిన చోట మధ్య మధ్యలో వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై మోదీ వైఫల్యాలను ఎండగట్టే వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. అప్పట్లో రాజ్ ఠాక్రే చెప్పిన ‘లావ్రే తో వీడియో’ (ఆ వీడియో ప్రదర్శించండి) అనే డైలాగ్ ఫేమస్ అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రసాద్ లాడ్ మద్దతుదారులు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై ఎమ్మెన్నెస్‌ను పరోక్షంగా కించపరిచాలనే ఉద్ధేశంతో ‘లావ్రే తో ఫటాకే, వాజవ్రే ఢోల్’ అనే వ్యాఖ్యలు రాశారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెన్నెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వారు వెళ్లిపోయిన తరువాత కొద్దిసేపటికే లాడ్‌కు బెదిరింపు ఫోన్లు రావడం మొదలయ్యాయి. దీంతో ఆ ఫోన్లు ఎమ్మెన్నెస్ కార్యకర్తలే చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సెమీస్‌లో ప్రసాద్
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌కు చెందిన తేజ్ బహదూర్ దేబాపై ప్రసాద్ విజయం సాధించాడు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ఆసియా చాంపియన్ అమిత్ ఫంగల్, సచిన్ సివాచ్, గౌరవ్ సోలంకి కూడా సెమీఫైనల్‌కు చేరారు. దాంతో ఈ విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత్ ఖాతాలోకే చేరనున్నాయి. -
ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీకి నిఖత్, హుసాముద్దీన్, ప్రసాద్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగే ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మొహమ్మద్ హుసాముద్దీన్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్ ఎంపికయ్యారు. మే 20 నుంచి 24 వరకు గువాహటిలో ఈ టోర్నీ జరుగుతుంది. ఒలింపిక్ కేటగిరీ అయిన 51 కేజీల విభాగంలో నిఖత్ బరిలోకి దిగుతుంది. ఇదే విభాగంలో భారత మేటి బాక్సర్ మేరీకోమ్ కూడా పాల్గొంటుంది. హుసాముద్దీన్ 54 కేజీల విభాగంలో, ప్రసాద్ 52 కేజీల విభాగంలో ఉన్నారు. 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్ తరఫున పురుషుల విభాగంలో 35 మంది... మహిళల విభాగంలో 37 మంది పోటీపడతారు. ఈ టోర్నీలో 16 దేశాల నుంచి సుమారు 200 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
సగం విరాళానికి...
తేజస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ హీరో హీరోయిన్లుగా ఎం.వి. ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మనసా.. వాచా’. నిశ్చల్ దేవా–లండన్ గణేష్ నిర్మించిన ఈ సినిమా ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా ఈ నెల 15న విడుదలవుతోంది. ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు మందులు వేసుకుని నయం చేసుకుంటాం. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో సగం క్యాన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను ‘మనసా.. వాచా’ కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. ఎం.వి. ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు నిశ్చల్ దేవా. ‘‘ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా రిలీజవ్వడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు. -
మారుతి
‘‘పిల్లలంతా వెళ్లిపోయాక ఇల్లెంత బోసిపోయిందో చూడండీ..’’ అంట్ల గిన్నెలు సింక్‌లో వేస్తూ అవంతి నిట్టూర్పు.‘‘వాళ్ల ఉద్యోగాలు.. వాళ్ల జీవితాలు..తప్పదు’’ చిలికిన మజ్జిగను రెండు గ్లాసుల్లో పోస్తూ అన్నాడు ప్రసాద్.‘‘అందుకే చిన్న ఇల్లు తీసుకుందాం అంటే విన్నారా?’’ అంది పెరుగ్గిన్నెను ఫ్రిజ్‌లో పెడుతూ.‘‘ఇది మనకోసం కాదుగా అవంతీ..’’ అన్నాడు రెండు మజ్జిగ గ్లాసులను తీసుకుని డైనింగ్ హాల్లోకి వెళుతూ, ‘‘మరే..’’బొడ్లో దోపుకున్న చీర కొంగును తీసి చేతులు తుడుచుకుంటూ భర్తను అనుసరించింది. రాత్రి తొమ్మిదైంది... ఎక్కడి నుంచో కుక్క అరుపు. ‘‘హూ.. మొదలైంది’’ డైనింగ్ టేబుల్ కుర్చీ ఇవతలకు లాక్కుంటూ అవంతి. మౌనంగా ఒక మజ్జిగ గ్లాస్ భార్యకు ఇచ్చాడు ప్రసాద్. తన గ్లాస్‌లోని మజ్జిగను సిప్ చేస్తూ హాల్లో ఉన్న కిటికీ దగ్గరకు వెళ్లాడు. బయటకు చూశాడు. తెల్లటి ప్రహరీకి నల్లని గేట్. స్ట్రీట్ లైట్ వెలుతురు ఏటవాలుగా పడి మెరుస్తోంది. గేట్ లోపల.. బయట ఏమీ లేదు. కుక్క కూడా! మజ్జిగ సిప్ చేస్తూనే కిటికీ తలుపులు మూసి బోల్ట్ పెట్టి కర్టెన్ లాగాడు. ఇంకో సిప్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే మజ్జిగ తాగేసింది అవంతి. భర్తనే చూస్తోంది... పది రోజులే అవుతోంది ఆ గృహ ప్రవేశం చేసి. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు.. నలుగురూ ఉద్యోగస్తులే. ప్రవేశం అయిన అయిదు రోజులకే వెళ్లిపోయారు. వేసవి సెలవులు కదా మనవలు, మనవరాళ్లను ఉంచమన్నా వినలేదు ‘‘మిమ్మల్ని విసిగిస్తారు’’ అంటూ. ఇప్పుడు ఆ కుక్క అరుపులు తప్ప ఆ ఇంట్లో ఏ అలికిడీ లేదు. ఆ కుక్కా కనిపించదు. వినిపిస్తూ ఉంటుంది. అంతే! ఏంటో ఈ రెండు రోజులుగా దాని అరుపు వింటుంటే భయమేస్తోంది అవంతికి. ఇప్పుడు భర్త మొహంలోనూ అది కనపడుతోంది ఆమెకు. మజ్జిగ తాగడం పూర్తి అయినా ఇద్దరూ అలాగే కూర్చున్నారు చాలా సేపు!∙∙ బోఓ... బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ..చటుక్కున నిద్రలోంచి లేచింది అవంతి. కుక్క ఏడుపు.. అదే పనిగా!మంచం కింద నుంచి వస్తోంది. వంగి చూసింది. కుక్క లేదు. ఈసారి ఆ ఏడుపు లివింగ్ ఏరియా దూరానికి వెళ్లింది. గబగబా అక్కడికి పరిగెత్తింది అవంతి. బయట గేట్ దగ్గరకు షిఫ్ట్ అయింది ఏడుపు. మెయిన్ డోర్ తెరిచి చూసింది ఆమె. ఏమీ కనిపించలేదు. మళ్లీ ఇంట్లోకి మళ్లింది ఏడుపు. అవంతీ లోపలకు వెళ్లింది. ఈ సారి హృదయ విదారకంగా.. పైన బెడ్ రూమ్ లోంచి. ఆ వైపుగా కదిలింది ఆమె. అరే.. వంటింట్లోంచి.. కిందకు దిగింది ఆమె. టెర్రస్ మీద నుంచి వినపడింది.. టెర్రస్ చేరుకుంది అవంతి. లేదు.. కుక్క లేదు.. కాని ఏడుపు తడవ తడవకు ఒక్కో చోటికి మారుతూనే ఉంది. పిచ్చిపట్టినదానిలా అవంతి ఎటుపడితే అటు పరుగులు తీస్తూనే ఉంది. కాసేపటికి నిద్రలేచిన ప్రసాద్‌కి పక్కన భార్య కనిపించలేదు. హాల్లోకి వచ్చి చూశాడు. ఆయాస పడుతూ.. నీరసంగా ఈడుస్తూ .. చెమటలు పట్టి భార్య. ‘‘అవంతీ....!’’ విస్మయంగా పిలిచాడు ప్రసాద్. చటుక్కున చూసింది భర్తను. ‘‘ఏమండీ.. అదెక్కడుందో కనపడట్లేదు.. పాపం ఒకటే ఏడుపు.. ఇందాకటి నుంచి..’’ జాలేసింది ప్రసాద్‌కి.. ‘‘అవంతీ..?’’ ‘‘కుక్కండీ.. పాపం.. ఎందుకు ఏడుస్తోందో?’’ ‘‘కుక్క లేదు.. ఏం లేదు.. పదా.. పడుకుందువు గానీ’’ అంటూ ఆమె భుజమ్మీద చేయి వేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. అయినా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది అవంతి.. ‘‘అదిగో అక్కడ నుంచి వినపడుతోంది’’ అంటూ గుమ్మం బయటవైపుకి చూపిస్తూ వెళ్లబోయింది. ‘‘నేను చూస్తాలే. నువ్ పడుకో’’ అంటూ బలవంతంగా మంచమ్మీద కూర్చోబెట్టాడు భార్యను. పక్కనే స్టడీ టేబుల్ మీదున్న నీళ్ల గ్లాస్ ఇచ్చాడు. దాహంగా ఉందేమో గటగటా తాగేసింది అవంతి. ఖాళీ గ్లాస్ భర్త చేతికిచ్చి.. మంచం మీద వాలిపోయింది. గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఇటు తిరిగేసరికే నిద్రలోకి జారుకుని కనిపించింది భార్య. పక్కనే కూర్చున్నాడు అవంతి తల నిమురుతూ. కుక్క ఏడుపు భార్య భ్రమ కాదు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే! పిల్లలు వెళ్లినప్పటి నుంచీ ఇది జరుగుతున్న తతంగమే. తను నమ్మడానికి కారణం.. రాత్రిళ్లు దాని అరుపులు తనకూ వినిపించడమే! ఇద్దరికీ ఒకే రకమైన భ్రమ, భ్రాంతి ఉంటాయా? చిత్రమేంటంటే.. తెల్లవారే సరికి ఇదంతా మరిచిపోతోంది అవంతి. అడిగితే అమాయకంగా మొహం పెడుతుంది.. ప్రతి రోజూ! కలతతోనే నడుం వాల్చాడు ప్రసాద్.∙∙ వేసవి కదా.. ఉదయం ఆరింటికే హాజరు వేసేసుకున్నాడు సూర్యుడు. రాత్రి నిద్రలేమి ప్రసాద్‌ను వెంటాడుతోంది. మార్నింగ్ వాక్‌లో అన్యమనస్కంగానే అడుగులు వేస్తున్నాడు. పార్క్‌లో ఎదురుపడ్డ వాళ్లంతా విష్ చేస్తుంటే.. చిరునవ్వుతో బదులిస్తున్నాడు. కాస్త నడకకే అలసినట్టనిపించింది. చెట్టు నీడలో ఉన్న íసిమెంట్ బెంచీ చూసుకుని కూలబడ్డాడు. జబ్బకున్న సంచీ పక్కన పెట్టి దాంట్లోంచి నీళ్ల సీసా తీసి గొంతు తడుపుకున్నాడు. సీసాకు మూత పెడుతూ తల తిప్పాడు యథాలాపంగా. ప్రసాద్ కంటే రెండుమూడేళ్లు పెద్దవాడై ఉంటాడు.. ఒక వ్యక్తి నడుస్తూ వస్తున్నాడు. పక్కనే గోధుమ వర్ణంలో మెరిసిపోతున్న సింహంలాంటి కుక్క. దానికి ఏదో చెప్తున్నాడు అతను. అది శ్రద్ధగా వింటోంది అతని మాటలను. సిమెంట్ బెంచీ కనపడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆగింది తన యజమానిని కూర్చోమన్నట్టుగా. వెనకాలే అతనూ వచ్చి బెంచి మీద సేద తీరాడు. ప్రసాద్ పక్కనే. ఆసక్తిగా గమనిస్తున్నాడు ప్రసాద్. అపరిచితుడు కూర్చోగానే నవ్వుతూ విష్ చేశాడు ప్రసాద్‌ని. బదులుగా తనూ నవ్వాడు. ప్రసాద్ కళ్లన్నీ ఆ కుక్క మీదనే. ఎక్కడో చూసినట్టు.. చాలా పరిచయం ఉన్నట్టు. గమనించిన ఆ అపరిచితుడు.. ‘‘వీడి పేరు మారుతి. నా బంటు. నా పిల్లల కన్నా’’ చెప్తున్నప్పుడు అతని కళ్లల్లో నీటి పొర. యజమానిని చూస్తూ కుక్క ఏడ్చింది.. అరిచింది.. అచ్చం.. రాత్రిళ్లు తమకు వినిపిస్తున్నట్టుగానే!ప్రసాద్ భృకుటి ముడి పడింది. అదీ గమనించాడు అపరిచితుడు. ‘‘భయపడకండి.. మారుతి మిమ్మల్నేం చేయడు. వాడు ఆ ఇంటిని వదిలిపోలేడు. ఎందుకంటే అది నా యిల్లు. ఆస్తి కోసం నా కొడుకులు నన్ను చంపేశారు. నా మీద బెంగతో చిక్కి శల్యమై మారుతీ నా దగ్గరకు వచ్చేశాడు. తర్వాత ఆ ఇంటిని నా పిల్లలు మీకు అమ్మేశారు. నా మీద.. నేను కట్టిన ఆ ఇంటి మీద ప్రేమ చావక వీడు .. రోజూ మిమ్మల్ని ఇబ్బంది పెడ్తున్నాడు. క్షమించండి..’’ స్థిరమైన గొంతుతో.. విషాదమైన చూపులతో ఇంకేదో చెప్పుకు పోతూనే ఉన్నాడు ఆ అపరిచితుడు. అతని ఒళ్లో తల పెట్టి బాధగా మూలుగుతున్నాడు మారుతి. వెన్నులోంచి చలి ప్రసాద్‌కి.. ‘‘ప్రసాద్ గారూ.. ప్రసాద్ గారూ.. ’’భుజం తట్టినట్టనిపించి మెడ తిప్పాడు.. పక్కింటి ఆయన.. వెంటనే.. బెంచి చివర చూశాడు.. ఖాళీగా ఉంది ఆ జాగా! సరస్వతి రమ -
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలకు నిఖత్ జరీన్, ప్రసాద్
న్యూఢిల్లీ: గతేడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో మెరిసిన భారత బాక్సర్లు కొత్త సీజన్లోనూ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో భారత బాక్సర్లు మూడు అంతర్జాతీయ టోర్నీల్లో బరిలోకి దిగనున్నారు. బల్గేరియాలో జరిగే స్ట్రాండ్జా టోర్నీలో... ఆ తర్వాత ఇరాన్లో జరిగే టోర్నీలో... ఫిన్లాండ్లో జరిగే టోర్నీలో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్ట్రాండ్జా టోర్నీలో భారత్ తరఫున మహిళల విభాగంలో 10 మంది... పురుషుల విభాగంలో తొమ్మిది మంది పోటీపడుతున్నారు. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఇరాన్లో జరిగే టోర్నీలో పాల్గొనే భారత పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ ఎంపికయ్యాడు. అతను 52 కేజీల విభాగంలో పోటీపడతాడు. -
వేగంగా విస్తరిస్తున్న ఎంఫైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆసరాగా చేసుకుని ఆన్ డిమాండ్ హెల్త్‌కేర్ సేవలు అందిస్తున్న ఎంఫైన్ వేగంగా తన సర్వీసులను విస్తరిస్తోంది. 80 ఆసుప్రతులకు చెందిన 18 విభాగాల్లో పనిచేస్తున్న 300కు పైగా డాక్టర్లతో కంపెనీ చేతులు కలిపింది. నిముషంలో వీడియో కాల్ ద్వారా ఈ వైద్యులను సంప్రతించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు 50,000 పైగా కస్టమర్లు తమ సేవలను అందుకున్నారని ఎంఫైన్ సీఈవో ప్రసాద్ కొంపల్లి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో 22 ఆసుపత్రులతో ఎంఫైన్కు భాగస్వామ్యం ఉంది. 100 మంది వైద్యుల ద్వారా 5,000 పైచిలుకు కస్టమర్లు వైద్య సేవలు పొందారు. -
నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!
‘‘బాబాయ్... బాబాయ్’’ అని అరుచుకుంటూ అతడి వెనకాల పరుగెత్తుకుంటూ వస్తున్నాడు అబ్బాయ్. ఆయన కళ్లు పీక్కుపోయి ఉన్నాయి. దుస్తులు దుమ్ముకొట్టుకుపోయాయి. ఎన్ని రోజులవుతుందో తిండి తిని! ‘‘నాయనా వేణూ..’’ అంటూ పరుగెత్తుకు వచ్చింది అమ్మ. ఆమె కళ్లలో శోకనది కట్టలు తెంచుకుంది... ‘‘బాబూ వేణూ... ఏమిట్రా ఇది! ఇన్నాళ్లు ఎక్కడికెళ్లావు? ఏమైపోయావు? ఇల్లు వదిలి పెట్టి ఎన్నాళ్లు ఇలా తిరుగుతావు?’’ ‘‘ఇల్లు వదిలి పెట్టినందుకు కాదమ్మా....తల్లిని వదిలి పెట్టినందుకు బాధ’’ కన్నీళ్లను దిగమింగుతూ అన్నాడు వేణు. ‘‘ఆ బాధ నీకేమాత్రం ఉన్నా ఒక్కసారి వచ్చి కనబడక పోతావా’’ కొడుకు కళ్లలోకి చూస్తూ అడిగింది తల్లి. ‘‘ఏ ముఖం పెట్టుకొని కనబడమంటావు అమ్మా! చేయడానికి ఉద్యోగం లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు’’ శూన్యంలోకి చూస్తూ అన్నాడు వేణు. ‘‘తల్లికి కావల్సింది నీ సంపాదన కాదురా. నీ క్షేమం. సరేలే... పద ఇంటికి పోదాం’’ అని కొడుకు చేయి పట్టుకుంది తల్లి. ‘‘ఇంటికా!’’ ఒక్క క్షణం వెనకడుగు వేశాడు వేణు. ‘‘అన్నం తిని ఎన్నాళ్లయిందో’’ కొడుకు కడుపు వైపు చూస్తూ అన్నది అమ్మ. అందుకే అంటారు కదా... అమ్మ జేబు చూడదు... కాలే కడుపు చూస్తుందని! తన ఆకలిని అబద్ధంతో కప్పిపెట్టాలనుకొని... ‘‘నేను బాగానే తింటున్నానమ్మా’’ అన్నాడు\వేణు. ‘‘ఆ ముఖం చూస్తూనే తెలుస్తుందిరా... పదపదా’’ అని బలవంతంగా కొడుకును ఇంటికి తీసుకెళ్లింది అమ్మ. ఇంట్లో... ‘‘బాబూ! నీకు అర్షలు అంటే ఇష్టంగా. అన్నం ఉడికేలోపు ఇవి తిను’’అమ్మ చేతుల్లో నుంచి అర్షలు తీసుకొని తినబొయ్యాడో లేదో... లోపలి నుంచి అన్నల వెటకారాలు మొదలయ్యాయి... ‘‘తమ్ముడూ వేణు! అర్షలు తింటున్నావా! తిను. బాగా తిను. అర్షలతో పాటు అమ్మ ప్రేమ కూడా బాగా తినమ్మా. ఒరేయ్ ధనూ... పెట్టే వాళ్లకు లేకపోయినా తినేవాళ్లకయినా ఉండాలి బుద్ది’’ ఈమాటలు విని ఆ అమ్మ తట్టుకోలేకపోయింది. ‘‘మీరు మనుషులా రాక్షసులా? విరోధి అయినా ఆకలి అంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోబుట్టినవాడు, మీ కంటే చిన్నవాడు ఇన్నాళ్లకు ఇంటికొస్తే రెండు అర్ష ముక్కలు పెట్టానని మీ ఇష్టం వచ్చినట్లు వాగుతారా’’ అని ఆ కొడుకుపై మండి పడింది.‘‘తేరగా తినడానికి ఇది ధర్మసత్రం కాదు’’ అని సన్నాయి నొక్కులు నొక్కింది కోడలు. ‘‘అయినా వాడికి కాళ్లు లేవా చేతులు లేవా? కష్టపడి సంపాదించి కడుపు నిండా తినవచ్చు కదా. ఎవరొద్దాన్నారు?’’ అని తమ్ముడిపై విరుచుకుపడ్డాడు అన్న.‘‘అసలు వాడికి తిండి ఎందుకన్నయ్యా.కవిత్వం వెలగబెడుతున్నాడు కదా. దాన్నే తిని బ్రతకమను’’ అని వెటకారం చేశాడు చిన్న అన్నయ్య.మరో వైపు వేణు ఏదో వెదుకుతున్నాడు.‘‘వదినా! ఇక్కడ నాది ఒక ఫైలు ఉండాలి’’ అని వదినను అడిగాడు. మళ్లీ అందుకున్నాడు అన్నయ్య...‘‘ఆడవాళ్లను అడుగుతావేరా, నన్ను అడుగు చెబుతాను. అక్కడ ఉన్న ఫైలు, చెత్తకాగితాలు ఒక్క రూపాయికి అమ్మేశాను’’‘‘ఏమిటీ నా గేయాలను అమ్మేశారా! నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!’’ బాధను అణుచుకుంటూ అడిగాడు వేణు.‘‘అవును. ఆ కిరాణం కొట్టు సుబ్బయ్య మంచోడు కనుక ఆ రూపాయి అయినా ఇచ్చాడు’’ వెటకారపు కారాన్ని కళ్లలో చల్లాడు చిన్న అన్నయ్య.‘‘వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది!’’ ఆవేశంగా అన్నాడు వేణు.అంతే అన్నయ్యల కోపం ఆకాశాన్ని అంటింది.‘‘ఏమన్నావ్ మేము మూర్ఖులమా! ఏరా ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా ఆ చెత్త కుప్పలో తోస్తే కాని నీ రోగం కుదరదు. పదా పదా’’ అని మెడపట్టి తమ్ముడిని ఇంటి నుంచి గెంటేశారు. ప్రముఖ పత్రికాధిపతి ప్రసాద్ తన ఇంట్లో ఆరోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు.వచ్చిన అతిథులను ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాడు ప్రసాద్.‘‘నమస్కారం ప్రసాద్‌గారు. ఈరోజు కవిసమ్మేళనం ఏర్పాటు చేశారట కదా అందుకే స్పెషల్‌గా వచ్చాను. అన్నట్లు ఈ వార్త మీ దాకా రాలేదా? అరే, ఊరంతా చెప్పుకుంటున్నారే. ఈమధ్య నేను కవిత్వంరాస్తున్నాను’’ అని గర్వంగా అన్నాడు సూటుబూటులో వచ్చినయాక్టర్ రావు.‘దేవుడా! నువ్వు కూడా కవిత్వం రాస్తున్నావా!’ అన్నాయి ఆయన కళ్లు.నోరు మాత్రం...‘‘ఓహో అలాగా. గుడ్’’ అన్నది.అక్కడ కూర్చున్న ఇద్దరు సాహితీ దిగ్గజాలకు ఈ రావును పరిచయం చేస్తూ...‘‘వీరు యాక్టర్రావు గారు, నటించడం మానేసి కవిత్వం మొదలుపెట్టారు. వీరు వేటూరిగారు, వారు ఆరుద్రగారు’’ అన్నాడు.‘‘ఏమిటి మీకా పిచ్చిపట్టుకుందా?’’ గెడ్డంతో నవ్వుతూ అడిగారుఆరుద్ర.‘‘మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఆ జబ్బు నాకంటుకుంది’’ అన్నాడు యాక్టర్ రావు.‘‘అంటుకుందా! జబ్బుకు సరిౖయెన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి’’ అని యాక్టర్రావుకిసలహా ఇచ్చారు ఆరుద్ర.రావు పెద్దగా నవ్వి...‘‘అంత్యప్రాస! అందుకే మిమ్మల్ని ఆరుద్ర అన్నారు’’‘‘ఆరుద్ర గారు మీరొక కవిత చెప్పాలి’’ అడిగారు అభిమానులు.అప్పుడు ఆయన ఇలా చెప్పారు.‘కవిత కోసమే నేను పుట్టాను.క్రాంతి కోసమే కలం పట్టాను.ఎండమావులు చెరిపిపండువెన్నెల నిలిపిగుండెవాకిలి తలుపు తట్టాను కవిత కోసమే నేను పుట్టాను’ -
శేరిలింగంపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం
-
ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం ఉదయం మరణించారు. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. అనేక తెలుగు సినిమా, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు. రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలున్నారు. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద రావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. ప్రసాద్ తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించారు. ఊహ తెలియక ముందే తల్లి కన్నుమూసింది. మేనమామ దగ్గరుండి ఎస్ఎస్ఎల్సీ దాకా చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో నటించేవారు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్ బీఎస్సీ సీటు, ఎంబీబీఎస్ సీటు పోగొట్టుకున్నారని సమాచారం.1983లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. నువ్వు నేను చిత్రంలో ఆయన పోషించిన ధనవంతుడైన కథానాయకుడి తండ్రి ప్రాత మంచి పేరు తెచ్చిపెట్టింది. భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం వైజాగ్ ప్రసాద్ కుమార్తె, కుమారులు అమెరికాలో ఉన్నారు. వారు రాగానే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 'మా' తరపున వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు 'మా' అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పతనం మొదలు.. పరిటాల కోటకు బీటలు
‘పరిటాల కోట’కు బీటలు వారుతున్నాయా? మంత్రి సునీత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఆ కుటుంబం తీరుతో విసిగిపోతున్నారా? టీడీపీనీ వీడి ప్రత్యామ్నాయ అన్వేషణలో ఉన్నారా? నియోజకవర్గంలో టీడీపీ పతనావస్థకు చేరిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోన్న వేపకుంట రాజన్న, రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌లు టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరు పార్టీని వీడేందుకు ఉత్పన్నమైన పరిణామాలు, నియోజకవర్గంలో పరిటాల కుటుంబ తీరుతెన్నులు.. పార్టీ స్థితిగతులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సునీత సొంత నియోజకవర్గంలోనే పాలన పూర్తిగా గాడి తప్పింది. తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు ప్రజలచేత ఎన్నికైన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాధికారాలు లేవు. ఏ మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నా ‘పరిటాల ఫ్యామిలీ’ నిర్ణయమే ఫైనల్. ఇందుకోసం సునీత తమ రక్త సంబంధీకులు, ఆత్మీయులనే ఇన్చా ర్జీలుగా నియమించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కనపెడితే మండలాల వారీగా భూకబ్జాలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టులతో పాటు ఆర్థిక లబ్ధి పొందే అంశాల్లో వీరు కీలకశక్తిగా ఎదిగారు. ఈ పరిస్థితి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు, కీలక నేతలకుమింగుడు పడని పరిస్థితి. పరిటాల కుటుంబాన్ని ఎదిరించేందుకు బెదిరి మొదట్లో సర్దుకుపోయారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మంత్రికి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్న తరుణంలో ఒక్కొక్కరుగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. చివరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిలో సునీత సామాజికవర్గానికి చెందిన కీలక నేతలే ఉండటం గమనార్హం. సైకిల్ దిగనున్న దగ్గుబాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ పరిటాల కుటుంబంతో అన్యాయానికి గురైన జాబితాలో చేరారు. వ్యాపారవేత్త అయిన ప్రసాద్ ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు భారీగా ఖర్చు చేశారు. తర్వాత కూడా పార్టీ కోసం రూ.కోట్లు కుమ్మరించారు. అయితే సునీత సోదరుడు మురళీ నాలుగేళ్లుగా ప్రసాద్‌ను తీవ్ర వేదనుకు గురిచేశారని తెలుస్తోంది. ఎంపీపీగా పూర్తి డమ్మీని చేసి, తానే ఎంపీపీగా వ్యవహరించారు. మురళీ సిఫార్సు లేకుండా ఎంపీపీ చెబితే పింఛన్ కూడా ఇవ్వలేని స్థితికి ప్రసాద్ చేరారు. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీపీ చేయాల్సిన పనులను మురళీ చేస్తున్నారు. బుక్కచెర్లలో రూ.కోటితో చేసిన సామిరెడ్డిపల్లి వంక అభివృద్ధి పనులకు మురళీ భూమిపూజ చేశారు. బోగినేపల్లి సీసీరోడ్డుకు భూమి పూజ చేశారు. చివరకు గురువారం అయ్యవారిపల్లి సీసీరోడ్డుకు కూడా అతనే భూమిపూజ చేశారు. మురళీ కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అయినప్పటికీ అధికారులు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆయనతోనే కార్యక్రమాలు చేయిస్తున్నారు. చివరకు రాప్తాడులో నిర్మించిన టీడీపీ ఆఫీసుకు ప్రసాద్ రూ.10లక్షలు విరాళం ఇచ్చారు. దీని ప్రారంభోత్సవానికి ఆహ్వానం కూడా పంపలేదు. ఇక శుక్రవారం పండమేరులో మంత్రి నిర్వహించిన జలహారతి కార్యక్రమానికీ ఎంపీపీకి సమాచారం ఇవ్వలేదు. ఇలా ప్రతీ అంశంలో కనీసమర్యాద లేకుండా ప్రసాద్‌ను అవమానానికి గురిచేశారు. ఆర్థికంగా బలహీనుడి చేసే ప్రయత్నం ఆర్థికంగా కూడా ప్రసాద్‌ను బలహీనుడిని చేసే ప్రయత్నం చేశారు. నాలుగేళ్లలో ఎలాంటి కాంట్రాక్టు ప్రసాద్‌కు దక్కకుండా మంత్రి ప్రయత్నించారని తెలుస్తోంది. ప్రసాద్ సొంత గ్రామం బండమీదపల్లిలో రూ.8.5కోట్లతో చేస్తున్న కాలవ పని ప్రసాద్‌కు దక్కుకుండా మురళీనే ఎన్ఎంఆర్ కన్స్ట్రక్షన్స్కు ఇప్పించుకుని పనిచేస్తున్నారు. ఆర్థికంగా తాను నష్టపోయానని, పని ఇవ్వాలని విన్నవించినా ఖాతరు చేయలేదు. దీంతోపాటు వ్యాపార రీత్యా ప్రసాద్‌ను దెబ్బతీసే యత్నం చేశారు. ప్రసాద్‌కు హైదరాబాద్‌లో ‘డీబీ పాలిమర్స్’ అనే పెట్రో కెమిల్లైన్స్ పైపులు తయారు చేసే పరిశ్రమ ఉంది. ఇందులో మురళీ కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు. వారంతా మూడేళ్లు అందులో పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత వారిని అక్కడి నుంచి రప్పించి, రూ.20కోట్లతో గతేడాది డిసెంబర్లో ‘ఎస్వీఆర్ఎస్ పాలిమర్స్’ పేరుతో కొత్త పరిశ్రమను స్థాపించారు. ఈ ఘటనతో ప్రసాద్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను మంత్రి సునీత వద్దకు తీసుకెళ్లి ఇచ్చారు. అయితే ఎన్నికలు ముగిసే వరకూ రాజీనామా చేయొద్దని, పార్టీలోనే ఉండాలని.. వెళితే పార్టీకి వ్యతిరక పవనాలు వీస్తున్నాయనే మెసేజ్ ప్రజల్లోకి వెళుతుందని ప్రసాద్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే బెదిరింపులకు లొంగకుండా పార్టీని వీడేందుకే ప్రసాద్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వేపకుంట రాజన్నదీ అదేబాట పరిటాల రవీంద్ర హయాంలో ఆయనకు కుడిభుజంగా వేపకుంట రాజన్న ఎదిగారు. కనగానపల్లి మండలంలో కీలక నేత. సునీత, ఆమె కుటుంసభ్యుల తీరుతో విసిగిపోయిన రాజన్న టీడీపీకి దూరంగా ఉంటున్నారు. త్వరలోనే పార్టీని వీడుతానని సన్నిహితులకు చెబుతున్నారు. కనగానపల్లి ఇన్చార్జిగా నెట్టెం వెంకటేశ్ మొన్నటి వరకూ కొనసాగారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేత ముకుందనాయుడు టీడీపీలోకి వెళ్లారు. నాయుడు భర్త పద్మీగీత ఎంపీపీగా కొనసాగుతున్నారు. నెట్టెం వెంకటేశ్‌ను తప్పించి నాయుడికి కనగానపల్లి బాధ్యతలు అప్పగించారు. దీంతో వెంకటేశ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. నాలుగేళ్లుగా పరిటాల కుటుంబం ఆర్థికంగా అత్యంత బలంగా ఎదగడం మినహా ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదని.. వీరిని నమ్ముకుంటే రోడ్డునపడక తప్పదనే నిర్ణయంతో పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
రెక్కలు తెగిన చీకటి
ఆఫీస్ లంచ్ బ్రేక్‌లో పరధ్యానంగా ఉన్న ప్రసాద్‌ని చూశాను. నవ్వుతూ గలగల మాట్లాడే వాడి ముఖంలో ఆ సీరియస్‌నెస్ అస్సలు బాగోలేదు. ఆ మాటే అన్నాను. ఓ నవ్వు నవ్వి, ‘‘అలాంటిదేం లేదు’’ అన్నట్లు భుజాలెగరేశాడు. తిరిగొచ్చాక సీట్లో కూర్చుని పని చేస్తున్నాడు కానీ, ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. కుర్చీని వాడికి దగ్గరగా జరుపుకుని మాటల్లోకి దింపాను. పొడిపొడిగా సమాధానాలిచ్చాడు. సరిగ్గా అప్పుడే ఫోనొచ్చింది. మాట్లాడుతూ వరండాలోకి వెళ్లాడు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటూ, నెమ్మదిగా మాట్లాడాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. ముఖం మాత్రం కందగడ్డలా మారిపోయింది. వచ్చి తన సీట్లో కూలబడి నిస్తేజంగా నాకేసి చూశాడు. ‘‘చెప్పు, ఏం జరిగింది?’’ అన్నాను ఆత్రుతగా. ‘‘ఇన్వెస్టిగేషనా?’’ అన్నాడు. చుర్రుమని తగిలింది ప్రశ్న! ఇలాంటివి వాడు అనడం, నేను వినడం మామూలే. ‘‘నీయిష్టం. ఏమైనా అనుకో. కానీ చెప్పి తీరాలి’’ అన్నాను. నీకనవసరం అన్నట్లు ఓ చూపు విసిరాడు.మౌనాన్ని కాలమే కరగదీస్తుందని నాకు తెలుసు. మర్నాడు నా పనిలో నేను బిజీగా ఉన్నాను. మళ్లీ అడుగుతానని వాడు ఎదురుచూస్తున్నాడు. గ్రహించాను. నేనేమీ అడగలేదు. బెట్టు చేసి చెప్పడం వాడి అలవాటు. మూడు దశాబ్దాల మా స్నేహంలో ఇది నాకు కొత్త కాదు.రాత్రి ఏడింటికి ప్రసాద్ మా యింటికొచ్చాడు.‘‘కాఫీ ఇవ్వనా అన్నయ్యా!’’ అంది మా ఆవిడ. ‘‘మేడ మీదకి తీసుకురా’’ అని ఆర్డరేసి మేడెక్కి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. రెండు కుర్చీలు మెట్ల మీద నుంచి మోసుకు వెళ్లి వేశాను.‘అడగాల్సింది ఏమీ లేదా?’ అన్నట్లు వాడి ‘వాడి చూపులు’ నాకు గుచ్చుకుంటున్నాయి. టీ తెచ్చిన మా ఆవిడని కిందకి వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశాను, కప్పు అందుకుని. ఇది రహస్య సమావేశమని కమలకి అర్థమైపోయింది. ‘‘రొట్టెలకి పిండి కలపాలి’’ అని వెళ్లిపోయింది. నేను ఆకాశంలో మేఘాలవైపు చూస్తున్నాను.‘‘దాన్ని ఎలా పెంచాను నేను! ‘ఆడపిల్ల పుట్టిందా’ అని జాలిపడిన వాళ్లని కడిగి పారేశాను. ఏం లోటు చేశాను దానికి? చెప్పరా చెప్పు!’’ నన్ను నిలదీశాడు. కొండ కదిలింది. బాధ కరిగింది.‘‘ఆరు నెలలయింది, అది నాతో మాట్లాడి! కార్తీక మాసం పిక్నిక్కి రమ్మంటే రాలేదు. నిన్నటికి నిన్న సినిమాకి వెళదామనుకుని నేను, మా చెల్లాయి బయలుదేరితే రానంది. వాళ్లమ్మతోనూ అందరితోనూ బాగానే ఉంటోంది. నా దగ్గరికొచ్చేసరికి మూతి బిగించుకుని కూర్చుంటోంది. కనీసం నాతో కలిసి భోజనం కూడా చెయ్యడం లేదు. వింటున్నావా?... దాని పెళ్లికి డబ్బు దాస్తున్నాను. ఈ క్షణంలో సంబంధం నచ్చితే చేయగలను. డాక్టరవుతాను అంటే వద్దన్నానా? నీకునచ్చిన చదువు చదువుకో అన్నాను.’’ పొంతన లేని మాటల ప్రవాహం అలా సాగుతూనే ఉంది.‘కూతురు వీడితో నిశ్శబ్ద యుద్ధం చేస్తోంది’ ఇదీ నేను గ్రహించింది. ఏ విషయంలోనో తండ్రి వల్ల పిల్ల హర్ట్ అయింది! తెలుసుకోవాలి. రవళితో మాట్లాడాలి. మంచి వంక దొరికింది. వెంటనే ప్రసాద్ భార్య సంగీతకి ఫోన్ చేశాను. మా రెండు కుటుంబాలు ఓ రోజు రాయగడ మజ్జిగౌరి మందిరం చూసి రావాలని నిర్ణయించుకున్నాం. రైలు ప్రయాణం నాలుగు గంటలూ కబుర్లతో, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ విశేషాలతోనే గడిచిపోయింది. ఊళ్లో దిగిన వెంటనే ఒక రెసిడెన్సీలో రూమ్ తీసుకుని, స్నానపానాలు కానిచ్చి మందిరానికి వెళ్లాం. ఉత్కళాంధ్రుల ఇలవేల్పు దర్శనంతో పులకించిపోయాం. ముద్దమందారంలా ఉన్న అమ్మవారి శిరస్సుకి శిరసు వంచి నమస్కరించాం. మందిరం ముందున్న ఇత్తడి గుర్రాల్ని పిల్లలు ఆసక్తిగా పరిశీలించారు. అక్కడికి యాభై అడుగుల దూరంలో పరుగులు తీస్తున్న రైళ్లని ఆశ్చర్యంగా గమనించారు.లాడ్జికి తిరిగొస్తూ బస్టాండ్‌కి దగ్గరున్న ‘ఆదివాíసీ వస్తు ప్రదర్శనశాల’లో వారి ఆభరణాలు, దుస్తులు, వేట సాధనాలు, సంగీత వాయిద్యాలు, వంట పాత్రలు, కొమ్ము బొమ్మలు మా వాళ్లని బాగా ఆకర్షించాయి. ట్రైబల్ ఆర్ట్, కంచు బొమ్మలు మురిపించాయి. అట్నుంచి అటే తెరువలి లక్ష్మీనారాయణ మందిరం చూడాలని బయలుదేరాం. తెల్లని హంసలా మెరిసిపోతున్న పాలరాతి కట్టడాలు, వాటి చుట్టూ అందమైన పూల తోటలు ప్రశాంతతకి పట్టుగొమ్మలుగా ఉన్నాయి. పనిలో పనిగా చట్టికొనా జలపాతాన్నీ చూసేశాం.తిరిగి రాయగడ వస్తూ నాగావళి నది ఇసుక తిన్నెల్లో ఆడుకున్నాం. పరిగెత్తాం. అందరిలో ఆనందం చిందులు వేస్తోంది. నా కూతురు శారద గులకరాళ్లు ఏరుతోంది రవళితో కలిసి.‘‘మావయ్యా అని ఊరికే అంటే ఏం లాభం! ఓ కొడుకును కంటుందేమో మీ అత్తయ్యని అడిగి చూడు’’ అన్నాను. రవళి నవ్వుతూ వెళ్లి నేనన్న మాటలు మా కమల చెవిలో ఊదేసింది. కమల నన్ను తన్నడానికి వస్తే నేను తప్పించుకుంటూ అల్లరి చేశాను. చివరికి నా శ్రీమతి నా చెవులు పట్టుకొని మెలిపెట్టడం, నేను రెండు గుంజీలు తీసి వదిలేయమని బతిమిలాడటం అందరికీ కనువిందు చేసింది.శారద ఒక్కత్తే నాకు సపోర్ట్ చేసింది. నేనంటే దానికి పంచ ప్రాణాలు. నా ఇంటి మహాలక్ష్మి అది. మా ఆవిడ వీరత్వం చూసి చాలా రోజుల తర్వాత ప్రసాద్ పకపక నవ్వాడు. సంగీత ముఖంలో చిన్న రిలీఫ్ కనిపించింది. రవళి కళ్లకి రుమాలు కట్టారు. అంతా అందకుండా ఆటపట్టిస్తున్నారు. రాయిని గుద్దుకుని పడబోయింది తను. గబుక్కున వెళ్లి ఆపాను. గబగబ రుమాలు విప్పి నాకేసి సీరియస్‌గా చూసింది. ‘‘నువ్వూ మా నాన్నలా అవకాశవాదివేనా మావయ్యా!’’ అంది.‘‘రాయిని తన్నబోయావు. ఆపాను’’ – అన్నాను.విషయం గ్రహించి ‘సారీ’ అంది. ఒక నిమిషం వ్యూహాత్మకంగా ఆలోచించి మౌనంగా అక్కడ్నుంచి ముందుకు వచ్చేశాను. పాపం రవళి నొచ్చుకుంటుందని తెలుసు.. తెలిసే అలా చేశాను. కొండ మీదున్న కాలి బాట నుంచి ఒకరి వెనక మరొకరుగా నడిచి వస్తున్న ఆదివాసీలను చూపించాను కమలకి. వెంటనే ఓ చిన్న ఉపన్యాసానికి సిద్ధమైపోయాను. ‘‘రాయగడ జిల్లాలో జనాభా ఎనిమిది లక్షలు. ఇందులో ఈ గిరి పుత్రుల సంఖ్య సగానికంటే ఎక్కువే. పోడు వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. కందులు, మినుములు,అల్లం, ఆవాలు, పెసలు, రాగులు అన్నీ పండిస్తారు. తేనె, చింతపండు అమ్ముతారు. కొండ చీపుళ్లు అమ్మకం వీరి ప్రధాన ఆదాయ వనరు. పురుగు మందులు వాడని కూరగాయలు గొప్ప రుచిగా ఉంటాయి. మీకు తెలుసా! రాయగడ వంకాయలకు ముళ్లుంటాయి. లోపల గింజలు మాత్రం ఉండవు...’’అలా ఉపన్యాసం చాలాసేపు కొనసాగించి ఊపిరి తీసుకున్నాను. పిల్లలు చప్పట్లు కొట్టారు.‘‘ఇవన్నీ మీకెలా తెలుసు?’’ అంది శ్రీమతి. ‘‘ఎక్కడికైనా వెళ్లే ముందు ఆ ప్రాంత విశేషాలు తెలుసుకోవాలి కదా! ఇంటర్నెట్ చూస్తే అన్నీ తెలుస్తాయి’’ అన్నాను. శీతాకాలం అయినా బాగా దాహమేసింది. నీళ్ల సీసా ఎత్తి గుటకలు వేస్తున్నాను.రవళి నా దగ్గరగా వచ్చింది. ‘‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి’’ అంది. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని తనకి తెలీదు. వెళ్లాను. నదిలోకి చిన్న చిన్న రాళ్లు విసురుతూ చెప్పింది – ‘‘నాన్నంటే నాకు చాలా గౌరవం ఉండేది. జన్మనిచ్చి, విద్యాబుద్ధులిచ్చి..’’ గొంతు జీరబోయింది... సర్దుకుంది. ‘‘...కానీ నాన్న కల్పించుకొని పనిమనిషి మీద చేతులు వేయడాలు, నా క్లాస్మేట్ సుజాత ఇంటికొస్తే తనని ఎగాదిగా చూడటాలు నాకు నచ్చడం లేదు. నేను తప్పు చేస్తే సరిదిద్దాల్సిన నాన్న.. తనే తప్పు చేస్తూ.. ఛీ! సిగ్గేస్తోంది. ‘‘ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది.’’ ఇదే చివరి మాటగా విసవిసా నడుస్తూ వెళ్లిపోయింది రవళి. నా అడుగు ఏమాత్రం అటూ ఇటూ వేసినా కొంపలు అంటుకుంటాయి.అటు ప్రసాద్తోను, ఇటు చెల్లాయితోనూ ఏం మాట మిగిలినా కొరివితో తల గోక్కున్నట్టే. కానీ స్నేహధర్మంతో పరిస్థితి సరిదిద్దాలి. తిరుగు ప్రయాణంలో రైలు కంటే వేగంగా ఆలోచనలు పరిగెత్తాయి. పార్వతీపురం ఎప్పుడు దాటామో తెలీదు. బొబ్బిలిలో రైలు ఆగింది. ‘‘చెల్లాయ్! నీ నడుంనొప్పికి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నావు?’’ అని సంగీతని అడిగాను. ‘‘హైదరాబాద్‌లో! మంచి డాక్టర్ చూశారు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ చిన్నపాటి ఎక్సర్సైజ్లు చెయ్యమన్నారు’’‘‘వెంటనే పనిమనిషిని మాన్పించు. తేలికపాటి వ్యాయామాలు ప్రారంభించు. ఇంట్లో ముగ్గురే కదా – నీ పనులు నువ్వే చేసుకో’’ అన్నాను. ‘‘ఏమిటి అసలు సంగతి?’’ అన్నట్లు చూసింది సంగీత. గుప్పిడి విప్పకపోతేనే అందం, చందం. ‘‘నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ యిష్టం’’ అన్నాను. ఏదో దాస్తున్నావు అన్నట్లు నవ్వుతూ తల ఊపిందామె. ‘‘ట్యూషన్ సార్ మీయింటికే రావడం, రవళి స్నేహితురాళ్లు చదువు పేరుతో మీ యింట్లో మూగడం అవసరమా? ఆ సార్‌కి చెప్పు – ఇక మీయింట్లో చెప్పడం కుదరదని, మరోచోట చెప్పినా రవళి వస్తుందని.’’ అన్నాను.నా మాటలకి మా ఆవిడ, సంగీత, ప్రసాద్ ఏకకాలంలో ఆశ్చర్యపోయినా – ఒక్కొక్కరిలో ఒక్కో ప్రశ్న తలెత్తింది. ప్రసాద్ లోలోపలే కుతకుతలాడిపోయాడు. నివురుగప్పిన నిప్పులా... లేని శాంతం కప్పుకుని కూర్చున్నాడు. ఈ మార్పులన్నీ తనని ఎలా ప్రభావితం చేస్తాయో ప్రసాద్‌కు తెలుసు. కానీ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయాడు.ఈ విషయాలేమీ తెలియని సంగీత – తన ఆరోగ్యమే మహా భాగ్యమని ప్రభాతపు నడక, సాయంకాలపు నడకల్లో, వ్యాయామాల్లో, ఇంటి పనుల్లో తీరికలేని హడావుడిలో మునిగిపోయేందుకు నిర్ణయించుకుంది.రవళి కళ్లలో ఆనందబాష్పాలు చూశాను. మా ఆవిడ ముఖంలో మాత్రం జవాబు దొరకని ప్రశ్న కదులుతోంది. కొన్నాళ్లకు ఆ ప్రశ్న మరచిపోతుంది. ఆమె ఆ ప్రశ్న మరచిపోయే లోపే ప్రసాద్‌తో మాట్లాడాలి. ఇవన్నీ అతనికి అర్థమయ్యేలా గట్టిగానే చెప్పాలి. ఆ రోజు కోసం ఎదురుచూడకుండా నేనే దగ్గరికెళ్లాలి! -
ఏజీగా బాధ్యతలు చేపట్టిన బీఎస్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమితులైన బండా శివానందప్రసాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైకోర్టులోని తన కార్యాలయంలో సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు అభినందించారు. అనంతరం తెలంగాణ, హైకోర్టు న్యాయవాదుల సంఘాలు బీఎస్ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించాయి. తనను ఏజీగా నియమించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇరు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భవిష్యత్‌లో ఎలక్ట్రికల్ వాహనాలే అగ్రగామి
హైదరాబాద్: భారతదేశంలో వచ్చే 20–30 ఏళ్లలో ఎలక్ట్రికల్ వాహనాలే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాయని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీఎస్వి.ప్రసాద్ పేర్కొన్నారు. రాయదుర్గంలోని దినేష్ ఫిల్లింగ్ స్టేషన్లో దేశంలో రెండవ, తెలంగాణలో మొదటి హెచ్‌పీసీఎల్ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్‌ను నాగ్‌పూర్‌లో ప్రారంభించగా.. రెండవది హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో ప్రస్తుతం 175 ఎలక్ట్రికల్ వాహనాలు నడుస్తున్నాయని తెలిపారు. త్వరలో ఆర్సీ పురం, ఉప్పల్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మరో నెల రోజుల్లో దేశంలో మరో 4 నగరాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నామని ప్రకటించారు. మ్యాన్యువల్ రిక్షాల స్థానంలో ఈ–రిక్షాలు నీతి ఆయోగ్ సూచనపై 2030 నాటికి దేశంలో ప్రస్తు తం కొనసాగుతున్న 2.5 కోట్ల మ్యాన్యువల్ రిక్షాల స్థానంలో ఈ–రిక్షాలను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని హెచ్ïపీసీఎల్ బిజినెస్ డెవలప్మెంట్ సీజీఎం సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. త్వరలో హెచ్‌పీసీఎల్ ఆ«ధ్వర్యంలో బ్యాటరీ, బ్యాటరీ సెల్స్, ఈ–రిక్షాలు, టూ వీలర్ల ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేçస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ అధికారులు శ్రీనివాస్, రాజేశ్, జూమ్‌కార్ల ప్రతినిధి దీపక్, దినేష్ ఫిల్లింగ్ నిర్వాహకులు దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బొగత జలపాతంలో ఒకరి గల్లంతు
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతంలో ఆదివారం బుర్రి ప్రసాద్ (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతయ్యాడు. సహాయక సిబ్బంది అతడి కోసం గాలించినప్పటికీ సాయంత్రం వరకూ ఆచూకీ లభించలేదు. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం రామవాడకు చెందిన ప్రసాద్ కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బొగత జలపాతాన్ని సందర్శించడానికి స్నేహితులు మినుగు అనిల్, వేముల వినయ్, రావుల నిఖిల్ తో కలసి ఇక్కడికి వచ్చారు. ప్రసాద్ జలపాతం కింది భాగం లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంత య్యాడు. సహాయక సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. సోమవారం కూడా గాలింపు చేపడతామని ఎస్సై చెప్పారు. కాగా, జలపాతంలో గల్లంతైన ప్రసాద్ కోసం గాలిస్తున్న సమయంలోనే హన్మ కొండకు చెందిన ఎస్వీ రెడ్డి అనే వ్యక్తి బొగతలో వస్తున్న వరదలో పడిపోయాడు. అతను నీటిలో మునిగిపోతుండగా సహాయక సిబ్బంది అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. -
ఊరికి ఉపకారి
‘అతను’ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎంత కష్టమొచ్చినా భయపడడు. రోజూ ఆలయానికి వెళ్లి ‘అందర్నీ చల్లగా చూడు’ అని దణ్ణం పెట్టుకుంటాడు. ఆ వూరిలో వానల్లేక చాలా కాలం అయింది. ‘అతను’ ఓ రోజున చెవులను భూమికి ఆనించి ఏదో విన్నాడు. నిశితంగా ఆకాశం కేసి చూశాడు. త్వరలో చాలా పెద్ద వర్షం వచ్చే సూచనుందనీ, జాగ్రత్తగా ఉండమని అందరినీ హెచ్చరించాడు. ఎవరైనా వింటేగా? అతను మాత్రం ఏం జాగ్రత్త చేసుకోవాలో అన్నీ చేసుకున్నాడు. ఒకరోజు పట్నం వెళ్లి రెండు లాంతర్లు, కొన్ని ప్లాస్టిక్ తాళ్లు, వేరుశనగలు, ఒక బెల్లం అచ్చు, పాలపొడి కొనుక్కొచ్చాడు. మరో రోజు పొలం నుండి తెచ్చిన చిన్న చిన్న తాటిదుంగలు, చాంతాళ్లను అటక మీదకు చేరవేసాడు. కొవ్వొత్తులు, ప్లాస్టిక్ డబ్బాలు, అటుకులు, బెల్లం అన్నీ ఆ ఊరిలో ఎల్తైన దిబ్బ మీద ఉన్న శివాలయం ప్రాంగణంలోకి చేరవేశాడు. ఓ వారం రోజులకి ఆకాశంలో పెద్ద ‘కరిమబ్బు’ ఆ ఊరిమీదికొచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్న వానలకు ఊరంతా నీళ్లు వచ్చేశాయి. అంతా ఇళ్ల పైకప్పులెక్కేసారు. పిల్లల ఏడుపులు, జంతువుల అరుపులతో ఊరంతా గోల గోలగా ఉంది. ‘అతను’ లాంతర్లు వెలిగించి తెచ్చాడు. దుంగలకి తాళ్లు కట్టి తెప్పలా దానిమీద కొందరిని శివాలయానికి చేరవేశాడు. తను గర్భగుడి ముందు గదిలో దాచిన అటుకుల బస్తా, బెల్లం, వేరుశనగలు అందరికి పంచిపెట్టాడు, ‘అతనికి ‘ కూడా ఆనందంతో కడుపు నిండిపోయింది.అద్దంలా స్వచ్ఛమైన హృదయం ఉన్న అతనితో ప్రకృతి చెలిమి చేయడం ఎప్పుడూ మానలేదు. ప్రమాద హెచ్చరికలు పంపడమూ మానుకోలేదు. పదిమందికీ సాయం చేయడం అసలే మానుకోలేదు. – చాగంటి ప్రసాద్ -
పోలీస్ కవి
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణానికి చెందిన కాశిబోయిన ప్రసాద్ బాల్యం నుంచి కవితలు రాస్తున్నాడు. అతని ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు మరింత ప్రోత్సహించారు. దీంతో సృజనకు పదును పెట్టి ఎన్నో కవితలను రాశాడు. ఆశువుగా కూడా కవితలను చెప్పగలడు. ప్రస్తుతం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు కవితలు రాస్తూ రాణిస్తున్నాడు. వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అనేక బిరుదులు, సత్కారాలు అందుకున్నాడు. సేవకార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తాను చదువుకున్న గౌరిదేవిపేట పాఠశాలలో ప్రతి ఏడాది 10వ తరగతిలో ప్ర£ýథమస్థానాన్ని సాధించిన వారికి గోల్డ్ మెడల్‌తో పాటు రూ.వెయ్యి నగదు, ద్వితీయ స్థానం సాధించిన వారికి సిల్వర్ మెడల్‌తో పాటు రూ.వెయ్యి నగదును అందిస్తున్నాడు. జనవరి 26న ఇద్దరు గురువులను, ఒక విద్యార్థిని సన్మానించడంతో పాటు రూ.20వేలు విలువ చేసే క్రీడా సామగ్రి, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నాడు. గత పదేళ్లుగా విద్యార్థులకు 8వందల టీ షర్టులను అందించాడు. చర్చిలకు, పాఠశాలలకు, అనాథ ఆశ్రమాలకు గడియారాలను అందజేస్తున్నాడు. బడిమానేసిన ఆకతాయిగా తిరుగుతున్న గిరిజన పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం పొందాడు. 2010లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా పాల్గొని సత్కారం పొందాడు. 2008లో కరీంనగర్ ఎస్పీ నుంచి ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నాడు. -
ఆయిల్ వద్దంటే అనర్థమే!
సాక్షి, హైదరాబాద్: ‘నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యకరం’ అని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అన్నారు. ‘ప్రతీ మనిషికి సాధారణం గా రోజుకు 2 వేల కేలరీలు కావాలి. కష్టపడి పని చేసే వారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అందులో 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి. అంటే 50 నుంచి 65 గ్రాము ల వరకు ఫ్యాట్స్ అవసరం’అని తెలిపారు. శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్‌బీఎన్ ప్రసాద్.. నూనెలు వాడటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సమాన నిష్పత్తిలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు ఆయిల్స్‌లో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడు సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసిం ది. ఈ నిష్పత్తిలో బ్యాలెన్స్ తప్పితే అనారోగ్య సమస్యలు ముంచెత్తుతాయి. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో తయారు కావు. వీటిని నూనెల ద్వారానే తీసుకోవాలి. ఇవి ఎక్కువున్నా, తక్కువున్నా సమస్యలే. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుం డాలి. ఒమెగా–3 ఆమ్లాలు.. కేవలం సోయాబీన్, ఆవ నూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉం టాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. ఒమెగా–3 ఉన్న నూనెలను వాడని వారు తప్పనిసరిగా వేయించిన అవిసె గింజలు రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి కూడా ఒమెగా–3 లభిస్తుంది. ఆలివ్ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 75 శాతం ఉంటాయి. ఇక సన్ ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్లో 50 శాతం వరకు శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఆ నూనెలు అత్యంత ప్రమాదకరం జంతువుల కొవ్వు, కళేబరాల నుంచి తయారు చేసే నూనెలు అత్యంత ప్రమాదకరం. వాటిలో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. తినుబండారాలు తయారు చేసే కేంద్రాల్లో ఉపయోగించే అవకాశముంది. తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి వ్యాపారస్తులు వారికి అంటగడుతుంటారు. వృక్షాల నుంచి తయారయ్యే నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక నూనెలను పలుమార్లు వాడకూడదు. ఎక్కువ సార్లు వేడి చేసినప్పుడు పెరా క్సైడ్ వంటి విష పదార్థాలు తయారవుతాయి. విడిగా కొనవద్దు.. - ఆయిల్‌ను విడిగా కొనవద్దు. ప్యాకింగ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు అనిపిస్తే.. బ్రాండెడ్ నూనెలైనా సరే కొనకూడదు. - ప్యాకింగ్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. - న్యూట్రీషియన్ సమాచారం, ప్రమాణాల ప్రకారం 3 ఫ్యాటీ ఆమ్లాల సమాన నిష్పత్తి ఆధారంగానే నూనెలను ఎంపిక చేసుకోవాలి. - గుండెకు మేలు జరుగుతుందంటూ ప్యాకింగ్‌లపై రాస్తారు. అయితే సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకుని మాత్రమే కొనాలి. అనుమానమొస్తే ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. - పత్తి గింజల నుంచి నూనె తీస్తుంటారు. పత్తి పంటలో రసాయనాలు కలుపుతుండటం వల్ల నూనె కూడా విషంగా మారుతుందని అనుకోవడం అశాస్త్రీయం. రిఫైనింగ్‌లో అంతా సవ్యంగానే ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీలు రిఫైనింగ్‌ను సరిగానే చేస్తుంటాయి. మహారాష్ట్రలో పత్తి నూనెను అధికంగా వాడతారు. -
తెలుగదేలయన్న తెలుగు తెలుగే
సందర్భం ఇంటర్మీడియట్ వరకు తెలుగులో విద్యాబోధనను తప్పనిసరి చేయడంపై, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఏపీలో కూడా పాలకులు ఇదే బాటలో నడవడం ఎంతో అవసరం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న రెండు చారిత్రక నిర్ణయాల వల్ల తెలుగు జాతి మొత్తం ఆయనను అభినందించాల్సి ఉంది. ఒకటి.. రూ.50 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించడానికి కేసీఆర్ ఆదేశించడం. ఇది చరిత్రకమైన నిర్ణయం ఎందుకైందంటే, తెలంగాణా మేధావులు కొందరు ఈ సభలను ప్రపంచ తెలంగాణ సభలుగా నిర్వహించాలని పట్టుబట్టారు. మనది తెలుగు భాష కాదు.. తెలంగాణ భాష అని వాదిం చారు. అన్నీ విన్న కేసీఆర్ నో అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలుగానే నిర్వహించాలని ఆయన తన రాజ శాసనంతో తెలుగు వారు భూగోళంలో ఎక్కడున్నా అందరినీ ఆనంద సాగరంలో ముంచివేశారు. తెలుగు పట్ల, తెలుగు జాతి పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాభిమానాలను ఈ ఒకే ఒక్క శాసనంతో ప్రపంచానికి తేటతెల్లం చేశారు. ప్రాంతాలుగా విడిపోయినా భాషకు వేరు వేరు పేర్లు పెట్టుకోవలసిన పని లేదని హిందీ భాషా రాష్ట్రాలు మనకు చాటి చెప్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో హిందీ మాతృభాషగా చెలామణి అవుతోంది. అంతే గానీ రాష్ట్రం విడిపోయినప్పుడల్లా హిందీకి ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకోలేదు. అందుకు కారణం కబీర్, తులసీదాస్ల నుంచి... ప్రేమ్‌చంద్, రాంధారి సింగ్ దినకర్, నిరాళా, కేదార్నాథ్ సింగ్ దాకా అల్లుకున్న ఆత్మీయత అంతా హిందీనే కాబట్టి. కనుకనే హిందీ వారందరిలో ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నా ఒక భావైక్యత, భాషైక్యత సుస్పష్టంగా పరిమళిస్తుంది. ఆ ఐక్యతలో ఒక అనుబంధం ఉంటుంది. ఒక తాదాత్మ్యత ఉంటుంది. ఒక గర్వం ఉంటుంది. అది కనిపించకుండా రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. భాష ద్వారా ఆ భాష మాట్లాడే మనుషులు మనమంతా ఒకటే అనుకునే ప్రేమ సూత్రం అదే. కొన్ని ఆవేశకావేశాలకు.. తాత్కాలిక ఉక్రోషాలకు.. కోపాలకు గురై తరాలుగా భాష పేనే ఈ సూత్రం ముక్కలు ముక్కలుగా తెగిపోకూడదు. కనీసం ఉన్న భాషను ఉన్నంతకాలమైనా ఉన్నంత శక్తి మేరకు కాపాడుకోవాలి. పోతన అయినా తిక్కన అయినా కాళోజీ అయినా శ్రీశ్రీ అయినా మన ఆస్తిగా భావించుకోవాలి. ఎవరి ప్రాంతంలో వారు తమ తమ ప్రాంతపు కవులను, రచయితలను కళాకారులను ప్రోత్సహిస్తూనే ఉమ్మడి ఆస్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు తేజాల నుంచి ప్రేరణ పొందాలి. తెలుగు వారిని అన్నదమ్ములుగా కలిపి ఉంచే భాషను వేరు చేస్తే అది చారిత్రక ద్రోహంగా నిలిచిపోతుంది. ఈ ప్రమాదాన్ని కేసీఆర్ గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఏం చెప్పినా తెలుగు తెలుగే అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలుగానే నిర్వహించాలని హుకుం జారీ చేశారు. తెలుగు జాతి ఇప్పుడు కాకున్నా ముందు ముందు ఈ నిర్ణయం ఎంత గొప్పదో తెలుసుకుంటుంది. రెండో నిర్ణయం కూడా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ తెలుగు భాష ఒక అంశంగా ఉండాలని, అది తప్పనిసరి అని నిర్ణయించారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలన్నింటా ఆ నిర్ణయం అమలు జరగాల్సిందే అని నిర్దేశించారు. తామర తంపరగా ప్రైవేటు విద్యాసంస్థలు వెలిసి, ఇంటర్మీడియట్లో తెలుగు లేకుండా చేసి, మార్కుల కోసం సంస్కృత భాషను పెట్టడం వల్ల ఒక చారిత్రక అపరాధం జరిగిపోయింది. నూనూగు మీసాల తరం, రక్తంలోకి భాషా సాహిత్యాల సుగంధం ఇంకే వయసులో తెలుగుకు దూరమైపోయింది. వ్యాపారం చేసుకోవడానికి విద్యాసంస్థలు పెట్టి భాషా సంస్కృతులతో గొప్ప జూదం ఆడారు ఒక వర్గం వారు. మీడియం ఏదైనా తెలుగు ఒక అంశంగా ఉంటే కనీసం పిల్లలు తెలుగు సాహిత్యంతో పరిచయం కలిగి వుంటారు. ఎవరు ఎన్ని భాషల్లో పండితులైనా మాతృ భాషను నరాల్లో ఇంకించుకున్న వారే సృజనాత్మకంగా ఆలోచించగలరు.. మాట్లాడగలరు.. రాయగలరు. ఉన్నత విద్యలలో, సాంకేతిక విద్యలలో కూడా తెలుగు ఒక అంశంగా బోధిస్తే జరిగే మేలు మాటల్లో వర్ణించలేనిది. దీనివల్ల ఎవరూ నష్టపోయేది ఏం లేదు. రానున్న తరాలు రమణీయమైన భవిష్యత్తును నిర్మిం చుకోవడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ దిశగా అడుగులు కదపడానికి ప్రస్తుత నిర్ణయం దోహదపడుతుందని చెప్పవచ్చు. అందుకే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగును ఒక విషయంగా బోధించడాన్ని తప్పనిసరి చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ నిర్ణయం వెనకున్న పెద్దలను మనసారా అభినందిస్తున్నాను. తెలుగు పట్ల ఆయనకున్న అనంతమైన ప్రేమానురాగాలే దీనికి కారణం కావొచ్చు. ఇక్కడ మరే ఇతర రాజకీయమైన కారణాలను వెదికినా అది పొరపాటే అవుతుంది. ఇదే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాలకులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. వ్యాసకర్త ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 84998 66699 డా. ప్రసాదమూర్తి -
పాముకాటుతో విద్యార్థి మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని క్రిష్ణాపురంలో గురువారం పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన జరిగింది. 108 సిబ్బంది, వైద్య సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు పట్ర సూరి అనే వ్యక్తి కుమారుడు ప్రసాద్ (9) అనే విద్యార్థి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు. అయితే గురువారం తెల్లవారు జామున ప్రసాద్ నోట్లో నురుగు వస్తుండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించగా అనంతపురము ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడన్నారు. పాము కాటుకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ గోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డిలు విద్యార్థి మృతదేహన్ని పరిశీలించారు. -
ప్రసాదం బదులు..విత్తనాలు పంపిణీ
సాక్షి, ముంబై: ఠాణేకు చెందిన ఓ గణేశ్ మండలి వినూత్న రీతిలో భక్తులకు ప్రసాదం పంచి పెడుతోంది. భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. శ్రీరంగ్ సహనివాస్ గణేశోత్సవ్ మండల్ తమ మండలిని సందర్శించేందుకు వచ్చిన భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. సీతాఫల్, బల్సమ్ (ఒక రకమైన తైలం), గుమ్మడి కాయ, నారింజ, నిమ్మకాయ, సపోట, జీడి పప్పు, చింత పండు, కర్జూరం తదితర విత్తనాలు మట్టితో రోల్ చేసి (సీడ్ బాల్స్) భక్తులకు ఇస్తున్నారు. వీటిని భక్తులు పక్క ఇంటి పెరట్లో లేదా ఇంటి ఆవరణంలో స్థలం ఉన్నా అక్కడ నాటాల్సిందిగా సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ మండలి 8,000 క్లే బాల్స్ (విత్తనం ఉంచిన మట్టి ఉండ)ను తయారు చేసింది. మరి కొన్ని రోజుల్లో మరో 25 వేల క్లే బాల్స్‌ను తయారు చేసి భక్తులకు పంపిణి చేస్తామని మండలి నిర్వాహకులు తెలిపారు. అయితే ఉత్సవాల సమయంలో విత్తనాన్ని దానం చేసేందుకు వీలుగా వీటిని సీడ్స్ బాంబ్లుగా మార్చారు. ఈ సందర్భంగా మండలి అధ్యక్షుడు ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. తాము క్లీన్ అండ్ గ్రీన్ పర్యావరణాన్ని నమ్ముతామన్నారు. దీంతో తాము ఈ ఏడాది భక్తులు విత్తనాలను నాటేందుకు సీడ్ బాంబులను ప్రసాదంగ పంపిణి చేస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా తమకు మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. వివిధ మార్గాల ద్వారా తాము విత్తనాలను సేకరించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా స్థానిక పాఠశాల విద్యార్థులు, వాలెంటీర్లు కూడా సీడ్ బాంబ్స్‌ను తయారు చేయడంలో పాలుపంచుకున్నారని తెలిపారు. మండలి సంయుక్త కార్యదర్శి ఓంకార్ పట్నే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గౌరీ తనయుడు ఆశీర్వాదం పొందేందుకు భక్తులు తమ మండపానికి దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈకో–ఫ్రెండ్లీ గణేష్ సందేశంతో పాటు పర్యావరణానికి హాని కలుగకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. -
ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్న ప్రసాద్
సామర్లకోట : విశాఖలో ఈ నెల 20న లలితా కన్వెన్షన్ హాల్లో జరిగిన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్లో వియత్నాం ఇంటర్నేషన్ డ్యాన్స్ ఎక్స్‌లెన్సీ అవార్డును అలమండ ప్రసాద్ అందుకున్నారు. ఆ విషయాలను గురువారం ఆయన విలేకర్లకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగశాస్ర్తి పాల్గొని కూచిపూడి నాట్యం శాస్త్రీయమైనదని, ఈ నాట్య కళను విశ్వ వ్యాప్తంగా చేయడానికి అందరూ అంకితభావంతో కృషి చేయాలని కోరినట్టు అలమండ ప్రసాద్ తెలిపారు. అవార్డు అందుకుని సామర్లకోట వచ్చిన ప్రసాద్‌ను పలువురు అభినందించారు. -
వైఎస్ జగన్ కోసం ప్రసాద్ సాహసం
-
వైఎస్ జగన్ కోసం ప్రసాద్ సాహసం
హైదరాబాద్ : జననేత పట్ల ఓ విద్యార్థి అభిమానం ఊళ్లు దాటేలా చేసింది. చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని కలవాలనుకున్న అతడు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా రైలెక్కేసి హైదరాబాద్ చేరుకున్నాడు. కర్నూలు జిల్లా బేతంచలర్ల మండలం ముద్దవరంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ప్రసాద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. వైఎస్ జగన్‌ను కలిసి, మాట్లాడి ఫోటో దిగాలని కోరిక. స్కూల్‌కు వేసవి సెలవులు కావడంతో ప్రసాద్... ఎలాగైనా వైఎస్ జగన్‌ను కలవాలని ఇంట్లో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ రైలు ఎక్కాడు. కాచిగూడా స్టేషన్లో దిగిన అతడు అక్కడి నుంచి వాళ్లను, వీళ్లను అడుగుతూ వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయం చేరుకున్నాడు. కార్యాలయం వరకు వచ్చాడు కాని తన అభిమాన నేతను ఎలా కలవాలో తెలియని పరిస్థితి ప్రసాద్‌ది. చివరికి ధైర్యం చేసి తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో వైఎస్ఆర్సీపీ కార్యాలయ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపాడు. ఎలాగైనా వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని ప్రాధేయపడ్డాడు. అది సాధ్యం కాదని చెప్పినా వినకుండా కార్యాలయం బయటే కూర్చుండిపోయాడు. అయితే ప్రసాద్ విషయం తెలుసుకున్న వైఎస్జగన్ వెంటనే స్పందించి, అతడిని పిలిపించుకుని మాట్లాడారు. అంతేకాకుండా ప్రసాద్ ఉండేందుకు ఏర్పాట్లు చేసి భోజనం కూడా పెట్టించారు. అతనితో ఫొటో దిగడమే కాకుండా ఆ ఫొటో ఫ్రేమ్ కట్టించి మరీ ఇచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండా వచ్చాడన్న విషయం తెలుసుకున్న వైఎస్ జగన్...అతడి క్షేమసమాచారాలు ప్రసాద్ కుటుంబసభ్యులకు తెలియచేశారు. రెండు రోజుల పాటు పార్టీ కార్యాయంలో గడిపిన ప్రసాద్ అనుకోని ఆతిధ్యానికి మురిసిపోయాడు. పలకరిస్తే చాలని వస్తే ఇంతటి ఆప్యాయత దక్కుతుందని ఊహించలేదని తెలిపాడు. అనంతరం అతడిని క్షేమంగా ఇంటికి చేర్చే ఏర్పాటు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీంతో తాను అభిమానించే నాయకుడు తనపై ఇంత అభిమానం చూపుతాడని అసలు ఊహించలేదని ఇంటికి బయల్దేరాడు ప్రసాద్. -
విద్యుత్‌శాఖ ఏడీ ప్రసాద్ బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్‌శాఖ ట్రాన్స్ఫార్మర్ విభాగం ఏడీఈ ప్రసాద్‌ను హిందూపురానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాజశేఖర్‌రావును అనంతపురానికి బదిలీ చేస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బ్యాడ్మింటన్‌లో ‘తూర్పు’ ‘రాకెట్’
–పతకాల పంట పండిస్తున్న కృష్ణప్రసాద్ -జూనియర్ డబుల్స్‌లో ప్రపంచ నం:2 ర్యాంక్ భానుగుడి(కాకినాడ) : షటిల్ బ్యాడ్మింటన్‌లో తూర్పు కిరణం అనితర సాధ్యంగా మెరుస్తోంది. తండ్రి ఆశలకు, ఆశయాలకు ప్రతి రూపంగా ఎదిగిన ఆ కుర్రాడు పట్టుమని 17 సంవత్సరాలు రాకుండానే అటు సీనియర్, ఇటు జూనియర్ ఫార్మాట్లలో డబుల్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అతడే కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈనెల 25న జారీ చేసిన ర్యాంకింగ్స్‌లో జూనియర్ డబుల్స్‌లో ప్రపంచ రెండోర్యాంకుతో పాటు జాతీయ స్థాయి మొదటి ర్యాంకు ప్రసాద్‌కు దక్కాయి. తండ్రి నుంచి వారసత్వంగా .. ప్రసాద్ తండ్రి గంగాధర్ షటిల్ బ్యాడ్మింటన్‌లో ఆంధ్రా యునివర్సిటీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆల్ఇండియా స్థాయిలోనూ ఆడారు. అయితే అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆడాలన్న కల కలగానే మిగిలిపోయింది. దాన్ని కుమారుని ద్వారా తీర్చుకోవాలని నాలుగేళ్ళ వయసు నుంచే అతడితో సాధన చేయించారు. ప్రస్తుతం ప్రసాద్ గోపీచంద్ అకాడమీలో అంతర్జాతీయ కోచ్‌లు టామ్కిమ్హెర్, విజయ్ దీప్‌సింగ్, రాజేంద్ర కుమార్ల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు ఇదీ ప్రసాద్ విజయపరంపర డచ్ జూనియర్ ఇంటర్ నేషనల్ డబుల్స్‌లో కపిల్ధృవ్తో కలిసి రజతపతకం సా«ధించాడు. గతేడాది జాతీయస్థాయిలో జరిగిన అండర్–19 డబుల్స్‌లో, మిక్స్డ్ డబుల్స్‌లో విన్నర్‌గా నిలిచాడు. 2015లో ఆసియన్ జూనియర్ టోర్నమెంట్లో అండర్–17లో బంగారు పతకాన్ని సాధించాడు. సుశాంత్ చిప్లకట్టి మెమోరియల్ టోర్నీలో 2014 నుంచి 2017 వరకు జాతీయస్థాయి పతకాలు సాధించాడు. 2016లో జరిగిన ఆసియన్ బ్యాడ్మింటన్‌లో దేశానికి కాంస్యపతకం సాధించిన బృందంలో ప్రసాద్ సభ్యుడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్సాయితో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 2016లో, 2017లో సీనియర్ నేషనల్స్‌లో కపిల్ధృవ్తో కలిసి డబుల్స్‌లో కాంస్యం సాధించాడు. ఆసియన్ బ్యాడ్మింటన్ సీనియర్లో ఇండియాకి ఇప్పటి వరకు చైనీస్, మలేషియా, జపాన్, కొరియన్ దేశస్థులే ఎక్కువగా పోటీని ఇచ్చారని, కొరియన్ దేశానికి చెందిన లీయంగ్ సబ్సోమెన్లింగ్తో సుశాంత్ చిప్లకట్టి మెమోరియల్ టోర్నీలో ఫైనల్లో తలపడ్డానని, తాను ఎదుర్కొన్న ప్రత్యర్ధుల్లో అతనే మేటి క్రీడాకారుడని ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ ఏడాది వరల్డ్ నంబర్‌వన్ కావడమే లక్ష్యం.. జూనియర్ వరల్డ్ ఛాంపియన్, జూనియర్ ఆసియన్ బ్యాడ్మింటన్, జూనియర్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించడం ఈ సంవత్సరం తన లక్ష్యాలని చెప్పాడు ప్రసాద్. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో భారత పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలన్న ఆశయంతోనే సాధన చేస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ, సీనియర్ క్రీడాకారుల పర్యవేక్షణలో మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఉదయం 5గంటలకు నిద్ర లేవడం దగ్గర్నుంచి రాత్రి ప్రాక్టీస్ ముగించుకుని నిద్రించే వరకు నెట్స్‌లో 8గంటల పాటు ప్రాక్టీస్, ఇంటర్నెట్ ద్వారా షటిల్లో సరికొత్త ప్రయోగాలను సాధన, కోచ్‌ల పర్యవేక్షణలో ప్రపంచ క్రీడలకు సిద్ధమవుతున్నానన్నాడు. కృష్ణప్రసాద్‌ది రాయవరం మండలం సోమేశ్వరం. అక్కడి నుంచి తండ్రి వ్యాపారరీత్యా కాకినాడకు మకాం మార్చారు. ఒకటో తరగతి నుంచి ఎంఎస్ఎన్ ఎయిడెడ్ పాఠశాలలో చదివి 8వ తరగతి పూర్తికాగానే గోపీచంద్ అకాడమీలో చేరాడు. ప్రస్తుతం కాకినాడ ఎంఎస్ఎన్ ఎయిడెడ్ కాలేజీలో ఇంటర్ ప్రయివేట్‌గా చదువుతున్నాడు. నాన్నే తొలిగురువు.. నాన్న గంగాధర్ షటిల్ బ్యాడ్మింటన్‌లో మంచి క్రీడాకారుడు. ఆంధ్రా యూనివర్సిటీకి కెప్టెన్‌గా సత్తాచాటారు. 2007 నుంచి నాన్న వద్దే శిక్షణ తీసుకున్నా. పదేళ్ళ వయసు నుంచే రాకెట్ పట్టాను. జిల్లాస్థాయి టోర్నీ నుంచి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగానంటే నాన్న నేర్పిన మెళకువలే కారణం. తండ్రే గురువుగా వ్యవహరించే అరుదైన అదృష్టం దక్కిన అతికొద్దిమందిలో నేనూ ఒక్కడిగా ఉండడం ఆనందంగా ఉంది. -కృష్ణప్రసాద్ చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ప్రసాద్ షటిల్లో అద్భుతమైన ఆటతీరు కనబర్చేవాడు. వాడిలో ఉన్న ప్రతిభను గమనించి మంచి కోచ్‌ల పర్యవేక్షణలో ఉంచాలని గోపీచంద్ అకాడమీలో చేర్పించాం. గతేడాది వరకు డబుల్స్‌లో నంబర్ 3గా, ఆల్ ఇండియా లెవల్లో నంబర్ 2గా ఉన్న ప్రసాద్ ప్రస్తుతం ప్రపంచ జూనియర్ డబుల్స్‌లో నంబర్-2గా, ఆల్ ఇండియా నంబర్-1గా తన స్థానాన్ని మెరుగుపర్చుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది. -గంగాధర్ -
సినీ ప్రముఖుడి కూతురి కిడ్నాప్ కలకలం
పెరంబూర్: చెన్నైలో సినీ ప్రముఖుడి కూతురిని దుండగులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. స్థానిక అన్నాశాలైలోని వాణిజ్య సముదాయంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు టీ.నగర్లో చిత్రనిర్మాణ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రసాద్(56) అన్నాశాలై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు అన్నాశాలైలోని ఒక షాపింగ్ మాల్ వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. అక్కడ ఓ వ్యక్తి తన కూతురి కిడ్నాప్‌నకు ప్రయత్నించి, చివరకు సెల్‌ఫోన్, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక అన్నానగర్‌లో దుండగుడి ఆచూకీ లభించడంతో అక్కడ గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఏ దేవుడికి... ఏ ప్రసాదం?
ఒక నిమిషం–ఒక విషయం షోడశోపచారాలతో దైవాన్ని పూజించడం మనం ఆచారం. అందులో పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టడం ముఖ్యం. అయితే ఒక్కోదేవుడికి ఒక్కో ప్రసాదమంటే ప్రీతికరం. ఏ దేవుడికి లేదా దేవతకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో తెలుసుకుని, దానిప్రకారం మన అవకాశాన్ని బట్టి అదే నైవేద్యం పెడితే మంచిది. వేంకటేశ్వర స్వామికి: వడపప్పు, పానకం; వినాయకుడికి: బెల్లం, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు; ఆంజనేయుడికి: అప్పాలు, లడ్డూలు, శెనగలు; సూర్యుడికి: ఆవుపాలతో చేసిన పాయసం, మొలకెత్తిన పెసలు; లక్ష్మీదేవికి: క్షీరాన్నం, పండ్లు; సత్యనారాయణస్వామికి: ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి కలిపి చేసిన ప్రత్యేక ప్రసాదం; దుర్గాదేవికి: మినపగారెలు, అల్లం ముక్కలు; షిర్డీ సాయిబాబాకి: పాలు, గోధుమ రొట్టెలు, పాలకోవా; శ్రీకృష్ణుడికి: అటుకులతోకూడిన తీపి పదార్థాలు, వెన్న; శివుడికి: కొబ్బరికాయ, అరటిపండ్లు. సంతోషిమాతకు: పులుపులేని పిండివంటలు, తీపిపదార్థాలు; సరస్వతీదేవికి: రేగుపండ్లు, వెన్న, పేలాలు, కొబ్బరి, పాయసం. ఒక ఘటన సీతాదేవి అశోకవనంలో ఒక చెట్టుకింద కూర్చొని ఉంది. రావణుడు, అతడి అనుచరులూ పరుషపు మాటలతో పెట్టే హింసలకు ఆమె ఎంతగానో తల్లడిల్లిపోయింది. తన జాడ తన పతికి తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చే వీలూ లేదు. తానేమి చేయాలో దిక్కు తోచలేదు. దాంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడింది. సరిగ్గా అదే సమయంలో చెట్టుకొమ్మమీద మైనాక పక్షి కూత కూస్తోందట. ఆ కూత ఎలా ఉన్నదంటే, వేదాధ్యయనం చేసిన గురువు, తన శిష్యుని నిద్రలేపి, స్నాన సంధ్యావందనాలు, అగ్ని కార్యాన్ని, హోమాన్ని చేసుకోమని చెబుతున్నట్లు తోచిందట. ఆ కూత సీతాదేవికి ఓదార్పుగానూ, హితవచనంగానూ అనిపించిందట. అంతే! సీతాదేవికి మనసు మారిపోయింది. తాను మరణిస్తే తన పతి తట్టుకోలేడు. తాను తన నాథుని ఎప్పటికీ చూడలేదు. జీవించి ఉంటే, ఏదోవిధంగా తన జాడ తెలుస్తుంది. అప్పుడు అసుర సంహారం చేసి, తనను తీసుకొని వెళ్లగలడు... అనిపించింది. దాంతో తనకు వచ్చిన ఆత్మహత్యాలోచనను మనసు నుంచి తుడిచి వేసిందట. అంటే... అవతలి వారు తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు... ఆ దుఃఖాన్ని మనం తీర్చలేమని తెలిసినప్పటికీ, అనునయపూర్వకంగా ఒక్కమాట మాట్లాడినా లేదా కనీసం ఓదార్పుగా చేతితో స్పృశించినా అవతలి వారికి ఎంతో ఊరట కలుగుతుందని వాల్మీకి మహర్షి ఈ సంఘటన ద్వారా తెలియజెబుతున్నాడు. -
ప్రసాదం తిని 150 మందికి అస్వస్థత
పూణే: ఓ ఉత్సవంలో పంపిణీ చేసిన స్వీట్లు తిని సుమారు 150 మంది అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర పూణే జిల్లా మావల్ తహశీల్ పరిధిలోని పచానే గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ ఉర్సు ఉత్సవంలో ప్రసాదంగా లడ్డూను పంపిణీ చేశారు. అది తిన్న వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులతో గ్రామంలోనే శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తున్నామని మావల్ తహశీల్ ఆరోగ్య అధికారి చంద్రకాంత్ లొహారే తెలిపారు. అయితే, బాధితుల్లో చాలా మందిని వైద్య చికిత్సల అనంతరం ఇళ్లకు పంపించేశామని.. ఇంకా, 50 మంది వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేపట్టామని, ఉత్సవం సందర్భంగా పంపిణీ చేసిన స్వీట్లు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు. -
పోరాటాల ప్రపంచీకరణ
అమెరికా పెట్టుబడులు భారత్‌లోకి రావచ్చు. కానీ భారతదేశ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా ఉద్యోగాల కోసం మాత్రం వెళ్ళరాదు. నేడు శ్రామికుల వలసల ద్వారా శ్రమ శక్తి ప్రపంచీకరణ చెందుతున్నది. దీని నియంత్రణకై కొత్తగా దేశాల మధ్య సరిహద్దు గోడల నిర్మాణ ప్రక్రియ ఉనికిలోకి వస్తున్నది. దీనికి నేడు ట్రంప్ సర్కారు సార«థ్యం వహిస్తున్నది. సరిగ్గా ఇదే సమయంలో దేశాల మధ్య సరిహద్దులను చెరుపుకుని నాలుగు ఖండాలలోని సుమారు 20 దేశాల భూగర్భ గని కార్మికవర్గం, తెలంగాణ లోని గోదావరిఖనిలో ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రెండవ ప్రపంచ గని కార్మిక సభలను జరుపుకుంటున్న ఘటనకు చాలా ప్రాధాన్యత వుంది. పాతికేళ్ల ప్రపంచీకరణ ప్రక్రియ గని కార్మికుల సంఖ్యను కుదించింది. ఉదా:– సింగరేణిలో కార్మికుల సంఖ్య ఈ పాతికే ళ్లలో లక్షా పదహారు వేల నుంచి 56 వేలకు తగ్గిపోయింది. ఉత్పత్తి పెరిగింది. పని భారాలు పెరి గాయి. శాశ్వత కార్మికుల స్థానంలో, ఒప్పంద (కాంట్రాక్టు), పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) కార్మికులు ఉనికిలోకి వచ్చారు. వీరి జీతాలు బెత్తెడు. పనిభారాలు బారెడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆదాయం పన్ను (ఐ.టి.) కోత మరో ఎత్తు. ఏటా రెండున్నర నెలల జీతాలను ఐటీ పేరిట ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నాయి. ఈ ప్రపంచీకరణ దుష్ఫలితాలు భార త్కే పరిమితం కాదు. ప్రపంచ గని కార్మిక వర్గానికి వర్తించే సార్వత్రిక కష్టనష్టాలివి. ఈ నేపథ్యం నుంచే ప్రపంచ గని కార్మిక వర్గం మధ్య పరస్పర సమన్వయ కృషి ప్రారంభమైంది. సుమారు ఐదారేళ్ల సమన్వయ కృషి ఫలితంగా 2013 మార్చిలో పెరూ దేశంలో మెుదటి ప్రపంచ దేశాల గని కార్మిక మహాసభలు జరిగాయి. భారతదేశంలో రెండో సభలు జరపాలన్న సూచన ఆనాటికే వచ్చింది. అయితే 2016 ఫిబ్రవరిలో ఐసీజీ సమావేశం చర్చించి, గోదావరిఖనిలో జర పాలని నిర్దిష్టంగా తీర్మానించింది. జర్మనీ, భారత్, రష్యా, కజకిస్తాన్, పోలండ్, బెలారస్, ఉక్రెయిన్, కొలంబియా, పెరూ, కాంగో, కెన్యా, టోగో, మెురాకో, ట్యునీషియా, తదితర దేశాల ప్రతినిధులు దాదాపు 75 మంది జనవరి 31వ తేదీకే గోదావరిఖని చేరుకున్నారు. మెుత్తం 105 మంది విదే శీయులు రావచ్చు. దేశ వ్యాపితంగా 300 మంది భారతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. మెుత్తం 450 మంది ప్రతినిధులతో జరగనున్నది. పాతికేళ్ల పెట్టుబడుల ప్రపంచీకరణ ప్రక్రియ వెర్రితలలు వేసే స్థాయిుకి చేరింది. శ్రామికుల వలసలను అడ్డుకోవటానికి మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం తన లక్ష్యమని ట్రంప్ ప్రకటించాడు. ఇరాక్, అప్ఘానిస్తాన్ వంటి దేశాల సరిహద్దుల కూల్చివేతకు పూనుకున్న గత అమెరికా దేశాధ్యక్షులకు భిన్నంగా నేడు ట్రంప్ గోడల నిర్మాణం చేపడతానంటున్నాడు. గత పాతి కేళ్ల ప్రపంచీకరణ ప్రక్రియ నిర్జీవ పెట్టుబడులకూ, సరుకులకూ దేశాల సరి హద్దులకి అతీతంగా యధేచ్చగా తరలిపోయే స్వేచ్చను కల్పించింది. కానీ సజీవ శ్రమశక్తికి అలాంటి స్వేచ్చను ఇప్పుడు హరించి వేస్తున్నారు. అమె రికా పెట్టుబడులు భారత్‌లోకి ‘మేకిన్ ఇండియా’ కోసం రావచ్చు. కానీ భారతదేశ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా ఉద్యోగాల కోసం వెళ్ళరాదు. పెట్టుబడుల ప్రపంచీకరణ ప్రక్రియకి ప్రతిస్పందనగా శ్రమశక్తి కూడా ప్రపంచీకరణకు గురవుతున్న వేళ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. సరిగ్గా ఇప్పుడే అంతర్జాతీయ గని కార్మిక సభలు జరగడం విశేషం. ‘ప్రపంచ పెట్టుబడి’ అన్ని దేశాల భూగర్భ ఖనిజ సంపదలను తన వశం చేసుకోవడం ద్వారా ప్రపంచీకరణ చెందింది. ఎల్లలు లేని ఈ తరహా ప్రపంచ పెట్టుబడి నుంచి ఏ ఒక్క దేశం విడిగా తన ఆత్మరక్షణ చేసుకోవడం సాధ్యం కాదు. ప్రపంచీకరణ చెందిన పెట్టుబడిని ప్రపంచీకరణ చెందు తున్న శ్రమశక్తే నిర్ణయాత్మకంగా ప్రతిఘటించగలదు. ఈ రోజు గని కార్మిక రంగంలో పురుడు పోసుకుంటున్న ఈ ప్రక్రియ మున్ముందు అన్ని రంగాల కార్మిక వర్గానికీ, ఇతర పీడిత వర్గాలకూ స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం. (గోదావరిఖనిలో ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రెండవ అంతర్జాతీయ గని కార్మిక సభలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం సా’’ 3 గం’’లకు విఠల్‌నగర్ పార్కు నుంచి ప్రదర్శన, అనంతరం 5 గం’’లకు జి.యం. కాలనీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా..) పి. ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యు. జాతీయ కార్యదర్శి -
పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని..
ముండ్లమూరు : వేధిస్తున్నాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందిన భర్త.. పోలీసుస్టేషన్‌కు సమీపంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక పోలీసుస్టేషన్‌కు సమీపంలో సోమవారం జరిగింది. ఏఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ శ్రీనివాసనగర్‌కు చెందిన అతిరాసి ప్రసాద్, సుగుణ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో ఈ నెల 6వ తేదీన భర్త చేయి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ సుగుణ ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుస్టేషన్‌కు రావాలని పోలీసులు ప్రసాద్‌కు శనివారం కబురు పంపారు. ప్రసాద్ స్టేషన్‌కు వచ్చాడు. ఎస్ఐ బాలరంగయ్య విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వెళ్లి ఉన్నారు. అదే రోజు సాయంత్రం ప్రసాద్‌ను ఇంటికి పంపారు. సోమవారం ఉదయం ప్రసాద్ పోలీసుస్టేషన్‌కు రాగా ఎస్ఐ, ఏఎస్ఐ ఇద్దరూ లేరు. వారు వచ్చాక రమ్మని కానిస్టేబుళ్లు మళ్లీ చెప్పారు. దీంతో ప్రసాద్ పోలీసుస్టేషన్ బయటకు వెళ్లి భార్య తనను పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పుతోందని మనస్తాపం చెంది బ్లేడుతో గొంతు కోసుకుంటున్నాడు. అటు వైపు వెళ్తున్న దళిత నేత పాలెపోగు డగ్లస్ గమనించి తప్పించే ప్రయత్నం చేశాడు. ఆయన కేకలకు కానిస్టేబుళ్లు కూడా బయటకు వచ్చి ప్రసాద్‌ను రక్షించారు. అప్పటికే కొంతమేర గొంతు తెగడంతో రక్తం కారుతోంది. క్షతగాత్రుడిని వెంటనే అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో పంచాయితీ సెక్రటరీ
రాజమండ్రి: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా కేశవపల్లి పంచాయతి సెక్రటరీగా పని చేస్తున్న ప్రసాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రసాద్ లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు వివరాల కోసం అతన్ని విచారిస్తున్నారు. -
370 కిలోల గంజాయి స్వాధీనం
12 మంది అరెస్టు మాడుగుల, గొలుగొండ, హుకుంపేట మండలాల్లో పోలీసులు 370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాడుగుల మండలంలో ఇద్దర్ని, గొలగొండ మండలంలో నలుగుర్ని, పెదబయలు మండలంలో ఆరుగుర్ని అరెస్టు చేశారు. మాడుగుల : విశాఖ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి, 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ ఫోర్స్మెంట్ సీఐ సీవీవీఎస్ ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. ముందస్తు సమాచారం మేరకు దాడులు జరిపి, ఆటోలో తరలిస్తున్న 310 కిలోల గంజాయిని ముకుందపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎస్.దుర్గ, కాళ్ల వెంకట మాలిబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించినట్టు సీఐ ప్రసాద్ తెలిపారు. గొలుగొండ: ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని శనివారం గొలుగొండ పోలీసులు పాలకపాడు ప్రాంతాలలో పట్టుకున్నారు. ఎస్ఐ ఉమామహేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారులో 40 కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దాడిచే శారు. బీహార్‌కు చెందిన ఎం.ఆలీమ్, సీలేరుకు చెందిన భద్ర, బిస్మమ్, గణేష్ అనే నలుగుర్ని అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. వీరి వద్ద నుంచి కారు, బైక్, నాలుగు సెల్ఫోన్లు, రూ.40 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ కేశవరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హుకుంపేట: పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి హుకుంపేట మీదుగా అరకులోయ ప్రాంతానికి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని హుకుంపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొంతిలి సమీపంలోని రోడ్డు వద్ద హుకుంపేట ఎస్ఐ బొండా నాగకార్తీక్, సిబ్బంది శనివారం వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయం లో మఠం ప్రాంతం నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా 30 కిలోల గంజాయి బయటపడింది. ఆటోను సీజ్ చేసి, మఠం గ్రామానికి చెందిన జన్ని భాస్కరరావు, అరకులోయకు చెందిన పి.కృపానందం, కొర్రా చిత్రు,బీహర్ రాష్ట్రానికి చెందిన చందన్ కుమార్, మిధున్ కుమార్, జగ్రనా«థ్ సాహూను అరెస్ట్ చేసి, విశాఖ సెంట్రల్ జైల్‌కు రిమాండ్‌కు తరలించారు. -
వృత్తి నిబద్ధతతోనే గుర్తింపు
► కరీంనగర్‌ను మరిచిపోలేం ► ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర పాఠశాల సంచాలకులు ప్రసాద్, మూడు జిల్లాల డీఈఓలు కరీంనగర్ : వృత్తి నిబద్ధతతోనే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎన్ఎస్ఎస్ ప్రసాద్, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎస్.శ్రీనివాసాచారి, కందిమల్ల లింగయ్యలు అన్నారు. కరీంనగర్‌లోని భగవతి పాఠశాలలో ఆదివారం తెలంగాణ పాఠశాలల విద్యా ఉద్యోగు ల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీఈవో రాజీవ్‌తోపాటు వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ పనిచేసిన ఉద్యోగ ధర్మం పాటిస్తే గౌరవప్రదంగా జీవించవచ్చన్నారు. తాము పనిచేసిన కాలంలో జిల్లాలో చేపట్టిన విద్యా సంబంధిత కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయని, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు నెలకొల్పడంతో ఉమ్మడి రాష్ట్రం లోనే కరీంనగర్ జిల్లా ముందున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కిందిస్థారుుకి తీసుకెళ్లడంతో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎం.నర్సింహస్వామి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ పాఠశాలల విద్య ఉ ద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎ.రవీందర్‌రాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్వీ రమ ణ, జె.భగవాన్‌రెడ్డి, నాయకులు ఎస్.వేణుమాధవ్, ఎస్.సురేందర్, జి.నాగార్జునచారి, కె.ఎస్ రాబర్ట్, సుగుణాకర్, రాజేశ్వరి, శ్రీధర్, మహేశ్‌తో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కటుకం రమేశ్, నూలి మురళీధర్‌రావు, రవీంద్రచారితో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
రాజంపేట టౌన్: విధులకు సక్రమంగా హాజరు కాని రాజంపేట ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావుతో విధులకు సక్రమంగా హాజరు కాని ప్రసాద్, నవీన్‌లను సస్పెండ్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం ప్రభుత్వ ఐటీఐ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నెలకు ఐదు రోజులు కూడా ఐటీఐకి రాడని, అలాగే ప్రసాద్, నవీన్‌లు కూడా ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం 3 గంటలకు ఇంటికి వెళుతున్నారని ఆరోపించారు. ఇందువల్ల విద్యార్థుల సరైన బోధన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు ఆరోపించారు. అంతేకాక ఐటీఐ అంటే ప్రాక్టికల్స్‌లో ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని, అయితే ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పరికరాలు పూర్తిస్థాయిలో లేక పోవడంతో విద్యార్థులు ఐటీఐ ఉత్తీర్ణులైనా బయటికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలను పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి ఫలితం లేదన్నారు. వెంటనే పై సమస్యలను పరిష్కరించకుంటే డిసెంబర్ 4వ తేదీ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరసింహ, లక్ష్మీనారాయణ, టీ.ప్రసాంత్, విజయ్, గంగిరెడ్డి, గురు, బాలక్రిష్ణ, రెడ్డయ్య, భాను తదితరులు పాల్గొన్నారు. -
సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలే
ఏపీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ ఘనంగా యానాం కవితోత్సవం-2016 ఉభయ రాష్ట్రాల నుంచి రచయితలు, కవులు రాక యానాం టౌన్ : కవులు, రచయితలు చేసే రచనల ద్వారానే నిజమైన మార్పు వస్తుందని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సమాజాన్ని సంస్కరించేది కవులు, రచయితలేనని, మంచి రచనలు సమాజ ఉన్నతికి దోహదపడతాయని చెప్పారు. స్థానిక కవి సంధ్య, స్ఫూర్తి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం యానాం కవితోత్సవం–2016 నిర్వహించారు. కవి సం«ధ్య అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ శిఖామణి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన గౌరవ అతి«థిగా ప్రసంగించారు. కవులు, రచయితలు తెలుగువారిలో భాషాభిమానం పెంపొందించడానికి మరింత కృషి చేయాలన్నారు. అప్పుడే కవులు, రచయితలు చేసే రచనలకు విలువ ఉంటుందన్నారు. కన్నడులకు, తమిళలకు ఉన్న భాషాభిమానం తెలుగువారిలో లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు జాతి గొప్పది, మన భాష గొప్పది అన్న భావన అందరిలోనూ కలగాలని ఆకాంక్షించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ సాహిత్యం సమాజానికి అవసరమని, కవిత్వం మనిషిని స్పందింపజేస్తుందని చెప్పారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డి ‘మానవ నాగరికత– కవిత్వం’ అంశంపై మాట్లాడారు. మానవ వికాసానికి సాహిత్యం దోహదం చేస్తుందన్నారు. ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, ప్రముఖ కవి ఆకెళ్ల రవిప్రకాష్ మాట్లాడుతూ గతంలో తాను యానాం పరిపాలనాధికారిగా పనిచేశానని, అప్పట్లో కవిత్వం మీద ఉన్న ఆసక్తితో తొలిసారి ఉగాదికి కవిసమ్మేళనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డాక్టర్ శిఖామణి మాట్లాడుతూ ఎర్రన రచించిన పద్యాన్ని తనదైన శైలిలో వినిపించారు.శిఖామణి సాహితీ తొలి పురస్కారం కె.శివారెడ్డికి ప్రదానం చేయాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కాలే సాయినాథ్, మధునాపంతుల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇన్సెర్టు కవితోత్సవం–2016 ప్రారంభం యానాం గోదావరి తీరం శనివారం సాహితీ సుగంధాలతో పులకించింది. వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు తరలివచ్చి తమ సాహిత్యం, కవిత్వంతో సాహితీ ప్రియులను, అభిమానులను అలరించారు. కవిసంధ్య సాహితీ, సాంస్కృతిక సంస్థ, స్ఫూర్తి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గాజుల గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన బొజ్జా తారకం, ఆవత్స సోమసుందర్ ప్రాంగణంలో యానాం కవితోత్సవం–2016ను నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకను ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు దివంగత మంగళంపల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు సుప్రసిద్ధ కవులు కె.శివారెడ్డి, కొలకలూరి ఇనాక్, ప్రముఖ చిత్రకారులు శ్రీలా వీర్రాజు, అక్బర్, ఏపీ గిరిజన సహకార సంస్థ ఎండీ, కవి ఆకెళ్ల రవిప్రకాష్ , ఇండియా టూరిజం ఏడీ తుల్లిమల్లి విల్సన్‌సుధాకర్, కవిసంధ్య అధ్యక్షుడు డాక్టర్ శిఖామణి, కవి దాట్ల దేవదానంరాజు, డాక్టర్ వరుగు భాస్కరరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం సభా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి కవులు, రచయితలు, సాహితీప్రియులు, అభిమానులు పాల్గొన్నారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సహకారం, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కళలు, సాంస్కృతికశాఖ సౌజన్యంతో డాక్టర్ శిఖామణి సారథ్యలో ఈ కవితోత్సవాన్ని నిర్వహించారు. -
సినీఫక్కీలో మోసం
అమడగూరు : డబ్బులకోసం ఆశ పడిన మహిళలు సినీఫక్కీలో మోసపోయిన ఘటన గురువారం రెడ్డివారిపల్లిలో చోటు చేసుకుంది. బాధిత మహిళల వివరాల మేరకు.. రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి బెంగుళూరులో ఒక కంపెనీలో పనిచేస్తూ యజమానికి నమ్మిన బంటుగా ఉన్నాడు. అయితే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ యజమానికి చిక్కొచ్చి పడింది. దీనికోసం ప్రసాద్‌ను పావుగా వాడుకున్నాడు. తెలిసిన వాళ్ల బ్యాంకు ఖాతాలు కావాలన్న యజమాని కోరిక మేరకు ప్రసాద్ తన సొంతూరి మహిళలను ఉపయోగించుకున్నాడు. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన వారితో ఫోన్లో మాట్లాడి ఆధార్‌కార్డు, గుర్తింపుకార్డు తీసుకువస్తే డబ్బులు ఇస్తామని తెలిపాడు. దీంతో ఆశ పడి కూలి పనులు చేసుకునే 22 మంది మహిళలు బాడుగ వాహనంలో యశ్వంతపురంలోని బసవేశ్వర నగర్‌కు చేరుకుని ప్రసాద్‌ను కలిశారు. అయితే అక్కడికెళ్లగానే వేలిముద్రలు వేసేవారు అవసరం లేదని సంతకం చేసేవారే కావాలని 22 మందిలో 9 మందిని ఎంపిక చేసుకున్నారు. ఆ తొమ్మిది మందిని యాక్సిస్ బ్యాంకుకు తీసుకెళ్లి ఫొటోలు తీసి, ఒక్కొక్కరి దగ్గర 42 సంతకాలు చేయించుకున్నారు. అందులో ఖాళీ చెక్కులు కూడా ఉన్నాయి. మహిళలు అక్కడుండగానే వారి పేరు మీద ఖాతా పుస్తకాలు, ఏటీఎం కార్డులు సైతం వచ్చేశాయి. దీంతో ప్రసాద్ అందరినీ తీసుకుని రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి చేరుకుని ప్రతి మహిళకూ రూ. 500 ఇచ్చాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న మహిళల భర్తలు తమను మోసం చేశారంటూ ప్రసాద్‌తో గొడవకు దిగారు. గురువారం పలువురి పెద్దమనుషుల తీర్మానం మేరకు బెంగుళూరుకు వెళ్లి బ్యాంకు ఖాతాలు రద్దు చేయించాలని తీర్మానించుకున్నారు. అనుకున్న ప్రకారం గురువారం మధ్యాహ్నం పెద్దమనుషులతో పాటుగా మహిళలు బెంగుళూరుకు వెళ్లి ఖాతాలు రద్దు చేయించుకున్నారు. -
నోట్ల రద్దు సబబేనా మోదీజీ!
ఇప్పటికే బోలెడు పన్నులు కడుతున్న మాకు, ప్రభుత్వం ఏం సేవలు ఇస్తుందో చెప్పండి. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతాలకోసం అయితే మేము పన్నులు కట్టం సర్. వీలయినంత ఎగ్గొడతాం. ప్రధానమంత్రి మోదీజీ, నాపేరు ప్రసాద్. హైదరాబాద్ లోని బాలానగర్‌లో చిన్న ఇండస్ట్రీ నడుపుతాను. నెలకి రూ. 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అంటే, ఏడాదికి రూ.24 లక్షలు. నిజాయితీగా అయితే ఏడాదికి కనీసం రూ.3 లక్షలు (మినహాయింపులు అన్నీ పోను) ఆదాయపు పన్ను కట్టాలి. అయితే నేను జస్ట్ రూ. 30 వేలు మాత్రమే పన్ను కడతాను.. ఎందుకంటే? నేను ఒక మామూలు మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టా. కష్టపడి చదువుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు సొంత ఇండస్ట్రీ పెట్టుకునే దశకి చేరుకున్నాను. నా సంపాదన రెండు లక్షల్లో, ఒక లక్ష నా కుటుంబ అవసరాలకి సరిపోతుంది. మిగతా లక్ష భూములు, బంగారంలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఖర్చు పెట్టే లక్ష రూపాయల్లో దాదాపు రూ.30 వేలు పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటోంది. కిరాణా సరుకుల దగ్గర నుంచి టీవీ, మొబైల్ దాకా ఏది కొన్నా 20 నుంచి 30 శాతం పన్ను. ఇక ఫ్రెండ్స్‌తో మందు పార్టీ చేసుకుంటే, రూ. 3,000లు ఖర్చు అయితే, దాదాపు 60% ప్రభుత్వానికి పన్ను. కారుకి పెట్రోల్ కొట్టిస్తే లీటరుకి రూ.30 పన్ను. కారు కొంటే అన్ని ట్యాక్సులు కలిపి ప్రభు త్వానికి లక్షన్నర చెల్లించా. ఇంటి స్థలం కొంటే లక్ష రూపా యలు రిజిస్ట్రేషన్ కోసం కట్టా. ప్రభుత్వం కనీసం మట్టి రోడ్డు కూడా వేయని మా కాలనీలో స్థలం కొన్నందుకు ప్రభుత్వం డెవలప్మెంట్ చార్జీల పేరుతో రూ. 50 వేలు వసూలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వా నంగా ఉన్నాయో చూశాక, కార్పొరేట్ ఆస్పత్రులు ఎంత దోపిడీ చేస్తున్నాయో చూశాక, తప్పనిసరై హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, సిగ్గు కూడా లేకుండా ప్రభుత్వం దాని మీద సర్వీస్ ట్యాక్స్ వేసింది. దారిదోపిడీ∙దొంగలు దోచు కున్నట్లు, ప్రతిదాని మీద ఆఖరికి స్మశానంలో శవ దహనం మీద కూడా పన్నులేస్తున్న ప్రభుత్వం మాకు తిరిగి ఏమిస్తోంది? గవర్నమెంట్ స్కూళ్లలో మా పిల్లల్ని చేర్పిస్తే చదువు వస్తుందనే నమ్మకం ఉందా? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యంతో తిరిగొస్తామనే నమ్మకం ఉందా? దేశ రక్షణ, రోడ్లు వేయడం తప్ప, చేస్తున్న అభివృద్ధి పనులేమిటో మాకు అర్థం కావడం లేదు. కారు కొంటే రోడ్ ట్యాక్స్, రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్.. తోలు తీసేస్తున్నారు కదా సర్. ఇక మా పన్నుల డబ్బు ఏమైపోతోంది? మా ఇండస్ట్రీలో పని చేసే వారికి జీతం పెంచాలి అంటే, వారు ఎంత పని చేస్తారు? ఎలా పనిచేస్తారు? అని ప్రతి ఏడూ చూసి ఇంక్రి మెంట్ ఇస్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగి పనిచేసినా చేయకపోయినా, అధ్వాన్నంగా చేసినా, అందరికీ ఒకే జీతం, ఒకే ఇంక్రిమెంట్.. మా సొమ్మంటే అంత లోకువా? పైగా మా పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ, మా పనులు చేయాలంటే, పోజులు కొడ తారు. 10 గంటలకి ఆఫీసు అంటే 11 గంటలకి వస్తారు. లంచం లేకుండా ఒక్క పని కూడా చేయరు. మరి ఎందుకు సార్, మేము ప్రభుత్వాలకి పన్నులు కట్టాలి. ఇండస్ట్రీ నడ వాలి అంటే, కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లంచాలు ఇవ్వాలి. అందరికీ కలిపి నెలకి సుమారు రూ.10 వేలు నేను లంచం ఇవ్వాల్సి వస్తోంది. ఆ లంచాలన్నీ వైట్ లో చూపించడం ఎలా సార్? అందుకే సార్, మాకు ప్రభు త్వాలకి పన్ను కట్టాలంటే కడుపు మండిపోద్ది. అలాగని నేను సామాజిక బాధ్యత లేనివాణ్ణి కాదు సర్, మీరు సైనికనిధికి విరాళం ఇవ్వమంటే రూ.10 వేలు ఇచ్చా. మా దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి ఏడాదికి రూ. 20 వేలు ఇస్తా. మా ఊర్లో స్కూల్ బాగు చేస్తామంటే మా నాన్న పేరుమీద లక్ష డొనేషన్ ఇచ్చా. కానీ ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం నాకు మనసొప్పదు సర్. ఓకే.. ఇదంతా గతం. ఇప్పుడు అంతా వైట్ మనీలోనే వ్యవహారాలు చేద్దాం. మీరు డిసైడ్ చేశారు కాబట్టి, నా దగ్గర ఉన్న రూ.10 లక్షల బ్లాక్ మనీకి 30% అంటే రూ. 3 లక్షలు కట్టి, మొత్తం వైట్లోకి మార్చుకుంటా. కానీ, రేపటి నుంచి నేను నెలకి రూ.10 వేలు లంచాలు ఇవ్వకుండా పనులు అవుతాయనే గ్యారంటీ ఇస్తారా? లేదా లంచాల్ని చెక్ రూపంలో తీసుకొమ్మని ఉద్యోగులకి పర్మిషన్ ఇస్తారా? ఇక నాయకుల సంగతి చెప్పలేదు కదా.. మా గల్లీ లీడర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేదాకా అందరి ఎలక్షన్లలకి, అన్ని పార్టీల వాళ్లకి విరాళాలు ఇవ్వాలి. లేకపోతే ఇబ్బంది పెడ తారు. వీళ్ళని కూడా విరాళాలు చెక్కుల రూపంలో తీసు కొమ్మని చట్టం తెస్తారా? పార్టీల డబ్బుల లెక్కల్ని రహస్యం లేకుండా ఓపెన్‌గా చెబుతారా? ఇప్పటికే బోలెడు పన్నులు కడుతున్న మాకు, ప్రభుత్వం ఏం సేవలు ఇస్తుందో చెప్పండి. నాయకుల జల్సాల కోసం, ఉద్యోగుల జీతాల కోసం అయితే మేము పన్నులు కట్టం సర్. వీలయినంత ఎగ్గొడతాం. పదేళ్ళకి మళ్ళీ దేశంలో బ్లాక్ మనీ పెరిగి పోతుంది. అప్పుడు మళ్ళీ నోట్ల మార్పిడి తెస్తారా? ఇందుకు కాదు సర్, మిమ్మల్ని ఎన్నుకుంది. మీ నిర్ణయం వల్ల రెండు రోజులుగా చేతిలో డబ్బులేక ఇబ్బంది పడు తున్న మా వర్కర్స్ కూడా, మీ మీద నమ్మకంతో ఈ ఇబ్బందిని సంతోషంగా భరిస్తున్నారు సార్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ముందు మేము కడుతున్న పన్నులకి న్యాయం చేయండి. అప్పుడు మేము కూడా న్యాయంగా పన్నులు కడతాం. రెండు చేతులు కలిస్తేనే సర్ చప్పట్లు, మా చెయ్యి రెడీ.. మీచేత కోసం ఎదురు చూస్తుంటాం. ఇట్లు మీ అభిమాని, ఓటరు (సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ కథనం సాక్షి పాఠకుల కోసం) ప్రసాద్, చిన్న పరిశ్రమదారు, హైదరాబాద్ -
ప్రిన్సిపాల్ కోసం సుకుమార్ క్లాప్
‘‘లెక్చరర్‌గా నేనూ, ప్రిన్సిపాల్‌గా ప్రసాద్ ఒకే కాలేజీలో పని చేశాం. ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాతో ప్రసాద్ నిర్మాతగా ప్రవేశిస్తున్నారు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్దేవ్ జంటగా జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలన చిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ ఇవ్వగా, కె.రామ్మోహన్‌రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ నరేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు థామస్‌రెడ్డి, విజయ్‌ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. ‘‘సుకుమార్‌తో పాతికేళ్ల అనుబంధం నాది. చక్కటి కథ, కథనాలతో కుటుంబమంతా కలసి చూడదగ్గ అంశాలతో ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ప్రసాద్. ‘‘గులాబీ’, ‘గీతాంజలి’, ‘సఖి’ తరహా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి’’ అని జొనాథన్ అన్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్దేవ్, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రధన్ పాల్గొన్నారు. -
1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పోస్ అమలు
అత్తిలి : పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో చేపట్టిన ఈ–పోస్ విధానంలో ఎరువుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని వ్యవసాయశాఖ డెప్యూటీ డైరెక్టర్ బీజీవీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం అత్తిలిలో వ్యవసాయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 1,100 మంది ఎరువుల డీలర్లకు ఉచితంగా ఈ–పోస్ యంత్రాలను అందజేసి శిక్షణ ఇచ్చామని, వాటి ద్వారానే రైతులకు ఎరువుల విక్రయాలు జరుపుతున్నారని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 816 జిల్లాల్లో ఈ పోస్ విధానంలో ఎరువుల విక్రయాలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో 13 మండల వ్యవసాయశాఖ కార్యాలయ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయని వ్యవసాయశాఖాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కమాలాకర్ చెప్పారు. అత్తిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 2 ఏడీఏ కార్యాలయాలు, జేడీ కార్యాలయ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. -
మహా గణపతి లడ్డూ పంపిణీ
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూను మంగళవారం పంపిణీ చేశారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 2010లో 500 కిలోల లడ్డూను స్వామికి ప్రసాదంగా సమర్పించారు. 2011లో 2400 కిలోలు, 2012లో 3500, 2013లో 4200, 2014లో 5200, 2015లో 6000కిలోల మహాలడ్డూను ఖైరతాబాద్ మహాగణపతికి సమర్పించారు. ఈ ఏడాది అందజేసిన 500 కిలోల లడ్డూను ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం ఉదయం 5 నుంచి 11 గంటల వరకూ క్యూలో వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. దాదాపు ఆరువేల మంది భక్తులకు ప్రసాదం అందజేసినట్టు కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్ కుమార్ తెలిపారు. సంతోషంగా ఉంది.. ‘ఏటా లడ్డూ పంపిణీ ఉత్సవ కమిటీ సభ్యులకు సవాలుగా మారేది. ఈ సంవత్సరం క్యూలో వచ్చే భక్తులకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శిల్పి రాజేంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. -
రాజుగారు మళ్లీ వస్తున్నారు
రాజుగారి గది 2 , ఓంకార్ ,పొట్లూరి వి. ప్రసాద్ ‘‘గతేడాది చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ‘రాజుగారి గది’. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓంకార్. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ ఏడాది ‘క్షణం’, ‘ఊపిరి’ లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ పీవీపీ. ‘రాజుగారి గది 2’ని నిర్మించడానికి ఈ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ ముందుకొచ్చారు. ఈ సీక్వెల్‌కి అగ్ర నిర్మాణ సంస్థ తోడవడంతో భారీ తారాగణంతో పాటు మంచి టెక్నిషియన్లను కూడా తీసుకుంటున్నామని దర్శకుడు ఓంకార్ అన్నారు. మొదటి భాగంకన్నా రెండో భాగం ఇంకా క్వాలిటీగా ఉంటుందన్నారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్నాయి. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే నిర్మాతలు. -
బాస్కెట్‌బాల్ పోటీలకు ఎ.కోడూరు విద్యార్థి
కె.కోటపాడు: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ జట్టుకు ఎ.కోడూరు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి యడ్ల ప్రసాద్ ఎంపికయ్యాడు. ఈనెల 21న విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన అండర్ 17 విభాగం రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలో ప్రసాద్ మంచి ప్రతిభ కనబర్చాడు. దీంతో రాష్ట్రస్థాయి జట్టులో పాల్గొననున్నాడు. ప్రసాద్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.అనురాధ, పీఈటీ కె.చిట్టిప్రసాద్, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
రక్తదారులు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గోరంట్ల మండలం రెడ్డిచెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలచెట్లపల్లికి చెందిన విశ్వనాథ్‌రెడ్డి (12), బూదిలి గ్రామ సమీపంలోని పుట్టపర్తి– బెంగుళూరు ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన లక్ష్మమ్మ (65) మృతి చెందారు. రాయదుర్గం మండలం మల్లాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన ప్రసాద్(40) దుర్మర ణం చెందాడు. గోరంట్ల : మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని పూలచెట్లపల్లికి చెందిన నరేంద్రరెడ్డి, ఇందిరమ్మ కుమారులిద్దరూ విశ్వనాథ్‌రెడ్డి (12), విజయ్‌కుమార్‌రెడ్డి (13) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నారు. శనివారం వారని పాఠశాలకు పంపించేందుకు నరేంద్రరెడ్డి ఇద్దరినీ గ్రామ బస్టాప్ వద్ద దింపి వెళ్లారు. అదే సమయానికి పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో పని చేసే యువకుడు పవన్ వీరిద్దరినీ ద్విచక్రSవాహనంపై ఎక్కించుకొని పాఠశాలకు వెళ్తుండగా రెడ్డిచెర్వు కట్ట సమీపంలో గోరంట్ల నుంచి కదిరి వైపు వేగంగా వస్తున్న టాటా సుమో ద్విచక్రSవాహనాన్ని ఢీకొనింది. ఈ ప్రమాదంలో మధ్యలో కూర్చున్న విశ్వనాథ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. విజయకుమార్‌రెడ్డికి కాలు విరిగింది. పవన్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు టాటా సుమోలో గోరంట్ల ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో విశ్వనాథ్‌రెడ్డి మృతి చెందాడు. విజయ్‌కుమార్‌రెడ్డిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. మండలంలోని బూదిలి గ్రామసమీపంలోని పుట్టపర్తి– బెంగుళూరు ప్రధాన రహదారిలో చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలిని కారు ఢీకొనింది. గాయపడిన ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మల్లాపురం సమీపంలో ఒకరు రాయదుర్గం : మండలంలోని మల్లాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి శనివారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు .... బళ్లారికి చెందిన ప్రసాద్æ(40), రాము అనే వ్యక్తులు శ్రావణ శనివారం సందర్భంగా రాయదుర్గం మండలంలోని మల్లాపురం విప్రమలై నవ నరసింహస్వామి దర్శనానికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మల్లాపురం గ్రామ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా, రాము స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. బళ్లారిలో చికిత్స పొందుతూ ప్రసాద్ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చే స్తున్నారు. -
తమ్ముడిని చంపిన అన్న
డబ్బు విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన అన్న ఇనుప రాడ్‌తో కొట్టడంతో.. తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సైదాపూర్ తండాలో గురువారం వెలుగుచూసింది. తండాకు చెందిన అన్నదమ్ములు మేగావత్ చిన్నా(19), ప్రసాద్(22) ల మధ్య గత కొన్ని రోజులుగా డబ్బుల విషయంలో వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ప్రసాద్ పక్కనే ఉన్న ఇనుప రాడ్‌తో చిన్నా తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తిపై మారణాయుధాలతో దాడి
జలదంకి : మండలంలోని లింగరాజు అగ్రహారంలో ఆదివారం పాతకక్షల నేపథ్యంలో కూకటి ప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ప్రసాద్ తన గొర్రెలను చెరువు సమీపంలో మేపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన మట్టెపు వెంకటేశ్వర్లు, తిరుమలరావు, రమేష్ విచక్షణ రహితంగా మారణాయుధాలతో ప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రసాద్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రత్యర్థులు పరారీ అయ్యారు. పక్కన పొలంలో ట్రాక్టర్‌తో పనిచేసుకుంటున్న వారు ప్రసాద్ పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. దీనిపై జలదంకి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లైన మూడు నెలలకే అనంతలోకాలకు...
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం ఆరిలోవ : అనకాపల్లి వెళ్లొస్తూ ప్రమాదవశాత్తూ చోడవరం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరిలోవలో టి.ఐ.సి.పాయింట్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టి.ఐ.సి.పాయింట్ ప్రాంతానికి చెందిన ప్రసాద్(26)తో పాటు మరో ఇద్దరు స్నేహితులు బైక్‌పై ఆదివారం అనకాపల్లి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా చోడవరం సమీపంలో బైక్ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆటో బైక్ నడుపుతూ కిందపడిన ప్రసాద్ మీదకు ఎక్కేసింది. దీంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న పాల్ అనే యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో స్నేహితుడికి చేతులపై స్వల్ప గాయాలయ్యాయి. ప్రసాద్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. అతని భార్య ఆషాడం కావడంతో కన్నవారింటికి వెళ్లింది. ఇంతలోనే ప్రసాద్ మృత్యువాత పడ్డాడు. అక్కడి పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన పాల్‌ను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ప్రసాద్ తల్లిదండ్రులు కన్నీరు పర్యంతమై సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రసాద్ కార్పెంటర్ వర్క్ చేస్తాడని స్థానికులు తెలిపారు. -
వేటగాళ్ల తూటాకు జింక బలి
నిజామాబాద్ జిల్లా రెంజల్లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వాడీవేడిగా విందు రాజకీయం
♦ వికారాబాద్ కాంగ్రెస్‌లో సీనియర్ల మధ్య మాటామాటా ♦ పార్టీలో ఉంటారా? పోతారా? చెప్పాలని నిలదీత ♦ జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రసాద్ స్పష్టీకరణ ♦ కొందరి నమ్మకద్రోహం వల్లే ఓడిపోయానని ఆవేదన వికారాబాద్ కాంగ్రెస్‌లో సీనియర్ల మధ్య మాటామాటా పార్టీలో ఉంటారా? పోతారా? చెప్పాలని నిలదీత జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రసాద్ స్పష్టీకరణ కొందరి నమ్మకద్రోహం వల్లే ఓడిపోయానని ఆవేదన వికారాబాద్: కాంగ్రెస్ విందు రాజకీయం కాస్తా సీనియర్ల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో మాజీ కౌన్సిలర్ రత్నారెడ్డి తన ఫామ్‌హౌస్‌లో వికారాబాద్ కాంగ్రెస్ ముఖ్యనేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన నాయకులు.. కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చిం చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారడం.. పలువురు సీనియర్లు పార్టీని గులాబీ గూటికి చేరుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ కూడా హాజరైన నేపథ్యంలో జరిగిన సంభాషణ వాడీవేడి చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ప్రసాద్‌కుమార్ గతంలో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొని వెనక్కి తిరిగి వచ్చిన అంశాన్ని గుర్తుచేసిన మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మోహన్‌రెడ్డి.. ‘అసలు మీరు పార్టీలో ఉంటున్నారా? వెళ్లిపోతున్నారా? ఈ విషయాన్ని స్పష్టం చేయండి’ అని ప్రశ్నించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి దీటుగా స్పందించిన ప్రసాద్.. ‘నేను పార్టీ మారడంలేదు. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచా. కొందరి నమ్మకద్రోహం వల్ల ఓడిపోయా’ అని అన్నారు. ఒకరిద్దరు మరో నేతను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. నన్ను కాదని పార్టీలోకి ఎవరూ రాలేరని స్పష్టం చేశారు. డబుల్ గేమ్ ఆడకుండా పార్టీకోసం శ్రమిస్తే.. వచ్చే ఎన్నికల్లో మనదే విజయమని స్పష్టం చేశారు. అనుకోని పరిస్థితుల్లో తానేమైనా పొరపాట్లు చేస్తే పట్టించుకోవద్దని, సీనియర్లు మనసులో పెట్టుకోకుండా పార్టీ పటిష్టత కోసం తనతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా వివేక్ సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న నేపథ్యంలో విందు భేటీ జరిగిందనే వార్తలపై ‘సాక్షి’ ప్రసాద్‌కుమార్‌ను సంప్రదించగా.. గులాబీ గూటికి చేరాలనే ఆలోచన తనకులేదని, జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. -
వాట్సప్ మెసేజీలను మావాళ్లు చదవలేకపోతున్నారు
న్యూఢిల్లీ : వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్ ల మేసెజ్ లను డీక్రిప్ట్ (వ్యక్తీకరించడానికి) చేయడానికి భారత సెక్యురిటీ ఏజెన్సీలకు సాధ్యపడదని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో తెలిపారు. న్యాయపరంగా, టెక్నికల్ గా, రెగ్యులేటరీ పాలసీ వంటి కారణాలతో ఈ వాట్సాప్ మెసేజ్ లను చదివగలిగే ఆకృతులోకి మార్చడం కుదరదని పేర్కొన్నారు. వివిధ అప్లికేషన్ సర్వీస్ ప్రొవేడర్లు కల్పిస్తున్న ఎన్ర్కిప్టెడ్ కమ్యూనిషన్ తో వ్యవహరించేటప్పుడు సెక్యురిటీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఆ అప్లికేషన్లు ఎన్కిప్షన్ టెక్నాలజీని, యాజమాన్య ధృవీకరణ ప్రొటోకాల్స్ ను వాడుతూ మెసేజ్ లను భద్రంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు. మొబైల్ అప్లికేషన్లలో వాట్సాప్ అనేది సమాచారం మార్పిడికి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, ఇంటర్ నెట్ సేవలు కల్గి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉందని చెప్పారు. సెక్యురిటీ ఏజెన్సీలు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించి, వాటిని డీక్రిప్ట్ చేయడం సాధ్యపడదని, ఒకవేళ డీక్రిప్ట్ చేయాలనుకున్నా టెక్నికల్ గా, న్యాయపరంగా, రెగ్యులేటరీ పాలసీ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. టెలికాం సర్వీసు ప్రొవేడర్లతో పాటు సోషల్ మీడియా ప్రొవైడర్లతో రెగ్యులేటరీ ఎప్పడికప్పుడూ సమావేశమై దేశ భద్రత, అభివృద్ధి అంశాలు, సేవల విషయంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాల అమలు చేస్తుంటాయని చెప్పారు. ఇటీవలే వాట్సాప్ ద్వారా అందించే అన్ని సేవలకు ఎండ్ టూ ఎండ్ ఎన్ర్కిప్షన్ ను ఫేస్ బుక్ తీసుకొచ్చింది. ఉద్దేశించిన గ్రహీతలు మాత్రమే ఈ మెసేజ్ లు చదువుకోగలిగే రీతిలో దీన్ని రూపొందించారు. ఎన్ర్కిప్షన్ అనేది అత్యంత ప్రాముఖ్యం కల్గిన సాధనమని, ఈ కొత్త డిజిటల్ యుగంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులు భద్రతను, సెక్యురిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్ర్కిప్టెడ్ సర్వీసులకు, లా ఎన్ ఫోర్స్ మెంట్ లకు సంబంధించి చాలా చర్చలు జరిగాయని, అయితే ప్రజల సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్, హ్యాంకర్ల దగ్గర్నుంచి భద్రతగా ఉంచడమే లా ఎన్ ఫోర్స్ మెంట్ విధిగా గుర్తించామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
వీడిన బిషప్ కిడ్నాప్ మిస్టరీ
ఖాజీపేట: కడప మేత్రాసనం బిషప్ గల్లేల ప్రసాద్‌పై దాడి, కిడ్నాప్ మిస్టరీ వీడింది. విచారణ వేగాన్ని పెంచి మూడు రోజుల్లోనే పోలీసులు పురోగతి సాధించారు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించారు. దాదాపు 15 మందిని అనుమానితుల కింద అదుపులోకి తీసకున్నారు. రెండురోజులుగా నిందితులను వేర్వేరు స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్నారు. వారిలో చర్చి మత గురువు రాజారెడ్డి కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరో ఇద్దరు మత గురుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. బిషప్‌పై దాడి ఆర్థిక విషయాల కోసమే జరిగినట్లు తెలుస్తోంది. కడప మేత్రాసనంలో పోక్రోటర్ పదవి కీలకమైంది. ఆర్థిక లావాదేవీలన్నీ ఇతని ద్వారానే జరుగుతాయి. కోట్ల రూపాయలు ఎలాంటి ఆడిటింగ్ లేకుండానే మంజురు చేస్తారన్నట్లు సమాచారం. గతంలో ఈ పదవిలో ఉన్నవారు దాడికి కారణమయిన వారికి అనుకూలంగా ఉండేవారు. వారంతా బదిలీ కావడంతో ఈ పదవిలో తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకునే విషయంలో బేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో బిషప్‌పై తీవ్ర ఓత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అందుకు బిషప్ అంగీకరించకుండా వేరొకరిని నియమించడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. బిషప్ పై దాడి చేసి, బెదిరించైనా తమకు అనుకూలమైన వారిని నియమించు కోవాలనుకున్నారు. కేసు నమోదు కావడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. -
నేరం మోపడంతో ఒకరి ఆత్మహత్య
సొసైటీ ఎదుట మృతుని బంధువుల ఆందోళన నిందితులను శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ సీతంపేట : చేయని నేరం తనపై మోపారని మనస్తాపానికి గురై ఒక వ్యక్తి రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. దీంతో మృతుని శవంతో భార్య, కొడుకు, బంధువులు మృతుడు పనిచేసిన సొసైటీ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. మృతుని భార్య జానకీదేవి తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెం పోస్టాఫీస్ వీధిలో నివశిస్తున్న కె.ఎస్.ఎస్.డి.ఎస్.ప్రసాద్(65) సీతంపేట మధురానగర్‌లోని వైశాఖి మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో ఐదేళ్లుగా గుమస్తాగా పనిచేస్తున్నారు. మార్చి 24న రాత్రి సొసైటీలో దొంగతనం జరిగింది. సుమారు రూ.98వేల నగదు, 90 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ దొంగతనంపై ప్రసాద్‌ను అనుమానించి సొసైటీ చైర్మన్ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రసాద్‌ను పిలిపించి పోయిన వస్తువులు సొసైటీకి అప్పగించాలని ఆదేశించారు. సొసైటీలో దొంగతనం జరిగినపుడు ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగింది అన్న విషయాలు పూర్తి స్థాయిలో విచారించకుండా నేరం మోపడంతో తట్టుకోలేక వారం రోజుల కిందట ప్రసాద్ ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా జామి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిక్కులేని వారిమయ్యాం: ఒక తాళం తన భర్త వద్ద, మరొకటి సొసైటీ చైర్మన్ వద్ద ఉంటాయని, కానీ రె ండు తాళాలు తన భర్త వద్దనే ఉన్నట్టు బలవంతంగా సంతకం చేయించుకున్నారని మృతుని భార్య జానకీదేవి ఆరోపించారు. పోలీసులు, సొసైటీ యాజమాన్యం బతకనివ్వరని తన వద్ద ఆందోళన వ్యక్తం చేశారని, అప్పటి నుంచి కనిపించకుండా పోయిన తన భర్త ఇలా శవమై వచ్చారని జానకీదేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నామని, తన భర్త మరణంతో దిక్కులేనివారిమయ్యామని వాపోయింది. తన భర్తపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అసలు నేరస్తులను శిక్షించాలని, తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ద్వారకా సీఐ షణ్ముఖరావు బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో మృతుని కుమారుడు రమేష్, సామాజిక కార్యకర్త గుమ్మడి కామినాయుడు, బంధువులు పాల్గొన్నారు. -
అతడు విద్యార్థి కాదు..కూలీ
ఉస్మానియా ఆర్ట్సు కళాశాల లైబ్రరీ వెనక ఉన్న నీటి ట్యాంకులో యువకుడి మృతదేహం బుధవారం కలకలం రేపింది.బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, అతడు నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్- 2 ఉద్యోగాల సంఖ్య పెంచాలనే డిమాండ్ తోనే చనిపోయాడంటూ ఆరోపించారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు యత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. అతడి ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంత మంతా టెన్షన్ వాతావరణం నెల కొంది. మరో వైపు యువకుడి మృత దేహం పూర్తిగా డీ కంపోస్టై ఉండటంతో.. గుర్తించడం కష్టంగా మారింది. ఓ స్థాయిలో యువకుడి మృత దేహాన్ని గుర్తుపట్టేందుకు వచ్చిన మాణిక్యేశ్వర్ నగర్ వాసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసు విచారణలో అతడు విద్యార్థి కాదు..అడ్డా కూలీ అని, మాణిక్యేశ్వర్‌నగర్ వాసి అయిన ప్రసాద్ కుమారుడు బాబా అని తేలింది. -
కలకలం
సీఎంపై పేపర్ బంతితో దాడి బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో ఒక వ్యక్తి బాంబ్...బాంబ్ అంటూ చేతిలోని పేపర్‌బంతిని విసరడం కలకలం రేపింది. చివరికి అతను తాగుబోతు అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉదయభాను కళాసంఘం స్వర్ణోత్సవ సంబరాలు బెంగళూరులోని రవీంద్రకళాక్షేత్ర ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం సిద్ధరామయ్య ప్రసంగించడానికి వేదిక వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఆడిటోరియం మొదటి అంతస్తులోని ఓ వ్యక్తి...‘మీరు మా సమాజానికి ఏమి చేశారో మొదట చెప్పి ప్రసంగించాలి’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఆ వ్యక్తి ‘అంతా మీరే తింటున్నారు. మా కోసం ఏం చేశారో చెప్పేవరకూ నేను మిమ్మల్ని వదలను’ అంటూ చేతిలోని ఒక ఎర్రని వస్తువును బాంబ్..బాంబ్ అంటూ సీఎం ఉన్న వేదిక పైకి విసిరాడు. దీంతో కార్యక్రమంలో కలకలం చెలరేగింది. పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వస్తువును పరీక్షించగా కొన్ని మాత్రలపై కాగితాలను గుండ్రంగా చుట్టి దానిపై చాక్లెట్ రాపర్స్‌ను అతికించినట్లు తేలింది. దీంతో పోలీసులతో పాటు వేదికపైనే ఉన్న కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పలువురు సాహితీవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధరామయ్యపై పేపర్ బంతితో దాడికి యత్నించిన వ్యక్తి బీబీఎంపీ అరణ్య విభాగం ఉద్యోగి ప్రసాద్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిత్రదుర్గాలో మీడియాతో మాట్లాడుతూ...‘ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ఈ దాడికి పాల్పడి ఉండటాన్ని కొట్టిపారేయలేం. అయినా ఇలాంటివన్నీ ప్రజాస్వామ్యంలో సాధారణం. మా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పిస్తుంది’ అని అన్నారు. -
కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని నల్లవాగు బ్రిడ్జి పై గురువారం చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. కారు నల్లవాగు బ్రిడ్జి వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా, ప్రసాద్, రోడ్డు ప్రమాదం -
నిర్మాత ప్రసాద్‌పై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
-
యువరైతు ఆత్మహత్య
ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన భానోతు ప్రసాద్(27) బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్‌కు ఒకటిన్నర ఎకరా పొలం ఉంది. అందులో పెట్టిన పంట ఎండిపోవడంతో అప్పుల బాధకు తాళలేక బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
యూటర్న్!
► మనసు మార్చుకున్న ప్రసాద్ ► కాంగ్రెస్‌ను వీడేదిలేదని స్పష్టీకరణ ► డిగ్గీ ఫోన్ రాయబారం, సీనియర్ల బుజ్జగింపులతో మెత్తబడిన మాజీ మంత్రి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి.. టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గారు. అధినాయకత్వం, సీనియర్ల బుజ్జగింపులతో మెత్తబడ్డ ప్రసాద్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. గురువారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమై టీఆర్ఎస్లో చేరుతున్నారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఆయనతో రాయబారాలు నడిపింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో గురువారం పొద్దుపోయేవరకు సీఎల్పీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ తదితరులు ప్రసాద్‌తో చర్చలు జరిపారు. పార్టీ వీడడానికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయంగా విరోధిగా ఉన్న డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని, పొమ్మనలేక పొగ పెట్టడంలో భాగంగానే ఆయనకు టికెట్ ఇచ్చారని ప్రసాద్ కుండబద్దలు కొట్టారు. ఆది నుంచి తనకు వ్యతిరేకంగా పార్టీలో ఒకవర్గం పనిచేస్తోందని, ఈ వ్యవహారంలోనూ వారి హస్తం ఉండడంతో మనస్తాపానికి గురయ్యాయని అన్నారు. అంతేగాకుండా చంద్రశేఖర్ అభ్యర్థిత్వంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తనతో సంప్రదించకపోవడం కూడా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదే భరోసా! రాజకీయ భిక్ష ప్రసాదించిన పార్టీని వీడడం ధర్మం కాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వారించారు. పార్టీలో నీ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని, వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతల్లో కూడా వేరొకరి జోక్యం ఉండదని తేల్చిచెప్పారు. ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా హామీ ఇప్పిస్తానని చెప్పిన ఉత్తమ్.. డిగ్గీరాజాతో ఫోన్లో మాట్లాడించారు. ఆయన కూడా పార్టీ వీడొద్దని సముదాయించడంతో ప్రసాద్ శాంతించారు. ఇక ఈ నెల 21న ఢిల్లీలో సోనియాను కలిసేందుకు అపాయిట్మెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిల్లానేతలు కేఎల్లార్, మల్లేశ్, లక్ష్మారెడ్డి, శ్రీశైలంగౌడ్, శ్రీధర్ తదితరులు ప్రసాద్‌తో మరోసారి రాయబారం నడిపి పార్టీ వీడకుండా ఒప్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన ప్రసాద్ కొన్ని పరిణామాలతో మనసు చివుక్కుమన్నదని, అందుకే పార్టీ మారే అంశంపై ముఖ్యనేతలతో చర్చించానే తప్ప.. మారుతానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. కుటుంబంలాంటి పార్టీని వీడేదిలేదని, పార్టీ కోసం సీనియర్లతో కలిసి పని చేస్తానని అన్నారు. ఊగిసలాట! గులాబీ తీర్థం పుచ్చుకోవాలని దాదాపుగా నిర్ణయించుకొని చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్న ప్రసాద్.. సొంతపార్టీలో కొనసాగు తారా? లేదా కారెక్కుతారా? అనే అంశంపై చ ర్చోపచర్చలు జరుగు తున్నాయి. ఇంతదాకా వచ్చి ఇప్పుడు పార్టీలో కొనసాగడం కష్టమని కొందరు, నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారే తప్ప వెళ్లడం ఖాయమని మరి కొందరు అంటు న్నారు. పార్టీ మార్పిడిపై ప్రసాద్ కుమార్ స్పష్టత నిచ్చినందున... ఆయన పార్టీలోనే ఉంటారా? గులాబీలోకి చేరుతారా అనే అంశంపై కాలమే సమాధానం చెబుతుంది. -
పోలీసులను ఆశ్రయించిన వడ్డీ బాధితులు
వడ్డీ వ్యాపారులు తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారంటూ బాధితులు విశాఖ నాలుగో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని నర్సింహనగర్‌కు చెందిన డీఎస్ఎన్ రెడ్డి అనే వ్యక్తి వడ్డీకి అప్పులు ఇస్తుంటాడు. అతడి వద్ద స్థానికులైన బండారు సూర్యారావు, పార్వతి దంపతులు మూడేళ్ల క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వారి నుంచి ఐదు ప్రామిసరీ నోట్లు, ఐదు చెక్కులు తీసుకున్నారు. అప్పటి నుంచి నెలకు వెయ్యి చొప్పున వారు అతడికి వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే, ఆ వ్యాపారి ఇటీవల అసలు మొత్తం వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో బాధితులు తమ ఇంటిని విక్రయానికి పెట్టారు. అయితే, కొంటానంటూ ముందుకు వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తి బోగస్ పత్రాలిచ్చారంటూ వారిని బెదిరిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాధిత దంపతులు బ్యాంకులో ఉన్న తమ నగలను మరో మహిళ ఆర్థిక సాయంతో విడిపించుకున్నారు. కాగా.. సదరు మహిళ ఆ నగలను తన వద్దే ఉంచుకుని రేపుమాపు అంటూ తిప్పుకుంటోంది. దీంతో బాధిత దంపతులు బుధవారం సాయంత్రం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్‌ఎన్‌రెడ్డి, ప్రసాద్, మరో మహిళపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. -
పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
పర్చూరు: పంట ఎండిపోయిందనే మనస్తాపంతో బుధవారం ఉదయం పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన చిమటా ప్రసాద్(37) తనకున్న మూడెకరాలతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవ డంతో పంట ఎండిపోయింది. ఎండిపోయిన పంటను చూసి దిగులు చెందిన ప్రసాద్ పొలంలో పురుగుల మందు తాగాడు. అది గుర్తించిన గ్రామస్తులు హుటాహుటిన గుంటూరు తరలించగా..చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు. -
సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్
రోజర్ బిన్నీపై వేటు వైజాగ్‌కు టెస్టు హోదా ముంబై: భారత క్రికెటర్ సీనియర్ సెలక్షన్ కమిటీలో భారత మాజీ వికెట్ కీపర్, ఆంధ్రకు చెందిన మన్నవ శ్రీకాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్‌కు చోటు లభించింది. సౌత్ జోన్‌నుంచి ఇప్పటి వరకు సెలక్టర్‌గా ఉన్న రోజర్ బిన్నీ స్థానంలో ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ కమిటీలో చైర్మన్ సందీప్ పాటిల్‌తో పాటు విక్రమ్ రాథోడ్, సబా కరీం కొనసాగనుండగా...సెంట్రల్‌జోన్ నుంచి రాజీందర్ సింగ్ హన్స్ స్థానంలో రాజస్థాన్ మాజీ ఆటగాడు గగన్ ఖోడాకు అవకాశం దక్కింది. ఖోడా భారత్ తరఫున ఓపెనర్‌గా 2 వన్డేలు ఆడారు. తండ్రి సెలక్టర్ కావడం వల్ల స్టువర్ట్ బిన్నీ కెరీర్‌పై ప్రభావం పడుతోందని, అతను తన ప్రతిభతో ఎంపికైనా విమర్శలు ఎదుర్కొంటున్నాడని ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు మనోహర్ అభిప్రాయ పడ్డారు. అందు వల్లే రోజర్ బిన్నీని తప్పించామని, మున్ముందు స్టువర్ట్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని, అతను స్వేచ్ఛగా ఆడవచ్చని ఆయన అన్నారు. ఆరు కొత్త టెస్టు వేదికలు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)కు ఆనందం కలిగించే మరో నిర్ణయాన్ని బోర్డు ఏజీఎంలో తీసుకున్నారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంకు టెస్టు హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. వైజాగ్‌తో పాటు పుణే, రాజ్‌కోట్, ఇండోర్, ధర్మశాల, రాంచీ కూడా టెస్టు వేదికలు కానున్నాయి. ఈ వన్డే వేదికల్లో టెస్టుల నిర్వహణకు తగిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయని బోర్డు అభిప్రాయ పడింది. వైజాగ్‌లో ఇప్పటివరకు ఐదు వన్డేలు జరిగాయి. ఏసీఏ కార్యదర్శి, బీసీసీఐ ఉపాధ్యక్షుడు అయిన గోకరాజు గంగరాజు టూర్ ప్రోగ్రామ్ అండ్ ఫిక్స్చర్స్ కమిటీ చైర్మన్‌గా కూడా ఎంపికయ్యారు. -
ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి