
సాక్షి, ఏలూరు: జి.కొత్తపల్లిలో తనపై తెలుగుదేశం పార్టీ నేతలే దాడి చేశారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ నేతలే నాపై దాడి చేశారనేందుకు నా వద్ద ఆధారాలున్నాయని మీడియాకు చూపెట్టారు. టీడీపీ నాయకుల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు.
నన్ను హతమార్చి రాజకీయ హత్యగా చిత్రీకరించాలని చూశారని వెంకట్రావు అన్నారు. మా నాయకుడు గంజి ప్రసాద్ కుటుంబానికి మా ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న పాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ మండిపడ్డారు.