సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్ (88)కన్నుమూశారు. కొద్ది రోజులుగా లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో మృ తిచెందారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మ హాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించా రు. ప్రచార ఆర్భాటాలకు, పురస్కారాలకు దూరంగా ఉన్న ప్రసాద్ నడుస్తున్న నిఘం టువు వంటి వారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆయన విద్యాభాసమంతా మద్రాస్ లోనే జరిగింది.
పాత్రికేయులుగా, ఆంధ్రప త్రిక ఎడిటర్‌గా పని చేసి, పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రోషనారా, అక్బర్, ఆర్య చాణక్య, పృథ్వీరాజ్, షాజహాన్ వంటి చారిత్రక నవలలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. మితభాషి అయిన ప్రసాద్ మృతితో ఒక మంచి రచయితను, గొప్ప పాత్రికేయుడిని కోల్పోయామని పలు వురు పాత్రికేయులు, సాహిత్యాభిమానులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment