Senior Journalist and Novelist Pilla Krishnamurthy Passed Away- Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్టు వీరాజీ మృతి

Published Thu, Aug 19 2021 9:05 AM | Last Updated on Thu, Aug 19 2021 2:42 PM

Senior Journalist Pilla Krishnamurthy Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్ః ప్రముఖ నవలా రచయిత, సీనియర్‌ జర్నలిస్టు వీరాజీ (పిళ్ళా కృష్ణమూర్తి, 80) బుధవారం హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలోల మరణించారు. వీరాజీ ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమితో పాటు పలు ఆంగ్ల, హిందీ పత్రికల్లో సంపాదకుడిగా పని చేశారు. వీరాజీ కాలమిస్టుగా 2011లో గోల్డెన్‌ జూబ్లీ పూర్తి చేసుకున్నారు.

1990 నుంచి ఆంధ్రభూమి డైలీలో ప్రచురితమైన కాలమ్‌ ‘వీరాజీయం’మంచి పాఠకాదరణ పొందింది. తన అనుభవాల సమాహారంగా రాసిన ‘స్మృతి లయలు’ 106 వారాల పాటు కొనసాగింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వీరాజీ మృతి పట్ల ఆయన కుటుంబానికి బాలసాహిత్య పరిషత్‌ సంతాపాన్ని తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement