senior journalist
-
భక్తులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. పవన్ కు తిలక్ అదిరిపోయే కౌంటర్..
-
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన సీనియర్ జర్నలిస్ట్
-
జత్వాని కేసుపై పెట్టిన ఫోకస్.. పూనమ్ కౌర్ కేసుపై అదే స్పీడ్ ఉండాలి..
-
కరకట్ట కొంపలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు.. విజయవాడకు పారిపోయిన చంద్రబాబు
-
ఎన్నికల క్షేత్రంలో భేరి మోగింది
సార్వత్రిక ఎన్నికల భేరి మ్రోగింది. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అది పెద్ద ఎన్నికల క్రతువుకు ముహూర్తం ఖరారైంది. దేశమంతా లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం జెండా ఊపింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా? నేనా?.. విజయమా? పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. పోయినసారి మాదిరిగా ఈసారి కూడా ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపుతో అందరి జాతకాలు బయటపడతాయి. ఎవరి ధీమా వారిది. కొందరిది అతి విశ్వాసం. ఇక సర్వేలు, ప్రీ-పోల్, పోస్ట్-పోల్ అంచనాలు, బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, వికర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఎన్నికలు రాగానే సహజంగా జరిగే పెద్దతంతులో భాగమే ఈ చర్యలు. ఓటరు మదిలో ఏముందో? చివరికి కానీ తెలియదు. ఓటింగ్ సరళి, ఎన్నికలు, రాజకీయాలు, దేశం గురించి పుంఖాను పుంఖంగా ఉపన్యాసాలు దంచే మేధావులు సగంమంది అసలు ఓటే వెయ్యరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక దురదృష్టకర సంప్రదాయం. 60-70 శాతం మంది వేసే ఓట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి. మిగిలినవారు ఎప్పటికీ ప్రేక్షకులుగానే మిగిలిపోతారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు 67 శాతం మాత్రమే. అందులో మహిళల భాగస్వామ్యం కాస్త ఆశాజనకంగా వుంది. 33శాతం మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా వున్నారన్నది పచ్చినిజం. ఈసారి ఎట్లా ఉంటుందో చూడాలి. యువత పెరిగిన సమాజంలోకి వచ్చేశాం. అక్షరాస్యత పెరిగిన కాలంలోకి ప్రవేశించాం. ఈ క్రమంలో కులాల కుంపట్లు రగులుతూనే వున్నాయి, అవి పెరుగుతూనే వున్నాయి. ఇదొక విషాదం. రేపు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం వున్నాయి. మొత్తం 545 స్థానాలు కలిగిన లోక్ సభలో, దేశ అధికార పీఠాన్ని అధిరోహించాలంటే 272 స్థానాల్లో గెలవాలి. 2014, 2019 రెండు పర్యాయలలోనూ బీజేపీ / ఎన్డీఏ అఖండంగా గెలిచి, అధికారాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో బిజెపి మరింత బలపడింది, కాంగ్రెస్ ఘోరంగా చతికిలబడిపోయింది. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకున్న అధికార పార్టీ ఈసారి 370-400 సీట్లు సాధించాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈసారి గెలిచి, అధికారంలోకి వస్తే? బీజేపీ హ్యాట్రిక్ సాధించడమే కాక, అత్యంత శక్తివంతమైన పార్టీగా స్థిరపడిపోతుంది. ఈ క్రమంలో తమ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే పనిలోనూ పడిపోయింది. కూటమి నుంచి విడిపోయిన టీడీపీ వంటి పార్టీలను మళ్ళీ తీసుకొచ్చుకొని తన దొడ్లో కట్టేసుకుంటోంది. తటస్థంగా వున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు కూడా ఇంకా తటస్థంగానే వున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాటపై వున్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పదే పదే వెల్లడించారు. ఈ పదేళ్ల నరేంద్రమోదీ పాలనలో ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు మద్దతు పలికారు. కేంద్రంతో ఎటువంటి తగాదాలు లేకుండా స్నేహపూర్వకంనే వ్యవహరించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ది కూడా ఇంచుమించూ అదే తీరు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రయోజనాల వరకే తమను పరిమితం చేసుకున్నారు. కాకపోతే, ఈసారి బీజేడీతో ఎన్నికల బంధం ఏర్పరచుకోవడానికి బీజేపీ చూస్తోందని వింటున్నాం. సీట్ల సర్దుబాటు అంశం ఇంకా కొలిక్కిరాలేదు.దానిని బట్టిగానీ, ఆ ప్రయాణాన్ని అంచనా వేయలేం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను తాజాగా ఈ.డి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ అంశం వేడివేడిగా వుంది. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - బీఆర్ఎస్ మధ్య బంధం ఏర్పడుతుందని నిన్నటి దాకా వార్తలు గుప్పుమన్నాయి. కవిత అరెస్టు నేపథ్యంలో ఈ బంధం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. దక్షిణాదిలో బలోపేతం కావాలనే లక్ష్య సాధనలో బీజేపీ ఎంత వరకూ విజయం సాధిస్తుందన్నది ఈసారి అనుమానమే. కర్ణాటక, కొంత తెలంగాణలో తప్ప, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళలో బీజేపీ పుంజుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ వాతావరణం చూస్తుంటే, బీజేపీ చేపట్టిన పొత్తులు ఏ మాత్రం ఆ పార్టీకి లాభం తెచ్చిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఒరిస్సాలో బీజేడీ బలంగా వుంది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేని వాతావరణమే కనిపిస్తోంది. వైసీపీ ఒక్కటి ఒక వైపు - మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒక వైపు అన్నట్లుగానే వుంది. బీజేపీ -టీడీపీ -జనసేన ఒక పొత్తు కిందకు వచ్చాయి. షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ కూడా తన బాణాలను ప్రధానంగా జగన్ వైపే ఎక్కుపెట్టి యుద్ధం చేస్తోంది. తమ పథకాలు, ప్రజలపై అత్యంత విశ్వాసంతో జగన్ వున్నారు. కొత్త పొత్తుతో బలమైన శక్తిగా మారుతామనే నమ్మకంలో చంద్రబాబు, పవన్ వున్నారు. ఏపీలో ఏమవుతుందో చూద్దాం! తెలంగాణ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కవిత అరెస్టు అంశం కూడా తెలంగాణ రాజకీయ పార్టీలలో కొంత ప్రభావం చూపించకపోదు. ఎత్తుజిత్తులు బాగా ఎరిగిన కెసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో మళ్ళీ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన 'ఇండియా కూటమి' ఇంకా శక్తివంతంగా మారలేదు. ఆ కూటమిలోని నాయకుల మధ్య సయోధ్య పెద్దగా లేదన్నది బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జగన్ మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి ఎలాగైనా దించాలని ప్రతిపక్షాలన్నీ అనుకుంటున్నట్లుగా, కేంద్రంలో నరేంద్రమోదీని దించాలని విపక్షాలు అనుకుంటున్నాయి. ప్రతిపక్షాలు అలా అలోచించడం సహజమైన అంశం. ఆ మేరకు బలోపేతం కావడంలోనే అసలు రహస్యం దాగి వుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెద్ద ఎత్తున తేవాల్సిన అవసరం కూడా వుంది. కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత, నాయకత్వం పట్ల విశ్వసనీయత, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో బలంగా చెప్పగలగడం మొదలైన అంశాలు చాలా వున్నాయి. ఇవన్నీ సాధించకపోతే, కూటమి విజయం ఉత్తుత్తి ప్రగల్బాలుగానే మిగిలిపోతుంది. ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే, బీజేపీ పాలన పట్ల, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. ఈ పదేళ్ల సామాజిక పరిణామాన్ని గమనిస్తే, హిందూ భావజాలం, ఐక్యత పెరిగాయనే చెప్పాలి. దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువుల 'ఓటుశక్తి'పై బీజేపీ పెంచుకున్న విశ్వాసం కూడా పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధిలేమి, ప్రభుత్వ ఉద్యోగాలు సన్నగిల్లడం, అధిక ధరలు మొదలైనవి అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనే మాటలు వినపడుతున్నాయి. నరేంద్రమోదీ - అమిత్ షా ద్వయం తప్ప, మిగిలినవారికి స్వతంత్రత లేదని, కేంద్ర మంత్రులు సైతం డమ్మీలుగా మారిపోయారని, అంతా పిఎంఓ, గుజరాత్ గణమే చక్రం తిప్పుతున్నారనే మాటలు బలంగా వినపడుతున్నాయి. వీటన్నిటిని దాటుకుంటూనే నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ఇన్నాళ్లూ వరుస విజయాలు నమోదు చేసుకుంటూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లోనూ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, బీజేపీ అధికారంలో ఉండడం చారిత్రక అవసరంగా భావించి, మౌనముద్ర వహిస్తున్నారనే మాటలు వినవస్తున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి ఎంత ముఖ్యమో, కాంగ్రెస్‌కు అంతకంటే ముఖ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో, చంద్రబాబుకు అంతకంటే ముఖ్యం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
క్వాష్ పిటిషన్ కొట్టివేత! బాబు మళ్లీ జైలుకే..!
-
జర్నలిస్ట్ ఆనంద్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కుమార్ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆనంద్ ఢిల్లీలో గత 35 ఏళ్లుగా వివిధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సలహాదారు (నేషనల్ మీడియా) కార్యాలయంలో మీడియా కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్ పని చేశారు. అంతకు ముందు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పని చేశారాయన. తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఢిల్లీలోని సర్దార్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మరోవైపు ఆనంద్ మృతి పట్ల జర్నలిస్ట్ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. -
కేసులో మేటర్ లేదు..చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్
-
''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..''
పొద్దు మీకింది. మొగులు మీద చుక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ఎపటి తీర్గనే ఆనంద్ బాగ్ చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మాదోస్తుల అడ్డ.‘‘ఎలచ్చన్లు దగ్గర బడుతున్నయి. లీడర్లు ఏం జేస్తున్నరు?’’ అని సత్నారి అడిగిండు.‘‘ముందుగాల సర్వేలు జేపిచ్చిండ్రు’’ అని యాద్గిరిజెపిండు.‘‘సర్వేలు ఎందుకు?’’‘‘ఎవలకు ఎంత బలముందో ఎర్క జేస్కునేతందుకు.’’‘‘ఎర్క జోస్కోని ఏం జేస్తరు?’’‘‘ఎవ్వలికి ఎక్వ బలముంటె గాల్లకు ఎమ్మెల్యె టికిట్ఇస్తరు.’’‘‘టికిట్ రానోల్లు ఏం జేస్తరు?’’‘‘గోడ దుంకుతరు. లేకుంటె రెబల్ క్యాండిడేట్లుగ పోటి జేస్తరు.’’‘‘అన్ని పార్టిల లీడర్లు ఏం జేస్తరు?’’‘‘పాదయాత్రలు జేస్తరు. బస్సు యాత్రలు జేస్తరు.’’‘‘ఇంకేం జేసిండ్రు?’’‘‘పార్టీ కార్యకర్తలకు ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు.’’‘‘ఎవలితోని ఇపిచ్చిండ్రు?’’‘‘ముందుగాల బిచ్చపతి అనేటి బిచ్చగానితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు. ‘ఒక్క పది రూపాయలు దానమియ్యి. దానమిస్తె పున్యమొస్తది. నీ పేరు జెప్పుకోని బత్కుత. నీ పెండ్లాం పిల్లలు సల్లగుంటరు అనుకుంట బిచ్చమడ్గాలె. బిచ్చమేసె దాంక సతాయించాలె. ఇండ్లల్ల అడుక్కునేటప్పుడు గింత బిర్యాని పెట్టమ్మా, సోర్వ ఎయ్యమ్మా అని పాడాలె. ధర్మతల్లీ! నాకు బిచ్చమేస్తె మీ ఇంటికి లచ్చిందేవొస్తది. నీ మొగని జీతం బెర్గుతది. నీ బిడ్డ పెండ్లి అయితది. నీ కొడ్కుకు కొల్వు దొర్కుతది. నీ మెడలకు బంగారి గొల్సు, నడ్ముకు వడ్డాన వొస్తయి. చేతులకు బంగారి గాజులు,చెవులకు కమ్మలొస్తయి. నీ మొగడు దినాం నిన్ను మోటర్ల దిప్పుతడు. అమెరిక గొంచబోతడు. రొండంత్రాల బంగ్ల గట్టిస్తడు. నువ్వు ఏం గావాలన్నాఇస్తడు. గింత ఉడుకుడు బువ్వెయ్యమ్మా! గింత కూర, మామిడి తొక్కు బెట్టమ్మా! గిలాసల జెరంత సల్లబొట్టు బొయ్యమ్మా అని అనాలె. బిచ్చం బెట్టెదాంక ఇంటి ముంగటనే ఉండాలె. ఇయ్యాల బిచ్చమడ్గొస్తె రేపు ఓట్లుఅడ్గుడు మీకు అల్కగైతది’అనుకుంట బిచ్చపతి పాటం జెపిండు.థియరీ క్లాసులైనంక ప్రాక్టికల్స్ షురువైనయి. చిన్గిన అంగి, పైంటును పార్టీ కార్యకర్తలు దొడుక్కున్నరు. ఒక చేత్ల బొచ్చె, ఇంకో చేత్ల కట్టె బట్టుకున్నరు. కొందరు గుడి మెట్ల మీద గూసోని బిచ్చమడిగిండ్రు. కొందరు రేల్టేషన్ల, బస్టాండ్లల్ల బిచ్చమడిగిండ్రు. కొందరు గుడ్డోల్లు, కుంటోల్ల లెక్క యాక్టింగ్ జేస్కుంట బిచ్చమడిగిండ్రు.పొద్దు మీకినంకగా దినం అడ్క తెచ్చినయి గాల్లు బిచ్చపతికి సూబెట్టిండ్రు. గవ్విటిని జూసి గాడు మార్కులేసిండు.’’‘‘ఇంకెవలితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు?’’‘‘తిట్ల మీద పాటం జెపెటందుకు నర్సమ్మ అనేటామెను బిల్సిండ్రు. గామె తిట్లల్ల మషూర్. ముందుగాల తిట్టినంకనే గామె మాట్లాడ్తది. ‘నీ నోట్లె మన్నువడ. నీ ఇంట్ల పీన్గెల్ల. నీ దౌడల్ దగ్గర బడ. నీ తలపండు బల్గ. నీకు పిండం బెట్ట. నీ పెండ్లాం ముండమొయ్య. నీ ముక్కుల దూది బెట్ట. నీ చేత్ల జెష్ట మొల్వ. నీకు గజ్జి లెవ్వ. నీ యాపారం జెడ. నువ్వు ఆకల్తోని సావ. నువ్వు లంగవు. లఫంగవు.బట్టె బాజ్ గానివి. బద్మాష్వి. సన్నా సివి. దద్దమ్మవు. బేకార్గానివి. నక్కవు. గజ్జి కుక్కవు.పందివి. జిల్ల పుర్గువు. నీ కాల్లు చేతులిర్గ. నీకు గత్తర్ దల్గ’ అనుకుంట నర్సమ్మ తిట్ల దండకం సదివింది. తిట్ల దండకంను చపాయించి తలా ఒక కాపి ఇచ్చిండ్రు.’’‘‘ఇంకెవ్వరితోనైన ట్రేనింగ్ ఇపిచ్చిండ్రా?’’‘‘ఒక గూండాను బిలిసిండ్రు. మీటింగ్‌లను ఎట్ల చెడగొట్టాలెనో, సూటి జూసి కోడిగుడ్లు, టమాటలు, పాత చెప్పులు ఎట్ల ఎయ్యాలెనో గాడు నేరిచ్చిండు. ఒక బైరూపులోడు వొచ్చిండు. రంగు బూస్కోకుంటనే యేసాలు ఎట్ల ఎయ్యాలెనో జెపిండు.ఇంకొగాయిన వొచ్చిండు. ఏం లేకున్నా గంటలు,గంటలు ఎట్ల సీచ్ గొట్టాలెనో పాటాలు జెపిండు.’’గీ తీర్గ మా దోస్తులు మాట్లాడుకుండ్రు. -తెలిదేవర భానుమూర్తి, సీనియర్ జర్నలిస్ట్,99591 50491 -
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
హఫీజ్‌పేట్/సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా పేరుపొందిన ఆయన పూర్తిపేరు చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు. 1959 ఆగస్టు 9న ఆయన జన్మించారు. పాత్రికేయ రంగంలో కృష్ణారావు ప్రయాణం 1975లో ఒక రిపోర్టర్‌గా ప్రారంభమైంది. ఆతర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. గత ఏడాది ఆయన కేన్సర్ బారిన పడ్డారు, కృష్ణారావుకు భార్య లక్ష్మి, కుమారుడు కిరీటి, కూతురు కిన్నెర ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా కుమార్తె అమెరికాలో ఉన్నారు. కాగా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం కృష్ణారావు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. కృష్ణారావు మరణం తెలుగు రాష్ట్రాల్లో పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖుల నివాళి కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు ముఖ్యలు గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్‌కాలనీలో ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రాంచందర్‌రావు, జూలూరి గౌరిశంకర్, కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కృష్ణారావుకు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. కాగా, శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. -
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణా రావు కన్నుమూత
-
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గురువారం కన్నుమూశారు. కాగా, అనలిస్ట్‌గా నిక్కచ్చిగా వ్యవహరించారు కృష్ణారావు. ఆయన రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా సుపరిచితులు. చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు 1959లో ఏలూరు జన్మించారు. 1975లో ఒక స్ట్రింగర్‌గా నిరాడంబరమైన తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా ఆయన పలు తెలుగు, తెలుగు దినపత్రికల్లో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డెక్కన్ క్రానికల్‌లో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం ప్రయాణం సాగించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎం జగన్ సంతాపం సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘ తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. కిందిస్థాయి నుండి మంచి జర్నలిస్టుగా ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణారావు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. కృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ► సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావుమృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు. ► ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సానుభూతి ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ విఎం కృష్ణారావు గారి మృతి పట్ల ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ దాదాపు 5 దశాబ్దాలుగా పత్రిక రంగంలో, రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. 18 ఏళ్ల పాటు డెక్కన్ క్రానికల్ దిన పత్రికలో బ్యూరో చీఫ్ గా ఆయన సేవలు ఎనలేనివి.. ఆయన ప్రతిభ అసామాన్యమైనది’ అని తన సానుభూతి తెలిపారు. ప్రత్యేకంగా టీవీ డిబేట్లలో నిర్మాణాత్మక రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆయనకు ఆయనే సాటని, ఎందరో యువ జర్నలిస్టులకు కృష్ణారావు జీవితం ఆదర్శణీయమన్నారు. ► కృష్ణారావు మరణం అత్యంత బాధాకరం. తెలుగు రాష్ట్రాలలో కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా వారికున్న అవగాహన , పలు అంశాల్లో వారు చర్చలలో పాల్గోన్న తీరు, పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చలు వారి అభిప్రాయాలు అద్భుతం . నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా :::ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్దన్‌రెడ్డి ► ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు గా కృష్ణారావు సేవలు చిరస్మరణీయం. రాజకీయ, సామాజిక అంశాలపై ఎంతో అవగాహనతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణారావు చేసిన విశ్లేషణలు, టీవీ మాద్యమాల్లో జరిపిన చర్చలు ఎంతో ప్రేరణ కలిగించాయి. నిరాడంబరంగా, నిజాయితీగా సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు సాగించిన పాత్రికేయ జీవితం ఎంతో ఆదర్శప్రాయం. నాకు ఎంతో కాలంగా అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ సోదరుడు కృష్ణారావు మరణం నన్ను కలిచివేసింది. ఆయన మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. :::మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంతాపం ► పాత్రికేయ రంగంలో నేల కొరిగిన ధృవతార. సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు ఇక లేరన్న విషయం అత్యంత బాధాకరం .సిహెచ్ ఎం వి కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చల్లో నిష్పక్షపాతంగా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు అద్భుతం . పాత్రికేయు రంగం లో నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను . ::: శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
బెంగళూరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. -
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క!
ఒక ఆటగాడు ఓడిపోకుండా మైదానంలో ఎంతసేపు నిలబడగలిగాడు, మొత్తం విజయానికి ఏ విధంగా దోహదపడ్డాడు అనేది అతడి ట్రాక్ రికార్డ్‌కి సంకేతం. వ్యక్తిగత స్కోర్ కంటే కీలక ఘట్టాల్లో జట్టు విజయానికి అండగా నిలవడం చాలా ముఖ్యం. జర్నలిజం రంగంలో జి.యస్. వరదాచారి కూడా ఇలాంటి ఆటగాడే. ఆరు దశాబ్దాలకు పైబడి తెలుగు జర్నలిజం వికాసానికి, విలువలకు, జర్నలిస్టుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పాటుపడుతూ వచ్చిన కార్యదక్షుడు. మరో సుప్రసిద్ధ జర్నలిస్టు సి. రాఘవాచారికి వర్తించే మాటలే వరదాచారికీ సరితూగుతాయి. తలుపు తట్టిన అవకాశాన్ని వదులుకోకుండా ఇంగ్లిష్ జర్నలిజంలోకి వరదాచారి ప్రవేశించి ఉంటే ఏ కోటంరాజు రామారావో అయ్యేవారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన లాయర్‌గా ప్రాక్టీస్ చేసి ఉంటే ఏ నానాపాల్కీవాలానో అయి ఉండేవారు. యూనియనిస్టుగానే కొనసాగి ఉంటే మరో మానికొండ చలపతిరావు అయ్యేవారు. కానీ ఇవేవీ కావాలనుకోలేదు. కనుకే ఆయన గోవర్ధన సుందర వరదాచారి అయ్యారు. నమ్మిన సిద్ధాం తాల విషయంలో రాజీపడేవారు కారు. ఎదుటివారు ఏ భావజాలానికి చెందిన వారైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గోవర్ధన కృష్ణమాచార్యులు, జానకమ్మ దంపతులకు 1932 అక్టోబర్ 15న జన్మిం చారు. జర్నలిజంపై మక్కువతో విద్యార్థి దశలోనే కొంతకాలం ‘వైష్ణవ’ పత్రికను నడిపారు. జర్నలిజం వృత్తిలో ప్రవేశించడా నికి విద్యార్హతల పట్టింపు లేని ఆ రోజు ల్లోనే బి.ఏ. డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. కోర్సులో భాగంగా చెన్నైలోని ‘ది హిందూ’లో ఇంటర్న్‌షిప్ దిగ్వి జయంగా పూర్తిచేశారు. ఇంగ్లిష్ జర్నలిజంలో ప్రవేశించే అవకాశం వచ్చినా తెలుగు భాషపై మక్కువతో ఆ ఆఫర్‌ను కాదనుకుని 1956లో హైదరాబాద్‌లో ‘ఆంధ్ర జనత’లో చేరారు. జర్నలి జంలో చేరిన కొత్తల్లోనే సహోద్యోగుల సందేహాలను ఓపికగా విడమరిచి చెప్తుండేవారు. నాటి నుంచి వరదాచారిని ‘ప్రొఫెసర్’ అని పొత్తూరి వెంకటేశ్వరరావు పిలిచేవారు. ‘ఆంధ్ర భూమి’లో న్యూస్ ఎడిటర్‌గా రెండు దశాబ్దాలు, ‘ఈనాడు’లో అసిస్టెంట్ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించినప్పటి నుంచి జర్న లిజం శాఖ అధిపతిగా, ప్రొఫెసర్‌గా 22 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దారు. ప్రెస్ అకాడమీ సహా పలు విద్యా సంస్థల్లోనూ జర్నలిజం పాఠాలు బోధించారు. హెచ్ఎం టీవీలో తీర్పరిగా బాధ్యతలు చేపట్టి తెలుగులో తొలి అంబుడ్స్ మన్‌గా ఖ్యాతి గడించారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యాలయమైన దేశోద్ధారక భవన్ అనుమతి సాధనలో, నిర్మాణ నిధుల సేకరణలో ముఖ్య భూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘా నికి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్థాపక కార్యదర్శిగా, జర్నలిస్టుల గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా, జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిర్విరామ సేవలు అందిస్తూ వచ్చారు. వెటరన్ జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా రిటైరైన జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డుల కోసం పాటుపడ్డారు. పాత్రికేయులకు కరదీపికలుగా నిలిచే పలు పుస్తకాలను ఈ సంఘం తరఫున ప్రచురించారు. వరదాచారి తన ఆత్మకథను ‘జ్ఞాపకాల వరద’ పేరిట వెలువ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం నార్ల వెంకటే శ్వరరావుపై మోనోగ్రాఫ్ రాశారు. పత్రికా రచనలో దొర్లే పొర బాట్లను సోదాహరణంగా వివరిస్తూ రాసిన ‘దిద్దుబాటు’ కాలమ్‌ను అదే పేరుతో సంకలనంగా వెలువరించారు. పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషిస్తూ ‘ఇలాగేనా రాయడం?’ పేరుతో వ్యాసాల సంకలనం రూపొందించారు. వరదాచారి పాత్రికేయ స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన బహుముఖీన కృషికి దర్పణం పడుతూ ప్రముఖుల రచనలతో ‘వరద స్వర్ణాక్షరి’ వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. స్వీయ ప్రతిభతో, బహుముఖీన కృషితో తెలుగు జర్నలిజం రంగాన్ని ఆరు దశాబ్దాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చి పరిపూర్ణ జీవితం గడిపిన వరదాచారి ధన్యజీవి. తెలుగు పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క. గోవిందరాజు చక్రధర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సీనియర్ పాత్రికేయుడు కేఎల్ రెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీనియర్ పాత్రికేయుడు కంచర్ల లక్ష్మారెడ్డి (93) గురువారం కన్నుమూశారు. పూర్వపు నల్లగొండ జిల్లా పర్సాయపల్లికి చెందిన కేఎల్ రెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 15 రోజులుగా గ్రేటర్ వరంగల్‌లోని గొర్రెకుంటలో ఉన్న ఆనంద ఆశ్రమంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతిచెందారు. బంధువులు ఆయన భౌతికకా యానికి హైదరాబాద్‌లోని నాగోల్‌లో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సుదీర్ఘ పాత్రికేయ జీవితం 1950లో ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి కేఎల్ రెడ్డి తెలుగుదేశం పేరిట వచ్చిన రాజకీయ వారపత్రికతో జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, నేటి నిజం, సాయంకాలం, మహానగర్ ఇలా పలు పత్రికల్లో పనిచేశారు. ‘తెలంగాణ ప్రభ’ పేరుతో వారపత్రికను, ‘కాలేజీ విద్యార్థి’ పేరుతో మాస పత్రికను సొంతంగా నడిపారు. 1969 తెలంగాణ ఉద్య మం సమయంలో ఆ వార్తలతో ‘నేడు’ పేరిట 3 నెలలపాటు కరపత్రాన్ని వెలువరించారు. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక పత్రిక స్థాయిలో ‘నేడు’ను వెలువరించడం నేరంగా పరిగణించి ఆయనకు నెల రోజులు జైలుశిక్ష కూడా వేశారు. సీఎం, ప్రముఖుల సంతాపం సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి పత్రికా రంగానికి నిస్వార్థ సేవలు అందించారని, ఆయన మృతి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ఐజేయూ, టీయూడబ్ల్యూజే నివాళి సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, కేఎల్ రెడ్డిల మృతిపట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రగాఢ సంతాపం వ్యక్తం ప్రకటించాయి. తెలుగు పత్రికా రంగం ఒకేరోజు ఇద్దరు పాత్రికేయ దిగ్గజాలను కోల్పో యిందని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సీనియర్ జర్నలిస్టు జీఎస్ వరదాచారి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు గోవర్ధన సుందర (జీఎస్) వరదాచారి (92) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. పంజాగుట్ట జర్నలిస్టు కాలనీలో నివాసం ఉండే ఆయనకు భార్య సరోజిని, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. భార్య 2000 సంవత్సరంలోనే చనిపోయారు. వరదాచారి మృతి పట్ల పలువురు ప్రముఖులు, సీనియర్ పాత్రికేయులు సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం పంజాగుట్ట çశ్మశానవాటికలో వరదాచారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుదీర్ఘ పాత్రికేయ జీవితంతో.. జీఎస్ వరదాచారి 1932లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జన్మించారు. న్యాయవాద కోర్సుతోపాటు జర్నలిజంలో డిప్లొమా చేశారు. 1956 ఒక తెలుగు దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. 1961లో ఆంధ్రభూమి దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా చేరి 22 ఏళ్లు పనిచేశారు. 1983లో ఈనాడులో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. అనంతర కాలంలో తెలుగు విశ్వవిద్యాలయం, ఇతర యూనివర్సిటీలు, ప్రముఖ దినపత్రికల జర్నలిజం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతుల్లో ‘పత్రికల భాష’ అంశంపై శిక్షణ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. సంతాపం తెలిపిన ప్రముఖులు జర్నలిజంలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు వరదాచారి తీసుకున్న చొరవ యావత్ పాత్రికేయ సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జర్నలిజంపై జీఎస్ వరదాచారి బోధనలు నేటి తరానికి గొప్ప స్ఫూర్తి అని, ఆయన మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. వరదాచారి మృతిపట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు, కార్యదర్శి కె.లక్ష్మణ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిజానికి సుదీర్ఘ సేవలు: సీఎం కేసీఆర్ జీఎస్ వరదాచారి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా జర్నలిజం రంగానికి సేవలందించారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ గోపాల్‌రెడ్డి దుర్మరణం
సాక్షి,అమరావతి/ తిరుమల: రాయల సీమాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి పట్టణానికి చెందిన మబ్బు గోపాల్‌రెడ్డి(75) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను కవర్ చేసేందుకు తిరుమల వచ్చిన గోపాల్‌రెడ్డి బుధవారం రాత్రి బైక్‌పై తిరిగి తిరుపతికి వెళుతుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 12వ మలుపు వద్ద కిందపడి రక్షణ గోడను ఢీకొట్టారు. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? తీవ్రంగా గాయపడిన ఆయనను తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. పలు ప్రముఖ దిన పత్రికల్లో పనిచేసిన గోపాల్‌రెడ్డి.. ప్రస్తుతం యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు. ఆయన మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన సజ్జల సీనియర్ జర్నలిస్ట్ మబ్బు గోపాలరెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గోపాలరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. -
సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది. ఆచార్య చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్ బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్రావుకు ఓయూ డాక్టర్ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
ఆ విమర్శలతో నా నటనలో మార్పు వచ్చింది: చిరంజీవి
Chiranjeevi Condolence To Gudipudi Srihari: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (88) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుడిపూడి శ్రీహరి మరణం పట్ల పలువురు సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 'గుడిపూడి శ్రీహరి గారు ఓ నిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీ విమర్శకుడు. నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు.. నటుడిగా నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోవడానికి ఎంతో ఉపకరించాయి. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను' అని చిరు ట్విట్ చేశారు. అలాగే మరోవైపు ఇటీవల ఓ కార్యక్రమంలో గుడిపూడి శ్రీహరి గురించి చిరంజీవి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ శ్రీహరికి నివాళి అర్పిస్తున్నారు. గుడిపూడి శ్రీహరి గారు ఓనిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీవిమర్శకుడు.నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు,నటుడిగా నన్నునేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోడానికి ఎంతో ఉపకరించాయి.ఆయన మరణం సినీ పాత్రికేయరంగానికి తీరనిలోటు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను pic.twitter.com/wCTFIrQby3 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 5, 2022 ఈ వీడియోలో ''నా నట జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన వారిలో గుడిపూడి శ్రీహరి, పీఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్ తదితర జర్నలిస్ట్‌లు ఉన్నారు. నా సినిమా సెట్లో వారితో చర్చించి ఎన్నో విషయాలు నేర్చుకునేవాడిని. ఆరోగ్యకరం జర్నలిజం అంటే ఏంటో వారి దగ్గర తెలుసుకున్నా. ఒకప్పుడు గుడిపూడి శ్రీహరి 'సితార'లో సినిమా రివ్యూలు రాశేవారు. ఆయన పదజాలం కొంచెం హార్ష్‌గా అనిపించినా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి చెబుతున్నట్లు ఉండేది. నేను బాగా నటిస్తున్నాని, పోరాటాలు, డ్యాన్సులు అన్నింటిల్లో వేగం పెంచానని ప్రశంసిస్తూనే డైలాగ్‌లు చాలా వేగంగా చెబుతున్నానని విమర్శించారు. 'నటనలో స్పీడ్ ఉండాలి గానీ మాటల్లో కాదు. మనం చెప్పే మాట ముందు మన చెవికి వినపడాలి. తర్వాత ఇతరులకు వినపడాలి' అని చెప్పి నాలో మార్పు తీసుకొచ్చారు'' అని చిరంజీవి పేర్కొన్నారు. -
విషాదం.. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత..
Gudipudi Srihari Passed Away: ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గతేడాది నవంబర్‌లో శ్రీహరి భార్య లక్ష్మీ మరణించారు. అయితే భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన ఆయన ఇంట్లో జారి పడటంతో తొంటి వెముక విరిగింది. దీంతో నిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అయితే ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. శ్రీహరి కుమారుడు స్వదేశానికి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం. గుడిపూడి శ్రీహరి 1968లో 'ది హిందూ'కు కంట్రిబ్యూటర్‌గా పాత్రికేయ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అనంతరం ఈనాడు, ఫిల్మ్ ఫేర్ వంటి పత్రికలలో పనిచేశారు. హైదరాబాద్ ఆల్ ఇండియఆ రేడియోలోనూ న్యూస్ బ్రాడ్ కాస్టర్‌గా రాణించారు. సుమారు 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా చిత్ర పరిశ్రమకు సెవలందించారు. 1969 నుంచి ది హిందూ పత్రికలో రివ్యూలు రాయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక తెలుకు సినిమాలకు రివ్యూలు రాశారు. 1985లో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్న 'మాకూ స్వాతంత్య్రం కావాలి' సినిమాకు శ్రీహరి మాటలు రాశారు. 2013 సంవత్సరానికి గానూ ఆయనకు తెలుగు విశ్వవిద్యాలయం 'పత్రికా రచన'లో 'కీర్తి పురస్కారాన్ని' ప్రకటించింది. గుడిపూడి శ్రీహరి మృతిపట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ? హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. -
సీనియర్ పాత్రికేయుడు శ్రీరంగనాథ్ మృతి
సాక్షి, అమరావతి/అమలాపురం: కోనసీమకు చెందిన సీనియర్ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్ (78) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన శ్రీరంగనాథ్ పాత్రికేయ ప్రస్థానం నాలుగు దశాబ్దాల పాటు సాగింది. శ్రీరంగనాథ్ ఉదయం దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్‌గా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఉదయం స్టేట్ బ్యూరోలో కూడా పనిచేశారు. వార్త దిన పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా, ఏపీ టైమ్స్ ఆంగ్ల పత్రిక బ్యూరో చీఫ్‌గా, ఆంధ్రప్రభ దినపత్రిక న్యూస్ నెట్ వర్క్ ఇన్ఛార్జిగా, సాక్షి దినపత్రిక కాలమిస్ట్‌గా పనిచేశారు. కమ్యూనిస్ట్ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ఇండియా మార్ట్గేజ్డ్ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్ తాకట్టులో భారతదేశం పేరుతో అనువదించారు. శ్రీరంగనాథ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సీఎం సంతాపం శ్రీరంగనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీరంగనాథ్ మృతి పత్రికా లోకానికి తీరని లోటని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జీవితాంతం బలమైన వామపక్ష రాజకీయ దృక్పథాన్ని ఆచరిస్తూ.. నీటిపారుదల రంగంలో డెల్టా వ్యవస్థ మెరుగుదలపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారని కొనియాడారు. మంగళవారం శ్రీరంగనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరంగనాథ్ ఎంతో మంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు. -
సీనియర్ పాత్రికేయుడు ప్రసాద్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్ (88)కన్నుమూశారు. కొద్ది రోజులుగా లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో మృ తిచెందారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మ హాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించా రు. ప్రచార ఆర్భాటాలకు, పురస్కారాలకు దూరంగా ఉన్న ప్రసాద్ నడుస్తున్న నిఘం టువు వంటి వారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆయన విద్యాభాసమంతా మద్రాస్ లోనే జరిగింది. పాత్రికేయులుగా, ఆంధ్రప త్రిక ఎడిటర్‌గా పని చేసి, పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రోషనారా, అక్బర్, ఆర్య చాణక్య, పృథ్వీరాజ్, షాజహాన్ వంటి చారిత్రక నవలలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. మితభాషి అయిన ప్రసాద్ మృతితో ఒక మంచి రచయితను, గొప్ప పాత్రికేయుడిని కోల్పోయామని పలు వురు పాత్రికేయులు, సాహిత్యాభిమానులు తమ సంతాపాన్ని తెలియజేశారు. -
మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత, ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ చందన్ మిత్రా (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ఎడిటర్, పొలిటీషియన్ చందన్ మిత్రా అస్తమయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా కూడా ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి ఒక ఫోటో షేర్ చేశారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్ మిత్రా రాజీనామా చేశారు. Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 2, 2021 I am posting a photograph of Chandan Mitra and me together during a school trip in 1972. Be happy my dear friend wherever you are. Om Shanti pic.twitter.com/58vMvU6Wa9 — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 -
సీనియర్ జర్నలిస్టు వీరాజీ మృతి
సాక్షి, హైదరాబాద్ః ప్రముఖ నవలా రచయిత, సీనియర్ జర్నలిస్టు వీరాజీ (పిళ్ళా కృష్ణమూర్తి, 80) బుధవారం హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలోల మరణించారు. వీరాజీ ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమితో పాటు పలు ఆంగ్ల, హిందీ పత్రికల్లో సంపాదకుడిగా పని చేశారు. వీరాజీ కాలమిస్టుగా 2011లో గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు. 1990 నుంచి ఆంధ్రభూమి డైలీలో ప్రచురితమైన కాలమ్ ‘వీరాజీయం’మంచి పాఠకాదరణ పొందింది. తన అనుభవాల సమాహారంగా రాసిన ‘స్మృతి లయలు’ 106 వారాల పాటు కొనసాగింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వీరాజీ మృతి పట్ల ఆయన కుటుంబానికి బాలసాహిత్య పరిషత్ సంతాపాన్ని తెలియజేసింది.