
సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి కన్నుమూత
సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి కన్నుమూశారు.
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణ మూర్తి గతంలో పలు పత్రికల్లో పనిచేశారు. ప్రస్తుతం ది హిందూకు సినిమా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
సురేష్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి హరీష్‌రావు, తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని పలువురు జర్నలిస్టులు కంటతడి పెట్టారు.