
వినోద్ వర్మ
రాయ్‌పూర్ : గత ఏడాది కలకలం రేపిన సెక్స్ సీడీ ఉదంతంలో పేరు వినిపించిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. అశ్లీల సీడీ కేసులో బీజేపీ నేత ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు మేరకు 2017 అక్టోబర్‌లో వర్మను ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సీడీ పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేశారని పాండ్రి పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు చేయడంతో వర్మను అరెస్ట్ చేశారు.
ఇక వర్మతో సహా సీఎంకు నలుగురు సలహాదారులను నియమిస్తూ చత్తీస్‌గఢ్ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ దినపత్రిక ఎడిటర్‌గా రాజీనామా చేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మరో జర్నలిస్టు రుచిర్ గార్గ్‌ను సీఎం మీడియా సలహాదారుగా నియమించారు. ఇక ప్రదీప్ శర్మ ప్రణాళిక, విధాన, వ్యవసాయ సలహాదారుగా, రాజేష్ తివారీ పార్లమెంటరీ సలహాదారుగా నియమితులయ్యారని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment