advisor
-
వియ్యంకుడికి ట్రంప్ కీలక పదవి
ఫ్లోరిడా:రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన టీమ్‌లో ఒక్కొక్కరిని నియమించుకుంటున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్పటేల్గా నామినేట్ చేసిన మరుసటి రోజే తన ప్రభుత్వానికి పశ్చిమాసియా వ్యవహారాల్లో సలహాదారుగా మసాద్ బౌలోస్‌ను ట్రంప్ నియమించుకున్నారు.అరబ్,మిడిల్ఈస్ట్ వ్యవహారాల్లో అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా మసాద్ సేవలందిస్తారని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం ద్వారా ట్రంప్ వెల్లడించారు. లెబనీస్-అమెరికా వ్యాపారవేత్త అయిన మసాద్ ట్రంప్ కుమార్తె టిఫానీకి మామ,ట్రంప్‌కు వియ్యంకుడు కావడం గమనార్హం.గాజాపై ఇజ్రాయెల్ దాడుల అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్ ఓటర్లను ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వైపునకు మళ్లించడంలో మసాద్ కీలకంగా పనిచేశారు.జనవరి 20న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. -
ప్రభుత్వ వ్యవహారాల్లో సహాయకులుగా వ్యవహరించేందుకు ..సలహాదారుల మండలి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సజావుగా సాగే క్రమంలో తనకు సహాయకారులుగా ఉండడానికి వీలుగా సలహాదారులతో కూడిన మండలిని ఏర్పాటు చేసుకునే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాటయ్యే సలహామండలికి (అడ్వయిజరీ బోర్డు) చైర్మన్‌గా లేదంటే ముఖ్య సలహాదారుడిగా తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం నియమితులయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తునట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే కీలక శాఖలపై పట్టు సాధించేపనిలో పడ్డారు. రాష్ట్ర మనుగడలో కీలకమైన ఆర్థికశాఖతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్రచర్చకు కారణమైన విద్యుత్, సాగునీటి రంగాలపై ఆయన అధికారులను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగారు. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం రాష్ట్రంలోని కీలకశాఖల్లో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు త్వరలోనే ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయి. మలిరోజే విద్యుత్‌శాఖపై సమీక్ష ప్రభుత్వం కొలువుదీరిన రోజే జరిగిన మంత్రివర్గ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కేబినెట్ భేటీలో విద్యుత్ రంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ మరుసటిరోజే ఆ శాఖపై పూర్తిస్థాయిలో సమీక్ష చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న రేవంత్ వ్యాఖ్యలు ఆ శాఖలో తీవ్రచర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కరెంట్ గురించి గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేదని, ఈ నేపథ్యంలోనే కరెంటు ప్రగతికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనలతోనే సీఎం ఆ శాఖను టార్గెట్ చేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి ఐదేళ్లుగా కరెంట్‌ను తీసుకున్నారని, బహిరంగమార్కెట్లో అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని లెక్కలతో సహా వెల్లడించారు. ఒకవేళ కరెంట్ కొనుగోలులో అవినీతి జరిగి ఉంటే దానిని కూడా ప్రజల ముందు ఉంచేందుకే రేవంత్ సిద్ధమవుతున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా చేసిన ఖర్చులు, రాబడులకు సంబంధించిన వివరాలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ అధికారులకు తొలి కేబినెట్ భేటీలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చన రేవంత్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. తర్వాత ప్రాజెక్టులపై దృష్టి విద్యుత్, ఆర్థిక రంగాలపై సమీక్షలు, యాక్షన్‌ప్లాన్ తర్వాత సీఎం రేవంత్ సాగునీటి రంగంపై దృష్టి సారించే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు–రంగారెడ్డిపై ఆయన ప్రత్యేక కసరత్తు చేస్తారని సమాచారం. -
పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి.. చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ లాభమేనా?
నేను ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వం నుంచి హెల్త్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంది. అయినా కానీ, నేను వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలా? – అమిత్ సోలంకి ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా హెల్త్ స్కీమ్‌ల కింద కవరేజీ ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) కింద రక్షణ లభిస్తుంది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సైతం ఈ పథకం కింద కవరేజీ లభిస్తుంది. అలాగే, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున హెల్త్ కవరేజీ ఉద్యోగులకు ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్, వెస్ట్ బెంగాల్ హెల్త్ స్కీమ్ ఇందుకు ఉదాహరణలు. ప్రభుత్వ, ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లో వైద్య కిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు వీటి పరిధిలో కవరేజీ వస్తుంది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగ చికిత్సలకూ వీరు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. అత్యవసర చికిత్స/వైద్యం, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు పరిహారం వస్తుంది. కాకపోతే అన్ని రకాల ఆస్పత్రుల్లో చికిత్సలు పొందే వెసులుబాటు ఉండదు. ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితంగా ఉంటుంది. పైగా ప్రభుత్వ ఆమోదిత ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. ప్రధాన పట్టణాల్లోనే ఇవి ఉంటాయి. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉంటుందో ముందు తెలుసుకోండి. అక్కడ ఉండే వసతులు ఏ మేరకో విచారించుకోవాలి. ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన వసతులతో అందుబాటులో లేకపోయినా, లేదంటే అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని ఆస్పత్రిలో వైద్యం పొందాలనుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రైవేటు బీమా సంస్థ నుం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి ట్రాక్ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో పే షరతును ఆమోదించాల్సి రావచ్చు. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. కనీసం రూ.5 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ కవరేజీ ప్లాన్‌ను తీసుకోవాలి. పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు లాభదాయకమేనా? – ఆశా పిల్లల కోసం ఏ తరహా పెట్టుబడి అనుకూలంగా ఉంటుంది? వారు చాలా చిన్న వయసులోనే ఉంటే ఈక్విటీ ఫండ్స్ అనుకూలం. మీకు ఈక్విటీల పట్ల తగినంత అనుభవం ఉంటే, వీలైనంత ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. 10–12 ఏళ్లపాటు పిల్లల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారు కాలేజీలోకి అడుగు పెట్టే సమయం వస్తుంది. దానికి మూడేళ్ల ముందే సన్నద్ధం కావాలి. మొదటి సంవత్సరం కాలేజీకి కోసం కావాల్సిన మొత్తాన్ని మూడేళ్ల ముందే వెనక్కి తీసుకోవాలి. కాలేజీ రెండో సంవత్సరం కోసం కావాల్సిన మొత్తాన్ని ఏడాది విరామం తర్వాత తీసుకోవాలి. ఇలా చేస్తే మార్కెట్లో ఆటుపోట్లు ఉన్నా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎవరైనా కానీ, పిల్లల విద్య కోసం ఈక్విటీల్లో మదుపు చేస్తున్నట్టు అయితే ఈ విధానాన్ని అనుసరించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు అంత అర్థవంతమైనవి కావు. ఎందుకంటే అనవసరమైన నిర్బంధాలు వీటిల్లో ఉండడమే కారణం. -
బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ అమెరికన్‌కు మరోసారి తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విధానాల్లో నిపుణురాలైన భారత సంతతికి చెందిన నీరా టాండన్‌ను తన దగ్గర దేశీయ విధాన సలహాదారుగా నియమించారు. బైడెన్ ప్రభుత్వ విధానాలు రచించడం, వాటిని అమలు పరిచే బాధ్యతల్ని ఆమెకు అప్పగించారు. శ్వేత సౌధం విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్‌కు చోటు లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటి సారి. ‘‘ఆర్థిక విధానాల దగ్గర్నుంచి జాతి సమానత్వం వరకు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆరోగ్యం, విద్య, వలస విధానాలను రూపొందించడం, వాటిని పక్కాగా అమలు జరిగేలా చూడడానికి టాండన్‌ను డొమెస్టిక్ పాలసీ అడ్వయిజర్‌గా నియమిస్తున్నాను’’ అని బైడెన్ ప్రకటించారు. టాండన్ ప్రస్తుతం అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఒబామా, క్లింటన్ ప్రభుత్వాల్లో కూడా ఆమె పని చేశారు. -
టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు
తిరుపతి అలిపిరి : టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయా సమావేశాల్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామగ్రి అందించాలని, మానవాళి శ్రేయస్సుకు యాగాలు, హోమాలు నిర్వహించాలని, ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. -
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా పద్మజ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఓ జీవోను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఓ జీవో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏఆర్ అనురాధ పేరిట ఆ జీవో విడుదల అయ్యింది. -
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2024లో ప్రజలు మళ్లీ సీఎం జగన్‌కు పట్టం కట్టడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ మనసున్న నాయకుడు...ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే.. అందరం అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలి’’ అని అలీ అన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ
-
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
సాక్షి, విజయవాడ:సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ మీడియా ఏపీ ప్రభు త్వ సలహాదారునిగా సినీనటుడు మహ్మద్ అలీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారని జీఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సలహాదారుడిగా డా. వాసుదేవరెడ్డి
సాక్షి, అమరావతి: అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్. వాసుదేవరెడ్డి ఆర్. నలిపిరెడ్డిని వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ నియమించింది. ఎన్.ఆర్.ఐ మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, అలాగే చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవరెడ్డి కృషి చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీత భత్యాలు ఆశించకుండా పనిచేసేందుకు ఆయన ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే దివంగత వైఎస్సార్ ఆశయాలను సాధించటమే లక్ష్యంగా, ఎన్ఆర్ఐలను సమీకృతం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడించారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు డాక్టర్లను సమస్వయం చేసి తమ సొంత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా పాటు పాడుతా నన్నారు. అమెరికాలో అమలవుతున్న అత్యంత అధునాతన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ రంగం ఏపీకి చేరువయ్యేలా పనిచేస్తామని, అలాగే వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల సేకరణ, నిధుల సమీకరణకు కృషి చేస్తానని వాసుదేవరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం బుచ్చిరెడ్డి కండ్రిగ వాసుదేవరెడ్డి స్వస్థలం. విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీ ఎంబిబీఎస్ పూర్తి చేసిన ఆయన అసంతరం అమెరికా వెళ్లి మెల్ బోర్న్ (ఫ్లోరిడా ఆయన సేవలు అందిస్తున్నారు. -
వైట్‌హౌస్‌లో భారతీయ ఆరతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్‌ను నామినేట్ చేయడంతో ‘ఆ పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలు’ అనే ప్రశంసలతో పాటు, ‘ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది... దిల్లీలో జన్మించింది ఆరతి ప్రభాకర్. తన మూడవ యేట కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. టెక్సాస్‌లోని లబ్బక్ సిటీలో పెరిగింది. ఆరతికి అమ్మ ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన విషయాలు చెబుతుండేది. ‘నీకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకోవాలి’ అని ఆమె తరచుగా చెప్పే మాట ఆరతి మనసులో బలంగా నాటుకుపోయింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ఆరతి. 34 ఏళ్ల వయసులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్స్ అండ్ టెక్నాలజీ (నిస్ట్)కి నాయకత్వం వహించింది. ‘నిస్ట్’కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. ‘నిఫ్ట్’ తరువాత రెచెమ్ (ఏరోస్పేస్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ) కార్పోరేషన్‌కు సీనియర్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ(డర్ప)కి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఆమె కెరీర్లో మరో ఘనతగా చెప్పుకోవాలి. రక్షణకు సంబంధించి భవిష్యత్కాల సాంకేతిక జ్ఞానానికి సంబంధించిన అధ్యయనం, ఆవిష్కరణలకు సంబంధించి అమెరికాలో ఇది శక్తివంతమైన సంస్థ. దీనికి నాయకత్వం వహించడం చిన్న విషయమేమీ కాదు. పెంటగాన్ ‘బ్లూ స్కై రిసెర్చ్ ఏజెన్సీ’గా ప్రసిద్ధి పొందిన ఈ సంస్థకు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ఊతం ఇచ్చింది ఆరతి. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... తాను కౌమారంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ‘ఆ సమయంలో కూడా ఎప్పటిలాగే ఉండేది తప్ప, ఏవో విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడేది కాదు. ఆ విషాద ప్రభావాన్ని నానై చూపించేది కాదు. ఒకానొక దశలో ఆమెకు నేను, నాకు ఆమే ప్రపంచం అన్నట్లుగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే మా అమ్మ అసాధారణమైన అమ్మ. సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టం. ఆ సేవాదృక్పథం ఆమెను ఎప్పుడూ చురుకుగా ఉండేలా చేసేది’ అని తల్లిని గుర్తుచేసుకుంటుంది ఆరతి. ప్రస్తుత విషయానికి వస్తే... ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే బాధ్యతను స్వీకరించబోతుంది ఆరతి. ఆమె గురించి అమ్మ మాటల్లో చెప్పాలంటే ‘సాహసం మూర్తీభవించే అమ్మాయి’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల్లో చెప్పాలంటే... ‘ప్రతిభావంతురాలైన, గౌరవనీయ శాస్త్రవేత్త’ అరవై మూడు సంవత్సరాల ఆరతి ప్రభాకర్...సెనేట్ అమోదముద్ర వేస్తే వైట్‌హౌస్ ఓఎస్టీపీ (ఆఫీస్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పాలసీ) ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టబోయే తొలి భారత సంతతి మహిళగా రికార్డ్ సృష్టిస్తుంది. ఆమెకు అభినందనలు. -
కమలా హారిస్ రక్షణ సలహాదారుగా శాంతి సేథి
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రక్షణ సలహాదారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శాంతి సేథి నియమితులయ్యారు. జాతీయ భద్రతా సలహాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆమె సమన్వయం చేయనున్నారు. శాంతి 1993లో యూఎస్ నేవీలో చేరారు. యూఎస్ నౌకాదళంలో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ డికేటర్ నౌక ఇన్చార్జ్గా పనిచేశారు. యూఎస్ యుద్ధ నౌక కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇండో అమెరికన్ ఆమే. భారత్‌కు వచ్చిన యూఎస్ నౌకకు తొలి మహిళా కమాండర్ కూడా. చదవండి: (ఏడాది కాలంలో దాదాపు 8 లక్షల వీసాల జారీ: డొనాల్డ్ హెఫ్లిన్) -
హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్ వివాదాస్పద నియామకం కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు రూ. 3 కోట్లు, ఎన్ఎస్ఈకి .. సుబ్రమణియన్‌కు.. మరో మాజీ ఎండీ, సీఈవో రవి నారాయణ్‌కు తలో రూ. 2కోట్లు, మాజీ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ వీఆర్ నరసింహన్‌కు రూ. 6 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా రామకృష్ణ, సుబ్రమణియన్ .. మూడేళ్ల పాటు మార్కెట్ ఇన్ఫ్రా సంస్థ లేదా సెబీ దగ్గర నమోదైన ఇతర మధ్యవర్తిత్వ సంస్థతో కలిసి పనిచేయకుండా నిషేధం విధించింది. నారాయణ్ విషయంలో ఇది రెండేళ్లుగా ఉంది. అటు కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకుండా ఎన్ఎస్ఈపై సెబీ ఆరు నెలలు నిషేధం విధించింది. కుట్ర కోణం.. ఈ మొత్తం వ్యవహారంలో చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేశారని సెబీ వ్యాఖ్యానించింది. ఎన్ఎస్ఈకి సంబంధించిన గోప్యనీయమైన సమాచారం (ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక ఫలితాలు మొదలైనవి) అన్నింటినీ యోగికి ఆమె చేరవేసేవారని, ఆఖరుకు ఉద్యోగుల పనితీరు మదింపు విషయంలో కూడా ఆయన్ను సంప్రదించేవారని.. సెబీ 190 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. యోగి సూచనల మేరకే ఆనంద్‌ను నియమించారని, ఎండీ.. సీఈవో స్థాయి అధికారాలన్నీ కూడా కట్టబెట్టారని, అడ్డగోలుగా జీతభత్యాలు పెంచారని తెలిపింది. ‘ముగ్గురి మధ్య జరిగిన ఈమెయిల్ సంప్రదింపులను చూస్తే గుర్తు తెలియని వ్యక్తితో (యోగి) చిత్ర, ఆనంద్ కుమ్మక్కై చేసిన కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంద్‌కు చిత్ర జీతభత్యాలు పెంచేవారు, అందులో నుంచి కొంత భాగాన్ని సదరు గుర్తు తెలియని వ్యక్తికి ఆనంద్ చెల్లించేవారు‘ అని వ్యాఖ్యానించింది. ఈ అవకతవకలన్నీ తెలిసినా, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్ సహ ఇతరత్రా అధికారులెవరూ గోప్యనీయ సమాచారం పేరిట ఆ వివరాలేవి రికార్డుల్లో పొందుపర్చలేదని సెబీ ఆక్షేపించింది. వివరాల్లోకి వెడితే.. చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా పని చేశారు. ఆ సమయంలోనే 2013లో ఆనంద్ సుబ్రమణియన్ రూ.1.68 కోట్ల వార్షిక వేతనంతో ఎన్ఎస్ఈలో చీఫ్ స్ట్రాటెజిక్ అడ్వైజరుగా నియమితులయ్యారు. అప్పుడు ఆయన బామర్ అండ్ లారీ అనే సంస్థలో రూ. 15 లక్షల వార్షిక వేతనం తీసుకునే మధ్య స్థాయి మేనేజరుగా ఉన్నారు. పైగా క్యాపిటల్ మార్కెట్లలో ఎటువంటి అనుభవం లేదు. అయినా ఆయన్ను పిలిచి మరీ ఎన్ఎస్ఈలో కీలక హోదా కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన వేతనం విడతల వారీగా 2016 నాటికి రూ. 4.21 కోట్లకు పెరిగింది. అప్పటికి ఆయన గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీకి సలహాదారుగా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన్ను ఎప్పటికప్పుడు అత్యుత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగిగా ప్రచారం చేసినా, ఎక్కడా ఆయన పనితీరు మదింపు చేసిన ఆధారాలేమీ లేవని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్
వాషింగ్టన్: వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా బారి నుంచి మనల్ని కాపాడే ఆయుధం మాస్క్ అంటూ వైద్యులు, పరిశోధకులు విపరీతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మాస్క్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసప్పటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ సూచనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. స్వయంగా ఆయన కరోనా బారిన పడినప్పటికి మాస్క్ విషయంలో తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఆయన అధికారులు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. మాస్క్ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ట్రంప్ ఉన్నత సలహాదారు ఒకరు కరోనా వ్యాప్తిని అరికట్టడలో మాస్క్ పని చేయదు అంటూ చేసిన ట్వీట్‌ని ట్విట్టర్ తొలగించింది. కరోనా గురించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని షేర్ చేస్తే.. ట్విట్టర్ తొలగించడం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: మీలో మాస్క్ మహారాజు ఎవరు? ) ఈ నేపథ్యంలో ఆదివారం ట్రంప్ సలహాదారు స్కాట్ అట్లాస్ ‘మాస్క్ పని చేస్తుందా? లేదు’ అంటూ దాని ప్రాముఖ్యతను తగించేలా ట్వీట్ చేయడంతో ట్విట్టర్ దాన్ని తొలగించింది. ఈ చర్యలపై వైట్‌హౌస్ ఇంకా స్పందించలేదు. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 2,17,000 మందికి పైగా అమెరికన్లు మరణించారు. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గినప్పటికి తాజాగా మళ్లీ పెరిగాయి. శుక్రవారం నాడు అమెరికాలో ఏకంగా 69, 400కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో కేసుల సంఖ్య 8 మిలియన్లు దాటింది. తాజాగా కేసుల సంఖ్య పెరగడం పట్ల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం టెస్టులు పెంచడం వల్లే కేసులు పెరిగాయన్నారు. ‘ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి అంటూ మీడియా అసత్య ప్రచారం చేస్తుంది. కానీ టెస్టులు పెంచడం వల్లనే కేసులు పెరిగాయి’ అన్నారు ట్రంప్. మాజీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ స్కాట్ గాట్లీబ్ మాట్లాడుతూ, "కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేలా జాతీయ వ్యూహం లేకపోతే దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తుంది" అన్నారు. అంతేకాక "రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం కానున్నాయి. వైరస్ వ్యాప్తికి మన దగ్గర ఎలాంటి నిరోధం లేదు" అన్నారు. -
పోలవరం సాంకేతిక సలహాదారుపై వేటు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక, న్యాయ సలహాల కోసం నెలకు రూ. 2 లక్షల వేతనంతో హెచ్‌కే సాహును ఏప్రిల్ 14, 2018న కన్సల్టెంట్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో కన్సల్టెంట్‌గా సాహును తొలగించే ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. (దేవినేని ఉమాకు మంత్రి అనిల్ సవాల్) -
ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయలు
సాక్షి, అమరావతి/కడప: లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న తన సొంత ఊరి ప్రజలను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సాంకేతిక ప్రాజెక్టుల సలహాదారు తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ముందుకొచ్చారు. వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లి గ్రామంలో మంచినీళ్ల ప్లాంటును యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయిస్తున్నారు. రూ. 7.5 లక్షల వ్యయంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో ప్రజలందరికీ ఉచితంగా శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేయనున్నారు. గ్రామంలో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేదలు, ఆర్థికంగా వెనుకబడిన 600 కుటుంబాలకు రూ. వెయ్యి (రూ. 6 లక్షలు) చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. దీంతో పాటు జాతీయ రహదారి నుంచి గ్రామంలోపలి వరకూ 1.2 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశారు. లోకేశ్వర్‌రెడ్డి సోదరుడు త్రిలోక్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. లోకేశ్వర్‌రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘అదరద్దు, బెదరద్దు.. నిర్లక్ష్యం అసలే వద్దు’ అన్న నినాదంతో తమ గ్రామంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరోనాపై అవగాహన కల్పించారు.ఈ ప్రమాదకరమైన వైరస్‌ను సామాజిక దూరం పాటించడం ద్వారానే తరిమిగొట్టగలమని ప్రజలకు వివరించారు. -
ఏపీ సీఎం ఆర్థిక సలహాదారుగా సుభాష్ చంద్ర
-
ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించింది. సుభాష్ చంద్ర గార్గ్‌కు కేబినెట్ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. సుభాష్ చంద్ర గార్గ్‌కు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవముంది. గార్గ్.. రాజస్తాన్ కేడర్-1983 ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ గార్గ్ వ్యవహరించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు, సెబీ లో ఒక సభ్యునిగా కొనసాగారు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీలోనూ ఈయన సేవలు అందించారు. -
దేవులపల్లి అమర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్టు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జనరల్ సెక్రటరీ దేవులపల్లి అమర్ జాతీయ మీడియా-అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.పి. సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి అభీష్టం ఉన్నంత ఉన్నంతవరకూ అమర్ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి విధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. -
ఢిల్లీకి గంగూలీ సలహాలు...
న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు ‘ఢిల్లీ క్యాపిటల్స్’ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తమ సలహాదారుడిగా నియమించింది. అడ్వైజర్‌గా అతని బాధ్యతలపై పూర్తి స్పష్టత లేకపోయినా హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పని చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ సహ యజమాని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో సౌరవ్‌కు సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉంది. ‘జిందాల్ కుటుంబం నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఇప్పుడు వారితో జత కట్టడం సంతోషంగా ఉంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని సౌరవ్ వ్యాఖ్యానించాడు. తన దూకుడైన శైలితో భారత కెప్టెన్‌గా ప్రత్యేక ముద్ర వేసిన గంగూలీ తమతో కలిసి పని చేయనుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఢిల్లీ యజమాని పార్థ్ జిందాల్... అతని అనుభవం ఐపీఎల్లో తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 2008 నుంచి 2010 వరకు కోల్‌కతా తరఫున ఐపీఎల్ ఆడిన గంగూలీ...2011 నుంచి 2013 వరకు పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరో వైపు తాను క్యాపిటల్స్‌కు సలహాదారుడిగా వ్యవహరించడంలో ఎలాంటి ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ లేదని సౌరవ్ స్పష్టం చేశాడు. తాను గత ఏడాదే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్నుంచి తప్పుకున్నానని, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో చర్చించిన తర్వాతే తాజా నిర్ణయం తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. -
స్వీడన్ ప్రధాని సలహాదారుగా మరాఠా యువతి
స్టాక్‌హోం : భారత సంతతికి చెంది న యువతి, మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త కుమార్తెకు సువర్ణావకాశం లభించింది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖేపాటిల్ స్వీడన్ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రాజకీయ సలహాదారురాలిగా నియమితులయ్యారు. స్వీడన్లో ఇటీవల అధికారం చేపట్టిన సోషల్ డెమోక్రాట్ గ్రీన్ పార్టీ కూటమి నాయకుడు స్టీఫెన్ లోవన్ వద్ద కొంతకాలంగా నీల పనిచేస్తున్నారు. స్టీఫన్ గత నెలలో స్వీడన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నీలను తన రాజకీయ సలహాదారురాలిగా నియమించుకున్నారు. ‘నీల... స్వీడన్ ప్రధాన మంత్రి రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక విభాగం, పన్నులు, బడ్జెట్, గృహనిర్మాణం వంటి విభాగాల బాధ్యతలను కూడా నిర్వహిస్తారు’ అని ఆమె తండ్రి అశోక్ పాటిల్ చెప్పారు. అంతేకాకుండా తన కుమార్తె.. స్టాక్‌హోం మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) సిటీ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారని చెప్పారు. నీల గత ప్రభుత్వం హయాంలోనూ రాజకీయ సలహాదారురాలిగా పనిచేశారు. ఆమె గ్రీన్ పార్టీలో క్రియాశీలకకార్యకర్త కూడా. అంతేకాకుండా గ్రీన్ పార్టీ ఎన్ని కల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాగా స్వీడన్లో జన్మించిన నీల బాల్యం అహ్మద్‌నగర్‌లోనే గడి చింది. స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ స్కూ ల్ ఆఫ్ బిజినెస్‌లో నీల ఎంబీఏ డిగ్రీ చదివారు. నీల తాత బాలాసాహెబ్ విఖే పాటిల్ గతంలో కేంద్ర మంత్రి గా పనిచేశారు. ఇక ఆమె మేనమామ రాధాకృష్ణ విఖేపాటిల్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. -
సీఎం సలహాదారుగా అశ్లీల సీడీ నిందితుడు
రాయ్‌పూర్ : గత ఏడాది కలకలం రేపిన సెక్స్ సీడీ ఉదంతంలో పేరు వినిపించిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. అశ్లీల సీడీ కేసులో బీజేపీ నేత ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు మేరకు 2017 అక్టోబర్‌లో వర్మను ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సీడీ పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేశారని పాండ్రి పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు చేయడంతో వర్మను అరెస్ట్ చేశారు. ఇక వర్మతో సహా సీఎంకు నలుగురు సలహాదారులను నియమిస్తూ చత్తీస్‌గఢ్ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ దినపత్రిక ఎడిటర్‌గా రాజీనామా చేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మరో జర్నలిస్టు రుచిర్ గార్గ్‌ను సీఎం మీడియా సలహాదారుగా నియమించారు. ఇక ప్రదీప్ శర్మ ప్రణాళిక, విధాన, వ్యవసాయ సలహాదారుగా, రాజేష్ తివారీ పార్లమెంటరీ సలహాదారుగా నియమితులయ్యారని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. -
అర్వింద్ ఎందుకు రాజీనామా చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అందులో అంతగా నిజం లేదని, అమెరికా అకాడమీ పదవి వదిలి వచ్చి మళ్లీ అక్కడికే వెళ్లడం సూచిస్తోంది. ఈ ప్రభుత్వం నుంచి ముఖ్యమైన సలహాదారు పదవి నుంచి తప్పుకున్న మొదటి వ్యక్తి కూడా అర్వింద్ కాకపోవడం ఈ విషయాన్ని మరింత ధ్రువీకరిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ 2016లో తప్పుకున్నారు. ఆయన తనకు రెండో పర్యాయం పదవీకాలాన్ని పొడిగించని కారణంగా పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక విధాన నిర్ణాయక మండలిగా వ్యవహరిస్తున్న ‘నీతి ఆయోగ్’ చైర్మన్ పదవికి అర్వింద్ పణగారియా రాజీనామా చేశారు. ఇప్పుడు అర్వింద్ సుబ్రమణియన్ రాజీనామా చేయడం కూడా చర్చ నీయాంశం అయింది. కీలక ఆర్థిక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు. పాలకపక్ష బీజేపీకే కాకుండా ఆరెస్సెస్ లాంటి అనుబంధ హిందూత్వ శక్తులకు కూడా విధేయులుగా ఉన్న వారే పదవుల్లో మనుగడ సాగించగలరని, లేకపోతే తప్పుకోవడం తప్పనిసరి అవుతుందని అర్థం అవుతోంది. సమాజంలో హిందువులు, ముస్లింలు అంటూ విభజన తీసుకరావడం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందంటూ 2016లో అర్వింద్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు ఆరెస్సెస్‌కు రుచించలేదు. గోవధ నిషేధంపై తాను ఆనాడే తన అభిప్రాయాలను వెళ్లడించినట్లయితే ఆనాడే తన ఉద్యోగం పోయేదని సుబ్రమణియన్ ఇటీవలనే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల కారణంగానే ఆయన తన పదవిని కోల్పోయి ఉండవచ్చు! సుబ్రమణియన్‌తోపాటు ర ఘురామ్ రాజన్ అభిప్రాయాలు జాతి వ్యతిరేకమైనవని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి బహిరంగంగా విమర్శించడం కూడా ఇక్కడ గమనార్హమే. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి, రాత్రి వేళల్లో మహిళలు పనిచేయడానికి వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి నీతి అయోగ్‌లో పనగారియా చేసిన ప్రతిపాదనలకు కూడా ఆరెస్సెస్ తీవ్రంగా విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని రఘురామ్ రంజన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం బహిరంగంగానే తప్పుపట్టారు. ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలనే ప్రశ్నించే ధైర్యమున్న సుబ్రమణియన్ లాంటి అధికారులు నానాటికి దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి ఎంతో అవసరం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దేశ ఆర్థిక విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అయితే అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఫలించినప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న సంస్కరణలు ఎందుకు ఫలించడం లేవన్నది మరో ప్రశ్న. ప్రభుత్వ విధానాలకు విధేయులు కాదంటూ ముఖ్య ఆర్థిక సలహాదారులను తీసేస్తూ పోతుంటే ఫలితాల ప్రశ్న అలాగే ఉండి పోతుంది.