
తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు.
సాక్షి, అమరావతి: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
‘‘2024లో ప్రజలు మళ్లీ సీఎం జగన్‌కు పట్టం కట్టడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ మనసున్న నాయకుడు...ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే.. అందరం అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలి’’ అని అలీ అన్నారు.
చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా?