![Trump picks Massad Boulos As Middle East Affairs Adviser](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/2/trump.jpg.webp?itok=uo7djPFK)
ఫ్లోరిడా:రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన టీమ్‌లో ఒక్కొక్కరిని నియమించుకుంటున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్‌పటేల్‌గా నామినేట్ చేసిన మరుసటి రోజే తన ప్రభుత్వానికి పశ్చిమాసియా వ్యవహారాల్లో సలహాదారుగా మసాద్ బౌలోస్‌ను ట్రంప్ నియమించుకున్నారు.
అరబ్,మిడిల్‌ఈస్ట్ వ్యవహారాల్లో అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా మసాద్ సేవలందిస్తారని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం ద్వారా ట్రంప్ వెల్లడించారు. లెబనీస్-అమెరికా వ్యాపారవేత్త అయిన మసాద్ ట్రంప్ కుమార్తె టిఫానీకి మామ,ట్రంప్‌కు వియ్యంకుడు కావడం గమనార్హం.
గాజాపై ఇజ్రాయెల్ దాడుల అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్ ఓటర్లను ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వైపునకు మళ్లించడంలో మసాద్ కీలకంగా పనిచేశారు.జనవరి 20న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment