వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ అమెరికన్‌కు మరోసారి తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విధానాల్లో నిపుణురాలైన భారత సంతతికి చెందిన నీరా టాండన్‌ను తన దగ్గర దేశీయ విధాన సలహాదారుగా నియమించారు. బైడెన్ ప్రభుత్వ విధానాలు రచించడం, వాటిని అమలు పరిచే బాధ్యతల్ని ఆమెకు అప్పగించారు. శ్వేత సౌధం విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్‌కు చోటు లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటి సారి.
‘‘ఆర్థిక విధానాల దగ్గర్నుంచి జాతి సమానత్వం వరకు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆరోగ్యం, విద్య, వలస విధానాలను రూపొందించడం, వాటిని పక్కాగా అమలు జరిగేలా చూడడానికి టాండన్‌ను డొమెస్టిక్ పాలసీ అడ్వయిజర్‌గా నియమిస్తున్నాను’’ అని బైడెన్ ప్రకటించారు. టాండన్ ప్రస్తుతం అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఒబామా, క్లింటన్ ప్రభుత్వాల్లో కూడా ఆమె పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment