Indian-origin
-
కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగిన అనిత
ఒట్టావా: కెనడా ప్రధాని బరినుంచి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనిత.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేకాదు తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రధానిగా, పార్టీ అధినేతగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఆమె బరిలోకి వచ్చారు. అయితే.. వారంలోపే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా లిబరల్ బృందానికి, ఓక్విల్లే ప్రజలకూ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ జట్టులోకి నన్ను ఆహ్వానించినందుకు, కీలకమైన కేబినెట్ శాఖలను అప్పగించినందుకు ప్రధాని ట్రూడోకు హృదయపూర్వక ధన్యవాదాలు. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎన్నుకున్నందుకు, గత ఇరవై సంవత్సరాలుగా నా భర్త, నేను మా నలుగురు పిల్లలను పెంచేందుకు స్వాగతించిన అద్భుతమైన ఓక్విల్లే ప్రజలకు నేను నిజంగా కృతజ్ఞురాలిని’’ అని అనిత తన ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకు తాను ఎంపీగా కొనసాగుతానన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి ఓక్విల్లేలో గెలవడం సాధ్యం కాదని చాలా మంది రాశారని, అయినప్పటికీ ఒక్కసారి కాదు రెండుసార్లు గెలిపించి ప్రజలు తన వెనుకే నిలిచారని చెప్పారు. ఈ గౌరవం ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతుందన్నారు. -
కెనడా ప్రధాని రేసులో మరో భారత సంతతి నేత
ఒట్టావా: భారత సంతతికి చెందిన మరో నేత కెనడా ప్రధాని రేసులో నిలిచారు. నేపియాన్ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య గురువారం ఈ మేరకు ప్రకటించారు. దేశ పునర్నిర్మాణం కోసం సమర్థమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమని వీడియో ప్రకటనలో ఉద్ఘాటించారు. ‘‘భావి తరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనేడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకు నావద్ద అనేక పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని చెప్పారు. ఈ ప్రయాణంలో అందరూ తనతో కలిసి రావాలని కోరారు. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో వైదొలిగిన నేపథ్యంలో ఆయన వారసుడెవరన్నది ఆసక్తికరంగా మారడం తెలిసిందే. భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్‌తో పాటు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ తదితర లిబరల్ పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. I am running to be the next Prime Minister of Canada to lead a small, more efficient government to rebuild our nation and secure prosperity for future generations.We are facing significant structural problems that haven’t been seen for generations and solving them will require… pic.twitter.com/GJjJ1Y2oI5— Chandra Arya (@AryaCanada) January 9, 2025కర్ణాటక టు కెనడాకర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ ర్గా కెరీర్ ప్రారంభించారు. చిన్న పరి శ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పని చేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించారు.మార్చి 9న కొత్త ప్రధానికెనడా కొత్త ప్రధానిని, తమ నాయ కుడిని మార్చి 9న ప్రకటిస్తామని అధికా ర లిబరల్ పార్టీ గురువారం వెల్లడించింది. ఇందుకోసం దేశవ్యాప్త ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది.👉ఇదీ చదవండి : ‘డబ్బుతో కెనడాను అమెరికాలో కలిపేసుకుంటా’ -
ఎక్స్‌లో లేఆఫ్, కట్ చేస్తే : వైట్‌హౌస్‌లోకి సగర్వంగా ‘ప్రియాంక’
నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ కూర్చోలేదు ఆమె. కొత్త కరియర్‌ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకొంది. కట్ చేస్తే వైట్ హౌస్‌లో స్పెషల్ గెస్ట్‌గా అవతరించింది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానం అందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ-నుంచి ఫుడ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి!అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన స్టేటెన్ ద్వీపానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్(ట్విటర్)లో పనిచేసింది. లేఆఫ్స్‌లో భాగంగా 2022 లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు పదేళ్ల పాటు వివిధకంపెనీల్లో టెకీగా పని చేసింది. టెక్ ప్రపంచంలోతనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ, నాయక్ మనసు మాత్రం ఎపుడూ వంటలు చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇందలో ఉద్యోగం మీద దెబ్బ పడింది. కానీ ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మల్చుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్‌తో ఆమె అవార్డ్ విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లుతో పంచుకొనేది.సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్‌గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజెన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తొలి తరం భారతీయ అమెరికన్‌గా, నాయక్ తన బ్రాండ్‌లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్షిప్స్, వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆమె ప్రత్యేకమైన “ఎకోకిచెన్” కాలమ్ ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్‌ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. (తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!)ఈ క్రమంలోనే 2024 అక్టోబర్‌లో నాయక్ వైట్ హౌస్‌లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.‘‘జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృతిపరంగా ఎన్నో అవమానాలు.. తిరస్కరణలు.. కానీ స్వయంకృషితో రచయిత/టీవీహోస్ట్గాఎదిగాను. ఇపుడు ప్రతిష్టాత్మక వైట్‌హౌస్ దీపావళి వేడుకలకు హాజరు.. ఇది చాలా సంతోషంగానూ,గర్వంగానూ ఉంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Naik | Eco Chef & Travel (@chefpriyanka) -
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
వాషింగ్టన్: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రొవాన్ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్ పటేల్(36) టొబాకో హౌస్ స్టోర్ పేరుతో దుకాణం నడుపుతున్నారు. మంగళవారం ఉదయం షాట్గన్తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. -
దుమ్మురేపిన అమ్మాయి.. ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్న భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రియాలిటీ షోలో ఫ్లోరిడాకు చెందిన ప్రనిస్కా మిశ్రా తన అద్భుతమైన తన గాప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటోంది. దీంతో "అవును, అమెరికాకు నిజంగానే టాలెంట్ ఉంది. కానీ అది చాలా వరకు భారతదేశం నుండే వస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో పాల్గొన్న ప్రనిస్కాను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. టీనా ఐకానిక్ సాంగ్ 'రివర్ డీప్ మౌంటైన్ హై' పాటతో అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మన భారతీయ బాలిక. దీంతో సూపర్ మోడల్ హెడీ క్లమ్ నుండి గోల్డెన్ బజర్‌ను కూడా అందుకోవడం విశేషం. అంతేకాదు ఆమె స్టేజ్‌మీదకు వచ్చి ప్రనిస్కాను ఆత్మీయంగా హగ్ చేసుకుంది. ఆ తరువాత ఆమె తండ్రి ఇలా కాసేపు ఉద్విగ్న క్షణాలతో నిండిపోయింది వేదిక. ఇంతలో వీడియో కాల్ ద్వారా ప్రనిస్కా అమ్మమ్మ లైన్లోకి రావడంతో అక్కడి వాతావరణం అటు ఆనందం, ఇటు భావోద్వేగంతో నిండిపోయింది.What on earth is going on??For the second time, within the past two weeks, a young—VERY young—woman of Indian origin has rocked the stage at @AGT with raw talent that is simply astonishing. With skills acquired in indigenous American genres of music. Rock & Gospel. Pranysqa… pic.twitter.com/2plEj8EXVs— anand mahindra (@anandmahindra) July 8, 2024 భూమిపై ఏమి జరుగుతోంది? రెండు వారాల్లో ఇది రెండోసారి. భారతీయ సంతతికి చెందిన చిన్నఅమ్మాయి తన టేలంట్‌తో షేక్ చేసింది అంటూ ఆనంద్ మహీంద్ర స్పందించారు. అలాగే అమ్మమ్మ వీడియో కాల్ చూడగానే కన్నీళ్లు వచ్చాయంటా ఆయన రాసుకొచ్చారు. -
నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత
విదేశాలకు వెళ్లిన నాలుగేళ్ల తరువాత ఇంటికి వచ్చేందుకు ఉత్సాహంగా బయలుదేరిన యువతి, విమానాశ్రయంలోనే కన్నమూసిన ఘటన విషాదాన్ని నింపింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న మన్‌ప్రీత్ కౌర్ (24) మెల్బోర్న్ నుండి న్యూ ఢిల్లీకి బయలుదేరింది. క్వాంటాస్ విమానాన్ని ఎక్కేందుకు తుల్లామరైన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా అస్వస్థతకు గురైంది. అలాగే విమానం ఎక్కి కూచుంది. సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ఉండగానే కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విమాన సిబ్బంది, అత్యవసర సేవలు వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించి నప్పటికీ ఫలితం లేకపోయిందని క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు. ఆమె క్షయ వ్యాధితో మరణించి ఉండవచ్చునని భావస్తున్నారు. జూన్ 20న ఈ ఘటన జరిగింది.దీంతో మృతురాలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమె స్నేహితుడు, కౌర్ గ్రామానికి చెందిన గుర్దీప్ గ్రేవాల్ ప్రయత్నిస్తున్నాడు. ఆమె అకాల మరణం తమను ఎంతగానో బాధించిందనీ, తను లేని లోటు తీరనిదంటూ గ్రేవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తను చెఫ్ కావాలని కోరుకుందని గుర్తు చేసుకున్నారు. -
అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయ బాడిగ
న్యూయార్క్: భారతీయ సంతతి అమెరికా పౌరురాలు, తెలుగుబిడ్డ జయ బాడిగ అక్కడి శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన జయ ఆ తర్వాత కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే న్యాయ విద్య చదివి న్యాయవాద వృత్తి జీవితం మొదలెట్టారు. ఇటీవల జడ్జిగా ఎంపికైన జయను కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తాజాగా నియమించారు. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా జయ కమిషనర్‌గా సేవలందిస్తుండటం విశేషం. డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోరి్నయా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటారీ్నగా పనిచేశారు. 2018లో కాలిఫోరి్నయా గవర్నర్ కార్యాలయంలో అత్యవసర సేవల విభాగంలో సేవలందించారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో లా చదివారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎంఏ చేశారు. కుటుంబ కేసులు, తగాదాలను పరిష్కరించడంలో జయ పది సంవత్సరాల అనుభవం గడించారు. -
అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు హఠాత్తుగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేస్తోంది. ఎన్నో కలలతో భవిష్యత్తును నిర్మించుకుంటున్న యువత అకాల మరణాలు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులు స్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మే 14న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.జార్జియాలోని అల్పారెట్టాలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయ అమెరికన్ విద్యార్థులు కన్నుమూశారు. వీరిని శ్రియ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. రిత్విక్ సోమేపల్లి, మహమ్మద్ లియాఖత్ అనే మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వీరు అల్ఫారెట్టాలోని నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ అల్ఫరెట్టా హైస్కూల్ విద్యార్థులనీ, యాక్సిడెంట్ సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిందని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా, అన్వీ శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.అన్వీశర్మ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కళాకార్ గ్రూప్ పేర్కొంది. అలాగే శ్రియ అద్భుతమైన డాన్సర్ అని షికారీ గ్రూప్ సంతాపం తెలిపింది. శ్రియ అవసరాల యూజీఏ షికారి డ్యాన్స్ టీమ్‌లో సభ్యురాలు, అలాగే అన్వీశర్మ యూజీఏ కళాకార్ ,కాపెల్లా బృందంలో సింగర్‌గా ఉన్నారు. ఇక ఆర్యన్ జోషి క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. కీలక పోటీల్లో జట్టు విజయానికి కారణమైన అతని మరణం తీరని లోటని ఆల్ఫారెట్టా హై క్రికెట్ జట్టు ఇన్‌స్టా పోస్ట్‌లో విచారం వ్యక్తం చేసింది. తెలిపింది.కాగా గత నెల, అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. -
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త?
మీరు విదేశాల్లో ఉంటున్నారా? ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్కమ్ కోసం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. స్థానిక చట్టాలు, సంస్థల గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వీడియోలు తీశారా? ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఉన్న ఫళంగా పెట్టెబేడా సర్ధుకుని స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. ఇదేదో బయపెట్టే ప్రయత్నం కాదు. విదేశాల్లో ఉంటున్నవారి సంరక్షణ కోసం కాస్త అవగాహన కల్పించే ఉద్దేశమేనని గుర్తించాలని విజ్ఞప్తి. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన మేహుల్ ప్రజాపతి కెనడాలో ఉంటూ స్థానిక ప్రముఖ టీడీ బ్యాంక్‌లో డేటా సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మరోవైపు కెనడా దేశం గురించి, అక్కడి సదుపాయాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా వివరిస్తుంటాడు. అంతవరకు బాగానే ఉన్నా..కెనడాలో డబ్బు ఆదా చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు గురించి వివరించాడు. ఫలితంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో జాబ్ లేక స్వదేశానికి తిరిగే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. this guy has a job as a bank data scientist for @TD_Canada, a position that averages $98,000 per year, and proudly uploaded this video showing how much “free food” he gets from charity food banks.you don’t hate them enough. pic.twitter.com/mUIGQnlYu6— pagliacci the hated 🌝 (@Slatzism) April 20, 2024 ఇంతకీ ఏం జరిగింది?మెహుల్ ప్రజాపతి టీడీ బ్యాంక్‌లో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతని జీతం ఏడాది రూ.81లక్షలు. అవి సరిపోకపోవడంతో డబ్బుల్ని ఆదా చేసేందుకు కెనడాలో విద్యార్ధులకు ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంక్‌లు ఉంటాయి. ఆ ఫుడ్ బ్యాంక్‌ల నుంచి విద్యార్ధులు ఆహారాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆహారాన్ని మెహుల్ ప్రజాపతి ప్రతినెల తెచ్చుకుంటున్నట్లు, తద్వారా నెలా ఆహారం, కిరాణా సామాగ్రి ఖర్చు పూర్తిగా తగ్గిపోతుందని వివరించాడు. అంతేకాదు ఓ వీడియోలో తాను వారానికి సరిపడ బోజనాన్ని ఉచితంగా తెచ్చుకున్నానని, వాటిల్లో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, సాస్‌లు, పాస్తా, క్యాన్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయని ఆ వీడియోలో చూపించాడు. update: the food bank bandit was fired https://t.co/RFLqvVGJb1 pic.twitter.com/CDdrfrmbqI— pagliacci the hated 🌝 (@Slatzism) April 22, 2024 విధుల నుంచి తొలగిస్తూ దీంతో టీడీ బ్యాంక్ మెహుల్ ప్రజాపతిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, చర్చిల ద్వారా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్‌ల నుండి మెహుల్ ఎలా తెచ్చుకుంటాడు. కెనడాలో ఉంటూ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని ఎలా తీసుకుంటారు. ఏడాది సుమారు 80లక్షల జీతం తీసుకుంటున్న మీరు ఫుడ్ బ్యాంక్‌ల నుంచి ఆహారం తీసుకోవడం సరైంది కాదని వార్నింగ్ ఇచ్చింది. అతడిని విధుల నుంచి తొలగించింది. సంబంధిత మెయిల్స్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఆస్కార్ బరిలో మన డాక్యుమెంటరీ
జార్ఖండ్‌లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు. ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’. ‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్‌లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది. బాధితులు పోరాడాల్సిందే ‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్‌గఢ్‌లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది. అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్‌ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది. స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు 55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్‌గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది. భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్‌స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది. -
అమెరికాలో విషాదం.. శవాలై కనిపించిన భారత సంతతి కుటుంబం
అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్ కమల్ కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేష్ కమల్ (57)తో పాటు ఆయన భార్య టీనా కమల్ (54), కుమార్తె ఆరియానా (18) మృతి చెందడం కలకలం రేపుతోంది. స్థానిక కాల మానం ప్రకారం.. గురువారం సాయంత్రం 7.30గంటల సమయంలో రాకేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉండే ఖరీదైన డోవర్ భవనంలో చనిపోయినట్లు గుర్తించామని నార్‌ఫోర్క్ డిస్ట్రిక్ అటార్నీ (డీఏ) మైఖేల్ మొరిస్సే తెలిపారు. ఈ ఘటనపై మైఖేల్ మొరిస్సే మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటన గృహ హింస అయ్యిండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు భర్త రిక్కీ మృతదేహం వద్ద తుపాకీ ఉండడమేనని అన్నారు. చంపారా? చంపించారా? ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపారా? లేదంటే ఎవరిచేతనైనా చంపబడ్డారా? అనేక అనుమానాలపై స్పష్టత ఇచ్చేందుకు న్యాయ వాది మైఖేల్ మొరిస్సే నిరాకరించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ సంఘటనను హత్య లేదంటే ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకోవాలా? వద్దా? అని నిర్ణయించే ముందు వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉందని చెప్పారు. ఆర్ధిక సమస్యలే కారణమా? రాకేష్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మరణానికి ఆర్ధిక సమస్యలే కారణమని తెలుస్తోంది. సంబంధిత ఆన్లైన్లోని ఆధారాల్ని స్థానిక పోలీసులు సేకరించారు. అదే సమయంలో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు, ఇతర సమస్యలు ఉన్నాయన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించ లేదని మోరిస్సే చెప్పారు. ప్రస్తుతం ఈ హత్యలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆస్తుల అమ్మకం ది పోస్ట్ నివేదిక ప్రకారం.. రాకేష్ కమల్ కుటుంబం 5.45 మిలియన్ డాలర్ల విశాలమైన భవనంలో నివసిస్తుంది. అయితే ఈ భవనాన్ని ఏడాది క్రితం మసాచుసెట్స్‌కు చెందిన విల్సోండేల్ అసోసియేట్స్ ఎల్ఎల్సీకి 3 మిలియన్లకు విక్రయించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, 2019లో కమల్‌లు 19,000 చదరపు అడుగుల ఎస్టేట్‌లో 11 బెడ్రూమ్లు ఉన్న భవనాన్ని రిక్కీ 4 మిలియన్లకు కొనుగోలు చేశారు. సంస్థ కార్యకలాపాల రద్దు రాష్ట్రంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన డోవర్లో నివసించే రాకేశ్ కమల్ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. విద్యా వంతులు ఎడ్యునోవా వెబ్సైట్ ప్రకారం..రాకేష్ కమల్ భార్య టీనా కమల్ భారత్‌లోని ఢిల్లీ యూనివర్సీటీ, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్సైట్లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించేవారు. ఇక కమల్ బోస్టన్ యూనివర్సిటీ, ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి కూడా. ఎడ్యునోవాలో పని చేయడానికి ముందు రాకేష్ కమల్ ఎడ్యుకేషన్ విభాగంలో అపారమైన అనుభవం ఉంది. ఇక ఎడునోవా మిడిల్ స్కూల్, హైస్కూల్, కాలేజ్‌లలోని విద్యార్థుల గ్రేడ్లను మెరుగుపరిచేలా సేవలందిస్తోంది. ఇక, రాకేష్ కమల్, టీనా కమల్ దంపతుల కుమార్తె ఆరియానా వెర్మోంట్లోని మిడిల్బరీ కాలేజీ న్యూరోసైన్స్ చదువుతుండేవారు. అప్పుల ఊబిలో ఉక్కిరి బిక్కిరి టీనా కమల్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. తనకు 1 మిలియన్ నుంచి 10 మిలియన్ల అప్పు ఉందని ఫైలింగ్‌లో తెలిపారు. తగిన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో రెండు నెలల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చివరికి ఆర్ధిక ఇబ్బందులు తాళలేకే రాకేష్ కమల్ తన భార్య టీనా కమల్, ఆరియాను హత్యా చేశారా? ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దృష్టిసారించారు. -
‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి బుకర్ ప్రైజ్
లండన్: ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్–2023 లభించింది. లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్ సాంగ్ విజేతగా నిలిచింది. తాజాగా లండన్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్ లించ్ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది. దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలు, పెరిగిపోతున్న నిరంశకుత్వం, ప్రబలుతున్న అశాంతి, వలసల సంక్షోభం.. వంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ మహిళ చేసిన పోరాటాన్ని ‘ప్రాఫెట్ సాంగ్’ నవలలో పాల్ లించ్ హృద్యంగా చిత్రీకరించారు. కెన్యాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన ‘వెస్ట్రన్ లేన్’ నవల టాప్–6లో నిలిచింది. -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్‌కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్‌ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్‌తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్‌ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
లండన్‌లో ప్రవాసభారతీయుని ఇంట్లో మంటలు..
లండన్: లండన్‌లోని భారత సంతతి వ్యక్తికి చెందిన ఇంట్లో ఆదివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్న కాసేపటికే ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలారి్పన అనంతరం ఫస్ట్ ఫ్లోర్లో ఐదు మృతదేహాలు పడి ఉండగా గుర్తించినట్లు చెప్పారు. కాగా, మాంచెస్టర్‌కు చెందిన దిలీప్ సింగ్(54) మాట్లాడుతూ..అది తన బావమరిది ఇల్లు కాగా, అందులో భార్య, ముగ్గురు పిల్లలతో ఆయన ఉంటున్నారన్నారు. మరో ఇద్దరు అతిథులు కూడా ఘటన సమయంలో ఉన్నట్లు తెలిపారు. ఆ కుటుంబం ఇటీవల బెల్జియం నుంచి లండన్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చినట్లు చెబుతున్నారు. -
బ్రిటన్ మంత్రివర్గంలో కుదుపు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సోమవారం తన మంత్రివర్గంలో ఆకస్మిక మార్పుచేర్పులు చేశారు. కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత మూలాలున్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా నియమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటిదాకా విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవర్లీని బ్రేవర్మన్ స్థానంలో హోం మంత్రిగా నియమించారు. ప్రధాని సిఫార్సుల మేరకు వారిద్దరి నియామకాలకు రాజు చార్లెస్ ఆమోదముద్ర వేసినట్టు డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హౌజింగ్ మంత్రి రేచల్ మెక్‌లీన్‌ను కూడా సునాక్ పదవి నుంచి తప్పించారు.ఈ నేపథ్యంలో మరో ఆరుగురు జూనియర్ మంత్రులు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు! థెరెసా కోఫీ, నిక్ గిబ్, నీల్ ఓబ్రియాన్, విల్ క్విన్స్, జెస్సీ నార్మన్ ఈ జాబితాలో ఉన్నారు. కామెరాన్... అనూహ్య ఎంపిక 57 ఏళ్ల కామెరాన్‌కు రిషి విదేశాంగ బాధ్యతలు అప్పగించడం అనూహ్యమేనని చెప్పాలి. ఒక మాజీ ప్రధానిని ఇలా మంత్రివర్గంలోకి తీసుకోవడం బ్రిటన్‌లో చాలా అరుదు. పైగా ప్రధానిగా రాజీనామా చేశాక కామెరాన్ ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక ప్రస్తుతం ఎంపీ కూడా కాదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోకి తీసుకున్నారు. బ్రిటన్‌లో ఇలా విదేశాంగ మంత్రి ఎగువ సభ్య సభ్యుడిగా ఉండటం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980ల్లో లార్డ్స్ సభ్యుడైన పీటర్ కారింగ్టన్ మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. కష్టకాలంలో ప్రధానిగా రిషి పనితీరు గొప్పగా ఉందంటూ కామెరాన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ‘‘కొన్ని వ్యక్తిగత నిర్ణయాల విషయంలో రిషితో నేను గతంలో విభేదించ ఉండొచ్చు. కానీ ఆయన అత్యంత సమర్థుడైన ప్రధాని’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ భద్రత, ప్రగతి తదితర కీలకాంశాల్లో ఆశించిన ఫలితాల సాధనలో రిషికి శక్తివంచన లేకుండా తోడ్పడతా. ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నా కీలక సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో రిషికి దన్నుగా నిలిచేందుకు నా రాజకీయ అనుభవమంతటినీ రంగరిస్తా’’ అని చెప్పారు. 2010 నుంచి 2016 దాకా ఆరేళ్లపాటు ఆయన బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగాలని గట్టిగా వాదించారు. ఈ విషయమై 2016లో మూడు రెఫరెండాలు తెచ్చారు. కానీ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకు (బ్రెగ్జిట్)కే ఓటేయడంతో రాజీనామా చేశారు. సునాక్ కూడా బ్రెగ్జిట్‌కే మద్దతిచ్చారు. పైగా ఆ సమయంలో కామెరాన్ మంత్రివర్గంలో సునాక్ జూనియర్ మంత్రి కూడా కావడం విశేషం! విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఆదివారం సునాక్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కూడా. పర్యటనలో భాగంగా క్లెవర్లీతో జై శంకర్ సమావేశాలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాంగ బాధ్యతలు స్వీకరించిన కామెరాన్‌తో జై శంకర్ చర్చలు ఎలా జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. బ్రేవర్మన్.. రెండోసారి ఉద్వాసన ఇక రిషి మంత్రివర్గంలో సీనియర్ సభ్యురాలైన 43 ఏళ్ల బ్రేవర్మన్ హోం శాఖ మంత్రిగా తప్పుకోవాల్సి రావడం ఇది రెండోసారి! ఈసారి ఆమెపై వేటు ఒకవిధంగా ఊహిస్తున్నదే. గోవా మూలాలున్న ఆమె రెచ్చగొట్టే మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల లండన్‌లో జరిగిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తూ ద టైమ్స్ పత్రికలో బ్రేవర్మన్ రాసిన వ్యాసంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. హోం మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించరానిదంటూ విపక్షాలతో పాటు అధికార కన్సర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మండిపడ్డారు. వ్యాసంలోని సదరు విమర్శలను తొలగించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినా ఆమె బేఖాతరు చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్ను తప్పించడం ఖాయమని అంతా భావించారు. అంతకుముందు లిజ్ ట్రస్ మంత్రివర్గం నుంచి కూడా ఆమె రాజీనామా చేయడం విశేషం. అప్పుడు కూడా మంత్రిగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పలు కీలకాంశాలపై ట్రస్ సర్కారు అయోమయంలో ఉందని ఆమె బాహాటంగా విమర్శించడం సంచలనం సృష్టించింది. వలసదారులపై ఆమె వ్యాఖ్యలూ దుమారమే రేపాయి. తర్వాత వలసలకు సంబంధించి అధికార పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా సహచర పార్టీ ఎంపీకి చూపించిన అంశంలో రాజీనామా చేయాల్సి వచి్చంది. ట్రస్ స్థానంలో రిషి ప్రధాని అయ్యాక బ్రేవర్మన్ను అనూహ్యంగా మంత్రివర్గంలోకి తీసుకోవడమే గాక మళ్లీ కీలకమైన హోం శాఖ బాధ్యతలే అప్పగించారు. దీనిపై అప్పట్లోనే ఆశ్చర్యం వ్యక్తమైంది. తాజా వేటు నేపథ్యంలో సునాక్‌కు ఆమె కంట్లో నలుసుగా మారడం ఖాయమంటున్నారు. కన్సర్వేటివ్ పారీ్టలోని తన మద్దతుదారుల దన్నుతో ప్రభుత్వానికి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజీనామా అనంతరం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరిచేలానే ఉన్నాయి. ‘‘ఇంతకాలం హోం మంత్రిగా పని చేయడం నాకు గొప్ప గౌరవం. సమయం వచి్చనప్పుడు చాలా సంగతులు చెప్తా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు! వివాదాస్పద వ్యాఖ్యలు ► బ్రిటన్‌లో వీసా కాల పరిమితి ముగిసినా దేశం వీడని వారిలో అత్యధికులు భారతీయులేనన్న బ్రేవర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ► భారత్‌తో ఓపెన్ మైగ్రేషన్ విధానాన్నీ ఆమె తప్పుబట్టారు. ► మరో సందర్భంలో బ్రిట న్లోని అక్రమ వలసదారులను ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తానన్నారు. ► బ్రిటన్‌లో ఎక్కడ పడితే అక్కడ వీధుల్లోనే నివసిస్తున్న వారు చాలావరకు అక్రమ వలసదారులేనన్నారు. ► శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్రగా అభివరి్ణంచారు. ► అతి వేగంగా కారు నడిపిన కేసులో జరిమానా, ఫైన్ పడ్డ విషయాన్ని దాచేందుకు ప్రయతి్నంచారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే..
ఎవరైనా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్.. లేదా ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఫేస్బుక్లో జాబ్ సంపాదించి రూ.6.5 కోట్ల వేతనం తీసుకునే ఒక టెకీ ఉద్యోగం వదిలి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ అతడెవరు, ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన 'రాహుల్ పాండే' 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ రూ. 6.5 కోట్లు కంటే ఎక్కువ. జాబ్ వదిలేసిన తరువాత ఫేస్బుక్లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్ చేసాడు. ఫేస్బుక్లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్‌గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు. ఇదీ చదవండి: సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం! మెటాను మించిన ప్రపంచం కోసం.. ఫేస్బుక్లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్‌లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను, ఇంజినీరింగ్‌కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించానని వెల్లడించాడు. -
కొడుకు హఠాన్మరణం ఆ తండ్రిని..ఏకంగా..
ఒక్కో ఘటన లేదా పరిస్థితులు మనిషిని తనకే తెలియని తనలోని ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవి కొందర్నీ మహనీయుడిని చేస్తే మరికొంర్ని వక్రమార్గంలో పయనించేలా చేస్తాయి. ఇక్కడొక తండ్రి కొడుకుని కోల్పోడమే జీర్ణించుకోలేని సతతమవుతున్న స్థితిలో తన కొడుకులా మరెవరూ అలా చనిపోకూడదనే గొప్ప ఆలోచనకు తెరతీసింది. ఇంకొన్నాళ్లు ఉండాల్సిన కొడుకు ఎలా అకాల మరణం చెందాడన్న ఆ సందేహమే అతడిని ఓ సరికొత్త చైతన్యం వైపుకి తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్‌లోని భారత సంతతి చెందిన జే పటేల్‌కి 30 ఏళ్ల బలరామ్ అనే కొడుకు ఉన్నాడు. అతను లండన్‌లో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అనూహ్యంగా మరణించాడు. దీంతో జీర్జించుకోలేని బలరామ్ తండ్రి తన కొడుకు ఎలా చనిపోయాడన్న సందేహంతో విచారించడం ప్రారంభించాడు. తన కొడుకు సరైన చికిత్స సకాలంలో అందలేదని, సరైన సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్లే చనిపోయినట్లు వెల్లడైంది. దీంతో అతను ఆస్పత్రిలోని పేషెంట్స్ సమస్యల పూర్వాపరాలు, జీవన వ్యవధిని నమోదు చేయడం ప్రారంభించాడు. అంతేగాదు చికిత్సలో తలెత్తుతున్న వైద్యుల తప్పుల తడకల గురించి కొత్త ఛారిటీ ఫౌండేషన్‌ని కూడా ప్రారంభించి రోగుల హక్కుల కోసం ప్రచారం చేస్తున్నాడు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌లో తన కొడుకు ఆస్పత్రి కన్సల్టెంట్, మిగతా సిబ్బంది చికిత్స సంరక్షణ వైఫల్యం కారణంగానే తీవ్ర నొప్పి, అసౌకర్యంతో ముందుగానే చనిపోయినట్లు అందరికీ తెలియజేశాడు. తాను చేసే ఈ కార్యక్రమాల ద్వారా అయిన తన కొడుకు బలరాం ట్రీట్మెంట్లో ఎలాంటి తప్పులు జరిగాయి అనే దానిపై ప్రభుత్వం స్పందించి..సత్వరమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ బంధువు, స్నేహితుడు, మరెవరైనా.. వారి ఆత్రతను ఆవేదనను ఆస్పత్రి యాజమాన్యం అస్సలు పట్టించుకోదని, అక్కడ తతెత్తుతున్న లోపాలను సరిదిద్దే యత్నం కూడా చేయదని ఆవేదనగా చెబున్నారు పటేల్. బ్రిటన్ పార్లమెంటు ఈ విషయంపై మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరి నిమిషంలో తన కొడుకు ఆరు ప్రాణాపాయ సంకట పరిస్థితులతో పోరాడడని చెప్పారు. తన కొడుకు చిన్నతనంలో కూడా ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు మానసికి వయసు సంబంధించిన పెరుగదల సమస్యతో ఇబ్బంది పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. అలా.. అలా నెమ్మదిగా మానసిక వికాసం కలుగుతుందనేలోపు ఇలాంటి ఘోరంగా జరిగిందని అన్నారు. అతను అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడంటూ కొడుకుని గుర్తుచేసుకున్నారు. ఇది పీడకలలా తనను వెంటాడుతూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు పటేల్. తన కొడుకు ఇంకొన్నాళ్లు జీవించాల్సిన వాడని, తగిన చికిత్స అందించడంలో జాప్యం, మంచి వైద్యం లేకపోవడం తదితర కారణాల వల్లే మరణించాడన్నారు. అందుకే తాను ఈ ఛారిటీ ద్వారా రోగులకు చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించి అకాల మరణాలను నివారించేలా చేయడమే గాక వారికి మంచి వైద్యం అందేలా ప్రత్యామ్నాయం మార్గాన్ని(వైద్యానికి సంబంధించిన సెకండ్ ఓపినియన్) ఎలా ఎంచుకువాలో అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. దీనికి యూకే ప్రభుత్వం, యూకే ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే మద్దతు ఇవ్వడంతోనే ఈ ప్రచారానికి పిలుపు ఇచ్చినట్లు పటేల్ తెలిపారు. ఇక 2021లో సెప్సితో మరణించి 13 ఏళ్ల మార్తా తల్లి కూడా ఇలానే "మార్తాస్ రూల్" అనే పేరుతో వైద్య చికిత్సకు సంబంధించిన సెకండ్ ఓపెనియన్ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..) -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ అమెరికన్‌కు మరోసారి తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విధానాల్లో నిపుణురాలైన భారత సంతతికి చెందిన నీరా టాండన్‌ను తన దగ్గర దేశీయ విధాన సలహాదారుగా నియమించారు. బైడెన్ ప్రభుత్వ విధానాలు రచించడం, వాటిని అమలు పరిచే బాధ్యతల్ని ఆమెకు అప్పగించారు. శ్వేత సౌధం విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్‌కు చోటు లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటి సారి. ‘‘ఆర్థిక విధానాల దగ్గర్నుంచి జాతి సమానత్వం వరకు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆరోగ్యం, విద్య, వలస విధానాలను రూపొందించడం, వాటిని పక్కాగా అమలు జరిగేలా చూడడానికి టాండన్‌ను డొమెస్టిక్ పాలసీ అడ్వయిజర్‌గా నియమిస్తున్నాను’’ అని బైడెన్ ప్రకటించారు. టాండన్ ప్రస్తుతం అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఒబామా, క్లింటన్ ప్రభుత్వాల్లో కూడా ఆమె పని చేశారు. -
కిడ్నాప్ నాటకంతో డబ్బులు కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..
ఒక అమాయక భర్తకి మీ భార్య కిడ్నాప్ అయ్యిందంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆమెను వదిలేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే చిత్రహింసలకు గురిచేస్తాం అని కూడా బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేసును విచారించిన పోలీసులు సైతం నివ్వెరపోయారు. చివరికి అతడి భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ అనూహ్య ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. దక్షిణాఫ్రికాలోని 47 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళ ఫిరోజా బీ బీ జోసెఫ్ తాను కిడ్నాప్ అయ్యినట్లు నాటకం ఆడింది. అందుకోసం తన భర్తకి ఒక అపరిచిత వ్యక్తి చేత ఫోన్ చేయించి..మీ భార్యను కిడ్నాప్ చేశామని, వదిలేయాలంటే పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇంతలో మరుసటి రోజు కూడా డబ్బుల తొందరగా ఇవ్వకపోతే గనుక ఆమెను చిత్రహింసలకు గురి చేస్తాం అని మరోసారి సదరు వ్యక్తి నుంచి కాల్ వచ్చింది ఆమె భర్తకు. దీంతో పోలీసులు ఆ ఫోన్ కాల్స్‌ని ట్రేస్ చేసి ఆ దిశగా దర్యాప్తు సాగించగా.. అసలు విషయం బయటపడింది. అతడి భార్య జోసఫ్ పీటర్‌మారిట్జ్‌బర్గ్ నగరంలోని ఒక హోటల్ల గదిలో ఉంటున్నట్లు తేలింది. అలాగే కిడ్నాపర్లు దొంగలించారన్న ఆభరణాలన్ని కూడా ఆమె అధీనంలోనే ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఆమె ఆ హోటల్లో బస చేసినట్లు సీసీఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించారు. అక్కడ ఆమె వేరే పేరుతో లగ్జరీగా నివశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కిడ్నాప్ నాటకంతో భర్త నుంచి డబ్బులు కాజేయాలనుకుని చివరికి కటకటాలపాలైంది. (చదవండి: అతని జీవితం నాశనం అయ్యింది.. భారతీయుడికి రూ.11 కోట్లు చెల్లించాలని ఆదేశం) -
హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?
న్యూఢిల్లీ:యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్‌పై వెల్లడించిన రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బ్లాక్ఇంక్ ఏంటి? సహ వ్యవస్థపాకులతోపాటు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కంపెనీ భారతీయ-అమెరికన్ సీఎఫ్‌వో అమృతా అహుజా గురించిన వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ ఇంకపై హిండెన్‌బర్గ్ గురువారం కీలక రిపోర్ట్‌ను వెల్లడించింది. జాక్ డోర్సే జేమ్స్ మెక్కెల్వీతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమృతా అహుజా, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్, బ్రియాన్ గ్రాసడోనియాతో సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్‌లు "మిలియన్ల డాలర్లను స్టాక్‌లో పెట్టారని " ఆరోపించింది. (ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) పెట్టుబడిదారులను మోసం చేసేందుకు కస్టమర్లను ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. రిపోర్ట్ ప్రకారం మోసంద్వారా వచ్చిన లాభాలను దోచు కున్నారని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో జాక్ డోర్సే , జేమ్స్ మెక్ కెల్వే సమిష్టిగా 1 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. అలాగే సీఎఫ్‌వో అమృతా అహుజా సహా ఇతర ఎగ్జిక్యూటివ్స్‌పై కూడా విమర్శలు గుప్పించింది. అమృతా అహుజా ఎవరు? ♦ అహుజా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డ్యూక్ యూనివర్సిటీ , హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రీమియం విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి. ♦ 2019లో బ్లాక్‌లో చేరడానికి ముందు, ఆమె ఎయిర్బిఎన్బి, మెకిన్సే & కంపెనీ, ది వాల్ట్ డిస్నీ కంపెనీ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ♦ ఆమె 2001లో కన్సల్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ♦ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, అహుజా క్లీవ్‌ల్యాండ్ శివారులో డే-కేర్ సెంటర్ నిర్వహించే భారతీయ వలసదారుల కుమార్తె. ♦ ఫాక్స్‌లో పనిచేస్తున్నప్పుడు, స్ట్రీమింగ్ సర్వీస్ హులును ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ♦ "కాల్ ఆఫ్ డ్యూటీ," "కాండీ క్రష్" , "వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్" వంటి పాపులర్ గేమ్‌ల వీడియో గేమింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజారే కంపెనీకి అభివృద్ధిలో తోడ్పడింది. ఆన్ స్టోర్ బిజినెస్ మోడల్నుంచి,ఆన్లైన్, ఆల్వేస్ ఆన్ లాంటి మల్టీప్లేయర్ వ్యాపార నమూనాతో అమ్మకాలతో దుమ్ము రేపేలా సాయపడింది. ♦ ఆమె 2022లో ఫార్చ్యూన్ యొక్క అత్యంత శక్తివంతమైన మహిళా సమ్మిట్‌లో కనిపించింది. ♦ భర్త హర్‌ప్రీత్ మార్వాహ. 7 , 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు. ♦ తొలి ఉద్యోగం: ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ హైట్స్‌లోని ఆమె తల్లిదండ్రుల డేకేర్‌లో సమ్మర్ క్యాంప్ కౌన్సెలర్ ఇవీ చదవండి: రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు -
నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!
ఒక వ్యక్తి ఫ్లైట్ జర్నీలో ఉండగా గుండె పోటుకి గురయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఐదుగంటలు శ్రమించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. విమానంలో తగిన వైద్య పరికరాలు లేకపోయినప్పటికీ.. ఆయన్ను రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో...సదరు పేషెంట్ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన లండన్ నుంచి భారత్‌కి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బర్మింగ్‌హామ్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ , భార సంతతి డాక్టర్ విశ్వరాజ్ వేమల సుమారు 10 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉండగా.. ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 43 ఏళ్ల వ్యక్తి రెండు సార్లు తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయం గురిచి డాక్టర్ విశ్యరాజ్ తెలియజేశారు. ఈ మేరకు విశ్వరాజ్ అతన్నిరక్షించేందుకు విమానంలో పరిమిత పరిధిలోనే ఉన్న వైద్య సామాగ్రితో అతని ప్రాణం కాపాడేందుకు శతవిధాల యత్నించారు. వాస్తవానికి ఆయన లండన్‌లో ఉన్న తన తల్లిని తిరిగి భారత్‌లోని తమ స్వస్థలం బెంగళూరుకి తీసుకువెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చిందంటూ తన వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లు విశ్వారాజ్ తెలిపారు. విమానంలో ఉన్న పరిమిత పరిధిలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ సాయంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఐతే అతను స్ప్రుహలోకి రావడానికి సుమారు గంట సమయం పట్టిందని, తనతో మాట్లాడుతుండగానే మరోసారి గుండెపోటుకి గురైనట్లు తెలిపాడు. దీంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరిలో ఆ వ్యక్తి గురించే ఒకటే టెన్షన్ మొదలైంది. అందరం అతను ఐదుగంటల వరకు ప్రాణాలతో ఉండేలా ప్రయత్నించాం. ఆ ప్రయాణికుడు విషయమై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పైలెట్ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తామంతా ముంబైలో దిగుతుండగా అందరిలోనే అతను బతకే ఉండాలంటూ ఒకటే ఆందోళన చెందినట్లు తెలిపారు. ఎట్టకేలకు ముంబైలో దిగినప్పుడూ.. ఆ ప్రయాణికుడు సదరు డాక్టర్ విశ్వారాజ్తో మాట్లాడటమే కాకుండా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. అదీగాక ముంబైలోని ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది అతన్ని సురక్షితంగా కాపాడటమే గాక అతను కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ విశ్వరాజ్ వేముల తన జీవితాంతం ఈ ఘటన మర్చిపోలేనంటూ..ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి: ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..) -
ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా జుట్టు ఊడి..
భారత సంతతి టీనేజ్ అమ్మాయికి దారుణమైన ప్రమాదం బారిన పడింది. ఏకంగా నెత్తిపై జుట్టుతో సహా చర్మం ఊడొచ్చి.. వెన్నుకి సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకెళ్తే..దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో గేట్‌వే మాల్లో భారత సంతతికి చెందిన క్రిస్టినా అనే టీనేజ్ అమ్మాయి గో కార్ట్ అనే స్పోర్ట్స్ కారుని నడుపుతోంది. అనుహ్యంగా ఆమె జుట్టు ఆ కారు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో తలపై ఉన్న హెల్మట్ పడిపోయి.. నెత్తిమీద ఉన్న జుట్టుతో సహా చర్మం ఊడొచ్చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. అంతేకాదు ఈ ప్రమాదంలో ఆమె వెన్నుకి కూడా తీవ్రగాయాలయ్యయి. ఈ ఘటన డర్బన్‌లోని ప్రముఖ గేట్ వే మాల్లోని ఎంటర్టైన్మెంట్ సెంటర్లో గత బుధవారం జరిగింది. కానీ క్రిస్టినా ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. ఈ మేరకు బాధితురాలి తండ్రి వెర్నాన్ గోవేందర్ మాట్లాడుతూ...రేసింగ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియనిబంధనలు పాటించిందని అన్నారు. కానీ ఆ గో కార్ట్(స్పోర్ట్స్) కారులోని పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. ఆమె తన జుట్టును కూడా పోనీటైల్లా కట్టేసిందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం తక్షణ సాయం అందించడంలో విఫలమైందని చెప్పారు. ఆ సమయంలో తన కూతురు వద్ద తన 13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని ఈ ఘటన గురించి చెప్పేందుకు గో కార్ట్ కార్యాలయానికి కూడా వెళ్లాడని చెప్పారు. ఐతే అప్పటికే కార్యాలయాన్ని మూసేసి, వారంతా వెళ్లిపోయినట్లు వాపోయారు. రేసింగ్ కోర్సులో భాగంగా తన కూతురు క్రిస్టినా గో కార్ట్‌ని నేర్చుకుంటుండగా.. స్పిన్ అవుతున్న సమయంలో గో కార్ట్‌లోని చట్రంలో ఆమె జుట్లు ఇరుక్కుపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరొకరెవరూ.. ఇలాంటి ఘోరమైన ప్రమాదం బారినపడకూదని..సదరు గోకార్ట్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి తండరి గోవేందర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు యాక్షన్ కార్టింగ్ గేట్‌వే యజమాని స్టీవెన్ పూల్ మాట్లాడుతూ.."రేస్ జరుగుతున్న ట్రాక్ వద్ద అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి అనుహ్య ఘటన జరగలేదు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని, కానీ ఆ సమయంలో బాధితురాలు క్రిస్టినా మామ చాలా దూకుడుగా ప్రవర్తించాడు. మాకు ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంది. క్లైయింట్స్ అందరికీ సంరక్షణ పద్ధతులకు సంబంధించిన రేసింగ్ వీడియోని చూపిస్తాం. అలాగే కార్ట్‌ని ఎలా నడపాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేదానిపై కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆఖరికి ఇలాంటివి చేసేటప్పుడూ..జుట్టును ఎలా కట్టుకోవాలో కూడా పూర్తిగా వివరిస్తాం. ఐతే ఒకప్పుడూ ఈ రేసింగ్ నేర్చుకుంటున్న వాళ్లకి తమ సిబ్బందే జుట్టును దగ్గరుండి ముడివేసి కట్టేదని, కానీ తల్లిదండ్రుల అయిష్టత చూపడం తోపాటు ఫిర్యాదుల చేయడంతో వారి వ్యక్తిగతానికే వదిలేశామని" వివరించాడు స్టీవెన్ పూల్. (చదవండి: భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్? కొండపై నుంచి కారును అమాంతం..) -
భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్? కొండపై నుంచి కారును అమాంతం..
టెస్లా కారులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన కుటుంబం కాలిఫోర్నియాలోని పెద్ద కొండపై నుంచి పడిపోయింది. ఐతే ఈ ఘటనలో ఆ కుటుంబ సభ్యులంతా ప్రాణాలతో బతికి బట్టగట్టగలిగారు. ఈ ప్రమాదం శాన్ మాటియో కౌంటీలోని డెవిల్స్ స్లైడ్ వద్ద జరిగింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని నిర్థారించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ..హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకున్న కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ సిబ్బంది హెలికాప్టర్లతో అద్భుతంగా రెస్కూ ఆపరేషన్ చేపట్టి బాధితులను రక్షించింది. ఐతే ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన హత్యా యత్నంగా అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు కుటుంబ యజమాని 41 ఏళ్ల ధర్మేష్ ఏ పటేల్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయనున్నట్లు కాలిఫోర్నియా పోలీసులు పేర్కొన్నారు. అదీగాక కారు కొండపై నుంచి ఇంత నిటారుగా పడిపోతే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అన్నారు. చాలా అరుదైన సమయాల్లోనే ఇలా జరుగుతుందని అన్నారు. ఈ ప్రమాదంలో 4 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల బాలుడికి చాలా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బాధితులు దాదాపు 250 నుంచి 300 అడుగులు కొండ దిగువున పడిపోయినట్లు పేర్కొన్నారు. బహుశా కారు సీట్లు పిల్లలను కాపాడి ఉండవచ్చని భావించారు. సదరు వ్యక్తి పటేల్ తన భార్య పిల్లలను చంపేందుకు ఇలా హత్యయత్నానికి ఒడిగట్టాడేమో అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. అతను కోలుకున్న తర్వాత శాన్ మాటియో కౌంటీ జైలుకు తరలిస్తామని అధికారులు తెలిపారు. (చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ)