
గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) తన నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మిని నియమించింది. టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మిని అంబాసిడర్‌గా నియమిస్తున్నుట్లు యూఎన్‌డీపీ ప్రకటించింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన ఆమె అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి పాటుపడాల్సి ఉంటుంది. ‘ప్రపంచంలోని అనేక మంది మహిళలు, బాలికలు ఎన్నో వివక్షలను, అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న సంగతి మనం మరచిపోకూడదు. ప్రధానంగా అసమానతపై దృష్టి సారిస్తా’ అని ఈ సందర్భంగా పద్మాలక్ష్మీ అన్నారు.