
‘సమ’ దారిలో ‘సగం’ దూరం
జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025
‘జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025’ (Gender Equality Strategy 2022-2025 ) పేరుతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో ది గ్లోబల్ కాంటెక్ట్స్–క్రైసిస్ అండ్ ఆపర్చునిటీ, వాట్ వుయ్ హ్యావ్ లెర్న్‌డ్, అవర్ పార్ట్‌నర్‌షిప్స్, డైరెక్షన్స్ ఆఫ్ చేంజ్, అవర్ ప్రయార్టీస్, త్రీ ఎనేబ్లర్స్, ఇన్‌స్టిట్యూషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్... అనే అధ్యాయాలు ఉన్నాయి.
‘మనం ముఖ్యంగా రెండు విషయాల గురించి ఆలోచించాలి. లింగ సమానత్వం దిశగా పురోగతి ఎందుకు నెమ్మదిగా, చెల్లాచెదురుగా ఉంది. దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి? అయితే ఎంత జటిలమైన సవాలు అయినా కొత్త అవకాశాలను అందిస్తుంది. కొత్త వ్యూహాలు రూపొందించుకునేలా చేస్తుంది’ అంటూ కార్యాచరణ ప్రణాళికకు ముందు మాట రాశాడు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యుఎన్ డిపి) అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టెయినర్.
‘సమ’ దారిలో ‘సగం’ దూరం
లక్ష్యం కూడా విత్తనంలాంటిదే. విత్తే ముందు దాని విలువ అంతగా తెలియకపోవచ్చు. ‘అది ఎప్పుడు మొలకెత్తాలి? ఎప్పుడు చెట్టు కావాలి?’ అనే నిరాశ కూడా ఎదురు కావచ్చు. అయితే విత్తనం ఎప్పుడూ ఫలాన్ని వాగ్దానం చేస్తుంది. విత్తనంలాగే లక్ష్యం కూడా ఫలితాన్ని వాగ్దానం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ‘విమెన్స్ ఈక్వాలిటీ 2030’ లక్ష్యం ఎంతో ఆశను రేకెత్తించడంతో పాటు ఎప్పటికప్పుడూ చర్చనీయాంశంగా ఉంటూ వస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే ముందు సవాళ్లు, సమస్యలపై అవగాహన ఉండాలి. విమెన్ అండ్ యూనైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్ రి΄ోర్ట్ జెండర్ ఈక్వాలిటీకి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించింది..
నాయకత్వంలో మహిళల కొరత : పార్లమెంటరీ సీట్లలో 27 శాతం, స్థానిక సీట్లలో 36 శాతం, మేనేజ్‌మెంట్ పదవుల్లో 28 శాతం మహిళలు మాత్రమే ఉండడంతో సమగ్ర విధాన రూపకల్పనకు ఆటంకం కలుగుతోంది. భిన్న అభిప్రాయాల కొరత కనిపిస్తోంది.
పేదరికం : 2030 నాటికి 34 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలో మగ్గిపోతారని అంచనా. ప్రపంచ మహిళా జనాభాలో 8 శాతం మంది రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారు.
పని ప్రాంతంలో వివక్ష–అసమానతలు: పురుషులలో 91 శాతం మందితోపోల్చితే మహిళల్లో 61 శాతం మంది మాత్రమే శ్రామిక శక్తి(లేబర్ ఫోర్స్)లో ఉన్నారు. ఇది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి రెండిటినీ ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే శ్రమ ద్వారా మహిళలు తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు.
అసమతుల్యత: పనిచేసే వయసులో ఉన్న సుమారు 2.4 బిలియన్‌ల మహిళలకు సమాన ఆర్థిక అవకాశాలు లభించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్‌ల మహిళలకు పురుషులతో సమానమైన ఆర్థిక హక్కులు లేవు. వేతనం లేని సంరక్షణ(అన్‌పేయిడ్ కేర్ వర్క్)లో మహిళలు, పురుషులు గడిపే సమయం మధ్య అంతరం కొద్దిగా తగ్గుతుంది. కానీ 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల కంటే 9.5 శాతం ఎక్కువ సమయం(రోజుకు 2.3గంటలు) వేతనం లేని సంరక్షణ పనిలో గడుపుతారు. ఈ నిరంతర అంతరం విద్య, ఉపాధి, ఇతర అవకాశాలలో మహిళల భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తుంది.
సామాజిక కట్టుబాట్లు – సాంస్కృతిక ఆచారాలు: ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు యువతులలో ఒకరికి పద్దెనిమిది ఏళ్లు నిండక ముందే పెళ్లి జరుగుతుంది.
విద్య-ఆరోగ్యం: 2030 నాటికి 110 మిలియన్‌ల మంది బాలికలు, యువతులు స్కూల్‌కు దూరంగా ఉంటారని అంచనా.
ఆహార అభద్రత: 2030 నాటికి దాదాపు 24 శాతం మంది మహిళలు, బాలికలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కోనున్నారని అంచనా.
హింస: ప్రతి సంవత్సరం 245 మిలియన్‌ల మంది మహిళలు, బాలికలు భర్త, సన్నిహితుల ద్వారా శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. వృద్ధ పురుషులతో పోల్చితే వృద్ధ మహిళలు ఎదుర్కొంటున్న పేదరికం, హింస ఎక్కువ.
నిదుల కొరత: లింగ సమానత్వం గురించి అవగాహన కలిగించే కార్యక్రమాల నిర్వహణకు తగినంత నిధులు లేవు. కేవలం నాలుగు శాతం మాత్రమే లింగ సమానత్వం, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై కేటాయిస్తున్నారు. 2030 నాటికి లింగ సమానత్వాన్ని సాధించడానికి అవసరమైన అదనపు పెట్టుబడి సంవత్సరానికి 360 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
అమలు చేయని చట్టాలు: కనీసం 28 దేశాలలో వివాహం, విడాకులకు సంబంధించి మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు లేవు. 67 దేశాలలో మహిళలపై ప్రత్యక్ష, పరోక్ష వివక్షను నిషేధించే చట్టాలు లేవు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి చట్టాలు ఉన్న చోట సమర్థవంతమైన అమలు సవాలుగా ఉంది........‘సవాళ్లు, సమస్యల సంగతి సరే, ఇప్పటి వరకు మనం ఏర్పర్చుకున్న లక్ష్యాల వల్ల ఏ మేరకు పురోగతి సాధించాం?’ అనే ప్రశ్న వేసుకుంటే జవాబు కొంత ఆశాజనకంగా ఉంటుంది. అంతర్జాతీయ నియమాల (ఇంటర్నేషనల్ కమిట్‌మెంట్స్) వల్ల కొన్ని రంగాలలో మెరుగుదల కనిపిస్తుంది. బాల్య వివాహాలు కొంత మేరకు తగ్గిపోయాయి. ఇది చిన్న ఆశా రేఖ మాత్రమే.
‘కోవిడ్‌లాంటి విపత్తుల వల్ల 2030 లక్ష్యం మనుపటి కంటే మరింత దూరంలో ఉంది’ అనే మాట వినబడుతుంది. 2030 లక్ష్యాలకు సంబంధించి చాలా రంగాల్లో పురోగతి మందకొడిగా సాగుతుందని, బాల్యవివాహాలు పూర్తిగా కనిపించకుండా చేయడానికి, చట్టపరమైన రక్షణ (లీగల్ ప్రొటెక్షన్)లో అంతరాలను పూడ్చడానికి, వివక్ష పూరిత చట్టాలను తొలగించడానికి, పని ప్రాంతంలో అధికారం, నాయకత్వ స్థానాల్లో మహిళలకు సమాన ప్నిధ్యం కల్పించడానికి, పార్లమెంట్‌లో సమాన ప్రాతినిధ్యం సాధించడానికి పట్టే కాలం... సుదీర్ఘ కాలం అంటున్నారు. ‘2030 లక్ష్యాలను చేరుకోవడానికి సమిష్టి కృషి, నిధుల పెంపుదల అవసరం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు కీలకమైనదే’ అంటుంది యూఎన్ రిపోర్ట్.
Comments
Please login to add a commentAdd a comment