నాడు బానిస.. నేడు గుడ్ విల్ అంబాసిడర్
లండన్: ఇస్లామిక్ ఉగ్రవాదుల చెరలో బంధీగా చిక్కి చిత్ర హింసలనుభవించి వారి చెరనుంచి బయటపడి తన లాంటి వారి విముక్తి కోసం పాటుపడుతోంది నదియా మురాద్(21). మహిళల ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా నదియా చేస్తున్న కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది. 2014 లో ఇరాన్ లోని యాదిజి (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇంట్లోంచి ఎత్తుకెల్లారు. అడ్డొచ్చిన సోదరులను, తల్లిని కళ్ల ముందే చంపేశారు.ఆమెను సెక్స్ బంధీగా చేసి చిత్రహింసలకు గురిచేశారు.
ఐసిస్ నుంచి బయటపడిన ఆమె ఇరాక్ లో యాదిజి వర్గ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇరాక్ లో ఉగ్రవాదులు మహిళలను అపహరించడం, అడ్డొచ్చిన వారిని చంపడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందిని వరకు అపహరించారు.వారి చెరలో 4 వేల మంది మహిళలు బంధీలుగా ఉన్నారు. వారి విముక్తి కోసం తన జీవితం అంకితమని నదియా ప్రకటించారు.