Slave
-
భారతీయ మహిళపై పైశాచికత్వం.. నోట్లో పళ్లన్నీ ఊడిపోయేలా..!
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే ఎందరో అమాయకులు బానిత్వంలో మగ్గిపోతున్నారు. వారిపై యజమానులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. మానవత్వాన్ని మరిచి చేసే హింసల దాటికి బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. మెల్బోర్న్(ఆస్ట్రేలియా): ఓ భారతీయ మహిళను ఎనిమిదేళ్లపాటు తమ ఇంటిలో బానిసగా ఉంచినందుకు మెల్బోర్న్ దంపతులకు అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు. అయితే కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి మెల్బోర్న్లో స్థిరపడ్డారు. కాగా వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మహిళను 2007లో మెల్బోర్న్కు తీసుకెళ్లారు. కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆ మహిళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై పైశాచికంగా ప్రవర్తించి కొట్టడంతో నోట్లో పళ్లన్నీ ఊడిపోయాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. ఇలా వెలుగులోకి.. కాగా 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమెను పరీక్షించిన ఓ పారామెడిక్.. మహిళ కేవలం 40 కేజీల బరువు ఉండి, శరీర ఉష్ణోగ్రత కూడా 28.5 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు షుగర్ ఉండగా.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో ఆ పారామెడిక్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ భార్యాభర్తలు చేసిన అమానవీయ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. వృద్ధ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వాళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించే సందర్భంలో వ్యాఖ్యానించారు. -
విమర్శించడం ఆపేద్దాం!
‘‘చెడు అలవాట్లకు బానిసయినవాళ్లను విమర్శించడం కంటే అసలు దానికి ఎందుకు బానిస అయ్యారనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ విమర్శించడం అలవాటై, ఆ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం’’ అన్నారు నటి, దర్శకురాలు పూజా భట్. గతంలో ఆమె మద్యానికి బానిస అయి, అందులో నుంచి బయటపడ్డారు. పలు సందర్భాల్లో ఈ విషయం గురించి ప్రస్తావించారామె. తాజాగా మరోసారి మద్యం అలవాటు నుంచి బయటపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మూడు సంవత్సరాల తొమ్మిది నెలలయింది మద్యం మానేసి. ఇంకో మూడు నెలలయితే నాలుగేళ్లు పూర్తవుతాయి. నేను మందు ఎలా బహిరంగంగానే తీసుకున్నానో, అందులో నుంచి బయటపడిన విషయాన్ని కూడా ఓపెన్‌గానే చెబుతాను. ఎందుకంటే నా ప్రయాణం అందరికీ తెలియాలనుకున్నాను. మద్యం మత్తు నుంచి బయట పడాలనుకుంటున్న వాళ్లకు స్ఫూర్తిగా ఉంటుందనుకున్నా. ఒక అలవాటు మానుకోవడానికి ఎంతో కృషి చేయాలి. మానేయాలనే పట్టుదలే మనల్ని మానేసేలా చేస్తుంది. మీరొక్కరే (మద్యానికి అలవాటుపడినవాళ్లు) ఒంటరిగా లేరు. మీలానే దీంట్లో నుంచి బయటపడాలనుకుంటున్నవాళ్లు చాలామందే ఉన్నారని తెలుసుకోండి. ఇలా బయటకు మాట్లాడినందుకు చాలా మంది నన్ను అభినందించారు. కొందరు ఎగతాళి కుడా చేశారు. ఏదైనా విషయానికి బానిసలైతే దానికి ఎందుకు బానిసలయ్యారో కనుక్కోవాలి’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు పూజా భట్. -
‘గతాన్ని గుర్తు చేస్తున్నాయి.. తొలగించండి’
లండన్: జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ప్రభావం బ్రిటన్ మీద కూడా పడింది. ‘బ్లాక్‌లైవ్స్ మాటర్’ నిరసన సెగ దేశవ్యాప్తంగా ఉన్న బానిస వ్యాపారులు, వలసవాదుల విగ్రహాలకు తాకింది. మంగళవారం ఆందోళనకారులు లండన్ మ్యూజియం బయట ఉన్న 18వ శతాబ్దానికి చెందిన బానిసల వ్యాపారి రాబర్ట్ మిలిగాన్ విగ్రహాన్ని తొలగించారు. ఈ క్రమంలో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ‘మన నగరం, దేశ సంపద బానిస వ్యాపారం నుంచి ఉద్భవించిది అనేది వాస్తవం. బహిరంగ ప్రదేశాల్లో ఇందుకు సంబంధించిన వేడుకలు జరుపుకోనవసరం లేదు. ఈ విగ్రహాలు, రహదారి పేర్లు, బహిరంగ ప్రదేశాల పేర్లు పూర్వ యుగాన్ని ప్రతిబింబిస్తాయి. వీటి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ ట్వీట్ చేశారు. నిరసనల నేపథ్యంలో లండన్ వ్యాప్తంగా వలసవాదులు, బానిస వ్యాపారుల పేర్ల మీద ఉన్న విగ్రహాలు, వీధుల పేర్లను సమీక్షించేందుకు గాను ఓ కమిటిని నియమించినట్లు సాదిక్ ఖాన్ తెలిపారు. ఆదివారం నిరసనకారులు బ్రిస్టల్‌లోని ఇంగ్లీష్ పోర్టు సిటిలో ఉన్న ఓ బానిసల వ్యాపారి కోల్స్టోన్ విగ్రహాన్ని రేవులో పడేశారు. సోమవారం ఆక్స్‌ఫర్డ్‌లో 1,000 మందికి పైగా ప్రదర్శనకారులు వలసవాది సిసిల్ రోడ్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టవర్ హామ్లెట్స్ మేయర్ జాన్ బిగ్స్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘విగ్రహాలను తొలగించడం మంచి పద్దతి కాదు. కానీ నిరసకారుల ఆందోళన వల్ల ప్రస్తుతం ఈ విగ్రహాలను తొలగించి స్టోర్ రూమ్‌లో భద్రపరిచి.. ఏం చేయాలనే దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’) ‘ప్రజలు ఇన్నాళ్లు విగ్రహాలు నిలబెట్టిన వ్యక్తులందరిని గొప్ప వ్యాపారవేత్తలుగా భావించారు. వారంతా దేశ ఉన్నతికి తోడ్పడ్డారని అనుకున్నారు. కానీ లోతుగా తరచి చూస్తే తెలిసే వాస్తవం ఏంటంటే వారంతా బానిస వ్యాపారులు. అందుకే ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగిస్తున్న నిరసనకారులను బ్రిస్టల్ పోలీసులు అడ్డుకోలేదు’ అన్నారు బిగ్స్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని తొలగించడాన్ని నేరంగా వర్ణించారు. -
ముగ్గురి చేతుల్లో దేశం బానిస
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్కు చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ చేతుల్లో దేశం బానిసగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పారు. అతి త్వరలోనే దేశం శక్తిసామర్థ్యాలు ఏమిటో మోదీ, అమిత్, భాగవత్ గ్రహించేలా చేస్తామన్నారు. ఢిల్లీలో తల్కాతోరా మైదానంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఏర్పాటు చేసిన ఓబీసీల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ గుర్తించిందని, వారికి అవకాశాలివ్వడం ద్వారా రాజకీయంగా వారు ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటోందని చెప్పారు. ఓబీసీలను శక్తివంతులుగా మారు స్తామన్నారు. తాము వారిని బస్సులో మాట్లాడకుండా కూర్చో బెట్టబోమని, వారికే తాళాలు ఇచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతామని చెప్పారు. దేశంలో నైపుణ్యాలకు కొదవలేదని, వెనుకబడిన వర్గాల వారిలో నైపుణ్యాలు ఇంకా ఎక్కువ ఉంటాయని, అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే వెనుకబడిపోయారన్నారు. బీజేపీ 15–20 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తోందని, ప్రధాని మోదీని మార్కెట్ చేసేందుకు వారు కోట్లు కుమ్మరిస్తున్నందుకు ప్రతిఫలంగా వారికి సహకరిస్తోందన్నారు. మోదీ విధానాలపై విమర్శలకు మరింత పదును పెట్టిన రాహుల్‌గాంధీ అమెరికా పారిశ్రామికవేత్తలకు కొత్త పేర్లు పెట్టారు. కోకా–కోలా వ్యవస్థాపకుడిని షికంజి విక్రేతగా, మెక్ డొనాల్డ్స్‌ను దాబావాలాగా, ఫోర్డ్, మెర్సిడెస్, హోండా వ్యవస్థాపకులను మెకానిక్స్‌గా పేర్కొన్నారు. -
నాడు బానిస.. నేడు గుడ్ విల్ అంబాసిడర్
లండన్: ఇస్లామిక్ ఉగ్రవాదుల చెరలో బంధీగా చిక్కి చిత్ర హింసలనుభవించి వారి చెరనుంచి బయటపడి తన లాంటి వారి విముక్తి కోసం పాటుపడుతోంది నదియా మురాద్(21). మహిళల ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా నదియా చేస్తున్న కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది. 2014 లో ఇరాన్ లోని యాదిజి (నాన్ ముస్లిం) వర్గానికి చెందిన నదియాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇంట్లోంచి ఎత్తుకెల్లారు. అడ్డొచ్చిన సోదరులను, తల్లిని కళ్ల ముందే చంపేశారు.ఆమెను సెక్స్ బంధీగా చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఐసిస్ నుంచి బయటపడిన ఆమె ఇరాక్ లో యాదిజి వర్గ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇరాక్ లో ఉగ్రవాదులు మహిళలను అపహరించడం, అడ్డొచ్చిన వారిని చంపడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందిని వరకు అపహరించారు.వారి చెరలో 4 వేల మంది మహిళలు బంధీలుగా ఉన్నారు. వారి విముక్తి కోసం తన జీవితం అంకితమని నదియా ప్రకటించారు. -
ప్రేమ, క్షమ లేకుంటే... సమాజమే ఎడారి
సువార్త ఒనేసిము ఒకప్పుడు ఫిలేమోను అనే ధనికుని వద్ద బానిసగా ఉండి పారిపోయినవాడు. అయితే అతనికి అపొస్తలుడైన పౌలు పరిచయమయ్యాడు. తద్వారా యేసుక్రీస్తును తెలుసుకొని విశ్వాసి అయ్యాడు. పారిపోయిన బానిసలకు, వారి యజమానులు క్షమిస్తే తప్ప, రోమా ప్రభుత్వం మరణశిక్ష విధించే రోజులవి. పైగా పారిపోయిన బానిసలకు వారి యజమానులు క్షమించడం కూడా జరిగేది కాదు. కాని ఫిలేమోను కూడా తన ద్వారానే ప్రభువును తెలుసుకున్నవాడు గనుక ఒనేసిమును బానిసగా కాక విశ్వాసిగా పరిగణించి అతన్ని క్షమించమని కోరుతూ పౌలు అతనికి ఒక లేఖ రాసి ఒనేసిముతోనే పంపించాడు. అతని వల్ల జరిగిన నష్టాన్ని తన ఖాతాలో వేస్తే తానే చెల్లిస్తానని కూడా పౌలు తెలిపాడు. పౌలు అభ్యర్థన మేరకు ఫిలేమోను అతన్ని క్షమించగా ఎఫెసీలోని చర్చికి తిమోతి తరువాత ఒనేసిము కాపరి అయ్యాడని, అలా అద్భుతమైన పరిచర్య చేశాడని చరిత్ర చెబుతోంది (ఫిలే 1:8-22). దేవుడు శ్రుతి చేసిన విశ్వాసి అద్భుతమైన రాగాలు పలుకుతాడు, ప్రేమ, క్షమ అతనిలో పరిమళిస్తుంది. పౌలు, ఫిలేమోను, ఒనేసిముల్లో అదే జరిగింది. ఫిలేమోను ధనికుడైన యజమాని, ఒనేసిము పారిపోయిన బానిస, నేరస్తుడు. కాగా పౌలు వారిద్దరికీ ఆత్మీయతండ్రి. సామాజికంగా ఈ ముగ్గురి మధ్యా ఎన్నో అంతరాలున్నా, దేవుని ప్రేమ, క్షమ అనే ఉమ్మడి అంశాలు పునాదిగా వారి మధ్య అపూర్వమైన అనుబంధం పరిమళించింది. ఫలితంగా ఆ ముగ్గురి సమిష్టి కృషితో దేవుని రాజ్య నిర్మాణం జరిగింది. దేవునితో అనుబంధం బలంగా ఉన్న విశ్వాసి జీవితంలోని ప్రతి అనుబంధమూ, బాంధవ్యమూ అత్యంత ప్రేమమయంగా ఉంటుంది. ప్రతి బాంధవ్యాన్ని కూడా దేవుడు తనను ప్రేమించినట్టుగా లోకాన్ని ప్రేమించే ఒక సదవకాశంగా భావిస్తాడు. అందుకే ఒక తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, సోదరుడిగా, సోదరిగా, మిత్రుడిగా, దేశపౌరుడిగా అత్యున్నతమైన విలువల స్థాపనకు విశ్వాసి శ్రమిస్తాడు. అలా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాడు. అయితే విశ్వాసులు కానివారి దృష్టిలో సమాజమంతా ఒక మాయా ప్రపంచం. తోటి మనుషులంతా అవసరార్థమైన సాధనాలు, పెకైగబాకేందుకు ఉపయోగపడే నిచ్చెనలు!! ఈ దుష్ట, భ్రష్ట విషవలయం నుండి విముక్తినిచ్చి విశ్వాసిని సమాజాన్ని కూడా ప్రభావితం చేసి ప్రేమామయం చేసేది దేవుని శక్తి. మన దైనందిన సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ, నిజాయితీ, నిస్వార్థత లేకపోతే ఆ బంధాలకు అసలు విలువేలేదు. తన సామాజిక బంధాల్లోనే నిజాయితీ లేనివాడుూ దేవునితో గల బాంధవ్యంలో నిజాయితీ కలిగి ఉంటాడనుకోవడం కేవలం భ్రమ!! అలాంటి వారి ప్రార్థనలు, అర్పణలు, పాటలు, ప్రసంగాలు, ఆరాధనలకు దేవుని దృష్టిలో అసలు విలువ లేదు. శ్రుతిలేక అపస్వరాలు పలికే వయోలిన్ వంటిదే ప్రేమ కరువైన సమాజం. ఊర్లో పోస్ట్మాన్ని మామా అని, ఇంటికొచ్చి గాజులమ్మిన వ్యక్తిని బాబాయ్ అని, చింతకాయలు కోసిచ్చిన అపరిచితున్ని అన్నా అని, పొరుగిళ్లలో వాడల్లో బోలెడు మంది అత్తలు, పిన్నిలు, మామయ్యలు, బాబాయ్‌లు, తాతలు, అవ్వల్ని కలిగి ఉన్న ఎంతో ఆప్యాయతాభరితమైన సమాజం ఒకప్పుడు మనది. కాలక్రమంలో ఆధునికత కాటుకు అది అంతరించింది. స్వార్థం, ధనార్జన తప్ప మరొకటి కానరాని నేటి సమాజపు విష కౌగిలిలో ఇప్పుడు స్వచ్ఛందంగా భాగమై నలిగిపోతున్నాం. పాపిని ప్రేమించి పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును కలిగి ఉండటమే ఒక తియ్యటి అనుబంధం. ఆ ప్రేమ విశ్వాసి ద్వారా లోకమంతా వ్యాపిస్తే అదే అసలైన ఆరాధనానుభవం!! - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
తమ్ముళ్లూ..జర జాగ్రత్త!
టీనేజ్లోనే మందుకు బానిసైన వారు ఆరోగ్యం, సామాజిక కోణాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారని అభివృద్ధి చెందిన దేశాలలోని అనుభవాలు చెబుతున్నాయి. టీనేజర్లలో గతంలో కంటే ఎక్కువగా మందు కొట్టే అలవాటు మన దేశంలో పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి తెలియజేస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత మేల్ టీనేజర్లు మందు కొట్టడంలో ముందున్నారు. కొలంబియా యూనివర్శిటీకి చెందిన అరవింద్ పిళ్ళై బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ‘‘1956-1960 మధ్య కాలంలో 19.5 శాతం మేల్ టీనేజర్లు మందుకొట్టేవారు. ప్రస్తుతం అది 70 శాతానికి మించిపోయింది’’ అంటున్నారు అరవింద్. ‘ఏ వయసులో మొదట మందు కొట్టారు?’, ‘ఎంత పరిణామంలో తాగారు?’, ‘ఏవైనా ప్రమాదాలు జరిగాయా?’, ‘ఇప్పుడు ఎంత తాగుతున్నారు?’ మొదలైనవి ప్రశ్నావళిలో ఉన్నాయి. కేవలం మద్యానికి సంబంధించినవే మాత్రమే కాకుండా మద్యపాన సమయంలో మానసిక స్థితిగతులను అంచనా వేయడానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇందులో ఉన్నాయి. ‘‘ఒకప్పుడు సంపన్నదేశాల టీనేజర్లలో మందు కొట్టే అలవాటు ఉండేది. ఇప్పుడు అభివృద్ధి, వెనకబాటుతనంతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని దేశాల టీనేజర్లలోనూ ఈ జాడ్యం పెరిగిపోయింది’’ అంటున్నారు అరవింద్. టీనేజ్లోనే మందుకు బానిసైన వారు ఆరోగ్యం, సామాజిక కోణాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారని అభివృద్ధి చెందిన దేశాలలోని అనుభవాలు చెబుతున్నాయి. ఆ అనుభవాల నుంచి మనం గుణపాఠాలు తీసుకోకపోతే...‘ఆనందం’ అనే సాకుతో తీసుకునే మద్యం మన జీవితాల్లో విషాదం నింపుతుంది. మద్యానికి దూరంగా ఉండడానికి కొన్ని సూచనలు... మద్యపానం వల్ల ఉత్సాహం వస్తుందని, అందులో ఆనందం ఉందనే మాటలను నమ్మి మోసపోకండి. ‘‘టీనేజ్ అంటేనే ఎంజాయ్. మందు పేరు వినగానే ముక్కు మూసుకుంటే ఎలా?’’ అని రెచ్చగొట్టే స్నేహితులను ‘‘ఎంజాయ్ అంటే ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడమా?’’ అని అడగండి. ‘‘నువ్వేమీ రోజూ తాగడం లేదు కదా... ఈ ఒక్క రోజే కదా’’ అని చెబుతూ మందును ముందు పెట్టేవాళ్లు కూడా ఉంటారు. గమనించాల్సిన విషయం ఏమంటే, ఒక్కసారి మందు కొడితే అది సంవత్సరం నుంచి నెలల్లోకి, నెల నుంచి వారం, వారం నుంచి రోజుల్లోకి మరుతుంది. ‘మందు కొట్టడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు’ దీని తాలూకు సమాచారాన్ని సంపాదించి ఒకటికి రెండు సార్లు చదువుకోండి. ఫ్రెండ్స్ పార్టీలకు ఆహ్వానించినప్పుడు చదివిన విషయాలను ఒకటికి రెండుసార్లు గుర్తు తెచ్చుకోండి. అప్పుడిక మందు మీ ముందుకు వస్తే ఒట్టు! -
సిబ్బందితో చెప్పులు మోయించిన ఆలయ ఈవో