![Bangladesh 2024 Student Protests UN Report](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Bangladesh-2024-Student.jpg.webp?itok=h1JZTrN3)
బంగ్లాదేశ్‌లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడింది. అనంతరం జరిగిన పరిణామాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఒక నివేదికను వెలువరించింది. నాడు చెలరేగిన హింసలో 1,400 మంది హతమయ్యారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని పరోక్షంగా పేర్కొంది. నాడు బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనల ఉదంతాలను కూడా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆ నివేదికలో తెలియజేసింది.
బంగ్లాదేశ్‌లో 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాటి షేక్ హసీనా ప్రభుత్వం.. నేటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాల కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారు.
2024 విద్యార్థి ఉద్యమంలో సుమారు 1,400 మంది హతమయ్యారని నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు చిన్నారులతో సహా పలువురు నిరసనకారులను కాల్చిచంపాయని తెలిపింది.
తిరుగుబాటు తొలి రోజుల్లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం 150 మంది మరణాలను మాత్రమే నిర్ధారించింది. అయితే ఈ నివేదికలోని వివరాల ప్రకారం వందలాదిగా సాగిన చట్టవిరుద్ధ హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు మొదలైనవన్నీ షేక్ హసీనా ప్రభుత్వంతో పాటు భద్రతా అధికారుల సహకారంతోనే జరిగాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది.
ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా మతపరమైన మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నదని ఆ నివేదిక ఆరోపించింది. మహిళలు వారి నిరసనను వ్యక్తం చేయకుండా నిరోధించేందుకు వారిపై శారీరక దాడి, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారని కూడా నివేదిక పేర్కొంది. నిరసనలను అణిచివేసే నెపంతో రాజకీయ నేతలు, భద్రతా అధికారులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు. విద్యార్థి నేత, అమరవీరుడు అబూ సయీద్ హత్య కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్
Comments
Please login to add a commentAdd a comment