bangaldesh
-
మోదీ-ట్రంప్ భేటీ తర్వాతే భారత్‌కు అమెరికా భారీ షాక్!
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన అలా ముగించి ఇలా వచ్చారో లేదో.. భారత్‌కు ట్రంప్ భారీ షాకిచ్చారు. భారత్, బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు అందించే మిలియన్ డాలర్ల నిధుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOSE) శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నిర్వహిస్తున్నారు. ఎలోన్ మస్క్ సూచన మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని మోదీ గతవారం అమెరికాలో పర్యటించారు. పర్యటన సమయంలో ఇద్దరు నేతలు అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేసేలా ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి కేటాయించే 21 మిలియన్ల డాలర్లను, బంగ్లాదేశ్ రాజకీయాల్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన 29 మిలియన్ల డాలర్ల మొత్తాన్ని తగ్గించాలని అమెరికా నిర్ణయించినట్లు ఎలోన్ మస్క్ ప్రభుత్వ సామర్థ్య విభాగం డోజ్ ఆదివారం ప్రకటించింది. ఇదే విషయాన్ని డోజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కాగా, డొనాల్డ్ ట్రంప్‌ని ప్రధాని మోదీని కలిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం.మరోవైపు బంగ్లాదేశ్‌లో, రాజకీయ స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పాలనను మెరుగుపరచడానికి రూపొందించిన కార్యక్రమంలో భాగంగా అమెరికా ఆదేశానికి 29 మిలియన్ డాలర్లను కేటాయిస్తుండేది. తాజాగా ఆ నిధుల కేటాయింపుల్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది.హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దించడంతో దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నప్పటికీ, రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. అమెరికా ప్రభుత్వం తన విదేశాంగ విధాన వ్యూహాల్లో భాగంగా వివిధ దేశాలలో ప్రజాస్వామ్యం, పాలన కార్యక్రమాలకు తరచుగా నిధులు సమకూరుస్తుంది. అలా భారత్‌లో ఓటింగ్ శాతం పెరగడానికి డబ్బు ఖర్చు చేస్తుంది. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశాల్ని ప్రోత్సహించడం ద్వారా చైనా వంటి దేశాల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. -
Bangladesh: ‘అవన్నీ ప్రభుత్వ హత్యలే’.. దడపుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి రిపోర్టు
బంగ్లాదేశ్‌లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడింది. అనంతరం జరిగిన పరిణామాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఒక నివేదికను వెలువరించింది. నాడు చెలరేగిన హింసలో 1,400 మంది హతమయ్యారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని పరోక్షంగా పేర్కొంది. నాడు బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనల ఉదంతాలను కూడా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆ నివేదికలో తెలియజేసింది.బంగ్లాదేశ్‌లో 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాటి షేక్ హసీనా ప్రభుత్వం.. నేటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాల కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారు.2024 విద్యార్థి ఉద్యమంలో సుమారు 1,400 మంది హతమయ్యారని నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు చిన్నారులతో సహా పలువురు నిరసనకారులను కాల్చిచంపాయని తెలిపింది.తిరుగుబాటు తొలి రోజుల్లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం 150 మంది మరణాలను మాత్రమే నిర్ధారించింది. అయితే ఈ నివేదికలోని వివరాల ప్రకారం వందలాదిగా సాగిన చట్టవిరుద్ధ హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు మొదలైనవన్నీ షేక్ హసీనా ప్రభుత్వంతో పాటు భద్రతా అధికారుల సహకారంతోనే జరిగాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది.ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా మతపరమైన మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నదని ఆ నివేదిక ఆరోపించింది. మహిళలు వారి నిరసనను వ్యక్తం చేయకుండా నిరోధించేందుకు వారిపై శారీరక దాడి, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారని కూడా నివేదిక పేర్కొంది. నిరసనలను అణిచివేసే నెపంతో రాజకీయ నేతలు, భద్రతా అధికారులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు. విద్యార్థి నేత, అమరవీరుడు అబూ సయీద్ హత్య కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ రెండోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఇక్బాల్ అందుబాటులో ఉంటాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ అంతలోనే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించి బంగ్లా క్రికెట్‌కు షాకిచ్చాడు. 34 ఏళ్ల తమీమ్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు."నేను గత కొంతకాలంగా ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. చాలా గ్యాప్ వచ్చింది. దీంతో నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం చాలా రోజుల కిందటే తీసుకున్నాను. నా నిర్ణయం ప్రకటించడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ ముందు నాపై చర్చలు ఉండకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడో బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాను. కానీ మీడియా మాత్రం నాపై అనవసర చర్చలు పెట్టింది.కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నన్ను జట్టులోకి తిరిగి రావాలని అభ్యర్థించాడు. నేను సెలక్షన్ ప్యానెల్‌తో కూడా మాట్లాడాను. నాలో ఇంకా సత్తువ తగ్గలేదని నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. కానీ నేను నా మనసు చెప్పిన మాటే వింటాను. అంతర్జాతీయ క్రికెట్లో నా అధ్యాయం ముగిసింది" అని తన రిటైర్మెంట్ నోట్లో తమీమ్ పేర్కొన్నాడు.రెండో సారి.. కాగా తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం రెండోసారి. గతంలో 2023 జూలైలో తొలిసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా సూచన మెరకు తన ఇక్భాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 దృష్ట్యా అతడు తన మనసును మార్చుకున్నాడు.కానీ అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులో తమీమ్‌కు జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి అతడు తిరిగి జట్టులోకి రాలేదు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.చదవండి: అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్ -
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దూరం పెరిగిందా?బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. నాటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య సంబధాలు క్షీణించాయి. ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబ్ కాదు.. జియా!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆమె తండ్రి, బంగబంధు ముజిబుర్ రహా్మన్కు ప్రాధాన్యం తగ్గిస్తూ పాఠ్యాంశాలను మార్చాలని నిర్ణయించింది. పాఠ్యాంశాల్లో చారిత్రక ఘటనలను అతిగా చూపడం, కొందరు వ్యక్తులను అనవసరంగా కీర్తించడం వంటి వాటిని పూర్తిగా తొలగించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీని ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది బంగబంధుగా పిలిచే షేక్ ముజిబుర్ రహా్మన్ కాదు..జియా ఉర్ రహా్మన్ అని ఉంటుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ మిలటరీ అధికారిగా జియా పనిచేస్తున్నారు. అనంతర కాలంలో బంగ్లా ఆరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబుర్ రహా్మన్ కాగా, ఆయన ఆదేశాల మేరకు జియా ఉర్ రహా్మన్ ఆ ప్రకటనను చదివారనేది అవామీ లీగ్ మద్దతుదారుల వాదన. అయితే, జియా ఉర్ రహా్మనే స్వయంగా స్వతంత్ర ప్రకటనను తయారు చేసి, ప్రకటించారన్నది బీఎన్పీ వాదన. బీఎన్పీ చీఫ్‌గా మాజీ ప్రధాని ఖలేదా జియా ఉన్నారు. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా ముజీబ్ కుమార్తె కాగా ఖలేదా జియా కుమార్తె. 👉చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌కు నో బెయిల్ -
భారత్‌లోకి చొరబడేందుకు 600 మంది బంగ్లాదేశ్ పౌరులు యత్నం
ఢాకా,ఢిల్లీ: ఇక్కడే ఉంటే తమకు భూమిపై నూకలు చెల్లినట్లేనని భావించిన సుమారు 600 మంది బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భారత్ భద్రతా బలగాలు వారిని నిలువరించాయి. రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ గురువారం (ఆగస్ట్8న)బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ప్రకటన చేశారు. అయినప్పటికీ అక్కడి విధ్వంసకర పరిస్థితులు అదుపులోకి రాలేదు. అల్లరి మూకలు పేట్రేగి పోయారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారుల్ని దారుణంగా హత మార్చుతున్నారు. అలా ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో 470 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.అల్లరి మూకల దమన కాండని ఆపేందుకు పోలీసులు తిరిగి విధుల్లోకి రావాలని, పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆ దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! ఆర్మీ సైతం చేతులెత్తేసింది. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడానికి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణమైన విద్యార్ధులే రంగంలోకి దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ తరుణంలో వందలాది బంగ్లాదేశ్ పౌరులు దేశం విడిచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లాలోని దక్షిణ్ బెరుబరి గ్రామం నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా వారిని బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు నిలిపివేశాయి. బలవంతంగా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించాయి. "Fear Being Killed": 600 Bangladeshis Try To Enter Bengal, Stopped By Border Force BSF https://t.co/NrH8JRrApU— ahmed (@ahmed_ebs) August 7, 2024 -
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ డౌటే.. పీసీబీ ఆఫర్‌కు నో రిప్లై!
బంగ్లాదేశ్- పాకిస్తాన్ టెస్టు సిరీస్ నిర్వహణపై సందిగ్దం నెలకొంది. బంగ్లాలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ జట్టు పాకిస్తాన్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రధాని షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో నిరసనకారుల ఆందోళనలు సోమవారం మిన్నంటాయి. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు.ఈ క్రమంలో వారి డిమాండ్లకు తలొగ్గిన హసీనా.. తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21 నుంచి బంగ్లా- పాక్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.రావల్పిండి వేదికగా తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ నుంచి విమాన ప్రయాణం అంత సురక్షితం కాదన్న వార్తల నేపథ్యంలో.. ఆటగాళ్లు పాక్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు స్పందిస్తూ.. ‘‘బంగ్లాదేశ్ క్రికెటర్లను సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంతో పాటు.. అదనంగా మరికొన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పీసీబీ బంగ్లా బోర్డుకు చెప్పింది.రావల్పిండిలో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ఆఫర్ చేసింది. కానీ ఇంత వరకు అటువైపు నుంచి స్పందన రాలేదు. బంగ్లా బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఉందని తెలిసింది. బోర్డు కార్యకలాపాలు కూడా సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాయి. 2019-2020లో బంగ్లాదేశ్ జట్టు చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది.కాగా షేక్ హసీనాతో సత్సంబంధాలు కలిగి ఉన్న వారిపై కూడా నిరసనకారులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొర్తజా ఇంటికి ధ్వంసం చేసి.. నిప్పు అంటించారు. ఈ మాజీ పేసర్ కెరీర్ ఎదుగుదలలో హసీనా పాత్ర కూడా ఉందని సమాచారం.అదే విధంగా.. అధికార అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా రెండుసార్లు(2019, 2024) గెలిచాడు కూడా! ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబరులో జరగాల్సిన మహిళా టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. -
T20 WC: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి శ్రీలంక అవుట్?!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకను దురదృష్టం వెంటాడింది. నేపాల్‌తో బుధవారం ఉదయం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.ఫలితంగా లంక సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా ఈ ఐసీసీ టోర్నీకి అమెరికాతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాడెర్‌హిల్ వేదికగా గ్రూప్-డిలో భాగమైన శ్రీలంక- నేపాల్ మధ్య బుధవారం మ్యాచ్ జరగాల్సింది.టాస్ పడకుండానే రద్దుఅయితే, ఎడతెరిపిలేని వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఇరు జట్ల ఖాతాలో ఒక్కో పాయింట్ చేరింది. కాగా టీ20 వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. రెండింటిలోనూ ఓటమి పాలైంది.ఇక ఇప్పుడు వర్షం కారణంగా ఒక పాయింట్ ఖాతాలో వేసుకోగలిగింది. కాగా హసరంగ బృందానికి గ్రూప్ దశలో ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. తదుపరి నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక తప్పక గెలవాలి.అలా అయితేనే సూపర్-8 ఆశలు సజీవంఅయినప్పటికీ సూపర్-8 చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండింట ఒక విజయం సాధించిన బంగ్లాదేశ్.. తదుపరి నేపాల్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో ఓడిపోవాలి.అంతేకాదు.. నేపాల్ తమకు మిగిలిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అదే విధంగా.. నెదర్లాండ్స్ తదుపరి తమ రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడే శ్రీలంక సూపర్-8 ఆశలు సజీవంగా ఉంటాయి. అలా కాకుండా నెదర్లాండ్స్ చేతిలో గనుక ఓడితే ఇంటిబాట పట్టాల్సిందే! ఇక ఈ గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే మూడు విజయాలతో సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: ఆసీస్ కెప్టెన్ -
అభిమాని పట్ల షకీబ్ దురుస ప్రవర్తన.. వీడియో వైరల్
షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్‌మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షకీబ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా. Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024 -
నకిలీ ఐడీప్రూఫ్‌తో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
ఖమ్మం: నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ ఐడీలతో పాస్‌పోర్టులు పొంది అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశీయులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ నూర్ నబీ, మహమ్మద్ సాగర్లు నకిలీ ఐడీలతో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. మరో ఇద్దరు షేక్ జమీర్, మహమ్మద్ అమినూర్ అక్రమంగా భారత్ లో చొరబడి ఖమ్మంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. సాగూరి ఖతూన్ అలియాస్ శిల్ప కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి భారత్ కి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన బోడ రాములుతో సహజీవనం చేస్తోంది. వీరికి 11 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. సాగూరి ఖతూన్.. బంగ్లాదేశ్‌కు వెళ్లి తన సోదరులను ఖమ్మం తీసుకువచ్చింది. ఖమ్మంలో బాల కార్మికులతో సెంట్రింగ్ పని చేయిస్తుండగా పోలీసులకు వీరి విషయం తెలిసింది. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: పల్లె కడుపున రాచపుండు! -
BAN Vs SL: బంగ్లాదేశ్ 365 ఆలౌట్
Bangladesh Vs Sri Lanka Test Series 2022- ఢాకా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 116.2 ఓవర్లలో 365 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 277/5తో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్ రహీమ్ (175 నాటౌట్; 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. ఇక లిటన్ దాస్ (141; 16 ఫోర్లు, 1 సిక్స్) తన వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతచేసి అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత ఐదు వికెట్లు, అసిథ ఫెర్నాండో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 2 వికెట్లకు 143 పరుగులు చేసింది. కాగా మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చదవండి👉🏾 IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్‌కు చలో చలో! చదవండి👉🏾Womens T20 Challenge: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్ సేనకు తప్పని పరాజయం -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన లిటన్ దాస్..
Update: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా, షహీన్ ఆఫ్రిది, ఆస్రఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. మిడిలార్డర్ మిడిలార్డర్ విఫలం అయినప్పటికీ, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం 206 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (114),ముష్ఫికర్(91), మెహది హసన్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. ►తొలి టెస్టులో తొలి రోజు ఆటముగిసేసరికి పటిష్ట స్ధితిలో నిలిచిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆదిలోనే లిటన్ దాస్ వికెట్‌ను కోల్పోయింది. హాసన్ ఆలీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 206 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. లిటన్ దాస్ 11 ఫోర్లు, 1 సిక్స్ తో 114 పరుగులు సాధించాడు. చిట్టగాంగ్: పాకిస్తాన్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఒకదశలో 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాను లిటన్ దాస్ (113 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ (82 బ్యాటింగ్; 10 ఫోర్లు) ఐదో వికెట్‌కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. చదవండి: Shreyas Iyer: డాన్స్ తో ఇరగదీసిన రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్.. వీడియో వైరల్ -
బంగ్లా యువతులచే బలవంతపు వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రాలను దాఖలు చేసింది. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు యువతులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు కాగా మిగతావారు స్థానికులుగా ఎన్ఐఏ గుర్తించింది. నకిలీ ఇండియన్ ఐడీ కార్డు సృష్టించి బంగ్లాదేశ్ నుంచి యువకులను అక్రమంగా తరలించి.. గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయించిన నిందితులపై తాజాగా ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. (తాహీర్ హుస్సేన్‌పై ఛార్జిషీట్) సోన్ నది దాటించి కలకత్తా మీదుగా ముంబాయి, హైదరాబాద్ తరలించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వారిని గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు అభియోగాలు మోపింది. తొలుత నగరంలోని పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు కాగా, ఆ తరువాత ఎన్ఐఏకు బదిలీ చేశారు. జల్పల్లి ప్రాంతంలో వ్యభిచార గృహాల్లో ఉన్న నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారు ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్స్‌లో ఉంచారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్ఐఏ పేర్కొంది. కాగా ఉమెన్ ట్రాఫికింగ్ అప్పట్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. (కంగనాపై దేశద్రోహం కేసు) -
దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకతను వెళ్లగక్కినందుకుగానూ ఓ విద్యార్థినిని దేశం విడిచి వెళ్లిపోవాలని అధికారులు నోటీసులు పంపించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన అఫ్సర అనిక మీమ్ అనే విద్యార్థి పశ్చిమ బెంగాల్‌లోని బిలురలో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సీఏఏ నిరసనలను ఆమె నిరంతరం పరిశీలిస్తూనే ఉంది. ఈ క్రమంలో డిసెంబర్లో సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసింది. దీంతో ఆగ్రహించిన భారత విదేశాంగ శాఖ ఆమెను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.(వేధింపులతోనే దేశం విడిచి వచ్చా) ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాక వీసా నిబంధనలను సైతం బేఖాతరు చేసినట్లు ఆమెకు పంపిన నోటీసులో పేర్కొంది. దేశాన్ని వదిలి వెళ్లేందుకు 15 రోజుల గడువు విధించింది. కాగా ఫిబ్రవరి 14న ఈ నోటీసులు అందించగా, ప్రస్తుతం ఆమె స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. గతంలోనూ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకుగానూ చెన్నైలో జర్మనీ విద్యార్థిని జాకబ్ లిన్ డిన్థెల్‌ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. (పాకిస్తాన్ జిందాబాద్; ‘కాల్చి పారెయ్యండి’) దేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్ విద్యార్థికి ఆదేశం -
సీఏఏపై బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఢాకా : పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) భారత ప్రభుత్వం ఎందుకు తెచ్చిందో తనకు అర్థం కావడంలేదని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. దాని అవసరం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఇది భారత దేశ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. దుబాయ్‌లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్సీ) అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్సీ కేవలం భారత దేశ అంతర్గత వ్యవహారమని తనకు చెప్పారన్నారు. 2019 అక్టోబరులో తాను ఢిల్లీకి వెళ్లినపుడు తనకు మోదీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారన్నారు. భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు మతపరమైన పీడన కారణంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఎవరూ వలస పోలేదని ఆ దేశం స్పష్టం చేసింది. మతపరమైన పీడన కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వసల వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు భారత ప్రభుత్వం సీఏఏను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమని ప్రకటించాయి. -
నా సొంత మైదానంలోనే ఆ మ్యాచ్: గంగూలీ
కోల్‌కతా: డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై చాలా కాలంగా తన ఆసక్తిని ప్రదర్శించిన సౌరవ్ గంగూలీ ఇప్పుడు బోర్డు అధ్యక్ష హోదాలో దానికి కార్యరూపం ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన తర్వాత పలు మార్లు గులాబీ బంతితో టెస్టు నిర్వహణ గురించి సౌరవ్ వ్యాఖ్యానించడంతోనే పరోక్షంగా అతని ఆలోచన అర్థమైంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో భారత్ ఆడే రెండో టెస్టును డే అండ్ నైట్‌గా నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. తన సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుందని స్వయంగా దీనిని నిర్ధారించిన సౌరవ్... మీ అభిప్రాయం చెప్పాలంటూ బంగ్లాదేశ్ బోర్డును కోరాడు. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ‘నేను బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్‌తో మాట్లాడాను. వాళ్లు దాదాపుగా అంగీకరించారు. అయితే తమ ఆటగాళ్లతో మాట్లాడాల్సి ఉందని నాతో చెప్పారు. ఇది కచ్చితంగా డే అండ్ నైట్ మ్యాచ్ అవుతుందని నేను నమ్ముతున్నా. వారు వీలైనంత తొందరగా తమ అధికారిక ప్రకటన చేస్తారు. ఒక్కసారి బంగ్లా బోర్డు నుంచి సమాధానం వస్తే మేం టెస్టు నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలు పెడతాం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. భారత్‌లాగే బంగ్లాదేశ్ కూడా ఇప్పటి వరకు ఒక్క డే అండ్ నైట్ టెస్టు కూడా ఆడలేదు. తమకు గులాబీ బంతితో ఏ మాత్రం అనుభవం లేదనేది ఆ జట్టు ఆటగాళ్ల భావన. ఒలింపియన్లకు సన్మానం... కోల్‌కతా టెస్టు సందర్భంగా షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ పీవీ సింధు తదితర ఒలింపియన్లను ఘనంగా సన్మానించనున్నట్లు సౌరవ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్న జేన్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ కోసం ప్రతీ ఏటా ‘పింక్ టెస్టు’ను నిర్వహిస్తారు. అదే తరహాలో ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్ కూడా ప్రతీ సంవత్సరం సాగే వేడుక కావాలని తాను కోరుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మనసులో మాట చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు కాంట్రాక్టులు... మరోవైపు తొలిసారి ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు గంగూలీ ప్రకటించాడు. బోర్డు కొత్త ఫైనాన్స్ కమిటీ దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తుందని అతను చెప్పాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెటర్లు ఏడాదికి తాము ఆడే మ్యాచ్‌ల సంఖ్యను బట్టి రూ. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. -
భర్త ప్రవర్తనతో విసిగిపోయి..
ఢాకా : పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నానే ఆవేదన ఓ వైపు.. ఎంత ప్రయత్నించినా భర్త ప్రవర్తనలో మార్పు రావడంలేదనే ఆవేశం మరోవైపు.. ఈ రెండు భావనల మధ్య నలిగిపోయిన ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడుస్తున్న రెండు నెలల పసికందు నోట్లో ఉప్పు పోసి బిడ్డ చావుకు కారణమైంది. ఈ విషాదకర ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మహ్మద్ బచ్చు, సాతీలు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మహ్మద్ దినసరి కూలీగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల పాప, రెండు నెలల బాబు సంతానం. కాగా గత కొన్ని రోజులుగా మహ్మద్ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం.... తాను దాచుకున్న డబ్బులతో కొడుకు కోసం పాల ప్యాకెట్ తీసుకురమ్మని సాతీ భర్తతో చెప్పింది. కానీ మహ్మద్ ఆ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకుని వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త చర్యతో విసిగెత్తి పోయిన సాతీ.. కొడుకు గుక్క పట్టి ఏడుస్తుండటంతో సహించలేకపోయింది. పేదరికంలో బతికే కంటే చావడమే నయమంటూ ఆవేశంలో చిన్నారి నోట్లో ఉప్పు పోసింది. ‘ఇదే నీకు ఆహారం’ అంటూ పిచ్చిదానిలా ప్రవర్తించింది. కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన సాతీ.. కొడుకును తీసుకుని ఆస్పత్రికి బయల్దేరింది. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తన భార్య కావాలనే కొడుకును పొట్టనబెట్టుందని మహ్మద్ ఫిర్యాదు చేయడంతో సాతీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రిలయన్స్ ఇన్ఫ్రాకు భారీ ఆర్డర్
సాక్షి, ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ నష్టాలతో సంక్షోభంలో పడ్డ అనిల్ అంబానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. వేల కోట్ల రూపాయల భారీ కంట్రాక్ట్ లభించిందన్న వార్తలతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాల్టి(బుదవారం) ప్రతికూల మార్కెట్లో లాభాలను ఆర్జిస్తోంది. రిలయన్స్ ఇన్ఫ్రా బంగ్లాదేశ్ నుంచి రెండుప్రాజెక్టులను సాధించింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బంగ్లాదేశ్‌నుంచి రూ. 5 వేల కోట్ల కాంట్రాక్టులను పొందింది. ఢాకాలో మేగానాఘాట్ వద్ద 750 మెగావాట్ల ఎల్ఎన్జీ ఆధారిత కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు ఈపీసీ కాంట్రాక్ట్ లభించినట్లు రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. అలాగే కుతుబ్దియా ఐలాండ్ వద్ద ఎల్ఎన్జీ టెర్మినల్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సైతం ఆర్డర్ దక్కినట్లు తెలియజేసింది. 2019 కల్లా వీటిని పూర్తిచేయాల్సి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఆర్డర్ల విలువ రూ. 5,000 కోట్లని ఒక ప్రకటనలో తెలిపింది. 250 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల రెండు లిగ్నైట్ ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 3,675 కోట్ల ఇపిసి ఆర్డర్ తరువాత ఈ భారీ ఆర్డర్ సాధించామని రియలన్స్ ఇన్ఫ్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ గుప్తా పేర్కొన్నారు. -
పరుగుల వరద..ప్రేక్షకుల సరదా..
-
డేంజర్ జర్నీ