
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రాలను దాఖలు చేసింది. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు యువతులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు కాగా మిగతావారు స్థానికులుగా ఎన్‌ఐఏ గుర్తించింది. నకిలీ ఇండియన్ ఐడీ కార్డు సృష్టించి బంగ్లాదేశ్ నుంచి యువకులను అక్రమంగా తరలించి.. గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయించిన నిందితులపై తాజాగా ఎన్‌ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. (తాహీర్ హుస్సేన్‌పై ఛార్జిషీట్)
సోన్ నది దాటించి కలకత్తా మీదుగా ముంబాయి, హైదరాబాద్ తరలించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వారిని గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు అభియోగాలు మోపింది. తొలుత నగరంలోని పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు కాగా, ఆ తరువాత ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. జల్పల్లి ప్రాంతంలో వ్యభిచార గృహాల్లో ఉన్న నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారు ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్స్‌లో ఉంచారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్‌ఐఏ పేర్కొంది. కాగా ఉమెన్ ట్రాఫికింగ్ అప్పట్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. (కంగనాపై దేశద్రోహం కేసు)
Comments
Please login to add a commentAdd a comment