సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్‌ఐఏ(National Investigation Agency) న్యాయస్థానం.
ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్ ఉర్ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. పాక్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు ఒబెద్ కుట్ర పన్నాడు. అయితే.. తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది.
ఇక ‘ముజాహిద్దీన్ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్ ముక్బుల్‌ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్. నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది కూడా.
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు వెల్లడి
Published Thu, Oct 26 2023 8:27 PM | Last Updated on Thu, Oct 26 2023 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment