bomb blast case
-
రామేశ్వరం కెఫే ఘటనలో పాక్ ముష్కరుడి హస్తం
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన వెనుక పాక్ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు బెంగళూరులోని ఎన్ఐఏ కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొన్నారు. పాక్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది పైజల్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నారని తెలిపింది. కాగా ఈ కేసులో ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజమ్మిల్ షరీఫ్‌లు నిందితులుగా ఎన్ఐఏ గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మంగళూరు కుక్కర్ పేలుడు తర్వాత ముస్సావిర్ షాజిబ్, తాహాలు అదృశ్యమయ్యారు. కొన్నేళ్ల అనంతరం మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ముజమ్మిల్ షరీఫ్‌తో పరిచయమైంది. ముజమ్మిల్ మెజస్టిక్ వద్ద హోటల్లో పనిచేసేవాడు. ఇతనే ముస్సావిర్ షాజిబ్, తాహాలను ఐసిస్ ఉగ్రవాదంలోకి చేర్చాడు. మొదటి దశలో కొన్ని దుశ్చర్యలు చేయడానికి ముజమ్మిల్ టాస్క్ ఇచ్చాడు. 2023 డిసెంబర్లో బెంగళూరులోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి కుట్రపన్నారు. తర్వాత షాజీబ్ బెంగళూరు నుంచి చెన్నైకు మకాం మార్చాడు. ట్రిప్లికేన్‌లో అద్దె ఇంట్లో ఐఈడీ బాంబు తయారుచేసి 2024 జనవరి 22 ఉదయం బెంగళూరుకు చేరుకున్నాడు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి షాజీబ్ ప్లాన్ రూపొందించాడు. పోలీసు భద్రత ఎక్కువగా ఉండటంతో బీజేపీ కార్యాలయం వెనుక బాంబు పెట్టి 90 నిమిషాలకు టైమర్ సెట్ చేశారు. అయితే బాంబు పేలలేదు. అనంతరం షాజీబ్ చెన్నై పారిపోయాడు. అనంతరం బెంగళూరులో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతంలో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఫిబ్రవరి నెలలో ఐఈడీ బాంబు తయారుచేసి అదేనెల 29 తేదీన షాజీబ్ చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నాడు. కృష్ణరాజపురం టిన్ ఫ్యాక్టరీ వద్ద దిగి అక్కడ నుంచి కుందలహళ్లికి వెళ్లి మార్చి 1న రామేశ్వరం కెఫేలో బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. -
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: NIA ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు!
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది.ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్ హుస్సేన్ షాబీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మజ్ మునీర్, ముజామిల్ షరీఫ్‌లు ఈ కేసులో నిందితులు. వీళ్లపై ఐపీసీ సెక్షన్లు, యూఏపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. .. వీళ్లు నలుగురు డార్క్ వెబ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిసి ఈ నలుగురు భారీ కుట్ర పన్నారు. మార్చి 1వ తేదీన బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో దాడి జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. షాజీబ్ అనే వ్యక్తి కేఫ్‌లో బాంబ్ పెట్టాడు. తాహా, షాబీజ్ ఇద్దరూ శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్లు. NIA Chargesheets 4 in Rameshwaram Cafe Blast Case pic.twitter.com/BnEBy29Khp— IANS (@ians_india) September 9, 2024 2020లో అల్ హింద్ ఉగ్రసంస్థ మూలాలు బయటపడగానే.. వీళ్లు పరారయ్యారు. వీళ్లు ఉగ్ర మూలాలు ఉన్న మరో ఇద్దరు నిందితులతో డార్క్ వెబ్‌లో జత చేరారు. టెలిగ్రామ్ ద్వారా వీళ్ల మధ్య సంభాషణలు జరిగాయి. క్రిఫ్టో కరెన్సీలతో వీళ్ల లావాదేవీలు సాగాయి. ఆ డబ్బుతో బెంగళూరులో మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలనుకున్నారు. అయితే..అయోధ్య ప్రాణప్రతిష్ట రోజున( జనవరి 22, 2024) బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కానీ, అది ఫలించలేదు. దీంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని ఎన్ఐఏ తెలిపింది. -
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: నిందితుడు షాజిబ్ అరెస్ట్!
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వివరాల ప్రకారం.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు షాజిబ్‌ను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్‌ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఇక, పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయి. #RameshwaramCafe accused arrested from #WestBengal pic.twitter.com/hmtccWxVXT — JOKER (@TheJokerBhai) April 12, 2024 ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్ఐఏ రంగంలోకి దిగింది. -
బెంగళూరు పేలుడు కేసులో ఒకరి విచారణ
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో బళ్లారిలో షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో బాంబు పెట్టి వెళ్లిపోయిన నిందితుడి కోసం గాలిస్తూ బుధవారం షబ్బీర్ ఆచూకీని కనుగొన్నారు. బళ్లారిలో మోతీ సర్కిల్ సమీపంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో షబ్బీర్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొంతసేపు విచారించి బెంగళూరుకు తరలించారు. బాంబు పెట్టిన వ్యక్తికి, షబ్బీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. షబ్బీర్ బళ్లారి సమీపంలో తోరణగల్లు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిíÙయన్‌గా పని చేస్తున్నాడు. బాంబు పేలుడు తర్వాత ప్రధాన నిందితుడు బెంగళూరు నుంచి బళ్లారికి బస్సులు మారుతూ వచ్చాడు. ఆపై షబ్బీర్ ఇంటికి వచ్చి అతడిని కలిసినట్లు ఎన్ఐఏ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలిసింది. కాగా, షబ్బీర్‌ను విచారించి రాత్రి వదిలిపెట్టినట్లు సమాచారం. -
బెంగళూరు పేలుడు కేసు.. NIA కీలక ప్రకటన
ఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) శనివారం కీలక ప్రకటన చేసింది. అనుమానితుడి కొత్త ఫొటోలను విడుదల చేసి.. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరింది. ఇందుకుగానూ రూ.10 లక్షల రివార్డు కూడా ఉంటుందని ఫోన్ నెంబర్లు, మెయిల్ అడ్రస్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మార్చి 1వ తేదీ మధ్యాహ్నాం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. బస్సులో వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌ను కేఫ్‌లో వదిలివెళ్లడం.. కాసేపటికే అది పేలడం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఫుటేజీల ఆధారంగా అనుమానితుడి కదలికలను దర్యాప్తు బృందం పరిశీలించింది. అయితే.. ఆ రోజు రాత్రి సమయంలో బళ్లారి బస్టాండ్‌లో అనుమానితుడు సంచరించినట్లుగా పేర్కొంటూ ఓ ఫుటేజీని నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. ఘటన తర్వాత.. తుమకూరు, బళ్లారి, బీదర్, భట్కల్.. ఇలా బస్సులు ప్రాంతాలు మారుతూ.. మధ్యలో దుస్తులు మార్చుకుంటూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. చివరకు అతను పుణే వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైనంత త్వరలో అతన్ని పట్టుకుని తీరతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే తమకు తెలియజేయాలని ఎన్ఐఏ ప్రజల్ని కోరుతోంది. పేలుడు జరిగిన రెండ్రోజులకు.. అంటే మార్చి 3వ తేదీన రామేశ్వరం బ్లాస్ట్ కేసులోకి యాంటీ-టెర్రర్ ఏజెన్సీ NIA దిగింది. ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. రెండేళ్ల కిందటి బళ్లారి బాంబు పేలుడుతో పోలికలు ఉండేసరికి.. ఆ పేలుడుకు కారణమైన నిందితుడ్ని జైల్లోనే అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఇక మరోవైపు బెంగళూరులో స్కూళ్లకు బాంబు బెదిరింపులకు సంబంధించిన కేసుల్ని సైతం పరిశీలిస్తోంది. అంతేకాదు.. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న ఓ గ్రూప్‌ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇక.. ఇప్పుడు రామేశ్వరం కేఫ్‌లో అనుమానితుడి చిత్రాలు విడుదల చేసి.. ఆచూకీ తెలిపిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచడంతో పాటు పది లక్షల రివార్డు సైతం ప్రకటించింది ఎన్ఐఏ. NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase. 📞 Call 08029510900, 8904241100 or email to info.blr.nia@gov.in with any information. Your identity will remain confidential. #BengaluruCafeBlast pic.twitter.com/ISTXBZrwDK — NIA India (@NIA_India) March 9, 2024 -
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో కీలకంగా AI
బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తన పరిశీలనాంతరం ఇది ఉగ్రదాడిగా భావిస్తుండగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైతం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీనే ఈ కేసు మొత్తానికి కీలకంగా మారింది. బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి.. ప్రధాన అనుమానితుడి ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. ఆ నిందితుడి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐఈడీ(Intensive Explosive Device)ను బ్యాగ్‌లో తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ముసుగు తొలగించి.. ఇందుకోసం భద్రతా సంస్థలు ఏఐ(Artificial Intelligence) సాయం తీసుకుంటున్నాయి. ఏఐ ఆధారిత ఫేషీయల్ రికగ్నిషన్ సాంకేతిక సాయంతో.. బ్యాగ్‌ను వదిలి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టబోతున్నారు. అనుమానితుడెవరో తెలిసిపోయిందని.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌ను ఉపయోగించి ఆ వ్యక్తిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. మరోవైపు ఏఐ టెక్నాలజీ సాయంతో అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించారు. అతని ఫొటోల్ని సేకరించుకుని ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది బెంగళూరు నగర నేర పరిశోధన విభాగం. Bengaluru blast: Suspected accused captured in CCTV #Bengaluru #Karnataka #Blast #RameshwaramCafe #RameshwaramCafeBlast pic.twitter.com/jNM6BFnPVH — Fresh Explore (@explorefresh24) March 2, 2024 బెంగుళూరులో.. అదీ టెక్నాలజీ కారిడార్లోనే ఈ పేలుడు జరగడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. భద్రతాపరంగా మరింత నిఘా, చర్యలు పెంచాల్సిన అవసరాన్ని ఈ పేలుడు ఘటన తెలియజేస్తోందని నిపుణలు అంటున్నారు. అలాగే.. అనుమానిత వ్యక్తులను పట్టుకునేందుకు AI లాంటి అత్యాధునిక సాంకేతికతను అధికారికంగా వినియోగించడం ఎంత అవసరమో కూడా చెబుతోందంటున్నారు. రెండేళ్ల కిందటి.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో.. మొత్తం 10 మంది గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. 2022 నవంబర్‌లో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్ బాంబు పేలింది. దీంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బృందం ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విచారణకు పూర్తి సహకారం: కేఫ్ యాజమాన్యం తమ ప్రాంగణంలో బాంబు దాడి జరగడంపై రామేశ్వరం కేఫ్ యాజమాన్యం స్పందించింది. విచారణలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాకారం అందిస్తామని.. అలాగే పేలుడులో గాయపడిన వాళ్లకు తాము అండగా నిలుస్తామని కేఫ్ ఎండీ దివ్య రాఘవేంద్ర రావు ప్రకటించారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం ఉదయం.. బ్రూక్‌ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్లో ఉన్న రామేశ్వరం కేఫ్. నెత్తిన క్యాప్.. ముఖానికి ముసుగు.. భుజాన బ్యాగ్‌తో ఆ ఆగంతకుడు కేఫ్‌కు వచ్చాడు. అతని వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 11గం.30.ని. ప్రాంతంలో బస్సు దిగి నేరుగా కేఫ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. పావు గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మధ్యలో తన భుజానికి ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లోని సింక్ వద్ద ఉన్న డస్ట్‌బిన్ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. సరిగ్గా అతను వెళ్లిపోయిన గంటకు ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ బాంబు పేలింది. ఫొటోలు వచ్చాయి: సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు. ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం అని అన్నారాయన. #Marksmendaily : #JustiIn #Karnataka CM #Siddaramaiah visits #RameshwaramCafe, a day after an explosion took place here in #Bengaluru @siddaramaiah #RameshwaramCafeBlast #BengaluruCafeBlast #bombblast pic.twitter.com/ptoGaYePHL — Marksmen Daily (@DailyMarksmen) March 2, 2024 అలాగే.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు.‘‘ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారాయన. -
93 పేలుళ్ల కేసు నుంచి తుండాకు విముక్తి
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసు నుంచి మాఫియా డాన్, వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అబ్దుల్ కరీం తుండా(81)కు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అతడిపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. తుండాపై ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టి వేస్తూ గురువారం అజ్మేర్లోని ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నివారణ చట్టం (టాడా) కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా 22 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తుండా బాంబుల తయారీకి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. కాగా, హమీదుద్దీన్ 14 ఏళ్లుగా, ఇర్ఫాన్ 17 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. బాంబు పేలుళ్లతోపాటు వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. -
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు వెల్లడి
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్ఐఏ(National Investigation Agency) న్యాయస్థానం. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్ ఉర్ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. పాక్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు ఒబెద్ కుట్ర పన్నాడు. అయితే.. తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది. ఇక ‘ముజాహిద్దీన్ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్ ముక్బుల్‌ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్. నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది కూడా. -
‘కనిష్క’ మరోసారి తెరపైకి..
టొరంటో: 1985లో ఎయిరిండియా ‘కనిష్క’ ఉగ్ర బాంబు పేలుడు ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసులో నిర్దోషిగా బయటపడిన రిపు దమన్ సింగ్ మాలిక్ (75) కెనడాలో గురువారం హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర్నుంచి తుపాకీతో కాల్చేశాడు. దీనిని టార్గెట్ కిల్లింగ్‌గా పోలీసులు భావిస్తున్నారు. వాంకోవర్‌లో 16 వేల మంది సభ్యులున్న ఖల్సా క్రెడిట్ యూనియన్ (కేసీయూ)కు మాలిక్ ప్రెసిడెంట్. అక్కడే ఖల్సా స్కూళ్లను నడుపుతున్నారు. ఆయనకు పాపిలాన్ ఈస్టర్న్ ఎక్స్పోర్ట్ వంటి పలు వ్యాపారాలున్నాయి. మాలిక్ హత్యను బాధాకరమైన, దురదృష్టకరమైన ఘటనగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ పేర్కొంది. ఎందరో శత్రువులు సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌ను భారత్ వెలుపల ముద్రించరాదన్న సంప్రదాయాన్ని ఉల్లంఘించి రిపుదమన్ వివాదాస్పదుడయ్యారు. ఆయన బయటకు కనిపించినంత మంచి వ్యక్తి కాదని కనిష్క కేసు దర్యాప్తు బృంద సారథి రిటైర్డు డిప్యూటీ కమిషనర్ గ్యారీ బాస్ చెప్పారు. మాలిక్ వివాదాస్పద వ్యక్తి అని ఆయన ఒకప్పటి మిత్రుడు ఉజ్జల్ దొసాంజ్ అన్నారు. 1985 జూన్ 23న 329 మందితో టొరంటో నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా కనిష్కలో సూట్‌కేసు బాంబ్ పేలి అంతా దుర్మరణం పాలయ్యారు. ఇది ఖలిస్తానీ ఉగ్రవాదుల పనేననంటారు. ఈ ఘటనలో దోషిగా తేలిన ఇందర్జిత్ సింగ్ రేయాత్ అనే వ్యక్తి కెనడాలో 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. -
లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత
న్యూఢిల్లీ: లూథియానా జిల్లా కోర్టులో సంభవించిన బాంబు పేలుడు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లి కూపీ లాగిన భారత దర్యాప్తు సంస్థలు సూత్రధారిని పట్టుకోవడంలో సఫలమయ్యాయి. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని భారత నిఘా వర్గాల సమాచారంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెల్సిందే. మాజీ కానిస్టేబుల్ గగన్‌దీప్ బాంబును అమర్చుతుండగా పేలి అతను మరణించాడు. ఎన్నికల వేళ పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఖలిస్థాన్ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నాయి. గగన్‌దీప్... జస్విందర్ సింగ్ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపాడని గుర్తించాయి. దాంతో ఇతనిపై పంజాబ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్ తమ రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు తగిన ఆధారాలను సమర్పించడంతో వారు ఎర్ఫర్ట్ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రెనేడ్లను పాక్ మీదుగా భారత్‌లోకి పంపే ప్రయత్నాల్లో ముల్తానీ ఉన్నాడని, పంజాబ్‌లో మళ్లీ పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత ఏజెన్సీలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. -
దర్భాంగా పేలుడు కేసు విచారణ
-
జైపూర్ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
జైపూర్ : 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు నలుగురు నిందితులను బుధవారం దోషులుగా తేల్చింది. ఒకరిని బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా వదిలేసింది. వివరాలు.. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల వ్యాసార్ధంలో, 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. అనంతరం అప్రమత్తమైన పోలీసులు స్థానిక హనుమాన్ ఆలయ సమీపంలోని ఒక బాంబుతో పాటు నాలుగు బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేశారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో అనేక మంది హనుమాన్ భక్తులు, విదేశీ పర్యాటకులు వస్తుండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాదీ ఇస్లామీ (హుజి) అనే ఉగ్రవాద సంస్ధ హస్తం ఉన్నట్టు అనుమానించిన పోలీసులు.. మొహమ్మద్ షాబాజ్ హుస్సేన్, మొహమ్మద్ సైఫ్ అకా కారియోన్, మొహమ్మద్ సర్వార్ అజ్మి, మొహమ్మద్ సైఫ్ అలియాస్ సైఫుర్ రహమాన్ అన్సారీ, మొహమ్మద్ సల్మాన్‌లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించిన రాజస్థాన్ ఏటీసీ విభాగం ఐదుగురిని అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు విచారణ కొనసాగగా, ప్రత్యేక కోర్టు బుధవారం నలుగురిని దోషులుగా ప్రకటించింది. -
యూపీ ఏటీఎస్ అదుపులో సిటీ డాక్టర్
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగిపట్టిలో ఉన్న మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో హైదరాబాద్‌లో ఉంటున్న ఓ ఆర్మీ మాజీ వైద్యుడు అను మానితుడిగా మారాడు. తన భార్యతో కలసి టోలి చౌకిలో నివసిస్తున్న అష్వఖ్‌ను యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక బృందం గురు వారం నగరంలో అదుపులోకి తీసుకుంది. తదు పరి విచారణ నిమిత్తం అక్కడకు తరలించింది. సోమవారం జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటికే అష్వఖ్ బంధువు అరెస్టు అయ్యాడు. వివాహానికి వెళ్లి.. అష్వఖ్ సమీప బంధువైన హాజీ ఖుద్భుద్దీఉత్తన్ బైరాగిపట్టిలోని ఓ మసీదులో పని చేస్తున్నాడు. ఓ స్నేహితుడి వివాహానికి హాజరుకావడానికి అష్వఖ్ ఈ నెల 8న బైరాగిపట్టికి చేరుకున్నాడు. పదో తేదీన ఫంక్షన్ పూర్తి చేసుకుని 12న తిరిగి హైదరాబాద్ రావడానికి రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో బైరాగిపట్టి మసీదు సమీపంలోని ఖుద్భుద్దీన్ నివాసానికి అష్వఖ్ వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం ఈ మసీదులో చిన్నస్థాయి పేలుడు సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ మసీదు తలుపులు, కిటికీలు ధ్వంస మయ్యాయి. దీనికి సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేపట్టిన కుషినగర్ పోలీసులు సదరు మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్న మౌలానా అజ్ముద్దీన్, ఖుద్భుద్దీన్ సహా మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. దర్యాప్తు చేపట్టిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అధికారులు పేలుడు జరిగిన రెండ్రోజుల్లోనే అజ్ముద్దీన్‌తోపాటు ఇజార్, జావేద్‌లను నిందితులుగా పేర్కొంటూ అదుపులో కి తీసుకున్నారు. అజ్ముద్దీన్ పాత్రపై ఆధారాలు లేక పోవడంతో అతడిని విడిచిపెట్టి, ఇజార్, జావేద్ సహా నలుగురిని అరెస్టు చేశారు. అనుమానితుడే.. ఖుద్భుద్దీన్ ఇచ్చిన సమాచారంతో గోరఖ్‌పూర్ ఏటీఎస్ పోలీసులు, అక్కడి లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంయుక్త బృందం అష్వఖ్ కోసం రంగంలోకి దిగింది. హుటాహుటిన విమానంలో నగరానికి వచ్చిన బృందం మెహిదీపట్నంలో అష్వ ఖ్‌ను అదుపులోకి తీసుకుని గురువారమే అక్కడకు తరలించింది. ఈ కేసులో అష్వఖ్ అనుమానితుడు మాత్రమే అని, వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నామని యూపీ పోలీసులు చెబుతున్నారు. అష్వఖ్ బంధువులు మాత్రం పోలీసుల ఆరోపణలను ఖండిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే అతడే స్థానిక ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పాడని తెలిపారు. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న నేపథ్యంలో కుషినగర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వా తే అతడు హైదరాబాద్ వచ్చాడని స్పష్టం చేస్తున్నా రు. అష్వఖ్ కెప్టెన్ హోదాలో ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసి ఉండటం, ప్రస్తుతం అతడి భార్య ఆ విభాగంలోనే పనిచేస్తుండటంతో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరీ అష్వఖ్.. ఉత్తరప్రదేశ్ బైరాగిపట్టికి చెందిన అష్వఖ్ అక్కడి అలీఘర్ వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కెప్టెన్ హోదాలో ఇండియన్ ఆర్మీలో చేరి కొన్నేళ్ల పాటు సేవలు అందించాడు. రెండేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకున్న అష్వఖ్ అక్కడ పనిచేస్తుండగానే జగిత్యాలకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
రాజేంద్రనగర్ పేలుడు ఘటనపై డీసీపీ దర్యాప్తు
-
న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!
శ్రీనగర్: వారి జీవితంలోని విలువైన కాలమంతా జైలు నాలుగు గోడలమధ్యే గడిచిపోయింది. దాదాపు 23 ఏళ్ల పాటు జైళ్లో నిర్బంధించి, ఇప్పుడు తీరిగ్గా నిర్దోషులేనంటూ వారిని విడుదల చేశారు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ అలీ భట్, లతీఫ్ అహ్మద్ వాజా, మీర్జా నాసర్ హుస్సేన్‌ల విషాదమిది. లజపతినగర్ మార్కెట్ పేలుళ్లలో హస్తం ఉందంటూ వీరిని మొదట 1996లో ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఓ బస్సును పేల్చారనే ఆరోపణలపై రాజస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లజపత్ నగర్ కేసుకు సంబంధించి వీరిని 2012లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రాజస్తాన్ బస్సు కేసు నుంచి బయటపడకపోవడంతో ఆ తరువాతా వారు జైల్లోనే మగ్గాల్సి వచ్చింది. తాజాగా రాజస్తాన్ హైకోర్టు సైతం వారిని నిర్దోషులంటూ తీర్పు ఇవ్వడంతో.. ఎట్టకేలకు 23 ఏళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయిన అనంతరం స్వేచ్ఛాప్రపంచంలోకి రాగలిగారు. కశ్మీరీ ఉపకరణాలను అమ్మి జీవనం గడిపేందుకు నేపాల్ వెళ్లిన వారిని 1996లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ’నేపాల్‌లో ఉన్న సామాన్యులమైన మేం ఢిల్లీలో, రాజస్తాన్‌లో బాంబు పేలుళ్లకెలా బాధ్యులమవుతాం? మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుని మమ్మల్ని బలిపశువులను చేశారు’ అని శ్రీనగర్‌కు చెందిన వాజా ఆవేదన వ్యక్తం చేశారు. భట్ జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఇంటికి వెళ్లగానే మొదట భట్ స్మశానవాటికకు వెళ్లి తన తల్లిదండ్రుల సమాధుల వద్ద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ‘నా సగం జీవితాన్ని కోల్పోయాను. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు?’ అనే భట్ ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. మాలాంటి అమాయకులు ఇంకా జైళ్లలో చాలామంది ఉన్నారని ఈ ముగ్గురు చెబుతున్నారు. -
‘మాలేగావ్’ నిందితులకు బెయిల్
ముంబై: మాలేగావ్ వరుస పేలుళ్లలో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఐఏ మహంతి, జస్టిస్ ఏఎమ్ బాదర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ధాన్ సింగ్, లోకేశ్ శర్మ, మనోహర్ నర్వారియా, రాజేంద్ర చౌదరిలకు బెయిల్ మంజూరు చేశారు. రూ. 50 వేలు పూచీకత్తు సమర్పించాలని, విచారణ సమయంలో ప్రతిరోజు స్పెషల్ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాక సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించరాదనే షరతును విధించింది. 2016లో ప్రత్యేక న్యాయస్థానం వీరికి బెయిల్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. 2013లో అరెస్టు అయినప్పటి నుంచి ఈ నలుగురు జైళ్లో ఉన్న సంగతి విదితమే. 2006, సెప్టెంబరు 8న నాసిక్ సమీపంలోని మాలేగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును మొదట మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక సంస్థ విచారణకు తీసుకొని మైనార్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసింది. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అనంతరం ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతుల్లోకి వెళ్లింది. మెజారిటీ వర్గానికి చెందినవారే ఈ పేలుళ్లకు పాల్పర్డారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ.. మొదట నిందితులుగా ఉన్న తొమ్మిది మందిపై ఉన్న చార్జ్‌షీట్‌ను తొలగించింది. దీంతో 2016లో స్పెషల్ ట్రయల్ కోర్టు ఎన్ఐఏ వాదనలను అంగీకరించి, తొమ్మిది మంది నిందితులను విడుదల చేసింది. -
సాధ్వి, పురోహిత్‌పై ఉగ్రవాద అభియోగాలు
ముంబై: మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008లో జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మరో ఐదుగురిపై మంగళవారం ఉగ్రవాద సంబంధిత అభియోగాలు నమోదయ్యాయి. నవంబర్ 2న ఈ కేసులో తుది విచారణ ప్రారంభమవుతుంది. ఉగ్రవాద వ్యాప్తికే నిందితులు అభినవ్ భారత్ అనే సంస్థను ప్రారంభించారని పేర్కొన్న ప్రత్యేక కోర్టు..వారిపై నేరపూరిత కుట్ర, హత్య తదితర నేరారోపణల్ని కూడా మోపింది. ఐపీసీ, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ కోర్టు జడ్జి వినోద్ పాదాల్కర్ ఈ మేరకు ఏడుగురిపై అభియోగాలు నమోదుచేశారు. నిందితుల్లో ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌తో పాటు మేజర్(రిటైర్డ్) రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ఉన్నారు. జడ్జి ఈ అభియోగాలు నమోదుచేసిన సమయంలో నిందితులంతా కోర్టులోనే ఉన్నారు. వారు దోషులుగా తేలితే జీవితఖైదు లేదా మరణశిక్ష పడుతుంది. -
పేలుళ్ల తర్వాతా మరో ఆపరేషన్‌కు కుట్ర!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు అనుచరులతో వచ్చి నగరంలో భారీ పేలుళ్లకు పాల్పడ్డాడు. 45 మందిని పొట్టనపెట్టుకోవడంతోపాటు మరెందరినో క్షతగాత్రులుగా మార్చాడు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత కొన్నేళ్లపాటు నగరానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు రావడానికి, తన అనుచరుల్ని పంపడానికి ఎవరూ సాహసించరు. అయితే, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ తీరే వేరు. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన అతడు మరో ఆపరేషన్ నిమిత్తం 2008 ఫిబ్రవరిలో ఒక అనుచరుడిని సిటీకి పంపాడు. 2009లో అరెస్టులపర్వంతో అది ఆగిపోయింది. జంట పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐఎం ఉగ్రవాదులు అనీఖ్ షఫీద్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు కోర్టు నేడు(సోమవారం) శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులకు సంబంధించి ఫారూఖ్, సాదిఖ్ షేక్‌లపై అభియోగాలు కొట్టేసింది. మరో కీలక నిందితుడు, బీహార్‌లోని నలందా ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ తారీఖ్పై సోమవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎం నేతృత్వంలో రియాజ్ భత్కల్ సూత్రధారిగా 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాపుల్లోనూ పేలుళ్లు జరిగాయి. ఈ కేసుల్లో దోషులుగా తేలిన ఉగ్రవాదులకు ఆ ఏడాది డిసెంబర్ 19న న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఆ రోజు కూడా సోమవారమే కావడం గమనార్హం. డాక్టర్నే ట్రాప్ చేసిన రియాజ్ మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని రోహరీ జిల్లాకు చెందిన అన్వర్ అబ్దుల్లా ఘనీ భగ్వార్ పూనెలోని ససూన్ హాస్పిటల్‌కు చెందిన బీజే మెడికల్ కాలేజీ నుంచి 2006లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఐఎంకు చెందిన ఆసిఫ్ బషీరుద్దీన్ షేక్ ప్రోద్బలంతో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. రియాజ్ భత్కల్‌కు కీలక అనుచరుడిగా మారాడు. అన్వర్‌ను రియాజ్ భత్కల్ హైదరాబాద్‌కు పంపి మరో ఆపరేషన్ చేపట్టాలని కుట్రపన్నాడు. ఇందులో భాగంగా 2008 ఫిబ్రవరిలో మెడిసిన్‌లో ఎండీ చేయడానికంటూ అన్వర్‌ను పూనె నుంచి హైదరాబాద్ పంపాడు. నదీంకాలనీలో అన్వర్ ప్రాక్టీసు నిర్వహిస్తుండగానే 2008 సెప్టెంబర్‌లో ముంబై పోలీసులు 20 మంది ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశారు. విచారణలో హైదరాబాద్ పేలుళ్లతోపాటు అన్వర్ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే ఉన్న అన్వర్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించి విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆధారాలు లభించడంతో 2009 జనవరిలో అరెస్టు చేశారు. -
విషాదానికి 25 ఏళ్లు
కరకగూడెం (ఖమ్మం): మణుగూరు సబ్ డివిజన్లో పినపాక, కరకగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో 25 ఏళ్ల క్రితం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. సమాంతర ప్రభుత్వాన్ని తలపించే రీతిలో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరేవారు. అయితే వారిని అణచివేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యూçహాలు రచించేది. ఇలా ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగేది. ఈ క్రమంలో 1992 సెప్టెంబర్ 4వ తేదీన పినపాక–కరకగూడెం మండలాల మధ్య గల రాళ్లవాగు వద్ద మావోయిస్టులు బ్రిడ్జిని పేల్చివేశారు. ఈ భారీ విస్ఫోటనానికి ఐదు మందు పాతరలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి పినపాక మండలంలో మావోయిస్టు కదలికలను అరికట్టేందుకు కరకగూడెంలో నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భద్రత కోసం వస్తూ ప్రాణాలు కోల్పోయారు.. కాగా, కరకగూడెం స్టేషన్ భద్రత కోసం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ నుంచి 10 మంది సిబ్బంది జీపులో కరకగూడెం పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. వారి కదలికలను అడుగడుగునా తెలుసుకున్న మావోయిస్టులు పక్కా ప్రణాళికతో రాళ్లవాగు బ్రిడ్జికి మందుపాతరను అమర్చారు. 1992 సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాళ్లవాగు వద్దకు చేరుకున్న పోలీసుల జీపును మావోయిస్టులు పేల్చి వేశారు. పూర్తి అటవీ ప్రాంతమైన రాళ్లవాగు వద్ద నుంచి భారీ శబ్దాలు రావడంతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. వేలాది మంది ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులు ప్రయాణిస్తున్న తునాతునకలయిన జీపును, చెట్టుకొకటి, పుట్టకొకటిగా పడి ఉన్న పోలీసుల మృతదేహాలు గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా నిలిచింది. ఇప్పటికీ ఏడూళ్ల బయ్యారం నుంచి కరకగూడెం రావాలంటే పోలీసులు భారీ బందోబస్తుగానే వస్తుంటారు. పోలీస్ శాఖలో రాళ్లవాగు ఘటన పెను విషాదాన్ని నింపింది. ఆనాటి విషాద ఘట్టంలో అమరులైన పోలీసులు వీరే.... డి. నరేందర్ పాల్ (రిజర్వ్ ఇన్స్పెక్టర్), ఎస్ఏ. జార్జ్ (సబ్ ఇన్స్పెక్టర్), డి. ప్రభాకర్ రావు (ఏఆర్ ఎస్సై), ఐ. రామారావు (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు డి. శంకర్‌బాబు, జి. నాగేశ్వరరావు, ఎం. వెంకటేశ్వరరావు, జి. సత్యనారాయణ, వై.బేబిరావు, టి. సుబ్బారావు అమరుల త్యాగాలు చిరస్మరణీయం సమాజంలో పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. అలాగే వెలకట్టలే నివి. ప్రజల మధ్యలో ఉంటూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసులను ప్రతి రోజు స్మరించుకుంటున్నాం. వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. – ఆర్ సాయిబాబా మణుగూరు డీఎస్పీ స్మరించుకోవడం అందరి బాధ్యత సమాజ శ్రేయస్సే లక్ష్యంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యత. అలాగే అమరుల కర్తవ్యం, త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి. – ఇ రాజ్‌కుమార్ కరకగూడెం ఎస్సై -
జంట పేలుళ్ల కేసులో తుది తీర్పు నేడే
-
జంట పేలుళ్ల కేసులో నేడే తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో జరిపిన జంట బాంబు పేలుళ్ల కేసులో సోమవారం తీర్పు వెలువడనుంది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబుల కు సంబంధించి మొత్తం 3 కేసుల విచారణ ఈ నెల 7తో పూర్తయింది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదు గురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. సోమవారం తీర్పు వెలువడనుండ టంతో పోలీసు విభాగం జైలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆక్టోపస్ కమాండోలను మోహరించింది. ఈ పేలుళ్లు జరిగి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవే ‘తొలి–ఆఖరి’ కేసులు... పేలుళ్ల కేసులను తొలుత నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు. పేలుళ్ల ఘటన తర్వాత నాటి ప్రభుత్వం ఉగ్ర వాదంపై పోరుకు ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు కల్పిస్తూ పోలీసుస్టేషన్ హోదా ఇచ్చింది. దీంతో సిట్ నుంచి ఈ 3 కేసులూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. దీనిపై ఆక్టోపస్ అధికా రులు 2009లో 3 అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాదికే ఆక్టోపస్‌ను కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీ సు స్టేషన్ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. సీఐ సెల్‌కు భవిష్యత్తులో మరే ఇతర కేసు దర్యాప్తును అప్పగించకూడ దని నాడే నిర్ణయించారు. దీంతో ఆక్టోపస్, సీఐ సెల్ వింగ్స్ పర్యవేక్షించిన తొలి, ఆఖరి కేసులుగా ఈ మూడే రికార్డులకు ఎక్కాయి. -
నేరం చేసిందెవరో?
ఆస్పరి మండలం కారుమంచి గ్రామం సమీపంలో ఐదేళ్ల క్రితం కోటప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఎవరు చంపారో.. ఎందుకు చంపారో అనే విషయం ఇప్పటి వరకు బయట పడలేదు. భార్య ఫిర్యాదు మేరకు ఆస్పరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతూనే ఉంది. కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామ శివారులోని అనుగొండ రోడ్డులో ఓ మహిళపై అత్యాచారం జరిపి పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఈ కేసు మిస్టరీ వీడలేదు. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన రైతు పెద్ద ఈరన్నను పాత కక్షలతో ప్రత్యర్థులు హత్య చేసి చింత చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ కేసు కూడా ఇప్పటివరకు దర్యాప్తు దశలోనే ఉంది. కర్నూలు: నేరాలు జరిగిన తర్వాత పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. ఘటన స్థలాన్ని పలుమార్లు పరిశీలించడంతోపాటు.. క్లూస్ టీమ్, పోలీస్ జాగిలాలతో గాలింపు చర్యలు చేపడతారు. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటవుతాయి. అయితే కేసుల దర్యాప్తులో ఆధారాలు లభించవు. దీంతో వాటిని మూసివేడయం పరిపాటిగా మారింది. కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కేసును ఇలానే చేశారు. భూపాల్ నగర్ వద్ద పొలాలకు వెళ్లే దారిలోని వంకలో కర్నూలు పాతబస్తీకి చెందిన వడ్డీ వ్యాపారి ఎనిమిదేళ్ల క్రితం దారుణ హత్యకు గురవగా కేసు నమోదైంది. దర్యాప్తులో పలు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించక కేసు మూసేశారు. అలాగే 2016 జూన్ 11న సి.బెళగల్ సమీపంలో సుమారు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి కాలేదు. కోడుమూరు–కర్నూలు రోడ్డులోని పరప్ప జున్ను దగ్గర 2010లో కత్తెర లక్ష్మి అనే మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి వరి పొట్టులో పూడ్చిపెట్టారు. ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపారు. వివాహేతర సంబంధంతో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు అప్పటి సీఐకి గ్రామస్తులు కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదే కోవలోకి కర్నూలు బాంబు పేలుళ్ల కేసు కూడా వస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే.. కర్నూలు శివారులోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి జొహరాపురం వెళ్లే దారి మున్సిపల్ డంప్ యార్డు వద్ద గత నెల 31వ తేదీన బాంబు పేలుళ్ల జరిగాయి. ఈ ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు బృందం సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. పేలుడు ఘటనలో కర్నూలు బుధవారపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన సంగతి తెలిసిందే. కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం సభ్యులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నప్పటికీ ఆధారాలు లభించకపోవడంతో ఇప్పటివరకు కేసు కొలిక్కి రాలేదు. బాంబులెలా వచ్చాయి... టార్గెట్ ఎవరు... ఎవరు దాచారు.. ఎప్పుడు దాచారు... ఎందుకు దాచారు... కుట్రదారులెవరు... పాత్రధారులెవరు అనే కోణంలో దర్యాప్తు కొనసా...గుతూనే ఉంది. సంఘటన జరిగిన సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డును బాంబ్ స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డంప్ యార్డు ఇప్పటికీ నిషేధిత ప్రాంతంగానే కొనసాగుతోంది. దర్యాప్తు కోసం ఐడీ పార్టీలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతమంతా గాలించారు, శోధించారు.. అయినా ఇప్పటివరకు ఒక్క ఆధారమూ లభించలేదు. బాంబు పేలుడు జరిగిన ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలిస్తూ కేసు ఛేదన కోసం శ్రమించారు. పేలుడు సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఎక్కువ సమయం ఏ ఫోన్లకు కాల్స్ వెళ్లాయనే కోణంలో ఫ్యాక్షనిస్టుల అనుచరులు, పాత నేరస్తుల ఫోన్ నంబర్లపై నిఘా ఉంచి దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు ముందు వారం రోజుల నుంచి ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం మాట్లాడిన ఫోన్ నంబర్ల వివరాలను కూడా సేకరించారు. సమీపం లోని మద్యం దుకాణాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించినా ఒక్క ఆధారమూ ఇప్పటివరకు లభించలేదు. గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన హత్య కేసుల్లోని నిందితులను, బాంబు తయారీదారులను, పాత నేరస్తులను సుమారుగా 30 మందికి పైగా విడతల వారీగా అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధానంగా నందికొట్కూరు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ఉన్న ఫ్యాక్షనిస్టుల అనుచరులపై నిఘా ఉంచి కేసు మిస్టరీని ఛేదించేందుకు శ్రమించినా ఇప్పటివరకు ఒక్క ఆధారం లభించలేదు. నేరాలూ అధికమే... జిల్లా కేంద్రం కర్నూలుతో పాటు ముఖ్య పట్టణాల్లో నేరాలు, మోసాలు కూడా అధికమే. పేకాట, క్రికెట్ బెట్టింగ్, దొంగతనాలు, మోసాలు, బెదిరింపులు, దొమ్మీలు వంటివి జిల్లాలో సర్వసాధారణమయ్యాయి. నకిలీ నోట్ల చెలామణి, నకిలీ ధృవీకరణ పత్రాల తయారీ, ఆర్థిక నేరాలు షరా మామూలే. ఒంటరిగా జీవనం సాగించే వారిపై జరుగుతున్న నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కర్నూలు నగరంలోని లక్ష్మీనగర్‌లో ఓ వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుండగా ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, నగదు కోసం దారుణంగా హత్య చేసిన సంఘటన రెండేళ్ల క్రితం సంచలనంగా మారింది. ఇలాంటి తరహా కేసులు ఒకటీ రెండు పోలీసులు ఛేదిస్తున్నప్పటికీ వారి కృషి ఎక్కువ కేసుల్లో ఫలితాలను సాధించలేకపోతోంది. సాంకేతిక ప రిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా కేసుల్లో ఆధారాలు లేక మగ్గుతున్న పరిస్థితులపై ఎస్పీ గోపీనాథ్ జట్టి ప్రత్యేక దృష్టి సారించి మనోధైర్యాన్ని నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అదృశ్యమై ఏడాది గడిచినా ఆచూకీ లేదు... ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉమా మహేశ్వరరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గణాంకాధికారిగా పనిచేస్తూ గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన అదృశ్యమయ్యాడు. అప్పటి డీఎంహెచ్ఓ నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 2017 ఆగస్టు మాసంలో ఈయన కడప నుంచి కర్నూలు డీఎంహెచ్ఓ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జిలోని 306 రూమ్‌లో ఉంటూ విధులు నిర్వహించేవాడు. సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి వరకు కార్యాలయంలో విధులు నిర్వహించాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భార్య అనూష ఫోన్ చేస్తే సెల్ స్విచాఫ్ అని వచ్చింది. ఇదే విషయంపై ఆమె కార్యాలయంలోని ఉద్యోగులతో వాకబు చేసినా వారి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. దీంతో కార్యాలయ ఉన్నతాధికారి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీమ జిల్లాల్లో గుర్తు తెలియని మృతదేహాల కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా అనే కోణంలో మొదట పోలీసులు విచారించారు. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేశారన్న అనుమానంపై భార్య అనూష జిల్లా కలెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు మిస్టరీ వీడలేదు. ఇలాంటి తరహా కేసులు జిల్లాలో వందకు పైగా దర్యాప్తులోనే మగ్గుతున్నాయి. -
తీర్పును స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమాయకులపై కేసులు బనాయించారని ఆరోపించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, మజ్లిస్‌లు దుర్మార్గపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. తాజా తీర్పును పరిశీలించైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించలేని సీఎం కేసీఆర్‌కు దళితుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 14 నుంచి మే 5 వరకు గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దళిత వాడల్లో భోజనం, పల్లె నిద్రలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రజాచైతన్యయాత్రలను నిర్వహిస్తామన్నారు. మే 2న కిసాన్ కల్యాణ్ కార్యశాలలు, మే 5న కౌశల్ వికాస్ యోజన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు బీజేపీ పదాధికారుల, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ తీర్పు వారికి చెంపపెట్టు: దత్తాత్రేయ కాంగ్రెస్ హయాంలో మక్కా మసీదు పేలుళ్ల కేసు సందర్భంగా కాషాయ తీవ్రవాదం అంటూ తప్పుడు ప్రచారం చేసిన వారికి తాజా తీర్పు చెంపపెట్టులాంటిదని ఎంపీ దత్తాత్రేయ పేర్కొన్నారు. అప్పట్లో చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయిందని ఓ ప్రకటనలో తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్ ఐఎం ఉగ్రవాది
న్యూఢిల్లీ: దేశరాజధానిలో 2008లో వరుస బాంబుపేలుళ్ల కేసులో కీలక సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ అలియాస్ జునైద్(32)ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుళ్ల తర్వాత ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఆరిజ్‌ఖాన్.. పదేళ్ల తర్వాత ఇండో–నేపాల్ సరిహద్దులో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ పేలుళ్లు సహా 165 మంది ప్రజల మృతికి ఆరిజ్ కారకుడని స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంజనీర్ అయిన ఆరిజ్.. బాంబులు తయారుచేయడం, దాడికి ప్రణాళికలు రచించడం, వాటిని అమలు పర్చడంలో సిద్ధహస్తుడని వెల్లడించారు. పాఠశాలలో ఉన్నప్పుడే ఆరిజ్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యారన్నారు. ఐఎం, సిమీ నేతలు అరెస్ట్ కావడంతో భారత్‌లో ఈ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నిందితుడు యత్నించాడన్నారు. నేపాల్‌లోని ఓ పాఠశాలలో ఆరిజ్ టీచర్‌గా చేసేవాడన్నారు. 2007లో యూపీ పేలుళ్లు, 2008లో జైపూర్, అహ్మదాబాద్ పేలుళ్ల కేసుల్లో కూడా ఆరిజ్ నిందితుడిగా ఉన్నాడు. ఆరిజ్ ఆచూకీ తెలిపినవారికి ఎన్ఐఏ రూ.10లక్షలు, ఢిల్లీ పోలీసులు రూ.5 లక్షల రివార్డుల్ని గతంలోనే ప్రకటించారు. -
సత్వర న్యాయం ఏది?
దాదాపు పాతికేళ్ల క్రితం ముంబై మహా నగరాన్ని భయోత్పాతంలో ముంచెత్తి 257మందికి పౌరుల ప్రాణాలను బలిగొన్న వరస పేలుళ్లకు సంబంధించిన మరో కేసులో ఎట్టకేలకు విచారణ పూర్తయి అయిదుగురు నిందితులకు శిక్షలు ఖరార య్యాయి. గత జూన్ 16నే ఈ అయిదుగురూ దోషులని ప్రత్యేక టాడా కోర్టు నిర్ధా రించగా గురువారం ఆ నిందితుల్లో తాహిర్ మర్చంట్, ఫిరోజ్‌ఖాన్‌లకు మరణ శిక్ష, రియాజ్ సిద్దిఖీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. కీలక నేరగాడు అబూ సలేం, మరొక నేరగాడు కరీముల్లా ఖాన్లకు యావజ్జీవ శిక్ష విధించింది. అబూ సలేంను అప్పగించినప్పుడు 2005లో పోర్చుగల్ దేశంతో కుదిరిన ఒప్పందం కారణంగా అతడికి మరణశిక్ష విధించడం సాధ్యం కాలేదు. ఈ పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం, మరొక నేరస్తుడు టైగర్ మెమన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు పాకిస్తాన్లో తలదాచుకున్నట్టు మన ప్రభుత్వం దగ్గర ఖచ్చిత మైన సమాచారం ఉన్నా ఆ దేశం మాత్రం అది నిజం కాదని బుకాయిస్తోంది. దేశ ఆర్ధిక రాజధానిగా వెలుగులీనుతున్న ముంబై నగరాన్ని ఉగ్రవాదులు దాడులకు లక్ష్యంగా ఎంచుకోవడం వెనక పెద్ద కుట్ర ఉంది. ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ మహా నగరాన్ని ధ్వంసం చేస్తే దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుందని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని వారు భావించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మార్గదర్శకత్వంలో దుబాయ్ కేంద్రంగా జరి గిన కుట్ర పర్యవసానంగానే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. పాకిస్తాన్ సరఫరా చేసిన పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్ను కంటెయినర్లలో దేశంలోకి తరలించి ముంబైలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రాలను ఎన్నుకుని కార్లలో ఆర్డీఎక్స్ అమర్చి పేల్చారు. ఉగ్రవాద ఉదంతాల్లో ఆర్డీఎక్స్ వాడటం ప్రపంచంలో అదే తొలిసారి. బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్, ఎయిరిండియా భవనం, రెండు ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాలు ఉగ్రవాదుల లక్ష్యాలయ్యాయి. ఈ పేలుళ్లనాటికే ముంబై నగరం మాఫియాల గుప్పిట ఉండటం, వారిని చూసీ చూడనట్టుగా ఉండే పోలీసు యంత్రాంగం ఉగ్రవాదులకు వరంగా మారింది. మాఫియా డాన్‌గా వెలుగొందుతున్న దావూద్ ఇబ్రహీం తన ముఠా సభ్యులతో ఈ పేలుళ్లకు పథకం పన్నాడు. కేవలం రెండు గంటల వ్యవధిలో ముంబైలో 12 వేర్వేరు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. 257మంది మరణించగా, 700 మందికిపైగా జనం తీవ్రంగా గాయపడి ఆస్పత్రులపాలయ్యారు. ముంబై మహానగరం 1993కు ముందు ఎప్పుడూ ఇంతటి బీభత్సాన్ని చవి చూడలేదు. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఈ నగరంలో ఉద్రిక్తతలు అలుముకుని హిందూ, ముస్లిం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పోలీసు కాల్పులు జరిగాయి. 1993 జనవరి 5న మొదలై మూడురోజుల పాటు సాగిన అల్లర్లలో భారీయెత్తున కత్తిపోట్లు, దాడులు జరిగాయి. ముస్లింలు 575మంది, హిందువులు 275మంది చనిపోయారు. లక్షమందికిపైగా నిరాశ్ర యులయ్యారు. ఆ ఘటనలను ఆసరా చేసుకుని పాకిస్తాన్ కేంద్రంగా బాంబు పేలుళ్లకు పథక రచన సాగింది. ఈ రెండు దురదృష్టకర ఉదంతాలపైనా నియ మించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికలో ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంగా మిగిలిన తీరును నిశితంగా విమర్శించింది. ముంబై పేలుళ్ల ఉదం తానికి ఉపయోగించిన ఆర్డీఎక్స్, గ్రెనేడ్లు వగైరాలన్నీ పాకిస్తాన్ నుంచి నౌకల్లో అక్రమంగా గుజరాత్‌కు చేరడం, అక్కడి నుంచి వ్యానుల్లో ముంబై నగరానికి రావడం గమనిస్తే ఈ మాఫియా ముఠా వేర్వేరుచోట్ల ఎంతమంది అధికారుల, సిబ్బంది కళ్లు కప్పిందో అర్ధమవుతుంది. దర్యాప్తు సాగిన మొదటి కొన్ని నెలల్లో పోలీసులకు అబూ సలేం పేరే వెల్లడికాలేదు. దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఒకరిద్దరు చాన్నాళ్ల తర్వాత పట్టుబడినప్పుడు దావూద్ అనుచరుడు బాబా చౌహాన్ పేరు బయటకొచ్చింది. అతని ద్వారా అబూ సలేం పేరు వెల్లడైంది. అయితే అప్పటికే సలేం ఢిల్లీకి పారిపోయి అక్కడినుంచి తన స్వస్థలమైన యూపీలోని ఆజాంగఢ్ చేరుకుని ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. దావూద్ ముఠానుంచి విడిపోయి ఆ తర్వాత పోర్చుగల్ వెళ్లి అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. ముంబైలో బాంబు పేలుళ్లతోపాటు రైఫిళ్లతో, గ్రెనేడ్లతో దాడులు చేయాలని తొలుత పథకం వేశారు. కానీ చివరకు కారు బాంబులు మాత్రమే వినియోగించారు. రైఫిళ్లు, గ్రెనేడ్లు ఉపయోగించి ఉంటే ముంబైలో ప్రాణనష్టం మరింత ఎక్కువ జరిగేది. ఈ మొత్తం వ్యవహారంలో 193 మంది నిందితులుంటే వారిలో దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ సహా 35 మంది ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో పలువురు ఇప్పటికీ పాక్‌లో తల దాచుకుంటున్నారు. క్రిమినల్ కేసుల్లో సాగే ఎడతెగని జాప్యం నేరస్తులకు ధైర్యాన్నిస్తుందని అంటారు. సాధారణ నేరాల సంగతలా ఉంచి కనీసం ఉగ్రవాద కేసుల్లోనైనా సత్వర విచారణ సాధ్యపడని దురవస్థ మన దగ్గర ఉంది. ముంబై పేలుళ్ల కేసులకు సంబంధించి 2006లో తొలిసారి టాడా కోర్టు యాకూబ్ మెమన్ సహా 12మందికి మరణశిక్ష, మరో 20 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. యాకూబ్ మెమన్‌కు రెండేళ్లక్రితం ఉరిశిక్ష అమలు కాగా ఆ పేలుళ్లకు సంబంధించి వేరే కేసుల్లో మళ్లీ ఇన్నాళ్లకు శిక్షలు పడ్డాయి. దానికన్నా ముందు జరిగిన ముంబై అల్లర్లలో అయితే కేవలం ముగ్గురికి మాత్రమే స్వల్పంగా శిక్షలు పడ్డాయి. నేరాలు జరగకుండా చూడటం ఒక ఎత్తయితే... కనీసం అవి జరిగాకైనా చురుగ్గా వ్యవహరించి దర్యాప్తు జరిపి పకడ్బందీ సాక్ష్యాధారాలతో నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటం పోలీసు యంత్రాంగం బాధ్యత. తిరుగులేని సాక్ష్యాధారాలుంటే న్యాయస్థానాల్లో విచారణ నిరాటంకంగా సాగుతుంది. వెంటవెంటనే శిక్షలుపడే స్థితి నేరగాళ్లలో భయం రేపు తుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం మాత్రమే కాదు... న్యాయవ్యవస్థ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది.