న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు నమోదు చేసిన ఎన్‌ఐఏ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది.
ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్ హుస్సేన్ షాబీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మజ్ మునీర్, ముజామిల్ షరీఫ్‌లు ఈ కేసులో నిందితులు. వీళ్లపై ఐపీసీ సెక్షన్లు, యూఏపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద విచారణ ఎదుర్కొంటున్నారు.
.. వీళ్లు నలుగురు డార్క్ వెబ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిసి ఈ నలుగురు భారీ కుట్ర పన్నారు. మార్చి 1వ తేదీన బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో దాడి జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. షాజీబ్ అనే వ్యక్తి కేఫ్‌లో బాంబ్ పెట్టాడు. తాహా, షాబీజ్ ఇద్దరూ శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్లు.
NIA Chargesheets 4 in Rameshwaram Cafe Blast Case pic.twitter.com/BnEBy29Khp
— IANS (@ians_india) September 9, 2024
2020లో అల్ హింద్ ఉగ్రసంస్థ మూలాలు బయటపడగానే.. వీళ్లు పరారయ్యారు. వీళ్లు ఉగ్ర మూలాలు ఉన్న మరో ఇద్దరు నిందితులతో డార్క్ వెబ్‌లో జత చేరారు. టెలిగ్రామ్ ద్వారా వీళ్ల మధ్య సంభాషణలు జరిగాయి. క్రిఫ్టో కరెన్సీలతో వీళ్ల లావాదేవీలు సాగాయి. ఆ డబ్బుతో బెంగళూరులో మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలనుకున్నారు. అయితే..
అయోధ్య ప్రాణప్రతిష్ట రోజున( జనవరి 22, 2024) బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కానీ, అది ఫలించలేదు. దీంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని ఎన్‌ఐఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment