cafe
-
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్‌కు ఫుడ్ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్‌గా
ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్‌గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్‌గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్‌గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్‌కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్‌లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్‌కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్‌తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్‌లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్‌లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్‌గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్‌లు, బార్లు, కాఫీ హౌస్‌లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్‌లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్‌తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
రాష్ట్రపతి మెచ్చిన మిట్టీ కేఫ్..దివ్యాంగులకు చేయూత
కంటోన్మెంట్: దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మిట్టీ కేఫ్ ఆధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో నూతన కెఫే ఏర్పడింది. పూర్తిగా దివ్యాంగుల ఆధ్వర్యంలో నిర్వహణ సాగే ఈ కెఫే ఏర్పాటుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్/ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చేయూతను అందిస్తుంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా ఈ మిట్టీ కేఫ్‌ను అధికారికంగా ప్రారంభించారు. మానసిక, శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి సమస్యలను సమాజం దృష్టికి తెచి్చ, స్పందించేలా చేసేందుకు ఈ మిట్టీ కేఫ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్టు కాంప్లెక్స్‌తో పాటు పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 47కి పైగా ప్రదేశాల్లో మీట్టీ కేఫ్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఏమిటీ మిట్టీ కేఫ్? ఈ కేఫ్‌లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్లో దివ్యాంగులు స్వయంగా రూపొందించిన గృహాలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న మిట్టీ కేఫ్ ఆలోచనను గుర్తించి, వాటి నిర్వహణకు సీఎస్ఆర్ కింద పలు ప్రభుత్వరంగ, ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్‌లను పలువురు సెలిబ్రిటీలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దివ్యాంగులకు ఉపాధి.. నగరంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ఉచితంగా కేటాయించిన స్థలంలో మిట్టీ కేఫ్‌ను నెలకొల్పారు. ఇందులో 15 మంది మానసిక, శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులు ఈ కేఫ్‌ను స్వయంగా నడుపుతున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకూ వేతనంగా అందుతుంది. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవంతో జీవించేందుకు మిట్టీ కేఫ్ అండగా ఉంటున్నట్లు నిర్వాహకురాలు స్వాతి తెలిపారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ.. మిట్టీ కేఫ్‌లలో సమోసా, చాట్, పకోడీ, మసాలా టీ, బిస్కెట్లు, కాఫీ, మ్యాగీ, శాండ్ విచ్, పలు రకాల ఐస్‌క్రీమ్స్, ఇతర చిరుతిండ్లు స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి అవసరమైన పెట్టుబడి, నిర్వహణా ఖర్చులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూపులు భరిస్తున్నాయి. దీనికి తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చొరవ తీసుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతోంది. రూ. 36–46 లక్షలు టర్నోవర్ దిశగా కృషి చేస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టి కేఫ్‌ను సందర్శించారు. పలు వస్తువులు కొనుగోలు చేసి నిర్వాహకులను, ఉద్యోగులను అభినందించారు. -
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. క్యూలో నిలబడమని చెప్పినందుకు సింగపూర్‌లోని ఒక కేఫ్‌లోని కేఫ్‌లోని క్యాషియర్‌పై (Cafe Cashier) దాడి చేశాడు. ఘటనలో భారత సంతతికి చెందిన రిషి డేవిడ్ రమేష్ నంద్వానీ (Rishi David Ramesh Nandwani ) దోషిగా తేలాడు. దీంతో సింగపూర్ కోర్ట్( Singapore Court ) నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4000 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.సింగపూర్‌లోని హాలండ్ విలేజ్‌లోని ప్రాజెక్ట్ అకాయ్ కేఫ్లొ అక్టోబర్ 31న ఈ ఘటన జరిగింది. కేఫేలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చాడు రిషి. దాదాపు మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో అక్కడంతా పిల్లలతో సహా కస్టమర్లు కిక్కిరిసి ఉన్నారు. ఈ సమయంలో క్యూలో తప్పుగా నిలబడటం గమనించిన మహిళా క్యాషియర్, రిషీని వెనక్కి వెళ్లమని సూచించింది. దీంతో అతను వెళ్లలేదు సరికదా అసహనంతో రెచ్చిపోయాడు. ఆ దేశం, అక్కడి ప్రజల గురించి అభ్యంతరకరంగా వ్యాఖానించాడు. ఆమెపై దుర్భాషలాడాడుతూ, అసభ్యమైన పదజాలంతో దూషించాడు. ఆవేశంతో కౌంటర్లో ఉన్న టిప్ బాక్స్ తీసుకుని ఆమెపైకి విసిరాడు. దీంతో ఆమె పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండుగంటల్లోనే రిషిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిషీ దురుసుగా ప్రవర్తించినట్లు తేల్చారు.వీడియో లింక్ ద్వారా రిషిని కోర్టులో హాజరుపరిచారు. కేఫ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా క్యాషియర్‌కు అసభ్యకరమైన సైగలు, దూషణలు చేస్తూ ఉన్న వీడియోను కోర్టులో ప్లే చేశారు. కేఫ్‌లో బాధితురాలి భద్రతకు హాని కలిగించే అవమానకరమైన పదాలను ఉపయోగించడం , అసభ్యకరమైన చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఛానల్ న్యూస్ ఆసియా ప్రకారం, శిక్ష సమయంలో రెండు అదనపు ఛార్జీలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం డిసెంబరు 30 జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
వాట్ ఏ ఆఫర్: డ్యాన్స్ చెయ్యి..కాఫీ తాగు..!
కొన్ని కేఫ్‌లు ప్రజలను సంతోష పెట్టేలా మంచి ఆఫర్లు అందిస్తాయి. అవి వినడానికి చూడటానికి చాలా వింతగా ఉంటాయి. కానీ ఈ కేఫ్ ఇచ్చిన ఆఫర్ మాత్రం సంతోషం తోపాటు మంచి రుచిని కూడా ఆస్వాదించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. యూఎస్‌లోని కేఫ్‌లోకి డ్యాన్స్ చేస్తూ.. ఎంటర్ అయ్యితే చాలు మంచి రుచికరమైన ఓ కప్పు కాఫీని సిప్ చెయ్యొచ్చు అంటూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది. అంతే జనాలంతా తమ టాలెంట్‌ని వెలికి తీసి మరీ మంచి మంచి స్టెప్పులతో అలరించారు. వృద్ధులు సైతం ఈ ఆఫర్ కోసం ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెలకోసారైనా..ఈ ఫన్ ఇనిషియేటివ్‌ని అందివ్వాలని కేఫ్ ఓనర్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఉదారంగా ఆలోచించే కేఫ్‌లు దొరకడం అత్యంత అరుదు. View this post on Instagram A post shared by Hope Rises (@hoperisesnetwork) (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
ఊరికే కూర్చోకు భయపడకు
దట్టమైన పొగ, ధారాళమైన దుర్భాషలతో నిండి ఉండే మగ రూప కాఫీ రెస్టారెంట్లే ఈ ప్రపంచం నిండా! ఇండోనేషియా కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అయితే అక్కడి ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణమైన బాందా ఏసాలో ఒక మహిళ పొగలు కక్కే మంచి కాఫీని తప్ప.. సిగరెట్ పొగలకు, చెత్త మాటలకు స్థానం లేని కేఫ్‌ను నడుపుతున్నారు! అది పూర్తిగా ఆడవాళ్ల అడ్డా. అక్కడ వాళ్లు కాఫీ తాగొచ్చు. కబుర్లు చెప్పుకోవచ్చు. చర్చలు పెట్టుకోవచ్చు. మగవాళ్లు కూడా వచ్చి కాఫీ తాగి వెళ్లిపోవచ్చు కానీ, అక్కడ కూర్చోటానికి లేదు. ఆ కాఫీ కేఫ్ పేరు ‘మార్నింగ్ మామా’. ఆ కేఫ్ యజమాని ఖుర్రేటా అయుని. 28 ఏళ్ల ముస్లిం యువతి. ఆమె దగ్గర పనిచేసే నలుగురు ‘బరిస్టా’లు (కాఫీ తయారు చేసి, సర్వ్ చేసేవారు) కూడా మహిళలే. పూర్తిగా మహిళలే నడిపే ‘మార్నింగ్ మామా’ వంటి కాఫీ కేఫ్‌లు ఏ దేశంలో అయినా ఉండేవే. అందులో కొత్తేమీ లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉండే ఇండోనేషియాలో కూడా ‘ఓన్లీ ఉమన్ ’ కాఫీ కేఫ్‌లు అరకొరగానైనా లేకుండాపోవు. అయితే ఏసా ప్రావిన్సులో ఒక మహిళ బయటికి రావటం, బిజినెస్ చేయటం అన్నది కలకలం రేపే విషయం. కొరడా దెబ్బలకు దారి తీసే సాహసం. ఇండోనేషియాలోని మొత్తం 38ప్రావిన్సులలో ఏసాప్రావిన్సు ఒక్కటే ఇప్పటికీ మారకుండా నియమాల శిలలా ఉండిపోయింది. మహిళల పట్ల నేటికీ కఠినమైన ఆంక్షలు, సంప్రదాయాలు కొనసాగుతున్న ప్రదేశం అది. అలాంటి చోట కాఫీ కేఫ్ తెరిచారు ఖుర్రేటా! అయితే అందుకోసం ఆమె సంప్రదాయాలను ధిక్కరించలేదు. ఆంక్షల్ని కాస్త సడలింపజేసుకుని, హిజాబ్‌ను ధరించి, ఇతర మతపరమైన కట్టుబాట్లకు లోబడి కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. ఖుర్రేటా కాఫీ కేఫ్ప్రారంభించిన ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణం బాందా ఏసాకు ‘1001 కాఫీ షాపులున్న పట్టణం’గా పేరు. వాటికి ఇప్పుడు ‘మార్నింగ్ మామా’కూడా జత కలిసింది. ఆడవాళ్లు బయటికి వచ్చి మగవాళ్లలా పని చేయటం అనే ‘దైవ దూషణ వంటి’ ఆ ధిక్కారాన్ని చూసి మొదట్లో కన్నెర్ర చేసిన స్థానిక పురుషులు.. మెల్లమెల్లగా ఇప్పుడు ఆమె కేఫ్‌కే ప్రత్యేకమైన నురగలు కక్కే చిక్కని పాల శాంగర్ ‘లాటే’ కాఫీకి అలవాటు పడుతున్నారు. పొగ, శబ్దం లేకుండా హాయిగా, ప్రశాంతంగా ఉండే అక్కడి వాతావరణాన్ని మరింతగా ఇష్టపడుతున్నారు. ‘మహిళలు సైతం సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. నిర్ణయాలు తీసుకోవచ్చు. నాయకత్వం వహించవచ్చు’ అని ఖుర్రేటా ఇస్తున్న స్టేట్మెంట్కు ప్రతీక ఆమె కాఫీ కేఫ్. -
వచ్చేస్తున్నాయి.. జెప్టో కేఫ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కేఫ్ సేవలను విస్తరిస్తున్నట్టు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్లలో 120కిపైగా కేఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్టు వివరించింది. త్వరలో హైదరాబాద్, చెన్నై, పుణే నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్టు వెల్లడించింది.అధిక నాణ్యత గల ఆహార తయారీ ప్రక్రియతో 10 నిమిషాల డెలివరీని సాధ్యం చేశామని, అందుకే బలమైన కస్టమర్ స్పందనను చూస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రూయింగ్ నైపుణ్యాలను ఉపయోగించే కాఫీ మెషీన్లతో సహా కేఫ్‌ల కోసం అత్యాధునిక పరికరాలను నిశితంగా పరిశోధించి, తమ బృందం సేకరించిందని వివరించింది.ఇదీ చదవండి: జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలుచాయ్, కాఫీ, అల్పాహారం, పేస్ట్రీస్, స్నాక్స్ వంటి 148 రకాల ఉత్పత్తులను 10 నిముషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని తెలిపింది. కొత్త నగరాలకు విస్తరించడం, ప్రతి నెలా 100కుపైగా కొత్త కేఫ్‌లను ప్రారంభిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,000 కోట్ల యాన్యువల్ రన్ రేట్ సాధిస్తామని జెప్టో సీఈవో ఆదిత్ పలీచా తెలిపారు. -
రామేశ్వరం కెఫే ఘటనలో పాక్ ముష్కరుడి హస్తం
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన వెనుక పాక్ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు బెంగళూరులోని ఎన్ఐఏ కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొన్నారు. పాక్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది పైజల్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నారని తెలిపింది. కాగా ఈ కేసులో ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజమ్మిల్ షరీఫ్‌లు నిందితులుగా ఎన్ఐఏ గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మంగళూరు కుక్కర్ పేలుడు తర్వాత ముస్సావిర్ షాజిబ్, తాహాలు అదృశ్యమయ్యారు. కొన్నేళ్ల అనంతరం మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ముజమ్మిల్ షరీఫ్‌తో పరిచయమైంది. ముజమ్మిల్ మెజస్టిక్ వద్ద హోటల్లో పనిచేసేవాడు. ఇతనే ముస్సావిర్ షాజిబ్, తాహాలను ఐసిస్ ఉగ్రవాదంలోకి చేర్చాడు. మొదటి దశలో కొన్ని దుశ్చర్యలు చేయడానికి ముజమ్మిల్ టాస్క్ ఇచ్చాడు. 2023 డిసెంబర్లో బెంగళూరులోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి కుట్రపన్నారు. తర్వాత షాజీబ్ బెంగళూరు నుంచి చెన్నైకు మకాం మార్చాడు. ట్రిప్లికేన్‌లో అద్దె ఇంట్లో ఐఈడీ బాంబు తయారుచేసి 2024 జనవరి 22 ఉదయం బెంగళూరుకు చేరుకున్నాడు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి షాజీబ్ ప్లాన్ రూపొందించాడు. పోలీసు భద్రత ఎక్కువగా ఉండటంతో బీజేపీ కార్యాలయం వెనుక బాంబు పెట్టి 90 నిమిషాలకు టైమర్ సెట్ చేశారు. అయితే బాంబు పేలలేదు. అనంతరం షాజీబ్ చెన్నై పారిపోయాడు. అనంతరం బెంగళూరులో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతంలో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఫిబ్రవరి నెలలో ఐఈడీ బాంబు తయారుచేసి అదేనెల 29 తేదీన షాజీబ్ చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నాడు. కృష్ణరాజపురం టిన్ ఫ్యాక్టరీ వద్ద దిగి అక్కడ నుంచి కుందలహళ్లికి వెళ్లి మార్చి 1న రామేశ్వరం కెఫేలో బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. -
ఉద్యోగానికి ఓకే
సమోయెడ్ జాతికి చెందిన ఓకే అనే రెండేళ్ల శునకం మొన్నటి దాకా ఓ కెఫెలో ఉద్యోగం చేసింది. తాజాగా మరో చోట ఇంటర్వ్యూకెళ్లి, ఎంపికైంది. త్వరలోనే కొత్త ఉద్యోగంలో చేరబోతోంది. డటౌ అనే తెల్ల పిల్లి కూడా తక్కువేం కాదు. అది నెలకు ఐదు క్యాన్ల ఆహారాన్ని సంపాదించుకుంటోంది. అదీ అన్ని పన్నులూ పోను..! ఇది కాకుండా.. ఆరోగ్యంగా, అందంగా, బుద్ధిగా ఉండే పిల్లులకి రోజూ స్నాక్స్ ఇస్తాం. యజమాని స్నేహితులకి 30 శాతం డిస్కౌంట్ ఇస్తాం అంటూ ఓ కెఫె నిర్వాహకుడు ఆఫర్ ఇచ్చారు. మరోచోట కెఫె నిర్వాహకుడు తమకు కావాల్సిన అర్హతలుండే పిల్లులు, కుక్కల కోసం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు..! చైనాలో కొత్త ట్రెండిది. చైనీయుల్లో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవాలనే ఉబలాటం ఇటీవల అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశంలో పిల్లల కన్నా పెంపుడు జంతువులే (పెట్స్) ఎక్కువుంటాయని ఓ సర్వేలో తేలింది. అయితే, తట్టుకోలేని జీవన వ్యయం.. బిజీబిజీగా మారిన జీవితంతో పెంపుడు జీవుల్ని కెఫెల్లో ఉద్యోగాలకు కుదుర్చుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లిన సమయాల్లో ఇవి కెఫెల్లో ఉంటాయి. తిరిగి రాగానే తమతోపాటే ఉంటాయి. దీంతోపాటు, కెఫెల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలతో ఎంతో కొంత ఆదాయం కూడా ఉంటోంది. దీంతోపాటు, చైనాలో మొదటిసారిగా గ్వాంగ్ఝౌలో 2011లో క్యాట్ కెఫె ప్రారంభించారు. ఇలాంటి కెఫెల సంఖ్య ఏటా 200 శాతం పెరుగుదల నమోదవుతోంది. 2023 లెక్కల ప్రకారం చైనాలో 4 వేల పైచిలుకు పిల్లులకు సంబంధించిన కంపెనీలు నడుస్తున్నాయి. పిల్లులు, కుక్కలతో గడపడం ఇష్టపడే కస్టమర్లు ఈ తరహా కెఫెలకు వస్తుంటారు. వీరి నుంచి సుమారు రూ.350 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తుంటారు. తమ మధ్య తిరుగాడుతూ ఉండే పిల్లులు, కుక్కలతో వీరు సరదాగా ఆడుకుంటారు.‘తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిన మాదిరిగానే ‘ఓకే’ను నేను కూడా కెఫెలో పార్ట్‌టైం జాబ్‌కి పంపిస్తున్నా’అని ఆ శునకం యజమాని 27 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి జ్యూ తెలిపారు. కొత్త జీవితానికి అది అలవాటు పడుతుందన్నారు. ‘జాబ్కెళ్లేటప్పుడు ఉదయం నాతోపాటే ఓకే కూడా కెఫెకు వస్తుంది. వచ్చే టప్పుడు తిరిగి సాయంత్రం ఇంటికి తెస్తాను. నేను, నా భర్త వీకెండ్స్‌లో బయటికి వెళ్లినప్పుడు ఓకేను కెఫె నిర్వాహకులే చూసుకుంటారు. పైపెచ్చు, పగలంతా మేం జాబ్లకెళితే ఓకే బద్ధకంగా నిద్రతోనే గడిపేస్తుది. ఆ సమయంలో దాని కోసం ప్రత్యేకంగా ఏసీ ఆన్ చేసి ఉంచడం తప్పనిసరి. ఫుజౌ నగరంలో అసలే నిర్వహణ ఖర్చులెక్కువ. ఓకే కూడా జాబ్ చేస్తే దాని ఖర్చులు అంది సంపాదించుకుంటుంది కదా’అని చెప్పుకొచ్చారు జ్యూ. ఓకేను ఇటీవలే ఓ కెఫె యజమాని గంటపాటు పరిశీలించారు. కస్టమర్లతోపాటు తోటి కుక్కలతో మసలుకునే తీరును గమనించి, ఓకే చెప్పారని జ్యూ తెలిపారు. ‘ఓకే స్టార్ ఆఫ్ ది కెఫె’అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. జిన్జిన్ అనే బీజింగ్‌కు చెందిన టీచర్‌కు టీఝాంగ్ బ్యుయెర్ అనే పిల్లి ఉంది. తనకున్న రెండు పిలుల్ని పోషించేందుకు నెలకు 500 యువాన్ల(సుమారు రూ.6 వేలు) వరకు ఖర్చువుతోందని ఆమె అంటున్నారు. ఆహారం తింటూ రోజంతా బద్ధకంగా ఇంట్లోనే ఉంటోంది. అందుకే, ఆహారం, స్నాక్స్ ఖర్చుల కోసం బ్యుయెర్ను కూడా కెఫెల్లో పనికి పంపించేందుకు సిద్ధం చేస్తున్నానన్నారు. ‘అక్కడైతే అటూఇటూ తిరుగుతుంటే తిన్నది అరుగుతుంది. పైపెచ్చు హుషారుగా కూడా ఉంటుంది’అన్నారు జిన్జిన్. ఇప్పుడు చైనాలో కెఫె యజమానులు తమకు కావాల్సిన పిల్లులు, కుక్కల కోసం సోషల్ మీడియాలో యాడ్లు ఇస్తున్నారు. క్యాట్ కెఫెలో పనిచేస్తే ఎంత శాలరీ ఇస్తారు?అని ఒకరు ప్రశ్నించగా, ఓ కెఫె యజమాని ఇచి్చన సమాధానం వైరల్‌గా మారింది. ‘మా క్యాట్ కెఫెలో పనికి పంపుతామంటూ చాలా మంది యజమానులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇక శాలరీ విషయానికొస్తే మేం చెప్పే దొక్కటే. మా పాత ఉద్యోగులు కొందరికి ఇచ్చినంత!’అని తెలిపారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
గౌరీ ఖాన్ ఇష్టపడే కేఫ్ ఇదే..! ప్రత్యేకత ఏంటంటే..
ఢిల్లీ అంటేనే ప్రత్యేకమైన ఆహారానికి, కేఫ్‌లుగా ప్రసిద్దిగాంచింది. దొరకని విభిన్న రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉండవు. అలాంటి ఢిల్లీలో గౌరీ ఖాన్ తరుచుగా సందర్శించే కేప్ ఒకటి ఉంది. ఆ కేఫ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అక్కడకు ఎప్పుడు వచ్చినా..కాఫీ, పిజ్జా ఆస్వాదించే వెళ్తారు గౌరీ ఖాన్. ఆ కేఫ్ ఎక్కడుందంటే..ఆ కేఫ్ పేరు ది బ్రౌన్ బాక్స్. ఇది పంచశీల్ పార్క్‌లో ఉంది. పర్ఫెక్ట్ లంచ్ డేట్ కోసం లేదా భాగస్వామితో సరదాగా గడిపేందుకు అనువైన ప్రదేశం. సాయంత్రాల్లో సరదాగా కాసేపు గడపడానికి హాయినిచ్చే ఆహ్లాదకరమైన ప్రదేశం ఆ కేఫ్. అంతేగాదు ఏదైన కంపెనీ సమావేశాల గురించి చర్చించడానికి కూడా అత్యంత అనువైన ప్రదేశం. మంచి వుడ్‌తో కూడిన ఫర్నేచర్ ఆ కేఫ్‌కి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ మంచి సలాడ్లు, పాస్తా, సైడ్లు, బర్గర్లు, కాఫీ, శాండ్విచ్లు, రిసోట్టో, కేక్‌లు వంటి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించొచ్చు. అంతేగాదు బడ్జెట్‌కి అనుగుణంగా ఖర్చుపెట్టాలనుకున్నా ఈ కేఫ్ బెస్ట్ అని చెప్పొచ్చట. గౌరీఖాన్, ఆమె కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇక్కడ ఎక్కువగా పిజ్జా, కాఫీని ఆస్వాదిస్తారట. ఈ బేకరీ కేఫ్‌ని పేస్ట్రీ చెఫ్ ప్రియాంక తివారీ నడుపుతున్నారు. ఆమె తన కేఫ్‌లో సాధారణ మెనులకు విభిన్నంగా ఆహారప్రియులు ఇష్టపడేలా సరికొత్త ఐటెమ్స్‌తో కూడిన మెనూని రూపొందించడం విశేషం. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
సమ్‌థింగ్ డిఫరెంట్
సరదాగా కాఫీనో, టీనో తాగడానికి కేఫ్స్కి వెళ్తున్నారా? ఇష్టమైన వంటకాలు రుచి చూడడానికి వెళ్తున్నారా? అయితే నగరంలో లేటెస్ట్ కేఫ్ కల్చర్‌ని మీరింకా టేస్ట్ చేయలేదన్నట్టే. ఇప్పుడు కేఫ్స్ అంటే ఆఫీస్.. కేఫ్స్ అంటే వెరైటీ ఈవెంట్లకు కేరాఫ్‌గా మారుతున్నాయి.. ఆధునిక కల్చర్‌కు అసలైన చిరునామాగా నిలుస్తున్నాయి నగరంలోని పలు కేఫ్‌లు. ఈవెంట్స్ నుంచి వెరైటీ మీట్స్ వరకూ కేఫ్‌లు వేదికలవుతున్నాయి. వర్క్‌ప్లేస్‌ల నుంచి వర్క్‌షాపుల వరకూ కేఫ్‌లు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. టాప్ క్లాస్ చిత్రకారుని చిత్రాలను వీక్షించడానికో.. ఓ బెస్ట్ సాక్సాఫోన్ ఆర్టిస్ట్ సంగీతాన్ని వినడానికో.. స్టోరీటెల్లర్ కథల విందుకో, సెలబ్రిటీల సక్సెస్ సీక్రెట్స్ వినేందుకో.. ఒకప్పుడైతే ఏదైనా కల్చరల్ సెంటర్‌కో లేదా వాటికి ప్రత్యేకించిన మరో చోటుకో వెళ్లేవారు. అయితే ఇప్పుడు వాటితో పాటు అవీ ఇవీ అనే తేడా లేకుండా అన్నీ ఒకే వేదికపై అందుకోడానికి ఒక్క కేఫ్‌కి వెళితే చాలు. ఫుడ్‌కీ, డ్రింక్స్‌కి మాత్రమే పరిమితమైతే కాదు.. రోజుకో ఈవెంట్‌తో తన వెంట తిప్పుకుంటేనే అది కేఫ్ అని పునర్ నిర్వచిస్తున్నాయి నగరంలోని నయా ట్రెండ్స్. మ్యూజిక్ ఈవెంట్ల.. పంట.. పేరొందిన రాక్ బ్యాండ్ సంగీత ప్రదర్శనలతో కేఫ్స్ హోరెత్తుతున్నాయి. బంజారాహిల్స్‌లోని హార్డ్‌రాక్ కేఫ్ లాంటివి అచ్చంగా వీటికే పేరొందాయి. డ్రమ్స్, ఫ్లూట్స్, సాక్సాఫోన్, వయోలిన్.. తదితర విభిన్న రకాల పరికరాలను పలికించడంలో నైపుణ్యం కలిగిన మ్యుజీషియన్స్ తరచూ కేఫ్ సందర్శకులకు వీనుల విందును పంచుతుంటారు. ఇక గజల్ గానామృతాలు, సినీ గాయకుల స్వరమధురిమల సంగతి సరేసరి. ఓ వైపు రుచికరమైన విందును, మరోవైపు పాటలతో వీనుల విందును సైతం అతిథులు ఆస్వాదిస్తున్నారు.కేఫ్స్‌లో నిర్వహించే ఈవెంట్స్‌లో మ్యూజిక్ తర్వాత కామెడీ షోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీకి అతిథుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సిటీలో ఇప్పుడు పదుల సంఖ్యలో స్టాండప్ కమెడియన్స్ ఉన్నారంటే దానికి కారణం కేఫ్స్ యజమానులు వారికి కల్పిస్తున్న అవకాశాలే అని చెప్పొచ్చు. ఇతర నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేరొందిన కమెడియన్స్, థియేటర్ ఆరి్టస్ట్స్, టీవీ షోస్ ద్వారా పాపులర్ అయినవారు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా సిటీ కేఫ్స్‌కు తరలివస్తున్నారు.వర్క్‌ప్లేస్‌లోనూ..ఒకప్పుడు సాయంత్రాల్లో, వారాంతాల్లో మాత్రమే కేఫ్స్ కళకళలాడేవి అయితే ఆ తర్వాత పగటి పూట, అలాగే అన్ని రోజుల్లోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే కస్టమర్స్ కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పొచ్చు. ఆఫీస్ స్పేస్‌ను కూడా కేఫ్స్ ఆఫర్ చేస్తుండడం ఇందులో ఒకటి. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ తదితర కరోనా నేపథ్యంలో పుట్టుకొచ్చిన వర్క్ కల్చర్స్ వల్ల ఇప్పుడు కేఫ్స్‌లో కూర్చునే ఆఫీస్ వర్క్ చేసుకోవడం నగరవాసులకు అలవాటైంది. కేవలం ఐటీ నిపుణులు మాత్రమే కాకుండా విభిన్న రకాల వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు కూడా కేఫ్స్‌ను వర్క్‌ప్లేస్‌లుగా వినియోగిస్తున్నారు.వర్క్‌షాప్స్.. విందు వినోదాలకు మాత్రమే కాకుండా విభిన్న రకాల అంశాల్లో శిక్షణా తరగతులకు కూడా కేఫ్స్ నిలయంగా మారుతుండడం విశేషం. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ కేఫ్స్‌లో బాగా పెరిగిందని నగరానికి చెందిన ఫుడీస్ క్లబ్ నిర్వాహకులు సంకల్ప్ చెబుతున్నారు. పోటరీ వర్క్‌షాప్, పెయింటింగ్ వర్క్‌షాప్, కేక్ డెకరేటింగ్, రెసిన్ ఆర్ట్, క్యాండిల్ మేకింగ్, బేకింగ్ తదితర కళలకు సంబంధించిన వర్క్‌షాప్‌లతో నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.డేటింగ్స్.. మీటప్స్.. పలు సంస్థలు, క్లబ్స్ తమ మీటప్ పాయింట్లుగా కేఫ్స్‌ను ఎంచుకుంటున్నాయి. నిర్వాహకులు వారి కార్యకలాపాలకు తగ్గట్టుగా థీమ్స్‌ను సిద్ధం చేసి మరీ ఆతిథ్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో ఊపందుకున్న డేటింగ్స్కు కూడా పలు కేఫ్స్ వారధిగా నిలుస్తున్నాయి. కొన్ని కేఫ్స్ ప్రత్యేకంగా ఒంటరి వ్యక్తుల కోసం ఒక రోజును కేటాయిస్తూ ఫ్రెండ్షిప్ ఈవెంట్స్, పెయిరింగ్ ఈవెంట్స్ తరహా థీమ్స్‌తో ఆకర్షిస్తున్నాయి. సహజంగానే ఇవి సోలో లైఫ్‌లో ఉన్నవారిని ఆకట్టుకుంటున్నాయి. -
Nimrah Cafe: సిటీ స్పాట్స్.. సెల్ఫీ షాట్స్
మనిషి జీవనశైలిలో వచ్చిన అధునాతన మార్పుల్లో సెల్ఫీకి ప్రత్యేక స్థానముంది. ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సాప్.. ఇలా ఎన్నో వేదికలపై సెల్ఫీ అజరామరంగా వెలుగుతోంది. 2012 తర్వాత సెల్ఫీ అనే వ్యాపకం గ్లోబల్ వేదికగా తన ప్రశస్తిని పెంచుకూంటూ వస్తోంది. అయితే.. ప్రస్తుతం నగరంలోని ఓల్డ్ సిటీ సెల్ఫీ స్పాట్స్‌గా గుర్తింపు పొందుతోంది. తమని తాము మాత్రమే కాకుండా తమ వెనుక ఓ చారిత్రక కట్టడం, వారసత్వ వైభవాన్ని క్లిక్‌మనిపించడం ఈ తరానికి ఓ క్రేజీ థాట్‌గా మారింది. ఇందులో భాగంగానే పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు సెల్ఫీ స్పాట్స్‌కు హాట్‌స్పాట్స్‌గా మారాయి..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే ఐటీ, మోడ్రన్ లైఫ్ వంటి విషయాలు మదికి వస్తాయేమో కానీ.., గతంలో మాత్రం చార్మినార్ గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా హైదరాబాద్‌ను మొదటిసారి సందర్శించిన ప్రతి ఒక్కరూ చార్మినార్‌ను చూడాలనే అనుకుంటారు. అనుకోవడమే కాదు.. నగరానికొచ్చి చార్మినార్‌తో సెల్ఫీ తీసుకోలేదంటే ఏదో అసంతృప్తి. ఇలా సిటీలో బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా చార్మినార్ అందరినీ దరిచేర్చుకుంటుంది. ఉదయం వాకింగ్ మొదలు అర్ధరాత్రి ఇరానీ ఛాయ్ ఆస్వాదించే వారి వరకు ఈ చార్మినార్‌తో సెల్ఫీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓల్డ్‌సిటీ ఇప్పటికీ తన వైభవాన్ని సగర్వంగా నిలుపుకుంటుంది అంటే చార్మినార్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి నగరవాసులు అతి ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాల్లో ఈ సెల్ఫీ స్పాట్ ఒకటి. ఓల్డ్‌సిటీ షాపింగ్ అంటే లక్షల క్లిక్కులే.. ఓల్డ్ సిటీ అంటే ఒక్క చార్మినార్ మాత్రమే కాదు.. ఇక్కడ దొరికే మట్టి గాజులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. షాపింగ్ అంటే నో చెప్పని యువతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. యువతుల మనస్సును హత్తుకునే ఎన్నో అలంకరణ వస్తులు, గాజులు, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ విరివిగా లభ్యమవుతాయి. రంజాన్ సీజన్లో ఇక్కడ షాపింగ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి సైతం రావడం విశేషం. ఈ సమయంలో ఇక్కడే లక్షలసెల్ఫీలు క్లిక్, క్లిక్మంటుంటాయి. చింత చెట్టు కింద సెల్ఫీ.. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన వరదలకు దాదాపు 15 వేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రాణనష్టం జరిగింది. ఈ తరుణంలో అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు సమీపంలో ఉన్న చింతచెట్టు దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. వరదల్లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగరవాసులు ఈ చెట్టు ఎక్కి తమ ప్రాణాలను దక్కించుకున్నాను. అయితే ఇప్పటికీ ఈ చెట్టు పటిష్టంగా ఉంది. ఈ చరిత్ర తెలిసిన వారు ఆ సమీపంలోకి వెళ్లినప్పుడు ఓ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మరిచిపోరు. ఈ వీధులన్నీ సెల్ఫీలమయమే.. పాతబస్తీలోనే కొలువుదీరిన సాలార్జంగ్ మ్యూజియం, వందేళ్ల సిటీ కాలేజ్, హైకోర్టు పరిసర ప్రాంతాలు, పురానాపూల్, చార్మినార్ చౌరస్తా కేంద్రంగా నాలుగు దిక్కుల్లోని విధుల్లో నిర్మించిన కమాన్లు కూడా సెల్ఫీ స్పాట్లుగా మారాయి. మిడ్ నైట్ స్పాట్.. నిమ్హ్రా చార్మినార్ పక్కనే ఉన్న నిమ్హ్రా కేఫ్ కూడా ది బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా మారింది. ఇక్కడ టీ తాగుతూ సెల్ఫీ తీసుకోవడం, అది కూడా అర్ధరాత్రి ఛాయ్‌కి రావడం ఇక్కడి ప్రత్యేకత. పాతబస్తీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఛాయ్ ఆహా్వనించడం నిమ్హ్రా కేఫ్ ప్రత్యేకత. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఇదే కేఫ్‌లో సెల్ఫీ దిగి అక్కడే ఫోన్ మర్చిపోయి ఎయిర్పోర్ట్ వెళ్లాడు. అయితే అంతే జాగ్రత్తగా తన ఫోన్ తనకు తిరిగి రావడంతో నగరవాసులపై గౌరవం పెరిగిందని చెప్పుకున్నారు. దీనికి సమీపంలోని షాగౌస్ బిర్యాని తింటూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ ట్రెండ్. ఇలా పిస్తాహౌజ్, ఇరానీ ఛాయ్, పాయా సూప్ తదితర ఫుడ్ స్పాట్లు సెల్ఫీ స్పాట్లుగా మారాయి.మొదటి ‘సెల్ఫీ’.. సెల్ఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఆ్రస్టేలియాలోని ఓ న్యూస్ వెబ్సైట్లో వాడారు. కానీ సెల్ఫీ అనే పదం ప్రాచూర్యం పొందింది మాత్రం 2012 తర్వాతే అని చెప్పాలి. సోషల్ మీడియా ఊపందుకుంటున్న 2013లో ఈ సెల్ఫీ అనే కొత్త పదం విపరీతంగా చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ పదం బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ సెల్ఫీ అనే పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. -
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: NIA ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు!
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది.ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్ హుస్సేన్ షాబీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మజ్ మునీర్, ముజామిల్ షరీఫ్‌లు ఈ కేసులో నిందితులు. వీళ్లపై ఐపీసీ సెక్షన్లు, యూఏపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. .. వీళ్లు నలుగురు డార్క్ వెబ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిసి ఈ నలుగురు భారీ కుట్ర పన్నారు. మార్చి 1వ తేదీన బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో దాడి జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. షాజీబ్ అనే వ్యక్తి కేఫ్‌లో బాంబ్ పెట్టాడు. తాహా, షాబీజ్ ఇద్దరూ శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్లు. NIA Chargesheets 4 in Rameshwaram Cafe Blast Case pic.twitter.com/BnEBy29Khp— IANS (@ians_india) September 9, 2024 2020లో అల్ హింద్ ఉగ్రసంస్థ మూలాలు బయటపడగానే.. వీళ్లు పరారయ్యారు. వీళ్లు ఉగ్ర మూలాలు ఉన్న మరో ఇద్దరు నిందితులతో డార్క్ వెబ్‌లో జత చేరారు. టెలిగ్రామ్ ద్వారా వీళ్ల మధ్య సంభాషణలు జరిగాయి. క్రిఫ్టో కరెన్సీలతో వీళ్ల లావాదేవీలు సాగాయి. ఆ డబ్బుతో బెంగళూరులో మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలనుకున్నారు. అయితే..అయోధ్య ప్రాణప్రతిష్ట రోజున( జనవరి 22, 2024) బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కానీ, అది ఫలించలేదు. దీంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని ఎన్ఐఏ తెలిపింది. -
తమిళనాడు ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు
చెన్నై: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనను తమిళనాడు ప్రజలతో ముడిపెడుతూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.అయితే.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దీంతో కేంద్ర మంత్రిపై మధురైలో కేసు నమోదు అయింది. తాజగా ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ జీ. జయచంద్రన్ సెప్టెంబర్ 5 తేదీకి వాయిదా వేశారు. -
Mitti Cafe: అలీన అద్భుత దీపం...
అద్భుతాలు జరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అలీన ఆ ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం...మిట్టీ కేఫ్. ఆఫీసుల నుంచి రెస్టారెంట్ల వరకు దివ్యాంగులకు సరిౖయెన సౌకర్యాలు లేని పరిస్థితి. ‘నేను ఉద్యోగం చేస్తాను’ అని అడిగితే ‘సారీ’ చెప్పే పరిస్థితి. ఇది తెలిసి కూడా దివ్యాంగులను ఉద్యోగులుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా చూడాలని కల కన్నది అలీనా అలమ్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదలుపెట్టిన ‘మిట్టీ కేఫ్’ ఆ తరువాత కాలంలో అద్భుతం సృష్టించింది. ‘మిట్టి కేఫ్’ అనేది ఇప్పుడు ఒక కేఫ్ బ్రాండ్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్...దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్‌లో ఇంటర్న్‌షిప్ ్ర΄ోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ‘మిట్టీ కేఫ్’ ఆలోచన ఆలీనా అలమ్‌కు వచ్చింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను సాకారం చేసుకోవడానికి ‘మిట్టీ కేఫ్’ మంచి ఆలోచన అనుకుంది.‘పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు తల్లిదండ్రులు. అలీనా మాత్రం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దారిలో నడక మొదలు పెట్టింది. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల చేత నడుస్తున్న ‘మిట్టీ కేఫ్’లు సక్సెస్ అయ్యాయి.‘మన దేశంలోని లక్షలాది మంది దివ్యాంగులు సమాన అవకాశాల కోసం, ఆర్థికంగా సొంతకాళ్ల మీద నిలబడడం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్య అనేది వారి సామర్థ్యం గురించి కాదు. సమస్య మనం చూసే దృష్టి కోణంలో ఉంది. వారి గురించి మనకు ఎన్నో అ΄ోహలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి΄ోవాలి’ అంటున్న అలీన ‘మిట్టీ కేఫ్’ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉ΄ాధితో΄ాటూ ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.దాతలు ఇచ్చిన విరాళాలతో‘మిట్టీ కేఫ్’ మొదలైంది. ‘సంకల్పం మంచిదైతే సహాయపడడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అన్నట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని కేఫ్‌కు సంబంధించిన ΄ోస్టర్లను ఉచితంగా ముద్రించి ఇచ్చాడు.దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మిట్టీ కేఫ్’లను తీర్చిదిద్దారు. దృష్టి లోపం ఉన్నవారు బిల్లింగ్ చేయడానికి వీలుగా బిల్లింగ్ సిస్టమ్‌లో ఆడియో ఫీచర్ ఉంది. మెనూ బ్రెయిలీ లిపిలో ఉంటుంది. వినికిడి లోపం ఉన్న, మూగ ఉద్యోగులు కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్లకార్డులు కూడా ఉంటాయి.హుబ్లీలోని చిన్న షెడ్లో మొదలైన ‘మిట్టీ కేఫ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఎయిర్΄ోర్ట్స్, పెద్ద కంపెనీలు, బ్యాంకులు... మొదలైన వాటిలో 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ్ర΄ాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎం–బెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ్ర΄ారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని విమాన్రాశయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ‘మిట్టీ కేఫ్’ లు ఏర్పాటు చేయనున్నారు.‘కరేజ్’ ‘మ్యాజిక్’ అనే మాటలు అలీన నోటి నుంచి తరచుగా వినిపిస్తుంటాయి. ‘ధైర్యం’ ఉన్న చోటే ఊహించని అద్భుతాలు, మ్యాజిక్‌లు జరుగుతాయి. ‘మిట్టీ కేఫ్’ రూపంలో అద్భుతం సృష్టించడానికి అలీనాలోని ధైర్యమే కారణం. ఆమెకు బాగా ఇష్టమైన కొటేషన్...‘ఎక్కడ దయాగుణం ఉంటుందో... అక్కడ మంచితనం ఉంటుంది.ఎక్కడ మంచితనం ఉంటుందో... అక్కడ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది’‘మనం మాత్రం ఏం చేయగలం’ అనుకునే నిరాశావాదులకు అలీన ఆలమ్ విజయం కనువిప్పు లాంటిది. కొత్త దారి చూపే కాంతి కిరణంలాంటిది. ‘మిట్టీ కేఫ్’లో పనిచేసిన దివ్యాంగ ఉద్యోగులలో కొందరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించడం మరో మంచి విజయం. -
నేతి రుచులు.. మాదాపూర్‌లో ఆకట్టుకుంటున్న రామేశ్వరం కేఫ్
మాదాపూర్: స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన అల్సాహారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలోని ఆహార ప్రియులు ఒక్కసారైనా ఈ కేఫ్‌లో నేతితో తయారు చేసిన ఆహారపదార్థాలు రుచిచూడకమానరు. ఇక వారాంతాల్లో అయితే నగరవాసులు టోకెన్ల కోసం కౌంటర్ వద్ద క్యూ కడుతుంటారు. వీరితోపాటు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం రామేశ్వరం కేఫ్‌ను విజిట్ చేస్తుంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో అల్పాహారానికి ఓ ప్రత్యేకమైన రుచి ఉంది. అందుకే నగరవాసులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఇక్కడి టిఫిన్లను రుచిచూస్తుంటారు. టెంపుల్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ హోటల్ చూడడానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రముఖులు, సినీతారలు సైతం వచ్చి చాయ్‌ను ఆస్వాదిస్తుంటారు. దాదాపు 150 రకాలకుపైగా టిఫిన్స్, స్నాక్స్, భోజనం, మాక్టైల్స్, జూసులు అందుబాటులో ఉంటాయి.ప్రతి రోజు 800వందల నుంచి 1000 మంది టోకెన్లు తీసుకుంటుంటారు. ఇక శని, ఆదివారాల్లో 1200 నుంచి 1400 వందల వరకూ టోకెన్స్ తీసుకుంటుంటారు. టెంపుల్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రైస్‌లో టెంపుల్ పులహోర, బిసిబెల్లాబాత్, కర్డ్‌రైస్, గొంగూరరైస్లు అందుబాటులో ఉన్నాయి. టిఫీన్స్లో స్పైసీ వడ, చక్కెర పొంగలి, నెయ్యి దోశ, నేతి ఇడ్లీ ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తాయి.రకరకాల దోశెలు...మల్టీ గ్రెయిన్ దోశ, బటర్ మసాలా దోశ, ఘీ పొడి దోశ, మసాలా దోశ, రవ్వ మసాలా దోశ, ఘీ రాగి దోశ, ఘీ ఆనియన్ దోశ, ఘీ ఆనియన్ ఊతప్పం, గార్లిక్, పుదీనా, మసాలా, ఉప్మా, జైన్ మసాలా దోశలు ప్రత్యేక ఫ్లేవర్‌తో తయారు చేయడంతో వీటి కోసం అల్పాహార ప్రియులు ఎగబడుతుంటారు. వీటితోపాటు సాంబార్ వడ, పెరుగు వడ, క్యారెట్ హల్వా, మిర్చి బజ్జీ, వంటి వెరైటీలూ భలే రుచిగా ఉంటాయని ఆహార ప్రియులు చెబుతుంటారు.పసందైన పానీయాలుబ్లాక్కాఫీ, బాదంమిల్్క, బూస్ట్, కాఫీ, హర్లిక్స్, లెమన్‌టీ, మసాలా బటర్మిల్్క, వివిధ రకాల పళ్ల రసాల మిల్‌్కõÙక్లు అందుబాటులో ఉంటాయి. -
Delhi: భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం
దేశరాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇక్కడి యూనిఫాం తయారీ దుకాణం, కేఫ్‌లలో చోటుచేసుకుంది. చూస్తున్నంతలోనే మంటలు చుట్టుపక్కల దుకాణాలను చుట్టుముట్టాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తమ వాహనాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 25 ఫైర్ టెండర్ వాహనాలు మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. వెంటిలేషన్ సరిగా లేకపోవడం కారణంగానే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ కాంప్లెక్స్‌లో 30 దుకాణాలు ఉండగా, వాటిలో 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. #WATCH दिल्ली: मयूर विहार फेज 2 में नीलम माता मंदिर के पास यूनिफॉर्म बनाने वाली दुकान और कैफे में आग लग गई। दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी का इंतजार है। pic.twitter.com/XGSNcdYJO0— ANI_HindiNews (@AHindinews) July 14, 2024 -
డేటింగ్ యాప్: అమ్మాయి వలపు వల.. సివిల్స్ అభ్యర్థి’ని కేఫ్‌కి పిలిచి..
ఢిల్లీ: డేటింగ్ యాప్‌ల పేరుతో కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. మాటమాట కలుపుతారు.. పరిచయాలు పెంచుకుంటారు. వీరి వలలో చిక్కుకుని లక్షలు పోగొట్టుకుంటున్నారు. నమ్మి చెప్పిన చోటుకు వెళ్తే జేబులు ఖాళీ చేసి పంపిస్తున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి టిండర్ యాప్‌లో ఓ యువతి పరిచయం కాగా, ఆమె బర్త్‌డే వేడుకకు కేఫ్‌కి పిలిచింది. ఇద్దరూ కేక్‌లతో పాటు డ్రింక్స్ ఆర్డర్ చేశారు. సడన్‌గా ఆ యువతి ఉన్నట్టుండి.. కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని.. ఎమర్జెన్సీ అంటూ నమ్మించి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. బిల్ కట్టేసి వెళ్లిపోదామనుకున్న యువకుడికి షాక్ తగిలింది. నాలుగు కేక్‌లు, నాలుగు షాట్స్ డ్రింక్స్‌కే రూ.1.21 లక్షల బిల్ వేశారు. మహా అయితే నాలుగైదు వేలల్లో ఉండే బిల్ ఇలా లక్ష దాటే సరికి యువకుడు నివ్వెరబోయాడు. చివరకు బిల్ కట్టకపోతే చంపేస్తాంటూ కేఫ్ సిబ్బంది బెదిరింపులకు దిగారు. చేసేదేమీ లేక ఆ యువకుడు ఆన్లైన్లో నగదును ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు.పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి పేరుతో పాటు వివరాలన్నీ ఫేక్ అని తేలింది. వీళ్లంతా కుమ్మక్కై ఆ యువకుడిని దోచుకున్నారని గుర్తించారు. వెంటనే ఆ యువతిపై నిఘా పెట్టిన పోలీసులు మరో కేఫ్‌లో వేరే అబ్బాయితో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇటీవల ఇలాంటి తరహా మోసం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చాలా మంది అబ్బాయిలు డేటింగ్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇలా డేటింగ్ యాప్‌లో అమ్మాయిల ద్వారా పబ్ ఓనర్లు చేస్తున్న దోపిడీ ఇటీవల ఒకటి బట్టబయలైంది. డేటింగ్ యాప్‌లో అమ్మాయిలను ఎరగా వేసి అలా పరిచయమైన వారిని పబ్‌లకు పిలిపిస్తూ వారి చేత ఖరీదైన మద్యం కొనుగోలు చేయిస్తున్నారు. -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆ కేఫ్ విందు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధిక మర్చంట్ రెండొవ ప్రీ వెడ్డింగ వేడు క్రూయిజ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అందులోనూ అంబానీల ఇంట జరిగే ఆఖరి పెళ్లి కావడంతో మరింత గ్రాండ్‌గా కన్నుల పండుగగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకులు దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్ జరిగింది. శనివారం (జూన్ 1, 2024న) ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంతో ముగుసింది. అయితే ఈ వేడుకకు విచ్చేసిన అతిరథ మహారథులకు రామేశ్వరం కేఫ్ విందు అందిచిందట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించి రామేశ్వరం కేఫ్. సెలబ్రిటీ అసెంట్ క్రూయిజ్‌లో బెస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్‌లో పాల్గొన్నందకు సంతోషంగా ఉందని రామేశ్వరం రెస్టారెంట్ పేర్కొంది. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ వేడుకల్లో సౌత్ ఇండియన్ వంటకాలను అందించే ఏకైక సంస్థ తామేనని కేఫ్ సగర్వంగా పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది స్వయంగా రామేశ్వరం కేఫ్ కోఫౌండర్ రాఘవేంద్రరావు. అంతేగాదు ప్రపంచంలోని అత్యుత్తమ వివాహ వేడుకలో తాము భాగమయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని తెలిపారు. కాగా ఈ ఏడాది జామ్నర్లో జరిగిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా రామేశ్వరం కేఫ్ భాగమయ్యింది. ఇటీవలే జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా రామేశ్వరమే విందు అందించడం విశేషం. కాగా, ఈ వేడుకల్లో సుమారు 800 మందికి ఆతిథ్యం ఇచ్చింది అంబానీ కుటుంబం. ఈ విందులో జపాన్, మెక్సికోతో సహ వివిధ వంటకాలతో కూడిన అంతర్జాతీయ మెనూని అందించారు. దీంతోపాటు ఈ వేడుకలో ఇంటి రుచిని అందించే వంటకాలను కూడా జోడించడం విశేషం.(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..) -
Mitti Cafe: ఈ కేఫ్ చాలా ‘స్పెషల్’
‘మిట్టి’ అంటే మట్టి.ఈ మట్టి మీద పుట్టిన అందరికీ ఈ మట్టి మీద ఉన్న అన్ని ఉపాధుల్లో హక్కు ఉంది. కాని దివ్యాంగులకు చాలా చోట్లడోర్లు క్లోజ్ అయి ఉంటాయి.అందుకే 24 ఏళ్ల అలినా ఆలమ్ దివ్యాంగుల కోసమే నడిచే, వారే యజమానులుగా మారే కేప్‌లను‘మిట్టి కేఫ్’ పేరుతో స్థాపించింది.ఇప్పటికి 4000 మంది దివ్యాంగులు ఉపాధి ΄పోందారు.సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీనే ఈ ప్రయత్నాన్ని మెచ్చుకునిసుప్రింకోర్టుప్రాంగణంలో మిట్టి కేఫ్‌కు చోటు ఇచ్చారు.అలినా ఆలమ్ తన టీనేజ్‌లో కోల్‌కటాలోని నానమ్మ దగ్గర పెరిగింది. నానమ్మకు వెన్ను సమస్య వచ్చినప్పటి నుంచి ఆమెకు కదలడం, సొంత పనులు చేసుకోవడం చాలా కష్టమవడం గమనించింది. అది అలినా ఆలమ్ మనసులో ముద్ర పడింది. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చాక చదువులు, ర్యాంకులు అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్నవారిని అందలం ఎక్కించేలా ఉన్నాయి కాని ఏ ఉ΄ాధి రంగమూ దివ్యాంగులకు మేము పని ఇస్తాం అనడం కనిపించలేదు. దివ్యాంగులు ఆత్మాభిమానంతో జీవించాలంటే వారికి సానుభూతి కంటే ఉపాధి కల్పించడమే చాలా ముఖ్యం అనుకుంది. ‘నేనే దివ్యాంగులకు పని ఇస్తాను’ అని నిశ్చయించుకుంది. ‘నీ దగ్గర ఏముందని వారికి పని ఇస్తావు?’ అని ఫ్రెండ్స్ అడిగారు. ‘సంకల్పం ఉంది’ అని చెప్పింది అలినా.2017లో మొదటి కేఫ్దివ్యాంగులకు పని ఇవ్వడమే కాదు... ఆ పని నలుగురి కంటా పడేలా చేయాలి... వారితో నలుగురూ మాట్లాడేలా ఉండాలి... ఈ ప్రయత్నాన్ని చూసి నలుగురూ తమ తమ రంగాల్లో అలాంటి వారికి పని ఇచ్చేలా ఉండాలి అనేది అలినా ఆలోచన. ఇందుకు ‘కేఫ్’ తెరవడం సరైనదనిపించింది. అప్పటికి చదువుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అలినా ఇలాంటి ప్రయత్నానికి అండగా నిలిచే సేవాసంస్థ దేశ్‌పాండే ఫౌండేషన్‌ను కలిసి ఆలోచన చెప్పింది. నిధులు తీసుకుని ఉత్తర కర్నాటకలోని హుబ్లీలో తొలి ‘మిట్టి కేఫ్’ తెరిచింది. అందుకు ఊరిలో ప్రతి వీధి తిరిగి దివ్యాంగులకు ఉద్యోగం, ఉ΄ాధి అని చెప్పింది. కొందరు సందేహంగా చూశారు. కొందరు అపనమ్మకంతోనే వచ్చారు. నడక వీలుకాని వారు, బధిరులు, అంధులు, మరుగుజ్జులు, గూని బాధితులు... వీరు వచ్చి ఉత్సాహంగా పనిలో జాయిన్ అయ్యారు. మిట్టి కేఫ్‌లో టీ, కాఫీ, శాండ్ విచ్, సాదా సీదా భోజనం దొరికేలా మెనూ తయారు చేసింది అలినా. ఆ మెల్లగా అయినా సరిగ్గా చేయడం నేర్చుకున్నారు. వారికే మొత్తం నిర్వహణ, ఆదాయ పంపకం అప్పజెప్పి మరో మిట్టి కేఫ్ కోసం సాగి΄ోయింది అలినా.ఆహ్వానించే ప్రయత్నంఒక పని సఫలం కావాలంటే సరిగ్గా వివరించే ప్రయత్నం చెయ్యాలి... ఉద్దేశం పరిశుభ్రంగా ఉండాలి. అలినా ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి ఉన్నాయి. అందుకే కార్పొరెట్ సంస్థలు, ఎయిర్΄ోర్ట్ల యాజమాన్యాలు అందరూ ఆమెను ఆహ్వానించారు. బెంగళూరు ఎయిర్΄ోర్ట్, ముంబై ఎయిర్‌పోర్ట్‌లతో ΄ాటు పెద్ద పెద్ద ఆస్పత్రులలో కూడా మిట్టి కేఫ్‌లు ఏర్పాటయ్యాయి. ‘ఇప్పటికి దేశంలో 41 చోట్ల మిట్టి కేఫ్‌లు ఉన్నాయి. ఇవి ఇంకా పెరుగుతాయి. సుప్రీంకోర్టు ప్రాగణంలో కూడా మాకు చోటు దక్కడం గొప్ప విషయం’ అంటుంది అలినా. ఈ కేఫ్‌ల ద్వారా ఇప్పటికి 4000 మంది దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వు వచ్చింది. ఆత్మాభిమానం తొణికిసలాడింది.వెతికి, శిక్షణ ఇచ్చి‘కేఫ్ పని అయినా శిక్షణ అవసరం. అందుకే నేను దేశంలోని కొన్ని ఎన్జిఓలను కాంటాక్ట్ చేసి ఆయా ్ర΄ాంతాల్లోని దివ్యాంగులను గుర్తించేలా చేశాను. అంతే కాదు ఇళ్ల నుంచి తరిమేస్తే రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న దివ్యాంగులను కూడా గుర్తించాను. ఒక పట్టణంలో ఒక సమూహం సిద్ధంగా ఉంది అని అర్థమయ్యాక వారికి అక్కడి వ్యక్తుల చేత రెండు నెలల ΄ాటు ట్రయినింగ్ ఇప్పించి మిట్టి కేఫ్‌లు స్థాపిస్తున్నాను. అందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఒకసారి కేఫ్ స్థాపించాక దాని మీద అధికారం ఆ దివ్యాంగులదే’ అంటుంది అలినా.‘మా మిట్టి కేఫ్ స్టాఫ్ మిగిలిన రెస్టరెంట్ల స్టాఫ్ అంత వేగంగా పని చేయక΄ోవచ్చు. చెప్పింది మెల్లగా అర్థం చేసుకోవచ్చు. కాని వారు పని గొప్పగా చేస్తారు. మీరు మెచ్చుకునేలా చేస్తారు’ అంటుంది అలినా. వీరు అమ్మే ‘కుల్హాద్ చాయ్’కి మంచి డిమాండ్ ఉంది. అన్నట్టు ఇక్కడ మెనూ బ్రెయిలీలో కూడా ఉంటుంది. ఇలాంటి కేఫ్‌ను ప్రతి ఊరికి ఆహ్వానించండి. -
డిజిటల్ కేఫ్.. కమ్మనైన ఆటలు, పసందైన టాస్క్‌లు లభ్యం
ఉత్తరప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయాగ్‌రాజ్ మరో కొత్తదనాన్ని సింగారించుకుంది. ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కొత్త సొబగును సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొట్టమొదటి ఫ్లోటింగ్ రెస్టారెంట్, బోట్ క్లబ్, మొదటి ట్రాఫిక్ పార్క్ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు డిజిటల్ కేఫ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.ప్రయాగ్‌రాజ్‌లోని ట్రాఫిక్ పార్క్ లో ప్రారంభించిన ఈ డిజిటల్ కేఫ్‌కు అత్యధిక సంఖ్యలో యువత తరలివస్తున్నారు. ఈ కేఫ్‌లో అల్పాహారానికి బదులుగా డిజిటల్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం మూడు పెద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చేవారు సోఫాలపై కూర్చుని, హెడ్‌ఫోన్ పెట్టుకుని వీడియో గేమ్‌లను ఆడవచ్చు. టెంపుల్ రన్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఇలాంటి ఏ గేమ్ అయినా ఇక్కడ ఆడుకోవచ్చు.ఈ పార్కులోకి ప్రవేశించేందుకు పిల్లలకు రూ.5, పెద్దలకు రూ.10 టిక్కెట్టుగా నిర్ణయించారు. డిజిటల్ కేఫ్, మోషన్ థియేటర్లకు ఎంట్రీ ఫీజుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పార్క్ ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. ఈ పార్కును ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తున్నది. -
‘రాయదుర్గం’లో ఎన్ఐఏ సోదాలు!
రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని ఉర్దూ (ఏఏఐ) పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్ నివాసంలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించడం అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకే రాయదుర్గంలోని నాగులబావివీధిలో ఉన్న అబ్దుల్ సాహెబ్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు ఉదయం తొమ్మిది గంటల వరకూ ఇంట్లోనే విచారణ చేశారు. అనంతరం అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ను అదుపులోకి తీసుకుని పటిష్ట పోలీసు భద్రత నడుమ రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని వాట్సాప్ చాటింగ్, ల్యాప్‌ట్యాప్‌లో ఫైళ్లు, ఆన్లైన్ లావాదేవీలపై మరో మూడు గంటలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ సమయంలో ఆ వీధిలోకి ఎవరూ రాకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ..విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్‌కు సుహేల్, మాతిన్ సంతానం. పెద్ద కుమారుడు సుహేల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మాతిన్ స్థానికంగా బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే తన మకాంను హైదరాబాద్‌కు మార్చిన సుహేల్ తరచూ బెంగళూరు వెళ్లి వచ్చేవాడు. నెలరోజుల క్రితమే బళ్లారికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న సుహేల్ అప్పటి నుంచి రాయదుర్గంలోని తన స్వగృహంలోనే ఉంటున్నాడు. కేఫ్‌లో బాంబు పేలుడుపై అనుమానాలు..కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్ కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సీసీ పుటేజీ ఆధారంగా 30 ఏళ్ల వయసు కలిగిన యువకుడు కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగు పడేసి వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అది పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు తేల్చారు. దీనికి ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో రాయదుర్గం పట్టణానికి చెందిన సుహేల్ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇరువురి సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేసేందుకే సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. అయితే నిందితుడు ఎక్కడా మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. ఎన్ఐఏ అదుపులో వికారాబాద్ పండ్ల వ్యాపారి?వికారాబాద్: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఈ ఏడాది మార్చి 1న జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వికారాబాద్‌లో ఒక పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇతని స్వస్థలం పూణే అని, నాందేడ్‌లోనూ పండ్ల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. అతడిపై కర్నాటకలో పలు కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో శిక్ష సైతం పడినట్టు ఎన్ఐఏ అధికార వర్గాల తెలిపాయి. -
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్
కోల్‌కతా: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కేఫ్ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్ షాజిబ్‌ను పశ్చిమబెంగాల్లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. తూర్పు మెదీనాపూర్‌లోని కాంతి ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళలోని పలు ప్రాంతాల్లో తనిఖీల తర్వాత అక్కడి పోలీసుల సాయంతో ఈ అరెస్టుల పరిణామం జరిగింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులకు స్థానికంగా సహకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను కూడా దర్యాప్తు సంస్థ గత నెలలో అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురూ ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నవంబర్‌లో నమోదైన మంగుళూరు కుక్కర్ పేలుడు కేసుతో పాటు శివమొగ్గ గ్రాఫిటీ కేసులోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన నిందితుడు.. కేఫ్‌లో టిఫిన్ చేసి.. బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ కేసును ఎస్ఐఏ దర్యాప్తు చేస్తోంది. పేలుడుకు పాల్పడిన ఈ ఇద్దరు వ్యక్తులు ఆచూకి తెలిపితే ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తామని.. అందుకు సంబంధిన నిందితుల ఫోటోలను విడుదల చేసి.. ఎన్ఐఏ రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!.. మంత్రి సంచలన కామెంట్స్ -
మాదాపూర్‌లో గ్రాండ్‌గా ఎఫ్ కేఫ్ లాంచ్ ప్రారంభం.. సందడి చేసిన స్టార్స్ (ఫోటోలు)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(12ప్రాంతాలు), తమిళనాడు(5 ప్రాంతాలు), ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట.. మొత్తం 18 ప్రదేశాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక నిందుతుడు ముజ్మిల్ షరీఫ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ముజ్మిల్ మరో ఇద్దరు నిందితులకు పేలుడు పదార్ధలు , సాంకేతిక పరికరాలు సరాఫరా చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సోదాల్లో నగదుతోపాటు, వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారులు సాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇక రామేశ్వరం పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని ఎన్ఐఏ వెల్లడించింది. కాగా మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో బాంబు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారు. ఈ సంఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తుజరుపుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. చదవండి: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ? Rameshwaram Café blast case: National Investigation Agency (NIA) arrested a key conspirator following massive raids across multiple locations in three states. Muzammil Shareef was picked up and placed in custody as a co-conspirator after NIA teams cracked down at 18 locations,… pic.twitter.com/TEzXTXpSv3 — ANI (@ANI) March 28, 2024 -
తమిళులకు కేంద్రమంత్రి క్షమాపణలు
సాక్షి, చెన్నై: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడి ప్రాంతం గురించి శోభా కరంద్లాజే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదం కావడంతో తమిళులుకు ఆమె క్షమాపణలు చెప్తూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ‘సోదరులు, సోదరీమణులకు నా క్షమాపణ. కృష్ణగిరి అడవుల్లో శిక్షణ పొంది, రామేశ్వరం కేఫ్ పేలుడుతో ముడిపడి ఉన్న నిందితుడి గురించే మాట్లాడాను. అయినప్పటికీ నా మాటలు మీకు బాధ కలిగించాయని నేను భావిస్తున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని కరంద్లాజే ఎక్స్.కామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. To my Tamil brothers & sisters, I wish to clarify that my words were meant to shine light, not cast shadows. Yet I see that my remarks brought pain to some - and for that, I apologize. My remarks were solely directed towards those trained in the Krishnagiri forest, 1/2 — Shobha Karandlaje (Modi Ka Parivar) (@ShobhaBJP) March 19, 2024 కరంద్లాజే గతంలో ఏం వ్యాఖ్యలు చేశారంటే? రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ విచారణలో తేలింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై బీజేపీ మహిళా నేత, కేంద్రమంత్రి కరంద్లాజే విమర్శలు చేశారు. సీఎం సంఘ విద్రోహ కార్యకాలపాల్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పలు సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. శోభా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎలాంటి అధికారం లేదు ‘శోభా మీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చర్యలు తీసుకోవాలి. అలాంటి వాదనలు చేసేందుకు మీకు ఎలాంటి అధికారం లేదని అన్నారు. శోభాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరుణంలో శోభా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టడంపై వివాదం సద్దు మణిగింది. -
బెంగళూరు పేలుడు కేసులో ఒకరి విచారణ
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో బళ్లారిలో షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో బాంబు పెట్టి వెళ్లిపోయిన నిందితుడి కోసం గాలిస్తూ బుధవారం షబ్బీర్ ఆచూకీని కనుగొన్నారు. బళ్లారిలో మోతీ సర్కిల్ సమీపంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో షబ్బీర్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొంతసేపు విచారించి బెంగళూరుకు తరలించారు. బాంబు పెట్టిన వ్యక్తికి, షబ్బీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. షబ్బీర్ బళ్లారి సమీపంలో తోరణగల్లు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిíÙయన్‌గా పని చేస్తున్నాడు. బాంబు పేలుడు తర్వాత ప్రధాన నిందితుడు బెంగళూరు నుంచి బళ్లారికి బస్సులు మారుతూ వచ్చాడు. ఆపై షబ్బీర్ ఇంటికి వచ్చి అతడిని కలిసినట్లు ఎన్ఐఏ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలిసింది. కాగా, షబ్బీర్‌ను విచారించి రాత్రి వదిలిపెట్టినట్లు సమాచారం. -
స్ట్రీట్ కేఫ్‌లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అహ్మదాబాద్‌లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడానికి కూడా రోబోట్లతోనే మోహరించింది. View this post on Instagram A post shared by Kartik Maheshwari (@real_shutterup) (చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!) -
బెంగళూర్ కేఫ్ పేలుడుతో జగిత్యాలకు లింక్?
సాక్షి, బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో.. తెలంగాణ జిల్లా జగిత్యాలకు సంబంధం ఉందా?.. తాజా అరెస్టుతో ఆ దిశగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ NIA మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే అతని స్వస్థలం జగిత్యాల కావడం.. పైగా అతనొక మోస్ట్ వాంటెడ్ కావడంతోకీ అంశం తెర మీదకు వచ్చింది.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో.. నిషేధిత పీఎఫ్ఐ కీలక సభ్యుడు సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అతన్ని ఎన్ఐఏ వైఎస్సార్ జిల్లా(ఏపీ) మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసింది. బెంగళూరు పేలుడు కేసులో.. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సలీం స్వస్థలం జగిత్యాల కేంద్రంలోని ఇస్లాంపురా. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని.. NIA సెర్చ్ టీం మైదుకూరులో అదుపులోకి తీసుకుంది. రామేశ్వరం కెఫ్ బాంబు పేలుడులో.. ఇతని హస్తమున్నట్టు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సలీంతో పాటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్, నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి కోసం ఇప్పుడు ఎన్ఐఏ టీంలు గాలింపు చేపట్టాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఉగ్రమూలాలకు కేరాఫ్‌గా జగిత్యాల పేరు పలుమార్లు వినిపించింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసు లింకుతో మరోసారి జగిత్యాల్లో ఉగ్రమూలాలపై చర్చ నడుస్తోంది. గతంలో జగిత్యాలతో పాటు కరీంనగర, నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బెంగళూరు పేలుడు కేసు.. NIA కీలక ప్రకటన
ఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) శనివారం కీలక ప్రకటన చేసింది. అనుమానితుడి కొత్త ఫొటోలను విడుదల చేసి.. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరింది. ఇందుకుగానూ రూ.10 లక్షల రివార్డు కూడా ఉంటుందని ఫోన్ నెంబర్లు, మెయిల్ అడ్రస్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మార్చి 1వ తేదీ మధ్యాహ్నాం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. బస్సులో వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌ను కేఫ్‌లో వదిలివెళ్లడం.. కాసేపటికే అది పేలడం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఫుటేజీల ఆధారంగా అనుమానితుడి కదలికలను దర్యాప్తు బృందం పరిశీలించింది. అయితే.. ఆ రోజు రాత్రి సమయంలో బళ్లారి బస్టాండ్‌లో అనుమానితుడు సంచరించినట్లుగా పేర్కొంటూ ఓ ఫుటేజీని నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. ఘటన తర్వాత.. తుమకూరు, బళ్లారి, బీదర్, భట్కల్.. ఇలా బస్సులు ప్రాంతాలు మారుతూ.. మధ్యలో దుస్తులు మార్చుకుంటూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. చివరకు అతను పుణే వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైనంత త్వరలో అతన్ని పట్టుకుని తీరతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే తమకు తెలియజేయాలని ఎన్ఐఏ ప్రజల్ని కోరుతోంది. పేలుడు జరిగిన రెండ్రోజులకు.. అంటే మార్చి 3వ తేదీన రామేశ్వరం బ్లాస్ట్ కేసులోకి యాంటీ-టెర్రర్ ఏజెన్సీ NIA దిగింది. ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. రెండేళ్ల కిందటి బళ్లారి బాంబు పేలుడుతో పోలికలు ఉండేసరికి.. ఆ పేలుడుకు కారణమైన నిందితుడ్ని జైల్లోనే అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఇక మరోవైపు బెంగళూరులో స్కూళ్లకు బాంబు బెదిరింపులకు సంబంధించిన కేసుల్ని సైతం పరిశీలిస్తోంది. అంతేకాదు.. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న ఓ గ్రూప్‌ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇక.. ఇప్పుడు రామేశ్వరం కేఫ్‌లో అనుమానితుడి చిత్రాలు విడుదల చేసి.. ఆచూకీ తెలిపిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచడంతో పాటు పది లక్షల రివార్డు సైతం ప్రకటించింది ఎన్ఐఏ. NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase. 📞 Call 08029510900, 8904241100 or email to info.blr.nia@gov.in with any information. Your identity will remain confidential. #BengaluruCafeBlast pic.twitter.com/ISTXBZrwDK — NIA India (@NIA_India) March 9, 2024 -
పటిష్ట భద్రత మధ్య తెరుచుకున్న రామేశ్వరం కేఫ్
కర్నాటకలోని బెంగళూరులో గల రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగి వారం రోజులు దాటింది. తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య రామేశ్వరం కేఫ్‌ను తిరిగి తెరిచారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేఫ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. కేఫ్‌ను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెరిచారు. అయితే శనివారం నుంచి వినియోగదారులకు సేవలు అందించనున్నారు. కస్టమర్లను తనిఖీ చేయడానికి కేఫ్ ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల అనుమానాస్పద కార్యకలాపాలపై కేఫ్ సిబ్బంది దృష్టి సారించనున్నారు. రామేశ్వరం కేఫ్ సహ వ్యవస్థాపకులు రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ‘ఏదైతే జరగకూడదని భావించామో అదే జరిగింది. మరింత భద్రతతో ఉండేందుకు ఇదొక పాఠం. శివుని ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భంగా మా కేఫ్‌ను తిరిగి ప్రారంభించాం. శనివారం జాతీయ గీతం ప్లే చేస్తూ రెస్టారెంట్‌ను కస్టమర్ల కోసం తెరుస్తాం’ అని తెలిపారు. కాగా కేఫ్‌ను పూలతో అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. #WATCH | Bengaluru, Karnataka: Checking of the customers being done at the Rameshwaram cafe. The cafe has reopened for people, 8 days after the blast. pic.twitter.com/kwclTU4ksE — ANI (@ANI) March 9, 2024 -
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో కీలకంగా AI
బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తన పరిశీలనాంతరం ఇది ఉగ్రదాడిగా భావిస్తుండగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైతం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీనే ఈ కేసు మొత్తానికి కీలకంగా మారింది. బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి.. ప్రధాన అనుమానితుడి ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. ఆ నిందితుడి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐఈడీ(Intensive Explosive Device)ను బ్యాగ్‌లో తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ముసుగు తొలగించి.. ఇందుకోసం భద్రతా సంస్థలు ఏఐ(Artificial Intelligence) సాయం తీసుకుంటున్నాయి. ఏఐ ఆధారిత ఫేషీయల్ రికగ్నిషన్ సాంకేతిక సాయంతో.. బ్యాగ్‌ను వదిలి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టబోతున్నారు. అనుమానితుడెవరో తెలిసిపోయిందని.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌ను ఉపయోగించి ఆ వ్యక్తిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. మరోవైపు ఏఐ టెక్నాలజీ సాయంతో అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించారు. అతని ఫొటోల్ని సేకరించుకుని ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది బెంగళూరు నగర నేర పరిశోధన విభాగం. Bengaluru blast: Suspected accused captured in CCTV #Bengaluru #Karnataka #Blast #RameshwaramCafe #RameshwaramCafeBlast pic.twitter.com/jNM6BFnPVH — Fresh Explore (@explorefresh24) March 2, 2024 బెంగుళూరులో.. అదీ టెక్నాలజీ కారిడార్లోనే ఈ పేలుడు జరగడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. భద్రతాపరంగా మరింత నిఘా, చర్యలు పెంచాల్సిన అవసరాన్ని ఈ పేలుడు ఘటన తెలియజేస్తోందని నిపుణలు అంటున్నారు. అలాగే.. అనుమానిత వ్యక్తులను పట్టుకునేందుకు AI లాంటి అత్యాధునిక సాంకేతికతను అధికారికంగా వినియోగించడం ఎంత అవసరమో కూడా చెబుతోందంటున్నారు. రెండేళ్ల కిందటి.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో.. మొత్తం 10 మంది గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. 2022 నవంబర్‌లో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్ బాంబు పేలింది. దీంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బృందం ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విచారణకు పూర్తి సహకారం: కేఫ్ యాజమాన్యం తమ ప్రాంగణంలో బాంబు దాడి జరగడంపై రామేశ్వరం కేఫ్ యాజమాన్యం స్పందించింది. విచారణలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాకారం అందిస్తామని.. అలాగే పేలుడులో గాయపడిన వాళ్లకు తాము అండగా నిలుస్తామని కేఫ్ ఎండీ దివ్య రాఘవేంద్ర రావు ప్రకటించారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం ఉదయం.. బ్రూక్‌ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్లో ఉన్న రామేశ్వరం కేఫ్. నెత్తిన క్యాప్.. ముఖానికి ముసుగు.. భుజాన బ్యాగ్‌తో ఆ ఆగంతకుడు కేఫ్‌కు వచ్చాడు. అతని వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 11గం.30.ని. ప్రాంతంలో బస్సు దిగి నేరుగా కేఫ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. పావు గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మధ్యలో తన భుజానికి ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లోని సింక్ వద్ద ఉన్న డస్ట్‌బిన్ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. సరిగ్గా అతను వెళ్లిపోయిన గంటకు ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ బాంబు పేలింది. ఫొటోలు వచ్చాయి: సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు. ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం అని అన్నారాయన. #Marksmendaily : #JustiIn #Karnataka CM #Siddaramaiah visits #RameshwaramCafe, a day after an explosion took place here in #Bengaluru @siddaramaiah #RameshwaramCafeBlast #BengaluruCafeBlast #bombblast pic.twitter.com/ptoGaYePHL — Marksmen Daily (@DailyMarksmen) March 2, 2024 అలాగే.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు.‘‘ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారాయన. -
‘రామేశ్వరం కేఫ్’ ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నేడు!
బెంగళూరులోని రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు నేడు(శనివారం) మఖ్యమంత్రి సిద్ధరామయ్య సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రామేశ్వరం కేఫ్‌లో గుర్తు తెలియని బ్యాగ్‌ను ఉంచారని, ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుడు సంభవించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కర్ణాటక పోలీసుల ఫోరెన్సిక్ బృందం ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 307, 471, యూఏపీఏలోని 16, 18, 38 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దర్యాప్తు బృందం తనిఖీలు చేస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ ‘ఈ కేసు దర్యాప్తు కోసం మేము పలు బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి ఆధారాలు సేకరించాం. పేలుడు సంభవించిన సమయంలో బీఎంటీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ కనిపించింది. అనుమానితుడు ఆ బస్సులో వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటాం. పేలుడు కోసం టైమర్‌ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్ఎస్ఎల్ బృందం విచారణ జరుపుతోంది’ అని తెలిపారు. #WATCH | A team of FSL, Bomb Disposal Squad and Dog Squad conducts an investigation at the explosion site at The Rameshwaram Cafe in Bengaluru’s Whitefield area. pic.twitter.com/iJf7rVvcwN — ANI (@ANI) March 2, 2024 -
బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడు ఘటనతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ పరిధిలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందిసహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించారు. 30 ఏళ్లలోపు వయసు వ్యక్తి ఒకరు ఆ కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగును పడేసి వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిరీ్వర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబోరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందాలు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు. టోకెన్ కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. పోయేముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్‌వాష్ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ‘ ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ చెప్పారు. ‘‘కేఫ్‌లో తినేందుకు అప్పుడే అక్కడికొచ్చాం. 40 మంది దాకా ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశాం’’ అని ప్రత్యక్ష సాక్షులు ఎడిసన్, అమృత్ చెప్పారు. ఎన్ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించింది. పేలుడు స్థలంలో బ్యాటరీ, వైర్లను గుర్తించారు. కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని కెఫే ఎండీ, సహ వ్యవస్థాపకురాలు దివ్య చెప్పారు. దుండగులను వదలిపెట్టం కేఫ్‌లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతాం. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు’ అని శుక్రవారం మైసూరులో వ్యాఖ్యానించారు. ‘‘ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేపట్టింది. సీసీకెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇది ఉగ్రవాదుల పనిలా లేదు. పేలుడు ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని సీఎం అన్నారు. -
Bengaluru Cafe Bomb Blast Video: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
-
హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
Watch Video:బెంగళూర్ కేఫ్‌లో పేలిన టైం బాంబ్
సాక్షి, బెంగళూరు: నగరంలో సంభవించిన భారీ పేలుడు.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టైం బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. టిఫిన్ బాక్స్‌లో ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. తొలుత బ్లాస్ట్‌కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్‌లో సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించింది. అదే సమయంలో.. బోల్ట్‌లు, నట్లు, ఎలక్ట్రిక్ వైర్లను.. వాచ్‌ను(టైం బాంబ్ కోసం ఉపయోగించేది) గుర్తించింది. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. సీసీఫుటేజీ ఆధారంగా ఉదయం 11 గం. ప్రాంతంలో కేఫ్‌లోని సింక్ వద్ద ఓ ఆగంతకుడు బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాక.. 12గం.46ని. సమయంలో బాంబు పేలింది. ఆ బ్యాగ్‌లోని టిఫిన్ బాక్స్‌లోని బాంబ్ పేలుడుకు కారణమని.. ఇది ఉగ్రదాడే అయ్యి ఉంటుందని ఎన్ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది. ఏం జరిగిందంటే.. రామేశ్వరం కేఫ్‌కు నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది కస్టమర్లు వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మొత్తం తొమ్మిది మందిని బ్రూక్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. అందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్ మోహన్ చెప్పారు. అంతకు ముందు.. ‘‘సిలిండర్ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్ ఫైర్ స్టేషన్ అధికారి చెప్పారు. ఇదీ చదవండి: కలాం స్ఫూర్తి.. రామేశ్వరం కేఫ్ నెల బిజినెస్ 4 కోట్లపైనే! An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. #Karnataka pic.twitter.com/7PXndEx2FC — ANI (@ANI) March 1, 2024 #WATCH | Karnataka | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. Whitefield Fire Station says, "We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing… pic.twitter.com/uMLnMFoHIm — ANI (@ANI) March 1, 2024 Just spoke to Rameshwaram Café founder Sri Nagaraj about the blast in his restaurant. He informed me that the blast occurred because of a bag that was left by a customer and not any cylinder explosion. One of their employees is injured. It’s seems to be a clear case of bomb… — Tejasvi Surya (@Tejasvi_Surya) March 1, 2024 ఇదిలా ఉంటే.. రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో తాను మాట్లాడానని.. పేలుడు గురించి ఆరా తీశానని బీజేపీ నేత, ఎంపీ తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ఇది సిలిండర్ బ్లాస్ట్ కాదని.. కస్టమర్ ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు జరిగిందని.. ఇది ముమ్మాటికే బాంబు పేలుడంటూ పోస్ట్ చేశారాయన. -
దివ్యమైన ఫుడ్చైన్: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..?
కందిపొడితో కలిసిన తాజా నేతి వాసన. కొబ్బరి పచ్చడిలో తాజా కరివేపాకు, మినపప్పుతో వేసిన పోపు వాసన వీధి చివరకు వస్తోంది. ముక్కు చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఓ రెస్టారెంట్. లోపలకి వెళ్లేవాళ్లు, సంతృప్తిగా బయటకు వచ్చే వాళ్లు, క్యూలో ఉన్న వాళ్లను చూస్తే లోపల టేబుల్ దొరకడం కష్టమే, రష్ బాగానే ఉందనిపిస్తోంది. తలెత్తి చూస్తే విశాలమైన బోర్డు కుడివైపు ‘ద రామేశ్వరం కేఫ్’ అని ఇంగ్లిష్‌లో ఉంది. తమిళ రుచి అనుకునే లోపే ఎడమవైపు అదే పేరు కన్నడ భాషలో ఉంది. మధ్యలో చక్కటి ముగ్గుతో మూర్తీభవించిన దక్షిణాది సంప్రదాయం కనువిందు చేస్తోంది. బెంగళూరులో ఉన్న ఈ రెస్టారెంట్ తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు వేడి వేడిగా వడ్డిస్తూనే ఉంటుంది. ఈ రెస్టారెంట్ల యజమాని పాతికేళ్లు కూడా నిండని దివ్య. తాత, తండ్రుల వ్యాపార సామ్రాజ్యాన్ని ఈ అమ్మాయి వారసత్వంగా అందుకున్నదేమో అనుకుంటాం. కానీ ఇది పూర్తిగా ఆమె ఆలోచనే. మెక్‌డీ... కేఎఫ్సీలేనా! ఫుడ్ చైన్‌ను మించిన వ్యాపారం మరొకటి ఉండదని నమ్మింది దివ్య. సీఏ చేసిన తర్వాత ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో ఎంబీఏలో చేరినప్పటి నుంచి ఫుడ్ చైన్ బిజినెస్‌లో నెగ్గుకురావడం గురించిన మెళకువలు నేర్చుకోవడంలో మునిగిపోయింది. పాశ్చాత్య దేశాల్లో పుట్టిన మెక్ డీ, కేఎఫ్సీలను మనం ఆదరిస్తున్నాం. అలాగే దక్షిణాది రుచులను దేశమంతటా విస్తరించడం ఎందుకు సాధ్యం కాదు... అనుకుంది. మార్కెటింగ్ వ్యూహాలను తెలుసుకుంది. కోర్సు పూర్తి అయిన వెంటనే తన ఆలోచనను ఇంట్లో వాళ్ల ముందు బయటపెట్టింది. భర్త రాఘవరావు ఆహార పరిశ్రమల రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతడు మాత్రమే ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఇక మిగిలిన వారంతా – ‘సీఏ, ఐఐఎమ్‌లో పీజీ చేసిన అర్హతలకు పెద్ద కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం దొరుకుతుంది, హాయిగా ఉద్యోగం చేసుకోక ఇంత చదువూ చదివి ఇడ్లీలు, దోశెలు, ఊతప్పాలా’ అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఆమె తన అభీష్టాన్ని నెరవేర్చుకుని తీరాలని నిర్ణయించుకుంది. ఇపుడామె కారం పొడి చల్లిన నెయ్యి దోశెలు, స్పాంజిలాగ మెత్తని ఇడ్లీలు, ఊతప్పం, గుంత పొంగనాలు, మూడు రకాల చట్నీలు, సాంబారు... ఈ ఘుమఘుమలు బెంగళూరు నుంచి మన హైదరాబాద్‌ను తాకి, దేశందాటి దుబాయ్‌కి కూడా చేరాయి. ఇకపై సింగపూర్‌కి విస్తరించాలనేది దివ్య లక్ష్యం. తన ఫుడ్ చైన్‌కి ‘ద రామేశ్వరం కేఫ్’ అని పెట్టడానికి కారణం తాను అత్యంత ఎక్కువగా గౌరవించే మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సొంతూరు రామేశ్వరం (తమిళనాడు రాష్ట్రం) కావడమే అంటోంది. పెద్ద కలలు కనమని చెప్పిన కలామ్‌కి తన విజయాన్ని అంకితం చేసింది దివ్య. ఇది చదవండి: ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్! -
చాయ్ బిజినెస్‌కు ఫుల్ డిమాండ్.. ఏమి'టీ'క్రేజ్ అనుకుంటున్నారా?
ఒకప్పుడు టీ తాగడమనేది చాలా చిన్న విషయం. ఏ చిన్న కొట్టు దగ్గరికో వెళ్లి.. అర్జెంటుగా టీ తాగి వెంటనే కప్పు అక్కడ పెట్టి వచ్చిన దారిన వెళ్లిపోయేవారు. అయితే, కాలం మారింది. పద్ధతులూ మారాయి. అన్నింటా ఎం‘జాయ్’ కోరుకుంటున్న జనం టీ సేవనమూ అదే రీతిలో ఉండాలని భావిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా టీ కొట్లూ మారిపోయాయి. ఆధునిక హంగులు సంతరించుకున్నాయి. సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలో ఒకప్పుడు టీ తాగాలంటే ఎక్కడ దొరుకుతుందా అని వెతకాల్సిన పరిస్థితి. కానీ, నేడు అలా కాదు. ప్రతి ఏరియాలోనూ టీ కేఫ్‌లు ఏర్పాటయ్యాయి. అదీ విశాల ప్రాంగణాల్లో. శివారు ప్రాంతాల్లో అయితే ఆధునిక హంగులతో పెద్దపెద్ద కేఫ్‌లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి. తీరిగ్గా కూర్చొని..అలా కబుర్లు చెప్పుకుంటూ టీ/కాఫీ తాగేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వీటి వద్ద రద్దీ ఎక్కువగా కని్పస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు సైతం ఖాళీ సమయం దొరికితే చాలు కేఫ్‌ల బాట పడుతున్నారు. కొన్ని కేఫ్‌ల వద్ద కార్లు, బైకుల రద్దీని చూస్తే ఏమి‘టీ’ మార్పు అని ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం వరల్డ్‌కప్ క్రికెట్ సీజన్ నడుస్తుండడంతో కేఫ్‌లు మరింత రద్దీగా మారాయి. ఒక్క అనంతపురం నగరంలోనే కాకుండా..ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురం, కదిరి తదితర పట్టణ ప్రాంతాలు, చివరకు మండల కేంద్రాల్లో సైతం టీ కేఫ్‌ల సంస్కృతి విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీస్టాళ్లు, కేఫ్‌లు కలిపి ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు అంచనా. అభిరుచికి అనుగుణంగా.. ఒకప్పుడు టీ, కాఫీ అంటే ఆయా పొడులతో చేసేవే ఉండేవి. కానీ, నేడు వాటిలోనూ వివిధ రకాలు లభిస్తున్నాయి. సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, ఇరానీ ఛాయ్, పెప్పర్మెంట్ టీ, మసాలా టీ, లెమన్ టీ, లావెండర్ టీ.. ఇలా పలు రకాలు విభిన్న రుచుల్లో లభ్యమవుతున్నాయి. టీ మాత్రమే కాకుండా వివిధ రకాల కాఫీలు, రాగిమాల్ట్ వంటివి కూడా అందుబాటులో ఉంటున్నాయి. జనాన్ని ఆకర్షించేందుకు ఆయా దుకాణదారులు కొత్తదారులు అన్వేíÙస్తున్నారు. ఫ్రీ వైఫై అంటూ యువతను ఆకర్షిస్తున్నారు. పెద్ద పెద్ద టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆకట్టుకునేలా కుర్చీలు ఉంచుతున్నారు. టీ/కాఫీ అందించే కప్పులూ విభిన్నంగా ఉంటున్నాయి. బ్రాండ్లూ వచ్చేశాయి! టీ కేఫ్‌లకు లభిస్తున్న ఆదరణ చూసి కొందరు వాటినీ ‘బ్రాండ్’లుగా మార్చేస్తున్నారు. ‘ప్రాంచైజీలు’ ఇస్తూ చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. వారు నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఔట్లెట్ డిజైన్ చేయించడంతో పాటు వివిధ రకాల టీలు, కాఫీలు తయారుచేయడానికి వీలుగా మెటీరియల్ సరఫరా చేస్తున్నారు. వాటి తయారీలో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ కేఫ్‌లు ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కన ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ‘ఉపాధి’ మార్గం చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా టీ కేఫ్‌లను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి వ్యయం, మంచి మాస్టర్లు దొరికితే నిర్వహణ సులువు కావడం, ఆదాయం కూడా తగినంతగా ఉండడంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ యువత ఎక్కువగా ఉంటున్నారు. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ ఆదాయం కోసం టీ కేఫ్‌లు నిర్వహించే వారూ ఉన్నారు. ‘చర్చా’వేదికలు కేఫ్‌లు కేవలం పిచ్చాపాటి కబుర్లతో టీ, కాఫీ సేవనానికే పరిమితం కాలేదు. ‘చర్చా’వేదికలుగానూ మారాయి. ఇక్కడ రాజకీయ చర్చలు వేడీవేడిగా సాగుతుంటాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నడుస్తుంటాయి. ఉద్యోగ సంబంధ కార్యకలాపాలూ జరుగుతుంటాయి. పెళ్లి సంబంధాలూ కుదిరిపోతుంటాయి. ఇలా ఒకటేమిటి అనేక వ్యవహారాలకు టీ కేఫ్‌లు అడ్డాగా మారాయి. టీ కేఫే జీవనాధారం ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ టీ కేఫ్‌లో వర్కరుగా పనిచేసేవాణ్ని. అదే కేఫ్‌నకు ఓనర్‌గా ఎదిగా. ఇది నా కుటుంబానికి జీవనాధారంగా మారింది. పలు రకాల టీ తయారు చేస్తున్నా. ఆశించిన స్థాయిలో వ్యాపారం అవుతోంది. ఉపాధికి ఢోకా లేదు. నాన్న కూడా నాకు సహాయంగా ఉంటున్నారు. – ధనుంజయ, టీ కేఫ్ నిర్వాహకుడు, రాయదుర్గం స్నేహం బలపడే వేదిక టీ కేఫ్‌లు స్నేహం బలపడే వేదికలనడంలో అతిశయోక్తి లేదు. కాలేజీకి బంక్ కొట్టినా.. లేదా తోటి స్నేహితులందరం కలుసుకునేందుకు అడ్డాగా టీ కేఫ్‌లే ఉంటున్నాయన్నది వాస్తవం. ఇక్కడే కొత్త స్నేహాలు కూడా చిగురిస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తీరిక సమయాల్లో కేఫ్‌లలో కాలక్షేపం చేస్తూ ప్రపంచం గురించి చర్చించుకుంటుంటారు. – కార్తీక్, డిగ్రీ విద్యారి్థ, తాడిపత్రి ఆదరణ పెరుగుతోంది ప్రతి విషయాన్ని చర్చించుకోవడంతో పాటు ప్రపంచంలోని విషయాలన్నింటిపై మాట్లాడుకునేందుకు గతంలో రచ్చబండలు వేదికగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరి నుంచి పదుల సంఖ్యలో కూడుకుని మాట్లాడేందుకు వేదికగా టీ కేఫ్‌లు మారాయి. ఫలితంగా వీటికి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాపారంపై చాలా మంది యువత సైతం ఆసక్తి చూపుతున్నారు. – రవి, టీ మాస్టర్, తాడిపత్రి మిత్రులతో మాట్లాడే అవకాశం టీ తాగడానికి బాగా అలవాటు పడ్డాం. గతంతో పోలి్చతే ఇప్పుడు నగరంలో చాలా టీ స్టాల్స్, కేఫ్‌లు వెలిశాయి. మిత్రులతో కలసి ఛాయ్ తాగి కాసేపు కబుర్లు చెప్పుకునేందుకు కేఫ్‌లు వేదికగా మారాయి. – సూర్యనారాయణ, రెవెన్యూ కాలనీ, అనంతపురం -
బంజారాహిల్స్‌లో కెఫేలో సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
ఓయ్.. గరమ్ చాయ్
నెల్లూరువాసులు ఆహార ప్రియులు.. కొత్త రుచులను స్వాగతించడంలో వీరికి సాటి లేరు. నిద్ర లేచింది మొదలు రాత్రి భోజనం పూర్తి చేసిన తరువాత కూడా టీ తాగందే నిద్రపోని వ్యక్తులు ఉన్నారు. స్నేహితులతో ముచ్చట్లు పెట్టాలన్నా.. తోటి ఉద్యోగులతో పిచ్చాపాటి మాట్లాడాలన్నా.. వ్యాపారులు తమ లావాదేవీలపై.. నాయకులు రాజకీయాలపై చర్చించాలన్నా చాయ్ కేఫ్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అలాగే మహా నగరాలకే పరిమితమైన ఇరానీ చాయ్ కేఫ్‌లు ఇప్పుడు నెల్లూరు వాసులను తమ రుచితో ఆకర్షిస్తున్నాయి. నెల్లూరు సిటీ: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా చాయ్ సెంటర్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ప్రతి ప్రాంతంలో కనీసం రెండు నుంచి మూడు కేఫ్‌లు ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల చాయ్ సెంటర్లు, కేఫ్‌లు ఉంటాయని అంచనా. మహా నగరాల్లో ఉండే వివిధ రకాల చాయ్ సెంటర్లు ప్రస్తుతం నెల్లూరులో వెలుస్తున్నాయి. ఆయా కంపెనీల ఫ్రాంచైజీలను నగరవాసులు కొంత మొత్తం చెల్లించి నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహా నగరాలకు మాత్రమే పరిమితమైన ఇరానీ చాయ్ ఇప్పుడు నెల్లూరు వాసులను తన రుచితో కట్టిపడేస్తోంది. అయితే కొందరు టీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటుంటారు. అలాంటి వారి కోసం లెమన్ టీ, బ్లూ టీ, గ్రీన్ టీ, బాదం టీ లాంటి వాటిని కూడా కేఫ్ నిర్వాహకులు అందిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు.. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గరమ్ చాయ్‌ని ఇష్టపడుతూ చాయ్ కేఫ్‌లను ఆదరిస్తున్నారు. క్వాలిటీలో తగ్గేదేలే.. నెల్లూరు వాసులు రుచికి, క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. రుచి బాగుంటే అమితంగా ఆదరిస్తారు. దీంతో ఆ వ్యాపారం సైతం అంతే స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అయితే రుచిలో, నాణ్యతలో ఎలాంటి తేడా జరిగినా నగరవాసులు అటువైపు కూడా చూడరు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది వ్యాపారులు ఎదుర్కొన్నారు కూడా. గ్రాండ్‌గా సెలబ్రిటీలతో ప్రారంభించినా, ఆఫర్లు ఇచ్చినా, పెద్దగా పట్టించుకోరు. కేవలం రుచికి, నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు సైతం షుగర్ లెస్ ఇరానీ చాయ్ సైతం పలు చాయ్ కేఫ్‌లలో అందుబాటులో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోటాపోటీగా.. గతంలో నెల్లూరు నగరంలోని ప్రధాన సెంటర్లలో మాత్రమే టీ కేఫ్‌లు ఉండేవి. జనాభా పెరుగుదలతోపాటు ప్రజలు టీ, కాఫీలకు బాగా అలవాటు పడడంతో చాయ్ సెంటర్లకు ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. కొందరు చాయ్ సెంటర్ల నిర్వాహకులు పోటాపోటీగా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండే చాయ్ రుచులను సైతం నెల్లూరు వాసులకు పరిచయం చేస్తున్నారు. నగరంలోని రామలింగాపురం, అన్నమయ్య సర్కిల్, మాగుంటలేఅవుట్, వీఆర్సీ సెంటర్, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, వేదాయపాళెం, మూలాపేట, సంతపేట, కేవీఆర్ పెట్రోల్ బంక్ తదితర ప్రాంతాల్లో కొత్త రుచులతో టీ కేఫ్‌లు, ఇరానీ చాయ్ సెంటర్లు నూతనంగా వెలిశాయి. అయితే వాటిలో కొన్ని కేఫ్‌లు మాత్రమే రుచితో, నాణ్యతతో చాయ్ అందిస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఒక్క టీ చాలు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా వెంటనే చాయ్ సెంటర్‌కు వెళ్లి ఒక్క చాయ్ తాగితే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు కనీసం నాలుగు టీలు తాగుతాను. ధమ్ టీ, ఇరానీ చాయ్ నాకు చాలా ఇష్టం. – భాను, రామలింగాపురం స్నేహితులతో కలిసి.. రోజూ చిల్డ్రన్స్ పార్క్‌లో వాకింగ్‌కు వస్తుంటాను. వాకింగ్ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి చాయ్ సెంటర్‌కు చేరుకుంటాం. రుచికరమైన చాయ్‌ని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటాం. స్నేహితులతో అలా కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. – రాము, చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రమంలో మైండ్‌ను ఫ్రెష్ చేసుకునేందుకు సహచర ఉద్యోగులతో కలిసి ఓ టీ తాగుదామని చాయ్ కేఫ్‌లకు వస్తున్నారు. అలాగే స్నేహితులు వివిధ రకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ సాయంత్రం అయిందంటే చాయ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. స్నేహితులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చాయ్‌ని సిప్ చేస్తూ తమ టెన్షన్లను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన టీని ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో చాయ్ సెంటర్ల నిర్వాహకులు కొత్త రుచులను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. -
లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్!
నితిన్ సలూజా.. టీ కేఫ్ చైన్ ‘చాయోస్’ వ్యవస్థాపకుడు. నితిన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థి. చదువు పూర్తయ్యాక అమెరికా చేరుకున్నాడు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. లక్షల్లో ప్యాకేజీ అందుకున్నాడు. అయినా నితిన్ సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా చేయాలని భావించి, ఇండియా వచ్చాడు. నితిన్ తన ఆలోచనలను అమలు చేసే పనిలో పడ్డాడు. అనతికాలంలోనే అతని కంపెనీ కోట్లకు పడగలెత్తింది. నితిన్ సలూజా ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గట్టి పట్టుదల, సంకల్పబలంతో.. నితిన్ తన స్టార్టప్ బిజినెస్‌లో మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. గట్టి పట్టుదల, సంకల్పబలంతో తన సంస్థను విజయ శిఖరాలకు తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా లాంటి కాఫీ షాపుల ఆధిపత్యం ఉన్న మనదేశంలో ‘కెయోస్’ తనకంటూ ఒక పేరు తెచ్చుకునేలా నితిన్ నిరంతర కృషి చేశాడు. ఇది భారతదేశంలోని ప్రముఖ టీ కేఫ్ కంపెనీగా అవతరించింది. నితిన్ సలుజా స్థాపించిన ‘కెయోస్’ అనతికాలంలోనే రూ. 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీగా నిలిచింది. ఉద్యోగం వదిలేసి ఇండియాకు.. నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యాక ఆయన ఒక అమెరికన్ కంపెనీకి కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అమెరికా కంపెనీలో నితిన్ జీతం లక్షల్లో ఉండేది. నితిన్, అతని భార్యకు అమెరికాలో టీ అమ్మే వారెవరూ కనిపించలేదు. దీంతో నితిన్ కేఫ్‌ను తెరవాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చాడు. సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో పని చేయడం మొదలుపెట్టాడు. గురుగ్రామ్‌లో మొదటి కేఫ్ భారతదేశంలో కాఫీ అందించే అనేక కేఫ్‌లు ఉన్నాయని, అయితే అవి టీ అందించడం లేదని అతను భావించాడు. భారతదేశంలో టీ తాగే ప్రత్యేక సంస్కృతి ఉంది. ప్రజలు అనేక రకాల టీలను ఆస్వాదిస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకున్న నితిన్ భారతదేశంలోని టీ తాగేవారి అవసరాలను తీర్చగల టీ కేఫ్‌ను ప్రారంభించాలని అనుకున్నాడు. 2012లో నితిన్, అతని స్నేహితుడు రాఘవ్ సంయుక్తంగా ‘చాయోస్’ని స్థాపించారు. వారు గురుగ్రామ్‌లో మొదటి కేఫ్‌ని ఏర్పాటు చేశారు. కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం ప్రారంభించారు. నితిన్ మొదట్లో తానే స్వయంగా ఆర్డర్లు తీసుకుని, టీ తయారుచేసి అందించేవాడు. 200కు మించిన ‘చాయోస్’ కేఫ్‌లు కోవిడ్ సమయంలో ‘చాయోస్’ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. 2020లో తిరిగి ట్రాక్‌లో పడింది. నితిన్ కష్టానికి సరైన ఫలితం దక్కింది. 2020లో కంపెనీ 100 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ముంబై, బెంగళూరు, చండీగఢ్, పూణేలలో నితిన్ చాయోస్ స్టోర్లు నెలకొల్పారు. నేడు భారతదేశం అంతటా 200కు మించిన చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. చాయోస్ మన దేశంలో ప్రీమియం టీని అందించే కేఫ్. ఇది భారతీయులు తాము కోరుకునే అన్ని రుచుల టీలను అందిస్తుంది. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? -
జూబ్లీహిల్స్ : అక్షర ఆనంద్ ఆధ్వర్యంలో వైట్ నైట్ థీమ్‌తో వేడుక (ఫొటోలు)
-
ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!
Rameshwaram Cafe Founder Success Story: ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధించాలంటే దాని వెనుక కంటికి కనిపించని యుద్ధమే చేసి ఉండాలి. అప్పుడే ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోగలరు.. నిలదొక్కుకోగలరు. ఇలాంటి కోవకు చెందిన వారిలో బెంగళూరుకు చెందిన 'దివ్య' ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, అప్పుడే అనుకున్నది చేయవచ్చని తల్లితండ్రులు చెప్పిన మాటలు తు.చ తప్పకుండా పాటిస్తూ సీఏ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను, లెక్కకు మించిన సవాళ్ళను ఎదుర్కొంది. ఖర్చుల కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సిన రోజులు, రోజుకి రెండు మూడు బస్సులు మారాల్సిన పరిస్థితులు అనుభవించింది. అనుకున్న విధంగానే సీఏ పూర్తి చేసింది. సీఏ పూర్తి చేసి.. తన కుటుంబంలో సీఏ పూర్తి చేసిన మొదటి వ్యక్తి 'దివ్య' కావడం గమనార్హం. అంతే కాకుండా ఈమె IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో సభ్యురాలిగా కొనసాగుతోంది. కాగా ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలనే కోరికతో ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని యోచించింది. రామేశ్వరం కెఫే.. చదువుకునే రోజుల్లో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆహార సంస్థలు మంచి లాభాలను తీసుకొస్తాయని గ్రహించి, దక్షిణ భారతదేశ రుచులను అందరికి అందేలా చేయడానికి కంకణం కట్టుకుంది. ఈ ఆలోచనను తన అమ్మతో చెప్పింది. ఇది విన్న దివ్య తల్లి మేము కస్టపడి సీఏ చదివిస్తే.. ఇడ్లీ, దోశలు అమ్ముతావా అని చీవాట్లు పెట్టింది. తన నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. కానీ పట్టు వదలకుండా తన భర్త రాఘవేంద్ర రావుకి పెళ్లికి ముందు నుంచే ఈ వ్యాపారం మీద కొంత అనుభవం ఉండటం వల్ల 2021లో 'రామేశ్వరం కెఫే' ప్రారంభించింది. ప్రారంభంలో రెండు బ్రాంచీలతో మొదలైన వీరి వ్యాపారం, క్రమంగా వృద్ధి చెందింది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) ప్రస్తుతం 'రామేశ్వరం కెఫే' ద్వారా ఇడ్లీ, దోశ, వడలు, పొందాలి, రోటీ వంటివి విక్రయిస్తూ బెంగళూరులో తనదైన రీతిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. బెంగళూరులోని ఇతర కెఫేలు మాదిరిగా కాకుండా వీరు ఫ్రిజ్ వంటివి కూడా వాడరు, అందువల్ల పదార్థాలు ఎప్పుడు చాలా రుచికరంగా ఉంటాయని వినియోగదారులు చెబుతుంటే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందంటున్నారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?) నెలకు రూ. 4.5 కోట్లు.. ప్రస్తుతం బెంగళూరులో నాలుగు కెఫేలు నడుపుతున్నారు, కాగా రానున్న రోజులో దేశం మొత్తం మీదనే కాకుండా విదేశాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు దివ్య చెబుతోంది. ఈమె అటు సీఏ కెరీర్ ఇటు వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. కొన్ని నివేదికల ప్రకారం నెలకు సుమారు రూ. 4.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ జరుగుతున్నట్లు సమాచారం. -
ఈ హోటల్లో ఫ్రీగా నచ్చినంత తినొచ్చు.. కానీ ఓ కండిషన్
ఈ హోటల్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వండి.. కడుపు నిండా తినండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు! అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. తిన్నంత తిని డబ్బులు వద్దు అంటున్నారు అని సంతోషపడిపోకండి! ఎందుకంటే డబ్బులకు బదులు ప్లాస్టిక్ ఇవ్వాలండోయ్. ప్లాస్టిక్‌పై నిషేధం విధించినప్పటికీ... ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడంలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు... గుజరాత్‌లోని జునాఘడ్‌కు కలెక్టర్‌గా పనిచేస్తోన్న రచిత్ రాజ్ ‘ప్రకృతి’ పేరిట సరికొత్త కాన్సెప్ట్‌తో ప్లాస్టిక్ కేఫ్‌ను గతేడాది జూన్ ముఫ్పైన ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ఓం శాంతి అనే సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌నకు చెందిన రేఖా బెన్ నడిపిస్తోంది. ఇది సోంపు, నిమ్మకాయ షర్బత్, ఇడ్లీ, పోహా, డోక్లా, మేథీ థోక్లా, గుజరాతీ థాళీలను అందిస్తోంది. వీటిలో ద్రవాహారం కావాలంటే అరకేజీ, ఆహార పదార్థాలు కావాలంటే కేజీ ప్లాస్టిక్ ఇస్తే సరిపోతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉన్న కస్టమర్లు ఈ కేఫ్‌కు ఎగబడి వస్తున్నారు. తరచు వచ్చే కస్టమర్లతో పాటు, పబ్లిక్ హాలిడేస్‌లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కేఫ్ లోనేగాక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో సైతం కేఫ్ ఆర్డర్లు అందిస్తోంది. ప్లాస్టిక్ మనీతో... ప్లాస్టిక్‌ను ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ... ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడం లేదు. దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రచిత్ రాజ్ టీమ్ ప్లాస్టిక్ మనీ కేఫ్‌ను ప్రారంభించింది. ప్లాస్టిక్ వాడకంపై ఆసక్తి తగ్గించి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడం, రసాయన ఎరువులు వాడకుండా పండించిన ఆహారాన్నే ప్రజలకు అందించడం , సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళలతో వీటిని నిర్వహించడమే లక్ష్యంతో ప్లాస్టిక్మనీతో ఈ కేఫ్‌ను నడిపిస్తున్నారు. ఆదాయం... ఆరోగ్యం.... డబ్బులకు బదులుగా తీసుకునే ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌కు పంపించి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. సహజసిద్ధ ఎరువులతో పండించిన ఆహారం అందించి ఆరోగ్యం కాపాడుతూ, రసాయనాలు లేని పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా ఈ కేఫ్‌లను నడిపించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేఫ్‌లో ఆహార పదార్థాలను మట్టి పాత్రల్లో వడ్డిస్తూ ఇటు ప్రజల ఆరోగ్యంతో పాటు, అటు పర్యావరణాన్నీ పరిరక్షిస్తున్నారు. ఇలాంటి కేఫ్‌లు మరిన్ని ఏర్పాటైతే ప్లాస్టిక్ భూతాన్ని సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు ఈ కేఫ్‌ను ప్రశంసిస్తున్నవారు. -
బిజినెస్‌లోనూ బన్నీనే టాప్.. కేఫ్ నుంచి థియేటర్ దాకా..
టాలీవుడ్ చిత్ర సీమలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'అల్లు అర్జున్' (Allu Arjun) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బఫెలో వైల్డ్ వింగ్స్, అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్ వంటి బిజినెస్‌లు చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు. బన్నీ వ్యాపారాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బఫెలో వైల్డ్ వింగ్స్ (Buffalo Wild Wings) అల్లు అర్జున్ ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ అయిన 'బఫెలో వైల్డ్ వింగ్స్' కోసం ఫ్రాంచైజీని కలిగి ఉన్నాడు. హైదరాబాద్ రోడ్ నెం. 36 జూబ్లీహిల్స్‌లో సందడిగా ఉండే ప్రాంతంలో ఇది ఎంతో మంది ఆహార ప్రియులకు మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ (Aha OTT Platform) తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతించే ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌కి అల్లు అర్జున్ కో-ఫౌండర్. ఆహా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉంది. ఇది మంచి కార్యకలాపాలకు, కంటెంట్ సృష్టికి కేంద్రంగా పనిచేస్తుంది. (ఇదీ చదవండి: పాకిస్థాన్ ప్రజల మనసు దోచిన పాపులర్ కార్లు ఇవే!) అల్లు స్టూడియోస్ (Allu Studios) అల్లు స్టూడియోస్ అనేది అల్లు అర్జున్‌కి చెందిన అత్యాధునిక చిత్ర నిర్మాణ సంస్థ. ఇది రోడ్ నెం.10, జూబ్లీహిల్స్ హైదరాబాద్‌లో ఉంది. ఇందులో పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, ఆడియో రికార్డింగ్ వంటి అనేక సేవలు, మౌలిక సదుపాయాలు లభిస్తాయి. దీనిని హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. (ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!) ఏఏఏ సినిమాస్ (AAA Cinemas) ఇటీవల అల్లు అర్జున్ హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఏఏఏ సినిమాస్ అనే ఆధునిక మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇందులో మొత్తం 5 స్క్రీన్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్‌తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దక్షిణాదిలో ఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక్క థియేటర్ ఇదే కావడం గమనార్హం. -
Alina Alam: అద్భుతదీపం
దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది... అలీన అద్భుతదీపం కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు.. ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ అనేది తన అనుభవంలోకి వచ్చింది. ‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది అలమ్. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి. ‘రోమన్ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన. 23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్. ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్ మాటల్లో... ‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’ నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది. అయితే పెద్దగా స్పందన లభించలేదు. ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది. ‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన. కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాం్యపస్లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన. ‘మిట్టీ’ సక్సెస్ఫుల్ కేఫ్గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది. ‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి. దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్. -
వివాదాస్పదంగా నీరా కేఫ్ వేదామృతం పేరు
-
ఇటలీ కేఫ్‌లో కాల్పులు.. ప్రధాని మెలోనీ స్నేహితురాలు మృతి
రోమ్: ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దేశ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. రోమ్‌లోని ఫిడెన్ జిల్లాలోని ఓ కేఫ్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం జరగాల్సిన తమ అపార్ట్మెంట్ కమిటీ రెసిడెంట్స్ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు. ఇంతలోనే తుపాకీతో అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నికొలెట్టా గొలిసానో(50) తన స్నేహితురాలేనంటూ ప్రధాని జార్జియా మెలోనీ గతంలో ఆమెతో దిగిన సెల్ఫీని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పారీ్టకి చెందిన మెలోనీ దేశ తొలిæ మహిళా ప్రధానిగా అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లో నీరా కేఫ్ రెడీ
సాక్షి, హైదరాబాద్: తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరా. నగరవాసులకు ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. మొదట వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించి ఆ తర్వాత డిసెంబర్ రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో నీరా కేఫ్ సేవలను వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇటీవల కేఫ్‌ను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నెక్లెస్ రోడ్డులో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. నీరాను సురక్షితంగా నిల్వ చేసేందుకు అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. పామ్ ప్రొడక్ట్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అసోసియేషన్ (పీఆర్డీఏ) ఆధ్వర్యంలో నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తాటిచెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలుకొని దానిని వినియోగదారులకు చేర్చడం వరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నట్లు’ పీఆర్డీఏ వ్యవస్థాపకుడు వి.సత్యగౌడ్ తెలిపారు. ‘వేదామృత్’ పేరుతో స్వచ్ఛమైన నీరా రుచులను నగరాసులకు పరిచయం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: Dalit Bandhu: అత్యంత పేదలకు జాబితాలో ముందు చోటు! తెలంగాణ రుచులు సైతం.. ఈ కేఫ్‌లో రెస్టారెంట్ సేవలు కూడా లభిస్తాయి. నీరాతో పాటు తెలంగాణ వంటకాలన్నీ లభిస్తాయి. ఒకేసారి సుమారు 3 వేల మందికి పైగా సందర్శించేందుకు అనుగుణంగా కేఫ్‌ను ఏర్పాటు చేశారు. ►పర్యాటక ప్రియులు, నగరవాసులు ఎక్కువగా సేదదీరే హుస్సేన్‌సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డులో నీరా, తెలంగాణ వంటకాలను ఆస్వాదించవచ్చు. తాటి, ఈత చెట్ల పానీయంలోని సహజత్వాన్ని ప్రతిబింబించేవిధంగా నీరా కేఫ్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ►భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్‌లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేయనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్, బుస్ట్ వంటివి కూడా కేఫ్‌లో విక్రయిస్తారు. పోషకాలు పుష్కలం నీరాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, బీ–6, బీ–12 వంటివి సమృద్ధిగా లభిస్తాయి. మొత్తం 20 అమైనో ఆసిడ్స్‌లో 18 అమైనో యాసిడ్స్ నీరా నుంచి లభిస్తాయి. ఈ పానీయం రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. అన్ని విధాలుగా ఇది ఆరోగ్య ప్రదాయిని. –వి. సత్య గౌడ్, పీఆర్డీఏ -
రష్యా కేఫ్‌లో అగ్నికీలలు
మాస్కో: రష్యాలోని కోస్ట్రోమా పట్టణంలో శనివారం ఓ కేఫ్‌లో ఇరు వర్గాల మధ్య గొడవలో ఫ్లేర్ గన్ను పేల్చడంతో చెలరేగిన మంటలకు 13 మంది బలయ్యారు. ఏకంగా 37,000 చదరపు అడుగుల మేర విస్తరించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. సమీప భవనాల వారిని ఖాళీ చేయించారు. అనుమానితున్ని అరెస్టు చేశారు. 2009లోనూ పెర్మ్ నగరంలో నైట్‌క్లబ్‌లో బాణసంచా పేల్చడంతో మంటలంటుకుని 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
వీడియో: ‘బీటెక్ చాయ్‌వాలి’.. ఆమె థింకింగ్ వేరె లెవల్ గురూ..
ఆలోచన ఉండాలే గానీ.. జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపించి తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. తాజాగా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఓ యువతి.. తన కలలను నిజం చేసుకుంది. సొంతంగా బీటెక్ చాయ్‌వాలి అనే పేరుతో ఓ టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా, తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, తన కలను సాకారం చేసుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. సొంతంగా ఓ టీ షాప్‌ను ప్రారంభించింది. సదరు షాప్‌నకు ‘బీటెక్ చాయ్వాలీ’ అని పేరుపెట్టింది. దీంతో, వ్యాపారం ప్రారంభించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో వర్తికా సింగ్ మాట్లాడుతూ.. సొంత వ్యాపారం చేయాలనుకోవడం నా డ్రీమ్. అందులో భాగంగానే ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ వద్ద ‘బీటెక్ చాయ్వాలీ’ని ప్రారంభించాను. ప్రతీరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు టీ షాప్‌ను నడుపుతున్నాను. ‘బీటెక్ చాయ్వాలీ’తో ఎంతో సంతృప్తి చెందాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) మరోవైపు.. గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో ‘బీటెక్ చాయ్వాలీ’ ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ షాప్‌లో స్పెషల్ టీ, మసాలా టీ తాగేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, బీటెక్ చాయ్వాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది. నేను మీ కోసం ప్రార్థిస్తాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు బ్రాండ్ అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. https://t.co/l4NsiNCmn1 ke baad ab https://t.co/uwi8X7YeHb chaiwali bhi aagyi 🙄 Ab apun bhi bnega Upsc chaiwala 😍 pic.twitter.com/hH2Xxu2vKy — 🚩ASHU THAKUR 🚩 (@ashu_thakurr) October 3, 2022 -
Sheroes Hangout: ఆత్మబలమే అసలైన అందం... ఆనందం
ఆ కేఫ్ వేడివేడి చాయ్‌లకు మాత్రమే ఫేమస్ కాదు. వేడి, వేడి చర్చలకు కూడా. ఎక్కడో ఏదో దిగులుగా ఉందా? అంతా శూన్యం అనిపిస్తుందా? అయితే అటు పదండి. దేశవ్యాప్తంగా ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చిన శ్రేయాస్ హ్యాంగవుట్ కేఫ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది... ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ కేవలం రుచుల కేఫ్ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం లేనివారికి అంతులేని ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వేదిక. అభాగ్యుల కన్నీటిని తుడిచే చల్లని హస్తం. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి ముందడుగు వేయించే ఆత్మీయ మిత్రురాలు. యాసిడ్ ఎటాక్ సర్వైవర్స్ ఈ కేఫ్‌ను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ బ్యూటీ చైన్ సెలూన్ ‘నెచురల్స్’తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఈ కోర్స్ చేయడానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, వారు సొంతంగా బ్యూటీపార్లర్ ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదు మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో ఒకరు ఫరాఖాన్. ఒకప్పుడు ఆమెకు మేకప్ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే భర్త యాసిడ్ దాడి చేసిన తరువాత అద్దంలోకి చూడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ‘అందరు మహిళలలాగే నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. శుభకార్యాలకు వెళ్లడానికి ముందు ఎంతో హడావిడి చేసేదాన్ని. నా భర్త చేసిన దుర్మార్గం వల్ల మేకప్ అనే మాట వినబడగానే కన్నీళ్లు ధారలు కట్టేవి. అద్దం చూడడానికి భయమేసేది. ఇలాంటి నా మానసిక ధోరణిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి నన్ను బలమైన మహిళగా నిలబెట్టింది శ్రేయాస్. పూర్వంలాగే ఇప్పుడు నేను మేకప్ విషయంలో శ్రద్ధ చూపుతున్నాను. ఏ తప్పు చేశానని భయపడాలి? ఎవరికి భయపడాలి!’ అంటుంది ఫరాఖాన్. 28 సంవత్సరాల కుంతి సోని డిమాండ్ ఉన్న నెయిల్ ఆర్ట్‌లో శిక్షణ తీసుకుంది. ఒక సినిమా కోసం బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. ‘యాసిడ్ బాధితులకు ఉపాధి దొరకడం ఒక ఎల్తైతే, అందమైన ఆనంద జీవితం మరో ఎత్తు. యాసిడ్ బాధితురాలైన నేను మేకప్ వేసుకుంటే నలుగురు చులకనగా మాట్లాడతారేమో...అనే భావనతో చాలామంది అలంకరణ అనే అందమైన సంతోషాన్ని తమ ప్రపంచం నుంచి దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి శ్రేయాస్ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సోని. ఘాజిపూర్కు చెందిన రూపాలి విశ్వకర్మ సినిమా రంగంలో మేకప్–ఆర్టిస్ట్ కావాలని బలంగా అనుకుంటుంది. కొన్ని ప్రాంతీయ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన రుపాలి ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోకముందే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆమె రంగుల కల నల్లగా మసక బారింది. ఒకప్పుడు కళ్లముందు సుందర భవిష్యత్ చిత్రపటం తప్ప మరేది కనిపించేది కాదు. దాడి తరువాత ఎటుచూసినా దుఃఖసముద్రమే! ‘బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఇంటివాళ్ల నుంచి కూడా నన్ను పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. ఒక మూలన కూర్చొని జీవితాన్ని వెళ్లదీయి అన్నట్లుగా ఉండేవి వారి మాటలు. అయితే శ్రేయాస్‌తో పరిచయం అయిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. మరుగున పడిన కలలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నేను మేకప్–ఆర్టిస్ట్‌గా రాణించడం మాత్రమే కాదు, ధైర్యం లోపించి దారి కనిపించని యువతులకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటుంది రుపాలి. శ్రేయాస్ సరికొత్త ముందడుగు ద్వారా ‘అలంకరణ, అందం అనేవి మనకు సంబంధించిన మాటలు కావు’ అనే దుఃఖపూరిత నిరాశానిస్పృహలకు కాలం చెల్లుతుంది. ‘ఆత్మబలమే అసలైన అందం, ఆనందం’ అనుకునే కొత్త కాలం ఒకటి వస్తుంది. -
పబ్‌గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
నయా ట్రెండ్.. తందూరీ ఛాయ్.. భలే టేస్టీ గురూ
టీ.. దీనికి అభిమానులు కోట్లలో ఉన్నారు. పనిఒత్తిడి నుంచి స్వాంతన కోసం టీ తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని పొందేందుకు చాలామందికి చాయ్ ఔషధం. బెల్లం టీ, అల్లం టీ, లెమన్ టీ, మిరియాల టీ ఇలా టెస్ట్ చేసి ఉంటారు. మార్కెట్లోకి కొత్త రకం చాయ్ వచ్చింది. అదే తందూరీ టీ.. నెల్లూరులో దీనికి అభిమానులు పెరుగుతున్నారు. నెల్లూరు(మినీబైపాస్): టీ.. ఇది తాగాకే రోజును ప్రారంభించే వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. స్నేహితులతో కేఫ్‌ల్లో కూర్చొని సరదాగా గడిపేందుకు.. పనిఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. తలనొప్పి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామందికి టీ కావాలి. టీ లవర్స్ కోసం మార్కెట్లోకి కొత్త రకం వచ్చింది. అదే తందూరీ టీ.. పెద్ద సిటీలకే పరిమితమైన ఈ చాయ్ రుచిని ఇప్పుడు నెల్లూరులో కూడా చూడొచ్చు. నగరంలోని కొందరు వ్యాపారులు టీ అభిమానుల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. దీని ఎక్కువేమి కాదు. ధర రూ.20 మాత్రమే.. ఏంటిదీ.. తందూరీ అనే పదం మాంస ప్రియులకు బాగా పరిచయం ఉంటుంది. హోటళ్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి తందూరీగా కస్టమర్లకు అందిస్తారు. ఈ చాయ్‌ని కూడా నిప్పులపైనే చేస్తారు కాబట్టి తందూరీ టీగా పేరొచ్చింది. ఎలా చేస్తారంటే.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమిలా ఏర్పాటు చేస్తారు. ఇందులో బొగ్గులు వేసి మండించి బట్టీల్లో ఇటుకల్లా కాలుస్తారు. పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి టీ తయారు చేసి దానిని జార్లో పోసి కొలిమి వద్దకు తీసుకొస్తారు. కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఇత్తడి పాత్రలో ఉంచుతారు. అందులో చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టి పాత్ర వేడికి పొగలు చిమ్ముతూ నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్‌కు తందూరీ రుచి.. వాసన వస్తుంది. రుచి.. అదుర్స్ ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే.. మరికొన్నింటిని రుచి కోసమే చేస్తున్నారు. ఈ రెండింటికీ డిమాండ్ అధికంగా ఉంది. టీ లవర్స్‌కు వినూత్న రుచిని అందించేందుకు కొందరు వ్యాపారులు తందూరీ టీ స్టాల్స్‌ను ప్రారంభిస్తున్నారు. -
జూన్ 2న నీరా కేఫ్ ప్రారంభం
కడ్తాల్: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద రూ.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్‌ను జూన్ 2న దీనిని ప్రారంభిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో నీరా పైలెట్ ప్రాజెక్టు కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో తయారు చేస్తున్న నీరా, దాని అనుబంధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గీత వృత్తిని పరిరక్షించేందుకు 4 కోట్ల ఈత, తాటి మొక్కలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో నీరా కేఫ్‌లను విస్తరిస్తామన్నారు. కల్లు గీత కార్మికులకు మరింత ఉపాధి కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ముద్విన్ సహా యాద్రాద్రి భువనగిరి జిల్లా నందనం, సర్వేలు, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో నీరా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రియల్ ఎస్టేట్ వెం చర్ల పేరుతో తాటి, ఈత వనాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నెక్లెస్‌రోడ్డులో రూ.25 కోట్లతో నీరా కేఫ్
ఖైరతాబాద్ (హైదరాబాద్): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడుతున్న కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. తెలంగాణ ఆవిర్భావ దినం కంటే ముందే నీరా కేఫ్‌ను ప్రారంభించడంతోపాటు పూర్వీకుల చరిత్రను ఉట్టిపడేలా తీర్చిదిద్దుతామన్నారు. బుధవారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర తయారుచేసి ప్రత్యేక ప్యాకింగ్‌తో అందజేస్తామని తెలిపారు. ఆయుర్వేదిక్ డాక్టర్ల పర్యవేక్షణతోపాటు సీసీఎంబీ, సీఎస్ఐఆర్, ఐఐసీటీ వంటి సంస్థల సహకారంతో శాస్త్రీయంగా పరీక్షించి వీటి లాభాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఔషధ గుణాలున్న నీరా, కల్లు ఉత్పత్తికోసం ఇప్పటికే 4.25కోట్ల చెట్లను పెంచామని, రాబోయే రోజుల్లో 5 కోట్ల చెట్లు పెంచి స్వచ్ఛమైన కల్లును సీసాల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కె.కిషోర్ గౌడ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
Viral: కేరళను తాకిన యుద్ధం సెగ.. మెనూ నుంచి రష్యా సలాడ్ అవుట్
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. కీలక పట్టణాలను కైవసం చేసుకునే దిశగా రష్యా దాడులు జరుపుతోంది. ఐదార్, చెర్నిహివ్ పట్టణాలపై రష్యా మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది సైనికులు, వందలాది మంది పౌరులు మృత్యువాతపడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ అనేక దేశాలు, కంపెనీలు ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాతో సహా యూరోప్ దేశాలు రష్యాలో తయారైన ఆహార పదార్థాలను, డ్రింక్స్‌ను బ్యాన్ చేశాయి. తాజాగా ఉక్రెయిన్- రష్యా యుద్ధం సెగ కేరళను తాకింది. కేరళలోని ఓ కేష్ తమ మెను నుంచి రష్యా సలాడ్‌ను తీసేసింది. ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలపై రష్యా చేస్తున్న దాడిని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెస్టారెంట్ యజమాని తెలిపారు. ఈ మేరకు ఫోర్ట్ కొచ్చిలోని కా కషీ ఆర్ట్ కేఫ్ అండ్ గ్యాలరీరెస్టారెంట్కు బయట ఒక బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. దానిపై "ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా, మేము మా మెనూ నుంచి 'రష్యన్ సలాడ్'ని తీసివేశాము" అని రాసి పెట్టారు. ఈ బోర్డును సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావచ్చు.. జెలెన్ స్కీ భావోద్వేగం.. Russian salad off the menu too. This appears to be from the Kashi art cafe in Kochi, Kerala. A really nice place that I've been to many times over the years. Sincere, perhaps, but totally ridiculous. (via @VJ290481) pic.twitter.com/6TgBy1xhOj — Edward Anderson (@edanderson101) March 3, 2022 కాగా దీనిపై స్పందించిన కేఫ్ యజమాని పింటో తాము తీసుకున్న నిర్ణయానికి ఇంత స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. రష్కన్లకు తాము విరుద్ధం కాదని కేవలం యుద్ధాన్ని ఆపాలంటూ చెప్పాలనుకునేందుకు ఇదొక సందేశం అన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రజలకు తమ మద్దతును చూపేందుకు ఇది ఒక మార్గంగా ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మెనూ నుంచి రష్యా సలాడ్‌ను తొలగించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది కేఫ్ తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే! -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
మసాల ఛాయ్, బిర్యానితో ఫేమస్..! ఇప్పుడు బ్రిటన్‌లో తొలి కేఫ్‌గా రికార్డు..!
ఘుమఘుమలాడే బిర్యాని సువాసనతో, మైమరిపించే మసాలా ఛాయ్ ఆరోమాతో బ్రిటన్ వాసులను కట్టి పడేస్తున్న ఛాయ్ అదా(Chai Ada) సంచలనం నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో క్రిప్టోకరెన్సీ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసే తొలి కేఫ్‌గా నిలుస్తోంది ఛాయ్ అదా..! క్రిప్టోకు అనుకూలంగా..! ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి భారీ ఆదరణ నెలకొంది. పలు కంపెనీలు కూడా క్రిప్టో కరెన్సీలను యాక్సెప్ట్ చేస్తామని ప్రకటించాయి. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ కూడా క్రిప్టోపై సానూకూలంగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీను ఉపయోగించి టెస్లా కార్లను కొనుగోలు చేయవచ్చునని కూడా వెల్లడించాడు. క్రిప్టోపై ఉన్న ఆదరణను మరిన్నీ కంపెనీలు క్యాష్ చేసుకునేందుకు సిద్దమయ్యాయి. బ్రిటన్‌లో చాయ్ అదాను స్థాపించిన 26 మెకానికల్ ఇంజనీర్ తయ్యబ్ షఫీక్ క్రిప్టోను ఉపయోగించి కేఫ్‌లో చెల్లింపులను జరపవచ్చునని వెల్లడించాడు. క్రిప్టో పేమెంట్స్ కోసం సపరేటుగా ఒక యాప్‌నే క్రియేట్ చేశాడు. ఈ యాప్ సహాయంతో రిపుల్, లిట్‌కాయిన్, డోజీ కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలతో ఛాయ్ అదాలో చెల్లింపులను జరపవచ్చునని తయ్యబ్ షఫీక్ పేర్కొన్నాడు. ఛాయ్ అదాలో మెటావర్స్‌తో అతిథ్యం..! క్రిప్టోతో సమానంగా ఎన్‌ఎఫ్‌టీపై కూడా ప్రజలు ఎక్కువ ఆదరణ చూపుతున్నారని చాయ్ అదా కేఫ్ ఆపరేషన్స్ మేనేజర్ రానా నొక్కిచెప్పారు. క్రిప్టో లావాదేవీలనే కాకుండా మెటావర్స్‌లో కేఫ్ అతిథ్యమిచ్చేలా ప్లాన్స్‌ను కూడా చేస్తున్నట్లు తెలిపారు. 26 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ తయ్యబ్ షఫీక్ బ్రిటన్‌లో చాయ్ అదా పేరుతో కేఫ్‌ను ప్రారంభించాడు. మసాల ఛాయ్, వడ పావ్, బిర్యాని, కాశ్మీరి పింక్ టీ వంటి ఐటమ్స్‌తో బ్రిటన్ వాసులకు మంచి అతిథ్యాన్ని ఇస్తోంది ఛాయ్ అదా. చదవండి: అమితాబ్ బచ్చన్ టీమ్ వచ్చేది అప్పుడే.. సిద్ధంగా ఉండండి -
ఇదో కొత్తరకం కేఫ్... ఇంత వరకు ఎవ్వరూ చూసుండరు!
రెస్టారెంట్లో కస్టమర్లను ఆకట్టుకునేలా రెస్టారెంట్స్‌ని రకరకాలుగా అలంకరిస్తారు. అంతేకాదు కస్టమర్లకు కావల్సిన అన్నిరకాల సదుపాయాలను అందించేందకు విశేషంగా ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒక రెస్టారెంట్ ఏకంగా ఎక్వేరియంలా చేసి కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. (చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!) అసలు విషయం ఏమిటంటే....ఒక రెస్టారెంట్ సరికొత్త ఆలోచనతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా రెస్టారెంట్‌ని మోకాలు లోతు వరకు నీటితో నింపి అందులో రకరకాల చేపలను ఉంచుతుంది. అందలోనే టేబుల్స్ వేసి కస్టమర్లను కూర్చోమంటూ ఆహ్వానిస్తుంది. అక్కడ అలా నీళ్లలోని రకరకాల రంగురంగుల చేపలను చూస్తూ అక్కడ వాళ్లు అందించే ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తినేలా తయారుచేసింది. పైగా ఆ రెస్టారెంట్ గోడపై "స్వీట్ ఫిష్ కేఫ్" అని బోర్డ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి చూడండి. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) -
Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..
‘చాయ్ చాయ్ కోసమే కాదు...సామాజిక విశ్లేషణకు కూడా’ అనడానికి సజీవ సాక్ష్యం ఈ పింక్ కేఫ్. హరియాణాలోని రోహ్తక్ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు, గృహిణులు ‘పింక్ కేఫ్’ ప్రారంభించారు. దీని వెనుక ‘పథ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ చొరవ ఉంది. స్థూలంగా చెప్పాలంటే...ఇది మహిళల కోసం మహిళల చేత ఏర్పడిన కేఫ్. ఈ కేఫ్‌లో వేడి వేడి చాయ్ తాగుతూ హాట్ టాపిక్ల గురించి చర్చించుకోవచ్చు. భావాలను పరస్పరం పంచుకోవచ్చు. తమ బాధలకు పరిష్కార మార్గం వెదుక్కోవచ్చు. ‘గతంలో ఏదైనా సమస్య వస్తే నాలో నేను కుమిలిపోయేదాన్ని. దీంతో బాధ మరింత పెరిగేది. పింక్‌కేఫ్ పరిచయమయ్యాక వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది పరిచయమయ్యారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పింక్కేఫ్కు వస్తేచాలు ఆ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికుతుంది’ అంటుంది నీలిమ అనే అమ్మాయి. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! ఒకే కేఫ్ ఒక్కోరోజు ఒక్కో వేదికలా మారుతుంది. ఒకరోజు మహిళా రచయిత్రులు, కవయిత్రులు, సంగీతకారులు తమలోని సృజనను ఆవిష్కరించుకునే వేదిక అవుతుంది. ఒక రోజు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపే కౌన్సెలింగ్ సెంటర్ అవుతుంది. ఒకరోజు...పేద మహిళలకు ఉపాధి మార్గాలను సూచించే వేదిక అవుతుంది. హక్కులు, ఆరోగ్యం, అనుభవాలు, పరిష్కారాలు... ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకు ఈ పింక్‌కేఫ్ ఒక చుక్కాని. ఔత్సాహిక కళాకారులకు భుజం తట్టే వేదిక. ఉదా: రంజనికి కవిత్వమంటే ఇష్టం. తాను రాసిన కవిత్వాన్ని పుస్తకంగా వేసుకోవాలనేది ఆమె కల. అయితే తనకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో కల కలగానే ఉండిపోయింది. ‘పింక్ కేఫ్’ పరిచయమ య్యాక... ఒకరోజు తన కవితలను అక్కడ వినిపించింది. అవి నచ్చిన ముగ్గురు కలిసి కవిత్వాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం చూసి రంజని ఎంతగానో మురిసిపోయింది. ‘ఈ కేఫ్ మొదలు పెట్టినప్పుడు కాలక్షేపం కబుర్లకు తప్ప ఎందుకు అన్నవాళ్లు... ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇది చాలు పింక్‌కేఫ్ విజయం గురించి చెప్పడానికి’ అంటుంది పింక్ కేఫ్ మొదలు కావడానికి కష్టపడిన మహిళల్లో ఒకరైన సునీత. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
ఈ కేఫ్‌లో వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!
థాయ్‌లాండ్: ఒక పక్క కరోనా మహమ్మారీ కారణంగా చాలా వ్యాపారాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయంటే మరోవైపు ప్రకృతి విపత్తుల కారణంగా మరింత దారుణంగా దెబ్బతింటున్నాయి. చాలా మంది ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక నిరాశ నిస్ప్రుహలతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కానీ కొంతమంది ఆ కష్టాలనే ఆసరాగా చేసుకుని పలు అవకాశాలను సృష్టించుకుని అందరిచేత 'ఔరా' అనిపించేలా గొప్పగా బ్రతికి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిన వారే థాయ్‌లాండ్‌కి చెందిన కేఫ్ యజమాని టిటిపోర్న్ జుటిమనాన్ (చదవండి: ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్, స్కర్ట్స్‌కి స్వస్తీ) వివరాల్లోకెళ్లితే.......ఈ ఏడాది ఆరంభంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ విజృభించి ప్రపంచదేశాలన్ని సెకండ్ లాక్‌డౌన్‌ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే టిటిపోర్న్ జుటిమనాన్ ఉత్తర బ్యాంకాక్‌కు సమీపంలోని నొంతబురిలో చావో ఫ్రయా యాంటిక్ కేఫ్‌ను నిర్వహిస్తున్నాడు. మొన్నమొనటి వరకు కరోనా కారణంగా లాక్ డౌన్‌తో కేఫ్ మూసేయడంతో నష్టాల్లో ఉందనకుంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా థాయ్‌లాండ్‌లోని నదులన్ని వరదలో పొంగి పొరలుతున్నాయి. మళ్లీ మరోసారి కేఫ్ మూసేయాల్సిందేనా అని ఆలోచనలో మునిగిపోయాడు. దీన్నే అవకాశంగా మార్చుకుని కస్టమర్లను ఎందుకు ఆకర్షించకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు. వరదలకు తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కేఫ్ రన్ చేస్తే.. ఒక పక్క కస్టమర్లు లైవ్‌లో వరద ఉద్దృతిని వీక్షించినట్టు ఉంటుంది, కేఫ్‌ను మళ్లీ యథావిధిగా రన్ చేయగలిగే అవకాశం ఉంటుందని టిటిపోర్న్ భావించాడు. అతనూ ఊహించిందే నిజమైంది. వరదనీటిని చూస్తూ థ్రిల్‌గా ఫీలవుతూ ... కేఫ్‌లో వాళ్లకి ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని చక్కగా ఆస్వాదిస్తూ తింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. అయితే విపత్తును మరో సంక్షోభంగా భావించకుండా దాన్నే కేఫ్ యజమాని 'టిటిపోర్న్' ఒక మంచి అవకాశంగా మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. (చదవండి: ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ...) -
జిరాక్స్ కోసం వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
కన్నౌజ్: పత్రాలను జిరాక్స్ తీయించుకోవడానికి సైబర్ కేఫ్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగింది. ఓ మహిళ సహా మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. అత్యాచారాన్ని నిందితులు వీడియో తీశారని, ఈ ఘటన బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్లు 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం రూ. 10 వేలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. దీంతో తాను, తన మిత్రురాలు కలసి తమ ఇళ్లలో దొంగతనం చేసి డబ్బు చెల్లించినట్లు చెప్పారు. డబ్బు పోయిన సంగతిని తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా, అత్యాచారం విషయం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కేఫ్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు కూడా తేలిందన్నారు. చుట్టుపక్కల వారు సైతం ఆ కేఫ్ వద్ద యువతులను పలు మార్లు చూసినట్లు చెప్పారని పేర్కొన్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..) -
కెఫే నిలోఫర్ ప్రాసెసింగ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిలోఫర్ చాయ్.. బహుశా ఈ పేరు తెలియని హైదరాబాదీయులు ఉండరేమో. భాగ్యనగర వాసులే కాదు విదేశీయులు సైతం ఇక్కడి గరమ్ గరమ్ చాయ్ రుచి చూసినవారే. నాలుగు దశాబ్దాల నిలోఫర్ ప్రస్థానంలో ఇప్పటికే కోటి మందికిపైగా వినియోగదార్ల మనసు చూరగొంది. రెండవ తరం రాకతో సంస్థ విస్తరణ బాట పట్టింది. బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల తయారీతో మొదలుకుని ప్రీమియం లాంజ్‌ల ఏర్పాటు, టీ పొడుల విక్రయంలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ సైతం నెలకొల్పుతున్నట్టు కెఫే నిలోఫర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న ఏబీఆర్ కెఫే అండ్ బేకర్స్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు వెల్లడించారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. అత్యాధునిక యంత్రాలతో.. తయారీ కేంద్రం కోసం శంషాబాద్ దగ్గరలో తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలను కేటాయించింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఈ అత్యాధునిక ప్లాంటుకు రూ.30 కోట్లు పెట్టుబడి చేస్తున్నాం. ఇక్కడ టీ పొడుల ప్రాసెసింగ్ యూనిట్ ఏడాదిలో, డ్రై కేక్స్, బిస్కట్స్ తయారీ కోసం బేకరీ ప్రాసెసింగ్ యూనిట్ æ2023లో అందుబాటులోకి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాదే నాల్గవ కేంద్రం.. హిమాయత్‌నగర్‌లో ప్రీమియం లాంజ్‌ను డిసెంబరులో ప్రారంభించనున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రానుంది. ఒకేసారి 250 మంది వినియోగదార్లకు సేవలు అందించే వీలుంది. ఈ సెంటర్‌కు 150 మందిని నియమిస్తాం. బంజారాహిల్స్‌లో ఉన్న ప్రీమియం లాంజ్ 2019లో ప్రారంభమైంది. లక్డీకాపూల్‌లో తొలి కెఫేకు సమీపంలోనే రెండవ కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేశాం. మా కెఫేలకు రోజుకు 20,000 మంది కస్టమర్లు వస్తుంటారు. రెండేళ్లలో తెలంగాణలో.. టీ పొడులను మూడు రకాల రుచుల్లో పరిచయం చేశాం. రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఇవి లభిస్తాయి. రూ.10 మొదలుకుని రూ.650ల ప్యాక్ వరకు తీసుకొచ్చాం. సంస్థ ఆదాయంలో ఆన్లైన్ వాటా 20 శాతం ఉంది. ఆన్లైన్లో బుక్ చేస్తే చాయ్ సైతం ప్రత్యేక బాక్స్ ద్వారా హైదరాబాద్‌లో డెలివరీ చేస్తున్నాం. 300ల రకాల బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. సంస్థలో 250 మంది ఉద్యోగులున్నారు. -
కొండపై కేఫ్.. వ్యాపారం కాదంటున్న ‘అందాల రాక్షసి’
Lavanya Tripathi: కొండ ప్రాంతం.. చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో ఇల్లు... అక్కడ బస చేస్తే దక్కే అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. ఆ అనుభూతిని ఆస్వాదించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు లావణ్యా త్రిపాఠీ. ఈ అందాల రాక్షసి ప్రకృతి ప్రేమికురాలు. పచ్చని చెట్లన్నా, పంట పొలాలన్నా ఆమెకు చాలా ఇష్టం. అందుకే ముస్సోరీకి దగ్గర్లో కొండ మీద ఉన్న చమసారి అనే గ్రామంలో ఒక వ్యవసాయ భూమిని కొన్నారు. అక్కడొక బస ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. అయితే రెగ్యులర్ ఇల్లులా కాకుండా ఒక కేఫ్‌ని తలపించేలా కట్టించాలనుకుంటున్నారు. ఈ కేఫ్ పూర్తిగా తన కుటుంబ సభ్యుల కోసమేనని, వ్యాపారం కాదని లావణ్య పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడే రీతిలో సహజమైన వస్తువులతో నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నామన్నారు. అక్కడ కొన్ని రోజులు ఉంటే రీఛార్జ్ అయిపోతాం అని కూడా అంటున్నారు లావణ్య. ఇప్పటికే అక్కడ దాదాపు 25 మొక్కలు నాటించారు. చదవండి: గ్లామర్ సీక్రెట్ చెప్పిన హన్సిక -
మాస్క్ ధరిస్తే రూ.350 కట్టాలంట !
కాలిఫోర్నియా: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేఫ్‌లో మాస్క్ ధరిస్తే ఫైన్ కట్టాలంట. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఓ కేఫ్ యజమాని ఈ వింత రూల్‌ని పెట్టాడు. అదేంటి ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో అల్లాడిపోతూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తుంటే ఇక్కడ మాత్రం ఇలాంటి రూల్ పెట్టారని అనుకుంటున్నారా? అసలు ఆ కేఫ్ యజమాని కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టాడో తెలుసుకుందాం. ఓ కేఫ్ యజమాని తన కస్టమర్లలో మాస్క్ ధరించిన వారి నుంచి బిల్లుపై 5 డాలర్లు (సుమారు 350 రూపాయలు) అదనంగా కట్టించుకుంటున్నాడు. దీనికి ఓ కారణం ఉందని ఆ యజమాని అంటున్నాడు. వారు ఈ మొత్తాన్ని గృహహింస బాధితులకు సహాయపడే స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో వీరు చేస్తున్న మంచి పనిని కస్టమర్లు సైతం స్వాగతిస్తున్నారు. అంతే గాక అదనుపు బిల్లు చెల్లించడంలోనూ వెనకాడటం లేదు. ‘మొదట్లో 5 డాలర్లను కొంతమంది కస్టమర్లు చెల్లించగా, మరికొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని’ కేఫ్ యజమాని క్రిస్ కాజిల్మాన్ ఎన్బిసి న్యూస్‌కు చెప్పారు. Hey #medtwitter, leave Fiddleheads Cafe in Mendocino, CA a review on Google and Yelp and tell them what you think. pic.twitter.com/8qkYTtILhM — Optimistic Radiologist (@responsibleMDs) May 29, 2021 చదవండి: బీప్: ప్రియుడికి పంపాల్సిన మెసెజ్ లెక్చరర్‌కు.. -
మనసు కుదుట పడింది కాఫీ తాగండి
ఆ కేఫ్‌కి కష్టమర్లు మంచి రేటింగే ఇచ్చారు. ఫేస్బుక్ 5కు 5 పాయింట్లు ఇచ్చింది. కోల్‌కతా ప్రజలకు తెలుసు తమకు ఆ కేఫ్‌ను ప్రోత్సహించాలని. అందుకే అక్కడకు వెళతారు. మాక్టైల్స్ తాగుతారు. పఫ్‌లు తింటారు. బేకరి ఐటమ్స్ పార్శిల్ కట్టించుకుంటారు. 7 నుంచి 9 మంది స్త్రీలు ఎప్పుడూ అక్కడ చిరునవ్వుతో పని చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉండి ప్రశాంతంగా ఉండే బేకరి కేఫ్ పేరు ‘క్రస్ట్ అండ్ కోర్’. దక్షిణ కోల్‌కతాలోని ‘చేట్ల’ ప్రాంతంలో ఉంటుంది. ఏమిటి దాని విశేషం? మానసిక సమస్యల నుంచి బయటపడిన ఏ ఆధారం లేని స్త్రీలు అక్కడ పని చేస్తారు. ఇలా వారి కోసమే నడిచే బేకరి దేశంలో ఇదే కావచ్చు. మానసిక హింస భౌతిక హింసలో గాయం అయితే మందు రాస్తే తగ్గిపోవచ్చు. కాని మానసిక హింస తాలూకు దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. అవి క్రమేపి మానసిక రుగ్మతలుగా మారతాయి. వాటికి వైద్యం చేయించుకోవాలని చాలామంది మహిళలకు తెలియదు. ఒకవేళ తెలిసినా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు కాని సైకియాట్రిస్ట్‌ల దగ్గరకు వెళ్లరు. చివరకు ఆ రుగ్మతలు ముదిరిపోతాయి. ఏమీ తెలియని స్థితిలో ఇళ్ల నుంచి బయటపడి సమాజం దృష్టిలో ‘పిచ్చివాళ్లు’ అన్న ముద్ర పడి తిరుగుతుంటారు. ఇలా తిరిగే స్త్రీల కోసం కోలకతాలో ‘ఈశ్వర సంకల్ప’ అనే ఎన్.జి.ఓ పని చేస్తోంది. వీళ్లు ‘సర్బరి షెల్టర్’ అనే ఒక హోమ్‌ను నడుపుతున్నారు. ఇందులో అచ్చంగా మానసిక సమస్యలతో రోడ్ల మీద తిరిగే స్త్రీలను తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తారు. వీరికి వైద్యం చేయించి బేకింగ్‌లో శిక్షణ ఇచ్చి ఈ బేకరిలో ఉపాధి కల్పిస్తున్నారు. 2018లో ఇలా మానసిక సమస్యల నుంచి బయటపడిన స్త్రీల కోసం ‘క్రస్ట్ అండ్ కోర్’ బేకరినీ తయారు చేశారు. గత మూడేళ్లుగా ఈ బేకరి విజయవంతంగా నడుస్తూ ఉంది. గృహహింసతో మానసిక సమస్యలు ‘సర్బరి షెల్టర్’లో ఆశ్రయం పొంది బేకరిలో పని చేస్తున్న మహిళలందరూ దారుణమైన గృహహింసకు పాల్పడిన వారే. భర్త, అత్తింటివారు పదేపదే భౌతికదాడికి పాల్పడటం, మానసికంగా భయభ్రాంతం చేయడం వల్ల అదీ ఒకరోజు రెండు రోజులు కాదు మూడునాలుగేళ్లు వరుసగా చేయడం వల్ల మతి చలించి ముఖ్యంగా ‘స్క్రిజోఫోబియా’ బారిన పడి ఇళ్లు వదిలినవాళ్లే అంతా. వీరు చాలారోజులు రైల్వేస్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చివరకు ఈ హోమ్‌కు పోలీసుల ద్వారా చేరుతారు. ‘వాళ్లకు ఒక్కొక్కరికి సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు వైద్యం చేయిస్తాం. అప్పుడు నార్మల్ అవుతారు. ఆ తర్వాత కూడా మందులు తప్పనిసరిగా కొనసాగిస్తూ పని చేసుకోవాల్సి ఉంటుంది’ అని హోమ్ నిర్వాహకులు చెప్పారు. కొత్త జీవితం ‘నేను బిస్కెట్లు బాగా చేస్తాను. కేక్‌లు అవీ చేయడం రాదు’ అని ఈ కేఫ్‌లో పని చేసే ఒక మహిళ చెప్పింది. ‘నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. నాదంటూ ఒక ఇల్లు ఉండాలి’ అందామె. మిగిలిన వారిలో ముంబై నుంచి తప్పిపోయి వచ్చినవారు, అస్సాం వైపు నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరి వయసులో 26 నుంచి 45 వరకూ ఉన్నాయి. ‘మీ కేఫ్‌లో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి’ అనే చిన్న మాటకు వాళ్లు చాలా బ్రైట్‌గా నవ్వుతారు. ఆ చిన్న ప్రశంస వారికి పెద్ద ఆరోగ్యహేతువుతో సమానం. ‘మానసిక సమస్యల నుంచి బయటపడిన వారు కొంత బెరుకుగా, ఎదుటివారి మీద ఆధారపడేలా ఉంటారు. వీరిని సమాజం కలుపుకుని మద్దతు ఇవ్వకపోతే తమలో తాము ముడుచుకుపోతారు. నలుగురిలో కలవడానికే భయపడిపోతారు. కేఫ్ పెట్టడం ద్వారా వీరు నలుగురినీ కలిసేలా చేసి వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాం’ అని కేఫ్‌లో సూపర్వైజర్గా పని చేసే మహిళ చెప్పారు. ఈ సూపర్వైజర్ మాత్రం ‘నార్మల్’ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ. ఈమె తనతో పని చేసే ఈ మహిళలను కనిపెట్టుకుని ఉంటుంది. ఈ కేఫ్‌కు వెళితే బయట ‘మేము ప్రతికూలతలను జయించాం. మేము చాంపియన్స్’ అని ఉంటుంది. నిజమే. వారు చాంపియన్స్ మనసు చీకటి గుయ్యారాల్లో జారి పడిపోయినా తిరిగి వెలుతురు వెతుక్కుంటూ దానిని దారికి తెచ్చుకున్నారు. సమస్యలు, సవాళ్లు తద్వారా మానసిక బలహీనత ఎవరికైనా సహజం. దానికి వైద్యం తీసుకోవాలి. స్నేహితుల సపోర్ట్ తీసుకోవాలి. అన్నింటిని దాటి కొత్త జీవితం మొదలెట్టాలి. క్రస్ట్ అండ్ కోర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. – సాక్షి ఫ్యామిలీ -
నగరంలో హలీమ్ సందడి...
-
దేశంలోనే తొలి ఇగ్లూ కేఫ్.. ఎక్కడంటే!
కరోనా వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చిన్న చితక సంస్థల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు అన్నీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయాయి. మహమ్మారితో కుదేలైన రంగాల్లో టూరిజం(పర్యాటకం) కూడా ఒకటి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో అన్ని రంగాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయి. 9 నెలల పాటు ఇళ్లకే పరిమితమైన జనాలు బయట ప్రపంచానికి అడుగుపెడుతున్నారు. ఆనందం, ఆహ్లాదం కోసం షికార్లు, టూర్ల బాట పడుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆఫర్లతో పాటు నూతన ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి.ఇ దే క్రమంలో కశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఓ హోటల్ వినూత్న ఆలోచన చేసింది. ఏకంగా దేశంలోని తొలి ఇగ్లూ హోటల్‌ను రూపొందించింది. గుర్మార్గ్లోని కొలాహోయ్ స్కీ రిసార్ట్‌లో ఈ మంచు కేఫ్‌ను నిర్మించారు. చదవండి: అరుదైన మంచు గుడ్లగూబ ఫొటోలు! ఇగ్లూ ఆకారంలో నిర్మించిన ఈ కేఫ్ పూర్తిగా మంచుతోనే నిర్మితమైంది. గోడల దగ్గరి నుంచి టేబుళ్లు, కుర్చీలు అన్నీ మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. చల్లటి ఇగ్లూ హోటల్లో పర్యాటకులు కూర్చొని వెచ్చని ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఇగ్లూ కేఫ్ మొత్తం 15 అడుగుల ఎత్తు.. 26 అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడి స్థానిక నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో డిజైన్లు తయారు చేశారు. నాలుగు టేబుల్స్‌తో దాదాపు 16 మంది ఒకేసారి కూర్చునేందుకు వీలుగా ఈ కేఫ్ ఉంది. అక్కడికి వెళ్లిన టూరిస్టులు కేఫ్ ముందు దీగిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ఆలోచన కావడంతో ప్రజలు అధికసంఖ్యలో ఇగ్లూ కేఫ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. చదవండి: పర్యాటకం పట్టాలెక్కేనా? -
మీది లవ్ బ్రేకపా? అయితే ఇక్కడకు వెళ్లండి
డెహ్రాడూన్: నలుగురూ బాగుండాలి, అందులో నేనుండాలి... అనుకున్నాడు డెహ్రాడూన్‌కు చెందిన ఓ వ్యక్తి. అందుకే పగిలిన హృదయాలను అతికించలేకపోయినా కనీసం వారి మనసుకు స్వాంతన చేకూర్చాలనుకున్నాడు. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదివేయండి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దివ్యాన్షు బాత్రాకు 21 ఏళ్లుంటాయి. అతడు ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. కానీ లాక్డౌన్లో అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిసి ఈ ప్రేమజంటను విడదీశారు. నెచ్చెలి దూరం కావడంతో కుంగిపోయాడు. హైస్కూల్ నుంచి ప్రేమిస్తున్న అమ్మాయిని హఠాత్తుగా మర్చిపోలేక నరకం అనుభవించాడు. ఆరు నెలలు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. పబ్జీకి బానిసగా మారాడు. ఈ మనోవేదనలోనే కొట్టుమిట్టాడుతున్న అతడికి హఠాత్తుగా ఓ రోజు ఇలా ఎంకెంతకాలం ఆమెను గుర్తు చేసుకుంటూ పిచ్చివాన్నైపోవాలి అన్న ఆలోచన వచ్చింది. అంతే, ఆమె జ్ఞాపకాలకు తాళం వేసి ఓ కెఫేను ప్రారంభించాడు. దానికి దిల్ తుట ఆషికి-చాయ్‌వాలా అన్న పేరును ఖరారు చేశాడు. ఇక్కడ లవ్‌లో ఫెయిలయిన వాళ్లు వారి బాధను మనసారా చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడిది బ్రేకప్ అయిన ఎంతోమందికి ఆశాదీపంగా కనిపిస్తోంది. (చదవండి: ఈ అగ్నిప్రమాదం గచ్చిబౌలిలో జరిగిందా?) ఈ కెఫే గురించి దివ్యాన్షు మాట్లాడుతూ.. "నాలానే చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. వాళ్ల మనసులోని బాధనంతా కక్కేస్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బ్రేకప్ అయినవాళ్లను నా కెఫెకు వచ్చి వాళ్ల కథలను చెప్పమంటాను. అలా వారి భారాన్ని ఇక్కడే దించేసుకుని జీవితంలో ముందుకెళ్లేందుకు సహాయం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కెఫే ఐడియా విని దివ్యాన్షు తండ్రి కోప్పడ్డాడట. దీని గురించి అతడు మాట్లాడుతూ... "ఒక అమ్మాయి కోసం నేను పిచ్చోడిలా అయిపోయాను. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి నా కాళ్ల మీద నేను నిలబడతాను అన్నప్పుడు అమ్మ నాకు సపోర్ట్ చేసింది. కానీ కెఫే పేరు చెప్పగానే నాన్న ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు నాన్న స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చి కెఫె గురించి, దాని ప్రాముఖ్యతను గూర్చి మెచ్చుకున్నాడు. అప్పుడు కానీ మా నాన్న నేనో మంచి పని చేస్తున్నానని అంగీకరించలేకపోయాడు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి కెఫెను నడిపిస్తున్న దివ్యాన్షు త్వరలోనే హరిద్వార్‌లో కూడా ఈ కెఫెను ప్రారంభించాలనుకుంటున్నాడు. (చదవండి: బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!) -
గాన గంధర్వుడికి అపూర్వనివాళి
పుదుచ్చేరి: 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సంగీతాభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసిన వార్త గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం. కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన సెప్టెంబర్ 25న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా పుదుచ్చేరిలోని ఒక బేకరి సంస్థ బాలుకి విభిన్నంగా నివాళులర్పిస్తోంది. చాక్లెట్‌తో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేసే సాంప్రదాయాన్ని పాటిస్తున సంస్థ తాజాగా ఎస్పీబీకి నివాళిగా ఏకంగా 339 కిలోలతో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న చాక్లెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఒక శకం ముగిసింది!) పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకోవడం ఏర్పాటు చేయడం జునిక బేకరీకి అలవాటు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రాహాన్ని కూడా పూర్తిగా చాక్లెట్‌తో మాత్రమే రూపొందించి ప్రదర్శనకు ఉంచింది. ఇది జనవరి 3వరకు ప్రదర్శనలో ఉంటుందని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసిన చెఫ్ రాజేంద్రన్ చెప్పారు. 339 కిలోల బరువున్నఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటలు పట్టిందని తెలిపారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో బేకరీ యజమాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కోయంబత్తూరులో సిరితుళి అనే స్వచ్ఛంద సంస్థ ఎస్పీబీ వనం పేరుతో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పనస, మామిడి, ఎర్ర చందనం, సాండర్స్, టేకు, రోజ్‌వుడ్, వెదురు, మహోగనితోపాటు ఇతర చెట్లను పెంచనున్నారు. కాగా ఇంతకుముందు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలం చాకొలెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 600 కిలోలసూపర్ స్టార్ రజనీకాంత్ చాకొలేట్ విగ్రహాన్ని తయారుచేసిన కబాలీ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. అలాగే కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ విగ్రహాలను కూడా రూపొందించింది. -
నెక్లెస్ రోడ్డులో 'నీరా కేఫ్' కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్‌రోడ్డులో కొత్తగా నిర్మించనున్న 'నీరాకేఫ్'కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా తెలంగాణ వంటలకు ప్రాధాన్యం కల్పించేలా నీరా కేఫ్‌ను తిర్చిదిద్దనున్నారు. తెలంగాణలో మొట్టమొదటగా ఏర్పాటుకానున్న నీరా కేఫ్‌ను దాదాపు 3 కోట్లతో నిర్మించనున్నట్లు అంచనా. ఈ కేఫ్‌లో 10 స్టాల్స్‌తో సహా 250 మంది కూర్చొనే సిట్టింగ్ కెపాసిటీ ఉంండనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. -
కేఫ్.. ఎలా సేఫ్!
సాక్షి, హైదరాబాద్: నలుగురు ఓ చోట చేరితే కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రబలే ప్రమాదం ఉన్నందున వీలైనంత మేరకు గుమికూడే పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వం వెల్లడించింది. అన్నీ బంద్ చేయించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు జనానికి ఆహ్వానం పలికే కేఫ్‌లు మాత్రం ఇప్పుడూ అదే పంథాను అనుసరిస్తూ బెదరగొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల ఇప్పటికీ అవి కిటకిటలాడుతూనే ఉన్నాయి. సమోసాలు తింటూ చాయ్ బిస్కెట్లు లాగించే వారితో కేఫ్‌లు నిండుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతనగరం పరిధిలో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. (హైదరాబాద్ : కరోనా భయంతో సిటీజనుల్లో అలజడి) ఓ వైపు కరోనా వైరస్ భయపెడుతుండటంతో వీలైనంత వరకు జనసమూహం లేకుండా చేయటం ద్వారా వైరస్ మన ప్రాంతంలో విస్తరించకుండా చూడాలన్న తాపత్రయం కనిపిస్తుండగా, కేఫ్‌ల నిర్వాహకులు మాత్రం దాన్ని పట్టించుకుంటున్నట్టు కనిపించటం లేదు. చాలావాటిని మూసేయించిన సర్కారు జనం సరుకులు కొనేందుకు వీలుగా మాల్స్, ఇతర దుకాణాలకు మాత్రం అనుమతించింది. ఇవి నిత్యావసరాలకు సంబంధించినవి కావటంతో వాటిని మూసివేయించటం సరికాదని ప్రభుత్వం భావించింది. కానీ ఏ రకంగానూ అత్యవసరం, నిత్యావసరం జాబితాలోకి రానప్పటికీ కేఫ్‌లు మాత్రం యథాప్రకారం తెరిచే ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 23 వేల వరకు కేఫ్‌లున్నాయి. ఇవన్నీ ఇప్పుడు కోవిడ్ భయం ఇసుమంతైనా లేకుండా దర్జాగా జనంతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గతంతో పోలిస్తే రద్దీ తగ్గినా, చాలా ప్రాంతాల్లో ఎప్పటిలాగేనే కేఫ్‌లు కిటకిటలాడుతున్నాయి. (కనికా కపూర్‌కు కరోనా) ఇవి ప్రమాదకరం కావా... 1. గ్లాసులు శుభ్రం చేస్తారా.. కొన్ని పెద్ద కేఫ్‌లలో ఎప్పుడు చూసినా వందమందికి తగ్గకుండా కనిపిస్తారు. చిన్నవాటిల్లో ఆ సంఖ్య పది నుంచి 20 మంది వరకు ఉంటుంది. కేఫ్ అనగానే ముందుగా కనిపించేది చాయ్. నిత్యం వందల కప్పుల చాయ్ ఖర్చవుతుంటుంది. చాయ్‌కి ముందుగా వేళ్లు నీటిలో మునిగేలా బాయ్ మంచినీటి గ్లాసులు తెచ్చిపెడతాడు. ఈ గ్లాసులను సరిగా శుభ్రం చేయరన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితిలో ఇది ప్రమాదంగా పరిణమిస్తుందన్న భయం వ్యక్తమవుతోంది. 2. ఆ వదిలేసిన బిస్కెట్లు, సమోసాలే కేఫ్‌లలో బిస్కెట్లు, సమోసాలు అనగానే ప్లేట్లో కొన్నింటిని తెచ్చి పెడతారు. అందులో మనం తినగా మిగిలిన వాటిని తిరిగి తీసుకెళ్లి ఇతరులకు అందిస్తారు. చిన్న నిర్లక్ష్యం ఉన్నా వైరస్ విస్తరించే తరుణంలో ఇది ప్రమాదకరమే కదా..! 3. ఒకరికొకరు తగిలేలా.. ఒక టేబుల్ చుట్టూ నలుగురైదుగురు కూ ర్చుంటారు. ఎక్కువగా వారంతా ఒకరినొకరు తగిలేలా కూర్చుంటారు. ఇది ప్రస్తుత పరిస్థితిలో ప్రమాదకరం. 4. ఒక సిగరెట్.. ముగ్గురు మిత్రులు.. ఒక సిగరెట్ వెలిగించి సరదాగా దాన్ని ఇద్దరు ముగ్గురు మిత్రులు కాల్చే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇందుకు ఎక్కువగా కేఫ్‌లే వేదికవుతాయి. చాయ్ తాగి ఓ సిగరెట్ వెలిగించి తలో రెండు పఫ్‌లు లాగించి వెళ్లిపోతుంటారు. ఈ ఎంగిలి కూడా ప్రమాదకరమే. కేఫ్‌లో పోగయ్యే అవకాశం లేకుంటే ఇది కూడా కొంతమేర తగ్గుతుంది. -
షాకింగ్ : టాయిలెట్లో కెమెరా అమర్చారు..
పుణే : పుణేలోని ఒక కేఫ్‌లో టాయిలెట్ లోపల దాచిన కెమెరాను ఒక మహిళ ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయడం వైరల్‌గా మారింది. అంతేగాక సదరు మహిళ తాను కెమెరాను ఎలా కనుగొన్నది ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్షాట్ల రూపంలో వివరించింది. ఈ ఘటనపై స్పందించిన పూణే పోలీసులు స్పందిస్తూ.. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం పంపించామని, కేఫ్‌పై తగిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల క్రితం పూణేలోని హింజావాడి ఏరియాలోని కేఫ్ బిహైవ్‌కు ఓ మహిళ కాఫీ తాగేందుకు వచ్చింది. రెస్ట్ రూమ్‌కు అని వెళ్లిన సదరు మహిళ టాయిలెట్లో కెమెరా ఉన్నట్లు గుర్తించి వాటిని ఫోటోలు తీసుకుంది. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురాగా ఆమెను 10 నిమిషాలు బయటికి పంపించి కెమెరాను రహస్యంగా తొలగించారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు తనకు లంచం కూడా ఇవ్వబోయారని సదరు మహిళ పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తున్న కేఫ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. Have deleted my previous tweet, as someone pointed out a mistake. Behive, Hinjewadi was filming women in the ladies toilet. This is the limit of perversion. They have to be brought to book. RT widely. @PuneCityPolice pic.twitter.com/sPW7lWLSYS — TheRichaChadha (@RichaChadha) 6 November 2019 -
సేమ్ జెండర్ అడ్డా
కొన్నాళ్ల కిందట. బెంగళూరులోని ఓ కేఫ్. చేతిలో చేయి వేసుకుని నిలబడ్డ సేమ్ జెండర్ జంటొకటి కేఫ్‌లో కాస్త మూలగా ఉన్న చోట టేబుల్ కోసం చూస్తోంది. టేబుల్ దొరికింది. వెళ్లి కూర్చోబోతుంటే ‘‘మీరిలా కూర్చోడానికి మిగిలిన కస్టమర్స్ ఇష్టపడరు’’ అంటూ వాళ్లను కూర్చోనివ్వలేదు ఆ కేఫ్ సిబ్బంది. అంతేకాదు, వాళ్ల పట్ల చాలా అభ్యంతరకరంగా కూడా ప్రవర్తించారు. అప్పుడు అక్కడే ఉన్న హెప్సీబా స్మిత్ అనే అమ్మాయి వాళ్లను గమనించింది. ఆ కేఫ్ సిబ్బంది తీరు ఆమెకు నచ్చలేదు. బాధేసింది కూడా. ఒకే జెండర్ వాళ్లిద్దరూ చేతిలో చేయి వేసుకుని వచ్చినంత మాత్రాన వాళ్లు స్వలింగ సంపర్కులన్నట్టేనా? ఒకవేళ అయితే రెస్టారెంట్ సిబ్బందికొచ్చిన ఇబ్బంది ఏంటీ? అనుకుంది. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వాళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ చోటు కల్పిస్తే బాగుంటుంది కదా అని కూడా ఆలోచించింది బైసెక్సువల్ అయిన హెప్సీబా. ఆ నిశ్చయంతోనే అప్పటిదాకా ‘తాజ్ వెస్టెండ్’ లో బార్టెండర్గా చేస్తున్న పనిని వదిలేసి సొంతూరైన హైదరాబాద్‌కు వచ్చేసింది. పీపుల్స్ చాయిస్ తన క్లాస్మేట్, స్నేహితుడూ అయిన మహ్మద్ ఆదాంతో కలిసి తొమ్మిది నెలల కిందట ఎల్జీబీటీక్యూ కోసం సైనిక్‌పురిలో ‘పీపుల్స్ చాయిస్’ పేరుతో కేఫ్‌ను స్థాపించింది. ఇది పెట్టడానికి రెండేళ్లు పట్టిందట! తన ఆలోచన గురించి మహ్మద్‌కు చెప్పినప్పుడు.. ‘‘ముందు ఖ్వీర్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి, వాళ్లతో స్నేహం చేసి వాళ్లలో కలిసిపోయి వాళ్ల అభిరుచులు, ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే దానికి తగ్గట్టే కేఫ్ ప్లాన్ చేసుకోవాలి’’ అని సలహా ఇచ్చాడట ఆదాం.. హెప్సీబాకు. అతను చెప్పినట్టే చేసింది. ‘ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్’లో కూడా పాలుపంచుకున్నారిద్దరూ. ఇంత పరిశీలన, అధ్యయనం తర్వాతే ‘పీపుల్స్ చాయిస్’ కేఫ్‌కు రూపమిచ్చారు. వీళ్లిద్దరూ మంచి పాకశాస్త్ర ప్రవీణులు కూడా. కేఫ్‌లో వంటపనీ చేస్తుంటారు. పీపుల్స్ చాయిస్లో లైవ్ పెర్ఫార్మెన్స్తో పాటు ఈవెంట్స్‌నూ నిర్వహిస్తుంటారు. దేశంలో ఎల్జీబీటీక్యూ కోసం నడుస్తున్న అతి కొద్ది కేఫ్‌లలో ‘పీపుల్స్ చాయిస్’ ఒకటిగా.. వాళ్లకోసం ఉన్న అద్భుతమైన స్పేస్‌గా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల వాళ్లతో..! అయితే ఈ ప్రయాణమంతా ఇక్కడ చెప్పుకున్నంత సాఫీగా సాగలేదు. కేఫ్ చుట్టుపక్కల వాళ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ‘‘ఒకసారైతే ఈవెంట్ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్లొచ్చి కేఫ్ ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మల్ని విరిచేశారు. సామాన్లను పడేసి.. చిందర వందర చేశారు. ‘‘పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం. అదృష్టం ఏమంటే పోలీసులు మా వైపు నిలబడ్డారు. వెంటనే వాళ్లను పంపించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఆ సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతూంటుంది’’ అంటుంది హెప్సీబా. చదువే పరిష్కారం కొంతమంది స్నేహితులతో కలిసి పేదరికంలో ఉన్న ఎల్జీబీటీ వాళ్లకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హెప్సీబా, మహ్మద్. ‘‘మారుమూలన ఉన్న వాళ్లు హైదరాబాద్‌కు రాలేరు. అందుకే మేమే తరచుగా అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి చదువు చెప్తున్నాం. ‘‘ఈ రెండేళ్లలో నేనూ చాలా నేర్చుకున్నాను. ఈ భూమ్మీద గౌరవం అందుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మనుషులందరూ సమానమే. ఆ సమానత్వాన్ని తెచ్చే, ఇచ్చే సాధనం చదువొక్కటే. దానికోసమే మా ఈ ప్రయత్నం’’అంటుంది హెప్సీబా. -
ప్రకృతి నిజంగానే పిలుస్తోంది..
జపాన్‌లోని అకాషీలో ఉన్న హిపోపో పాపా కేఫ్.. లోకల్‌గా ఇది చాలా ఫేమస్.. ఫుడ్ విషయంలో కాదు.. బాత్రూం విషయంలో.. ఈ హోటల్‌కు వచ్చినవారు ఒక్కసారైనా బాత్రూంకు వెళ్లివస్తారు. ఎందుకో తెలుసా? ఫొటో చూశారుగా.. ఇందుకే.. ఈ కేఫ్ యజమాని ఓ భారీ అక్వేరియం మధ్యలో బాత్రూంను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.1.8 కోట్లు ఖర్చుపెట్టాడు. దీంతో జనం ఈ కేఫ్‌కు బారులు తీరుతున్నారు. అయితే.. దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్.. చాలామంది జనం కేఫ్‌లో అర్డర్ ఇచ్చేదాని కన్నా.. ఎక్కువ సమయం బాత్రూంలో చేపలను చూస్తూ గడిపేస్తున్నారట. మరికొందరైతే.. ఉత్తుత్తినే.. ప్రకృతి పిలుస్తోందంటూ బాత్రూంలో దూరి గంటలు గంటలు గడిపేస్తున్నారట. ఇంకొందరైతే.. మరింత చిత్రంగా.. అవలాగ మమ్మల్నే చూస్తూ ఉంటే.. పనెలా అవుతుందమ్మా.. ఛీ సిగ్గేస్తోంది అంటూ వయ్యారాలు కూడా పోతున్నారట. -
ఎప్పటికీ మోడరన్ కేఫ్
పొట్ట చేత బట్టుకుని కర్ణాటకలోని ఉడిపి నుంచి విజయవాడ వచ్చారు. ఉడిపిలో ప్రసాదాలు తయారుచేసిన అనుభవంతో ఇక్కడ అల్పాహారం తయారు చేయడం ప్రారంభించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టారు. మరెందరో నిరుద్యోగులకు ఉచిత ఆవాసం కల్పించారు. తాను పస్తుండి, ఇతరుల ఆకలిని తీర్చారు. ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఆయనే విజయవాడ మోడరన్ కేఫ్ వ్యవస్థాపకులు హెచ్. టి. వాసుదేవరావు. త్వరలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ఈ కేఫ్‌లో శాకాహారం మాత్రమే దొరుకుతుంది. ఈ వంశంలో మూడవతరానికి చెందిన హెచ్. టి. ఉదయశంకర్ ఈ కేఫ్‌ను పూర్వీకుల సంప్రదాయంలో నడుపుతున్నారు. ఈ వారం ఫుడ్ ప్రింట్స్ కోసం సాక్షి ఆయనతో ముచ్చటించింది... మా తాతగారు హెచ్ టి వాసుదేవరావు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో ప్రసాదాలు, వంటలు తయారు చేసేవారు. అలా ఆయనకు వంట చేయడంలో నైపుణ్యం వచ్చిందే కాని, వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. దాంతో అక్కడ పనికి స్వస్తి పలికి, మా తాతగారు, ఆయన బావగారితో కలిసి 1927లో మచిలీపట్టణం చేరుకున్నారు. అక్కడ మూడు సంవత్సరాల పాటు చిన్న క్యాంటీన్ నడిపారు. కాని పెద్దగా జరుగుబాటు లేకపోవడంతో, విజయవాడ జంక్షన్ కాబట్టి అక్కడైతే వ్యాపారం బాగా నడుస్తుందన్న ఆలోచనతో 1930లో విజయవాడ చేరి, రైల్వే స్టేషన్ దగ్గర గాంధీనగర్‌లో ‘కోమల విలాస్’ అని చిన్న హోటల్ ప్రారంభించారు. హోటల్ నిర్వహణలో బాగా ఇబ్బందులు పడ్డారు. ఆరు సంవత్సరాలపాటు వ్యాపారం సాధారణంగా జరిగింది. ఒంటి చేత్తో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఎన్నో రోజులు గడిపారు తాతగారు. మధ్యలో అప్పులపాలయ్యారు. మళ్లీ వెనక్కి వెళ్లిపోయి దేవాలయంలోనే వంటలు చేసుకుందామనుకున్నారు. ఆ సమయంలో కొన్నాళ్లు ఆయన వండుతూ, ఆయనే వడ్డిస్తూ, ఆయనే గిన్నెలు శుభ్రం చేసుకుంటూ, బిల్లులు వసూలు చేసుకుంటూ... ఒంటి చేతి మీదే నడిపారు. 1936లో పెళ్లి చేసుకున్నారు. నానమ్మ కూడా తాతయ్యకు పనిలో సహాయపడేది. పేరు మార్చాక వ్యాపారం పుంజుకుంది తాతగారికి ఏమనిపించిందో, ఎందుకనిపించిందో ఏమోగాని 1936లో మోడరన్ కేఫ్ అని పేరు మార్చారు. అప్పటి నుంచి ఆయన దశ మారింది. వ్యాపారం పుంజుకోసాగింది. వచ్చిన లాభాలతో 1940లో విజయవాడలోని వన్ టౌన్ సామారంగం చౌక్‌లోను, బీసెంట్ రోడ్డులోను రెండు కేఫ్‌లు ప్రారంభించారు. కొంతకాలానికి మా తాతగారి బావగారు విడిగా వ్యాపారం ప్రారంభించారు. మా తాతగారు విజయవంతంగా వ్యాపారం కొనసాగించారు. బీసెంట్ రోడ్డులోని కేఫ్‌లో మాత్రమే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఉన్నాయి. మిగిలిన రెండు శాఖలలోను కేవలం రెస్టారెంట్లు మాత్రమే. అవి రెండు అద్దెకు తీసుకున్నవే. 1954లో బీసెంటు రోడ్డులోది సొంతంగా కొనుగోలు చేశారు. తాతగారి తరవాత ముగ్గురు కొడుకులకి మూడు హోటల్స్ ఆస్తి పంపకంలో వచ్చాయి. మా నాన్నగారు హెచ్‌టి మురళీధరరావుకి బీసెంటు రోడ్డులో ఉన్న మోడరన్ కేఫ్ వచ్చింది. ఆ తరవాతి తరంలో నేను చూస్తున్నాను. చెక్కుచెదర లేదు... 1988లో విజయవాడలో జరిగిన అల్లర్ల సమయంలో బీసెంటురోడ్డులోని మోడరన్ కేఫ్‌కి అటు పక్క ఇటు పక్క ఉన్న అన్ని దుకాణాలు తగులబడిపోయాయి. కాని మోడరన్ కేఫ్ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఇదంతా తాతగారు చేసిన అన్నదానం ఫలితమే అనుకుంటాం. కొద్దిపాటి మొత్తంతో ప్రారంభమైన ఈ కేఫ్ ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగింది. ఎప్పటికీ ఇది మోడరన్గానే ఉంటుంది. ఇవి మా ప్రత్యేకం... నాన్నగారి కాలం నుంచి ఇడ్లీ సాంబారు, మసాలా దోసె మా కేఫ్ ప్రత్యేకం. ఇటీవలే ఉత్తరాది వంటకాలు కూడా తయారుచేస్తున్నాం. బీసెంట్ రోడ్లో ఉండే మా కేఫ్‌లో నాన్నగారు పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించేవారు. ఆ సంప్రదాయాన్ని నేను కొనసాగించాను. ఆ రోడ్డులోని రామాలయంలో జరిగే సీతాకల్యాణం సమయంలో మూడు రోజుల పాటు ఉచిత అన్నదానం నాన్నగారి కాలం నుంచి జరుగుతోంది. – హెచ్. టి. మురళీధరరావు, చైర్మన్, మోడరన్ కేఫ్, విజయవాడ సంప్రదాయం కొనసాగిస్తున్నాను కృష్ణ, రామానాయుడు, శోభన్‌బాబు వంటి వారు ఇక్కడకు వచ్చేవారు. విజయవాడ నగరం సినిమా, రాజకీయాల హబ్. మా అమ్మవాళ్ల నాన్నగారు విఠలాచారిగారు. అందువల్ల మా కేఫ్‌కి సినీ నటుడు కాంతారావు కూడా వస్తుండేవారు. చాలా సంవత్సరాలుగా మా కేఫ్‌కి వస్తున్నవారు 20 –30 మంది ఇప్పటికీ ఉన్నారు. విజయవాడ వచ్చినప్పుడు మా లాడ్జిలోనే దిగేవారు ఇప్పటికీ ఉన్నారు. 1995 నుంచి నేను చూసుకుంటున్నాను. మా ఇడ్లీ సాంబారు ఇష్టపడేవారు కూడా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడకు వస్తూనే ఉన్నారు. ఏళ్లతరబడి మా హోటల్‌తో అనుబంధం పెంచుకున్న కొందరు వృద్ధులు అప్పుడప్పుడు, ‘వ్యాపారం ఎలా జరుగుతోంది’ అని అడిగి వెళ్తుంటారు. రామాలయంలో నవరాత్రులు తొమ్మిది రోజులూ పులిహోర + స్వీట్ ఇస్తూ ఉంటాం. రెండురోజులు ఉచిత భోజనం పెడతాం. మూడో తరంలో నేను కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. – హెచ్. టి. ఉదయశంకర్, మోడరన్ కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్, విజయవాడ – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ -
ఎంత ధైర్యం.. ఈ పిల్లకి!
అమ్మాయంటే ఇదే చదవాలి.. ఈ ఉద్యోగమే చేయాలి.. ఇలాగే ఉండాలి అన్న మూస ధోరణులు, సంప్రదాయాలు బద్ధలు కొట్టి సమాజంలో తనదైన ప్రత్యేకతను చాటింది మేహ్‌విష్ మెహ్రాజ్ జర్గర్. హోటళ్లు, కేఫ్‌ల వంటి బాధ్యతల నిర్వహణ పురుషులకే చేతనవుతుందన్న భావనను పక్కకునెట్టి జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో కేఫ్‌ను ప్రారంభించిన తొలి కశ్మీరీ యువతిగా మేహ్‌విష్ ఘనతను సాధించింది. మేహ్విష్కు ఏడేళ్ల వయసులోనే ఆమె తండ్రి కేన్సర్‌తో చనిపోగా, నలుగురు సభ్యుల కుటుంబ భారమంతా ఆమె తల్లిపై పడింది. ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఆ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయినా ఆ మాతృమూర్తి తన ముగ్గురు పిల్లలను బాగా చదివించింది. అమ్మ కష్టం, జీవితంలో తనకు ఎదురైన ఘటనలు మేహ్విష్ను మరింత రాటుదేలేలా చేశాయి. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని డీకొనేందుకు సంసిద్ధంగా ఉండాలనేపాఠాలను అవి ఆమెకు నేర్పాయి. తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా తల్లి అందించిన స్ఫూర్తితో ధృఢచిత్తంతో ముందుకే సాగింది మేహ్‌విష్. అమ్మాయేంటి! కేఫ్ ఏంటి?! జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సంక్షుభిత పరిస్థితులు, కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్యనే న్యాయశాస్త్రంలో పట్టాను సాధించింది మేహ్‌విష్. ఆ తర్వాత తన ఆసక్తిని మార్చుకుని వ్యాపార రంగం వైపు అడుగులు వేసింది. అమ్మాయిలు ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదు అనే విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్థిరపడిపోయిన ఏదైనా పద్ధతి, విధానాన్ని ఎవరైనా మహిళ మార్చివేస్తే విమర్శలు రావడం సహజమేనని, వారి మాటలు తన కార్యాచరణపై ఎలాంటి ప్రభావం చూపవని నిరూపించింది. మహిళలకు సరిపడిన పనులే చేయాలంటూ ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ మాధ్యమాల్లో ఆమెపై ‘ట్రోల్స్’తో దాడి మొదలైనా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ‘‘ఓ మహిళ సొంతంగా ఏదైనా చేస్తే సహించలేని కొందరు విమర్శిస్తుంటారు. అలాంటి వాటిని నేను ఏమాత్రం పట్టించుకోను’’ అంటూ ఆమె తన ఆత్మస్థైర్యాన్ని చాటుతోంది. ‘నేను ఎంచుకున్న రంగంలోనే భిన్నంగా ఏమైనా చేయాలని అనుకున్నాను. నా కుటుంబసభ్యులే ఈ విషయంలో మొదట్లో సంశయించినా ఆ తర్వాత పూర్తి మద్దతునిచ్చారు’’ అంటోంది. కేఫ్ అంటే కేఫ్ కాదు మహిళలు అనగానే బ్యూటీ పార్లరో, బోటికో, వ్యానిటీ షోరూంల నిర్వహణకు పరిమితమనే జనసాధారణ అభిప్రాయాన్ని కాదని కేఫ్‌ను మొదలుపెట్టింది మేహ్‌విష్. శ్రీనగర్‌లోని మునావరాబాద్ ప్రాంతంలో ఇద్దరు మిత్రులతో కలిసి ‘నేను మరియు మీరు’ ( M్ఛ N ్ఖ) అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించింది. దీనిని తన అభిరుచులకు తగినట్టుగా తీర్చిదిద్దింది. కశ్మీర్‌తో సంస్కృతిని ప్రతిబింబించే చీనార్ చెట్లు, ఇతర చిహ్నాలతో ఇంటీరియర్స్ ఉండేలా శ్రద్ధ వహించి దానిని ట్రెండీ కేఫ్‌గా రూపొందించింది. యువత కోరుకున్న భిన్నరుచుల ఆహారాలు ఇక్కడ దొరుకుతుండడంతో ఆమె ప్రయత్నం హిట్టయింది. అయితే అల్లర్లతో ఎప్పుడూ అట్టుడుకుతుండే కశ్మీర్లో ఇలా ఒకమ్మాయి కేఫ్ నడపటం ఎంతవరకు క్షేమం అని మేహ్‌విష్ గురించి తెలిసినవాళ్లు తెలియనివాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. రెండో బ్రాంచీకీ రెడీ! కేఫ్‌కు యువతీయువకులతో పాటు వివిధ వర్గాల నుంచి ఆదరణ పెరగడంతో శ్రీనగర్‌లోనే రెండో బ్రాంచీ ఓపెన్ చేసేందుకు ఇరవై అయిదేళ్ల మేహ్‌విష్ సిద్ధమైపోయింది! ‘స్వప్నాలు సాకారం చేసుకునేందుకు అంకితభావంతో శ్రమిస్తే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే సొంతంగా మనుగడ సాధించేందుకు ఇక్కడి అమ్మాయిలకు శక్తిసామర్థ్యాలున్నాయి. వ్యాపారాల నిర్వహణ అనేది కేవలం అబ్బాయిలకే పరిమితం కాదు, అమ్మాయిలు కూడా సమర్థంగా నిర్వహించగలరు’’ అంటూ మేహ్‌విష్ తన ఈడు వారిలో చైతన్యం రగిలిస్తున్నారు. ఆమె తీసుకుంటున్న చొరవ, కొత్తదనం కోసం ఉవ్విళ్లూరుతున్న తీరు కశ్మీర్లో మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. వ్యాపారరంగంలో అవకాశాలు పరిమితంగానే ఉన్నా అక్కడి చదువుకున్న అమ్మాయిలు అడ్డంకులను ఛేదించి ప్రస్తుతం ఆర్ట్ సెలూన్లు, బోటిక్‌లు, టెక్ స్టార్టప్‌లు మొదలుపెట్టడం మరో విశేషం. – కె. రాహుల్ -
‘అటువంటి విమర్శలు పట్టించుకోను’
ఎంత పెద్ద కష్టం దాటితే అంత పెద్ద హీరోలవుతారు.. కానీ ఆ హీరో అమ్మాయి అయితే మాత్రం.. ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి కొందరికి అహం అడ్డొస్తుంది. సరిగ్గా మెవిష్ అనే పాతికేళ్ల యువతి విషయంలోనూ అదే జరిగింది. మెవిష్... ఉగ్రదాడులు, భద్రతా బలగాల పహారాల మధ్య నిత్యం బంధీగా ఉండే కల్లోలిత కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో సొంతంగా కేఫ్ నడుపుతున్న ఓ మామూలు అమ్మాయి. కానీ ఆమె చూపిన చొరవ నేడు ఎంతో మంది యువతుల్లో స్ఫూర్తిని నింపింది. తమ కాళ్ల మీద తాము నిలబడగలమనే నమ్మకాన్ని ఇచ్చింది. క్యాన్సర్ బారిన పడి తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని తలకెత్తుకుంది మేవిష్. ఏం చేయాలో పాలుపోని సమయంలో కేఫ్ పెట్టాలన్న ఆలోచన తట్టింది ఆమెకు. అనుకున్నదే తడువుగా ఆలోచనను తల్లితో పంచుకుంది. మొదట కాస్త భయపడిన ఆమె తల్లి.. కూతురి ధైర్యాన్ని చూసి సరేనంది. కానీ ఇరుగుపొరుగు వారికి ఈ విషయం అంతగా నచ్చలేదు. ‘ఆడపిల్ల వీధిన పడి వ్యాపారం చేయడమా.. ఇంకా పెళ్లి కూడా కాలేదు... ఇదంతా అవసరమా’ అంటూ మేవిష్ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలు మేవిష్పై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. తల్లి, తోబుట్టువుల సాయంతో శ్రీనగర్‌లో కేఫ్ ఏర్పాటు చేసి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతోంది. విమర్శలు పట్టించుకోను.. ‘నేను లా గ్రాడ్యుయేట్‌ని. నాన్న మరణించడంతో ఒక్కసారిగా వీధిన పడ్డాం. ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన సమస్యలు తీరిపోవని తెలుసు. అందుకే కేఫ్ పెట్టి కుటుంబాన్ని పోషించాలనుకున్నాను. నా ఆలోచనను పంచుకోగానే ప్రోత్సహించిన వారి కంటే నిరుత్సాహ పరిచిన వారే ఎక్కువ. ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడతానంటే విమర్శలు రావడం సహజం. నా విషయంలో కూడా అదే జరిగింది. కానీ అటువంటి విమర్శలను పట్టించుకుని ఉంటే నా కుటుంబం మరోసారి వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే ధైర్యం చేసి ముందడుగు వేశానంటూ’ తన గురించి చెప్పుకొచ్చింది ఈ శ్రీనగర్ అమ్మాయి.