
ఆలోచన ఉండాలే గానీ.. జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపించి తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. తాజాగా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఓ యువతి.. తన కలలను నిజం చేసుకుంది. సొంతంగా బీటెక్ చాయ్‌వాలి అనే పేరుతో ఓ టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా, తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, తన కలను సాకారం చేసుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. సొంతంగా ఓ టీ షాప్‌ను ప్రారంభించింది. సదరు షాప్‌నకు ‘బీటెక్ చాయ్‌వాలీ’ అని పేరుపెట్టింది. దీంతో, వ్యాపారం ప్రారంభించినట్టు పేర్కొంది.
ఈ క్రమంలో వర్తికా సింగ్ మాట్లాడుతూ.. సొంత వ్యాపారం చేయాలనుకోవడం నా డ్రీమ్. అందులో భాగంగానే ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ వద్ద ‘బీటెక్ చాయ్‌వాలీ’ని ప్రారంభించాను. ప్రతీరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు టీ షాప్‌ను నడుపుతున్నాను. ‘బీటెక్ చాయ్‌వాలీ’తో ఎంతో సంతృప్తి చెందాను అంటూ చెప్పుకొచ్చింది.
మరోవైపు.. గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో ‘బీటెక్ చాయ్‌వాలీ’ ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ షాప్‌లో స్పెషల్ టీ, మసాలా టీ తాగేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, బీటెక్ చాయ్‌వాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది. నేను మీ కోసం ప్రార్థిస్తాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు బ్రాండ్ అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
https://t.co/l4NsiNCmn1 ke baad ab https://t.co/uwi8X7YeHb chaiwali bhi aagyi 🙄
— 🚩ASHU THAKUR 🚩 (@ashu_thakurr) October 3, 2022
Ab apun bhi bnega Upsc chaiwala 😍 pic.twitter.com/hH2Xxu2vKy