Faridabad
-
అండర్‌పాస్ వరదలో కారు చిక్కుకొని.. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ మృతి
గురుగ్రామ్: దేశ రాజధాని ఢిల్లీతో సహా ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం కురిసిన వర్షాల కారణంగా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి, అనేక వీధులు, దారులు జలమయమయ్యాయి. అయితే హర్యానాలో భారీ వర్షానికి ఫరీదాబాద్‌లోని అండర్‌పాస్‌లో వరద నీటిలో కారు చిక్కుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బాధితులను గురుగ్రామ్‌లోని పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులుగా గుర్తించారు.గురుగ్రామ్ సెక్టార్ 31లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న పుణ్యశ్రేయ శర్మ, క్యాషియర్ విరాజ్ ద్వివేది శుక్రవారం సాయంత్రం మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో ఫరీదాబాద్‌కు ఇంటికి బయల్దేరారు. అయితే ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్ వద్దకు చేరుకోగా.. వరద నీటితో నిండి పోయి ఉంది. అయితే నీటి ఎత్తు ఎక్కువ లేదని భావించిన ఇద్దరు.. కారును నీటిలో ముందుకు పోనిచ్చారు. దీంతో కారు పూర్తిగా మునిగిపోవడంతో ఇద్దరు వ్యక్తులు వాహనం దిగి ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.కానీ దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయారు. కారు ఇరుక్కుపోయిందని సమాచారం అందుకున్న పోలీసులు అండర్‌పాస్‌కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కారు వద్ద శర్మ మృతదేహాం బయటకు తీయగా.. అనేక గంటల గాలింపు తర్వాత శనివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ద్విదేది మృతదేహాన్ని వెలికితీశారు.మరోవైపు ఢిల్లీ, దేశ రాజధాని పరిసర ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. -
ఇదేం వింత ప్రకటన..రక్తపింజరను పట్టుకురావడమా..?
ప్రభుత్వాలు నేరస్తులను పట్టుకునేందుకు రివార్డులు ప్రకటించడం చూశాం. అంతగా లేకపోతే కాస్త ధనవంతులు తమ వాళ్ల కోసం, లేదా పోయిన వస్తువులు తీసుకొస్తే వేలల్లో డబ్బిస్తామని ప్రకటించడం విని ఉంటారు. ఇలాంటి ప్రమాదకరమైన వింత ప్రకటన గురించి మాత్రం విని ఉండరు. ఇలాంటి వింత ప్రకటన ఇచ్చిన తొలి ప్రభుత్వం ఆ దేశమే కాబోలు. ఏం జరిగిందంటే..బంగ్లాదేశ్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ షాహ్ మద్ ఇష్తియాక్ ఆరిఫ్ ఓ వింత ప్రకటన చేశాడు. ఆయన ఎవరైనా.. రక్తపింజరి పాముని చంపితే వారికి రూ. 35 వేలకుపైగా పారితోషకం ఇస్తామని ప్రకటించాడు. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది కూడా. ఆ తర్వాత రోజునే మాట మార్చి రక్తిపంజరిని పట్టుకొచ్చిన వారికే ఆ రివార్డు అని ప్రకటించాడు ఆరిఫ్. అయితే అలియాబాద్ యూనియన్‌లో రెజాల్ అనే రైతు ఈ విషయం తెలుసుకుని బహుమతి ఎలాగైన పొందాలని అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా రక్తపింజరని రెజాల్ తన స్నేహితుల సాయంతో ప్రాణాలు పణంగా పెట్టి మరీ పట్టుకున్నాడు. దాన్ని ఓ పెద్ద వంటపాత్రలో ప్యాక్ చేసి నేరుగా ఫరిదీపూర్ ప్రెస్క్లబ్కి తీసుకువచ్చాడు. అయితే ఆ ప్రభుత్వం రెజాల్కు మొండి చేయి చూపి ఇంతవరకు ఎలాంటి పారితోషకం అందజేయలేదు. ఇక ఎదురు చూసి.. చూసి.. రెజాల్ రెండు రోజుల క్రితమే ఆ పాముని చంపినట్లు తెలిపాడు. ఇలా రెజాల్ మాదిరిగా చాలామంది ఆ ప్రకటనను చూసి రక్తపింజర్లను పట్టుకుని నగరానికి వస్తుండటం గమనార్హం. వారందరికీ కూడా ఎలాంటి రివార్డు దక్కలేదు. అయితే సదరు పార్టీ నేత మాటమార్చి.. పాములు పర్యావరణంలో భాగమే. కాకపోతే ఫరీద్పూర్ ప్రజలు వీటివల్ల భయపడుతున్నారని ఇలా ప్రకటించామే తప్ప ప్రతిఫలం ఇస్తామనలేదంటూ బుకాయించాడు. పైగా ప్రకటించిన రివార్డు గురించి ఊసెత్తిన పాపాన పోలేదు. అబ్బా..! నాయకులు ఎంతలా మాట మార్చగలరు అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇలా ప్రకటించడం చట్ట విరుద్ధమని ఫరీద్పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గోలమ్ ఖుద్దూస్ భుయాన్ అన్నారు. నిజానికి ఈ పారితోషకం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు వారంతా..ఒకవేళ ఆ క్రమంలో చనిపోవడం లేదా గాయపడటం జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రకటనలు కారణంగా చాల పాములు చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. వాటిని పట్టుకున్న వారంతా మనుషులు సంచరించిన ప్రదేశంలో విడిచిపెట్టాలని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు కూడా. (చదవండి: పసుపు ఆరోగ్యంపై ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుందా?) -
Video: తప్ప తాగి కారుతో ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవర్
హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసును కొంతమంది బలవంతంగా కారులోకి ఎక్కించుకొని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌ఘర్‌లో నడిరోడ్డుపై జరిగింది.బల్లాబ్‌ఘర్ బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డు మధ్యలో కారును ఆపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ట్రాఫిక్ సబ్- ఇన్స్పెక్టర్ డ్రైవర్ వద్దకు వెళ్లి బండి పత్రాలు అడిగి, చలాన్ రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై డ్రైవర్‌కు పోలీస్‌కు మధ్య వాగ్వాదం మొదలైంది.పేపర్లను పరిశీలించేందుకు సబ్ఇన్స్పెక్టర్ డ్రైవర్ డోర్ ద్వారా కారు లోపలికి వంగగా.. డ్రైవర్ ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ను నొక్కి కారును ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ పోలీస్‌తోపాటు కారు అలాగే ముందుకు కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అక్కడున్న వారు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది వెంటనే వాహనాన్ని చుట్టుముట్టి అధికారిని రక్షించారు.నిందితుడుని కొంతదూరం వెంబడించి పట్టుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.VIDEO | #Haryana: A cab driver tried to flee when traffic police asked for the documents of the vehicle he was driving in Ballabgarh. He was nabbed by traffic cops after a short chase. The incident reportedly took place yesterday. (Source: Third Party) pic.twitter.com/eJILVSsqMJ— Press Trust of India (@PTI_News) June 22, 2024 -
జనరల్ టిక్కెట్‌తో ఏసీ కోచ్‌లోకి మహిళ.. ప్రతాపం చూపిన టీటీఈ!
నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్ష విధించాలి.. కానీ శిక్ష పేరుతో ఒక్కోసారి అధికారులు చెలరేగిపోతుంటారు. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ జనరల్ టిక్కెట్‌తో రైలులోని ఏసీ కోచ్ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన టీటీఈ ఆమెపై తన ప్రతాపం చూపాడు. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఫరీదాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. జనరల్ టిక్కెట్‌తో ఒక మహిళ జీలం ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలోకి ఎక్కేసింది. దీనిని గమనించిన అదే రైలులోని టీటీఈ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలులో నుంచి తోసివేశాడు. దీంతో ఆమె రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకుపోయింది. ఆ మహిళ ఆర్తనాదాలు విన్న పోలీసులు అతి కష్టం మీద ఆమెను కాపాడగలిగారు. బాధితురాలికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఝాన్సీలో ఒక వివాహానికి హాజరు కావాల్సి ఉందని, అయితే తను స్టేషన్‌కు చేరుకునే సమయానికి, రైలు నెమ్మదిగా కదులుతున్నదని, దీంతో కనిపించిన బోగీలో వెంటనే ఎక్కేశానని తెలిపింది. ఈ విషయాన్ని టీటీఈకి చెప్పినా పట్టించుకోలేదని, తగిన జరిమానా చెల్లిస్తానని తాను చెప్పినా వినకుండా రైలు నుంచి తోసివేశారని ఆమె ఆరోపించింది. కాగా ఈ ఉదంతపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స!
వైద్య విధానంలో అత్యంత క్లిష్టమైన రెండు చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్స ఇద్దరూ వ్యక్తులకు ఏకకాలంలో తొలిసారిగా విజయవంతమయ్యింది. ఇక్కడ అన్నింట్లకంటే షాకింగ్ ట్వీస్ట్ ఏంటంటే ఈ శస్త్ర చికిత్స ఓ కిడ్నీ మార్పిడి పేషెంట్‌కి కూడా జరగడం. ఇలా కిడ్నీ మార్పిడి చేయించుక్నున వ్యక్తికి సంక్లిష్టమైన ఈ చేయి మార్పిడి శస్తచికిత్స జరగడం దేశలోనే తొలిసారి కూడా. ఈ షాకింగ్ ఘటనలు ఎక్కడ జరిగాయంటే.. ఇద్దరు మగ రోగులకు హర్యానాలో ఫరిదాబాద్‌లోని అమృత హాస్పిటల్లో విజయవంతంగా ఈ చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ముందుగా ఉత్తర భారతదేశానికి చెందిన 65 ఏళ గౌతమ్ తాయల్కు ఈ సంక్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అయితే అనుకోకుండా గత రెండేళ్ల క్రితం ఓ పారిశ్రామిక ప్రమాదంలో మణికట్టుపై వరకు ఎడమ చేతిని కోల్పోయారు. అయితే అతనికి బ్రెయిన్ డెడ్ అయిన థానేకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేయిని మార్పిడి చేశారు. ఒక కిడ్నీ మార్పిడి రోగికి ఇలాంటి శస్త్ర చికిత్స జరగడం దేశంలో మొట్టమొదటిది. వైద్యశాస్త్రంలో ఇదొక అరుదైన ఘట్టం కూడా. ఇలా ట్రాన్సప్లాంట్ చేయడానికి రెండు ఎముకలు, రెండు ధమనులు, సుమారు 25 స్నాయువులు, 5 నరాలను కలపాల్సి ఉంటుందని వైద్యుడు మోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. ఈ చికిత్స అనంతరం రోగి మంచిగానే కోలుకుంటున్నట్లు తెలిపారు. అతని కొత్త చేతిలో కూడా కదలికలు మొదలయ్యాయని చెప్పారు. జస్ట్ ఒక్క వారంలోనే డిశ్చార్జ్ అవుతాడని అన్నారు. ఇక మరో హ్యాండ్ ట్యాన్స్ప్లాంటేషన్ ఢిల్లీకి చెందిన దేవాన్ష్ గుప్త అనే 19 ఏళ్ల వ్యక్తికి జరిగింది. మూడేళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులు మోకాలి పైభాగం వరకు పోయాయి. కుడి చేయి మోచేయి పైభాగం వరకు పోగా, ఎడమ చేయి మోచేయి కొంచెం కింద స్థాయి వరకు పోయింది. అయితే ఈ వ్యక్తికి ఫరీదాబాద్‌లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయిన సూరత్ అనే 33 ఏళ్ల వ్యక్తి చేతులను మార్పిడి చేశారు. ఇక ఈ విచ్ఛేదనం స్థాయిని బట్టి ఈ ఆపరేషన్ అంత క్రిటికల్‌గా ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ సర్జరీ తర్వాత దేవాన్ష్ పరిస్థితి కూడా మెరుగుపడిందని, పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే మోచేయి పైవరకు పోయిన కోల్పోయిన చేతి శస్త్ర చికిత్సలో కాస్త సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే గుప్తా పురోగతి కూడా బాగుందని, అవసరమనుకుంటే తదుపరి చేతి మార్పిడికి సంబంధించిన కొన్ని చికిత్సలు రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సదరు పేషంట్లు గౌతమ్ తాయల్, దేవాన్ష్ గుప్తా ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ మార్పిడి తమకు రెండో అవకాశం అని, పైగా జీవితంలో కొత్త ఆశలు అందించిందని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలతో వైద్య విధానం మరింత అభివృద్ధిని సాధించింది. అంతేగాదు ఈ శస్త్ర చికిత్స భవిష్యత్తులో ఇలా అవయవాల కోల్పోయిన వారిలో కొత్త ఆశను అందించేలా ధైర్యంగా జీవించేలా చేయగలుగుతుంది. (చదవండి: మా పాపకు పీరియడ్స్ ఇంకా రాలేదు! కానీ ఆమెకు అలా అవుతోంది..) -
Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా...
దైనందిన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని కదిలించి ఆలోచింపచేస్తాయి. మరికొన్ని సందర్భాలు భవిష్యత్‌నే మార్చేస్తాయి. అలాంటి ఓ సంఘటన ప్రణవ్ శుక్లా జీవితాన్ని మార్చేసి సామాజికవేత్తగా తీర్చిదిద్దింది. వందలమంది వృద్ధులను చేరదీసి వారి ఆలన పాలన చూసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు ప్రణవ్. హరియాణలోని ఫరిదాబాద్‌కు చెందిన వ్యక్తి ప్రణవ్ నారాయణ్ శుక్లా. ప్రణవ్ శుక్లా ప్రొఫెసర్ కొడుకు కావడంతో ఇంటర్మీడియట్ తరువాత మెడిసిన్ చదవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మెడిసిన్‌లో చేరాడు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడడంతో నెలరోజుల తరువాత మెడిసిన్ మానేసాడు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. అయినా తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌ను కష్టపడి చదివి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కాలేజీ రోజుల్లో... ప్రణవ్ శుక్లా ఫ్యాషన్ డిజైనింగ్ చదివేటప్పుడు రోజూ కాలేజీకి ట్రైన్లో వెళ్తుండేవాడు. ఒకసారి ట్రైన్ ఎక్కేందుకు ఓక్లా స్టేషన్‌కు చేరుకున్నాడు. అది చలికాలం కావడంతో ప్లాట్‌ఫాం మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫాం పైన ఒక మూలన ఒక వృద్ధుడు చలికి వణికిపోతూ అల్లాడిపోతున్నాడు. అదిచూసి చలించిపోయిన ప్రణవ్ తను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న జాకెట్‌ను ఆ వృద్ధుడికి ఇచ్చాడు. అప్పుడు అతడి కళ్లలో చూసిన ఆనందం ప్రణవ్‌కు చాలా సంతృప్తినిచ్చింది. తను జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత వృద్ధుల బాగోగులను చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆనందాల, ఆత్మీయతల ఆశ్రమం.. ప్రణవ్ ఉద్యోగంలో చేరాక కొంతమొత్తాన్ని దాచుకుని వృద్ధులకు ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. çకొంతమొత్తం జమయ్యాక.. నిరాశ్రయులైన వృద్ధులకు బియ్యం, పప్పులు, దుస్తులు వంటి నిత్యావసరాలు సమకూర్చేవాడు. అయితే వారి అవసరాలు తీర్చడానికి మరిన్ని సదుపాయాలు అవసరం అని భావించి... 1996లో ‘అనడి సేవా ప్రకల్ప్’ పేరిట ఓల్డేజ్ హోమ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రణవ్‌కు పంతొమ్మిదేళ్లు. వసతి సదుపాయాలు లేక అనాథలుగా మారిన ఒంటరి వృద్ధులను చేరదీసి వసతి, కడుపునిండా ఆహారం పెట్టడం, అవసరమైన ఆరోగ్య అవసరాలు తీర్చుతూ వృద్ధుల జీవననాణ్యతను మెరుగుపరిచాడు. ఒకపక్క ప్రణవ్ ఉద్యోగం చేస్తూనే అనడిని చూసుకునేవాడు. కొన్నాళ్ల తరువాత పూర్తి సమయాన్ని ఆశ్రమానికి కేటాయించడం కోసం 2017లో ఉద్యోగం వదిలేశాడు. అప్పటినుంచి మరింత సమయాన్ని కేటాయించి ఆశ్రమంలోని వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మొదలు పెట్టాడు. వారికి అవసరమైన వైద్యసదుపాయాలు సకాలంలో అందిస్తూ వారిని ఆనందంగా ఉంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఆవులు పెంచుతూ... ఆశ్రమాన్ని నడిపేందుకు.. అవసరమైన ఖర్చుల కోసం అనడి ఫారమ్స్ అండ్ గోదామ్ పేరిట ఆవుల పెంపకాన్ని ప్రారంభించాడు. రెండువందల ఆవులను పెంచుతూ.. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యిని విక్రయిస్తూ వచ్చిన ఆదాయాన్ని అనడి ఆశ్రమ వృద్ధుల కోసం ఖర్చు చే స్తున్నాడు. గత ఇరవై ఆరేళ్లుగా అనడీలో ఎంతోమంది వృద్ధులు ఆశ్రయం పొందారు. మలివయస్కుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నలభై ఆరేళ్ల ప్రణవ్ సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు, గౌరవ సత్కారాలు దక్కడంలో ఆశ్చర్యం లేదు. అందుకే పిల్లలు వద్దనుకున్నాం కాలేజ్ డేస్‌లో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తోంది. పెద్దవారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆశ్రమంలో నలభైæరెండు మంది వృద్ధులు ఉన్నారు. వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాము. అందుకే నేను, నా భార్య పిల్లలు వద్దు అనుకున్నాము. -
స్టీల్‌బ్యాంక్
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకునే సాధారణ గృహిణి తులికా సునేజా. ‘చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది, అప్పుడే భవిష్యత్ తరాల మనుగడకు ఢోకా ఉండదన్న తాపత్రయం తనది. ‘వాయు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గిద్దాం’ అని చెప్పేవారే కానీ ఆచరించేవారు అరుదు. అందుకే కాలుష్య స్థాయుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదని భావించిన తులికా... పర్యావరణాన్ని కాపాడడానికి నడుం బిగించి ‘క్రోకరీ బ్యాంక్’ నడుపుతోంది. ఈ బ్యాంక్ ద్వారా డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కృషిచేస్తోంది. ఫరీదాబాద్‌కు చెందిన తులికా సునేజా ఓ రోజు పిల్లలతో బయటకు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు... రోడ్డుమీద కొంతమంది ఉచితంగా అన్నదానం చేస్తుండడం చూసింది. నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు అని సంతోష పడేలోపు.. చుట్టుపక్కల చెల్లాచెదరుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు కనిపించాయి. తులికాతో ఉన్న తన పిల్లలు ‘‘అమ్మా ఇలా ప్లాస్టిక్ పడేయడం పర్యావరణానికి మంచిది కాదు, దీనిని నియంత్రించడానికి షరిష్కారమే లేదా?’’ అని తల్లిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ప్రశ్నకు తులికా దగ్గర సమాధానం లేదు. కానీ డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని రోజుల తరబడి ఆలోచించసాగింది. కొన్నిరోజుల తర్వాత తన మదిలో మెదిలిన ఐడియానే ‘క్రోకరీ బ్యాంక్’. ఎవరికీ నమ్మకం కుదరలేదు.. తనకు వచ్చిన క్రోకరీ బ్యాంక్ ఐడియాను తన స్నేహితులతో చెప్పింది తులిక. ‘‘బ్యాంక్ ఆలోచన బావుంది కానీ ఎవరు పాటిస్తారు. బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చాలా స్థలం, డబ్బులు కావాలి’’ అన్న వారే తప్ప సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చడానికి తన భర్త సాయం తీసుకుంది. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడంతో.. తాను దాచుకున్న డబ్బులతో స్టీ్టల్వి.. యాభై టిఫిన్ ప్లేట్లు, యాభై స్పూన్లు, యాభై భోజనం చేసే ప్లేట్లు, యాభై గ్లాసులు కొనింది. ఇవన్నీ పదమూడు వేల రూపాయల్లోనే వచ్చేశాయి. ఈ స్టీల్ సామాన్లతో 2018లో తనింట్లోనే ‘క్రోకరీ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ గురించి తెలిసిన కొంతమంది తమ ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు ఈ సామాన్లు తీసుకెళ్లేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో చాలామంది ఫంక్షన్లకు ఈ ఇక్కడి నుంచే సామాన్లను తీసుకెళ్లడం మొదలు పెట్టారు. కొంతమంది పర్యావరణవేత్తలు సైతం తులికాకు మద్దతు ఇవ్వడంతో క్రోకరీ బ్యాంక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్నాపెద్దా పుట్టినరోజు వేడుకలు, కిట్టీపార్టీలు, కొన్ని ఆర్గనైజేషన్లలో జరిగే చిన్నపాటి ఈవెంట్లకు సైతం ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంక్ నుంచే సామాన్లు తీసుకెళ్తున్నారు. తులికాను చూసి ఫరీదాబాద్‌లో పదికి పైగా స్టీల్ క్రోకరీ బ్యాంక్‌లు ఏర్పాటయ్యాయి. నేను చాలా చిన్నమొత్తంతో క్రోకరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాను. ఎవరైనా ఇలాంటి బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. నాలా మరికొంతమంది పూనుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. దీని ద్వారా 2018నుంచి ఇప్పటిదాకా ఐదులక్షల డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించగలిగాను. భవిష్యత్‌లో మరింత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి భారీస్థాయిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిస్తాను. – తులికా -
గుండెపోటుతో మెడికల్ షాపు ముందే కుప్పకూలిన 23 ఏళ్ళ యువకుడు
చండీగఢ్: హరియాణా ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మెడికల్ షాపులో మందులు కొనడానికి వెళ్లిన 23 ఏళ్ల యువకుడు అకస్మాతుగా గుండెపోటుతో కుప్పకూలాడు. అతను అడిగిన ఓఆర్ఎస్ ఇస్తుండగా.. క్షణాల్లోనే కిందపడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ యువకుడ్ని ఇటావాకు చెందిన 23 ఏళ్ల సంజయ్గా గుర్తించారు. ఛాతీలో అసౌకర్యంగా అన్పించడంతో మందుల దుకాణానికి వెళ్లిన అతడు ఓఆర్ఎస్ ఇవ్వమని అడిగాడు. అప్పటికే తీవ్రంగా ఇబ్బందిపడుతూ ఛాతీపై రుద్దుకోవడం వీడియోలో కన్పించింది. మెడికల్ షాపులోని వ్యక్తి ఇతరులకు మందులు ఇచ్చి.. రెండు మూడు నిమిషాల తర్వాత సంజయ్ అడిగిన ఓఆర్ఎస్ ఇచ్చాడు. అది తీసుకోవడానికే ముందే అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. షాపులోని వ్యక్తి చేతి పట్టుకుని కిందపడకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బయటకు వెళి చూస్తే సంజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. Man got heart attack while taking ORS at Medical store, died on the spot in Faridabad, Haryana. 👇#Faridabad #Haryana #HeartAttack #Health #BreakingNews #ViraqlVideo #India #IndiaNews pic.twitter.com/80y2bkVzy0 — Free Press Journal (@fpjindia) January 6, 2023 చదవండి: ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్.. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై.. నోట్ల కట్టను నోట్లో పెట్టుకొని
సాధారణంగా కావాల్సిన పనులు తొందరగా జరగాలంటే అధికారులు లంచం డిమాండ్ చేయడం తెలిసిందే. ఇది కాస్తా ప్రస్తుతం లంచాలు ఇవ్వనిదే ఏ పని జరగదనే స్థాయికి వచ్చింది. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు అయినా చివరికి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా లంచాల బాట పడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి పట్టుబట్టాడు. అయితే తరువాత సదరు అధికారి చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే హర్యానాలోని ఫరీదాబాద్‌లో లంచం తీసుకుంటున్న పోలీస్‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గేదెల దొంగతనం కేసులో నిందితుడిపై చర్య తీసుకోవడానికి శుభనాథ్ అనే వ్యక్తి నుంచి సబ్-ఇన్స్పెక్టర్ మహేంద్ర పాల్ రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు అప్పటికే అధికారికి రూ.6 వేలు ఇచ్చాడు. అయితే తరువాత విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి నుంచి ఎస్సై లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. లంచగొండి పోలీస్ నుంచి డబ్బులు రికవరీ చేస్తుండగా.. అతడు వెంటనే ఎవరూ ఊహించని పనిచేశాడు. లంచం రూపంలో తీసుకున్న కరెన్సీ నోట్లను నోట్లో పెట్టుకుని మింగేశాడు. పోలీసు చర్యను అడ్డుకున్న అధికారులు వెంటనే అతను మింగిన డబ్బును బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఓ పోలీస్ అధికారి ఏకంగా నోట్లో వేళ్లు కూడా పెట్టాడు. కానీ పోలీస్ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఫలితం లేకుండా పోయింది. దీన్నంతటినీ ఓ వ్యక్తి ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పట్టుబడ్డ పోలీస్ నోట్లు మింగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిజంగా అతడు చేసిన పనితో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Inspector in Faridabad Haryana took Rs 10,000 as a bribe! Caught red-handed by Vigilance team. Sub-inspector also tried to swallow the money in front of the vigilance team and also manhandled them. pic.twitter.com/KoWanFElgf — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) December 13, 2022 A police sub-inspector in #Faridabad, #Haryana swallowed currency notes, to avoid being trapped by the vigilance team. Reportedly, the cop took a bribe from a person in exchange for initiating action on his complaint of buffalo theft.#SubInspector #MahenderPal #ViralVideo pic.twitter.com/oK3ZIIP2r3 — Hate Detector 🔍 (@HateDetectors) December 13, 2022 -
వీడియో: ‘బీటెక్ చాయ్‌వాలి’.. ఆమె థింకింగ్ వేరె లెవల్ గురూ..
ఆలోచన ఉండాలే గానీ.. జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపించి తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. తాజాగా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఓ యువతి.. తన కలలను నిజం చేసుకుంది. సొంతంగా బీటెక్ చాయ్‌వాలి అనే పేరుతో ఓ టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా, తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, తన కలను సాకారం చేసుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. సొంతంగా ఓ టీ షాప్‌ను ప్రారంభించింది. సదరు షాప్‌నకు ‘బీటెక్ చాయ్వాలీ’ అని పేరుపెట్టింది. దీంతో, వ్యాపారం ప్రారంభించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో వర్తికా సింగ్ మాట్లాడుతూ.. సొంత వ్యాపారం చేయాలనుకోవడం నా డ్రీమ్. అందులో భాగంగానే ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ వద్ద ‘బీటెక్ చాయ్వాలీ’ని ప్రారంభించాను. ప్రతీరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు టీ షాప్‌ను నడుపుతున్నాను. ‘బీటెక్ చాయ్వాలీ’తో ఎంతో సంతృప్తి చెందాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) మరోవైపు.. గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో ‘బీటెక్ చాయ్వాలీ’ ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ షాప్‌లో స్పెషల్ టీ, మసాలా టీ తాగేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, బీటెక్ చాయ్వాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది. నేను మీ కోసం ప్రార్థిస్తాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు బ్రాండ్ అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. https://t.co/l4NsiNCmn1 ke baad ab https://t.co/uwi8X7YeHb chaiwali bhi aagyi 🙄 Ab apun bhi bnega Upsc chaiwala 😍 pic.twitter.com/hH2Xxu2vKy — 🚩ASHU THAKUR 🚩 (@ashu_thakurr) October 3, 2022 -
ఈవీ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ మోపెడ్.. కి.మీ.కు 25 పైసలు మాత్రమే!
ఫరీదాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నహక్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్'ను ఈరోజు దేశంలో లాంఛ్ చేసింది. కొత్త నహక్ మోటార్స్ ఎగ్జిటో సోలో ఎలక్ట్రిక్ మోపెడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.85,999గా ఉంది. ఇది 100 శాతం మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మోపెడ్. ఈ స్కూటర్ మీద కి.మీ. ప్రయాణానికి 25 పైసలు మాత్రమే ఖర్చు కానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం ప్రీ బుకింగ్స్ వచ్చే నెలలో కంపెనీ అధికారిక పోర్టల్‌లో ప్రారంభమవుతాయని నహక్ మోటార్స్ తెలిపింది. అంతేకాక, డెలివరీలు వచ్చే నెల నుంచి పాన్-ఇండియా డీలర్ షిప్ ద్వారా ప్రారంభమవుతాయని కూడా పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్'ను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించడానికి రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ 150 కిలోగ్రాముల వరకు పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 48వీ 30 ఏహెచ్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. దీని ఛార్జర్'ను రెగ్యులర్ హోమ్ పవర్ సాకెట్'లో ప్లగ్ చేయవచ్చు. (చదవండి: ఇక సామాన్యులు బంగారం కొనడం కష్టమేనా..!) -
షాకింగ్ వీడియో: ఈ తల్లీకొడుకులు చెప్పింది వింటే చిర్రెత్తుకు రావడం ఖాయం
బిడ్డ ఎలాంటోడైనా, ఎంతటోడైనా ఆ తల్లికి పసివాడే. అలాంటిది పసివాడినే ఆ తల్లి అలా చేసేసరికి.. చూసేవాళ్లకి చిర్రెత్తుకొచ్చింది. చీర, బెడ్షీట్లకు కొడుకును వేలాడదీసి పైకి లాగిన ఆ తల్లిని చూసి.. ‘ఇదేం తల్లీ? అనుకునేవాళ్లంతా’.. అందుకు కారణం తెలిసేసరికి తిట్టిన తిట్టు తిట్టడమే కనిపిస్తోంది సోషల్ మీడియా అంతా.. ఫరిదాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనగా ఈ వీడియో సర్క్యులేట్ అవుతోంది. పోయినవారం సెక్టార్ 82లోని ఓ సొసైటీలో ఇది జరిగింది. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్లో పడిపోవడం, ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో.. వేరేవాళ్ల సాయం కోరకుండా ఇదిగో ఈ తల్లి ఇలా కొడుకును కిందకు వేలాడదీసి పంపి.. చీరను పైకి తెప్పించుకుంది. అదీ తొమ్మిదవ ఫ్లోర్ నుంచి.. ఆ సమయంలో దూరంగా ఎదురుగా ఎక్కడో ఉన్న అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అలా వైరల్ అయ్యింది ఆ వీడియో. ఏ మాత్రం జంకు లేకుండా ఆ పిలగాడు పైకి వెళ్తుండగా.. ఆ తల్లి నిమ్మలంగా పైకి లాగుతూ కనిపించింది. ఆ పక్కనే మరికొందరు ఉన్నారు. గ్రిల్ మీద కాళ్లు పెట్టే క్రమంలో పట్టుతప్పి ఉంటే గనుక ఆ బిడ్డ సంగతి ఏంటని తిట్టి పోస్తున్నారు. Daily News Haryana సౌజన్యంతో వీడియో ఇక వైరల్ అయిన వీడియోపై ఆ తల్లీకొడుకులు సైతం స్పందించారు. అయితే వాళ్ల మాటలు గనుక వింటే.. అప్పటిదాకా పిల్లోడి మీద జాలి చూపించిన వాళ్లకు మరింత కోపం రావడం ఖాయం. పడితే ఏమవుతుంది? ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు పోవాల్సిందేగా అని ఆ బుడ్డోడు చెప్తుంటే.. వీడియో తీస్తున్నారని తెలియదని, ఈ ఘటనకు తనను క్షమించాలని ఆ తల్లి అంటోంది. ఈ ఘటన పోలీసుల దృష్టికి సైతం వెళ్లింది. మరి వాళ్లు ఏం చేస్తారో చూడాలి మరి. -
నడిరోడ్డుపై బ్యాగ్ కలకలం.. అందులో నుంచి ఏడుపు శబ్దం
హర్యానా: ఫరీదాబాద్‌లోని సెక్టార్25 రోడ్డులో ఉన్న బ్రిడ్జిపై ఓ నల్లబ్యాగ్ కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలలోకి వెళితే.. ఒక పాదచారుడు బ్రిడ్జిపై నడుచుకుంటూ ఉదయాన్నే వెళుతున్నాడు. అలా వెళుతున్న అతనికి రోడ్డు పక్కన ఒక నల్లని బ్యాగ్ నుంచి చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో ఆ బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూశాడు. బ్యాగ్‌లో నుంచే ఆ ఏడుపు వినిపిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. వెంటనే బ్యాగ్ తెరిచి చూస్తే అందులో ఓ పసికందు గట్టిగా ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకి సమాచారం అందించాడు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పాపను వైద్య పరీక్షల నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి కొన్ని గంటల క్రితం పుట్టిన పాపను బ్యాగ్‌లో పెట్టి అక్కడ పడేసి వెళ్లిపోయి ఉండొచ్చని, పాప ఒంటిపై కనీసం దుస్తులు కూడా లేవని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ మహిళ.. ఆ పాపకు పాలిచ్చి ఆకలి తీర్చిందని పోలీసులు పేర్కొన్నారు. పాపను అక్కడ వదిలేసి వెళ్లింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ పసికందును వదిలేసి వెళ్లిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని, పాప ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పసికందును అలా నడిరోడ్డుపై బ్యాగ్‌లో వదిలేసి వెళ్లారనే విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ పాపను దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. అయితే దానికి న్యాయపరమైన ప్రక్రియ ఉంటుందని, అలా దత్తత తీసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదని పోలీసులు వారికి తెలిపారు. ఇక దాంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుందామని వచ్చినవారు నిరాశ చెందారు. -
మెట్రో స్టేషన్లో కలకలం, పైనుంచి దూకేస్తానన్న యువతి.. అంతలో
చండిగఢ్: అంతవరకు ప్రశాంతంగా ఉన్న మెట్రో ఆవరణమంతా ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఏం జరిగిందో తెలీదు గానీ ఓ యువతి మెట్రో స్టేషన్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతంగా ముగిసింది. ఈ ఘటన హర్యానాలో జూలై 24 న సాయంత్రం 6:30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫరిదాబాద్ మెట్రో స్టేషన్ బాల్కని పైకి అకస్మాత్తుగా ఓ యువతి ఎక్కి అక్కడి నుంచి దూకాలని ప్రయత్నించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేసిన పోలీసు అధికారి, సిఐఎస్ఎఫ్ సిబ్బంది, మెట్రో సిబ్బందితో కలిసి.. ఆ యువతి దృష్టిని మళ్లించేందుకు ముందుగా ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అలా మాటల్లో పెట్టిన పోలీసు అధికారి ఆ యువతి వద్దకు మెల్లగా చేరుకున్నాడు. ఇంతలో, మరో వ్యక్తి కూడా ఆమె వద్దకు చేరడంతో తనని కాపాడగలిగారు. విచారణలో.. ఆ యువతి, ఫరీదాబాద్ సెక్టార్ 28 లో ఉన్న ఓ ప్రవేట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. తాను చేస్తున్న పని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొంది. అనంతరం పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కాగా ఫరీదాబాద్ పోలీసు శాఖ ఆ యవతిని కాపాడిన వారిని అభినందిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది . యువతిని కాపాడటంలో అధికారులు చూపిన సమయస్ఫూర్తికి , ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ऐसा #फ़िल्मों में भी नहीं होता। जान देने पर अमादा #लड़की को जान हथेली पर रख कर बचाया। जाँबाज़ #पुलिस कर्मी को बधाई। #कहो_ना_कहो pic.twitter.com/sPZ5bjkZOm — People’s Police - Faridabad Police (@FBDPolice) July 24, 2021 -
లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు.. ఎలా ఉండేవి?
ఆటవిక యుగం మధ్య దశలో మనుషులు అరణ్యాలలో, కొండ గుహలలో నివసించేవారు. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో ఉండే జనాభా చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఇదంతా చరిత్ర. ఇక మన చుట్టూ జరుగుతున్న విషయాలను కొన్ని చిత్రాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. మరి లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు ఎలా ఉండేవి? చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్ గుహలోని చిత్రాలు లక్ష సంవత్సరాల క్రితం వేసినట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. టూల్ టోపోలాజీ ఆధారంగా.. ఈ ప్రదేశంలో చారిత్రక ఆనవాళ్లను గుర్తించినట్లు వివరించారు. పర్యావరణవేత్త సునీల్ హర్సనా వన్యప్రాణులు, వృక్షసంపదపై ఆరావళీ కొండల్లో వివిధ అంశాలను సునీల్ హర్సనా డాక్యుమెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి గుహలలోని కళను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గుర్తించిన ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గుహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అలా ఈ చిత్రాలు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. కాగా ఈ ఏడాది మే నెలలో పర్యావరణవేత్త సునీల్ హర్సానా… మంగర్ బని అటవీప్రాంతంలోని గుహలో ఈ చిత్రాలను గుర్తించారు. జూన్ నుంచి హర్యానా పురావస్తు శాఖ అధికారులు వీటిపై పరిశోధనలు జరిపారు. పురావస్తు శాఖ ఫరీదాబాద్‌లోని శిలాఖరి, మంగర్, కోట్, ధౌజ్ ప్రాంతాలలో, గుర్గావ్లోని రోజ్ కా గుజ్జర్, దమ్దామా వంటి ప్రదేశాలలో పరిశోధనలు నిర్వహించారు. ఇక అక్కడ రాతి యుగంలో వాడిన కొన్ని సాధనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగర్ బని అడవికి రక్షణ దీనిపై హర్యానా ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కా మాట్లాడుతూ.. పాలియోలిథిక్ యుగానికి చెందిన పురాతన గుహ చిత్రాలు, సాధనాలు పెద్ద సంఖ్యలో ఉన్నందున చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల రక్షణ చట్టం 1964 ప్రకారం.. మంగర్ బని అడవికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల హర్యానాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఆరావళీ పర్వత శ్రేణిలోని గుహలలోని కొన్ని చిత్రాలను కూడా గుర్తించారు. ఇందులో మనుషుల బొమ్మలు, జంతువులు, ఆకులు, రేఖాగణిత చిత్రాలు ఉన్నాయి. ఇవి 40,000 సంవత్సరాల క్రితానికి (ఎగువ పాలియోలిథిక్ యుగం) చెందినవని, సుమారు 10,000 సంవత్సరాల క్రితం వరకు వర్థిల్లినట్లు తెలిపారు. @AshokKhemka_IAS Principal Secretary to govt archaeology dept Haryana said: "We will be giving MangarBani forest protection under Punjab Ancient & Historical Monuments & Archaeological Sites & Remains Act, 1964 because of presence of large number of stone age cave paintings." pic.twitter.com/IUN5AVzF31 — Aravalli Bachao (@AravalliBachao) July 15, 2021 -
ఎఫైర్; భర్తను జైలుకి పంపాలని స్కెచ్.. ట్విస్ట్ ఏంటంటే!
చండీఘఢ్: భర్తను కటకటాల్లోకి నెట్టాలని భావించి ఓ భార్య చేసిన కుట్ర బెడిసికొట్టింది. తనన మోసం చేస్తున్నాడని భావించి అతడిని ఇరికించేందుకు చేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. ఫరీదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి అతను రోజూ ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ఇక ఒక్కోరోజు అసలు ఇంటికే వెళ్లేవాడే కాదు. దీంతో తన భర్త ఎందుకు ఇంటికి రావడం లేదని ఆలోచించిన భార్య అతనిపై క్రమంగా అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని అపోహ పడింది. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని అనుమానించి రగిలిపోయింది. ఈ విషయం పలుమార్లు భర్తతో చర్చించగా వీరి మధ్య తరుచూ గొడవలు అయ్యేవి. దీంతో విసిగి పోయిన మహిళ.. ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఢిల్లీ వెళ్లి మరీ ఓ వ్యక్తి వద్ద గంజాయి మొక్కను కొనుక్కొచ్చింది. సుమారు 700 గ్రాముల గంజాయి మొక్కను తన భర్త ఆటోలో పెట్టింది. తరువాత తనకేం సంబంధం లేనట్లు గుర్తు తెలియని మహిళ మాదిరిగా పోలీసులకు ఫోన్ చేసి గంజాయి విషయం చెప్పి భర్తను బుక్ చేయాలని చూసింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు కిలాడీ భార్యేనని తెలిసి ఆమెకు షాకిచ్చారు. ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. చదవండి: వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నారు: హైకోర్టు ఆవేదన యువతితో దిగిన ఫొటోతో స్టేటస్.. భార్య చూడటంతో! -
ఫరిదాబాద్ హత్య.. ‘నా కెరీర్ నాశనం చేసింది’
చండీగఢ్: సోమవారం మధ్యాహ్నం ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో 21 ఏళ్ల నికితా తోమర్‌ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. నికిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఇక పోలీసుల దర్యాప్తులో ఈ నెల 24, 25 తేదీలలో నికిత, తౌసీఫ్‌లు దాదాపు 16 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కెరీర్‌ని నాశనం చేసింది.. అందుకే నికితా తోమర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తౌసీఫ్ తమ కుమార్తెని వివాహం చేసుకోవాల్సిందిగా చాలా కాలం నుంచి వేధిస్తున్నాడని తెలిపారు. ఒకసారి నికితను కిడ్నాప్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదరడంతో తౌసీఫ్ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక పోలీసుల విచారణలో తౌసీఫ్.. తన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో మెడిసిన్ చదవలేకపోయానని.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలిన భావించి.. నికితను హత్య చేశానని తెలిపాడు. (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో) -
మహిళను వేధించిన డాక్టర్‌పై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఫరీదాబాద్‌లోని క్యూఆర్జీ ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని లైంగిక వేధింపులకు గురిచేసిన డాక్టర్‌పై విచారణ చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) కోరింది. ఏప్రిల్ 18న ఆస్పత్రిలో జరిగిన ఘటనలో వైద్యుడిపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ట్విటర్ పోస్ట్ ఆధారంగా సుమోటోగా ఎన్సీడబ్ల్యూ ఈ కేసును చేపట్టింది. ఈ వైద్యుడు ఇతర మహిళా సభ్యుల పట్ల కూడా అభ్యంతరకరంగా వ్యవహరించినట్టు ఫిర్యాదులు వచ్చినా ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదని దుయ్యబట్టింది. వైద్యుడిపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా బాధితురాలిని ప్రస్తుత పోస్ట్ నుంచి తప్పించి డిమోట్ చేసిందని ఎన్సీడబ్ల్యూ ఓ ప్రకటనలో పేర్కొంది. బాధిత మహిళ ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారించిందా..? ఈ విచారణలో నిందితుడు దోషిగా తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ తక్షణమే కమిషన్‌కు నివేదిక పంపాలని కోరుతూ ఎన్సీడబ్ల్యూ క్యూఆర్జీ ఆస్పత్రి డైరెక్టర్ సంగీతా రాయ్ గుప్తాకు లేఖ రాసింది. చదవండి : తారతమ్యం మరచిన తాతయ్య -
కాంగ్రెస్ నేత హత్య కేసు.. గ్యాంగ్‌స్టర్ అరెస్టు
చండీగఢ్ : హరియాణా కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ ఖేరీ(35)ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్ 27న వికాస్ చౌదరి రౌడీషీటర్ల చేతుల్లో హత్య గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కౌశల్, సచిన్ ఖేరీ అనే ఇద్దరు గ్యాంగ్స్టర్లు నిందితులుగా ఉన్నారు. అయితే సచిన్ ఫరీదాబాద్‌లో ఉన్నాడనే సమాచారం తెలియడంతో.. అతని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం సోమవారం అర్ధరాత్రి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో పారిపోయేందుకు యత్నించిన సచిన్ పోలీసులపై కాల్పులకు దిగాడు. అయితే దాదాపు అరగంట పాటు శ్రమించిన పోలీసులు సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘‘సచిన్ ఫరీదాబాద్ పరిధిలో ఉన్నాడని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నాం. ద్విచక్ర వాహనం పై ఉన్న సచిన్‌ను లొంగిపోవాలని సూచించినప్పటికీ.. అతడు మా ఆదేశాలు పట్టించుకోకుండా పారిపోడానికి ప్రయత్నించాడు. పైగా పోలీసులపైకి ఎదురు కాల్పులకు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా అతనిపై కాల్పులు జరిపారు. దీంతో సచిన్ కాలికి గాయమైంది. గాయంతో కిందపడిపోయిన సచిన్‌ను అదుపులోకి తీసుకున్నాం’’ అని సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో గాయపడిన సచిన్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా, హర్యానా గ్యాంగ్‌స్టర్ కౌశల్‌కు సచిన్ సన్నిహితుడని పోలీసులు వెల్లడించారు. సచిన్‌పై ఇప్పటివరకు 200 దోపీడీ, కిడ్నాప్, హత్య కేసులు నమోదైనట్లు తెలిపారు. 2012 నుంచి సచిన్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కౌశల్ గ్యాంగ్ అంతా సచిన్ నేతృత్వంలోనే నడుస్తుందని పోలీసులు చెప్పారు. -
రివాల్వర్‌తో కాల్చుకుని ఐపీఎస్ ఆత్మహత్య
ఛండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) ఆత్మహత్యకు పాల్పడారు. ఫిరీదాబాద్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్ కపూర్ బుధవారం తెల్లవారజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పని ఒత్తిడి కారణంగా విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన విక్రమ్ గత ఏడాదే ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. -
ఉద్యోగ విరమణ కాగానే.. చాపర్ ఎక్కాడు
ఫరిదాబాద్ : ఉద్యోగ విరమణ అనంతరం ఓ వ్యక్తి చేసిన పని గ్రామస్తులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ అతను చేసిందేమీటంటే.. చాపర్‌లో ప్రయాణించాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్ సమీపంలోని సద్పురాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురే రామ్ అనే వ్యక్తి నీమ్కా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేసేవాడు. అది అతని స్వగ్రామం సద్పురాకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. సద్పురా నుంచే అతను పాఠశాలకు నిత్యం రాకపోకలు సాగించేవారు. అయితే 40 ఏళ్ల పాటు పాఠశాలలో పనిచేసిన రామ్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. అయితే రామ్‌కు అతని కుటుంబ సభ్యులతో కలిసి చాపర్‌లో ప్రయాణించాలనే కోరిక ఉండేంది. ఈ విషయాన్ని తన రిటైర్మెంట్కు కొద్ది రోజుల మందు తన తమ్ముడు, సద్పురా సర్పంచ్ శివకుమార్‌కు తెలిపాడు. తన ఉద్యోగ విరమణను కొత్తగా జరుపుకోవాలని ఉన్నట్టు పేర్కొన్నాడు. దీంతో శివకుమార్ అన్న కోరిక తీర్చేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం కుటుంబసభ్యులంతా కలిసి రూ. 3.30 లక్షలు జమ చేశారు. ఆ డబ్బుతో.. రామ్ పనిచేసిన పాఠశాల నుంచి సద్పురాకు 8 ట్రిప్పులు తిరిగేలా ఓ చాపర్‌ను బుక్ చేశారు. రామ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం అనంతరం అతని కుటుంబ సభ్యులంతా నీమ్కా నుంచి సద్పురాకు చాపర్‌లో చేరుకున్నారు. సదుర్పాకు చాపర్‌లో వచ్చిన రామ్‌కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. -
ఏజెంట్ నిర్వాకం : వీడియో వైరల్
సాక్షి, ఫరీదాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశ పోలింగ్ సందర్భంగా హరియాణాలో ఓ సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఓటు వేయడానికి మహిళా ఓటర్లకు బదులుగా ఓ పోలింగ్ ఏజెంట్ స్వయంగా తానే ఓటు వేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీంతో స్పందించిన అధికారులు సంబంధిత పోలింగ్ ఏజెంట్‌పై ఫిర్యాదు చేయడంతోచ పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. ఆరో విడుత ఎన్నికల్లో భాగంగా హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలోని అసౌటి పోలింగ్ బూత్‌లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లో కూర్చొన్న ఓ ఏజెంట్.. ఈవీఎం కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి అక్కడ మహిళ ఉండగానే అతడు ఓటేశాడు. ఇలా ముగ్గురు మహిళల ఓట్లు ఆ పోలింగ్ ఏజెంటే ఓటేసినట్లు అక్కడున్న వారు తెలిపారు. అయితే ఈ తతంగాన్ని అక్కడున్న ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ సంఘటనపై ఫరీదాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. సదరు పోలింగ్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. కేసు నమోదు చేశామని, ముగ్గురు మహిళల ఓట్లు వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. పోలింగ్ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. The person in the video is the Polling agent who has been arrested in the afternoon itself. FIR lodged. He was trying to effect at least 3 lady voters. Observer & ARO with teams visited the booth at Asawati in prithala constituency. He is satisfied that voting was never vitiated — DISTRICT ELECTION OFFICE FARIDABAD (@OfficeFaridabad) May 12, 2019 What the is this? Is this what we call democracy? pic.twitter.com/XFuvq5dD1m — Ravi Nair (@t_d_h_nair) May 12, 2019 -
18 ఏళ్లుగా ఆ రోడ్డు నిర్మాణం సా..గుతోంది!!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని రాజకీయ పార్టీలపై విమర్శలు రావడం మామూలే. అయితే 18 ఏళ్ల క్రితం మంజూరైన ఓ రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. వివరాలు.. ఢిల్లీ, నొయిడా, ఫరిదాబాద్ను కలుపుతూ సాగే కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ ప్రాజెక్టుతో పాటు అదే ఏడాదిలో ఢిల్లీ మెట్రోకు కూడా కాంగ్రెస్ పాలకులు శంకుస్థాపన చేశారు. అయితే 277 కిలోమీటర్ల రైల్వే లైన్‌తో మెట్రో నిర్మాణం పూర్తి చేసుకోగా, 13.7 కిలోమీటర్ల కాళింద్ కుంజ్ బైపాస్ ప్రాజెక్టు మాత్రం అటకెక్కింది. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాడానికి 18 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టుని మంజూరు చేయగా, అంతకంతకూ పెరిగిన వాహనాల రద్దీలో దక్షిణ ఢిల్లీ ఊపిరి సలపకుండా ఉంది. అన్నీ ఆటంకాలే..! ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను వివరణ కోరగా.. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాల కారణంగా నిర్మాణం ఆగిపోయిందని తెలిపింది. ఓక్లా పరిరక్షణ కేంద్రం(బర్డ్ శాంక్చూరీ) మీదుగా రోడ్డు వేయాల్సి రావడంతో నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయని పేర్కొంది. అయితే రీడిజైన్ అనంతరం మట్టి తవ్వకాలు, కొలతలు చేపట్టామని వివరించింది. కానీ, రోడ్డు నిర్మాణానికి అవరసమైన 43 ఎకరాలకు యూపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున 2007లో మరోమారు పనులు నిలిచిపోయాయని తెలిపింది. కాగా, భూ అనుమతుల విషయమై 2017లో ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కార్‌తో సంప్రదింపులు జరిపింది. -
కొడుకులా చూసుకున్నాం, కానీ...
ఫరిదాబాద్: హర్యానాలో మరో ఘాతుకం చోటు చేసుకుంది. కన్నకొడుకులా చూసుకున్న యాజమానికి తీరని శోకం మిగిల్చిందో మానవ మృగం. నాలుగేళ్ల చిన్నారిని అతిక్రూరంగా హత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఆపై మృతదేహాన్ని తన ఇంట్లో దాచిపెట్టాడు. ఫరిదాబాద్‌లోని పల్వాల్ మండలం అసోథి గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం... చిన్నారి తండ్రి స్థానికంగా ఓ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. 24 ఏళ్ల భోలు అలియాస్ వీరేందర్ ఆ షాపులో తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన భోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం చంపి, ఇంట్లోని డ్రమ్‌లో బాలిక మృతదేహాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లు తిరిగి దుకాణానికి వచ్చేశాడు. బాలిక కనిపించపోయే సరికి కంగారుపడిన తల్లిదండ్రులు ఊరంతా వెతకటం ప్రారంభించారు. వారికి భోలు కూడా సాయం చేస్తున్నట్లు నటించాడు. నిందితుడి తల్లి సహకారం... అయితే చిన్నారి తండ్రితో కొందరు స్థానికులు.. బాలికను భోలు తీసుకెళ్లటం చూశామని చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది. భోలు ఇంటికి చేరుకున్న బాలిక బంధువులు ఇంట్లో సోదాలు చేసేందుకు యత్నించారు. అయితే భోలు తల్లి మాత్రం వాళ్లను ఇంట్లోకి రానివ్వలేదు. పైగా వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో బలవంతంగా వారంతా ఇంట్లోకి చొరబడి సోదా చేశారు. చివరకు ఓ గదిలో రక్తపు మరకలు, డ్రమ్‌లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భోలుని, నేరానికి సహకరించిన అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు. (కథువా ఘటన కథనాలు) ఉరి తీయాలి... ‘తొమ్మిదేళ్లుగా నా దగ్గర నమ్మకంగా పని చేశాడు. కొడుకులా చూసుకున్నాం. కానీ, నా కూతురినే కిరాతకంగా చంపాడు. వాడి కళ్ల ముందే పుట్టి పెరిగిన నా బిడ్డను మృగంలా కబలించాడు. వాడిని ఉరి తీస్తేనే న్యాయం జరుగుతుంది. నాలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు’ అని చిన్నారి తండ్రి కోరుతున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో బాలల హక్కుల సంఘాలు శనివారం ఫరిదాబాద్‌లో సంఘీభావ ర్యాలీని నిర్వహించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు కోరుతున్నాయి. కేసులు నమోదు... కాగా, ఘటన అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో బలగాలను మోహరించిన పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఐపీసీతోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. సీసీఫుటేజీ, నిందితుడి ఇంట్లో రక్తపు మరకల, స్థానికుల స్టేట్మెంట్ ఆధారంగా నిందితులపై అభియోగాలు నిరూపణ అయ్యే అవకాశం ఉందని దేవేంద్ర సింగ్ అనే అధికారి వెల్లడించారు. భోల్‌కు వివాహమైనప్పటికీ అతని పద్ధతి నచ్చని భార్య రెండేళ్లుగా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం భోలు, అతని తల్లి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. -
బాత్ టబ్‌లో పడి ఎన్నారై మహిళ మృతి!
ఫరిదాబాద్: హరియాణాలో ఓ ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్లో బాత్ టబ్‌లో పడి ఉన్న మహిళ మృతదేహన్ని ఆలస్యంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లండన్‌లో స్థిరపడిన భారత సంతతి మహిళ రీతూ కుమార్ (40) ఈ నెల 22న భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్ బస చేస్తున్నారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు గురువారం రీతూ కుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వారు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం హోటల్లోని వచ్చి ఆమె గదిలోకి వెళ్లి చూడగా బాత్రూంలో ఆమె మృతదేహం లభించింది. కాగా ఆమె గత కొద్ది రోజులుగా తన భర్తతో కలిసి ఉండడం లేదని, ఆమె గదికి కూడా హోటల్ సిబ్బందిని రావద్దని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. -
హర్యానాలో టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి
-
టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి
హర్యానా : టోల్ ప్లాజా సిబ్బందిపై బస్సు డ్రైవర్, కండక్టర్ లు దాడికి దిగారు. గురుగ్రామ్-ఫరీదాబాద్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సిబ్బందిపై హర్యానా రోడ్ వేస్‌కు చెందిన డ్రైవర్, కండక్టర్లు దాడి చేసిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరూ కలిసి టోల్‌ప్లాజా సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అయ్యా! అది గేదె మాంసం
సాక్షి, న్యూఢిల్లీ : గో రక్షక దళాల పేరిట దేశ రాజధాని శివార్లో శుక్రవారం జరిగిన దాడి దేశవ్యాప్తంగా మరోసారి కలకలం రేపుతోంది. ఫరిదాబాద్‌లో ఓ ఆటో రిక్షాలో బీఫ్ తీసుకెళ్తున్న ఆరోపణతో ఇద్దరిని చితకబాది.. ఆపై వారిని కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. అజాద్ అనే వికలాంగుడు ఓ ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన ఆటోలో గేదే మాంసంను ఓ దుకాణం వద్దకు తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆటోని అడ్డగించారు. అజాద్‌తోపాటు ఆటోలో ఉన్న మరో బాలుడిని తమ వెంట సమీపంలోని బజ్రీ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ గోమాంసం ఆరోపణలతో వారిపై దాడి చేశారు. అది గో మాంసం కాదని ఎంత మొత్తుకున్నా వారిని నిర్దాక్షిణ్యంగా చితకబాదారంట. విషయాన్ని అజాద్ ఫోన్లో తన కుటుంబ సభ్యులకు వివరించగా.. అక్కడికి రాగానే వారిపై కూడా దాడికి తెగపడ్డారు. అంతలో మరో 40 మంది వారికి జత కలిశారు. జై హనుమాన్, జై గో మాత చెప్పాలంటూ డిమాండ్ చేశారని.. తాను నిరాకరించటంతో పంది మాంసం తినిపిస్తామని బెదిరించారని గాయపడిన అజాద్ మీడియాకు తెలిపాడు. ఏం చేసినా తాను మాత్రం నినాదాలు చేయనని చెప్పటంతో 40 మంది కలిసి తమను దారుణంగా చితకబాదారంటూ... గాయాలు చూపించాడు. అతని మెడ, కాళ్లు, వీపు నిండా దెబ్బలే ఉన్నాయి. కాగా, ముందు బాధితులపై గోమాంసం అక్రమ రవాణా కేసు నమోదు చేసినప్పటికీ.. పరీక్షల్లో అది గేదే మాంసం అని తేలటంతో కేసు కొట్టివేసినట్లు పోలీసులు వెల్లడించారు. గోరక్షక దళాల పేరిట జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు.. వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. మరో పక్క నిజమైన హిందువులు ఆవులను పూజిస్తారని.. కేవలం నేర చరిత్ర ఉన్న వారే ఇలాంటి దాడులకు తెగబడతారని గోరక్షక దళాలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
మనిషా? లేక రాక్షసా?
సాక్షి, న్యూఢిల్లీ : పని పేరుతో తన దగ్గరకు తెచ్చుకున్న మైనర్‌పై ఓ యువతి అతికిరాతకంగా వ్యవహరించింది. రెండేళ్లుగా శారీరకంగా తీవ్రంగా హింసిస్తుండటంతో ఆ వేధింపులు తట్టుకోలేక బాలిక పై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించింది. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన యువతి(23) ఫరిదాబాద్ లో చదువుకుంటోంది. తన స్వగ్రామంలోని ఇంట్లో పని చేసే దంపతుల కూతురిని తన అవసరాల నిమిత్తం రెండేళ్ల క్రితం వెంట తెచ్చుకుంది. కొన్నాళ్లపాటు బాగానే చూసుకున్న యువతి.. హఠాత్తుగా మారిపోయింది. ఇంట్లోంచి కాలు కూడా బయటపెట్టనీయకుండా బాలికను ఆ యువతి దారుణంగా హింసించటం మొదలుపెట్టింది. లోపలి నుంచి ఏడుపులు వినిపించటంతో చుట్టుపక్కల వారు యువతిని ప్రశ్నించగా.. మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరూ చూస్కోండి అంటూ యువతి పరుషంగా బదులు ఇచ్చేదంట. ఈ క్రమంలో ఆ వేధింపులను తట్టుకోలేక పారిపోవాలని బాలిక నిర్ణయించుకుంది. బుధవారం వారిద్దరూ ఉంటున్న కనిష్క టవర్స్ 11వ అంతస్థు నుంచి కిందకు దూకేసింది. అయితే కింది ఫ్లోర్ లోనే ఉన్న పిట్ట గూడులో ఇరుక్కుపోయి భయంతో అరవ సాగింది. తొమ్మిదవ ఫ్లోర్లో ఉన్న ఓ టీచర్ ఆ ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించింది. వారొచ్చి బాలికను రక్షించి విముక్తి కల్పించారు. బాలిక శరీరం మొత్తం కాల్చిన గాయాలు ఉన్నాయి. ప్రతీ రోజు తనకు నరకం చూపించిందని ఆ బాలిక చెబుతోంది. బాల కార్మిక చట్టం కింద యువతిపై కేసు నమోదు చేసి.. పోలీసులు ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. కాగా, బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చేంత వరకు శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచాలని ఫరిదాబాద్ శిశు సంరక్షణం కమిటీ అధికారి హెచ్ఎస్ మాలిక్ తెలిపారు. -
రూ.10 నాణెంపై అయోమయం!
ఫరీదాబాద్: గత రెండు వారాలుగా ఫరీదాబాద్ ప్రజలు రూ.10 నాణెం విషయంలో తికమకపడుతున్నారు. కొంతమంది దుకాణదారులు రూ.10 నాణెం చెల్లుతుందని తీసుకుంటుంటే.. మరికొందరు అంగీకరించటం లేదు. దీంతో ప్రజలు నాణ్యాన్ని తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆర్బీఐ రూ.10 నాణెం చెల్లదని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే ఇందుకు ప్రధానకారణం. దీంతో రూ.10 నాణ్యాలతో అక్కడి ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. రూ.10 నాణెంను బ్యాంకులో ఇచ్చి పది నోటును తీసుకుంటున్నారు. దీనిపై స్పందించిన నీలమ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు. ఆర్బీఐ అటువంటి నిర్ణయం ఏం తీసుకోలేదని.. రూ.10 నాణెంను తీసుకోవడానికి తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని పేర్కొన్నారు. ఇప్పటివరకూ దాదాపు 2వేల పది రూపాయిల నాణ్యాలు బ్యాంకుకు వచ్చినట్లు చెప్పారు. నగరంలోని కొద్ది ప్రాంతాల్లో నాణ్యాలను తీసుకుంటున్నా.. టియాగాన్, పాత ఫరీదాబాద్ లలో తీసుకోవడం లేదని తెలిపారు. -
ప్రియురాలికి ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టి...
ఫరిదాబాద్: ప్రియురాలికి ఫేస్ బుక్ లో ఆడియో మెసేస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. 16వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు హర్యానాలోని గుర్గావ్ లో కాల్ సెంటర్ లో టీమ్ మేనేజర్ గా పనిచేస్తున్న అమన్ నాగపాల్ గా గుర్తించారు. తనతో కలిసి పనిచేస్తున్న యువతితో అతడు సహజీవనం చేస్తున్నాడని, ఆమెతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఎస్ఆర్ఎస్ హిల్ వ్యూలో నివసిస్తున్నారని, కొద్దిరోజుల క్రితం ఘర్షణ పడ్డారని చెప్పారు. అమన్ ప్రియురాలు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవడంతో, మానసికంగా అతడు కుంగిపోయాడని వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు అమన్ తన ఆవేదనను రికార్డ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడని చెప్పారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని పోలీసు అధికారి కిమ్తీ లాల్ తెలిపారు. యువతి తండ్రి, పిన్ని, మరో యువకుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ముందస్తు విరమణకూ వర్తింపు
ఓఆర్ఓపీపై ప్రధాని మోదీ స్పష్టీకరణ * ఎంతో కష్టమైనా.. హామీ మేరకు ఓఆర్ఓపీని అమలు చేస్తున్నాం * 40 ఏళ్లుగా ఏమీ చేయని వారు మమ్మల్ని ప్రశ్నిస్తారా? * కాంగ్రెస్‌పై ఫరీదాబాద్ సభలో ధ్వజం ఫరీదాబాద్/న్యూఢిల్లీ: సైనిక బలగాల నుంచి త్వరగా పదవీ విరమణ చేసిన జవాన్లకు కూడా ఒకే ర్యాంకు - ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) వర్తిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓఆర్ఓపీ డిమాండ్‌ను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్న వారికి ఇది వర్తించబోదని రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేర్కొనటంపై.. మాజీ సైనికోద్యోగులు తీవ్రంగా స్పందించారు. శనివారం రాత్రే రక్షణమంత్రిని కలిసిన మాజీ సైనికోద్యోగులు.. సైనిక బలగాల్లో వీఆర్ఎస్ అనేదే లేదన్న తమ వాదనతో మంత్రి ఏకీభవించారని, కాబట్టి నిర్ణీత గడువుకన్నా ముందుగా పదవీ విరమణ చేసిన వారికీ ఓఆర్ఓపీ వర్తిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఆదివారం ఈ అంశంపై స్పందించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో మెట్రో రైలును ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘15-17 ఏళ్ల సర్వీసు అనంతరం ఉద్యోగం నుంచి వైదొలగిన వారికి ఓఆర్ఓపీ రాదని కొందరు భావిస్తున్నారు. నా జవాను సోదరులారా.. హవల్దార్ కానీ, సిపాయి కానీ, నాయక్ కానీ.. దేశానికి భద్రత కల్పించేది మీరు. ఎవరికైనా ఓఆర్ఓపీ వచ్చేట్లయితే.. ముందు మీరే ఉంటారు’ అని పేర్కొన్నారు. ‘యుద్ధం చేస్తూ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయి సైన్యం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిన వారికి ఓఆర్ఓపీ నిరాకరించటం జరుగుతుందా? సాయుధ బలగాలను ప్రేమించే ఒక ప్రధాని అలా ఎన్నడూ కనీసం ఆలోచన కూడా చేయలేడు. అటువంటి వారందరికీ ఓఆర్ఓపీ వస్తుంది. అందుకే.. రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లలో అత్యధిక మొత్తం 15-17 ఏళ్ల సర్వీసు తర్వాత వెళ్లిపోవాల్సి వచ్చిన అటువంటి జవాన్లకు వెళుతుంది’అని చెప్పారు. సాయుధ బలగాల్లో 80-90 శాతం మంది అటువంటి సైనికులే ఉంటారని పేర్కొన్నారు. ఏమీ చేయని వారు ప్రశ్నిస్తారా? తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు లేదని పరోక్షంగా విమర్శిస్తూ.. ఓఆర్ఓపీ 42 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా సైనిక బలగాలకు వట్టి మాటలతో సానుభూతి చూపటం మినహా చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తాను గత ఏడాది మే 26వ తేదీన పదవి స్వీకరించానని, ఈ నిర్ణయాన్ని అమలు చేయటం చాలా కష్టంతో కూడుకున్నదని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం ఓఆర్ఓపీకి రూ. 500 కోట్లే కేటాయించింది. మేం అధికారంలోకి వచ్చినపుడు రూ. 600 కోట్లు లేదా రూ. 700 కోట్లు ఉంటుందనుకున్నాం. కానీ.. కూర్చుని లెక్కవేసినపుడు కొత్త విషయాలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం, అధికారుల్లో అయోమయం నెలకొంది. గత కొన్ని రోజులుగా నేను లెక్కవేయటం మొదలుపెట్టాను. మొత్తం రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల వరకూ ఉండొచ్చని తెలుసుకున్నాను. ఈ అంశం చాలా కష్టమైనది. దీని ప్రభావం ఎలా ఉంటుందో మున్ముందు ఏఏ అంశాలు తలెత్తుతాయో తెలియదు. కానీ.. మేం ఒక హామీ ఇచ్చాం.. దానిని అమలు చేస్తున్నాం’ అనివివరించారు. ‘42 ఏళ్ల పాటు ఏమీ చేయని వారు.. వీఆర్ఎస్ పేరుతో మిమ్మల్ని (సైనికులను) తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్లు రాజకీయంగా పైచేయి సాధించాలని మాత్రమే అనుకుంటున్నారు’ అని కాంగ్రెస్‌ను విమర్శించారు. అలాగే.. ప్రతిపాదిత కమిషన్ గురించి ప్రస్తావిస్తూ.. అదేమీ వేతన సంఘం కాదని.. ఓఆర్ఓపీ అమలులో చిన్నచిన్న మార్పులు ఏమైనా అవసరమా అనేది పరిశీలించేందుకు మాత్రమేనని.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, ఓఆర్ఓపీ అమలులో ఎదురయ్యే చిన్న చిన్న అంశాలను క్రమంగా పరిష్కరిస్తూ వెళ్తామని రక్షణమంత్రి పారికర్ చెప్పారు. అవసరమైన ఆర్థిక అవసరాలన్నింటినీ పూర్తిగా తీరుస్తామని అన్నారు. అయితే..నూటికి నూరు శాతం అంతా తృప్తి చెందలేరని పారికర్ తెలిపారు. ఓఆర్ఓపీని పలచబార్చారు: ఆంటోని యూపీఏ తెచ్చిన ఓఆర్ఓపీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం గణనీయంగా పలచబార్చటంతో పాటు.. దానిపై రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని విమర్శించారు. ఓఆర్ఓపీని 2014 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని యూపీఏ ప్రకటించిందని.. ఆ తేదీతో ప్రకటిస్తే ఆ ఘనత యూపీఏకు వెళుతుందన్న భయంతో జూలై నుంచి అమలు చేసేలా తేదీ మార్చారని ధ్వజమెత్తారు. ఓఆర్ఓపీకి ఎన్ని నిధులైనా ఇస్తామని చెప్పామన్నారు. మాజీ సైనికోద్యోగుల ఆమరణ దీక్ష విరమణ * నాలుగు డిమాండ్లపై ఆందోళన కొనసాగుతుందని వెల్లడి ఓఆర్ఓపీ కోసం గత 85 రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులు ప్రధాని ప్రకటన నేపథ్యంలో నిరవధిక నిరాహారదీక్షను ఆదివారం విరమించారు. ప్రధాని ప్రకటనను స్వాగతిస్తున్నామని.. అయితే మరో నాలుగు అంశాలనూ ప్రభుత్వం అంగీకరించే వరకూ ఆందోళనను కొనసాగిస్తామని రిటైర్డ్ మేజర్ జనరల్ సత్బీర్సింగ్ పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి పెన్షన్‌ను సమీక్షిస్తామనటం తమకు అంగీకారం కాదన్నారు. రెండేళ్లకోసారి సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన జ్యుడీషియల్ కమిషన్‌లో ముగ్గురు మాజీ సైనికోద్యోగులు, ఒక ప్రస్తుత సైనికాధిపతితో పాటు రక్షణశాఖ నుంచి ఒక ప్రతినిధి.. మొత్తం ఐదుగురు సభ్యులు ఉండాలన్నారు. ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వం ప్రకటించినట్లు ఆరు నెలల్లో కాకుండా నెల రోజుల వ్యవధిలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఓఆర్ఓపీ అమలుకు ప్రామాణిక సంవత్సరంగా 2013 క్యాలెండర్ సంవత్సరం కాకుండా.. 2014 మార్చి 31ని నిర్ణయించాలని పట్టుపట్టారు. ప్రభుత్వం క్యాలెండర్ సంవత్సరానికి కట్టుబడి ఉంటే.. డిసెంబర్ 31ని నిర్ణయించాలన్నారు. పెండింగ్ అంశాలను సత్వరం పరిష్కరించాలని ఈ నెల 12న ఢిల్లీలో భారీ స్థాయిలో ‘గౌరవ్ ర్యాలీ’ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే తిరిగి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టంచేశారు. గురుద్వారా నుంచి తెచ్చిన ప్రసాదంతో మాజీసైనికోద్యోగుల ఐక్యవేదిక సభ్యులు నిరశనదీక్ష విరమించారు. మెట్రో రైల్లో మోదీ * ఫరీదాబాద్ మెట్రో ప్రారంభం ఫరీదాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న బదర్పూర్-ఫరీదాబాద్ మెట్రో రైలు కారిడార్‌ను ప్రధాని మోదీ ఆదివారం ఫరీదాబాద్‌లో ప్రారంభించారు. ఈ మార్గం దేశ రాజధాని ఢిల్లీని హరియాణాలోని ఫరీదాబాద్‌తో కలుపుతుంది. మెట్రో ప్రారంభం కోసం ప్రధాని ఢిల్లీలోని జనపథ్ స్టేషన్ నుంచి మెట్రో వెలైట్ లైన్ రైల్లో ఫరీదాబాద్‌లోని బాటా స్టేషన్‌కు చేరుకున్నారు. షెడ్యూలు ప్రకారం హెలికాప్టర్లో వెళ్లాల్సిన ప్రధాని రైల్లో ప్రయాణించడంతో ప్రయాణికులు, అధికారులు ఆశ్చర్యపోయారు. మోదీ ప్రయాణికులతో ముచ్చటించారు. వారి కోరికపై సెల్ఫీ ఫొటోలు కూడా దిగారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, వీరేందర్ సింగ్, రావ్ ఇందర్జిత్ సింగ్, ఢిల్లీ మెట్రో చీఫ్ మంగు సింగ్ ప్రయాణించారు. మెట్రో ప్రారంభం తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ కొత్త కారిడార్ వల్ల కీలక పారిశ్రామిక ప్రాంతమైన ఫరీదాబాద్‌లో ఢిల్లీ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. మెట్రో కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదని, ఆర్థిక ప్రగతికి కూడా అవకాశం కల్పిస్తుందని అన్నారు. 14 కిలోమీటర్ల బదర్పూర్-ఫరీదాబాద్ కారిడార్‌ను రూ. 2,500 కోట్లతో నిర్మించారని, దీన్ని బల్లభ్‌గఢ్‌కు పొడిగించేందుకు మరో రూ. 400 కోట్లు ఖర్చు పెట్టనున్నామని తెలిపారు. సభలో వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్ నిర్మాణంతో ఢిల్లీ మెట్రోలో 200 కి.మీ పూర్తయిందని తెలిపారు. 9 స్టేషన్ల గుండా వె ళ్లే ఈ మార్గం దాదాపు ఫరీదాబాద్‌లోని అన్ని ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో రోజూ 2 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారుల అంచనా. -
సోదరుడే కీచకుడు
ఫరీదాబాద్: మైనర్ బాలిక పాలిట సోదరుడే కీచకుడైన దారుణ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని శాంతనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సోదరుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి చనిపోవడంతో ఏడేళ్ల నుంచి బాధితురాలు సోదరుడితో కలిసి ఉంటోంది. తోడబుట్టిందన్న విచక్షణ కూడా లేకుండా పలుమార్లు సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆమెను భయపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
విచ్చలవిడిగా బాణసంచా దుకాణాలు
గుర్గావ్: ఫరీదాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాణసంచా మార్కెట్లో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం ఘటన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటుచేస్తే ఏమి జరుగుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయినప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాల్లో అనుమతి లేకుండా అనేక బాణసంచా విక్రయ దుకాణాలు వెలిశాయి. వాస్తవానికి నగరంలోని ఐదు ప్రాంతాల్లో మాత్రమే వీటి విక్రయానికి గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) అనుమతి ఇచ్చింది. లీజర్ వ్యాలీ గ్రౌండ్స్, సెక్టార్ -5 హుడా గ్రౌండ్స్, గౌశాల మైదానం, తావ్దేవి లాల్పార్కు, పటౌడీ ప్రాంతంలోని రాంలీలా మైదానంలో మాత్రమే బాణసంచాను విక్రయించేందుకు అనుమతించారు. అయినప్పటికీ నగరంలో విచ్చలవిడిగా దుకాణాలు వెలిశాయి. లీజర్ వ్యాలీ గ్రౌండ్స్‌లో 350 దుకాణాలు వెలిశాయి. ఇదిలాఉంచితే కాగా ఢిల్లీకి సరిహద్దులోని ఫరీదాబాద్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో 230కి పైగా బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతైన సంగతి విదితమే. ఇక్కడి దసరా మైదానంలో ప్రతిఏటా దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దాదాపు 200 దుకాణాలకు లెసైన్సులు ఇచ్చామని అగ్ని మాపక శాఖ అధికారి రామ్ మెహర్ చెప్పారు. కొంతమంది దుకాణాలను అలంకరించుకుంటుండగా, మరి కొందరు బాణసంచాను రవాణా చేస్తున్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటనలో కొన్ని ప్రైవేటు వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయని చెప్పారు. -
బాణసంచా పేలుడు : 200 దుకాణాలు దగ్ధం
-
200 బాణాసంచా దుకాణాలు దగ్ధం
న్యూఢిల్లీ: హర్యానాలోని ఫరీదాబాద్ లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో దాదాపు 200 బాణాసంచా దుకాణాలు దగ్ధమయ్యాయి. దశారా మార్కెట్ లోని ఓ మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల్లో బాణాసంచా పూర్తి తగలబడిపోయింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో మంటలు ఎగిసిపడుతున్నాయి. కరెంట్ స్తంభాలు కాలిపోయాయి. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. 18 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపుచేస్తున్నారు. ప్రాణనష్టం సంభవించినట్టు సమాచారం లేదు. కోనుగోలుదారుల వాహనాలు మంటల్లో తగలబడిపోయినట్టు సమాచారం. అయితే ఎంత మేర ఆస్తి నష్టం సంభవించిందనేది మంటలు అదుపులోకి వచ్చాక గాని తెలియదు. -
యమునపై భారీ వారధి
నోయిడా: ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ మధ్య రాకపోకలు సాగించేవారి కష్టాలు ఇక తీరనున్నాయి. యమునానదిపై నిర్మించనున్న ఆరులేన్ల వారధి నిర్మాణ పనులు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓఖ్లా బ్యారేజీకి సమాంతరంగా ఈ వంతెనను నిర్మిస్తారు. 574 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయితే కాళిందీకుంజ్ వంతెనపై ట్రాఫిక్ భారీగా తగ్గే అవకాశముంటుంది. ఢిల్లీ నుంచి నోయిడా, ఫరీదాబాద్‌ల మధ్య రాకపోకలు సాగించేవారికి ప్రస్తుతం కాళిందీకుంజ్ వంతెన మాత్రమే మార్గం. నూతనంగా నిర్మిస్తున్న వంతెన అందుబాటులోకి వస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చినట్లే. కాళిందీకుంజ్ వంతెనపై ప్రస్తుతం రోజుకు 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తవంతెనతో వాహనాల సంఖ్య సగానికిపైగా తగ్గే అవకాశముంటుందని చెబుతున్నారు. నోయిడా అథారిటీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం... ఈ నూతన వంతెన నిర్మాణానికి రూ. 139 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదట ఈ వంతెన నిర్మాణ పనులను ఫిబ్రవరిలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అనేక కారణాలవల్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు వారం రోజుల్లో పనులు పూర్తిచేసి, రెండేళ్లలో వంతెనను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 17.3 మీటర్ల వెడల్పు, 574 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ వంతెన కోసం 15 పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి పిల్లర్ మధ్య 41 మీటర్ల దూరం ఉండేలా చూస్తారు. ఈ వంతెనపై ఆరులేన్ల రహదారిని ఏర్పాటు చేసుకోవచ్చు. పాదచారుల కోసం కూడా ప్రత్యేక ఫుట్‌పాత్ నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుంది. మెట్రో ట్రాక్‌కు 40 మీటర్ల దూరంలోనే ఈ వంతెన ఉంటుంది. ప్రస్తుతం మెట్రో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. బొటానికల్ గార్డెన్, కాళిందీకుంజ్ మధ్య ఈ మెట్రో వంతెన నిర్మిస్తున్నారు. నిజానికి ఈ వంతెన నిర్మాణం కోసం రెండేళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నోయిడా అథారిటీకి, నోయిడా టోల్ బ్రిడ్జి కంపెనీ లిమిటెడ్‌కు మధ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. నిర్మాణం, నిర్వహణ పద్ధతిలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. -
హర్యానాలో కేజ్రీవాల్ రోడ్ షో
-
ఢిల్లీ బాలికపై ఎనిమిది మంది అత్యాచారం
ఫరీదాబాద్: ఢిల్లీకి చెందిన ఓ బాలికను ఎనిమిదిమంది దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధితురాలు తన స్నేహితుడిని కలిసేందుకు ఫరీదాబాద్‌కు వచ్చింది. బల్లాభ్‌గఢ్ బస్టాండ్‌లో ఆమె బస్సు కోసం వేచియుండగా, గమ్యస్థానానికి చేరుస్తామంటూ ఐదుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. మరో ముగ్గురు వారితో జతకలిశారు. ఎనిమిది మంది కలసి బాలికను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని బస్టాండ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురి నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఫరీదాబాద్-ఢిల్లీ ప్రయాణం మరింత సుగమం
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రోరైలు ప్రయాణికులకు కొత్త సంవత్సరం సరికొత్త సదుపాయాలతో స్వాగతం పలకనుంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే మెట్రోప్రాజెక్ట్లతో ఫరీదాబాద్-ఢిల్లీ ప్రయాణం మరింత సుగుమమం కానుంది. ఏడాది ప్రారంభంలో కేంద్రీ య సచివాలయం నుంచి మండీహౌస్ మధ్య మెట్రో సేవలు అందుబాటులో రానున్నాయి. ఏడా ది మధ్యలో బాదర్పూర్-ఫరీదాబాద్ మధ్య మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే లక్షలాది మంది మెట్రో ప్రయాణికులు ఎంతో మేలు కలగనుంది. అదే సమయంలో రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌పై భారం తగ్గుతుంది. మండీహౌస్ స్టేషన్‌ను ఇంటర్చేంజ్ పాయింట్‌గా మారుస్తుండడంతో యెల్లోలైన్ నుంచి బ్లూలైన్కి ప్రయాణించే వాళ్లు నేరుగా వెళ్లవచ్చు. దీంతో రాజీవ్ చౌక్ స్టేషన్లో కాస్త రద్దీ తగ్గనుంది. డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ పేర్కొన్న ప్రకారం.. మండీహౌస్-సెంట్రల్ సెక్రెటేరియట్ మధ్య ట్రయల్న్‌న్రు డిసెంబర్ 30 వరకు పూర్తి చేయనున్నారు. మార్చి వరకు ఈ లైన్లో పూర్తిస్థాయిలో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి తెస్తామన్నా రు. ఇదే ఏడాది జూన్-జూలై వరకు బాదర్పూర్-ఫరీదాబాద్ మధ్య మెట్రోసేవలు ప్రారంభం కానున్నాయి. ఒక్కసారి మారితే చాలు... ఈ లైన్లలో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తే నోయిడా, ఆనంద్‌విహార్-ద్వారక, ఫరిదాబాద్ బాదర్పూర్ రూట్లో ప్రయాణికులు మండీహౌస్లో మారితే సరిపోతుంది. ఇప్పటి వరకు కేంద్రీయ సచివాలయం మెట్రోస్టేషన్ నుంచి రాజీవ్చౌక్కి వచ్చి అక్కడి నుంచి మెట్రోరైలు మారాల్సి వచ్చేది. ఇందుకోసం 7 నుంచి 10 నిమిషాల సమయం వృథా అయ్యేది. రాజీవ్చౌక్పై తగ్గనున్న రద్దీ... డీఎంఆర్సీ అధికారులు చెబుతున్న ప్రకారం ఫరీదాబాద్-మండీహౌస్ రూట్లను కలిపే రాజీవ్‌చౌక్ స్టేషన్‌తో కలపడంతో రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌పై 20 శాతం రద్దీ తగ్గనుంది. ప్రయాణికులు నేరుగా మండీహౌస్ మెట్రోస్టేషన్‌కు చేరుకోవచ్చు. మండీహౌస్-కశ్మీరీగేట్ మధ్య మెట్రోసేవలు అందుబాటులోకి వస్తే రాజీవ్‌చౌక్ స్టేషన్ రద్దీ మరో 40 శాతం తగ్గుతుంది. -
అసభ్యకర వీడియోతో బ్లాక్ మెయిలింగ్: పోలీసులకు మహిళ ఫిర్యాదు
ఫరిదాబాద్: ఓ మహిళను బలవంతంగా అనుభవించబమే కాకుండా, ఆ సన్నివేశాలను వీడియోలో బంధించి ఓ యువకుడు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఘటనపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడు సంవత్సరాల కూతురితో న్యూ రంజిత్ నగర్ లో ఒంటరిగా ఉంటున్న మహిళకు గోపీచంద్ అనే వ్యక్తి పరిచయమైయ్యాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించడంతో ఆ మహిళ చత్తర్‌పూర్‌లోని ఓ ఫాంహౌస్‌లో పని చేస్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తనతో చనువుగా ఉండటం మొదలు పెట్టిన గోపీచంద్ పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు. అతనికి అప్పటికే పెళ్లి కావడంతో తాను వ్యతిరేకించినట్లు ఆ మహిళ పేర్కొంది. కాగా, ఓ హోటల్ లో జరిగిన పార్టీలో కూల్‌డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి తనను బలవంతంగా అనుభవించాడని, అప్పడు తీసిన వీడియో చూసి తరుచు వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నడని పేర్కొంది.ఆ మహిళ ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎన్‌పీటీఐ ఆఫర్ చేస్తున్న కోర్సులేవి?
బీమా (Insurance) సంబంధిత కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలపగలరు? - శశాంక్, నిర్మల్. చాలా సంస్థలు బీమాకు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. బీమా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలపై ఈ కోర్సులు దృష్టిసారిస్తున్నాయి. యాక్చూరియల్ సైన్స్.. బీమా వ్యాపారానికి ఆధారమైనది. ఇది ఇన్సూరెన్స్ రిస్క్స్, ప్రీమియంలకు సంబంధించిన గణాంకాలను వివరిస్తుంది. బీమా పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికల విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు యాక్చూరియల్ సైన్స్ ఉపయోగపడుతుంది. కోర్సుల వివరాలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, హైదరాబాద్.. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌ల్లో ది ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది. ఏ గ్రూపులోనైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారితో పాటు సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు. ఈ సంస్థ యాక్చూరియల్ సైన్స్‌లో పీజీ డిప్లొమాను కూడా అందుబాటులో ఉంచింది. వెబ్సైట్: www.iirmworld.org.in యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.. ఎంఎస్సీ యాక్చూరియల్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో చేరేందుకు మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. వెబ్సైట్: www.unom.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్.. ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.ipeindia.org అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ యాక్చూరియల్ సైన్స్, నోయిడా.. ఎంబీఏ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. వెబ్సైట్: www.amity.edu కెరీర్: కోర్సులు పూర్తిచేసిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కంపెనీలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టన్సీలు తదితరాల్లో అవకాశాలుంటాయి. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సులేవి? - శ్రీకాంత్, కాకినాడ. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ), ఫరీదాబాద్.. విద్యుత్ రంగంలో శిక్షణ, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి దేశంలో అత్యున్నత సంస్థ. కోర్సుల వివరాలు: బీటెక్/బీఈ (పవర్ ఇంజనీరింగ్): కోర్సులో ప్రవేశానికి 10+2 పూర్తిచేసి ఉండాలి. ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా పూర్తిచేసిన వారికి ఆరు సీట్లు కేటాయించారు. వీరికి గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ ద్వారా నేరుగా కోర్సు మూడో సెమిస్టర్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ (పవర్ మేనేజ్మెంట్): కోర్సులో ప్రవేశానికి బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)ను 60 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి. క్యాట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌పీటీఐ- ఇతర కోర్సులు: పీజీ డిప్లొమా- థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్; పీజీ డిప్లొమా ఇంజనీర్స్ కోర్సు-హైడ్రో; పోస్ట్ డిప్లొమా కోర్సు-థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్; సర్టిఫికెట్ కోర్సు-పవర్ డిస్ట్రిబ్యూషన్. వెబ్సైట్: www.npti.in నాకు పక్షులంటే ఆసక్తి. ఆర్నిథాలజిస్ట్ కెరీర్‌ను ఎంపిక చేసుకుందామనుకుంటున్నాను.. వివరాలు తెలియజేయండి? - శ్రవణ్, నిజామాబాద్. ఆర్నిథాలజీ.. పక్షుల ప్రవర్తన, వర్గీకరణ, ఫిజియాలజీ, ఎకాలజీ వంటి అంశాలను వివరిస్తుంది. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకుంటే బయాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ బయాలజీ, జువాలజీ వంటి కోర్సులు చేసుండాలి. అకడమిక్ అర్హతలతో పాటు పక్షులపై అమితమైన ప్రేమ, ఎక్కువ గంటల పాటు పనిచేయగల ఓర్పు, పరిశోధనలపై ఆసక్తి, ఆత్మ ప్రేరణ అవసరం. కోర్సులు: సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ, తమిళనాడు.. ఆర్నిథాలజీలో పరిశోధనలు చేస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్థాయిలో ఆర్నిథాలజీ, నేచురల్ హిస్టరీ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.sacon.in కెరీర్: కోర్సులు పూర్తిచేసిన వారికి జంతు ప్రదర్శనశాలలు, శాంక్చురీలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. వైల్డ్‌లైఫ్ బయాలజిస్టులు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేటర్స్, ఎకాలజిస్టులు వంటి హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పీజీ స్థాయిలో సోషియాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - క్రాంతి, విజయవాడ వివిధ వృత్తుల్లో ప్రవేశించేందుకు లిబరల్ ఆర్ట్స్ కోర్సులు దారి చూపుతాయి. సోషియాలజీ అనేది లిబరల్ ఆర్ట్స్‌కు చెందిన ఒక సబ్జెక్టు. ఇది సామాజిక జీవితంలో మనుషుల ప్రవర్తనను వివరిస్తుంది. సమాజంలో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ నిర్మాణానికి, నిర్వహణకు ప్రాధాన్యమిస్తుంది. కోర్సుల వివరాలు: ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఏ-సోషియాలజీ కోర్సును అందిస్తోంది. అర్హత: బీఏ/బీఎస్సీ/బీకాంను 40 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఎంఏ సోషియాలజీని ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఏ/బీకాం/బీఎస్సీ/బీఎస్సీ హోంసైన్స్/బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ నర్సింగ్/ బీబీఎం/ బీసీఏ లేదా బీఏఎల్. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఎంఏ సోషియాలజీని అందిస్తోంది. అర్హత: గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.svuniversity.ac.in కెరీర్: కోర్సులు పూర్తిచేసిన వారికి అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, పబ్లిషింగ్, జర్నలిజం వంటి రంగాల్లో అవకాశాలుంటాయి. విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ -
డెంగీతో నగరాలు విలవిల
చండీఘఢ్: హర్యానా రాష్ర్టంలో అనేక నగరాల్లో డెంగీ వ్యాధి వ్యాపించి ప్రజలను భయకంపితులను చేస్తోంది. కర్నల్, గుర్గావ్, ఫరీదాబాద్ నగరాల్లో ఈ వ్యాధి సోకి ఇప్పటివరకు ఒక చనిపోగా, 291 మంది వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకా 1500కు పైగా వ్యాధి సోకినవారు ఉండొచ్చని అంచనా. వ్యాధిని నిరోధించడంలో ఆరోగ్యశాఖ సరైన రీతిలో స్పందించకపోవడంతో డెంగీ అన్ని నగరాలకు పాకిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్నల్ నగరంలో డెంగీ మృతి కేసు నమోదైంది. వ్యాధి సోకిన వారికి సత్వర చికిత్స అందించేందుకు, ప్లేట్లెట్లను వేరుచేసేందుకు అవసరమైన పరికరాలు ప్రభుత్వ ఆస్పత్రిలో లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారుతోంది. ఒకవేళ ఎవరైనా రోగిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పిస్తే, వారికి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ రోగుల నుంచి అధికమొత్తంలో ఫీజులను వసూలుచేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన 291 డెంగీ కేసుల్లో గుర్గావ్ నుంచి 158, ఫరీదాబాద్ నుంచి 58 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 30 కేసులు కర్నాల్ నగరం నుంచి నమోదు కాగా, వారిలో ఒకరు చనిపోయారు. అనుమానిత కేసుల్లో గుర్గావ్ నుంచి 1000కి పైగా రోగులుండగా, ఫరీదాబాద్‌లో 200మంది, మిగిలినవారు కర్నల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులను మినహాయిస్తే, రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(పీడీఐఎంఎస్)లో మాత్రమే ప్లేట్లెట్లను వేరుచేసే సదుపాయం ఉంది. రోగుల ప్లేట్లెట్ కౌంట్ కోసం పీజీఐఎంఈఆర్, చండీఘఢ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలపైనే హర్యానా ఆధారపడుతోంది. ఇదిలా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధిపై అవగాహన శిబిరాలను నిర్వహించడంలో ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారని, అందువల్లే వ్యాధి త్వరగా వృద్ధి చెందుతోందని నివాస సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. హర్యానా ఆరోగ్య సేవల (మలేరియా) డెరైక్టర్ డాక్టర్ కమలా సింగ్ మాట్లాడుతూ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ను వేరుచేసే పరికరాలు లేని మాట వాస్తవమేనన్నారు. సివిల్ సర్జన్లందరూ గుర్గావ్, ఫరీదాబాద్, కర్నల్లలో డెంగీ వ్యాధి పీడితులకు సరైన చికిత్స అందించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ఘజియాబాద్‌లో మరో ఆరు డెంగీ కేసులు ఘజియాబాద్: నగరంలో గురువారం ఆరు డెంగీ కేసులను గుర్తించినట్లు ఘజియాబాద్ జిల్లా అధికారులు తెలిపారు. ఘజియాబాద్ ముఖ్య ఆరోగ్య అధికారి అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ ఇటీవల 64 మంది డెంగీ అనుమానిత రోగులనుంచి నమూనాలను సేకరించాం.. వారిలో ఆరుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచొద్దు: ఢిల్లీవాసులకు కేంద్ర మంత్రి ఆజాద్ పిలుపు డెంగీ తీవ్రతను తగ్గించేందుకు తమ ఇళ్లల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గురువారం కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ ఢిల్లీవాసులకు సూచించారు. ప్రజల సమష్టి కృషితోనే డెంగీ వ్యాధి నిర్మూలన సాధ్యమని ఆయన అన్నారు. గురువారం ఆయన ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఏకే వాలియా, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిలో దోమల గుడ్ల వృద్ధికి ఆస్కారముంటుంద న్నారు. ఇళ్లల్లోని వాటర్ ట్యాంకులు, కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసినప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. డెంగీ నియంత్రణలో మున్సిపాలిటీల వైఫల్యం: సీఎం షీలా న్యూఢిల్లీ: నగరంలో నానాటికి విజృంభిస్తున్న డెంగీ వ్యాధిని నిరోధించడంలో స్థానిక మున్సిపల్ పాలకవర్గాలు విఫలమయ్యాయని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆరోపించారు. గురువారం ఆమె మాట్లాడుతూ నగరంలోని మూడు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడంలేదని, దాంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని విమర్శించారు. ఉత్తర ఢిల్లీలోని కంజన్వాలాలో తొమ్మిదో ఈ-సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం డెంగీ కేసుల నిర్వహణలో ఆస్పత్రులకు కావాల్సిన వనరులను కల్పిస్తోందన్నారు. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో 700 డెంగీ బెడ్లను, ప్లేట్లెట్ కొరతను తీర్చేందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది’ అని షీలా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,567 కేసులు నమోదవ్వగా, ఇదే నెలలో గత ఏడాది 52, 2011లో 172 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆమె గుర్తు చేశారు.