వైద్య విధానంలో అత్యంత క్లిష్టమైన రెండు చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్స ఇద్దరూ వ్యక్తులకు ఏకకాలంలో తొలిసారిగా విజయవంతమయ్యింది. ఇక్కడ అన్నింట్లకంటే షాకింగ్ ట్వీస్ట్ ఏంటంటే ఈ శస్త్ర చికిత్స ఓ కిడ్నీ మార్పిడి పేషెంట్‌కి కూడా జరగడం. ఇలా కిడ్నీ మార్పిడి చేయించుక్నున వ్యక్తికి సంక్లిష్టమైన ఈ చేయి మార్పిడి శస్తచికిత్స జరగడం దేశలోనే తొలిసారి కూడా. ఈ షాకింగ్ ఘటనలు ఎక్కడ జరిగాయంటే..
ఇద్దరు మగ రోగులకు హర్యానాలో ఫరిదాబాద్‌లోని అమృత హాస్పిటల్‌లో విజయవంతంగా ఈ చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ముందుగా ఉత్తర భారతదేశానికి చెందిన 65 ఏళ గౌతమ్ తాయల్‌కు ఈ సంక్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అయితే అనుకోకుండా గత రెండేళ్ల క్రితం ఓ పారిశ్రామిక ప్రమాదంలో మణికట్టుపై వరకు ఎడమ చేతిని కోల్పోయారు. అయితే అతనికి బ్రెయిన్ డెడ్ అయిన థానేకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేయిని మార్పిడి చేశారు.
ఒక కిడ్నీ మార్పిడి రోగికి ఇలాంటి శస్త్ర చికిత్స జరగడం దేశంలో మొట్టమొదటిది. వైద్యశాస్త్రంలో ఇదొక అరుదైన ఘట్టం కూడా. ఇలా ట్రాన్సప్లాంట్ చేయడానికి రెండు ఎముకలు, రెండు ధమనులు, సుమారు 25 స్నాయువులు, 5 నరాలను కలపాల్సి ఉంటుందని వైద్యుడు మోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. ఈ చికిత్స అనంతరం రోగి మంచిగానే కోలుకుంటున్నట్లు తెలిపారు. అతని కొత్త చేతిలో కూడా కదలికలు మొదలయ్యాయని చెప్పారు. జస్ట్ ఒక్క వారంలోనే డిశ్చార్జ్ అవుతాడని అన్నారు. ఇక మరో హ్యాండ్ ట్యాన్స్‌ప్లాంటేషన్ ఢిల్లీకి చెందిన దేవాన్ష్ గుప్త అనే 19 ఏళ్ల వ్యక్తికి జరిగింది.
మూడేళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులు మోకాలి పైభాగం వరకు పోయాయి. కుడి చేయి మోచేయి పైభాగం వరకు పోగా, ఎడమ చేయి మోచేయి కొంచెం కింద స్థాయి వరకు పోయింది. అయితే ఈ వ్యక్తికి ఫరీదాబాద్‌లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయిన సూరత్ అనే 33 ఏళ్ల వ్యక్తి చేతులను మార్పిడి చేశారు. ఇక ఈ విచ్ఛేదనం స్థాయిని బట్టి ఈ ఆపరేషన్ అంత క్రిటికల్‌గా ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు.
ఈ సర్జరీ తర్వాత దేవాన్ష్ పరిస్థితి కూడా మెరుగుపడిందని, పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే మోచేయి పైవరకు పోయిన కోల్పోయిన చేతి శస్త్ర చికిత్సలో కాస్త సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే గుప్తా పురోగతి కూడా బాగుందని, అవసరమనుకుంటే తదుపరి చేతి మార్పిడికి సంబంధించిన కొన్ని చికిత్సలు రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సదరు పేషంట్లు గౌతమ్ తాయల్, దేవాన్ష్ గుప్తా ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ మార్పిడి తమకు రెండో అవకాశం అని, పైగా జీవితంలో కొత్త ఆశలు అందించిందని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలతో వైద్య విధానం మరింత అభివృద్ధిని సాధించింది. అంతేగాదు ఈ శస్త్ర చికిత్స భవిష్యత్తులో ఇలా అవయవాల కోల్పోయిన వారిలో కొత్త ఆశను అందించేలా ధైర్యంగా జీవించేలా చేయగలుగుతుంది.
(చదవండి: మా పాపకు పీరియడ్స్ ఇంకా రాలేదు! కానీ ఆమెకు అలా అవుతోంది..)
Comments
Please login to add a commentAdd a comment