hand
-
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’
గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్‌భవన్‌లో లోక్స్వరాజ్ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు.. .. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై ప్రస్తావిస్తూ.. లోక్‌సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. -
HousewifeDermatitis గురించి విన్నారా? చలి చేతికి చిక్కొద్దు!
ఈ చర్మవ్యాధిని గృహిణులకు వచ్చే సమస్యగా ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇంటి గచ్చును శుభ్రం చేస్తుండటం, బట్టలు ఉతికే సమయంలో సబ్బు (డిటెర్జెంట్) వీళ్ల చేతుల్ని ప్రభావితం చేస్తుండటం, ఇంటిపనుల్లో ఇంకవైనా రసాయనాలు తగిలి చేతులు ఇరిటేషన్‌కు లోనవ్వడం వంటివి జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ‘హౌజ్ వైఫ్ డర్మౖటెటిస్’ అంటారు. దాంతోపాటు చెయ్యిపై దుష్ప్రభావాలు పడతాయి కాబట్టి దీన్ని ‘హ్యాండ్ ఎక్సిమా’, ‘హ్యాండ్ డర్మటైటిస్’ అని కూడా అంటారు. నిజానికి ఇది కేవలం గృహిణులనే కాకుండా పలు రకాల రసాయనాలు వాడే వృత్తుల్లో ఉండే వారందరికీ వస్తుంది. ముఖ్యంగా శుభ్రం చేసే వృత్తుల్లో ఉన్నవారూ, కేటరింగ్, బ్యూటీ కేర్ సెలూన్లలో హెయిర్ డ్రస్సింగ్ చేసేవారూ, హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఉన్నవారు... వీళ్లంతా ఏదో ఒక డిటర్జెంట్ లేదా రసాయనం చేతుల్లోకి తీసుకొని పనిచేస్తుంటారు కాబట్టి వీళ్లందరినీ ఈ ఎగ్జిమా లేదా డర్మటైటిస్ ప్రభావం చూపుతుంది. పైగా చలి పెరిగే ఈ సీజన్లో ఇది మరింత బాధిస్తుంటుంది. మహిళలను ఎక్కువగా బాధించే ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ వింటర్ సీజన్లో మామూలుగానే చర్మం పొడిబారడం ఎక్కువ. దీనికి తోడు రసాయనాలూ చేతులపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య మరింతగా అరచేతులూ, చేతివేళ్లూ, గోళ్ల చుట్టూ ఉండే చర్మం (పెరీ ఉంగ్యువల్) ప్రభావితమయ్యే భాగాల్లో ఈ సమస్య తీవ్రంగా మారినప్పుడు అక్కడ నీటిపొక్కుల్లా రావడాన్ని పామ్ఫాలిక్స్’ అని అంటారు. ఒక్కోసారి కొందరిలో ఈ సమస్య అనువంశీకంగానూ కనిపిస్తుంది. తమ సొంత వ్యాధి నిరోధక శక్తే తమ చర్మాన్ని దెబ్బతీయడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని అలర్జిక్ రియాక్షన్స్, ఆహారం వల్ల కలిగే అలర్జీలు, చాలాసేపు నీళ్లలో ఉండటం వంటి అంశాలూ దీన్ని మరింత పెచ్చరిల్లేలా చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఇన్ఫెక్షన్లా కూడా మారి మరింత ఇబ్బంది కలిగించే అవకాశముంది. నివారణ / మేనేజ్మెంట్ / చికిత్స... ఇంటి పనులు అయిన వెంటనే ఘాటైన సువాసనలు లేని మంచి క్లెన్సర్‌ను గోరు వెచ్చని నీటిలో వేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఇందుకు వేడి నీళ్లు ఉపయోగించకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్లే వాడాలి). ఇక క్లెన్సర్‌ను ఎంపిక చేసే విషయంలో వాటిల్లో ఘాటైన లేదా చేతికి హానిచేసే తీవ్రమైన రసాయన సాల్వెంట్స్ లేకుండా జాగ్రత్తపడాలి. ∙చేతులకు ఈ సమస్యను తెచ్చిపెట్టే డిటర్జెంట్లు / రసాయనాలు కలిపిన నీళ్లు... వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం లేదా తప్పనప్పుడు ఈ ఎక్స్పోజర్ వ్యవధిని వీలైనంతగా తగ్గించడం. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్‌ను పాటించడం). ఇందుకోసం ఘాటైన సబ్బులను కాకుండా గ్లిజరిన్, ఆల్కహాల్ బేస్డ్ మైల్డ్ శానిటైజర్లు వాడటం. (కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)ఇల్లు శుభ్రం చేసే సమయంలో లేదా ఇంటి పనులప్పుడు శుభ్రమైన కాటన్ గ్లౌజ్ వాడటం. ఇంటికి సంబంధించిన కాస్తంత మురికి పనులు (డ్రైయిన్లు శుభ్రం చేయడం వంటివి) చేసేటప్పుడూ గ్లౌజ్ ధరించడం. చర్మ సంరక్షణ కోసం వాడే వాసన లేని ఎమోలియెంట్స్ (చేతులకు హాయిగొలిపే లేపనాల వంటివి) వాడటం. అరచేతులు, చేతివేళ్లు తేమ కోల్పోకుండా ఉండేందుకు చేతికి కొబ్బరి నూనె లేదా చేతులు తేమ కోల్పోకుండా చేసే ఆయింట్మెంట్స్ / క్రీమ్స్ వాడటం. చేతులకు తగిలే చిన్న చిన్న దెబ్బలు, గీరుకుపోవడం వంటి వాటినీ నిర్లక్ష్యం చేయకుండా వాటికి తగిన బ్యాండ్ఎయిడ్ వంటివి వేయడం. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా ఇంకా చేతులు పొడిబారిబోయి, చర్మం లేస్తుండటం, పొట్టురాలుతుండటం, పగుళ్లు వస్తుండటం జరుగుతుంటే డర్మటాలజిస్టుకు చూపించాలి. వారు తగిన పూతమందులు, ఇతరత్రా చికిత్సలతో సమస్యను తగ్గిస్తారు. లక్షణాలు... చేతులపై చర్మం బాగా పొడిగా మారడం, ఇంతగా పొడిబారడంతో పొట్టు లేస్తుండటం చేతివేళ్లపై పగుళ్లు, ఈ పగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న పుండ్లలా మారడం (బ్లిస్టర్స్) చర్మం ఊడిపోతూ ఉండటం , చర్మం ఎర్రబారడం ఒక రకమైన నొప్పితో కూడిన ఇబ్బంది. -డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్ -
తెగిన చేతిని అతికించిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన చేయి గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అపోలో ఆస్పత్రికి రోగి.. 8 గంటల పాటు శ్రమించి అతికించిన వైద్య బృందం సాక్షి, హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో పూర్తిగా తెగిపడిపోయిన చేయిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్తి వైద్యులు విజయవంతంగా అతికించారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట)సమయం దాటిపోయిన తర్వాత కూడా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించటం గమనార్హం. మంచిర్యాలకు చెందిన పవన్‌కుమార్ అనే వ్యక్తి అక్టోబర్ 11న బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగి మోచేయి పై భాగంవరకు తెగి పడిపోయింది. తెగిన చేయిని ఓ కవర్లో చుట్టి అతడిని హుటాహుటిన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రిఫర్ చేశారు. పవన్‌కుమార్‌ను హైదరాబాద్‌కు తరలించే సమయానికి అప్పటికే గోల్డెన్ అవర్ కూడా దాటిపోయింది. అయినప్పటికీ 8 గంటల పాటు శ్రమించి క్లిష్టమైన మైక్రోవ్యాసు్కలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి చేయిని తిరిగి అతికించారు. సాధారణంగా వేలు కానీ, చిన్న అవయవం కానీ తెగిపడిపోతే సులువుగానే అతికించవచ్చని, పూర్తి చేయిని అతికించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స వివరాలను బుధవారం మీడియా సమావేశంలో అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి వెల్లడించారు. 26 రోజుల్లోనే పవన్ కోలుకున్నాడని తెలిపారు. అతికించిన చేయి వేళ్లు తిరిగి పనిచేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, ఇందుకోసం మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తెగిన వెంటనే జాగ్రత్త చేయాలి తెగిపోయిన శరీర భాగాలను అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి అన్నారు. తెగిపోయిన శరీర భాగాలను నీటితో కడిగి, పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్లో ఉంచాలని తెలిపారు. ఆ కవర్‌ను ఐస్ప్యాక్లో పెట్టి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అయితే నేరుగా ఐస్‌లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదని వివరించారు. పుట్టుకతో లోపాలు, విరిగిపోయిన చేతులు, పక్షవాతం వంటి వ్యాధుల కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వారి భాగాలను అతికించే అవకాశం ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ బాబు, శస్త్ర చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ గురుప్రసాద్ (ప్లాస్టిక్ సర్జన్), డాక్టర్ వివేక్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శరణ్య (అనస్తీషియా) తదితరులు పాల్గొన్నారు. -
చేతులు కడుక్కుందాం..ఆరోగ్యంగా ఉందాం..!
Global Handwashing Day 2024: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్) అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి గాను దీన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలిసి 2008లో ‘గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ పార్ట్నర్షిప్ సముదాయంగా రూపొందాయి. ఆనాటి నుంచి దాదాపు 100కు పైగా దేశాల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్కూళ్లు, ప్రైవేటు సంస్థలు ఈ రోజున చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ ఏడాది థీమ్ : ‘‘శుభ్రమైన చేతులు ఎందుకు అవసరమంటే’’? ఈ పొరబాట్లు చేయకండి... చేతులు కడుక్కోవడం అందరికీ తెలిసిన విద్యే. ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేమీ లేవు. రెండుమూడేళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు మందులూ, మాకులూ, వ్యాక్సిన్ల కంటే ముందుగా అందరి ప్రాణాలు రక్షించింది ఈ చేతులు కడుక్కోవడమనే పనే. చేతులు కడుక్కోవడంలో చేసే కొన్ని పొరబాట్లను సరిదిద్దుకోవడమెలాగో చూద్దాం.సబ్బును మరవకండి: వాష్ బేసిన్లో నల్లా / కొళాయి కింద చేతులుంచినా చేతులు కడుక్కున్నట్టే. కానీ హానికరమైన మురికి అంతా తొలగి΄ోవాలంటే సబ్బును వాడాల్సిందే. మొక్కుబడిగా వద్దు: చేతులు కడిగేదే మురికినంతా శుభ్రం చేసుకోడానికి. అందువల్ల సబ్బు రాసుకున్న చేతివేళ్లను శుభ్రంగా కనీసం 20 సెకన్ల పాటు రుద్దుకుంటూ కడగాలి. పొడిగా అయేంతవరకు ఆగండి: చేతుల్ని శుభ్రం చేసుకున్న వెంటనే ఆ తడిచేతులతోనే ఏదైనా పనికి ఉపక్రమించడం సరికాదు. తడి చేతులు పొడిగా అయ్యేవరకు ఆగి అప్పుడు తినడం లేదా ఏదైనా పనిచేయడం మొదలుపెట్టాలి. ఒకసారి చేతులు శుభ్రంగా కడిగాక తినడం లేదా ఏదైనా పని చేయడం పూర్తయ్యే వరకు మురికిగా ఉండే ఉపరితలాలను తాకడం సరికాదు. ఆదరాబాదరా అసలే వద్దుకొందరు చేతులు కడుక్కునేటప్పుడు ఆదరాబాదరా కడిగేసుకుంటారు. రెండు వేళ్లకూ మధ్యనుండే చోట్ల లేదా గోర్ల చివరల్లో అంతగా శుభ్రం చేసుకోరు. చేతులు కడుక్కోవడం అంటే వేలికీ వేలికీ మధ్యనుండే చోట్లలో, అలాగే గోర్ల కింద కూడా శుభ్రంగా కడుక్కోవాలి. చదవండి: అలాంటి జన్యువులు ఉంటే బరువు తగ్గడం ఈజీ..! -
ముక్కలైన చేయికి పునర్జన్మ
శివమొగ్గ: రెండు ముక్కలైన చెయ్యికి శస్త్ర చికిత్స చేసి వైద్యులు మళ్లీ ఒక్కటి చేశారు. ఈ అరుదైన సంఘటన శివమొగ్గ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగింది. ఓ సామిల్లో పనిచేసే కారి్మకుడు (35) చేయి రంపంలోకి చిక్కి రెండు ముక్కలైంది. వెంటనే అక్కడున్నారు విడిపోయిన చేతిని ఐస్‌బాక్స్‌లో పెట్టుకొని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు 7 గంటల పాటు శస్త్రచికిత్స చేసిన తెగిన చేతిని ఎముకలు, మాంసంతో పాటు కలిపారు. తరువాత వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించి బాగు కావడంతో డిశ్చార్జి చేశారు. అతని చెయ్యి త్వరలోనే మామూలుగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చేతన్, ఎముకల వైద్యుడు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ వాదిరాజు కులకరి్ణ, మూకర్ణప్ప, సంతో‹Ù, అర్జున్ ఈ శస్త్రచికిత్స చేశారు. -
సాగరిక ఘట్జ్ హ్యాండ్ పెయింటింగ్ కళ్ళుతిప్పుకోలేరు.. (ఫోటోలు)
-
దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స!
వైద్య విధానంలో అత్యంత క్లిష్టమైన రెండు చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్స ఇద్దరూ వ్యక్తులకు ఏకకాలంలో తొలిసారిగా విజయవంతమయ్యింది. ఇక్కడ అన్నింట్లకంటే షాకింగ్ ట్వీస్ట్ ఏంటంటే ఈ శస్త్ర చికిత్స ఓ కిడ్నీ మార్పిడి పేషెంట్‌కి కూడా జరగడం. ఇలా కిడ్నీ మార్పిడి చేయించుక్నున వ్యక్తికి సంక్లిష్టమైన ఈ చేయి మార్పిడి శస్తచికిత్స జరగడం దేశలోనే తొలిసారి కూడా. ఈ షాకింగ్ ఘటనలు ఎక్కడ జరిగాయంటే.. ఇద్దరు మగ రోగులకు హర్యానాలో ఫరిదాబాద్‌లోని అమృత హాస్పిటల్లో విజయవంతంగా ఈ చేతి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ముందుగా ఉత్తర భారతదేశానికి చెందిన 65 ఏళ గౌతమ్ తాయల్కు ఈ సంక్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అయితే అనుకోకుండా గత రెండేళ్ల క్రితం ఓ పారిశ్రామిక ప్రమాదంలో మణికట్టుపై వరకు ఎడమ చేతిని కోల్పోయారు. అయితే అతనికి బ్రెయిన్ డెడ్ అయిన థానేకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేయిని మార్పిడి చేశారు. ఒక కిడ్నీ మార్పిడి రోగికి ఇలాంటి శస్త్ర చికిత్స జరగడం దేశంలో మొట్టమొదటిది. వైద్యశాస్త్రంలో ఇదొక అరుదైన ఘట్టం కూడా. ఇలా ట్రాన్సప్లాంట్ చేయడానికి రెండు ఎముకలు, రెండు ధమనులు, సుమారు 25 స్నాయువులు, 5 నరాలను కలపాల్సి ఉంటుందని వైద్యుడు మోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. ఈ చికిత్స అనంతరం రోగి మంచిగానే కోలుకుంటున్నట్లు తెలిపారు. అతని కొత్త చేతిలో కూడా కదలికలు మొదలయ్యాయని చెప్పారు. జస్ట్ ఒక్క వారంలోనే డిశ్చార్జ్ అవుతాడని అన్నారు. ఇక మరో హ్యాండ్ ట్యాన్స్ప్లాంటేషన్ ఢిల్లీకి చెందిన దేవాన్ష్ గుప్త అనే 19 ఏళ్ల వ్యక్తికి జరిగింది. మూడేళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులు మోకాలి పైభాగం వరకు పోయాయి. కుడి చేయి మోచేయి పైభాగం వరకు పోగా, ఎడమ చేయి మోచేయి కొంచెం కింద స్థాయి వరకు పోయింది. అయితే ఈ వ్యక్తికి ఫరీదాబాద్‌లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయిన సూరత్ అనే 33 ఏళ్ల వ్యక్తి చేతులను మార్పిడి చేశారు. ఇక ఈ విచ్ఛేదనం స్థాయిని బట్టి ఈ ఆపరేషన్ అంత క్రిటికల్‌గా ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ సర్జరీ తర్వాత దేవాన్ష్ పరిస్థితి కూడా మెరుగుపడిందని, పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే మోచేయి పైవరకు పోయిన కోల్పోయిన చేతి శస్త్ర చికిత్సలో కాస్త సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే గుప్తా పురోగతి కూడా బాగుందని, అవసరమనుకుంటే తదుపరి చేతి మార్పిడికి సంబంధించిన కొన్ని చికిత్సలు రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సదరు పేషంట్లు గౌతమ్ తాయల్, దేవాన్ష్ గుప్తా ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ మార్పిడి తమకు రెండో అవకాశం అని, పైగా జీవితంలో కొత్త ఆశలు అందించిందని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలతో వైద్య విధానం మరింత అభివృద్ధిని సాధించింది. అంతేగాదు ఈ శస్త్ర చికిత్స భవిష్యత్తులో ఇలా అవయవాల కోల్పోయిన వారిలో కొత్త ఆశను అందించేలా ధైర్యంగా జీవించేలా చేయగలుగుతుంది. (చదవండి: మా పాపకు పీరియడ్స్ ఇంకా రాలేదు! కానీ ఆమెకు అలా అవుతోంది..) -
ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామూన 2.15 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న చేతి గ్లౌజ్‌ల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చెలరేగిన భారీగా మంటలకు ఆరుగురు మృతి చెందారు. ‘తెల్లవారుజామూన 2.15 గంటలకు అగ్ని ప్రమాద సమాచారం అందింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాహయక చర్యలు చేట్టాం. అప్పటికే ఆరుగురు ఫ్యాకర్టీ మంటల్లో చిక్కున్నారు. దీంతో రెస్క్యూ చేసిన ఆ ఆరుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాం’ అని అగ్నిమాపక అధికారి మోమన్ మోంగ్సే తెలిపారు. ఘటన స్థలంలో సాయహక చర్యలు కొనసాతుగున్నాయని తెలిపారు. -
ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!
ఆంటీ తనకు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక చిట్టి తల్లి తానే స్వయంగా ల్యాప్‌టాప్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాన్ని నేహా అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్నారి కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన ‘హ్యాండ్‌మేడ్’ ల్యాప్‌టాప్ ఫొటోను నేహా షేర్ చేశారు. నేహా క్యాప్షన్‌లో ఇలా రాశారు ‘నా మేనకోడలు నన్ను ల్యాప్‌టాప్ కావాలని అడిగింది. నేను నిరాకరించడంతో, మూడు గంటల పాటు శ్రమపడి, ల్యాప్‌టాప్ తయారు చేసుకుంది’ నేహా షేర్ చేసిన ఫోటోలో ల్యాప్‌టాప్ ఆకారంలో కత్తిరించిన కార్డ్బోర్డ్ కటౌట్ కనిపిస్తుంది. దానిపై స్కెచ్ పెన్‌తో గీసిన కీబోర్టు చిహ్నాలు కనిపిస్తాయి. కాగా ఈ హోమ్మేడ్ ల్యాప్‌టాప్‌లో ‘గేమ్స్’, ‘జూమ్’, ‘లైక్’, ‘రైట్’, ‘సెలెక్ట్’ మొదలైన ఆప్షన్ బటన్లు కనిపిస్తాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారింది. 2,52,000కు పైగా వీక్షణలను దక్కించుకుంది. సోషల్ మీడియా యూజర్స్ ఆ చిన్నారి సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్ ‘ఈ ల్యాప్‌టాప్ ఉత్తమమైనది. విండోస్ ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి’ అని రాశారు. మరొకరు ‘ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్‌లో చాలా ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మరింత మెరుగ్గా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు! My niece asked for my laptop and i said no so she spent 3 hours making her own laptop😭 pic.twitter.com/Bb7EK7BN97 — Neha (@LadyPeraltaa) October 1, 2023 -
సెలవైనా ఠంఛన్‌గా పింఛన్
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్‌గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!
హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధిలో పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద ర్యాష్, పొక్కులు, పుండ్ల లాంటివి వచ్చి బాధపెడతాయి. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు... ఔట్‌బ్రేక్స్ మాదిరిగా అకస్మాత్తుగా పిల్లల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వాతావరణంలో వేడిమీ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుంది. అందుకే మనలాంటి ఉష్ణమండలపు ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువ. రోజుల వయసు పిల్లలు మొదలుకొని, పదేళ్ల చిన్నారుల వరకు కనిపించే ఈ సమస్య తల్లిదండ్రుల ఆందోళనకూ కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లోని ర్యాష్, పుండ్లు, కురుపుల్లో నొప్పి ఓ మోస్తరుగా, కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. దేహం రంగు (స్కిన్ టోన్)ను బట్టి ఈ కురుపులు, పుండ్లు పిల్లలందరిలో ఒకేలా కాకుండా కాస్త వేర్వేరుగా కనిపించవచ్చు. అంటే ఎరుపు, గ్రే కలర్, కొన్నిసార్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి ఆరు రోజుల వరకు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో పిరుదుల మీదా కనిపించే అవకాశం ఉంది. పుండ్లు పిల్లల్లో నోటి వెనకా, గొంతులోనూ వచ్చి బాధిస్తాయి. ఇలా జరగడాన్ని ‘హెర్పాంజియా’ అంటారు. కొంతమందితో మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి ఇలా... ‘కాక్సాకీ’ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇది ఎంటరోవైరస్ జాతికి చెందిన వైరస్. పిల్లల ముక్కు నుంచి స్రవించే స్రావాలు, లాలాజలం, పుండ్ల నుంచి స్రవించే తడితో పాటు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు వ్యాపించే తుంపర్ల (డ్రాప్లెట్స్) వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. వ్యాధి నయమై, లక్షణాలు తగ్గిపోయాక కూడా వైరస్ చాలాకాలం పాటు దేహంలోపలే ఉండి, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పిల్లలతో ఉండే పెద్దల ద్వారా ఇతర పిల్లలకు ఇది వ్యాప్తి చెందవచ్చు. అరుదుగా ముప్పు... చాలావరకు దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధి అరుదుగా కొంతమంది పిల్లల్లో ముప్పు తెచ్చిపెట్టవచ్చు. పిల్లల వయసు అనే అంశమే ఈ ముప్పునకు కారణం. అంటే సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇది ఒకింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద వయసు పిల్లల్లో ఇది ప్రమాదకరం కాబోదు. కొద్దిమంది పిల్లల్లో మెదడు, ఊపిరితిత్తులు, గుండె కూడా దుష్ప్రభావాలకు లోనవుతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి తెచ్చిపెట్టే ముప్పులు ఈ కింది విధంగా ఉండవచ్చు. వైరల్ మెనింజైటిస్ : మెదడు పొరల్లో వాపుతో పాటు, మెదడు చుట్టూ ఉండే సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్లో ఇన్ఫ్లమేషన్ కలగడం. ఎన్సెఫలైటిస్ : మెదడువాపునకు కారణమై ఒక్కోసారి ప్రాణాపాయం వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా చాలా అరుదు. చికిత్స ఇది వైరల్ జ్వరం కాబట్టి నిర్దిష్టంగా చికిత్స ఏదీ లేదు. కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) అందించాల్సి ఉంటుంది. అంటే జ్వరం తగ్గడానికి పారాసిటమాల్, డీ–హైడ్రేషన్ సమయంలో ఐవీ ఫ్లుయిడ్స్, సీజర్స్వంటి కాంప్లికేషన్లతో పాటు వైరల్ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ కనిపించినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స అందించడం అవసరం. ఈ వ్యాధి నివారణకు టీకా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ: కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ∙నేరుగా దగ్గడం తుమ్మడం చేయకుండా, చేతిగుడ్డ /రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ∙వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన (కాచి, వడబోసిన లేదా క్లోరిన్‌తో బ్లీచ్ చేసిన) నీటిని తాగాలి. ∙పిల్లల వ్యక్తిగత వస్తువుల్నీ పరిశుభ్రంగా ఉంచాలి. వారి డయపర్ వంటి వాటిని జాగ్రత్తగా పారేయాలి (డిస్పోజ్ చేయాలి). పిల్లల వస్తువులు, బొమ్మల వంటివి... ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. లక్షణాలు తగ్గే వరకు స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇల్లు, తలుపులు, డోన్ నాబ్స్ వంటి వాటితో పాటు పరిసరాలనూ డిస్–ఇన్ఫెక్టెంట్ల సహాయంతో శుభ్రం చేయడం మేలు. వైరస్ కారణంగా 24 నుంచి 48 గంటల పాటు జ్వరం. ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ. ∙ఆకలి లేకపోవడం, ఆకలి బాగా మందగించడం. ∙గొంతు బొంగురుపోవడం, ఇబ్బందికరంగా మారడం. ∙కొన్నిసార్లు ర్యాష్, పొక్కులు, కురుపులు చిగుర్లు, నాలుక, చెంపల లోపలివైపున కూడా కని పించవచ్చు. కొన్నిసార్లు పొక్కులు, కురుపులు లేకుండా ఎర్రబడిన భాగం కాస్త ఉబ్బెత్తుగా అయినట్లుగానూ కనిపించవచ్చు. డాక్టర్ రమేశ్ బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు) -
ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!
ఈ రోజే నేషనల్ హ్యాండ్ సర్జరీ డే. పనిచేసే చోటే చేతులకు ఎదురయ్యే సమస్యలు నిర్లక్క్ష్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ రోజుని ఏర్పాటు చేశారు. వర్క్‌ప్లేస్‌లో అదేపనిగా చేసే పనుల వల్ల చేతివేళ్లు, కండరాలకు ఎదురయ్యే అంతర్గత సమస్యల కారణంగా చేతులు నొప్పి పుట్టడం లేదా కదలించలేని స్థితికి వస్తుంది. చాలామంది అదే సర్దుకుంటుందని లక్క్ష్యపెట్టరు. దీంతో ఆ సమస్యలు తీవ్రమై సర్జరీ చేయించుకునే స్థితికి దారితీస్తుంది. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? దీనికి నివారణ తదితరాల గురించే ఈ కథనం. కార్యాలయాల వద్ద చేసే పనిని బట్టి చేతులకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వుతాయి. కెమికల్స్‌కి సంబంధించిన వాటిలో పనిచేస్తే చేతులు చర్మానికి సంబంధించిన ఎలర్జీల బారినపడే అవకాశం ఉంటుంది. ఇక కంప్యూటర్ తదితర వాటి వద్ద పనిచేసే వాళ్ల అయితే ..అదే పనిగా టైప్ చేయడంతో పునరావృత ఒత్తిడితో కూడిన గాయాలు(ఆర్ఎస్ఐ) బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాయింట్ పెయిన్లు, లేదా వేళ్లు వద్ద కండరాలు దెబ్బతినడం లాంటివి. ఆ నొప్పి తీవ్రమైన ఛాతీ వరకు వ్యాపించటం జరుగుతుంది. చివరికి చేతిని పైకెత్తడం కాదుకదా! కనీసం కదపలేని స్థితికి వస్తారు. చాలమటుకు అందరూ వీటిని అలక్క్ష్యపెడతారు. పెద్ద సమస్యగా గుర్తించరు. పైగా తేలిగ్గా తీసుకుంటారు. అందుకోసమే ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ముఖ్యోద్దేశంతో ఈ నేషనల్ "హ్యాండ్ సర్జరీ డే" అనే దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా దీన్ని ఆగస్టు 23న జరుపుకుంటారు. ఈ గాయాలను ఎలా గుర్తించాలి అదేపనిగా చేసే పనుల వల్ల చిటికెలు వద్ద కండరాలు రాపిడికి గురవ్వటం, లేదా జాయింట్లు తప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అవే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లేదా రేనాడ్స్ సిండ్రోమ్కి దారి తీస్తుంది. కటింగ్ పనులు చేసేవారికైతే తరచుగా లోతుగా అయ్యే గాయాలు మరింత తీవ్రమై రోజువారి జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. మనం కూర్చొనే తీరు, సమీపంలోని వస్తువులు, పరికరాల కారణంగా కూడా ఈ ఆర్ఎస్ఐ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పూణే రూబీ హాల్ క్లినిక్‌కి చెందిన ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కిరణ్ ఖరత్ తెలిపారు. పునరావుత ఒత్తడితో కూడిన గాయాలు(ఆర్ఎస్) లక్షణాలు.. చేతులు నొప్పి పుట్టడం లేదా ఒకవిధమైన జలధరింపుకు గురవ్వుతారు. కొందరిలో తిమ్మిర్లు వచ్చి అసౌకర్యంగా ఫీలవుతారు. మణికట్టు లేదా ముంజేయి నుంచి భుజం వరకు ఆ సమస్యలు పాకే అవకాశం ఉంది. దీన్ని ఆయా వ్యక్తుల శారరీకంగా చేసే శ్రమను పరిగణలోకి తీసుకుని నిర్థారిస్తారు. కొన్నిసార్లు నరాల్లో రక్తప్రసరణ సరిగా ఉందా లేదా అని నిర్వహించే పరీక్షలు లేదా అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ వంటి రోగ నిర్థారణ పరీక్షల సాయంతో వైద్యులు ఈ సమస్యలను గుర్తిస్తారు. చికిత్స: వర్క్‌ప్లేస్‌లో వాతావరణాన్ని ఒత్తిడి లేకుండా కూల్‌గా చేసేలా వాతావరణాన్ని సెట్ చేసుకోవాలి. అదేసమయంలో ఏకథాటిగా చేసే పనికి కాస్త విరామం ఇవ్వడం వంటివి చేయాలి. అలాగే ఒత్తిడికి గురికాకుండా మధ్య మధ్యలో తేలికపాటి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆర్ఎస్ఐ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు లేదా సమస్య తీవ్రతను తగ్గించొచ్చు. ఈ ఆర్ఎస్ఐ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే కార్యాలయాల వద్ద ఉద్యోగులకు సౌకర్యావంతమైన రీతిలో ఫర్నేచర్, పరికరాలు, వంటివి ఉండాలే యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పని చేసే చోట ఎదురయ్యే అనుకోని ప్రమాదాలకు తక్కణ రక్షణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండాలి. వాటిన్నిటితో పాటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు దీని గురించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి. అందుకు తగ్గట్టు శిక్షణ సమావేశాలు ఏర్పాటు చేయడం, భద్రతో కూడిన పరికరాలు ఏర్పాటు, లేదా రక్షణ కోసం చేతి తొడుగులు వంటివి ఏర్పాటు చేయాలని డాక్టర్ ఖరత్ అన్నారు. (చదవండి: వృద్ధులను వేదించే గొంతులోని కఫం సమస్యకు..ఇలా చెక్ పెట్టండి!) -
గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి..
నేపాల్‌కు చెందిన సైనికుడు అరుదైన గిన్నీస్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. కేవలం చేతులను మాత్రమే ఉపయోగించి 75 మెట్లను 25.03 సెకన్లలో కిందకు దిగి చరిత్ర సృష్టించాడు. దీంతో ప్రపంచంలోనే ఇప్పటివరకు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వేగంగా మెట్లపై కిందకు దిగే పోటీకి ప్రపంచంలోనే మంచి ప్రజాధరణ ఉంది. అయితే.. ఇందులో ఇలా మెట్లను దిగడంలో కేవలం చేతులను మాత్రమే ఉపయోగించాలి. శరీర బరువు మొత్తం చేతులపై మోస్తూ మెట్లపై నుంచి కిందకు దిగాలి. ఇలా దిగే క్రమంలో బ్యాలెన్స్ మిస్ కాకుండా చూసుకోవడం చాలా కీలకం. ఈ పోటీలో ఇప్పటివరకు 30..8 సెకన్లతో అమెరికాకు చెందిన వ్యక్తిపై రికార్డ్ ఉంది. దీనిని ప్రస్తుతం నేపాల్‌కు చెందిన సైనికుడు హరి చంద్ర గిరి ఛేదించాడు. ఖాట్మండ్ లోయలో ఉన్న బుద్దిస్ట్ దేవాలయం జమ్చెన్ విజయ స్థూపంపై ఉన్న మెట్లపై హరి చంద్ర ఈ ఫీట్‌ను సాధించాడు. అయితే.. తాను 8 ఏళ్ల వయస్సు నుంచి చేతులపై నడిచే నైపుణ్యాన్ని సాధన చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ వేషధారణలో బాలుడు.. పార్కుకి వెళ్తే.. -
జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్..
ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కులో ఓ జాలరిపై సొరచేప దాడి చేసింది. పడవలో వెళుతున్న క్రమంలో అతన్ని నీళ్లలోకి లాగేసింది. చేయి కడుక్కోవడానికి పడవ నుంచి నీళ్లలోకి వంగిన క్రమంలో సొరచేప లాగేసినట్లు స్థానికులు తెలిపారు. పడవలో చేపల వేటకు వెళ్లారు జాలరి. ఈ క్రమంలో చేయి కడుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అనుకోకుండా పడవ నుంచి వంగి నీళ్లలో చేతి కడుక్కోవాలనుకున్నాడు. ఇంతలోనే నీటిలో ఉన్న సొరచేప జాలరి చేతిని కరిచేసింది. అంతటితో ఆగకుండా నీటిలోకి లాగేసింది. పడవపై నుంచి ఒక్కసారిగా నీళ్లలో పడిపోయాడు జాలరి. కానీ పక్కనే ఉన్న అతని స్నేహితుడు వెంటనే బాధితున్ని పడవపైకి లాగాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. View this post on Instagram A post shared by THEQUALIFIEDCAPTAIN (@thequalifiedcaptain) ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన వీక్షకులు రకరకాలుగా స్పందించారు. పడవపై ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అయితే.. ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గత ఏడాదే 57 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందులో 5గురు మరణించారు. ఇదీ చదవండి: 'ఒకే దేశంలో రెండు చట్టాలా..?' ప్రతిపక్షాలకు ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్.. -
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
-
డైరెక్టర్లకు హ్యాండ్ ఇస్తున్న హీరోలు
-
బోనులోని సింహంతో వ్యక్తి పరాచకాలు.. తర్వాత ఏం జరిగిందో చూడండి..
ప్రమాదం అని తెలిసినా కావాలనే కొంతమంది తమ పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఓ డైలాగ్ ఇందుకు సరిగ్గా సరిపోతుంది. ‘పులిని చూడలంటే చూస్కో.. దానితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచె రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు..సరే చనివిచ్చిందకదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఈ డైలాగ్‌లో పులి ప్లేస్‌లో సింహాన్ని రీప్లేస్ చేస్తే అచ్చం ఇలాగే ఉంటుందేమో.. అసలేం జరిగిందంటే.. ఓ జూలో రెండు సింహాలను బంధించి ఉండగా.. వాటిని చూసేందుకు సందర్శకులు చుట్టుముడతారు. వారిలో ఓ వ్యక్తి బోనులోకి చేయి పెట్టి సింహాన్ని మచ్చిక చేస్తున్నట్లు ప్రయత్నించాడు. కానీ ఆ సింహం స్పందించకుండా అలాగే ప్రశాంతంగా ఉంటుంది. అతనిని గమనించిన పక్కనున్న వ్యక్తి బోనులోని మరో సింహం తలపై చేయి పెట్టాయి. దీంతో ఆగ్రహం చెందిన సింహం హఠాత్తుగా అతని చేతిని నోటిలోకి లాక్కుటుంది.. సింహం ఊహించని చర్యతో అక్కడున్న వారంతా షాక్‌కు గరయ్యారు. సింహం చేతిని కరవడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. సింహం బారి నుంచి చేతిని విడిపించుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. సింహానికి భయపడి అక్కడున్న వారు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అయితే భయం, బాధతో గట్టిగా అరవడంతో కాసేపటికి సింహం అతని చేతిని వదిలేసింది. దీంతో భయంతో అక్కడున్న వారంతా దాని నుంచి దూరంగా పారిపోయారు. Fook around............. pic.twitter.com/N8ETVsXQJr — Vicious Videos (@ViciousVideos) December 26, 2022 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ట్విటర్‌లోషేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బోనులో ఉన్నా సింహం సింహమే.. ఇలాంటి తుంటరి పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అంటూ కామెట్లు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో తెలియరాలేదు. -
మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా!
రియో డీ జెనీరో: బ్రెజిల్ తీరంలో మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం బయటపడడం కలకలం రేపింది. ఇది మరో గ్రహానికి చెందిన జీవి చెయ్యి కావొచ్చని స్థానికులు అనుమానించారు. భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 20న సో పౌలో స్టేట్‌లో లభించిన పొడవైన ఎముకలు మనిషి చేతి వేళ్లను పోలి ఉన్నాయి. అచ్చంగా చెయ్యి ఆకారంలోనే ఉండడం గమనార్హం. నిజానికి ఇది గ్రహాంతరవాసి హస్తం కాదని, భారీ తిమింగలం లేదా డాల్ఫిన్‌కు చెందిన ఎముకలని మెరైన్ బయాలజిస్ట్ ఎరిక్ కోమిన్ వెల్లడించారు. ఇది 18 నెలల క్రితం మరణించి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఎముకలు సముద్ర జీవి శరీరం చర్మం కింద ఉండే ఫ్లిప్సర్స్ అని తెలిపారు. ఈ ఫ్లిప్పర్స్‌కు ఐదు వేళ్ల లాంటి ఎముకలు ఉంటాయన్నారు. -
వేడి నూనెలో వట్టి చేతులతో..
యశవంతపుర: సలసల మరుగుతున్న నూనె చుక్క పడినా బొబ్బలెక్కుతాయి. కానీ అదే వేడి నూనెలో ఉడుకుతున్న వడలను చేతితో బయటకు తీశారు భక్తులు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా కుమట పట్టణంలో జరిగింది. పట్టణంలోని కామాక్షి దేవస్థానంలో దసరా తరువాత పౌర్ణమి రోజున ఘనంగా జాతర జరుగుతుంది. ఇందులో కళాయిలో వేగుతున్న వడలను తీసి భక్తిని చాటుకునే కార్యక్రమం ఉంటుంది. ఆదివారం సాయంత్రం జరిగిన జాతరలో కొందరు భక్తులు ఇలా వడలను తీశారు. ఎవరికీ బొబ్బలు ఎక్కలేదన్నారు. గోవా, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. (చదవండి: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు) -
నమ్మలేని నిజం.. 10 ఏళ్లకుపైగా ఎత్తిన చేతిని దించలేదు..!
మీ చేతిని పైకి ఎత్తి ఎంత సమయం వరకు ఉండగలరు? మహా అయితే ఓ 10-20 నిమిషాలు అతి కష్టంతో పైకి ఎత్తి ఉంచగలరేమో. కానీ, గంటలు కాదు, రోజులు కాదు.. ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉండటం అంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే, అది నిజం. ఓ సాధువు దానిని గతంలోనే చేసి చూపించారు. 70 ఏళ్ల సాధువు అమర్ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1973 వరకు అమర్ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేతిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని వెల్లడించారు. ఓ రిపోర్టర్ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని తెలిపారు. Guy from India hasen't put his arm down for 10 Years to honor his God 😱#amazing #india #pandit #guru #sacrifice #ENGvIND @unexpected_new pic.twitter.com/ldAVoXpMJi — Next Level (@NextInteresting) September 24, 2022 ఇదీ చదవండి: Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
అతనికి 24 వేళ్లు.. సోదరికి 21, తమ్మునికి 22 వేళ్లు
బెంగళూరు: ప్రతి మనిషికీ కాళ్లు చేతులకు కలిపి 20 వేళ్లుంటాయి. కానీ శివమొగ్గ తాలూకాలో ఉన్న వ్యక్తికి రెండు కాళ్లు, రెండు చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు ఉంటాయి. బసవనగంగూరులో నివసించే మంజునాథ్‌కు ఈ ప్రత్యేకత సొంతం. ఒక్కో చేతికి ఆరేసి వేళ్లు, ఒక్కో కాలికి ఆరు చొప్పున వేళ్లతో ఇతడు చూపరులను ఆశ్చర్యపరుస్తాడు. ఒక మనిషికి 24 వేళ్లు ఉండడం చాలా అరుదు అని స్థానిక ప్రజలు ఆంటున్నారు. కూలీ పనులు చేసుకునే మంజునాథ్ ఇంట్లో అతని తల్లి, సోదరికి 21 వేళ్లు, తమ్మునికి 22 వేళ్లు ఉన్నాయి. చదవండి: టీచర్ వికృతానందం.. మహిళలకు అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపి.. -
యువకుడి రెండు చేతులను నరికేసిన సర్పంచ్ భర్త..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచోసుకుంది. పంట సేకరణ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒక వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చిన అమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన హోషంగాబాద్ జిల్లాలో జరిగింది. చౌరాహెట్ గ్రామాంలో కొన్ని రోజులుగా పంట సేకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో.. సదరు గ్రామానికి చెందిన సోమేష్ గుర్జార్ అనే రైతు ఒక రోజు సర్పంచ్ భర్త అయిన భగవాన్ సింగ్‌కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరాడు. ఈ విషయం గురించి గ్రామస్తులు పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఒకరోజు సోమేష్ గుర్జార్ గ్రామస్థుల అందరి సమక్షంలో సర్పంచ్ భర్తను నిలదీశాడు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి ఒకరి కాలర్‌ను మరోకరు పట్టుకున్నారు. ఈ సంఘటనను భగవాన్ సింగ్ అవమానకరంగా భావించి ఆవేశంతో రగిలిపోయాడు. గుర్జార్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో గత శుక్రవారం రాత్రి సింగ్ కుటుంబం సభ్యులు గుర్జార్‌ను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మూకుమ్మడిగా కర్రలతో దాడిచేశారు. దీంతో గుర్జార్ లేవలేని స్థితిలో కిందపడిపోయాడు. అప్పుడు భగవాన్ సింగ్ ఒక కోడవలితో రైతు రెండు చేతులను విచక్షణ రహితంగా నరికేశాడు. ఈ క్రమంలో, రైతు రెండు చేతులు తెగిపోయి, రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనతో అతని కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గుర్జార్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
నీ భార్యతో కలిసుంటే ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేవు.. చివరికి!
ముంబై: జాతకాలు, జ్యోతిష్యం వంటి వాటిని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారు. రాశిఫలాలు, గ్రహాలు అంటూ పూజారి చెప్పిన విషాయాలన్నింటిని పాటిస్తారు. తాము జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు, అనుకున్నది సాధించేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇందులో కొన్ని మంచి చేసే పనులు ఉంటే చాలా వరకు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మి కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఓ ప్రబుద్ధుడు ఈ ఘటన మహారాష్ట్రలో సోమవారం వెలుగు చూసింది. పుణెకు చెందిన రఘునాథ్ ఏముల్ తను ఎమ్మెల్యే లేదా మంత్రి కావాలంటే ఏం చేయాలని జ్యోతిష్కుడిని (హస్తరేఖలు చూసి జాతకం చెప్పే వ్యక్తి) అడిగాడు. దీనికి అతను ఇంట్లో తన భార్య ఉండగా నువ్వు ఎప్పటికీ నీ కలను సాధించలేవని, ఆమె మంచిది కాదని నిందలు వేశాడు. తనకు విడాకులు ఇస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చాడు. ఇది నమ్మిన రఘునాథ్, అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో విసిగి పోయిన భార్య తనను వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని మహిళ ఆమె భర్త, అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. మహిళా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
తెగిపడిన చేయి.. అంతా క్షణాల్లోనే..
కడప అర్బన్: కడపలోని అక్కాయపల్లిలో శనివారం రాత్రి విద్యుత్‌షాక్‌తో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా సీఐ ఎం. నాగభూషణం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కాయపల్లిలోని సొంత ఇంటిలోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్న షేక్ ఆరిపుల్లా, భార్య ఫరీదాలకు ముగ్గురు కుమార్తెలు. ఆరిపుల్లా ప్రస్తుతం కువైట్‌లో ఉన్నాడు. ప్రతీ రోజూ చెత్తను, ఇతర వస్తువులను, కూరగాయలను బకెట్లో పెట్టి పైకి, కిందికి తీసుకుని వస్తుంటారు. ఈక్రమంలో ఆ బకెట్‌కు పాత విద్యుత్ వైరును కట్టి ఉంచారు. ఈనెల 3వ తేదీ రాత్రి మూడో కుమార్తె అయేషా(12) చెత్తబుట్టను కిందకు వేసింది. బకెట్ విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురైంది. ఈక్రమంలోనే స్టీల్ పైపునకు చేయి తగలడం, తెగిపడటం క్షణాల్లో జరిగిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే తల్లి ఫరీదా(37) కుమార్తెను పట్టుకోవడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రజల సాయంతో విద్యుత్ సరఫరా ఆపించారు. గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్సకోసం క్రిస్టియన్‌లేన్‌లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. చదవండి: బందరులో బాలిక కిడ్నాప్ కలకలం అనిత వీడియో: అడ్డంగా బుక్కైన మంత్రి -
ఇంట్లో ప్రయత్నించకండి.. కాలిపోద్ది!
వంట చేసేటప్పుడు కొద్దిగా నూనె చిట్లి చేతుల మీద పడితే ఎంత మంట పుడుతుందో కదా. మరోసారి కిచెన్‌లో అడుగుపెట్టకూడదు అనుకుంటాము. నూనె చిట్లుతుందనే భయంతోనే చాలా మంది పిండి వంటలు చేయడం వంటి వాటి జోలికి పోరు. రెండు మూడు చుక్కల నూనె మీద పడితేనే బాధతో విలవిల్లాడతామే.. ఏకంగా సలసల కాగే నూనేలో చేతిని ముంచితే.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అలాంటిది ఈ న్యూస్ చదివి.. వీడియో చూశాక ఇంకేమంటారో మరి. ఓ నడి వయసు మహిళ చేతిని చాలా ఈజీగా.. చిల్లుల గరిటే మాదిరి బాగా మరుగుతున్న నూనెలో ముంచి తీస్తుంది. ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజం. ఫస్ట్ వి ఫీస్ట్ అనే ట్విట్టర్లో అకౌంట్లో షేర్ చేసిన ఈ టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..) She said tongs are for losers 😭😭😭 pic.twitter.com/QF4IaFiMd7 — First We Feast (@firstwefeast) October 26, 2020 ‘షి సేడ్ టంగ్స్ ఆర్ ఫర్ లూజర్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ నడి వయసు మహిళ పెద్ద బాండీ ముందు నిల్చుని ఉంది. దానిలో నూనె బాగా మరుగుతుంది. బజ్జీలు వంటి స్నాక్ ఐటెం తయారు చేస్తుంది. పిండిలో ముంచిన మిరపకాయల్ని నూనెలో వేస్తుంది. ఫ్రై అయిన వాటిని పక్కకు జరపడానికి చిల్లుల గరిటే, పట్టుకారు లాంటివి వాడకుండా చేతితోనే పక్కకు జరుపుతుంది. బాగా మరిగిని ఆ నూనెని చేతిలోకి తీసుకుని దానిలో పోయడం చూడవచ్చు. రెండు సార్లు మరిగే నూనెలో చేయి పెట్టినా ఆమెకు ఏం కాలేదు. ఆ తర్వాత ఓ ఎడిటెడ్ పటుకారు ఫ్రేమ్‌లోకి వచ్చి.. బహుశా నేను ఇక్కడ లేను.. నేను కేవలం ఓ భ్రమను మాత్రమే అనడం చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 16కే మంది చూశారు. చాలా మంది ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నామని.. ఆమె అవతార్ ఆఫ్ ఆయిల్ బెండర్ అని.. ఇలాంటి వీడియో నెవ్వర్ బీఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆమె చేతికి ఉన్న పిండి కాలకుండా కాపాడుతుంది అంటున్నారు. -
గేటు దూకబోయి.. ఇనుప రాడ్డులో
పిడుగురాళ్ల (గురజాల): వాకింగ్ కోసం వచ్చిన ఓ విద్యార్థి గేటు దూకబోయి.. అందులో చేయి ఇరుక్కొని తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొపావత్ వెంకట్ నిఖిల్ నాయక్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం వాకింగ్ కోసం స్థానిక మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చాడు. పాఠశాల గేటుకు తాళం వేసి ఉండటంతో గేటు దూకి లోపలికి వెళదామని ప్రయత్నించే క్రమంలో కాలు జారి గేటు పైనున్న ఇనుప కడ్డీలోకి ఎడమ చేయి పూర్తిగా చొచ్చుకునిపోయింది. (చదవండి: విషాదం.. వివాహమైన 28 రోజులకే..) కడ్డీలో నుంచి చేయి తీయాలని ప్రయతి్నంచినా రాలేదు. స్థానికుల సమాచారం మేరకు పల్నాడు ఆస్పత్రి వైద్యుడు అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి సుమారు గంటన్నర సమయం వెచ్చించి ఇనుప రాడ్డులో నుంచి చేయిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, వైద్యులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
భుజం జాగ్రత్త!
ఈ ప్రపంచంలో ఏపని జరగాలన్నా భుజం కదిలించడం ద్వారానే అది సాధ్యం. మనకు ఎవరైనా బాగా దగ్గరివారైతే... ‘అతడు నా కుడిభుజం’ అంటూ కితాబిస్తాం. ఎవరికైనా బాధ్యతను అప్పగిస్తే... ‘నీ భుజాల మీద పెడుతున్నా’నంటాం. కష్టసాధ్యమైన బాధ్యతను నెరవేరుస్తున్న వారిని... ‘భారాన్నంతా తన భుజ స్కంధాల మీద మోస్తున్నాడ’ంటాం. పనుల బాధ్యతలను పంచుకునే వాడు దూరమైతే నా కుడిభుజం విరిగినట్టయిందని సామెత చెబుతాం. ఇదీ భుజానికి ఉన్న ప్రాధాన్యత. దానికి ఏవైనా వైద్యపరమైన సమస్యలు వస్తే... మన పనులు మనం చేసుకోవడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితే రాకూడదని అందరూ భావిస్తారు. మన రోజువారీ పనులన్నింటికీ భుజం కాసే... ఆ అవయవం ప్రాధాన్యతనూ, దానికివచ్చే సమస్యలనూ, వాటి నివారణను తెలుసుకుందాం. భుజంలో అత్యంత సంక్లిష్టమైన నాలుగు కీళ్లు, ముప్ఫయికి పైగా కండరాలు, ఆరు ప్రధానమైన లిగమెంట్లు ఉండి, అవన్నీ సమన్వయంతో కొనసాగుతూ మన రోజువారీ పనులన్నీ సక్రమంగా జరిగేలా చూస్తాయి. అయితే మన బరువంతా కాళ్లమీద పడుతుంది. కాబట్టి కాళ్ల అరుగుదలతో పోలిస్తే... భుజాలకు వచ్చే అరుగుదల సమస్యలు కాళ్ల అంతకాకపోయినా... కాస్తంత తరచుగా వీటికీ సమస్యలు రావడం చాలామందిలో కనిపించేదే. పైగా ఇటీవల క్రికెట్ వంటి ఆటల మూలంగా చేతిని గుండ్రంగా తిప్పుతూ బంతి విసరడం వల్ల భుజం పైన చాలా భారమే పడుతుండటం చాలా తరచూ కనిపించే విషయం. దాంతో ఫ్రోజెన్ షోల్డర్, భుజం కీలు అరగడం వల్ల వచ్చే రొటేటర్ కఫ్ వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. భుజానికి వచ్చే అనేక సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన పెంచుకుందాం. షోల్డర్ ఆర్థరైటిస్ భుజం నిర్మాణంలో చేతి ఎముక బంతి అంత పరిమాణంలో ఉండి, భుజంలోని ‘గోల్ఫ్టీ’తో పోల్చదగ్గ ఒక సాకెట్లో ఇమిడి ఉంటుంది. భుజాన్ని చాలా ఎక్కువగా ఎక్కువగా ఉపయోగించి పనిచేసేవారిలో చాలా ఏళ్ల తర్వాత ఈ ఎముక చివరన ఉండే బంతి వంటి భాగంలోని కార్టిలేజ్ (ఎముక చివరన మృదువుగా ఉండే మృదులాస్థి) అరిగిపోతుంది. కొన్నిసార్లు ఏదైనా గాయమైనప్పుడు లేదా భుజం ‘గూడ’ తప్పినప్పుడు లేదా భుజం విరిగినప్పుడు కూడా ఎముక చివరన ఉండే కార్టిలేజ్ దెబ్బతింటుంది. ఈ కారణం వల్ల కూడా షోల్డర్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇలాంటప్పుడు భుజంలో నొప్పి వస్తుంది. లక్షణాలు: భుజంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కదలించినప్పుడు కీళ్ల మధ్య రాపిడి జరుగుతున్నట్లుగా ఉంటుంది. భుజం కదిలించడంలో ఇబ్బంది. నిర్ధారణ: సాధారణ ఎక్స్–రేతో భుజం ఆర్థరైటిస్‌ను స్పష్టంగా నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: సమస్య తొలి దశలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, ఇంజెక్షన్స్‌తో దీనికి చికిత్స చేయవచ్చు. అయితే భుజం నొప్పి తీవ్రంగా ఉండి, అనంతర దశల్లోకి ప్రవేశిస్తే... షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ లేదా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం కావచ్చు. సర్జరీ అవసరం ఎప్పుడన్నది ఆర్థరైటిస్ తీవ్రత మీద ఆధారపడుతుంది. ఫ్రోజెన్ షోల్డర్ ఈ సమస్య ప్రధానంగా పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. సాధారణంగా 40 – 60 ఏళ్ల వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఎందువల్ల వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. కానీ... డయాబెటిస్ ఉన్నవారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భుజానికి గాయమైన వారిలో, గతంలో ఏ కారణం వల్లనైనా భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో మరింత ఎక్కువ. చేతి ఎముక, భుజంతో కలిసే చోట గుండ్రంగా ఉండి, అది అక్కడి సాకెట్లో ఇమిడి ఉండే భాగం చాలా సంక్లిష్టమైన నిర్మాణం. ఇందులో భుజం కీలు చుట్టూ కవచంలా ఉండే భాగాన్ని క్యాప్సూల్ అంటారు. ఈ సమస్య వచ్చినవారిలో కీలు అంతా బాగానే ఉన్నప్పటికీ క్యాప్సూల్ భాగం బాగా మందంగా మారుతుంది. ఇది ఎక్స్‌రేలో, ఎమ్మారైలో పెద్దగా కనిపించదు. ఈ సమస్య ఉన్నవారిలో భుజం కదలికలు చాలా పరిమితంగా మారతాయి. గతంలోలా భుజం సులువుగానూ, తేలిగ్గానూ కదిలించలేరు. విపరీతమైన భుజం నొప్పి ఉంటుంది. డయాబెటిస్ వచ్చినవారిలో ఈ నొప్పి ఎక్కువ. అందుకే ఈ నొప్పిని డయాబెటిస్‌కు ఒక సూచికగా కూడా డాక్టర్లు తీసుకుంటూ ఉంటారు. చికిత్స: సాధారణంగా చాలామందిలో ఫ్రోజెన్ షోల్డర్ వల్ల వచ్చే నొప్పి కొన్నాళ్ల తర్వాత దానంతట అదే తగ్గిపోతుంటుంది. అయితే ఫ్రోజెన్షోల్డర్ని ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ వ్యాయామాల ద్వారా తగ్గించవచ్చు. నొప్పి మరీ తీవ్రంగా ఉంటే పెయిన్ కిల్లర్స్‌తో కొద్దిమేర ప్రయోజనం ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా నొప్పినివారణ మందుల్ని అదేపనిగా వడటం మాత్రం చాలా ప్రమాదం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిమితంగా... అందునా డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్‌కిల్లర్స్ వాడాలి.పాశ్చాత్యదేశాల్లో ఉపయోగించే ‘హైడ్రోడయలటేషన్’ వంటి ప్రక్రియలు ఇప్పుడు మనవద్ద కూడా లభ్యమవుతున్నాయి. అరుదుగా ఆర్థోస్కోపీ వంటి ప్రక్రియలు అవసరం కావచ్చు. రొటేటర్ కఫ్ పెయిన్ ఎవరైనా మన చేతిని మెలిదిప్పితే... మన భుజం వద్ద కూడా నొప్పి రావడం చూస్తుంటాం కదా... చెయి మెలిదిప్పకపోయినా అచ్చం అలాంటి నొప్పే రొటేటర్ కఫ్ సమస్య ఉన్నవారిలో కనిపిస్తుంటుంది. రొటేటర్ కఫ్ అన్న సమస్య వారిలో భుజంలోని ఏడు ప్రధాన కండరాల్లో నాలుగు కండరాలు ప్రభావితమవుతాయి. ఈ కండిషన్ ఉన్నవారిలో చేతి ఎముకకూ, భుజం ఎముకకూ మధ్య ఉండాల్సిన గ్యాప్ తగ్గుతుంది. ప్రధాన కండరమైన రొటేటర్ కఫ్‌కు పగుళ్లు ఏర్పడతాయి. దాంతో గతంలో తమ భుజాన్ని చాలా తేలిగ్గా పైకి లేపగలిగిన వారు కూడా ఈ సమస్య ఉన్నప్పుడు భుజాన్ని పైకెత్తడంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. భుజాన్ని పక్కలకు కదిలించినా నొప్పి ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా ఎమ్మారై ప్రక్రియల ద్వారా కండరాల్లో ఏవైనా పగుళ్లు ఉన్నాయేమో కనుగొంటారు. చికిత్స: ఈ సమస్య ఉన్నవారిలో ఫిజియోథెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్స్‌తో చికిత్స అవసరమవుతుంది. ఇక కొందరిలో ఆర్థోస్కోపీ ప్రక్రియ ద్వారా చేతి ఎముకకూ, భుజంలోపల ఉండే ఎముకకూ మధ్య ఉన్న గ్యాప్‌ను సరిచేస్తారు. ఈ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది ఆర్థరైటిస్‌కు దారితీసి, భవిష్యత్తులో అతి సంక్లిష్టమైన ‘షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ’ అవసరం పడవచ్చు. ఆటల కారణంగా భుజానికి అయ్యే గాయాలతో... భుజం ఎప్పుడూ కదులుతూ ఉండే భాగం కాబట్టి దానికి గాయమయ్యే అవకాశాలూ ఎక్కువే. ఉదాహరణకు భుజం గూడ తప్పడం (షోల్డర్ డిస్లొకేషన్), రొటేటర్ కఫ్ టేర్, స్లాప్ టేర్స్, టెండనైటిస్, టెండన్ రప్చర్స్ వంటివి జరగవచ్చు. సాధారణంగా ఆటల్లో భుజంలో గూడ తప్పడం సమస్య తరచూ కనిపిస్తుంటుంది. ఇలా జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. ఇదే సమస్య ప్రతి నిత్యం జరుగుతూ ఉంటే ఆర్థోస్కోపీ స్టెబిలైజేషన్ అనే శస్త్రచికిత్స ద్వారా వైద్య నిపుణులు దాన్ని సరిచేస్తారు. భుజం సమస్యలనివారణ ఇలా... ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇందువల్ల భుజం కండరాలు బలంగా మారి భుజానికి వచ్చే అనేక సమస్యలు నివారితమవుతాయి ♦ వ్యాయామంలో వెనకవైపు కండరాలపై కూడా దృష్టిపెట్టడం... చాలామంది శరీరానికి ముందువైపు ఉన్న కండరాలు బలంగా రూపొంది కనిపించడానికి తగిన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే భుజం విషయంలో మాత్రం చేతులకు వెనకవైపున ఉండే కండరాలు కూడా అంతే బలంగా రూపొందేలా వ్యాయామాలు చేయాలి ∙డయాబెటిస్ రోగులు తమ రక్తంలోని చక్కెర పాళ్లను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. వారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం అవసరం ∙కంప్యూటర్‌పై పనిచేసేవారు, వీడియోగేమ్స్ ఆడేవారు, టీవీ చూసేవారు, డ్రైవింగ్ చేసేవారు సరైన భంగిమలో కూర్చోవడం అవసరం. -
వైద్యరంగంలో ఇదో అద్భుతం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కేరళ వైద్యులు అద్భుతం చేసి చూపించారు. విద్యుత్ షాక్‌కు గురై రెండు చేతులూ కోల్పోయిన ఇక్కడి ఎన్ఏడీ ఉద్యోగికి బ్రైన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి వాటిని సేకరించి అతికించారు. కేరళ రాష్ట్రంలోని అమృతా ఆస్పత్రిలో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. అయితే ఇన్ఫెక్షన్ కారణంగా అతికించిన ఎడమ చేతిని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్రచికిత్సకు అవసరమైన రూ.20 లక్షలు ప్రభుత్వం ద్వారా వచ్చేలా ఐఎన్టీయూసీ విశేష కృషి చేసింది. కేంద్ర రక్షణ శాఖ నిధులు మంజూరు చేయడంతో ఉద్యోగికి కొత్త చేతిని అతికించారు. విద్యుత్ షాక్‌తో పోయిన చేతులు.. 2007లో ఎన్ఏడీ ప్రాంతం శాంతినగర్‌కు చెందిన ఎం.డి.ప్రసాద్ నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్ఏడీ)లో ఉద్యోగంలో చేరాడు. చేరిన రెండేళ్లకే ఇంటి వద్ద విద్యుత్ షాక్‌కు గురవడంతో రెండు చేతులూ పోయాయి. కేజీహెచ్‌లో వాటిని తొలగించేశారు. రెండు ఆర్టిషీషియల్ చేతులతో పదేళ్లుగా అతడు ఉద్యోగం చేస్తున్నాడు. కేజీహెచ్‌లో ఓ డాక్టర్ సలహా మేరకు కేరళాలో మనుషుల చేతులను అతికిస్తారని తెలిసి ప్రసాద్ సంప్రదించాడు. దీంతో ఆయన ఆశకు ఒక దారి దొరికినట్లయింది. అయితే రెండు చేతులు అతికించేందుకు సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతుందని అక్కడి డాక్టర్లు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని ఐఎన్టీయూసీ దృష్టిలో పెట్టాడు. తోటి ఉద్యోగికి సాయపడాలని యూనియన్ సభ్యులు ఎంతో కృషి చేశారు. రక్షణ రంగంలో ఈ విధంగా చేతులు, కాళ్లు కోల్పోయిన వారికి కొత్తగా అవయవాల ఏర్పాటు కోసం ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. అందుకు ఎటువంటి అవకాశం లేకపోయిన యూనియన్ పట్టు వీడలేదు. ఢిల్లీ స్థాయిలో రక్షణ శాఖ మంత్రి దృష్టికి దీనిని తీసుకెళ్లారు. దీంతో ఆపరేషన్‌కు నిధులు మంజూరయ్యాయి. అమృతా ఆస్పత్రిలో ఆపరేషన్.. చేతుల ఆపరేషన్ కోసం కేరళలోని అమృతా ఆస్పత్రిలో ఎం.డి.ప్రసాద్ చేరాడు. బ్రైన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి వైద్యులు రెండు చేతులు సేకరించారు. ఆపరేషన్ చేసి వాటిని ప్రసాద్‌కు అతికించారు. కుడి చేతి ఆపరేషన్ సక్సస్ అయిందని.. ఎడమ చేతి ఆపరేషన్ తరువాత ఇన్ఫెక్షన్ రావడంతో దాన్ని తొలగించేశారని యూనియన్ నాయకులు తెలిపారు. రక్షణ శాఖ ఉద్యోగికి ప్రభుత్వ నిధులతో ఈ విధమైన ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని ఉద్యోగులు చెబుతున్నారు. ఐఎన్టీయూసీ ప్రతినిధుల పరామర్శ.. చేతి ఆపరేషన్ చేయించుకున్నా ఎం.డి.ప్రసాద్‌ను శనివారం ఎన్ఏడీ ఐఎన్టీయూసీ కార్యదర్శి ఎస్.మారయ్య, ఉద్యోగులు ఎ.గణేష్, కె.వేలుబాబు తదితరులు పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. నీ వెంట యూనియన్ ఎల్లప్పుడూ ఉంటుందని ప్రసాద్‌కు భరోసా ఇచ్చారు. -
వివాహేతరం సంబంధం.. చేతులు నరికేసిన భర్త
విజయనగరం జిల్లా: గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంలో ఓ వ్యక్తి, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి చేతులు నరికేశాడు. కొత్తగూడ గ్రామానికి చెందిన నరేష్, సుహాసిని(పేరు మార్చాం) భార్యభర్తలు. సుహాసినితో అదే గ్రామానికి చెందిన బిడ్డిక ధనుంజయ్ అనే వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి మహిళ భర్త పథకం ప్రకారం మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో ధనుంజయ్‌ను గ్రామం బయటికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి కత్తితో ధనుంజయ్ రెండు చేతులూ నరికేశారు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు ధనుంజయ్‌ను దగ్గరిలోని భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్క నోట శిశువు చేయి
ప్రకాశం, కనిగిరి: కుక్క నోట శిశువు చేయి కనిపించడం పట్టణంలో శుక్రవారం కలకలం రేగింది. వివరాలు.. పట్టణంలోని సాయిబాబా థియేటర్ పక్కన చెత్త కుప్ప నుంచి ఓ కుక్క మోచేయి భాగాన్ని నోట కరుచుకుని కనిపించింది. అక్కడే ఉన్న యువకులు దాన్ని చూసి తొలుత రబ్బరు చేయిగా భావించారు. కుక్క చేయిని తన పిల్లలకు పీకి పెడుతుండగా రక్తం వస్తోంది. యువకులు అది శిశువు చేయిగా గుర్తించి కుక్కను తరిమి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి చెయ్యి భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెత్త కుప్పలో ఓ డబ్బా.. ఆస్పత్రులో ఉపయోగించే ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్ వంటి అనవాళ్లు ఉన్నాయి. ఆస్పత్రిల్లో జన్మించి మృతి చెందిన శిశువు మృతదేహం చేయి భాగంగా తెలుస్తోంది. శిశువు మృతదేహాన్ని ఖననం చేయకుండా చెత్త కుప్పలో పారేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన డెలివరీల వివరాలు సేకరిస్తున్నారు. -
రైలు కింద పడి చేతిని కోల్పోయాడు
రాజమహేంద్రవరం క్రైం : ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఒక వ్యక్తి చేతిని కోల్పోయాడు. కాకినాడకు చెందిన విస్సాకోటి శ్రీనివాస్ కొంతకాలంగా రాజమహేంద్రవరంలోని అన్నపూర్ణమ్మ పేటలో ఉంటూ వడ్రంగి పని చేస్తుంటాడు. బుధవారం తునిలోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి రైలులో వెళ్లేందుకు స్థానిక గోదావరి రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఎక్కుతుండగా రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్య పడి చేతిని కోల్పోయాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్‌ను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు ఒక బాబు, పాప ఉన్నారు. వడ్రంగి పనికి ప్రధానమైన చేతిని కోల్పోవడంతో కుటుంబ పోషణ అగమ్యగోచరంగా మారింది. కళ్ల ముందు జరిగిన దుర్ఘటనను కుటుంబీకులు జీర్ణించుకోలేపోతున్నారు. -
చేతిరాత..భవితకు బాట
పరీక్షల్లో ఆకట్టుకునే అక్షరాలు మార్కులు పెరిగే అవకాశం రాయవరం : అక్షరాలు కంటికి ఇంపుగా కనిపించేలా ఉండాలి. అందమైన దస్తూరి చూసేవారిని ఆకట్టుకుంటుంది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారి మనస్సును హత్తుకునేలా ఉంటే మార్కులు వేసేలా ప్రేరేపిస్తుంది. అదే పరీక్షల్లో విజేతగా నిలుపుతుంది. మరో రెండు రోజుల్లో పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో అక్షరాలను ముత్యాల్లా రాసే వారు పరీక్షల్లో 20 శాతం అధిక మార్కుల సాధనతో పాటు వారి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమాధానాలు రాయడంపై సూచనలు పాటిస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అక్షరాలను రాయాలిలా.. పేజీకి పై భాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టి రాయాలి. పేజీకి కుడివైపు అర అంగుళం ఖాళీ విడిచి పెట్టి రాయవాలి. ఇలా ఉంటే మూల్యాంకన సమయంలో ఉపాధ్యాయునికి జవాబులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెలుపు కాగితాలపై సాధన చేయాలి. జవాబుల్లో ఏదైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి. విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాలను చేతితో రాయించాలి. జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాన్ని ఒకవైపు సరళరేఖలను గీసి భాగాల పేర్లు రాస్తే మేలు. లేదా వాటి నంబర్లు ఇచ్చి ఒకవైపు రాయాలి. పరీక్ష పత్రంతో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాన్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలోనే జవాబులు రాయడం పూర్తిచేయాలి. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినవి.. జవాబు రాసే తీరు పరీక్ష పేపరు దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సమాధానాలు టీచరుకు తెలుసునని గుర్తించాలి. జవాబు పత్రం ఆకట్టుకోవాలంటే పేజీకి 18–19లైన్లకు మించకూడదు. జవాబు పత్రంలోని తొలి లైన్ రాసే సమయంలో మార్జిన్ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయకపోతే మిగిలిన లైన్లు వంకర్లు తిరుగుతాయి. గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదంగానీ, మరో సగాన్ని కిందలైన్లో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏమిటో అర్థం కాదు. పదం పూర్తిగా రాయాలి. ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టి మరీ రాస్తే రెండో వైపు అక్షరాలు కన్పిస్తూ గందరగోళం మారుతుంది. కొద్ది సేపు రాయగానే వేళ్లు నొప్పి పుడతాయి. అందుకే తేలికగా అందంగా రాయాలి. అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్థం చేసుకోలేక మార్కులు వేయరు. సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో ఒక క్రమపద్ధతి పాటించాలి. పాయింట్ల వారీగా... పరీక్షల్లో రాసే అక్షరాలు అర్థమయ్యేలా ఉంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు ముగ్దుడై మార్కులు వేస్తాడు. లేదంటే వెనకడుతారు. సమాధానాల్లో దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. సంగ్రహ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయాలి. ఇచ్చి ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి. స్టోరీ రైటప్‌లో మంచి మార్కులు సాధించాలంటే ఇచ్చిన హింట్‌ను బాగా చదివి అర్థం చేసుకుని రాయాలి. ప్రశ్నలకు జవాబులు పాయింట్ల వారీగా రాస్తే మార్కులు బాగా వస్తాయి. జవాబులకు మధ్యలో ఉప శీర్షికలు పెట్టాలి. ముఖ్య విషయాలను అండర్లైన్ వేసుకోవాలి. బిట్‌పేపరు రాసే సమయంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. -
అయినా... వారు బతికారు
చావు’..ఇది అందరికీ సహజంగా రాదు. కొందరి వయోవృద్ధులై చనిపోతే..మరికొందరు ప్రమాదవశాత్తు చనిపోతుంటారు. మనిషే కాదు, ఏ జంతువైనా సరే పుట్టిన మరుసటి రోజే జీవించి ఉంటుందో లేదో అన్న గ్యారంటీ లేదు. కాని కొందరి జీవిత చరిత్రలు గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వెనక్కి వచ్చేస్తుంటారు. కొన్ని అనుకోని పరిస్థితులు మనిషిని మృత్యువు ముంగటి వరకూ తీసుకెళ్తాయి. ఈ స్థితిలో బతికేందుకు ప్రయత్నించిన వారిలో కొందరే చావును జయిస్తారు. అలాంటివారి గాథలు ఎప్పుడూ ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలా పట్టువదలకుండా ప్రయత్నించి, మృత్యువును జయించిన వారి గురించి నేటి ‘బిలీవ్’ లో తెలుసుకుందాం..! విమానం కూలినా..ఏం తినకున్నా.. 42 రోజులు సాధారణంగా ఎవరైనా ఆహారం లేకుండా పది రోజులకు మించి ఉంటే..పూర్తిగా నీరసించి చావుకు దగ్గరవుతారు. ఒకవేళ అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారైతే చనిపోవడం ఖాయం. కాని కెనడాకు చెందిన హెలెన్ కెల్బెన్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆమె ఆహారం లేకుండా ఏకంగా 42 రోజులు జీవించింది. అమెరికాకు చెందిన కెలెన్ ఫెయిర్ బ్యాంక్స్ నగరం నుంచి సీటిల్కు వెళ్లాలనుకుంది. అప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. 1963 ఫిబ్రవరి 4న పైటట్ రాల్ఫ్ ఫ్లోర్స్‌తో కలిసి ప్రత్యేక విమానంలో సీటిల్కు బయలుదేరింది. అయితే మంచు తుపాను కారణంగా మధ్యలోనే కెనడా సమీపంలోని ఓ మంచు పర్వతం వద్ద వారి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వారికి కొన్ని చోట్ల ఎముకలు విరగడంతోపాటు, చిన్నచిన్న గాయాలు కూడా అయ్యాయి. వారి వద్ద అత్యవసర స్థితిలో రక్షణకు ఉపయోగపడే పూర్తిస్థాయి సామాగ్రి కూడా లేదు. కానీ అగ్గిపెట్టెతోపాటు, వారం రోజులకు సరిపడా ఆహారం మాత్రం ఉంది. విమానం కూలిపోయిన ప్రాంతంలో మంచు ఉండడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తక్కువగా (–41 డిగ్రీలు) ఉన్నాయి. ఈ స్థితిలో వారు ప్రాణాలు నిలుపుకొనేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. విమానం క్యాబిన్లోంచి ఓ బ్లాంకెట్‌ను తయారు చేసుకుని, ఇంధనంతో మంట వెలిగించుకున్నారు. వారం తర్వాత ఆహారం అయిపోయింది. మంచుకరగసాగింది. ఈ సమయంలో వారికి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా మంచును కరిగించడం వల్ల లభించినవే. అలా నీటితోనే ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 42 రోజులపాటు జీవించారు. చివరకు ఓ విమానం వారి జాడను కనిపెట్టడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సాధారణంగా ఆహారం లేకుండా అన్ని రోజులు జీవించడం కష్టమే. కానీ వారిరువురూ చాలా లావుగా ఉండడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వే వారిని రక్షించిందని వైద్యుల విశ్వాసం. ప్రాణం కోసం చేతినే..! అమెరికాకు చెందిన ఆరన్ రాల్ స్టన్‌కు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త రికార్డు సృష్టించాలని తాపత్రయం పడేవాడు. ఎప్పటిలాగే 2003 ఏప్రిల్ నెలలో ఉత్తాహ్ ప్రాంతంలోని బ్లూజాన్ అనే పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లాడు. దాదాపు సగం పర్వతాన్ని ఎటువంటి సమస్యా లేకుండా అధిరోహించాడు. మంచు కురుస్తున్న సమయం కావడంతో అతనికి దారి సరిగా కనిపించలేదు. అయితే ఈ సమయంలోనే ఓ పెద్ద రాయి(దాదాపు 360 కేజీల బరువు) ఒక్కసారిగా పై నుంచి పడింది. దీంతో రాల్స్టన్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన రాయి అతని కుడి చేతిపై పడింది. రాల్స్టన్ ఎంత ప్రయత్నించినా చేతిని రాయి కింది నుంచి తీయలేకపోయాడు. రాయి కిందనే చేయి ఇరుక్కుపోయి పూర్తిగా నలిగిపోయింది. ఆ రాయిని పక్కకు జరిపేందుకు అతడు ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు. ఒంటరిగా చిక్కుకుపోయిన అతడిని రక్షిచేవారెవరూ అక్కడలేరు. అలా ఆరు రోజులపాటు చేయి రాయికింద ఇరుక్కుపోయి అలాగే ఉంది. ఆ చేయి అలాగే రాయికింద ఉంటే, ఇంకా కొద్ది రోజులకు అతడి ప్రాణాలు పోవడం ఖాయమని అనుకున్నాడు. అప్పటికే అతని చేతి నరాలు పూర్తిగా నలిగిపోయినట్టు రాల్స్టన్ గమనించాడు. చేతికి స్పర్శ కూడా లేకుండా పోయింది. చివరకు ఈ సమస్య నుంచి బయపడేందుకు అతడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాతికింద ఇరుక్కున్న భాగాన్ని కోసేసుకోకుంటే కనీసం ప్రాణమైనా మిగులుతుందని అనుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న ఓ చిన్న కత్తి సాయంతో అక్కడివరకు చేయిని కోసేసి, ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథతో ‘127 అవర్స్’ అనే మూవీ కూడా రూపొందింది. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ప్రజలకు మొండిచేయి చూపుతున్న టీడీపీ
గొరిగపూడి(భట్టిప్రోలు): ఎన్నికలకు ముందు టీడీపీ రకరకాల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండి చెయ్యి చూపిస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయ కర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. భట్టిప్రోలు మండలం గొరిగపూడిలో ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటేశ్వరరావు ఇంట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీలు ఇచ్చి జనాలను మోసం చేశారన్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికి ఫించన్లు అందకుండా చేస్తున్నారని, జన్మభూమి కమిటీ సభ్యులు అనుకూలమైన వారికే పథకాలు వర్తింప చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని నేతలు అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వారు మాఫియాలకు పాల్పడుతున్నారన్నారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికి హోదా విషయంలో కప్పదాట్లు వేశారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. భారత దేశంలో ఆర్థిక మాంద్యం రాబోతుందని నోట్ల రద్దు విషయం ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుండేదని తెలిపారు. ప్రజలు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని తెలిపారు. -
వికలాంగ యువతకు శిక్షణ
ముకరంపుర: రాష్ట్రంలో తొలిసారిగా వికలాంగుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన డీడీయూజీకేవై పథకం ద్వారా వరంగల్ జిల్లా ధర్మసాగర్లో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు. నిరుద్యోగ వికలాంగులకు ఈ కేంద్రంలో శిక్షణతో నైపుణ్యాలు పెంచి అనంతరం ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగావకాశాలు కల్పించనునన్నట్లు పేర్కొన్నారు. ట్యాలీ, డీటీపీ, డాటా ఎంట్రీ, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి చదివి ఉండి, 19 నుంచి 32 ఏళ్ల వయస్సున్న గ్రామీణ ప్రాంత వికలాంగులు, బదిరులు ఈ పథకానికి అర్హులన్నారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్తో పాటు మూడు నెలల పాటు వెయ్యి రూపాయల చొప్పున సై్టఫండ్ అందిస్తారని తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులైన వికలాంగులు 7893985858, 9440804858 నెంబర్లలో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. -
అపోలో చేతికి అర్బన్ హెల్త్ సెంటర్ల తాళాలు
అనంతపురం సిటీ: అపోలో హాస్పిటల్స్ చేతికి అర్బన్ హెల్త్ సెంటర్స్ తాళాలు అప్పగించాలంటూ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సెంటర్ నుంచి గురువారం ఉత్తర్వులు అందాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. దీంతో జిల్లాలోని 19 ఆరోగ్య కేంద్రాలు అపోలో హాస్పిటల్స్ చేతిలోకి వెళ్లిపోనున్నాయి. ఆ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల్లో పూర్తీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
టాబ్లెట్‌ను లాక్కున్న డాల్ఫిన్
-
ముక్క కలిపితే కోట్లు రాలాల్సిందే..
– రైజింగ్‌లో అధికార పార్టీ నేత – తాజాగా రూ.3 కోట్ల గెలుపు – రూ.కోటి పోగొట్టుకున్న ముఖ్య నేత సోదరుడు? – కర్నూలు, శివారు ప్రాంతాల్లో ఆట – హోటళ్లు, తోటలే అడ్డా ఆ నేత పేక ముక్కలు కలిపితే.. అవతలి వ్యక్తి చిత్తవ్వాల్సిందే. కోరుకున్న ముక్కలు కూడబలుక్కున్నట్లు ఆయన చేతిలో ఒదిగిపోతుంటే.. ‘ఆసు’కవిత్వం కోట్లు రాలుస్తోంది. శివారు తోటలు.. నగర హోటళ్లు ఈ ఆటకు దాసోహం కాగా, నేతల నోట ఈ రైజింగ్ హ్యాండ్ చర్చనీయాంశంగా మారింది. ఇంకేముంది.. విదేశీయానాలు, ఖరీదయిన పార్టీలకు ఈ పేకాట ‘కింగ్’ పెట్టింది పేరు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార పార్టీ నేత పేకాట జోరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో ఏకంగా రూ.3 కోట్లు గెలుచుకున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్యనేత సోదరుడివే కోటి రూపాయలు ఉన్నట్టు తెలిసింది. గతంలో కూడా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆడిన ఆటలో సదరు నేత ఏకంగా రూ.70 లక్షలు గెలుచుకున్నారు. ఈ డబ్బుతోనే భారీగా పాణ్యం నియోజకవర్గంలో పార్టీ చేసుకున్నారనే గుసగుసలు అప్పట్లోనే వచ్చాయి. మరోవైపు ఊహించనిస్థాయిలో వస్తున్న ఆదాయంతో విదేశీయానాలు కూడా బాగానే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్నను ఆడించావో.. వాస్తవానికి ఈ పేకాటలో జిల్లాలోని అధికార పార్టీ నేతలందరూ పాలుపంచుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. భారీగా కోట్లలో జరుగుతున్న ఈ దందా నగరం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తోటలతో పాటు కర్నూలులోని పెద్ద పెద్ద హోటళ్లలోనూ సాగుతోందని సమాచారం. ఇందులో వేల రూపాయలతో ఒక్కో ఆట సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యనేత సోదరుడు కూడా ఆటలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏకంగా కోటి రూపాయలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన మరో సోదరుడు.. తన అన్నతో ఆడితే ఖబడ్దార్ అంటూ రూ.3 కోట్లు గెలుచుకున్న మరో నాయకుడిని బెదిరించారు. మరోసారి అన్నతో ఆడినట్టు తెలిస్తే మంచిది కాదని హెచ్చరికలు కూడా జారీచేశారు. అసలు ఆదాయం కంటే.. పేకాటలో రైజింగ్ హ్యాండ్లో ఉండి భారీగా సంపాదిస్తున్న సదరు నేత వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పోస్టు కోసం కోట్లలోనే ఖర్చు చేశారు. ఈ పోస్టు వచ్చినప్పటికీ అంతో ఇంతో పర్సెంటేజీలు తీసుకుంటూ పనులు చేస్తున్నప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ముక్కల ఆటలో కోట్లు సంపాదించడం ప్రారంభించారు. ఫలితంగా అసలు పోస్టు ఆదాయం కంటే కొసరుగా ఈ పేకాటతో వస్తున్న ఆదాయమే బాగుందని సదరు నేత సంబరపడిపోతున్నారట. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో విదేశీయానాలు కూడా బాగానే చేస్తున్నట్టు సమాచారం. సదరు నేత పాస్‌పోర్టును గమనిస్తే ఎన్ని దేశాలు తిరిగాడో తెలుస్తుందని అధికారపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏదో ఒక సమస్యతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సదరు నేత.. ఇప్పుడు పేకాటతో ఏకంగా ‘కోట్లలో వ్యక్తిగా’ నిలుస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఇంత భారీ మొత్తంలో సాగుతున్న ఈ పేకాట దందా వైపు కనీసం కన్నెత్తి చూసేందుకు పోలీసులు జంకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో కండక్టర్ల చేతివాటం ఆకస్మిక తనిఖీలో దొరికిన ముగ్గురు సిబ్బంది ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి జరిమానాl అన్నవరం : నష్టాల్లో నడుస్తున్న అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు ను లాభాల బాటలోకి మళ్లించేందుకు అధికారులు చేస్తున్న య త్నాలు ఇంటి దొంగల పుణ్యమా అని నిష్ఫలంగా మారుతున్నా యి. అన్నవరం కొండపై నుంచి రైల్వేస్టేష్టన్కు నడిచే దేవస్థానం బస్‌లలో భక్తులు ఎక్కువగానే ప్రయాణిస్తున్నా ఆదాయం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోజరిపిన తనిఖీల్లో కొందరు కండక్టర్లు భక్తుల నుంచి నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా జేబులలో వేసుకుంటున్న విషయం వెల్లడైంది. దేవస్థానం ట్రాన్స్‌పోర్టు గత మూడేళ్లుగా రూ.లక్షల నష్టాన్ని చవి చూస్తున్నా భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం నాలుగు బస్‌లను రైల్వేస్టేష్టన్ నుంచి కొండమీదకు నడుపుతోంది. సగం మందికే టిక్కెట్లు.. తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ ఆరు ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్లో ఆగుతాయి. వాటిలో వచ్చే భక్తులు దేవస్థానం బస్‌ల ద్వారా రత్నగిరికి చేరుకుంటారు. అయితే కొందరు కండక్టర్లు బస్ నిండా భక్తుల్ని ఎక్కించాక కొందరికే టిక్కెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఆ సొమ్ములను దిగమింగుతున్నారు. బస్‌లో 50 మంది ఎక్కినా టి క్కెట్లు సగం మందికే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈఓ ఆదేశాల తో దేవస్థానం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేష్టన్ నుంచి రత్నగిరి కి వస్తున్న బస్‌ను తనిఖీ చేయగా భక్తుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వని విషయం వెల్లడైంది. ఔట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ఆ బస్ కండక్టర్ బి.వేంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. ఆదివారం మరో రెండు బస్‌లు తనిఖీ చేయగా ఒక కండక్టర్ ఆర్.రామకృష్ణ 20 మంది భక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని తేలడంతో సస్పెండ్ చేశారు. మరో కండక్టర్ బీవీ కిషోర్ ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో రూ.రెండు వేలు ఫైన్ విధించారు. బస్‌లలో ఆకస్మిక త నిఖీలను ఇక ముందూ కొనసాగిస్తామని ఈఓ నాగేశ్వరరావు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. -
బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో కండక్టర్ల చేతివాటం ఆకస్మిక తనిఖీలో దొరికిన ముగ్గురు సిబ్బంది ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి జరిమానాl అన్నవరం : నష్టాల్లో నడుస్తున్న అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు ను లాభాల బాటలోకి మళ్లించేందుకు అధికారులు చేస్తున్న య త్నాలు ఇంటి దొంగల పుణ్యమా అని నిష్ఫలంగా మారుతున్నా యి. అన్నవరం కొండపై నుంచి రైల్వేస్టేçÙన్కు నడిచే దేవస్థానం బస్‌లలో భక్తులు ఎక్కువగానే ప్రయాణిస్తున్నా ఆదాయం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోజరిపిన తనిఖీల్లో కొందరు కండక్టర్లు భక్తుల నుంచి నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా జేబులలో వేసుకుంటున్న విషయం వెల్లడైంది. దేవస్థానం ట్రాన్స్‌పోర్టు గత మూడేళ్లుగా రూ.లక్షల నష్టాన్ని చవి చూస్తున్నా భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం నాలుగు బస్‌లను రైల్వేస్టేçÙన్ నుంచి కొండమీదకు నడుపుతోంది. సగం మందికే టిక్కెట్లు.. తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ ఆరు ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్లో ఆగుతాయి. వాటిలో వచ్చే భక్తులు దేవస్థానం బస్‌ల ద్వారా రత్నగిరికి చేరుకుంటారు. అయితే కొందరు కండక్టర్లు బస్ నిండా భక్తుల్ని ఎక్కించాక కొందరికే టిక్కెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఆ సొమ్ములను దిగమింగుతున్నారు. బస్‌లో 50 మంది ఎక్కినా టి క్కెట్లు సగం మందికే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈఓ ఆదేశాల తో దేవస్థానం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేçÙన్ నుంచి రత్నగిరి కి వస్తున్న బస్‌ను తనిఖీ చేయగా భక్తుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వని విషయం వెల్లడైంది. ఔట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ఆ బస్ కండక్టర్ బి.వేంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. ఆదివారం మరో రెండు బస్‌లు తనిఖీ చేయగా ఒక కండక్టర్ ఆర్.రామకృష్ణ 20 మంది భక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని తేలడంతో సస్పెండ్ చేశారు. మరో కండక్టర్ బీవీ కిషోర్ ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో రూ.రెండు వేలు ఫైన్ విధించారు. బస్‌లలో ఆకస్మిక త నిఖీలను ఇక ముందూ కొనసాగిస్తామని ఈఓ నాగేశ్వరరావు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. -
ఇంటింటా బీఎఫ్‌డీ ప్రక్రియ : డీఎస్ఓ
కాకినాడ సిటీ: రేషన్ లబ్ధిదారుల పది మంది చేతివేలిముద్రలు ఇంటింటికీ వెళ్ళి సేకరించే బెస్ట్‌ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్‌డీ) ప్రక్రియను చేపట్టినట్టు పౌర సరఫరాలశాఖ అధికారి జి.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి వేలిముద్రలు సేకరించాలని చౌకడిపో డీలర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల మంది రేషన్‌కార్డులకు సంబంధించి 40,20,904 మంది లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 17,63,671 మంది వేలిముద్రలను సేకరించినట్టు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహించి తిరిగి ఆగస్టు 10 నుంచి 30 వరకు చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా ఆగస్టు నుంచి పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి బియ్యం చౌక దుకాణాలలోని ఈ పోస్ మెషీన్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని 4,309 పాఠశాలలకు సంబంధించి 926 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తెగిపడిన చెయ్యి
కందుకూరు : కందుకూరు ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెయ్యి తెగిపడింది. మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందిన సాయిలు (45) మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని చెవులపల్లి వద్ద ఉన్న తన పొలానికి బైక్‌పై వెళ్లి, మంగళవారం రాత్రి తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలో పులిమామిడి, మహేశ్వరం రహదారిపై కేకే బస్తీ బస్‌స్టాప్ వద్ద ఓ ఆటో, అతడి బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో సాయిలు కుడి చెయ్యి తెగిపడగా, మరో కాలు, చెయ్యి కూడా విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న చిప్పలపల్లికి చెందిన ఆంజనేయులుకు తీవ్ర గాయాలవగా.. తెగిపడిన చెయ్యితో సహా అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు. మామిళ్ల అనసూయ, ప్రేమలత, లావణ్య, పెంటయ్య స్వల్పంగా గాయపడగా, వీరిని కూడా అదే ఆస్పత్రికి తరలించారు. -
నేను మీ చేతిని
దురదృష్టం కొద్దీ ఒకవేళ తనకు కళ్లు పోయినా, కాళ్లు పోయినా అంతకంటే ఘోరం ఉండదనుకుంటాడు ఆనంద్. అయితే, నన్నూ, నా భాగస్వామిని కోల్పోతే మాత్రం అతడికి అంతకు మించిన కష్టం తప్పదు. నేను ఆనంద్ కుడి చేతిని. ఆనంద్ శరీరంలో నేనూ, నా భాగస్వామి కీలకమైన దేహ యంత్ర భాగాలం. ఆనంద్ శరీరంలోని ఇతర భాగాల్లాగానే మేము కూడా అతడి మెదడు అధీనంలో పనిచేస్తుంటాం. మెదడే నియంత్రణలోనే పనిచేస్తుంటాం చాలా మానవ నిర్మిత యంత్రాలన్నీ నా ముందు బలాదూరే! ఆనంద్ నైపుణ్యం గల టైపిస్ట్ అనుకోండి... నేనూ, నా భాగస్వామి కలిసి నిమిషానికి 120 పదాలను అలవోకగా టైప్ చేసేస్తాం. మమ్మల్ని నియంత్రించడానికే మెదడులో రెండు ప్రత్యేక భాగాలు పనిచేస్తుంటాయి. మెదడులో అవి ఉన్న ప్రదేశాన్నే ‘మోటార్ కార్టెక్స్’ అంటారు. ఆనంద్ తన బొటనవేలిని ఆడిస్తున్నాడనుకోండి... చాలా చిన్నగా కనిపించే ఈ చర్య కోసం మెదడు నుంచి... ఈ కండరాన్ని కొంచెం ముడుచుకోనీ, ఆ కీలును రిలాక్స్ కానివ్వు... వంటి వేలాది ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఆనంద్ నిద్రపోతున్నప్పుడు తప్ప నేనూ, నా భాగస్వామి ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. ఆనంద్ జీవితకాలంలో కనీసం రెండున్నర కోట్ల సార్లు అతడి పిడికిలి ముడుచుకోవడానికి, తెరుచుకోవడానికి దోహదపడేది మేమే. ఆనంద్ శరీరం బరువుకు సపోర్ట్ చేయడానికి తగినంత బలం ఉంటుంది మాకు. ఆనంద్ ముంజేతి కండరాల్లో ఉండే శక్తి ఫలితంగా బిగించి పట్టే అతడి పట్టు బలం 45 కిలోల వరకు ఉంటుంది. ఒకవేళ ఆనంద్ క్రమం తప్పని వ్యాయామంతో దృఢంగా ఉన్నాడనుకోండి అప్పుడు అతడి పట్టు బలం 60 కిలోల కంటే ఎక్కువే ఉంటుంది. నాలో 27 ఎముకలు ఉంటాయి భౌతికమైన పనులు చేయడంలోనే కాదు, మేధా వికాసంలోనూ మా పాత్ర ఉందని గర్వంగా చెప్పుకోగలం. గణితశాస్త్రం అభివృద్ధిలో మాది కీలక పాత్ర. నాకు, నా భాగస్వామికి ఉన్న పది వేళ్లతో పాటు, అతడి రెండు పాదాలకూ ఉండే పదివేళ్లు దశాంశ విధానాన్ని కనుగొనడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఇతర అవయవాలతో పోలిస్తే, నిర్మాణపరంగా నేను చాలా సంక్లిష్టంగా ఉంటాను. నా మణికట్టులో 8 ఎముకలు, అరచేతిలో 5 ఎముకలు, వేళ్లలో 14 ఎముకలు- నాలో మొత్తం 27 ఎముకలు ఉంటాయి. నా భాగస్వామిలో కూడా ఇదే సంఖ్యలో ఎముకలు ఉంటాయి. ఆనంద్ శరీరంలో ఉండే మొత్తం ఎముకల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ ఎముకలు మాలోనే ఉంటాయి. నాలోని ప్రతి చదరపు సెంటీమీటర్లోనూ వేలాది నరాల చివర్లు అనుసంధానమై ఉంటాయి. వీటి ద్వారానే వేడి, చల్లదనం, స్పర్శ తెలుసుకోగలుగుతాను. వేరు చేసే వేలిముద్రలు ఆనంద్ కడుపులో ఉండగా నాలుగో నెలలోనే వేలిముద్రలు ఏర్పడతాయి. ఒకరికి ఉండే వేలిముద్రలు ప్రపంచంలో వేరొకరికి ఉండనే ఉండవు. వేలిముద్రలే ఆనంద్ ఉనికిని ఇతరుల నుంచి వేరుచేసే ఆధారాలు. ఇక నా అరచేతుల్లో చాలా స్వేదగ్రంథులు ఉంటాయి. లక్షలాది ఏళ్ల కిందట ఆనంద్ పూర్వీకులు ఎక్కువగా చెట్ల మధ్య తిరుగాడేవారు. కొమ్మలను పట్టుకుని వేలాడటంలో చెమ్మదేరిన అరచేతులు వాళ్లకు మంచి పట్టు ఇచ్చేవి. ఇప్పుడు కూడా ఆనంద్‌కు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడంలోను, కారు స్టీరింగ్ పట్టుకోవడంలోను చెమ్మదేరిన అరచేతులే చక్కని పట్టు ఇస్తాయి. ఇవీ నా కష్టాలు ఆనంద్ చేసే పనుల్లో చాలా వరకు కీలక పాత్ర పోషించే నాకు చాలా కష్టాలు కూడా ఉన్నాయి. అతడు ప్రమాదాలకు గురైనప్పుడు తరచు గాయపడేది నేనే. వంటపని చేస్తున్నప్పుడు కాలడం, కూరగాయలు తరుగుతున్నప్పుడు కోసుకోవడం, మట్టి పనులు ఏవైనా చేసినప్పుడు కమిలిపోవడం వంటి బాధలు నాకు ఎదురవుతూ ఉంటాయి. ఇవి కాకుండా, తరచు ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకడం, సొరియాసిస్ వంటి చర్మవ్యాధులకు, అలెర్జీలకు కూడా గురవుతూ ఉంటాను. ఆర్థరైటిస్ వంటి ఇక్కట్లు నాలోని కీళ్లకు తీవ్రమైన నొప్పులు కలిగిస్తాయి. ప్రమాదవశాత్తు బలమైన దెబ్బలు తగిలినప్పుడు నా టెండన్లు, లిగమెంట్లు దెబ్బతింటాయి. ఒక్కోసారి ఎముకలు కూడా విరిగిపోతూ ఉంటాయి. తగిన చికిత్సలతో ఈ బాధలు నయమవుతూ ఉంటాయి. అదృష్టవశాత్తు నాకు క్యాన్సర్ సోకే అవకాశాలు మాత్రం చాలా చాలా అరుదు. ఇతర అవయవాలకు ప్రత్యామ్నాయం మేమే! ప్రపంచంలో దాదాపు 95 శాతం మందికిలాగే ఆనంద్‌ది కూడా కుడిచేతి వాటమే. అతడు శిశువుగా ఉన్నప్పుడు తొలి ఆరునెలల్లోనే తన చేతి వాటాన్ని ఎంచుకున్నాడు. ఆనంద్ పూర్వీకులు నిటారుగా నిలుచునే భంగిమను ఎంచుకోకుంటే, మనుషులు అతి దుర్బలమైన జీవులుగా మిగిలిపోయేవారు. ఏ పులికో, సింహానికో పలారమైపోయేవారు. నిటారుగా నిలబడే భంగిమ కారణంగానే చేతులు స్వేచ్ఛను పొందాయి. మెదడు కూడా అందుకు అనుగుణంగా పరిణామం చెందింది. ఫలితంగా చేతులు ఆయుధాలను ఉపయోగించడం సహా రకరకాల నైపుణ్యాలను నేర్చుకున్నాయి. కళ్లకు, గొంతుకు, చెవులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగల సామర్థ్యం మాది. ఆనంద్‌కు ఒకవేళ చూపుపోయిందనుకోండి... బ్రెయిలీ లిపిని చదవడానికి అతడి మమ్మల్ని వాడుకోవచ్చు. ఒకవేళ మూగ బధిరుడయ్యాడనుకోండి... సైగల భాష ద్వారా ఇతరులతో సంభాషించడానికి మేమే ఉపయోగపడతాం. మా స్పర్శజ్ఞానం గొప్పది. ఆనంద్ జేబులోంచి ఐదురూపాయల నాణెం తీయాలనుకోండి... జేబులోకి చూడకుండానే, వేళ్లతో తడిమి కచ్చితంగా అదే నాణేన్ని బయటకు తీయగలడు. బొటనవేలే కీలకం నాలో ఎక్కువగా పనిచేసే భాగాలు వేళ్లే. నాలుగు వేళ్లూ ఎంత పనిచేసినా, వాటికి వ్యతిరేకంగా బొటనవేలు లేకుంటే మాత్రం అవి అంత పనిచేయలేవు. బొటనవేలి సాయం లేకుండా ఆనంద్‌ను ఓ గ్లాసు నీళ్లు పెకైత్తమనండి చూద్దాం... పోనీ అంతొద్దు... పెన్ను తీసుకుని మిగిలిన నాలుగు వేళ్ల సాయంతోనే ఏదైనా రాయమనండి చూద్దాం. నేను చేసే పనుల్లో దాదాపు 45 శాతం బొటనవేలి సాయంతోనే సాధ్యమవుతాయి. బొటనవేలి సాయమే లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దాదాపు అసాధ్యంగా అనిపిస్తాయి. నాలో ఒకదానికి మరొకటిగా అతుక్కుని ఉండే ఎముకల మధ్య సున్నితమైన టెండన్లు, లిగమెంట్లు వాటి కదలికలకు దోహదపడతాయి. వాటిపై కనెక్టివ్ టిష్యూలతో పొరలా ఉండే ఫ్యాషియా నరాలు, రక్తనాళాలు వంటి ఇతర అంశాలకు పునాదిలా పనిచేస్తుంది. నాలో లెక్కలేనన్ని రక్తనాళాలు ఉంటాయి. -
దళారుల చేతుల్లో చిక్కుకున్న రైతు బజార్లు
-
బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు
పాట్నా: బ్యాంకు దొపిడీకి పాల్పడిన ఓ వ్యక్తి పారిపోయే క్రమంలో గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అతని చేయి నరికేశారు. ఈ ఘటన బిహార్‌లోని మహువా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం సాయుధులైన నలుగురు దుండగులు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ సర్వీస్ సెంటర్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 1.70 లక్షలు దోచుకొని పారిపోతున్న క్రమంలో.. నలుగురిలో జితేందర్ కుమార్ అనే దుండగుడు గ్రామస్తులకు చిక్కాడు. పారిపోతున్న సమయంలో దుండగులు తమపై కాల్పులకు కూడా పాల్పడటంతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు జితేందర్ కుమార్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం దోపిడీకి శిక్షగా అతని చేయిని నరికేశారు. పోలీసులు గ్రామస్తుల నుండి జితేందర్ కుమార్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు పాట్నా ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. -
సొంత చేయి పరాయిదైతే?!
మెడిక్షనరీ చేయి తనదే... కానీ చేష్ట మాత్రం తనది కాదు. తాను చేస్తున్న పని తాను అనుకున్నది కాదు. అలా చేయడం కూడా ఇష్టం లేదు. అయినా తన చేతిపైన తనకే నియంత్రణ ఉండదు. ఈ లక్షణాలు తెలుసుకుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తోందా? అయినా ఇది వాస్తవం. ఇది నరాలకు సంబంధించిన ఒక జబ్బు. కాస్తంత అరుదుగా కనిపిస్తుంది. ఇది వచ్చిన వారు తమ చేయి తమ ఒంటిలో భాగంలా అనిపించడం లేదని ఫీలవుతుంటారు. ఈ రుగ్మత పేరు ‘ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్’. ఈ జబ్బు వచ్చిన వారు తమ చేతిని మరెవరో నియంత్రిస్తున్నారనీ అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో పక్షవాతం వచ్చినవారిలోనూ, మెదడుకు శస్త్రచికిత్స అయిన వారిలోనూ, ఇన్ఫెక్షన్ వచ్చినవారిలో ఇది కనిపిస్తుంది. ఒక మహిళా పేషెంట్లో ఈ వ్యాధిని కనుగొన్న డాక్టర్ కర్ట్ గోల్డ్‌స్టెయిన్ అనే సైకియాట్రిస్ట్ దీన్ని మొదటిసారి దీన్ని నమోదు చేశారు. దీనికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేకపోయినా... చాలామందిలో దానంతట అదే తగ్గుతుంది. -
మణికి కీర్తిసురేశ్ హ్యాండ్
షూటింగ్ ప్రారంభమయ్యే వరకే కాదు, మొదలయిన తరువాత కూడా చిత్రంలో ఎవరుంటారో? ఉండరో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 30,40 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత కూడా కథానాయికలు చిత్రం నుంచి వైదొలగడమో, తొలగించడమో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మణిరత్నం చిత్రానికి అలాంటి పరిస్థితి కాకపోయినా షూటింగ్ ప్రారంభానికి ముందే హీరోహీరోయిన్లు అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం ఒక భారీ ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మొదట మళయాళ సూపర్‌స్టార్ మమ్ముటి, కార్తీ హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటించనున్నట్లు చెప్పుకున్నారు. ఆ తరువాత కార్తీ, దుల్కర్‌సల్మాన్‌లు హీరోలుగానూ, కీర్తీసురేశ్, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అలాటిది ఇక షూటింగ్రెడీ అవ్వడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా చిత్రం నుంచి దుల్కర్సల్మాన్ తప్పుకున్నారు. ఆయన ప్రతాప్పోత్తన్ దర్శకత్వంలో మలయాళ చిత్రాన్ని అంగీకరించడమే మణిరత్నం చిత్రాన్ని చేయలేకపోవడానికి కారణంగా తెలిసింది. మణిరత్నం దుల్కర్సల్మాన్ స్థానంలో తెలుగు నటుడు నానిని తీసుకున్నారు. ఇక అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు. అంతా అవ్వలేదనేవిధంగా తాజాగా మణి చిత్రానికి కీర్తీసురేశ్ హ్యాండ్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ నిర్మాత సురేశ్ స్పష్టం చేశారు. కారణాన్ని ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ తన కూతురు మణిరత్నం చిత్రం నుంచి వైదొలగిన విషయం నిజమేనన్నారు. ఆ చిత్రంలో కీర్తీ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. మరో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో ఇప్పుడే సెకెండ్ హీరోయిన్ పాత్ర చేయడానికి కీర్తీకి ఇష్టం లేదన్నారు. -
తెగిన ఎడమ చేతిని కుడికాలికి కుట్టి...
బీజింగ్: సృష్టికి ప్రతిసృష్టి చేసే వైద్యులు దేవుడితో సమానమంటారు. ఒక ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కార్మికుడి చేతిని వైద్యులు రక్షించి ఈ మాటను మరోసారి రుజువు చేశారు. చైనాలోని జో అనే కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా ప్రమాదానికి లోనయ్యాడు. అతడి ఎడమ చేయి మిషన్‌లో పడి తెగిపడింది. అతికించడానికి వీల్లేకుండా చర్మం అంతా పిప్పి పిప్పి అయిపోయింది. దీంతో ఆ భాగంలోని నరాలు, టిష్యూలను రక్షించడానికి జోకు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు పూనుకున్నారు . మైక్రో బయాలజీ విభాగం అధిపతి డా.టాంగ్ జుయు నేతృత్వంలో ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. వివరాల్లోకి వెడితే ...చైనాలోని ఒక ఫ్యాక్టరిలో స్పిన్నింగ్ బ్లేడ్ మిషన్‌లో పడి జో ఎడమ చేయి మణికట్టు పై భాగమంతా పూర్తిగా నలిగి పోయింది. గాయాల నుంచి అతను కోలుకునే దాకా తెగిపడిన అవయవభాగాన్ని అతని కుడికాలుకి జత చేసి ఆ భాగాన్ని సజీవంగా నిలపగలిగారు. ఒకనెల తర్వాత దాదాపు 10 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు విజయవంతంగా జో చేతిని అతికించారు. అతడు ఇప్పుడిప్పుడే చేతివేళ్లను మెల్లిగా కదిలిస్తున్నాడని, పూర్తిగా స్వాధీనంలోకి రావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కార్మికుడి ఎడమ చేయి వేళ్లు, మిగిలిన కణాలకు రక్త ప్రసరణ జరిగి అది సజీవంగా ఉండేందుకే ఈనిర్ణయం తీసుకున్నామని డాక్లర్లు తెలిపారు. సాధారణంగా తెగిపడిన వేళ్లు, చేయి తదితర భాగాలకు సుమారు పది గంటల్లోపు తిరిగి రక్త ప్రసరణను పునరుద్ధరించాల్సిం ఉంటుందని పేర్కొన్నారు. అయితే జో కోలుకునేసరికి సమయం పడుతుందనీ, అందుకే మిగిలిన భాగాన్ని ఇలా కాపాడాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందించిన పుర్రెను అమర్చి చైనా వైద్యులు చరిత్ర సృష్టించారు. -
రైలు ఎక్కే తొందరలో....
సాక్షి, ముంబై: రైలు ఎక్కడానికి వెళుతూ ప్లాట్‌ఫాం, రైలుకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పడి మణికట్టు వరకు చేయి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మంగళవారం శాంతాక్రజ్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఖార్లోని సాయిబాబా నగర్ నివాసి అయిన అరుణ్ సావంత్ (35), శాంతాక్రజ్‌లోని రైల్వే స్టేషన్లో పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ కాలు జారి రైలుకి, ప్లాట్‌ఫాంకి ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయాడు. ఈ ఘటనలో మణికట్టు వరకు చేయి తెగిపోయింది. స్పృహ కోల్పోయిన సావంత్‌ను విలేపార్లేలోని కూపర్ ఆసుపత్రికి తరలించామని బాంద్రా గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబానికి సమాచారం అందించామన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. ఈ బాలుడ్నిలా..!
-
ఒత్తిడి భరించలేకే చేయి నరుక్కున్నా
‘తెలిసీ తెలియని వయస్సులో చెడు సావాసాలు పట్టి చోరీలకు అలవాటుపడ్డా. అది గతం. ఇప్పుడు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. దొంగతనాలు మానేద్దామనుకుంటే పోలీసులు ఒప్పుకోవడం లేదు. నక్సలైట్లు మారిపోతే ఇల్లు, పొలం ఇస్తున్నారు. నేను చోరీలు మానేస్తానంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. పోలీసుల బలవంతంతో చోరీలు కొనసాగించడం ఇష్టం లేక చేయి నరుక్కున్నా.’ పాత నేరస్తుడు భూక్యా నాగరాజు కథనమిది.. విజయవాడ క్రైం : ఎ.కొండూరు మైత్రీనగర్‌కు చెందిన భూక్యా నాగరాజు పాత నేరస్తుడు. ఇతడిపై వేర్వేరు పోలీస్స్టేషన్లలో 135 దొంగతనాల కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో శిక్ష అనుభవించాడు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొద్ది రోజుల కిందట రాజమండ్రి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్కడ ఉండగానే హైదరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. గత మంగళవారం బెయిల్ విడుదలయ్యాడు. రికవరీ కోసం హైదరాబాద్ పోలీసులు ఒత్తిడి చేస్తుండటంతో భరించలేక కుటుంబ సభ్యుల తో కలిసి పురుగుల మందు తాగి చనిపోవాల నుకున్నాడు. ఈ ప్రయత్నాన్ని ఇరుగు పొరుగు వారు అడ్డుకున్నారు. నాగరాజు గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి ఎవరో పోలీసులు వచ్చారంటూ కు టుంబ సభ్యులు ఫోన్‌చేసి చెప్పారు. దీంతో మనస్తాపం చెందాడు. ఊరికి దూరంగా ఉన్న పొలాల్లోకి వెళ్లి కుడి చేయి మణికట్టుపై కత్తితో నరుక్కున్నాడు. మైలవరం సమీపంలోని నాగులూరులో ఉంటున్న సోదరుడు చిట్టిబాబుకు ఫోన్లో విషయం చెప్పాడు. చిట్టిబాబు వచ్చి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఇక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేసి నాగరాజు కుడిచేయి ని మణికట్టు వరకు తొలగించారు. ప్రస్తుతం ఇ తడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెపుతున్నారు. ఈ సందర్భంగా నాగరాజు ‘సాక్షి’తో పలు విషయాలు చెప్పాడు. రికవరీ కోసం ఒత్తిడి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తే పోలీసులు రికవరీ కోసం తనను వేధింపులకు గురి చేస్తారని నాగరాజు తెలిపారు. నేరం చేయకపోయి నా రికవరీ ఇవ్వాల్సిందేంటున్నారని, లేదంటే నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నాడు. లేదంటే చేయని నేరాలపై జైలుకు పం పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. షాపుల యజమానుల ఉసురు తగులుతుందేమో.. అమ్మని నగలు కూడా అమ్మినట్టు చెప్పాలం టూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని నాగరాజు తెలిపాడు. ఏయే షాపుల్లో ఏ నగలు విక్రయిం చిందీ చెప్పాలనేది ముందుగానే తనకు చెప్పి దుకాణాలు చూపిస్తారన్నాడు. ఆ తర్వాత షాపుల వద్దకు తీసుకెళ్లి డ్రామా నడుపుతారని, అనేకమంది బంగారు షాపుల యజమానులు చేయని నేరానికి రికవరీ ఇవ్వాల్సి వచ్చేదన్నా డు. ఇలా చేయడం వల్ల తనకూ, తన కుటుం బానికి ఉసురు తగులుతుందనే బెంగ పట్టుకుందని చెప్పాడు. ఎన్కౌంటర్ పేరిట బెదిరింపు దొంగతనాలు మానేసినా.. రికవరీ ఇవ్వకున్నా గజదొంగ అడపా వెంకన్న మాదిరిగానే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నట్టు నాగరాజు పేర్కొన్నాడు. తనతో దొంగతనాలు చేయించి పోలీసు అధికారులు బాగుపడుతున్నట్టు తెలిపాడు. చేతులు లేకపోతే దొంగతనాలు చేయాలని అడగలేరని, అందుకే చేయి నరుక్కున్నానని చెప్పాడు. నోరు విప్పితే పలువురు కటకటాల వెనక్కే తాను నోరు విప్పితే పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది జైలుపాలవుతారని నాగరాజు తెలిపాడు. అన్ని జిల్లాల పోలీసులు తనను నేరాలు చేయమని ప్రోత్సహించి సొమ్ములు వెనుకేసుకున్న వారేనని పేర్కొన్నాడు. తన గతి వాళ్లకు పట్టడం ఇష్టం లేకే నోరు మెదపడం లేదని అన్నాడు. దొంగతనాలు మానేయాలనుకుంటున్నానని, తనను వదిలేయాలని నాగరాజు కోరుతున్నాడు. వేధింపులు కొనసాగితే ఈసారి తల నరుక్కుంటానని అతడు పేర్కొన్నాడు. వేధింపులు ఇలాగే కొనసాగితే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని నాగరాజు భార్య ఝాన్సీ తనను కలిసిన విలేకరులతో విలపిస్తూ చెప్పింది. -
కృత్రిమ చేయికీ స్పర్శ!
ఈయన పేరు ఇగోర్ స్పెతిక్. మూడేళ్ల క్రితం ఓ ప్రమాదంలో చేయి మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. కృత్రిమ చేయి అమర్చుకున్నా... చేత్తో పట్టుకున్నది అక్కడే ఉందో లేక జారి పడిపోయిందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు అదే కృత్రిమ చేయితో స్పెతిక్ చెర్రీపండ్ల తొడిమలను తీసేయగలడు. వాటిని ముట్టుకున్న అనుభూతి కూడా పొందగలడు! అంతా... అమెరికాలోని క్లీవ్‌లాండ్ వెటరన్స్ ఎఫైర్స్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు 20 ఏళ్ల ప్రయోగాల ఫలితం. ప్రమాద తాకిడికి తెగిపోగా మిగిలిన కొన్ని నాడులకు వేర్వేరు మోతాదుల్లో సూక్ష్మస్థాయిలో విద్యుత్తును ప్రవహింపజేయడం ద్వారా ఇది సాధ్యమైంది. చేయి పైభాగంలో దాదాపు 20 తీగలను ఏర్పాటు చేసి... వాటిని కృత్రిమ చేతి ముంజేయి భాగంలోని ప్రధానమైన ప్రాంతాలకు కలిపారు. ప్రవహించే విద్యుత్తును బట్టి దాదాపు 20 రకాల స్పర్శానుభూతులను పొందగలడిప్పుడు. గరుకుకాగితానికి తాకితే.. పెన్ను మొనను నొక్కితే.. ఎలా ఉంటుందో తెలుస్తోందని స్పెతిక్ అంటున్నారు. ప్రమాదం జరిగిన తొలినాళ్లలో తన చేయి ఇంకా ఉన్న ఫీలింగ్ ఉండేదని, విపరీతమైన నొప్పీ ఉండేదని... ఇప్పుడు మాత్రం అంతా మామూలుగానే ఉన్నట్లు అనిపిస్తోందని సంతోషంగా చెబుతున్నాడు. నాడులను ప్రేరేపించగల ఈ కొత్త టెక్నాలజీ మెరుగైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ విస్తృత వాడకంలోకి వచ్చేందుకు మాత్రం కొంచెం సమయం పడుతుందని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డస్టిన్ టైలర్ అంటున్నారు. -
సలాం కొట్టలేదని చెయ్యి నరికాడు
గోల్కొండ, న్యూస్‌లైన్: సలాం చెప్పకపోవడమే ఆ పెయింటర్ చేసిన నేరం... దాన్నే తలవంపుగా భావించిన ఓ రియల్టర్ అతడి వెంటపడి మరీ చేయి నరికాడు. మంగళవారం గోల్కొండ ఠాణా పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎస్సై గోపాల్‌రావు కథనం ప్రకారం... మహ్మదీ లైన్స్‌లోని శాతంనగర్ వాసి సయ్యద్ షకీల్ పెయింటర్. మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తూ జీషాన్ హోటల్ పక్క సందులోకి చేరుకున్నాడు. అక్కడ షకీల్‌కు ఎండీలైన్స్‌కు చెందిన రియల్టర్ యహ్యాఖాన్ తారసపడ్డాడు. షకీలఠ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన యహ్యా‘క్యాబే.. సలాం నైకర్తా’ (ఏం రా సలాం చెయ్యవా?) అంటూ హూంకరించాడు. దీన్ని పట్టించుకోని షకీల్ తన దారిన ముందుకు వెళ్లాడు. దీన్ని అవమానంగా భావించిన యాహ్యా ‘నీ పని పడతా’నంటూ పక్కనున్న మాసం దుకాణం నుంచి కత్తి తీసుకుని షకీల్ వెంటపడ్డాడు. అతనిని వెంటాడి మరీ పట్టుకుని కత్తితో దాడి చేశాడు. ఘటనలో షకీల్ ఎడమ చేయి మణికట్టు భాగం 70శాతం మేర తెగింది. పోలీసులు షకీల్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న యహ్యా కోసం గాలిస్తున్నారు.