బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు | Mob chops off hand of man who looted bank | Sakshi
Sakshi News home page

బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు

Published Wed, Jan 20 2016 6:51 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు

బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు

పాట్నా: బ్యాంకు దొపిడీకి పాల్పడిన ఓ వ్యక్తి పారిపోయే క్రమంలో గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అతని చేయి నరికేశారు. ఈ ఘటన బిహార్లోని మహువా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం సాయుధులైన నలుగురు దుండగులు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ సర్వీస్ సెంటర్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 1.70 లక్షలు దోచుకొని  పారిపోతున్న క్రమంలో.. నలుగురిలో జితేందర్ కుమార్ అనే దుండగుడు గ్రామస్తులకు చిక్కాడు.

పారిపోతున్న సమయంలో దుండగులు తమపై కాల్పులకు కూడా పాల్పడటంతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు జితేందర్ కుమార్ను తీవ్రంగా కొట్టారు. అనంతరం దోపిడీకి శిక్షగా అతని చేయిని నరికేశారు. పోలీసులు గ్రామస్తుల నుండి జితేందర్ కుమార్ను కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు పాట్నా ఎస్పీ మను మహరాజ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement