chops off
-
ఘోరం: మటన్ కత్తితో తమ్ముడు, మరదలితో పాటు
లక్నో: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన తమ్ముడి కుటుంబంపై రగిలిపోయాడు. వారిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని మటన్ కోసే కత్తి తీసుకుని వెళ్లాడు. ఇంట్లోకి ప్రవేశించి తమ్ముడిని.. మరదలును వారి కుమారుడిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచేసి వారిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లాలో చోటుచేసుకుంది. కజియానాలో నౌషద్, జమీల్ సోదరులు. నౌషద్ మటన్ వ్యాపారి. సోదరుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమ్ముడి కుటుంబాన్ని నాశనం చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం నౌషద్ తాను ఉపయోగించే మటన్ కత్తిని తీసుకుని జమీల్ (42), అతడి భార్య రూబీ (38)పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం జాలి కూడా లేకుండా ఏడాది వయసున్న తమ్ముడి కుమారుడిని కూడా పాశవికంగా కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో వారు ముగ్గురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన వెంటనే నౌషద్ తన తల్లితో పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. -
భార్యపై అనుమానం.. నిద్రిస్తుండగా దారుణం
భోపాల్: భార్యపై అనుమానం అతడిని రాక్షసుడిగా మార్చింది. విచక్షణ కోల్పోయి కట్టుకున్న భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. గొడ్డలితో ఆమె కాలు, చేయ్యి నరికాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. హోషంగాబాద్‌లోని సియోని మాల్వాకు చెందిన ప్రీతం సింగ్‌కు 2012లో సంగీతతో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. సంగీత ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా.. ప్రీతం సింగ్ కుమారుడితో కలిసి నిష్తాపూర్ ప్రాంతంలోని పరాస్ నగర్లో ఉంటుండేవాడు. దినసరి కూలీగా పని చేస్తుండేవాడు. ఇలా ఏడేళ్లుగా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలోకి అనుమానం అనే రాక్షసి ప్రవేశించింది. దాంతో కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సంగీత సెలవు మీద భోపాల్‌కి వచ్చింది. కుమారుడితో కలిసి సంతోషంగా గడిపింది. ఇక రాత్రి బిడ్డతో కలిసి నిద్ర పోతుండగా.. ప్రీతం సింగ్ గొడ్డలి తీసుకుని సంగీత కుడి చేయి, కాలు నరికాడు. దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రీతం సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని వెల్లడించాడు. సంగీతను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. -
బ్యాంకు లూటీ చేసినందుకు చేయి నరికేశారు
పాట్నా: బ్యాంకు దొపిడీకి పాల్పడిన ఓ వ్యక్తి పారిపోయే క్రమంలో గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అతని చేయి నరికేశారు. ఈ ఘటన బిహార్‌లోని మహువా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం సాయుధులైన నలుగురు దుండగులు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ సర్వీస్ సెంటర్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 1.70 లక్షలు దోచుకొని పారిపోతున్న క్రమంలో.. నలుగురిలో జితేందర్ కుమార్ అనే దుండగుడు గ్రామస్తులకు చిక్కాడు. పారిపోతున్న సమయంలో దుండగులు తమపై కాల్పులకు కూడా పాల్పడటంతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు జితేందర్ కుమార్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం దోపిడీకి శిక్షగా అతని చేయిని నరికేశారు. పోలీసులు గ్రామస్తుల నుండి జితేందర్ కుమార్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు పాట్నా ఎస్పీ మను మహరాజ్ తెలిపారు.