
Global Handwashing Day 2024: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్) అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి గాను దీన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలిసి 2008లో ‘గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ పార్ట్‌నర్‌షిప్ సముదాయంగా రూపొందాయి. ఆనాటి నుంచి దాదాపు 100కు పైగా దేశాల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్కూళ్లు, ప్రైవేటు సంస్థలు ఈ రోజున చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై అవగాహన కల్పిస్తున్నాయి.
ఈ ఏడాది థీమ్ : ‘‘శుభ్రమైన చేతులు ఎందుకు అవసరమంటే’’?
ఈ పొరబాట్లు చేయకండి...
చేతులు కడుక్కోవడం అందరికీ తెలిసిన విద్యే. ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేమీ లేవు. రెండుమూడేళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు మందులూ, మాకులూ, వ్యాక్సిన్ల కంటే ముందుగా అందరి ప్రాణాలు రక్షించింది ఈ చేతులు కడుక్కోవడమనే పనే. చేతులు కడుక్కోవడంలో చేసే కొన్ని పొరబాట్లను సరిదిద్దుకోవడమెలాగో చూద్దాం.
సబ్బును మరవకండి: వాష్ బేసిన్‌లో నల్లా / కొళాయి కింద చేతులుంచినా చేతులు కడుక్కున్నట్టే. కానీ హానికరమైన మురికి అంతా తొలగి΄ోవాలంటే సబ్బును వాడాల్సిందే.
మొక్కుబడిగా వద్దు: చేతులు కడిగేదే మురికినంతా శుభ్రం చేసుకోడానికి. అందువల్ల సబ్బు రాసుకున్న చేతివేళ్లను శుభ్రంగా కనీసం 20 సెకన్ల పాటు రుద్దుకుంటూ కడగాలి.
పొడిగా అయేంతవరకు ఆగండి: చేతుల్ని శుభ్రం చేసుకున్న వెంటనే
ఆ తడిచేతులతోనే ఏదైనా పనికి ఉపక్రమించడం సరికాదు. తడి చేతులు పొడిగా అయ్యేవరకు ఆగి అప్పుడు తినడం లేదా ఏదైనా పనిచేయడం మొదలుపెట్టాలి.
ఒకసారి చేతులు శుభ్రంగా కడిగాక తినడం లేదా ఏదైనా పని చేయడం పూర్తయ్యే వరకు మురికిగా ఉండే ఉపరితలాలను తాకడం సరికాదు.
ఆదరాబాదరా అసలే వద్దు
కొందరు చేతులు కడుక్కునేటప్పుడు ఆదరాబాదరా కడిగేసుకుంటారు. రెండు వేళ్లకూ మధ్యనుండే చోట్ల లేదా గోర్ల చివరల్లో అంతగా శుభ్రం చేసుకోరు. చేతులు కడుక్కోవడం అంటే వేలికీ వేలికీ మధ్యనుండే చోట్లలో, అలాగే గోర్ల కింద కూడా శుభ్రంగా కడుక్కోవాలి.
Comments
Please login to add a commentAdd a comment