14 'స్కిన్నీ జన్యువులు'(సన్నగా ఉండే జన్యువులు) బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధ్యయనం పేర్కొంది. ఇలాంటి జన్యువులు లేని వారితో పోలిస్తే..ఈ 14 'స్కిన్నీ జన్యువులు వ్యాయమం చేసిన వాళ్లే వేగంగా బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నారు. వీళ్లు జస్ట్ ఎనిమిది వారాల పరుగుకే దాదాపు 11 పౌండ్లు కోల్పోతారట. ఈ పరిశోధన బరువుకి సంబంధించిన కీలక జన్యువుల గురించి వెల్లడించింది.
ఈ జన్యవులు వ్యాయామం, జీవనశైలి మార్పులకు అనుగుణంగానే సక్రియం చేయబడి, బరువు తగ్గడం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్, రిహాబిలిటేషన్ ఉపాధ్యాయుడు హెన్నీ చుంగ్ అన్నారు. అయితే యూకేలోని కొన్ని పరిశోధనలు మాత్రం వ్యాయామం జోక్యం లేకుండా జన్యువులు తమ నిజమమైన సామర్ధ్యాన్ని చూపించవని చెబుతోంది. అంటే ఇక్కడ తగిన వ్యాయామం, సరైన జన్యువులతోనే మనిషిలో ఎలాంటి జన్యువులు ఉన్నాయనేది చెప్పగలరు వైద్యులు.
అందుకోసం 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల దాదాపు 38 మందిపై పరిశోధన చేశారు. వారిలో సగం మందికి సాధారణ ఆహారం, అలవాట్లను మార్చకుండా.. వారానికి మూడుసార్లు 20 నుంచి 30 నిమిషాలు పరుగెత్తమని సూచించారు. మిగిలిన సగం మంది నియమనిబంధనలతో కూడిన ఆహారం, జీవనశైలి ఫాలో అయ్యారు. అయితే పరిశోధనలో 62% బరువు తగ్గడంలో జన్యు శాస్త్రమే కీలకమని అధ్యయనం పేర్కొనగా.. 37% మాత్రం వ్యాయామం, జీవనశైలి కారకాలతో ముడిపడి ఉందని తేలింది.
ఈ పరిశోధన జన్యు ప్రొఫెల్‌ని అర్థం చేసుకోవడంలో వ్యాయామం, చక్కటి డైట్ ఉపకరిస్తుందని నిర్ధారణ అయ్యింది. అయితే ప్రతి ఒక్కరూ జన్యుపరమైన వాటితో సంబంధం లేకుండా వ్యాయమంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడం ముఖ్యమని చెప్పారు పరిశోధకులు. ఇది హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి తద్వారా బరువుని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వర్కౌట్‌లు చేయాలని సూచించారు. ఈ అధ్యయనం జర్నల్ రీసెర్చ్ క్వార్టర్లీ ఫర్ ఎక్సర్‌సైజ్ అండ్ స్పోర్ట్‌లో ప్రచురితమయ్యింది.
(చదవండి: ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!)
Comments
Please login to add a commentAdd a comment