సంప్రదాయ ఖఫ్లీ గోధుమలు గురించి విన్నారా. ఇవి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. తప్పనిసరిగా రోజువారీ ఆహారgలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌కి పేరుగాంచిన ఈ ఖఫ్లీ గోధుమలతో కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
మన దేశంలో చాలామంది ప్రజలు రోటీలను ప్రదాన ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ఉండే ఫైబర్, కార్మోహైడ్రేట్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకోసం అనుకుంటే సాధారణ గోధుమలు కంటే ఈ ఖఫ్లీ గోధుమలు మరింత మంచివని చెబుతున్నారు నిపుణులు. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితులలను తట్టుకుని మరి పెరుగే ధాన్యంగా ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రలో ఈ రకం గోధుమలను ఎక్కువగా పండిస్తారు.
ప్రయోజనాలు..
ఇందులో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్ వంటి కొన్ని ఖనిజాలతో నిండి ఉంటుంది.
ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి సమతుల్యం చేస్తుంది. ప్రత్యేకించి టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
ముఖ్యంగా గ్లూటెన్ సెన్సిటివిటీకి మంచిది. జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఇది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.దీనిలో ఉన్న ఫైబర్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉటాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి..గుండె శ్రేయస్సుకి తోడ్పడతాయి.
బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
దీనిలోని ఫైబర్ కంటెంట్ మంచి పోషకమైన గట్ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది.
(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment