super
-
ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!
సంప్రదాయ ఖఫ్లీ గోధుమలు గురించి విన్నారా. ఇవి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. తప్పనిసరిగా రోజువారీ ఆహారgలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌కి పేరుగాంచిన ఈ ఖఫ్లీ గోధుమలతో కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మన దేశంలో చాలామంది ప్రజలు రోటీలను ప్రదాన ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ఉండే ఫైబర్, కార్మోహైడ్రేట్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకోసం అనుకుంటే సాధారణ గోధుమలు కంటే ఈ ఖఫ్లీ గోధుమలు మరింత మంచివని చెబుతున్నారు నిపుణులు. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితులలను తట్టుకుని మరి పెరుగే ధాన్యంగా ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రలో ఈ రకం గోధుమలను ఎక్కువగా పండిస్తారు. ప్రయోజనాలు..ఇందులో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్ వంటి కొన్ని ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి సమతుల్యం చేస్తుంది. ప్రత్యేకించి టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.ముఖ్యంగా గ్లూటెన్ సెన్సిటివిటీకి మంచిది. జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఇది. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉటాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి..గుండె శ్రేయస్సుకి తోడ్పడతాయి.బరువు నిర్వహణలో సహాయపడుతుంది.దీనిలోని ఫైబర్ కంటెంట్ మంచి పోషకమైన గట్ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది.(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!) -
మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
మహిళలు తమ కుటుంబ సంక్షేమం పట్టించుకున్నంతగా తమ వ్యక్తిగత ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. అలాగే ఇంటిల్లపాదికి ఇష్టమైనవి, ఆరోగ్యకరమైన ఆహారాలు ఓపిక తెచ్చుకుని మరీ వండిపెడతారు. తమ వద్దకు వచ్చేటప్పటికీ నాకెందుకు అనే భావన లేక త్యాగమో తెలియదు గానీ సరైన పోషకాహారం మాత్రం అస్సలు తీసుకోరు. ఇలా భావించే మహిళలు ప్రతి ఇంటిలోనూ ఉంటారు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దాదాపు 1.2 మిలియన్ల మంది బాలికలు, మహిళలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. దీనిపై ప్రతి స్త్రీకి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఏటా సెప్టెంబర్ 25న జాతీయ మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్ దినోత్సవం పేరుతో ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ చైతన్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ ఏంటో సవివరంగా చూద్దామా..!.పాలకూరపాలకూరలో ఐరన్ సమృద్ధిఆ ఉంటుంది. ఇది ఋతుస్రావం కారణంగా ఎదురయ్యే రక్తహీనతను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్‌ను కూడా ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ,సీ, కే, సీలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరి మహిళలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.పెరుగు కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉన్న పెరుగు ఎముకలను బలోపేతం చేయడానికి, కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది. స్త్రీలకు, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మోనోపాజ్ దశలో కాల్షియం తగ్గిపోతుంటుంది. దీని వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి ఇది తోడ్పడుతుంది. అంతేగాదు దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.బెర్రీలుబ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటివి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి జీర్ణక్రియ, బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్ మూలం.సాల్మన్సాల్మన్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల పవర్‌హౌస్. ఇది గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది, వాపును తగ్గిస్తుంది. ఒమేగా -3 లు మహిళలకు అత్యంత అవసరమైనవి. ఇవి మహిళల్లో మరణానికి ప్రధాన కారణం అయిన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.పప్పుకాయధాన్యాలు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఐరన్ సంబంధిత మూలం. శాఖాహారం లేదా శాకాహారి ఆహారాన్ని అనుసరించే వారికి పరిపూర్ణంగా ఉంటాయి. కాయధాన్యాలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.అక్రోట్లనువాల్నట్లు మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మహిళలకు మంచి చిరుతిండిగా పేర్కొనవచ్చుస్వీట్ పొటాటోస్వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి, దృష్టికి తోడ్పడుతుంది. ఇవి ఫైబర్, పొటాషియంతో నిండి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవన్నీ మహిళలకు పోషకమైన శక్తిని పెంచే కార్బోహైడ్రేట్లుగా పనిచేస్తాయి.చియా విత్తనాలుచియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, కాల్షియంను కూడా అందిస్తాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు, గుండె ఆరోగ్యానికి, గర్భధారణ తోపాటు వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు అత్యంత ముఖ్యమైనవి.(చదవండి: అవోకాడో వర్సెస్ ఆలివ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏది మంచిది?) -
మగువల మనసు దోచే స్కర్ట్... సూపర్ స్టయిల్! (ఫోటోలు)
-
యాంటీ కేన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలున్న 5 సూపర్ ఫుడ్స్ఇవే!
ప్రపంచంలో జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా దాదాపు రెండు శాతం మంది ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి జీవనశైలి అని చెబుతారు. ఇదే మాటలను ఉటంకిస్తూ ప్రముఖ నూట్రీషనిస్ట్ డా. సింథానీ ఎక్స్‌లో ఒక ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. యాంటి కేన్సర్, యాంటీ డయాబటిక్ సూపర్‌ఫుడ్స్ గురించి ఆయన ఈ వీడియోలో వివరించారు.షిటేక్ మష్రూమ్స్ ఇది తూర్పు ఆసియాకు చెందిన ఒక తినదగిన పుట్టగొడుగు.నాటో లేదా నానబెట్టిన సోయా బీన్స్ సీవీడ్ లేదా సముద్ర పాచి : కరిగే ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం సముద్రపు పాచిలో లభించే కొన్ని ఖనిజాలు . రక్తపోటును నియంత్రించి, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే ఫైటోకెమికల్స్ ఇందులో లభిస్తాయి. సీవీడ్ పెద్దప్రేగు , కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణలో గణనీయ పాత్ర పోషిస్తుంది. సీవీడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధన ద్వారా తెలుస్తోంది.5 Anti-Cancer, anti-diabetic, super foods that explain Japanese longevity. pic.twitter.com/Owicj1OFsO— Barbara Oneill (@BarbaraOneillAU) June 14, 2024ఇంకా కొంజాకు కొన్యాకూ ప్రయోజనాలు, అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మాచ్చా టీ ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ వీడియోలు తెలిపారు. -
వెడ్డింగ్ ప్లాన్ ఇలా ఉంటే అదుర్స్!
భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కన్యాదాత ఎంతో హంగు, ఆర్భాటాలతో పెళ్లి చేస్తాడు. ఒకోసారి వరుడి తరఫు వారే పెళ్లి ఖర్చులు పెట్టుకోవడం, లేదా ఖర్చును ఇద్దరూ కలిసి పంచుకోవడం... ఏ రకంగా చూసినా సరే, జీవితంలో ఒక్కసారే జరిగే సంబరం కావడంతో ఖర్చుకు ఎక్కడా వెనుకాడరు. పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి.. మండపాలంకరణ వరకు, పెళ్లిబట్టల నుంచి నగల వరకు; టిఫిన్ల దగ్గర నుంచి విందు భోజనాల వరకు... ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే. భారతీయులు సగటున పెళ్లికోసం చేస్తున్న ఖర్చు రూ. 5 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఉంటుందన్నది ఒక అంచనా. ఇల్లలకగానే పండగా... అన్నట్లు ఉన్నదంతా వదిలించుకుని లేదా లేకపోతే అప్పులు చేసి మరీ పెళ్లి చేసిన తర్వాత ఆ జంట కాపురం కోసం మరికొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏది తక్కువైనా నవ్వుల పాలు కావడం ఖాయం. అయితే వైభవంగా పెళ్లి చేయడం వరకు తప్పేం లేదు కానీ స్తోమతకు మించి అప్పులు చేయడంలోనే అభ్యంతరం... తప్పనిసరి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు కానీ కాస్త ఆచి తూచి ప్లాన్ ప్రకారం చేస్తే పెళ్లికి అయ్యే వృథా ఖర్చును కొంత తగ్గించవచ్చు. అదెలాగో చూద్దాం... ముందస్తు ప్రణాళిక ... పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేశాం అనే దానికన్నా ఎంత ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ చేశామన్నది ముఖ్యం. అనుకున్న బడ్జెట్ లోపు చేయాలంటే ఖర్చు ఎక్కడ పెట్టాలి.. ఎక్కడ తగ్గించుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం పెళ్లి తంతులో వివిధ ఘట్టాలకు అవసరమైన వస్తు సామగ్రిని ముందుగానే జాబితా రాసుకోవాలి. అవసరమైతే మండపం, అలంకరణ, కేటరింగ్ వంటి వాటిని ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తే కొంతమేరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పర్యవేక్షణ కూడా బావుంటుంది. వస్త్రాలు, నగలు కూడా అవసరం మేరకే కొనుగోలు చేయాలి. అతిథుల జాబితా అన్నింటికన్నా ముఖ్యం... పెళ్లి అంటేనే సకుటుంబ సపరివారంతోపాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అంతా హాజరు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం బంధువులకు ఒకటని, మిత్రులకు మరొకటని కార్డులు ప్రింట్ చేయిస్తుంటారు. ఇక్కడ కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందరికీ కామన్‌గా ఒకే ఆహ్వాన పత్రిక ఉంటే ఖర్చు తగ్గుతుంది. సేహితులకు కార్డులు కొట్టించే బదులు ఈ ఇన్విటేషన్ల ద్వారా కూడా ఆహ్వానం పంపుకోవచ్చు. అలాగే పెళ్లిలో మెహందీ అని, సంగీత్ అని, హల్దీ అనీ, రిసెప్షన్ అనీ ఇలా చాలా రకాల ఈవెంట్స్ చేస్తున్నారు. పెళ్లికూతురు దగ్గర కొన్ని, పెళ్లి కొడుకు వద్ద మరికొన్ని.. ఇద్దరిని కలిపి కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. వీటికి ఎవరెవరిని పిలవాలనే దానిపై కూడా కసరత్తు చేయాలి. అప్పుడు ఏ ఈవెంట్ కు ఎంతమంది వస్తారో అవగాహన ఉంటుంది కాబట్టి.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా బడ్జెట్ వేసుకోండి... పెళ్లికి ముందు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. బడ్జెట్ లేకుండా వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహిస్తే ఖర్చులు భారీగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ సిద్ధం చేసుకోవడం మొదటి పని. వివాహం అలా చేసుకోవాలని ఇలా చేసుకోవాలని చాలా కోరికలు ఉంటాయి. కానీ అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి. ఉదాహరణకు వివాహానికి బట్టలు, ఆభరణాలు అవసరం. అలాగని ఖరీదైన బట్టలు, ఆభరణాలు అవసరం లేదు. బడ్జెట్లో వచ్చే వాటిని తీసుకోవడం ఉత్తమం. క్యాటరింగ్: పెళ్లి విందులకు డబ్బు గుడ్డిగా ఖర్చు చేస్తారు. చాలా పెళ్లిళ్ల లో ఆహారం వృథా అవడం గమనిస్తూనే ఉంటాం. వివాహ విందు మెనులో అవసరమైన ఆహార పదార్థాలను మాత్రమే చేర్చండి. లేనిపోని గొప్పల కోసం మెనూని పెంచవద్దు. హాజరయ్యే అతిథుల సంఖ్యకు అనుగుణంగా క్యాటరింగ్ సిద్ధం చేసుకోవాలి. అలంకరణ సామగ్రి పెళ్లి ఇంట్లో చాలా అలంకరణ ఉంటుంది. అవసరమైన అలంకరణ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. వీటిలో పువ్వులు చాలా ముఖ్యమైనవి. వాటిని చౌకగా ఉన్న ప్రదేశాల నుంచి కొనుగోలు చేస్తే కొంత డబ్బు ఆదా అవుతుంది. హనీమూన్ ట్రిప్... పెళ్లితంతు ముగిసిన తర్వాత నూతన వధూవరుల హనీమూన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హనీమూన్ డెస్టినేషన్లుగా పేరుగాంచిన దేశాలకు ఎగిరిపోతున్నారు. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణం అవుతుంది. దీని బదులుగా మన దేశంలోనే అనువైన ప్రాంతాలను ఎంచుకుంటే చాలా సమయంతో పాటు ధనమూ ఆదా అవుతుంది. ఒకవేళ విదేశాలకే వెళ్లాలనుకుంటే తక్కువ ఖర్చుతో వెళ్లిరాగలిగే మలేసియా, థాయ్‌ల్యాండ్ వంటివి ఎంచుకుంటే సరిపోతుంది. (చదవండి: మూడ్‌ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే! ) -
మూడ్‌ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!
శరీరంలో స్రవించే హార్మోన్లలో ఒక్కోసారి చోటు చేసుకునే కొన్ని రకాల అసమతౌల్యతల కారణంగా చాలా ఒత్తిడికి లోనవుతుండటం లేదా మూడ్ ఆఫ్ కావడం మామూలే. అయితే దాన్ని సరిచేయడానికి మందులు మింగే బదులు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలు దృఢంగా ఉంటాయి. ఆ ఆహారాలేమిటో తెలుసుకుని, మూడ్ బాగుండనప్పుడు వాటిని తీసుకుంటే సరి! మూడ్‌ని మార్చే ఫుడ్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మూడ్ పాడవుతుంది. ఏదో పోగొట్టుకున్నట్లు... వెలితిగా... ఒకలాంటి బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వెంటనే మూడ్ సరవుతుంది. అవేమిటో తెలుసుకుందాం... పాలకూర.. ఐరన్ పాళ్లు అధికంగా ఉండే పాలకూర సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర స్మూతీ, సూప్ లేదా పాలకూరను ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్.. మష్రూమ్స్ యాంటి డిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ డి మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఇది సెరటోనిన్ సంశ్లేషణ స్థాయికి సంబంధించినది. దీని కారణంగా వ్యక్తి సంతోషకరమైన భావోద్వేగాలను అనుభవించగలడు. మీ మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, మష్రూమ్ రెసిపీని తినడం వల్ల తిరిగి మంచి మూడ్‌లోకి వచ్చేసే అవకాశం మెండుగా ఉంది. ప్రయోజనకరంగా ఉంటుంది. అవకాడో.. కొద్దికాలం క్రితం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి3 ,ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు సంతోషకరమైన హార్మోన్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజంతా సంతోషంగా ఉండటానికి సలాడ్, శాండ్విచ్ లేదా అల్పాహారంలో అవకాడోను చేర్చవచ్చు. డ్రై ఫ్రూట్స్.. ప్రతిరోజూ కొన్ని బాదం లేదా వాల్నట్లను తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇలా జరుగుతుంది. డార్క్ చాకొలేట్.. ఓ నివేదిక ప్రకారం డార్క్ చాకొలేట్ తినడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయులను పెంచుతుంది. ఫలితంగా వెంటనే మూడ్ సరవుతుంది. మూడ్ బాగుండనప్పుడు ఈ ఫుడ్ ప్రయత్నించండి. (చదవండి: మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!) -
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ ఎలా ఉపయోగపడుతుంది?
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైలు టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదు చేయడం... ఇలా అన్ని సేవలను ఒకే చోట ప్రయాణికులకు అందించేందుకు భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రైల్వే విభాగం అందించే అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. ఇన్నాళ్ల మాదిరిగా ప్రయాణికులు వేర్వేరు యాప్‌లపై అధారపడనవసరం లేదు. ఈ యాప్ ప్రాజెక్టును రైల్వే ఐటి వింగ్, సీర్ఐఎస్ పర్యవేక్షిస్తున్నదని రైల్వే విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. రైల్ మదద్, యూటీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, పోర్ట్రెయిట్, విజిలెంట్ తనిఖీ కార్యకలాపాల టీఎంఎస్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్, ఐఆర్సీటీసీ ఎయిర్ మొదలైన సేవలన్నీ కొత్త సూపర్ యాప్‌లో విలీనం కానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కోట్లాది మంది రైల్వే వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. రైల్వేకు సంబంధించిన అనేక పనులు ఇక వినియోగదారులకు సులభతరం కానున్నాయి. రైల్వే విభాగానికి ఈ సూపర్ యాప్ తయారీకి దాదాపు రూ. 90 కోట్ల ఖర్చు కానుంది. మూడు సంవత్సరాలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు అందుకున్న మొత్తం బుకింగ్‌లలో దాదాపు 5,60,000 బుకింగ్‌లు (సగానికి పైగా) ఐఆర్సీటీసీ యాప్ ద్వారా అందాయి. -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్‌లో భాగంగా తనే ఏజ్‌ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్‌ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
సూపర్ రేర్ చిరుత టోబీ పఫర్ ఫిష్: మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ప్రకృతి అంటేనే మనిషికి అందని రహస్యాల పుట్ట. అప్పుడప్పుడు అద్భుతమైనవి వెలుగులోకి వచ్చి మనల్ని ఆశ్చర్యంలో ముంచుత్తుతాయి. అయితే కొన్ని అరుదైన జీవులు కూడా అంతరించిపోతున్న తరుణంలో, మారుతున్న కాలంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన జీవులు వెలుగులోకి రావడం విశేషం. ఆస్ట్రేలియా తీరంలో అత్యంత అరుదైన లెపార్డ్ టోబీ పఫర్ ఫిష్ దర్శనమిచ్చింది. దీంతో ప్రకృతి ప్రేమికులు సంబర పడుతున్నారు. Super Rare Leopard Toby Puffer Fish సముద్రపు లోతుల్లో సంచరిస్తున్న కోరల్ సీ మెరైన్ పార్క్‌లో ఈత కొడుతున్న డీప్ సీ డైవర్ దృష్టిలోచిరుతపులిని పోలిన మచ్చలున్న చిన్న తెల్ల చేప పడింది. దీన్నే లెపార్డ్ పఫర్ ఫిష్ లేదా కాంతిగాస్టర్ లెపార్డ్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బారియర్ రీఫ్లో ఈత కొడుతుండగా, ఒక డైవర్ 'అత్యంత అరుదైన' సముద్ర జీవిని చూసి ఆశ్చర్యపోయాడు టోబీ పఫర్ అందమైన ఫోటోను గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీకి అనుబంధ సంస్థ మాస్టర్ రీఫ్ గైడ్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసింది. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని సంస్థ తెలిపింది. ఇవి సాధారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, మైక్రోనేషియా జలాల్లో కనిపిస్తుందని, అయితే ఈ తెల్లని చేప ఆస్ట్రేలియాలో కనిపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే శక్తి సముద్రానికి ఉంది.ఇంకా కనుగొనలేని అద్భుతమైన జంతువులు సముంద్రం నిండి ఉంది. తన జీవితంలో చిన్న తెల్ల చేపను చూడటం చాలా అదృష్టం అని డైవర్ కేథరీన్ లోగాన్ పేర్కొన్నాడు. చిరుత టోబీ పఫర్ అంటే ? రాక్ ఎన్ క్రిటర్స్ ప్రకారం, ఇది అక్వేరియంలో ఎక్కువగా వాడతారు. దీని ముందు భాగంలో రెండు చారలు ఉంటాయి. ముత్యం లాంటి తెల్లటి శరీరంపై చిరుత పులికి ఉండే మచ్చల్ని పోలిన మచ్చలు ఉంటాయి. అలాగే దీన్నిపట్టుకున్నప్పుడు కొద్దిగా "పఫ్"(ఉబ్బుతాయి) అవుతాయి. దాదాపు 3 అంగుళాల పొడవు ఉంటాయి. View this post on Instagram A post shared by Master Reef Guides - Great Barrier Reef 🪸 (@masterreefguides) -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్‌గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్‌లో ప్రయాణికులు, దిగువ డెక్‌లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగలరా? ఇది సాధ్యమేనా!
మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్ఫెటేషన్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి. ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్ఫెటేషన్ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్ హిల్ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్ఫెటేషన్ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్ఫెటేషన్కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
రూ.20వేల లోపు సూపర్ స్మార్ట్ఫోన్లు..
దేశంలో రూ.20 వేల లోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మంచి పనితీరుతో పాటు ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి 6జీబీ ర్యామ్‌తో అత్యంత సామర్థ్యం గల ప్రాసెసర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. శాంసంగ్, మోటరోలా, నోకియా, షావోమీ వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లు రూ.20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ! రూ.కోట్లలో జరిమానా.. పోకో (POCO) X4 ప్రో ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ , స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ (Xiaomi Redmi) Note 12 ధర: రూ. 17,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 48 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ (realme) 10 Pro 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.72 అంగుళాలు కెమెరా: 108 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... వన్‌ప్లస్ (OnePlus) Nord CE 2 Lite 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.59 అంగుళాలు కెమెరా: 64 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్ (realme) 9 5g SE ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 778G ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు (16.76 సెం.మీ.) కెమెరా: 48 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! రియల్మీ (realme) 9 ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 108 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh శాంసంగ్ గెలాక్సీ A14 5G ధర: రూ. 16,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 1330 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఒప్పో (OPPO) A78 5G ధర: రూ. 18,980 ప్రాసెసర్: ఆక్టా కోర్ , మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.56 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో (Moto) G73 ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో (Vivo) Y56 ధర: రూ. 19,780 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
ఆ ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు 30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది. 60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 180 బీపీఎస్ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. -
పాలు, నిత్యావసరాలు @ స్విగ్గీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలందించే స్విగ్గీ తాజాగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. గతేడాది కొనుగోలు చేసిన పాలు, నిత్యావసరాల డెలివరీ సంస్థ ’సూపర్’పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగంపై దాదాపు రూ.680 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ స్టోర్స్ పేరిట హైపర్ లోకల్ డెలివరీ వ్యాపారంలోకి, స్విగ్గీ డెయిలీ పేరిట సబ్స్క్రిప్షన్ ఆధారిత ఇంటి వంట డెలివరీ సేవల విభాగంలోకి స్విగ్గీ ప్రవేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఆరు నెలల్లో స్విగ్గీ నెలవారీ యూజర్ల సంఖ్య 10 రెట్లు పెరిగి 1,50,000 స్థాయికి చేరింది. తమ బ్రాండ్ పేరును, సొంత లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకునే ఉద్దేశంతో తాజాగా సూపర్ కార్యకలాపాలను కూడా విస్తరిస్తోంది. గతేడాది డిసెంబర్లో 1 బిలియన్ డాలర్లు సమీకరించిన స్విగ్గీ మరో 500–600 మిలియన్ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. రోజుకు లక్ష డెలివరీలు.. సూపర్‌ను స్విగ్గీ గతేడాదే కొనుగోలు చేసినప్పటికీ.. అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. 2015లో శ్రేయస్ నగ్దావనె, పునీత్ కుమార్ దీన్ని ప్రారంభించారు. స్విగ్గీ చేతుల్లోకి వచ్చాక కూడా సూపర్ వారి సారథ్యంలోనే నడుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగం బెంగళూరు, ముంబై, ఢిల్లీ– ఎన్సీఆర్ సహా ఆరు నగరాల్లో రోజుకు లక్ష పైచిలుకు డెలివరీలు అందిస్తోంది. మైక్రోడెలివరీ వ్యాపార విభాగంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న మిల్క్‌బాస్కెట్, డెయిలీ నింజా తదితర సంస్థలకు స్విగ్గీ సారథ్యంలోని సూపర్ ఎంత మేర పోటీనిస్తుందన్నది చూడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. సాధారణంగా ఇలాంటి స్టార్టప్స్‌కి ఎక్కువగా రోజూ సగటున రూ.70–90 ఆర్డర్లిచ్చే యూజర్లు ఉంటున్నారు. పాల డెలివరీ కోసం సబ్స్క్రయిబ్ చేసుకున్నప్పటికీ ఇతర ఉత్పత్తులు కూడా కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ‘సూపర్’ మోడల్.. వారంవారీ, నెలవారీ చందాదారులకు పాలతో పా టు బ్రెడ్డు, గుడ్లు మొదలైన వాటికి కూడా సూపర్ డెలివరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థ స్థూల అమ్మకాల్లో 70 శాతం వాటా పాలది కాగా.. మిగతాది ఇతర ఉత్పత్తులది ఉంటోంది. సుమారు అరవై శాతం ఆర్డర్లు భారీ గేటెడ్ సొసైటీల నుంచి ఉంటున్నాయి. దీంతో తక్కువ వ్యయాలతో డెలివరీ సాధ్యపడుతోంది. సూపర్ పోటీ సంస్థల వ్యాపార విధానం కూడా ఇదే రకంగా ఉంది. ఈ విభాగంలో కార్యకలాపాలను టాప్ 10 నగరాలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్విగ్గీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా చేరువవుతున్నందున.. సూపర్‌ను కూడా ఆయా మార్కెట్లలో ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నాయి. మరోవైపు సూపర్ పోటీ సంస్థ డైలీ నింజా కూడా కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. గతేడాదే ఇది మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ నుంచి పెట్టుబడులు సమీకరించింది. రోజువరీ ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో 30,000 ఉండగా.. ప్రస్తుతం 90,000కు పెరిగినట్లు సమాచారం. అటు మిల్క్‌బాస్కెట్ కూడా యూనిలీవర్ వెంచర్స్, కలారి క్యాపిటల్ నుంచి 26 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
నమ్మలేం! ఒకప్పటి హీరోయిన్.. ఆమేనా?
'గుచ్చి గుచ్చి చంపమాకు హొయలా' అంటూ నాగార్జున సరసన 'సూపర్' సినిమాలో అలరించిన అయేషా టకియా గుర్తుందా?.. తెలుగులో 'సూపర్'తోపాటు, హిందీలో పలు సినిమాలు చేసిన ఈ భామ అప్పట్లో తన అందచందాలతో అభిమానుల్ని ఉర్రూతలూంగించింది. 2009లో ఎస్పీ లీడర్ అబు ఆజ్మీ కొడుకు ఫర్హాన్ ఆజ్మీని పెళ్లి చేసుకున్న అయేషా గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లయిన తర్వాత అడపాదడపా సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు దర్శనమిచ్చిన ఈ అమ్మడు.. తాజాగా గత గురువారం ఓ వేడుకకు హాజరయింది. అక్కడ ఆమెను చూసిన వారు నమ్మలేకపోయారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అయిన అయేషా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు స్లిమ్‌గా కుందనపు బొమ్మలా సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు కాస్తా బొద్దుగా ఏమాత్రం గుర్తుపట్టనంతగా మారిపోవడంతో ఆమె అభిమానులు, బాలీవుడ్ వర్గాలు విస్తుపోయారు. అన్నట్టు మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టాలని అయేషా భావిస్తున్నది. త్వరలోనే మళ్లీ తెరపై కనిపిస్తానని, ప్రస్తుతం కథలు వింటున్నానని ఈ అమ్మడు చెప్పింది. -
అలాంటి వాటిని నా మదిలోకి రానీయను
చాలా కాలంగా చాలా రకాల గ్యాసిప్స్‌ను ఎదుర్కొన్న అనుష్క తాజాగా ఒక పెళ్లైన సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు, త్వరలో ఆయనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునో, లేక మరేదన్న సంఘటన తనను ఘాటుగా తాకిందోగానీ తను క్రింది విధంగా స్పందించారు. వదంతులకు తొలి రోజుల్లో చాలా బాధపడ్డాను. ఇంట్లో వాళ్లను అవి కష్టపెట్టాయి. ఇప్పుడు నేను చాలా పరిణితి చెందాను. నాలాంటి సెలబ్రిటీలు ఇలాంటి సత్యదూర ప్రచారాలను ఎదుర్కొవలసి ఉంటుందన్నది గ్రహించాను. ఇతరులు ఏమనుకుంటున్నారు, లోకం ఎలా చిత్రీకరిస్తోంది అంటూ జీవిస్తే ప్రశాంతత కరువవుతుంది.వదంతులకు చింతిస్తే మిగిలేది ఏడుపే. సినిమాలో వదంతులన్నవి సర్వసాధారణం. అలాంటివి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని తొసిపుచ్చలేను. అయితే అది కొంత సేపే. ఆ తరువాత ఏది విధికి వచ్చేస్తాం. అయినా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు బాధ పడాలి. వదంతులకు చింతిస్తూ కూర్చుంటే నిద్రేరాదు. అలాంటి వాటిని నా మదిలోకి రానీయను. అందుకే తాను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. నటిగా కూడా చాలా సంతృప్తిగా ఉన్నాను. తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. నటనా ప్రతిభను చాటుకునే పాత్రలు అమరుతున్నాయి అని అనుష్క పేర్కొన్నారు. -
తాడిపత్రిలో స్వచ్ఛభారత్ భేష్
తాడిపత్రి : తాడిపత్రి మున్సిపాలిటీలో స్వచ్ఛభారత్ అమలులో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం బాగుందని క్వాలిటీ కంట్రోల్ ఢిల్లీ బృందం ప్రశంసించింది. బృంద సభ్యులు అరవింద్, గిరిబాబు గురువారం తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్, సంజీవనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, మేనేజర్ సాయిశంకర్, డీఈఈ రఘుకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు. స్వచ్ఛభారత్ కింద మొత్తం 4,200 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. వాటిని వినియోగిస్తున్న విధానాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. రోడ్లు, పచ్చని చెట్లను చూసి ముగ్దులయ్యారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. -
పొట్టేలు గాంభీర్యం
‘మేకపోతు గాంభీర్యం’గురించి వినే ఉంటారు. కానీ ఇక్కడ ఓ గొర్రెపోతు (పొట్టేలు) దర్పం చూశారా..! ఎంచక్కా బైక్‌పైకి ఎక్కింది. బండి డ్రైవ్ చేస్తున్నట్టుగా కాసేపు ఫోజిచ్చింది. కొద్దిసేపు స్థానికులను తన చేష్టలతో అలరించి.. బైక్ దిగిపోయింది. ఈ దృశ్యం బయ్యారం మండలంలోని బాలాజీపేటలో బుధవారం చోటుచేసుకుంది. - బయ్యారం -
మాట్లాడే మహిళా రోబో!
శాస్త్ర సాంకేతిక రంగంలో ముందున్న చైనా పరిశోధకులు తాజా ప్రయత్నంలో భాగంగా మాట్లాడే రోబోను సృష్టించారు. రోబోలు నడవటం, పనులు చేయడం వంటివి ఎన్నో ఇంతకు ముందే చూశాం. అయితే వీటికి భిన్నంగా మాట్లాడే మరమనిషిని కనిపెట్టి మరోసారి విజయవంతమయ్యారు. అచ్చం అమ్మాయిలా ఉండే ముఖ కవళికలతోపాటు మాటలకు అనుగుణంగా కదిలే నోరు, పెదాలతో చైనా పరిశోధకులు వినూత్న సృష్టికి శ్రీకారం చుట్టారు. మరమనిషిలా కాక, సహజత్వం ఉట్టిపడేలా జియా జియా ఇప్పుడు చైనా వాసులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ మహిళ రూపంలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. పెదాల కదలికలు, కళ్ళు తిప్పడంతో సహా అచ్చంగా మనిషిని పోలి ఉండటం జియా జియా ప్రత్యేకత అంటున్నారు చైనా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ కొత్త రోబో క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా తన సేవలు అందిస్తుందని చెప్తున్నారు. ముందుగా ఫీడ్ చేస్తేనో, కీ ఇస్తేనో మాట్లాడటం కాక, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తల ఊపడం, దగ్గరగా వచ్చిన వారిని స్పర్శించడం వంటి కొత్త విషయాలను ఈ వినూత్న రోబోలో పొందుపరిచారు. మూడు సంవత్సరాలపాటు కష్టపడి పరిశోధకులు జియా జియా కదలికలను తీర్చి దిద్దారు. రోబో సృష్టికర్త చెన్ జియోపింగ్ పలకరిస్తే చాలు.. చక్కగా సమాధానం ఇస్తున్న రోబోను చూసి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫోటోలతో ముంచెత్తారు. ఇదెంతో అద్భుతమంటూ అభినందనలు కురిపించారు. టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, జియా జియా మాట్లాడటంతోపాటు, నవ్వడం, ఏడ్వటం కూడ చేసేట్లుగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారని స్టేట్ మీడియా వివరించింది. పరిశోధకులు కూడ వారి సాంకేతిక పరిమితులను అధిగమించి మాట్లాడే మహిళా రోబోలో మరిన్ని హావభావాలను కూడ పలికించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు. -
ఎంపీలు సూపర్ పౌరులు కాదుః అశోక్ గజపతి రాజు
న్యూఢిల్లీః పాలనలో పారదర్శకత చూపించే నాయకుల్లో అశోక్ గజపతిరాజు ముందుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఆ విషయం రూఢి చేశారు. బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కూడ అదే రీతిలో స్పందించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డంలో ఏమాత్రం జంకని ఆయన... ఎయిర్ పోర్టుల్లో తమకు కొంత ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి మెంబర్ల డిమాండ్ కు.. దీటుగా సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ మెంబర్లంటే సూపర్ పౌరులు కాదని, వారు కూడ సాధారణ ప్రజలేనని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు... తేల్చి చెప్పారు. విమానాశ్రయాల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంపీలు సూపర్ పౌరులు కాదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు లోక్ సభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో తనకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ... పార్లమెంట్ మెంబర్లు వారి వారి మంత్రి పదవులతో కొంత ప్రత్యేక గౌరవాన్ని పొందుతారని, అదే నేపథ్యంలో వారి విమాన ప్రయాణంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ శాఖ అన్ని సౌకర్యాలను అందిస్తుందని తెలిపారు. అయితే ఎంపీలు సూపర్ పౌరులు కాదని, విమానాశ్రయాలవద్ద తమకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్న బిజెపి సభ్యుల డిమాండ్ ను తిరస్కరించారు. అయితే తమ ఐడీ కార్డులను చూపించినప్పటికీ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో సిబ్బంది గుర్తు కూడ పట్టడం లేదని కొందరు సభ్యులు వాపోవడంతో... చాలా విమానాశ్రయాల్లో ఎంపీలు కమిటీ సభ్యులు అయి ఉంటారని, కాబట్టి విమానాశ్రయాల్లో వారిని గుర్తించరన్న విషయం వాస్తవం కాదని కేంద్ర మంత్రి తెలిపారు. ఎంపీలు ఐడీ కార్డులు చూపినప్పుడు అవకాశాన్ని బట్టి వారి సీట్లు హయ్యర్ క్లాస్ కు అప్ గ్రేడ్ చేయాలన్న టీఆర్ ఎస్ సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన అశోక్ గజపతి రాజు.. టిక్కెట్ల వాణిజ్య తరగతులను బట్టి అప్ గ్రేడేషన్ జరుగుతుందని, అందులో ముందుగా అధికారులకు అవకాశం ఇస్తారు తప్పించి, ఎంపీలకు కాదన్నారు. అంతేకాక వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు, ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రజలకు సీట్లు మంజూరు చేసే విషయంలోకూడ కొంత మానవతా కోణంలో చూడాల్సి వస్తుందని, అందులో కూడ వాణిజ్య కోణం ఉంటుందని అన్నారు. ఎయిర్ ఇండియా తోపాటు ఇతర ఎయిర్ లైన్స్ కూడ వాణిజ్య పరిగణల ఆధారంగానే అప్ గ్రేడ్ చేసేందుకు వీలౌతుందని అశోక్ గజపతి రాజు తేల్చి చెప్పారు.