అలాంటి వాటిని నా మదిలోకి రానీయను | gossips about anushka | Sakshi
Sakshi News home page

అలాంటి వాటిని నా మదిలోకి రానీయను

Oct 1 2016 3:20 AM | Updated on Sep 4 2017 3:39 PM

అలాంటి వాటిని  నా మదిలోకి రానీయను

అలాంటి వాటిని నా మదిలోకి రానీయను

చాలా కాలంగా చాలా రకాల గ్యాసిప్స్‌ను ఎదుర్కొన్న అనుష్క తాజాగా ఒక పెళ్లైన సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు, త్వరలో ఆయనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు

చాలా కాలంగా చాలా రకాల గ్యాసిప్స్‌ను ఎదుర్కొన్న అనుష్క తాజాగా ఒక పెళ్లైన సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు, త్వరలో ఆయనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునో, లేక మరేదన్న సంఘటన తనను ఘాటుగా తాకిందోగానీ తను క్రింది విధంగా స్పందించారు. వదంతులకు తొలి రోజుల్లో చాలా బాధపడ్డాను. ఇంట్లో వాళ్లను అవి కష్టపెట్టాయి. ఇప్పుడు నేను చాలా పరిణితి చెందాను.
 
  నాలాంటి సెలబ్రిటీలు ఇలాంటి సత్యదూర ప్రచారాలను ఎదుర్కొవలసి ఉంటుందన్నది గ్రహించాను. ఇతరులు ఏమనుకుంటున్నారు, లోకం ఎలా చిత్రీకరిస్తోంది అంటూ జీవిస్తే ప్రశాంతత కరువవుతుంది.వదంతులకు చింతిస్తే మిగిలేది ఏడుపే. సినిమాలో వదంతులన్నవి సర్వసాధారణం. అలాంటివి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని తొసిపుచ్చలేను. అయితే అది కొంత సేపే. ఆ తరువాత ఏది విధికి వచ్చేస్తాం. అయినా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు బాధ పడాలి.
 
  వదంతులకు చింతిస్తూ కూర్చుంటే నిద్రేరాదు. అలాంటి వాటిని నా మదిలోకి రానీయను. అందుకే తాను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. నటిగా కూడా చాలా సంతృప్తిగా ఉన్నాను. తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. నటనా ప్రతిభను చాటుకునే పాత్రలు అమరుతున్నాయి అని అనుష్క పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement