టాప్‌ హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | anushka warns gossip creators | Sakshi
Sakshi News home page

టాప్‌ హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Jun 6 2017 6:02 PM | Updated on Sep 5 2017 12:57 PM

టాప్‌ హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

టాప్‌ హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

‘ఇప్పటి దాకా చాలా సహనం పాటించాను. ఇక ఉపేక్షిచేది లేదు.. గాసిప్స్‌ పుట్టించే వారిపై ఇక చర్యలు తప్పవ’ని అంటోంది అగ్ర కథానాయకి అనుష్క.

చెన్నై: ‘ఇప్పటి దాకా చాలా సహనం పాటించాను. ఇక ఉపేక్షించేది లేదు.. గాసిప్స్‌ పుట్టించే వారిపై ఇక చర్యలు తప్పవ’ని అంటోంది అగ్ర కథానాయకి అనుష్క. ఆ ముద్దుగుమ్మ గురించి ఇది వరకే చాలా గాసిప్స్‌ షికార్లు చేశాయి. అయితే బాహుబలి 2 చిత్రం తరువాత అనుష్కపై వదంతుల పర్వం మోతాదు మించిందనే చెప్పాలి. ఆ చిత్ర కథానాయకుడు ప్రభాస్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లికి సిద్ధమయ్యారని, అయితే ప్రభాస్‌ ఇంట్లో అనుష్కను కోడలిగా అంగీకరించడం లేదన్న ఊహాగానాలు కోకొల్లలుగా ప్రచారం చేశారు.

అన్నిటికీ మౌనం పాటిస్తూ వచ్చిన అనుష్క ఇక లాభం లేదని భావించి.. ‘నేను, ప్రభాస్‌ హిట్‌ పెయిర్‌. అయితే పర్సనల్‌గా మా మధ్య ఉన్నది స్నేహమే..’ అంటూ కుండబద్దలు కొట్టారు. అయినా ఈ జంటపై వదంతుల ప్రవాహం ఆగడం లేదు. దీంతో విసిగిపోయిన ఈ స్వీటీ ఇక లాభం లేదనుకుందో ఏమో తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇకనైనా గాసిప్స్‌కు పుల్‌స్టాప్ పడుతుందో, లేదో చూడాలి. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హర్రర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement