gossips
-
పుష్ప 2 కళ్లచెదిరే కలెక్షన్స్... రష్మిక సెంటిమెంట్ వర్కౌట్ ...
-
తెలుగులోనే భారీ బడ్జెట్ బన్నీ, త్రివిక్రమ్ సినిమా
-
సలార్ 2 షూటింగ్ స్టార్ట్ ...వార్ 2 లో వార్స్ మాములుగా ఉండవు..
-
మేము జగన్ తోనే ఉంటాం..
-
రాజమౌళి, ఈగ 2 కి నేను అవసరం లేదన్నారు
-
తొలి సినిమా రిలీజ్ కాలేదు.. జాన్వీకి తెలుగులో మూడో ఛాన్స్?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతోనే ఈమె బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవర, RC 16 ప్రాజెక్టులపై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట.శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ.. 'దఢక్' సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ ఫేమ్ ఓ మాదిరిగా వచ్చింది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దేవర'లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబరులో మూవీ రిలీజైతే ఈమె భవిష్యత్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)దీనితో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీలోనూ హీరోయిన్ జాన్వీనే. దీని షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. ఈ రెండు సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు జాన్వీని మరో ఛాన్స్ వరించిందట. 'దసరా'తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల.. మరో మూవీ కోసం పనిచేస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలవనుంది. ఇందులోనే హీరోయిన్గా జాన్వీని అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ అంటే ఆశ్చర్యమే. అయితే జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్ మరింత రీచ్ వస్తుందని బహుశా నాని-శ్రీకాంత్ ఓదెల భావించి ఉండొచ్చు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక
కీర్తి సురేష్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. కారణం ఆమె నటిస్తున్న చిత్రాలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ప్రేమ వ్యవహారం గురించి కావచ్చు. నటి మేనక, నిర్మాత సురేష్ ల వారసురాలు కీర్తి సురేష్. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్‌తో జత కట్టిన రజనీమురుగన్ మంచి విజయాన్ని అందించింది. అలా కథానాయకిగా స్థిరపడి పోయిన కీర్తి సురేష్ తెలుగులో నటించిన మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకుంది. అదేవిధంగా కమర్షియల్ కథా చిత్రాల్లో నటిస్తూనే, నటనకు అవకాశం ఉన్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. దాంతోపాటు ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లోనూ తరచూ చిక్కుకుంటోంది. కీర్తీ సురేష్ పెళ్లి అని, ఓ వ్యాపార వేత్తతో త్వరలో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విషయాలపై కీర్తీ సురేష్ ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. అయితే తొలి సారిగా ఆమె తల్లి మేనక స్పందించారు. ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కీర్తి సురేష్ ప్రేమలో పడిందని, పెళ్లికి సిద్ధం అవుతోందనీ గాసిప్స్ చాలానే వస్తున్నాయని. అయితే కీర్తీ. ఎవరిని ప్రేమించినా ఆ విషయాలు తమకు చెబుతుందని, దాన్ని తాము బహిరంగంగా మీడియా ద్వారా వెల్లడిస్తామని చెప్పారు. అయితే కీర్తీ ఎవరినీ ప్రేమించడం లేదని, ఆమె గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవం అనీ చెప్పారు. కీర్తీ సురేష్ గురించి వదంతులు దొర్లుతున్నాయంటే, ఆమె నటిగా ఎదుగుతోందని అర్థం అని మేనక పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో కీర్తీసురేష్ బిజీగా ఉంది. తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం గురువారం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. -
రజనీకాంత్, కమల్ హాసన్ చిత్ర రీమేక్‌లో శృతిహాసన్?
అగ్ర కథానాయకులు కమల్ హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరంభ దశలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. వాటిలో కొన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. అదే విధంగా ఫ్యామిలీ డ్రామా కథా చిత్రాలు, హీరోయిన్ కథా చిత్రాలు ఉన్నాయి. అలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘అవళ్ అప్పడిదాన్’. అందులో కమలహాసన్, రజనీకాంత్, శ్రీప్రియ ప్రధాన పాత్ర పోషించారు. సీ.రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ పలు సమస్యలను ఎదురొడ్డి ఎలా నెగ్గుకొచ్చింది అన్నదే ఈ చిత్ర కథ. చదవండి: తారక్‌పై ట్వీట్ చేసి పప్పులో కాలేసిన నటి, అసలేం జరిగిందంటే.. అందులో కథానాయకి పాత్రలో శ్రీప్రియ నటించింది. కాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు అధర్వ, సమంత జంటగా బానాకాత్తాడి చిత్రాన్ని తెరకెక్కించిన బద్రి అవళ్ అప్పడిదాన్ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే ఇటీవల స్వయంగా పేర్కొన్నారు. కాగా ఇందులో నటి శ్రీప్రియ పాత్రలో శృతిహాసన్, రజనీకాంత్ పాత్రలో శింబు, కమలహాసన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్‌లను నటింప చేయడానికి ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ భారీ విజయం అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. చదవండి: అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్ శెట్టి ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్‌ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. ఇక తెలుగులో ఆమెకు డిమాండ్ పెరగడంతో మృణాల్ భారీగా రెమ్యునరేషన్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది. పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా దర్శక-నిర్మాతలు సంప్రదిస్తున్నారట. చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు దీంతో మృణాల్ కోటీ రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరమే ఈ రెంజ్లో డిమాండ్ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్ తొలుత టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరాఠిలో పలు టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్గా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మృణాల్ పాత్ర మాత్రం మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో 3, 4 పెద్ద సినిమాలతో పాటు రెండు డిజిటల్లో ఓ రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
Bimbisara Movie OTT Release Details: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా?
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార. ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న(ఆగస్ట్ 5న) గ్రాండ్‌గా రిలీజైంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్ తెచ్చుకుంది. ట్రైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కల్యాణ్ రామ్ బింబిసార అనే రాజుగా కనిపించాడు. చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ నెట్టింట చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసి మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు గట్టిగానే పొట్టి పడ్డాయట. చివరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం జీ5 ‘బింబిసార’ను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని అంటున్నారు. అంటే ఈ మూవీ అక్టోబర్‌లోనే ఓటీటీలో అందుబాటులోకి రానుందట. చదవండి: ‘లేడీ సూపర్‌స్టార్’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ మరోవైపు ఆగస్ట్ చివరిలో వారంలోనే రావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా డిజిటల్ స్ట్రీన్‌పై బింబిసార చూడాలంటే నెలన్నరకు పైగా వేచి చూడక తప్పందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా కొత్త డైరెక్టర్ వశిష్ఠ రూపొందించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈచిత్రానికి ఎమ్ఎమ కీరవాణి సంగీతం అందించారు. -
అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. దీంతో కృతీకి సక్సెస్ ఫుల్ హీరోయినే అనే గుర్తింపు ఇచ్చేశారు. అదే క్రేజ్‌తో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ‘ది వారియర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఆమె తొలి ఫ్లాప్ చూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ద్విభాష చిత్రం డిజాస్టార్‌గా నిలిచింది. ఉప్పెన హిట్‌తో కృతిని ఓ రేంజ్లో ఎత్తేసిన ప్రేక్షకులు ఆమె అందం, అభియనంకు ఫిదా అవుతూ ప్రశంసలు జల్లు కురిపించారు. చదవండి: సెట్లో దురుసు ప్రవర్తన.. నటుడు చందన్‌పై నిషేధం అయితే ఇప్పుడు ‘ది వారియర్’ ఫ్లాప్‌తో ఆమెను విమర్శిస్తున్నారు. ఇందులో తన లుక్ అంతగా లేదని పలువురు కృతికి సూచించారట. దీంతో తన అందాన్ని మరింత మెరుగు పరుచుకునేందు పెంచుకునేందుకు ‘బేబమ్మ’ సర్జరీకి సిద్దమైందట. తన పెదాల పరిమాణాన్ని తక్కించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫేమస్ డాక్టర్‌ను సంప్రదించి సలహా కూడా తీసుకుందని వినికిడి. ఇదే నిజమైతే సర్జరీతో అందానికి మెరుగులు అద్దుకున్న హీరోయిన్ల జాబితాలోకి ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా చెరినట్టే. చదవండి: ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు -
ఎన్నెన్నో వింత కథల వాన
ప్రపంచమంతా వాన చుట్టూ జానపద కథలు ఉన్నాయి. నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. వింతలు ఉన్నాయి. వినడానికీ పిల్లలకు చెప్పడానికీ బాగుంటాయి. వాన జోరున పడేటప్పుడు స్నేహితులతో పంచుకోవాల్సిన సంగతులివి. వేడి వేడి పకోడి కబుర్లు. మన జానపద కథ ఒకదాన్ని కెనడాలో చెప్పుకుంటారు. ఒక ఊళ్లో సుడిగాలి ఉండేవాడట. వాడు ఉత్త పోకిరి అట. దారిన పోయే ఆడవారిని బెదరగొడితే సుడిగాలి దెబ్బకు వారి పైటలు ఎగిరి ఇబ్బంది పడేవారట. ఇది ఊరి పెద్ద దృష్టికి వచ్చింది. ‘ఈ సుడిగాలిగాడు ఊళ్లో ఉండటానికే లేదు’ అని తీర్పు ఇచ్చాడు. ఇక సుడిగాలి ఊరు ఖాళీ చేయాల్సిందే. కాని సుడిగాలికి వాన మంచి ఫ్రెండు. వానకు కళ్లు లేవు. సుడిగాలే వానను మోసుకు తిరుగుతుంటాడు. ‘నువ్వు ఊరు ఖాళీ చేస్తే నేనెందుకు ఇక్కడుంటాను. నన్ను కూడా తీసుకుపో’ అని వాన అంటే సుడిగాలి సరేనన్నాడు. దోస్తులిద్దరూ చెప్పాపెట్టకుండా మాయమయ్యారు. ఏముంది... మూడు నెలలు గడిచే సరికి బాధ తెలిసి వచ్చింది. గాలి లేదు. దాని వెనుక వచ్చే వాన లేదు. దాంతో పంటలు పోయాయి. ఊరి పెద్ద నాలుక్కరుచుకుని ‘సుడిగాలిని వెతికి తెచ్చే వీరులెవరు?’ అని ప్రకటన చేశాడు. ఒంటె వచ్చింది. ఏనుగు వచ్చింది. నక్క వచ్చింది. ఎవరు ఎంత దూరం వెతికినా సుడిగాలి కనిపించలేదు. దాంతో పక్షులకు చెబుదాం అనుకున్నాడు ఊరి పెద్ద. కొంగ, నెమలి, గువ్వ వెతికాయి. కనిపించలేదు. ‘పెద్దయ్యా... నేను వెతికి తెస్తాను’ అని ఒక పిచుక అంది. ‘నువ్వా... సరే’ అన్నాడు పెద్దయ్య. పిచుక సుడిగాలిని వెతుక్కుంటూ వెళ్లింది. ఆకాశంలో నుంచి కిందకు చూస్తూ వెతగ్గా వెతగ్గా కింద ఒక ఝరి కనిపించింది. దాని మీదుగా ఎగురుకుంటూ వెళితే అందమైన తోట కనిపించింది. దాని పక్కనే గుహ. దాని మొదల్లో పచ్చగడ్డి. అవును... సుడిగాలి ఇక్కడే ఉండుంటాడు అని చూస్తే లోపలే సుడిగాలి, వర్షం ఉన్నారు. పిచుక సంగతి చెప్పి ‘ఊరు నాశనం అయ్యింది. రండి’ అనంటే.. ‘అరెరె.. వెనకే వస్తాం. నువ్వు పోయి సంగతి చెప్పు’ అన్నారు నేస్తులు. పిచుక ముందుగా ఊరు చేరి తమ పిచుక పెద్దలకు చెప్తే అవన్నీ సంతోషంతో గుమిగూడి కిచకిచలాడాయి. ఆ మరుసటిరోజు సుడిగాలి, దాని వెనుక హోరున వాన. మళ్లీ ఊరు కళకళలాడింది. సుడిగాలిని వెతికి తెచ్చిన పిచుకకు కృతజ్ఞత చెప్పాడు పెద్దయ్య. ఏ కారణం రీత్యా గానీ పిచుకలను వేటాడకూడదని ఆ రోజున తాకీదు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనం పిచుకను వేటాడరు. పాపం అనుకుంటారు. వాన వచ్చే ముందు పిచుకలు దగ్గరకు మూగి కిచకిచలాడే ఆనవాయితీ పోలేదు. ఇదీ కథ. ఇంద్రధనుస్సు ఈ కథ కూడా కొన్నిచోట్ల పిల్లలకు చెప్తారు. ఒకరోజు ఆకాశంలో బుజ్జిపాపలైన నల్లమేఘాలు, తెల్లమేఘాలు పరుగు పందెం పెట్టుకున్నాయట. తల్లి తూర్పుగాలి వచ్చి ‘ఇది వేళ కాదు నాయనా’ అన్నా వినిపించుకోకుండా ఇరుపక్షాలు పరుగుతీశాయట. ఆకాశంలో వీరి పరుగు ముందు సరదాగా మొదలైంది. నవ్వులాటలు... వెక్కిరింతలు సాగాయి. ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలిసేలోపు గాలి మళ్లింది. ఒకదానితో ఒకటి డీకొట్టుకున్నాయి. తలలు బొప్పికట్టాయి. నల్ల మేఘాల నిండా నీళ్లే. అవి ఏడుస్తుంటే భోరున వాన కురిసింది. ఇది సూర్యభగవానుడు గమనించాడు. ‘అరెరె... నాయనలాగా ఏడవకండి’ అని వారి కళ్లు తుడవడానికి ఏడుగురు అప్సరసలను పంపాడు. ఆ ఏడుగురు అప్సరసలు ఏడు రంగుల గౌన్లు ధరించి ఆ నల్లమేఘాల దగ్గరకు వచ్చి కళ్లు తుడిచారు. వాళ్ల ఏడుపు, దాంతో పాటే వాన ఆగింది. వెనక్కు మళ్లుదామనుకున్న అప్సరసలు తమ గౌన్లు తడవడంతో వాటిని కాసేపు ఆకాశంలో ఆరనిచ్చారు. ఆకాశంలో మబ్బులన్నీ చెదిరిపోగా వారి ఏడురంగుల గౌన్లు కింద ఉన్నవారికి ఇంద్రధనుస్సులాగా కనిపిస్తూ ఉండిపోయాయి. ఈ సారి నల్ల మేఘాలు ఏడ్చినప్పుడు వాటి కళ్లు తుడవడానికి ఏడుగురు అప్సరసలు వస్తారేమో చూడండి. ఎన్నెన్నో విశ్వాసాలు మన దేశంలో వ్యవసాయం దాదాపుగా వర్షాధారం. అందుకే రుతుపవనాల రాక కోసం జానపదులు, గ్రామీణులు ఎన్నెన్నో విశ్వాసాలు, క్రతువులు పెట్టుకున్నారు. వారికి ఎలాగైనా వాన కావాలి మరి. కప్పల పెళ్లి జరిపించడం మనం చూస్తూ ఉంటాం. వానాకాలంలో కప్పలు ప్రత్యుత్పత్తికి దిగుతాయి. కప్పల పెళ్లి జరిపించడంలో అంతరార్థం వాటికి పెళ్లి జరిగి, ప్రత్యుత్పత్తికి దిగాయి కనుక రావాల్సిందేనని వానను హెచ్చరించడం. ఇప్పుడు లేదుకాని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కూడా తమిళనాడు, బిహార్ రాష్ట్రాలలో వానలు పడకపోతే ఒక కన్నెపిల్ల చేత అర్ధరాత్రి నగ్నంగా నాగలి దున్నే కార్యక్రమం చేయించేవారు. ‘ఇంద్రుడు సిగ్గుపడి ఇకనైనా వాన కురిపిస్తాడనే నమ్మకం దీని వెనుక ఉంది’ అని పరిశోధకులు అంటారు. మధ్యప్రదేశ్‌లోని గోండులు భీముణ్ణే వానదేవుడు అనుకుంటారు. వానలు ఎంతకూ కురియకపోతే ఒక స్తంభాన్ని భీముడిగా తలచి పేడ, బురద పూస్తారు. వాటిని కడుక్కోవడానికైనా భీముడు వాన కురిపిస్తాడని నమ్మకం. రాజస్థాన్‌లో ఇదే పని రైతులు చేస్తారు. ఒకరినొకరు బురదతో కొట్టుకుంటారు. ‘ఇంత బురద పూసుకున్న ఈ అమాయకులను కడిగేద్దాం’ అని వాన అనుకోవాలట. రాగాలతో వర్షాలు హిందూస్తానీ సంగీతంలో ‘మల్హార్’ రాగం పాడితే వానలు పడతాయని నమ్మకం. తాన్సేన్ మల్హార్ పాడి వర్షాలు కురిపించాడని చరిత్ర. దక్షిణాది సంగీతంలో ‘అమృతవర్షిణి’ రాగం కూడా ఇలాంటిదే. ఒకసారి ముత్తుస్వామి దీక్షితార్ ‘అమృత వర్షిణి’ని అందుకుంటే ఆకాశం భళ్లుమని వాన మొదలైపోయిందట. జానపదులు మాత్రం ‘వానల్లు కురియాలి వానదేవుడా... వరిచేలు పండాలి వానదేవుడా’ అని వాళ్లకు తోచిన రాగంలో పాడి వానదేవుణ్ణి స్వాధీనంలోకి తెచ్చుకుంటారు. గతంలో వాన రాకడ, ప్రాణం పోకడ అనేవారు. అంటే వాన ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు అని అర్థం. కాని ఇప్పుడు ఈ అర్థం కాదు. వాన వస్తే ప్రాణం పోతుంది అని! ఎందుకంటే ఎక్కడ గుంట ఉందో ఎక్కడ మిట్ట ఉందో ఎక్కడ స్తంభాలు కూలతాయో ఎక్కడ గోతులు తవ్వి ఉన్నారో తెలియదు కనుక. వానాకాలంలో వాన కథలు చెప్పుకుందాం. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉందాం. మధ్యప్రదేశ్‌లోని గోండులు భీముణ్ణే వానదేవుడు అనుకుంటారు. వానలు ఎంతకూ కురియకపోతే ఒక స్తంభాన్ని భీముడిగా తలచి పేడ, బురద పూస్తారు. వాటిని కడుక్కోవడానికైనా భీముడు వాన కురిపిస్తాడని నమ్మకం. -
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి డేట్ ఫిక్స్, ఆ రోజే లాంచ్!
Prashanth Neel, Jr NTR Movie Shooting Starts Soon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఇక ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2, సలార్ మూవీ షూటింగ్‌లతో బిజీ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇప్పటికే ఎన్టీఆర్‌కు ఒక లైన్ స్క్రిప్ట్ వినిపించి ఓకే అనిపించుకున్న ఆయన, ఈ ప్రాజెక్టును ‘దసరా’ రోజున లాంచ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగు కూడా మొదలవుతుందని ఫిలిం దూనియాలో టాక్. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ సెక్సెస్‌తో ఫుల్‌జోష్‌లో ఉన్న ఎన్టీఆర్, నెక్ట్ మూవీ కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మే 5న ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌లు వారి వివాహ వార్షికోత్సవాలను ఇరు కుటుంబాలతో కలిసి ఒక్కచోటే సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్-లిఖిత, ఎన్టీఆర్-ప్రణతిల వివాహ వార్షికోత్సవం ఒకేరోజు కావడం విశేషం. చదవండి: నటికి చేదు అనుభవం, అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులు -
ధనుష్ మూవీ నుంచి ‘భీమ్లా నాయక్’ హీరోయిన్ను తప్పించారా?, ఏం జరిగింది..
Dhanush Sir Movie Heroine Samyuktha Menon Suddenly Walked Out: కోలివుడ్ స్టార్ హీరో, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాష చిత్రానికి తెలుగులో ‘సార్’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోందని చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ తప్పకుందంటూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. కాగా సంయుక్త మీనన్ భీమ్లా నాయక్‌లో రానాకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ మూవీ నిర్మాత నాగవంశీనే ధనుష్ సార్ మూవీకి నిర్మాత కావడంతో పాటు, త్రివిక్రమ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ భీమ్లా నాయక్‌కు స్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సార్ మూవీకి సంయుక్త మీనన్ హీరోయిన్గా తీసుకోవడంతో ఫిల్మ్ సర్కిల్లో ఈ అప్డేట్ ఆసక్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సార్ మూవీ నుంచి సంయుక్త మీనన్ తప్పించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండగా.. సంయుక్త షూటింగ్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై మేకర్స్ నుండి కానీ.. సంయుక్త నుండి కానీ ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె సార్ నుంచి తప్పుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సంయుక్త సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం సార్ మూవీకి సంబంధించిన అప్డేట్స్, పోస్టులు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది నిజమా కదా అన్నది చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
స్టార్ హీరోకు బాబాయ్‌గా హీరో రాజశేఖర్!, ఏ సినిమాలో అంటే..
ప్రస్తుతం హీరో రాజశేఖర్ హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన శేఖర్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో ప్రాజక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఈ క్రమంలో రాజశేఖర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబో ఎన్టీఆర్30(#NTR30) ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: డబ్బు కోసం ఇంత దిగజారాలా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్ కాగా చిత్రంలో ఎన్టీఆర్ బాబాయ్‌ది చాలా పవర్ ఫుల్ రోల్ అని, ఆ పాత్రకు రాజశేఖర్ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించాడట. దీంతో వెంటనే ఆయనను సంప్రదించి పాత్ర గురించి వివరించగా రాజశేఖర్ దీనిక ఫిదా అయ్యారని వినికిడి. దీంతో ఎన్టీఆర్‌కు బాబాయ్‌గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ఈ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా గతంలో పవర్ఫుల్ క్యారెక్టర్స్.. విలన్ రోల్స్ చేసే అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని గతంలో రాజశేఖర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ పాత్ర చేయాలనుకుంటున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ హీరోలుగా ఆకట్టుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోయిన జగపతి బాబు, శ్రీకాంత్‌లు ఇప్పటికే విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన విలక్షణ నటనతో విలన్‌గా జగపతి బాబు పరిశ్రమలో సెటిలైపోయాడు. ఇక తాజాగా అఖండతో ప్రతికథానాయకుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు శ్రీకాంత్. -
సోదరుడితో సంబంధం అంటగట్టారు.. నిద్ర లేని రాత్రులు గడిపా
Raveena Tandon Recalls Being Linked To Her Own Brother: బాలీవుడ్ నటి రవీనా టండన్ ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పుకార్లను షేర్ చేసుకుంది రవీనా. తనకు తన కోస్టార్స్‌తో రిలేషన్ ఉన్నట్లు అవాస్తవాలను మీడియా రాసేది అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఎలా రాస్తారు అని ప్రశ్నించింది. ఒకానొక సమయంలో తన సోదరుడితో రిలేషన్లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై తాను ఎంతో కృంగిపోయాను అని చెప్పింది. రవీనా తన కోస్టార్స్‌ను మంచి స్నేహితులుగా చూస్తానని.. ఆ విషయాన్ని పత్రికా సంపాదకులు అంగీకరించలేకపోయేవారని తెలిపింది. అప్పట్లో జర్నలిస్టుల దయతో నటులు ఉండేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రవీనా. ఇంకా ఆ ఇంటర్వూలో 'నేను అనేక నిద్ర లేని రాత్రులు గడపడం నాకు గుర్తుంది. నిద్ర పోవడం కోసం ఏడ్చేదాన్ని. ప్రతి నెల సినిమా మ్యాగజీన్లు విడదల అవుతున్నాయంటే భయం పట్టుకునేది. ఎప్పుడూ ఏ పుకారు నా మీద వస్తుందో అని. ఆ పుకార్లు నా పూర్తిగా నాశనం చేశాయి. నా విశ్వసనీయత, నా ప్రతిష్ఠ, నా తల్లిదండ్రుల మనసులను ముక్కలు చేశాయి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇదంతా దేని గురించి అని. వారు నా సొంత సోదరుడితో సంబంధం ఉన్నట్లు పుకార్లు పుట్టించారు. రవీనా టండన్‌ను డ్రాప్ చేయడానికి ఒక అందమైన అబ్బాయి వచ్చాడు, మేము రవీనా టండన్ బాయ్‌ఫ్రెండ్‌ను కనిపెట్టాం అని స్టార్‌డస్ట్ రాసింది. అసలు ఎలా చెప్తారు మీరు. ఎలా ధృవీకరీస్తారు. చిత్ర పరిశ్రమలో సినిమా పాత్రికేయులు, ఎడిటర్ల దయతో జీవిస్తున్నట్లుగా ఉండేది.' అని తన మనసులోని భారాన్ని దించేసుకుంది రవీనా. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ -
బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు!
Comedian Brahmanandam Sacked From Nithiin Movie?: ఒకప్పుడు ఏడాది పొడవునా వరుస పెట్టి సినిమాలు చేసే టాలీవుడ్ హాస్యబ్రహ్మ, ప్రముఖ నటుడు బ్రహ్మానందం కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించాడు. వయస్సు రీత్యా ప్రస్తుతం ఆయన పరిమిత స్థాయిలో సినిమాలకు మాత్రమే టైం కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి బ్రహ్మానందంను తొలిగించి నితిన్ ఆయనకు షాక్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారింది. నితిన్‌కు బ్రహ్మీకి మధ్య ఏం జరిగిందని, ఆయనను సినిమా నుంచి తొలగించేంత పెద్ద విషయం ఏం జరిగిందా? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఇదేనంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కోసం మూవీ టీం వైజాగ్ వెళ్లారని, ఈ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌కు నితిన్‌తో పాటు బ్రహ్మానందం కూడా పాల్గొనాల్సి ఉందట. కానీ బ్రహ్మానందం అనుకున్న సమయానికి షూటింగ్‌కు రాకపోవడం, డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతోనే ఆయనను సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. అయితే దీనిపై డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ నుంచి ఎలాంటి కామెంట్ రాలేదు. ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం తీరుతో విసుగిపోయిన నితిన్ ఆయనను పక్కకు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాకు బ్రహ్మీ ఒక్క రోజుకు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే 10 రోజులకు రూ. 50 లక్షలన్నమాట. ఈ పారితోషికాన్ని అడ్వాన్స్గానే చెల్లించాడట నితిన్. అయితే పారితోషికం నష్టపోయిన ఫర్వాలేదు కానీ ఆయనను భరించాల్సి అవసరం లేదని మేకర్స్ అభిప్రాయపడ్డంటూ టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే నితిన్ కానీ, మూవీ టీం కానీ ఈ రూమార్స్‌పై స్పందించే వరకు వేచి చూడాలి. -
కత్రినా కైఫ్‌తో విక్కీ కౌశల్ రిలేషన్షిప్.. టీజ్ చేసిన కపిల్
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సాధారణంగా జరిగేదే. అయితే అది ఎంత వరకూ ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ‘ఉరి’ స్టార్ ఓ షోకి రాగా అందులో వీరిద్దరి బంధం గురించి హోస్ట్ టీస్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందీ టీవీ పరిశ్రమలో పాపులర్ షో ‘కపిల్ శర్మ షో’. దానికి కపిల్ శర్మ హోస్ట్. ఈ షోకి ఎంతోమంది బాలీవుడ్ సెటబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ వస్తుంటారు. అలాగే తాజాగా ‘సర్దార్ ఉదం’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా హీరో విక్కీ, డైరెక్టర్ సుజిత్ సర్కార్ వచ్చారు. విక్కీ, క్యాట్ డేటింగ్లో ఉన్న విషయాన్ని మీడియాకి తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నట్లు, అసలు వాళ్ల మధ్యలో ఏం ఉందో అందరికి తెలియజేయాలని హోస్ట్ టీజ్ చేశాడు. దీంతో ఇబ్బంది పడ్డ యంగ్ హీరో నవ్వుతూ ముఖాన్ని దాచుకున్నాడు. అయితే షో జడ్జి అర్చనా పురాన్ సింగ్ మాట్లాడుతూ..‘ఈ పుకార్లు ఎంతవరకూ నిజమో తెలియదు. కానీ కపిల్ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు’ అని తెలిపింది. దీనికి స్పందనగా విక్కీ నాకు సోదరుడని, కాబట్టి నిజం చెప్పాలనివ్వాలని కపిల్ అనడం అక్కడ నవ్వులు పూశాయి. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియోని నెట్లో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. విక్కీ, కత్రినా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని వారు ధృవీకరించలేదు కానీ పార్టీలలో కలిసి కనిపించారు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రిప్‌కి కూడా వెళ్లారు. చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో -
‘ఐరన్‌మ్యాన్’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్‌మ్యాన్’ అలా..
ఐరన్‌మ్యాన్.. మార్వెల్ కామిక్స్‌లో పిల్లలకు ఓ ఫేవరెట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్నిసంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్ డానీ జూనియర్. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. రాబర్డ్ డానీ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొందరిని అన్‌ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్ నటులను అన్ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, స్పైడర్ మ్యాన్ ‘టామ్ హాలాండ్’ లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్‌ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్‌కు డానీ గుడ్‌బై చెప్పాడా? ఇక ఐరన్ మ్యాన్‌గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా. అయితే డానీ తన ఇన్‌స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్‌ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్‌లో.. ఏ ఒక్క యాక్టర్ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్ జాన్ డానీ జూనియర్. ముద్దులతో స్పైడర్‌మ్యాన్ టామ్దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హోలాండ్(25).. తన కో స్టార్ జెన్దయాతో రిలేషన్లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. కాగా, ఈ బ్రిటిష్ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్ నటి జెన్దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్‌మ్యాన్ హోంకమింగ్(2017) నుంచి పీటర్ పార్కర్-ఎంజే క్యారెక్టర్ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. I can’t breathe #TOMDAYA #TOMHOLLAND #ZENDAYA pic.twitter.com/bYLEf2YpBM — 🦖 (@8ncvrr) July 2, 2021 -
ఆ హీరోయిన్ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా?
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి టీమీడింయా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైదొలగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నాను అని బుమ్రా ప్రకటించినప్పటికి.. పెళ్లి చేసుకోవడం కోసమే మ్యాచ్‌కు దూరమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాలు కూడా బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపాయి. ఇదిలా ఉండగా.. తాజాగా బుమ్రాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరలవుతోంది. పెళ్లి పీటలెక్కబోతున్న బుమ్రా వివాహమాడబోయే వ్యక్తి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓ ప్రముఖ హీరోయిన్ని బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరగుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రచారం అవుతోంది. ఇక బుమ్రా కూడా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలోనే సెలవులు తీసుకున్నాడని.. గుజరాత్ వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీని గురించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం అవుతోంది. అంతేకాక బుమ్రా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అలానే క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని అనుపమ పరమేశ్వరన్ గతంలో బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ బయట కలుసుకున్నట్లు కానీ.. కలిసి ఫోటోలు దిగినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. అలాంటిది ఒక్కసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. మరి ఇవి ఎంత వరకు వాస్తవమో చూడాలి. ఇక ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేదన్న సంగతి తెలిసిందే. చదవండి: అందుకే సెలవు తీసుకున్న బుమ్రా! అనుపమ పరమేశ్వరన్ మనసు పారేసుకుంది, కానీ! -
అందుకోసం రోజుకు 52 నిమిషాలు!
ముందే వచ్చేశాడే.. ఇంట్లో ఏదైనా పని ఉంటే కదా వాడికి..! ఆవిడంతే ఎప్పుడూ ముభావంగా ఉంటుంది.. ఎందుకో చెప్పనా? అదిగో చూడు వాళ్లిద్దరి ఇకఇకలు పకపకలు.. బుద్ధిలేకుండా.. వాళ్లు ఎలాంటివాళ్లంటే! ఇలా ఏ ఇద్దరు మనుషులు కలిసినా మూడో వ్యక్తి గురించి చెవులు కొరుక్కోవడం మానవ సహజ లక్షణం. ప్రతీ మనిషి రోజుకు సగటున దాదాపు 52 నిమిషాలు ఇతరుల జీవితం గురించే మాట్లాడటానికి వెచ్చిస్తాడు. అంతేకాదు తమ మధ్య లేని స్నేహితుడు, బంధువు, శత్రువు ఇలా అందరి గురించి 15 శాతం చెడుగానే మాట్లాడుకుంటారు. సామాజిక జంతువైన మనిషికి ఈ లక్షణం పూర్వీకుల నుంచే సంక్రమించింది. ఆదిమ మానవుల కాలం నాటి నుంచే గాసిప్ రాయుళ్లు వదంతులు ప్రచారం చేసేవాళ్లు. అయితే ఓ వ్యక్తితో పరిచయం, స్నేహం పెంచుకునేందుకు ఎక్కువ మంది చాడీలపై ఆధారపడతారు. ఈ విషయాలన్నీ చెబుతున్నది మేం కాదండోయ్. మనిషి ప్రవర్తన- వ్యవహార శైలిపై పరిశోధనలు చేస్తున్న సామాజిక శాస్త్రవేత్తలు, సైక్రియార్టిస్టులూనూ. గాసిప్ అంటేనే ఒకరకమైన ప్రతికూల దృక్పథం. ఈ విషయం గురించి గాలేస్బర్గ్ నాక్స్ కాలేజీ సైకాలజీ ప్రొఫెసర్ ఫ్రాంక్ మెక్ఆండ్రూ మాట్లాడుతూ.. ‘‘మన పూర్వీకులు గాసిప్ విషయంలో ఎంతో నేర్పరులు. మానవ పరిణామక్రమంలో వారి వారసులమైన మనకు కూడా ఈ గుణం అలవడింది. ఎవరు ఎవరితో పడుకుంటున్నారు? ఎవరి దగ్గర అధికారం ఉంది? ఎవరికి కావాల్సినన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి? గుహల్లో నివసించే కాలం నాటి నుంచి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నిజానిజాలు తెలుసుకోకుండా మూడో వ్యక్తి గురించి వదంతులు ప్రచారం చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఇతరులను గాయపరుస్తుంది. అయితే రోజూవారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ గాసిపింగ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఓ వ్యక్తి ఎటువంటి వాడు.. అతడి వల్ల మనకేమైనా హాని కలుగుతుందా? అన్న విషయాలు తెలుసుకుని ముందే జాగ్రత్తపడవచ్చు’’అని చెప్పుకొచ్చారు. ఇక మరో ప్రొఫెసర్ మేఘన్ రాబిన్స్.. ఇతరుల గురించి రహస్యాలు మాట్లాడుకునేప్పుడు ప్రతీ ఒక్కరూ ఉపయోగించే మాట.. ‘‘నిన్ను నమ్మి నీతో ఈ విషయం పంచుకుంటున్నా’’. అయితే ప్రతీ ఒక్కరూ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేరు. కొంతమంది మాత్రమే దీనికి కట్టుబడి ఉంటారు. కాబట్టి మూడో వ్యక్తితో మనకు కొంతమేర ప్రమాదం పొంచి ఉంటుంది’’అని హెచ్చరించారు. ఆడ, మగా తేడా లేదు.. ఆడవాళ్లు, చదువుకోని వాళ్లు ఎక్కువగా గుసగుసలాడుకుంటారనేది ఒక అపోహ మాత్రమే అని పరిశోధకులు కొట్టిపారేశారు. గాసిపింగ్కు ఆడా, మగా.. హై క్లాస్, లో క్లాస్ తేడా ఉండదని.. నిరక్షరాస్యులే కాదు ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు కూడా ఇందుకు అతీతం కాదని వెల్లడించారు. ఇతరులకు హాని చేయనంత వరకు గాసిపింగ్ అంతచెడ్డ గుణం కాదని... బంధాలు పెంపొందించుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం రెస్టారెంట్లు, మాల్స్‌కు వెళ్లి కొత్త వారిని పరిచయం చేసుకుంటారని... ఇందుకోసం గాసిపింగ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే సెలబ్రిటీల గురించి మాట్లాడతాం చాలా మంది సెలబ్రిటీల జీవనశైలిని అనుకరించేందకు ప్రయత్నిస్తారు. వారి వివరాలు తెలుసుకునేందుకు అమితాసక్తి చూపుతారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి ఆరాలు తీస్తారు. ఇలా తెలుసుకున్న విషయాలను పది మందిలో కూర్చున్నపుడు.. పార్టీలో ఉన్నపుడు వాటికి కాస్త మసాలా జోడించి తనదైన స్టైల్లో చెప్పి శ్రోతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడేవారు ఇలా చేస్తారు. మాట్లాడుతోంది సెలబ్రిటీల గురించి కాబట్టి.. వాళ్లు మనకు తారసపడే అవకాశం లేనందు వల్ల ఇది సేఫ్‌సైడ్ అనుకుంటారు. అంతేకాదు ఇలాంటి వారు.. తన కంటే అన్ని విషయాల్లో కాస్త పైచేయి సాధించిన వారి విషయంలోనూ ఇదే ధోరణి అవలంబిస్తారు. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. అదే గాసిప్ తన గురించి వస్తే మాత్రం తట్టుకోలేరు. తనలోని అవలక్షణాలను చెప్పిన వారికి దూరంగా ఉంటారు. ఇందుకోసం ముఖ్యమైన బంధాలను వదులుకోవడానికి కూడా వెనకాడరంటూ ఆండ్రూ తాను పరిశోధనలో తేలిన అంశాల గురించి చెప్పుకొచ్చారు. -
‘వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను’
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో నటి మలైకా అరోరాకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తాయి. యువ కథానాయకుడు అర్జున్ కపూర్‌తో షికార్లు చేస్తున్న ఈ బ్యూటి త్వరలో అతడిని పెళ్లాడనుందన్న వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయంపై అర్జున్ కపూర్, మలైకాలు ఇంతవరకు స్పందించలేదు. తాజాగా తన ఫిట్నెస్ స్టూడియో ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మలైకాకు అర్జున్‌తో రిలేషన్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించిన మలైకా అరోరా, ‘నేను వ్యక్తిగత ప్రశ్నలకు ఎప్పుడూ సమాధానాలు చెప్పను. అలాంటి విషయాలు మాట్లాడటం నాకు కంఫర్టబుల్‌గా అనిపించదు. నా జీవితంలో జరిగే అన్ని విషయాలు అందరికీ తెలుసు. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడం నాకు ఇష్టముండదు. నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను’ అంటూ కామెంట్ చేశారు. -
మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి మహేష్!
టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్‌కు తిరుగులేదు. ఫ్యామిలీ అడియెన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల్లో కూడా మహేష్‌కు భారీ అభిమాన గణం ఉంది. టాలీవుడ్లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మహేష్ ఒకరు. అంతేకాకుండా మహేష్ ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉంటారు. అయితే ఇప్పుడు మహేష్ థియేటర్ బిజినెస్‌లోకి దిగినట్టు తెలుస్తోంది. ఏసియన్ సినిమాస్ సంస్థతో కలసి ఆయన జాయింట్ వెంచర్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో AMB మల్టీప్లెక్స్‌ను నవంబర్ 8న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను మహేష్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
మరో ప్రేమకథను నిర్మించనున్న సుకుమార్!
పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్. గతంలో కుమారి 21ఎఫ్, దర్శకుడు సినిమాలను నిర్మించిన లెక్కల మాష్టారు.. ఈసారి కూడా ఓ ప్రేమ కథా చిత్రాన్ని, యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నారని సమాచారం. సుకమార్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను దర్శకులుగా పరిచయం చేస్తూ.. కథ మాటలు అందిస్తూ.. సినిమాలను నిర్మిస్తూ.. సక్సెస్ సాధిస్తున్నారు. అయితే సుక్కు ఈసారి నాగశౌర్య, రష్మిక మందాన్న కాంబినేషన్లో ఓ లవ్ అండ్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ వార్తలపై సుకుమార్ స్పందించేవరకు చూడాల్సిందే. -
ఛలో హీరోయిన్ ఎంగేజ్మెంట్ రద్దు...!
కన్నడ బ్యూటీ, ఛలో ఫేమ్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో గతేడాది ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుండటంతో ఆమె నిశ్చితార్థం రద్దు దిశగా ఆలోచన చేస్తోందని, ఈ మేరకు ఓ నిర్ణయం కూడా తీసేసుకుందంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీనికితోడు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా తలెత్తాయన్నది ఆ కథనం పేర్కొంది. గీత గోవిందం పోస్టర్లలో రష్మిక.. విజయ్ దేవరకొండల మధ్య రొమాన్స్‌పై రక్షిత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. అయితే అప్పటి నుంచి రక్షిత్-రష్మికల మధ్య మాటలు లేవన్నంట. దీంతో కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ సమయంలో ఆమె వివాహ ఆలోచనను పూర్తిగా పక్కకు పెట్టినట్లు ఆ కథనం ఉటంకించింది. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితులు తూచ్‌గా తేల్చేస్తున్నారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో ఇద్దరూ కలిసి హాజరైన విషయాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ గాసిప్స్‌పై రష్మిక, రక్షిత్‌లు స్పందించాల్సి ఉంది.