న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి టీమీడింయా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వైదొలగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నాను అని బుమ్రా ప్రకటించినప్పటికి.. పెళ్లి చేసుకోవడం కోసమే మ్యాచ్‌కు దూరమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాలు కూడా బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి తెలిపాయి. ఇదిలా ఉండగా.. తాజాగా బుమ్రాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరలవుతోంది. పెళ్లి పీటలెక్కబోతున్న బుమ్రా వివాహమాడబోయే వ్యక్తి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓ ప్రముఖ హీరోయిన్‌ని బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది.
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరగుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రచారం అవుతోంది. ఇక బుమ్రా కూడా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలోనే సెలవులు తీసుకున్నాడని.. గుజరాత్ వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీని గురించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం అవుతోంది.
అంతేకాక బుమ్రా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అలానే క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని అనుపమ పరమేశ్వరన్ గతంలో బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ బయట కలుసుకున్నట్లు కానీ.. కలిసి ఫోటోలు దిగినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. అలాంటిది ఒక్కసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. మరి ఇవి ఎంత వరకు వాస్తవమో చూడాలి. ఇక ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేదన్న సంగతి తెలిసిందే.
చదవండి:
అందుకే సెలవు తీసుకున్న బుమ్రా!
అనుపమ పరమేశ్వరన్ మనసు పారేసుకుంది, కానీ!
Comments
Please login to add a commentAdd a comment