
సినిమా: ఆరాద్య అనే యువతి తాను అంజలి సోదరినని త్వరలో సినిమాల్లోకి వస్తానని ఇటీవల ఓ ప్రకటన చేసింది. దీనికి అంజలి తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆరాద్య తన సోదరి కాదని చెప్పకనే చెప్పింది. ఆ విషయం స్పష్టమయ్యేలా నాకున్న ఏకైక సోదరి అంటూ అంజలి తన అక్కతో దిగిన ఫోటోను ఫోస్ట్ చేసింది. ఆమె అక్క పేరు కూడా అందులో పేర్కొనలేదు.
ఆరాద్య ఎవరు, ఆమెకు అంజలికి సంబంధం ఏమిటి అనే విషయాలు ట్వీట్లో పేర్కొనలేదు. సముద్ర డైరెక్షన్‌లో రానున్న బైలింగువల్ మూవీలో అంజలి చెల్లెలు ఆరాధ్య హీరోయిన్‌గా చేస్తోందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
So happy I got to hangout with my one and ONLY sister 👩👧 ❤️❤️#adaywithmyakka #sislove#myblood #familytime pic.twitter.com/kOsktDmxrJ
— Anjali (@yoursanjali) September 24, 2017