దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్‌గానూ నటించాడు. తన ప్రపోజల్‌ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్‌కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.
రైల్లో నుంచి నెట్టేయాలని..
ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్‌గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.
కత్తితో బెదిరించి సంతకం..
నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్‌గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్‌పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.
(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)
అంత చెండాలంగా లెటర్ రాస్తారా?
నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్‌ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది.
సినిమా
అంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్‌స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.
చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా!
Comments
Please login to add a commentAdd a comment