హీరో భార్యనని చెప్పారు.. అంతా అతని వల్లే: నటి | Malayalam Actress Kavya Madhavan Reacts About Rumours On Her Marriage, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Kavya Madhavan: 'నా పేరు వల్ల స్టార్ హీరో భార్య అనుకున్నారు'

Published Thu, Jul 25 2024 9:00 PM | Last Updated on Fri, Jul 26 2024 10:40 AM

Malayalam Actress kavya Madhavan Open About Rumours On Her Marriage

మలయాళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య. తనదైన నటనతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే నటిగా ఎంత ఫేమస్ అయిందో.. అంతే వేగంగా రూమర్స్‌తో వార్తల్లోనూ నిలిచింది. తాను ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు స్టార్ హీరోను పెళ్లి చేసుకున్నానంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. తాను తమిళ నటుడు మాధవన్‌ భార్యనని ప్రచారం జరిగిందని తెలిపింది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ అవార్డు వేదికలో నటుడు మాధవన్‌తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. 

k

కావ్య మాధవన్ మాట్లాడూతూ..'హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన టైంలో ఓ సినిమా షూటింగ్‌ కోసం ఊటీ వెళ్లా. నా అసలు పేరు కావ్య మాధవన్. అక్కడి ప్రజలకు నేనంతగా తెలియదు. కానీ నేను మొదటిసారిగా తమిళనాడుకు వచ్చా. అయినా అక్కడ ప్రజలు నన్ను అదేపనిగా చూస్తూనే ఉన్నారు. నన్ను చూసేందుకు ఇంతమంది ఎందుకు వస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు. దానికి కారణం ఆ సినిమా హీరో జయసూర్యనే. తాను మాధవన్ భార్యనని అక్కడున్న వారందరికీ అతనే చెప్పాడంటా. దీంతో అందరూ నన్ను చూసేందుకు తరలివచ్చారని' తెలిపింది. తనపేరులో మాధవన్‌ అని ఉండడంతో అందరూ నిజంగానే ఆయన భార్యనే అనుకున్నారని కావ్య వెల్లడించింది. 

kk
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement