Kavya Madhavan
-
హీరో భార్యనని చెప్పారు.. అంతా అతని వల్లే: నటి
మలయాళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య. తనదైన నటనతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే నటిగా ఎంత ఫేమస్ అయిందో.. అంతే వేగంగా రూమర్స్‌తో వార్తల్లోనూ నిలిచింది. తాను ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు స్టార్ హీరోను పెళ్లి చేసుకున్నానంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. తాను తమిళ నటుడు మాధవన్ భార్యనని ప్రచారం జరిగిందని తెలిపింది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ అవార్డు వేదికలో నటుడు మాధవన్‌తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. కావ్య మాధవన్ మాట్లాడూతూ..'హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన టైంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీ వెళ్లా. నా అసలు పేరు కావ్య మాధవన్. అక్కడి ప్రజలకు నేనంతగా తెలియదు. కానీ నేను మొదటిసారిగా తమిళనాడుకు వచ్చా. అయినా అక్కడ ప్రజలు నన్ను అదేపనిగా చూస్తూనే ఉన్నారు. నన్ను చూసేందుకు ఇంతమంది ఎందుకు వస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు. దానికి కారణం ఆ సినిమా హీరో జయసూర్యనే. తాను మాధవన్ భార్యనని అక్కడున్న వారందరికీ అతనే చెప్పాడంటా. దీంతో అందరూ నన్ను చూసేందుకు తరలివచ్చారని' తెలిపింది. తనపేరులో మాధవన్ అని ఉండడంతో అందరూ నిజంగానే ఆయన భార్యనే అనుకున్నారని కావ్య వెల్లడించింది. -
హీరోయిన్ లైంగిక దాడి కేసు, దిలీప్ భార్యను విచారించిన పోలీసులు
Kerala Police Investigate Accused Dileep Wife Kavya Madhavan: ప్రముఖ హీరోయిన్ లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్టార్ నటుడు దిలీప్ కుమార్ భార్య కావ్య మాధవన్‌ను తాజాగా కేరళ క్రైం పోలీసులు విచారించారు. ఈ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఇటీవల బయటకు వచ్చిన కొన్ని ఆడియో క్లిప్స్‌తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్ బావ మరిది సూరజ్, శరత్‌లకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్‌లు బయటకు వచ్చాయి చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ దీంతో ఈ కేసులో దిలీప్ భార్య కావ్య మాధవన్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన కేరళ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఆలువాలోని తన నివాసంలో దాదాపు 4 గంటల పాటు ఆమెను విచారించారు. అయితే ఈ విచారణంలో కావ్య పోలీసులకు సహకరించలేదని తెలిసింది. పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఆమె సంబంధం లేని సమాధానాలు ఇచ్చిందని, మరికొన్నింటికి గుర్తులేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే గతంలో కావ్యకు పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేయగా తాను చెన్నైలో ఉన్నందున విచారణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. చదవండి: నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్ బాబు ఈ క్రమంలో ఇటీవల ఆమెకు మరోసారి సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారించగా తన నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదల కాగా... అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
నటి వేధింపుల కేసు: 'మేడం' ఆమెనే
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా కీలక విషయాలు వెల్లడించాడు. 'నా మేడం ఎవరో కాదు కావ్యామాధవనే' అంటూ వెల్లడించాడు. అయితే, నటిపై లైంగిక వేధింపుల కేసు వెనుక ఆమె ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నకు అతను 'లేదు' అని సమాధానం చెప్పాడు. నటిపై లైంగిక వేధింపుల కేసులో కావ్యా మాధవన్ ప్రమేయం కూడా ఉన్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో అపహరించి.. లైంగికంగా వేధించామని, ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశామని పల్సర్ సునీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని అతను చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ గతంలో పోలీసులకు చెప్పాడు. తాజాగా ఆ మేడం ఎవరో వెల్లడించిన పల్సర్ సునీ.. అయితే, ఆమెకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తుండటం గమనార్హం. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య అయిన కావ్యా మాధవన్‌కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన రెండో భార్య కావ్య పాత్రపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో రెండోసారి అభ్యర్థించినా నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది!
కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరో నటి కావ్యా మాధవన్ మెడకు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో లైంగికంగా వేధించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలిపాడు. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఈ 'మేడం' ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 'మేడం' అని మాత్రమే చెప్పిన పల్సర్ సునీ.. ఆమె పేరు, వివరాలు మాత్రం పోలీసులకు తెలియజేయలేదని తెలుస్తోంది. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య కావ్యా మాధవనే ఈ 'మేడం' అయి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పల్సర్ సునీ ఎవడో తనకు తెలియదని కావ్యా మాధవన్ అంటుండగా.. ఆమె వ్యాఖ్యలను పల్సన్ సునీ తోసిపుచ్చాడు. 'కావ్యా నేనెవరో తెలియదనడం మూర్ఖత్వం. ఆమెకు నేను బాగా తెలుసు' అని పల్సర్ సునీ మీడియాతో తెలిపాడు. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ సూత్రధారి కాగా, ఆయన భార్య కావ్య కూడా పాత్రధారిగా వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నటుడి భార్య విచారణ.. వెక్కివెక్కి ఏడ్పు
కొచ్చి: కేరళలో ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న మలయాళ నటుడు దిలీప్ భార్య కావ్య మాధవన్‌ను కూడా విచారించినట్లు కేరళ పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏవీ గార్జ్ విలేకరులతో మాట్లాడుతూ 'మంగళవారం కావ్యమాధవన్‌ను ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతానికి నేను ఈ విషయాన్ని మాత్రమే స్పష్టం చేయగలను. ఇంతకుమించి ఎలాంటి సమాచారం అందించలేను' అని ఆయన తెలిపారు. దిలీప్ పూర్వీకుల నివాసానికే వెళ్లిన అధికారులు అక్కడే ఆమెను దాదాపు ఆరుగంటలపాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సమయంలో పలుమార్లు ఏడ్చినట్లు సమాచారం. దిలీప్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కేరళ హైకోర్టు ఆగస్టు 8 వరకు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. -
నటిపై వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
కొచ్చి: కేరళ నటి అపహరణ, వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను విచారించిన పోలీసులు తాజాగా ఆయన భార్య, నటి కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన సోదాలు అర్థరాత్రి 2 గంటలకు కొనసాగినట్టు తెలుస్తోంది. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పేమెంట్స్ గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. అయితే సోదాలపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ నేరం చేసిన తర్వాత రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు నటిపై అఘాయిత్యానికి పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోలు ఉన్న మెమరీ కార్డును కూడా కార్యాలయంలోనే దాచిపెట్టివుంటాడని అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఇక్కడ సోదాలు జరిపారు. 2016లో దిలీప్, కావ్య పెళ్లి చేసుకున్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన తర్వాత తన మొదటి భార్య మంజు వారియర్‌కు 2015లో దిలీప్ విడాకులు ఇచ్చారు. వ్యాపారవేత్త నిశాల్ చంద్రను 2009లో పెళ్లి చేసుకున్న కావ్య 2010లో ఆయన నుంచి విడిపోయారు. -
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
-
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
అంతులేని ప్రేమకథకు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. లివింగ్ ‘లైలా- మజ్నూ’లుగా ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన హీరోహీరోయిన్లు కావ్యా మాధవన్- దిలిప్‌లు ఒక్కఇంటివాళ్లయ్యారు. మలయాళంలో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్న కావ్యా.. అదే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతోన్న దిలిప్‌లు శుక్రవారం వివాహబంధంలోకి ప్రవేశించారు. అతికొద్దిమంది ఆంతరంగికుల సమక్షంలో శుక్రవారం కొచిలోని ఓ హోటల్లో ఈ ఇద్దరూ మనువాడారు. కాగా, కావ్యా, దిలిప్‌లు ఇద్దరిరీ ఇది రెండో పెళ్లేకావడం గమనార్హం. మలయాళ నటి మంజూ వారియర్‌ను 1998లో పెళ్లాడిన దిలిప్.. కొన్నేళ్ల కిందటే ఆమెకు విడాకులిచ్చాడు. ఇటు కావ్య.. కెరీర్ జోరుమీదున్న సమయంలోనే(2009లో) కువైట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడి.. సంవత్సరం తిరిగేలోపే విడాకులిచ్చింది. గడిచిన కొద్దికాలంగా కావ్యా, దిలిప్‌ల ప్రణయగాథపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వీటిని ఏ దశలోనూ ఖండించని ఆ ఇద్దరూ.. అందరికి సర్ప్రైజ్ ఇస్తూ పెళ్లిపీటలెక్కారు. కావ్యతో పెళ్లికి దిలీప్ కుమార్తె మీనాక్షి కూడా అభ్యంతరపెట్టలేదని, ఆ ఇద్దరూ(కావ్యా, దిలీప్‌లు) కలిసి ఉండటం కంటే సంతోషకరమైన విషయం ఏదీ లేదని నటి మనేకా(నిర్మాత సురేశ్ భార్య) మీడియాతో అన్నారు. కావ్యా దిలిప్‌లు కలిసి ఇప్పటిదాకా 21 సినిమాల్లో జతకట్టారు. వాటిలో మీసమాధవన్, కాసిపట్టణం, పిన్నెయుమ్ తదితర సినిమాలు సూపర్హిట్లుగా నిలిచాయి. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న కావ్య
నటి కావ్య మాధవన్ రెండో వివాహానికి సిద్ధమవుతున్నారు. కాశి, ఎన్ మన వానిల్, సాధు మిరండా చిత్రాల్లో మలయాళ నటి కావ్య మాధవన్ నటించారు. ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈమె ఫిబ్రవరి 5, 2009న కువైట్ బ్యాంక్ అధికారి నిషాల్ చంద్రను వివాహమాడారు. తర్వాత నటనకు స్వస్తి చెప్పిన ఈమె తన భర్తతో విదేశాల్లో సెటిలయ్యారు. ఇలా ఉండగా వీరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. భర్తను విడిచి కేరళకు చేరుకున్న కావ్య, గత ఏడాది చట్ట బద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మలయాళ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో మలయాళ నటుడు దిలీప్‌ను కావ్య ప్రేమిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే దీనిని ఆమె ఖండించారు. అయినప్పటికీ తన భర్త దిలీప్‌కు కావ్యకు మధ్య రహస్య సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న మంజు వారియర్ దిలీప్‌ను విడిచి ఒంటరిగా జీవిస్తూ మళ్లీ నాట్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మలయాళ చిత్రాల్లోనూ నటించడం ఆరంభించారు. ప్రస్తుతం నటనలో బిజీగా ఉన్న కావ్యను రెండో వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు వత్తిడి తెస్తున్నారు. దీంతో కావ్య కేరళలో గల ప్రముఖ జ్యోతిష్యునితో కలిసి తన వివాహం గురించి అడిగినట్లు వచ్చే ఏడాది వివాహం చేసుకుంటే సమస్యలు ఏర్పడవని సదరు జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం.