
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న కావ్య
నటి కావ్య మాధవన్ రెండో వివాహానికి సిద్ధమవుతున్నారు. కాశి, ఎన్ మన వానిల్, సాధు మిరండా చిత్రాల్లో మలయాళ నటి కావ్య మాధవన్ నటించారు. ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈమె ఫిబ్రవరి 5, 2009న కువైట్ బ్యాంక్ అధికారి నిషాల్ చంద్రను వివాహమాడారు. తర్వాత నటనకు స్వస్తి చెప్పిన ఈమె తన భర్తతో విదేశాల్లో సెటిలయ్యారు.
ఇలా ఉండగా వీరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. భర్తను విడిచి కేరళకు చేరుకున్న కావ్య, గత ఏడాది చట్ట బద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మలయాళ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో మలయాళ నటుడు దిలీప్‌ను కావ్య ప్రేమిస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే దీనిని ఆమె ఖండించారు. అయినప్పటికీ తన భర్త దిలీప్‌కు కావ్యకు మధ్య రహస్య సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న మంజు వారియర్ దిలీప్‌ను విడిచి ఒంటరిగా జీవిస్తూ మళ్లీ నాట్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మలయాళ చిత్రాల్లోనూ నటించడం ఆరంభించారు.
ప్రస్తుతం నటనలో బిజీగా ఉన్న కావ్యను రెండో వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు వత్తిడి తెస్తున్నారు. దీంతో కావ్య కేరళలో గల ప్రముఖ జ్యోతిష్యునితో కలిసి తన వివాహం గురించి అడిగినట్లు వచ్చే ఏడాది వివాహం చేసుకుంటే సమస్యలు ఏర్పడవని సదరు జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం.