
ప్రముఖ డైరెక్టర్ ఖలీద్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన అల్లప్పుజా జింఖానా మూవీ దర్శకుడైన ఖలీద్ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో పాటు మరో డైరెక్టర్ అష్రఫ్ హంజా కూడా ఉన్నారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో వీరిద్దరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఆ ఫ్లాట్ మలయాళ సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్‌కు చెందినదని సమాచారం. వీరి నుంచి 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
డ్రగ్స్ కేసులో మలయాళ సినీ దర్శకులు అరెస్ట్ అలప్పుజ జింఖానా మూవీకి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా మలయాళంలో పలు సినిమాలను ఆయన తెరకెక్కించారు. మరో డైరెక్టర్ అష్రఫ్ తమాషా, భీమన్నంటే వాజి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా వీరిద్దరు గంజాయి కేసులో అరెస్ట్ కావడంతో మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు..
కొద్ది రోజుల క్రితమే మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అతనిపై మలయాళ ఇప్పటికే సినీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఓ హోటల్‌లో రైడ్ చేయడం పోలీసుల నుంచి టామ్ చాకో తప్పించుకున్నారు. ఏప్రిల్ 21న చాకోను అరెస్టు చేయగా.. వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. టామ్ చాకో తెలుగులో దసరా మూవీతో ఫేమస్ అయ్యారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు.