khalid
-
అల్‌ఖైదా నేత ఖలిద్ అల్ బతర్ఫీ మృతి
యెమెన్ అల్-ఖైదా శాఖ నేత ఖలిద్ అల్ బతర్ఫీ మృతి చెందాడు. ఆదివారం అర్థరాత్రి ఉగ్రవాదులు ఈ సమాచారాన్ని అందించారు. అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపులో అల్-ఖైదాకు నాయకత్వం వహిస్తున్న ఖలిద్ అల్ బతర్ఫీపై యూఎస్ఏ ప్రభుత్వం ఐదు మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్య అనంతరం ఈ తీవ్రవాద గ్రూపును అత్యంత ప్రమాదకరశాఖగా పరిగణిస్తున్నారు. అల్-ఖైదా తాజాగా దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. దానిలో ఖలిద్ అల్ బతర్ఫీ శరీరానికి అల్‌ఖైదా జెండాను చుట్టినట్లు కనిపిస్తోంది. ఖలిద్ అల్ బతర్ఫీ కి 40 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ‘సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ రంజాన్ మాసం సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసింది. యెమెన్‌లో సోమవారం నుంచి ముస్లింల పవిత్ర మాసం ప్రారంభం కానుంది. -
ఖలీద్ మషాల్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి?
కేరళలోని మలప్పురంలో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు ఖలీద్ మషాల్ వర్చువల్ ఉనికి ఆందోళనకరంగా మారింది. హమాస్ నాయకుడు ర్యాలీలో కనిపించడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. భారతదేశంలో నిర్వహించే ర్యాలీలో ప్రసంగించేందుకు ఉగ్రవాద సంస్థ నాయకునికి ఎలా అనుమతినిస్తారని పోలీసులను బిజేపీ ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో కేరళలో పాలస్తీనా అనుకూల ర్యాలీలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ర్యాలీలో ఖలీద్ మషాల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ ర్యాలీని జమాత్-ఇస్లామీ యువజన విభాగం సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ నిర్వహించింది. ఖలీద్ మషాల్ హమాస్ పొలిట్‌బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు. 2017 వరకు ఛైర్మన్‌గా వ్యవహరించాడు. చాలాకాలం పాటు ఖలీద్ మషాల్ హమాస్ నాయకుడిగా ఉన్నారు. ఖలీద్ మషాల్ వెస్ట్ బ్యాంక్‌లో జన్మించాడు. కువైట్, జోర్డాన్‌లో పెరిగాడు. 2004లో ప్రవాస హమాస్‌కు రాజకీయ నాయకునిగా మారాడు. ఖలీద్ మషాల్ ఎప్పుడూ గాజాలో నివసించలేదు. జోర్డాన్, సిరియా, ఖతార్, ఈజిప్టులో ఉంటూ గాజా కోసం వ్యూహాలు రచించేవాడు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఖలీద్ మషాల్ ప్రస్తుతం ఖతార్‌లో ఉన్నాడు. అతని నికర ఆస్తుల విలువ 4 బిలియన్ డాలర్లు. కేరళలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. అందులో బుల్డోజర్, హిందుత్వాన్ని నిర్మూలించండి.. వర్ణవివక్ష-జియోనిజం లాంటి నినాదాలు కనిపించాయి. సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు సుహైబ్ మీడియాతో మాట్లాడుతూ హమాస్ భారతదేశానికి సంబంధించిన సంస్థ కాదని, చట్ట ప్రకారం వారి భాగస్వామ్యం నేరం కాదన్నారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు, ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ఖలీద్ మషాల్ పాల్గొన్నారని, ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదన్నారు. ఇది కూడా చదవండి: అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం! -
టైటిల్ పోరుకు ఖాలిద్, ముజఫర్
హైదరాబాద్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: ‘శ్రీ కృష్ణ కేసరి టైటిల్’ హైదరాబాద్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఖాలిద్ బిన్, మొహమ్మద్ ముజఫర్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. యాదవ్ అహీ ర్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీ 86–120 కేజీల విభాగంలో వీరిద్దరూ ఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన సెమీఫైనల్ బౌట్లో సయ్యద్ మొహమ్మద్‌పై ఖాలిద్, లవకుమార్‌పై ముజఫర్ గెలుపొందారు. 86 కేజీల విభాగంలో శ్రీనాథ్‌పై జునైద్, మోహన్ గాంధీపై అమర్ మోరే నెగ్గి ఫైనల్‌కు చేరుకున్నారు. 74 కేజీల కేటగిరీ సెమీఫైనల్ బౌట్లో అబ్దుల్ సమద్‌పై రామచందర్, అబూబకర్ అబ్దుల్లాపై అహ్మద్ గెలిచారు. ఇతర కేటగిరీల సెమీఫైనల్స్ ఫలితాలు 70 కేజీలు: మహేశ్ యాదవ్‌పై టి. శివ సింగ్, మొహమ్మద్ సఫీయుద్దీన్పై ఆకాశ్ నెగ్గారు. 65 కేజీలు: అబ్దుల్ కలామ్‌పై సంతోష్; సయ్యద్ అబ్రార్‌పై దినేశ్ గెలిచారు. 57 కేజీలు: సాయి యాదవ్‌పై అక్షత్; విక్రమ్‌పై సంజయ్ గెలుపొం దారు. 50 కేజీలు: అస్లామ్‌పై టీకారామ్ సింగ్, శ్రీకాంత్ ముదిరాజ్‌పై కిషన్ సింగ్ నెగ్గారు. -
ఉగ్రవాద సోదరులు అరెస్టు
బెర్లిన్: ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరు జర్మనీ సంతతికి చెందిన మోరాకో సోదరులను జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరికి ఇస్లామిక్ స్టేట్, ‘నుస్రా ఫ్రంట్’ అనే ఉగ్రవాద సంస్థల్లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ పోలీసులు వారిని రచిద్(25), ఖలీద్(24) జర్మన్ సంతతికి చెందిన మోరాకన్లుగా గుర్తించారు. వీరిద్దరూ కూడా 2013లో సిరియాకు వెళ్లి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకున్నారని, అనంతరం రచిద్ ‘అల్ నుస్రా’లో చేరాడని అతడిపై ఇప్పటికే కిడ్నాపింగ్, గూఢచర్యం ఆరోపణలు ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్‌లో చేరి పలు ఆ సంస్థ చేసిన పలు దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అతడి సోదరుడు ఖలీద్ మాత్రం నేరుగా ఇస్లామిక్ స్టేట్‌లో చేరి ఉగ్రవాద చర్యలకు పూనుకున్నట్లు స్పష్టం చేశారు. -
ఇద్దరు రౌడీషీటర్ల అరెస్ట్
మద్యం తాగేందుకు డబ్బుల కోసం టెంట్‌హౌజ్‌లో పని చేస్తున్న వర్కర్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటనలో కార్మిక నగర్‌కు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు లక్ష్మణ్, ఖాలిద్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 15వ తేదీన కార్మికనగర్ సమీపంలోని బ్రహ్మంగారి టెంపుల్ వద్ద ఉన్న టెంట్‌హౌజ్ వద్దకు రౌడీషీటర్లు లక్ష్మణ్, ఖాలిద్‌లు వచ్చి ’ 5 వేలు ఇవ్వాలంటూ టెంట్‌హౌజ్ యజమానిని అడిగారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో టెంట్హౌజ్లోసామాన్లు అన్నీ ధ్వంసం చేసి భీభత్సం సష్టించి అక్కడ పని చేస్తున్న వాళ్లను తీవ్రంగా కొట్టి అడ్డు వచ్చిన కె. సురేష్కుమార్పై కత్తితో దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఖాలీద్ కన్నుపడితే..
కరీంనగర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు ఖాలీద్ గ్యాంగ్ ఇటీవల నగర శివారులో ఓ విద్యార్థినిని చెరబట్టింది. కరీంనగర్ క్రైం : కరీంనగర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు ధూం ఖాలీద్ నగర శివారు ప్రాంతాల్లో మాటువేసి రేప్‌లు, దోపిడీలు చేస్తుంటాడు. ఇప్పటికి పదుల సంఖ్యలో అమ్మారుులను చెరబట్టిన ఇతడి గ్యాంగ్ ఇటీవల ఓ ఇంటర్ విద్యార్థినిని చెరిచింది. నగరానికి చెందిన విద్యార్థిని పెద్దపల్లి బైపాస్ రోడ్డు ప్రాంతంలో వెళ్తుండగా.. ఖాలీద్, అతడి అనుచరులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. అనంతరం ఖాలీద్‌తో అనుచరులకు గొడవ జరగడంతో అతడిపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖాలీద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఓ కాలిని తొలగించాల్సి వస్తున్నట్లు సమాచారం. ఖాలీద్తోపాటు అతడి అనుచరులు పోలీసు శాఖలోని కొంతమంది బంధువుల అండతో రెచ్చిపోతున్నట్లు ఆరోపణలున్నారుు. అలాగే ఓ రాజకీయ పార్టీ నాయకులు వారి ఆగడాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలున్నారుు. కాగా.. తాజా ఘటన నేపథ్యంలో పోలీసులు ఖాలీద్ గ్యాంగ్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా వీరిని కఠినంగా శిక్షించాలని పలువురు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. -
బీడీ కార్మికుడికి పుట్టిన ‘ఐసిస్’ ఉగ్రవాది
బీడీ కార్మికుడికి పుట్టిన అబు అన్స్ పిల్లల కోసం కడుపుకాల్చుకున్న తండ్రి ‘ఐసిస్’ ఉగ్రవాది కుటుంబ వ్యవహారమిది కీలకంగా మారిన సిటీలో ఖాలిద్ కదలికలు సిటీబ్యూరో: అతడో బీడీ కార్మికుడు... రాజస్థాన్‌లోని ఓ పట్టణంలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. తన కుమారులకు బంగారు భవితనివ్వాలని అనునిత్యం తపన పడ్డాడు. చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల్నీ ‘ధిక్కరించి’ మరీ తన కుమార్తె ఉన్నత విద్యనభ్యసించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు శనివారం అరెస్టు చేసిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సభ్యుడు అబు అన్స్ తండ్రి అంజద్ ఖాన్ వ్యవహారమిది. జైపూర్‌కు 85 కిమీ దూరంలో ఉన్న టోంగ్ పట్టణంలోని మొహల్లా బథ్వాలన్ ప్రాంతానికి చెందిన అంజద్ ఖాన్ ఓ బీడీ తయారీ సంస్థలో కార్మికుడు. ఇలా వచ్చే చిరు ఆదాయంతోనే ముగ్గురు కుమారులు, కుమార్తెకు మంచి జీవితం ఇవ్వాలని భావించాడు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ తన దైనందిన అవసరాలను సైతం తగ్గించుకుంటూ వచ్చాడు. పెద్దవాడైన అబు అన్స్ను జైపూర్‌లోని జేవీసీఆర్సీ యూనివర్సిటీ నుంచి మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేయించాడు. కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు చేయించి ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు పంపాడు. మిగిలిన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఇటీవలే బీటెక్ పూర్తి చేయగా... మరొకరు డిగ్రీ తరవాత జైపూర్‌కు వచ్చి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. మైనార్టీలు ఎక్కువగా నివసించే మొహల్లా బథ్వాలన్లో యువతులు స్కూలు విద్యను దాటడమే గొప్ప విషయం. అలాంటి అంశాలనూ పట్టించుకోని అంజద్ తన కుమార్తెను సైతం బీఎస్సీ పూర్తి చేయించి, ఉన్నత చదువులకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన అబు తొలుత దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో సైబర్ సెక్యూరిటీకి సంబధించిన క్రాష్ కోర్సులు చేశారు. ఆ తర్వాత అబిడ్స్ గన్‌ఫౌండ్రీ చౌరస్తాలో ఉన్న టెక్నో వరల్డ్ గ్రూప్ (టీడబ్ల్యూజీ) సంస్థలో అప్రెంటీగా చేరారు. అది పూర్తయ్యాక అదే సంస్థలో గతేడాది జూన్ నుంచి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్న అబు బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ ఆరోపించింది. గత నెల 25 నుంచి అబు విధులకు హాజరుకావట్లేదని, అరెస్టు విషయం తెలిసి నమ్మలేకపోయామని సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఈ సంస్థ ఓ రాజకీయ ప్రముఖుడికి చెందినదిగా తెలిసింది. కుమారుడు అరెస్టు విషయం తెలుసుకున్న అంజద్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు. అయితే అబు అన్స్ను ఢిల్లీ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు తెలిసుకుని అక్కడకు వెళ్లారు. ఖాలిద్ సిటీకి ఎందుకొచ్చాడు? ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో గతేడాది చిక్కిన రిజ్వాన్ నిజాముద్దీన్ అలియాస్ ఖాలిద్ కదలికలు హైదరాబాద్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యూపీలోని ఖుషీనగర్ జిల్లా కాల్యాకు చెందిన ఖాలిద్ ముంబైలోని మాల్వనీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకుల్ని ఐసిస్ వైపు ఆకర్షించాడనేది ప్రధాన ఆరోపణలు వీరిలో ముగ్గురు సిరియా వెళ్లి తిరిగి వచ్చి పోలీసులకు పట్టుబడగా... మరో యువకుడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు గతనెల 30న ఖాలిద్‌ను అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేంచిన నేపథ్యంలోనే ఇతడి కదలికలు హైదరాబాద్‌లోనూ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నిఘా విభాగాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎన్ఐఏ అరెస్టు చేసిన నలుగురి ఉగ్రవాదులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయా? లేక ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా నగరం దాటి సిరియాకు వెళ్లిపోయినట్లు భావిస్తున్న ఐదుగురి అంశానికి సంబంధించిందా? అనే దానిపై దృష్టి పెట్టారు. జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ ఉగ్రవాదుల్ని మంగళవారం నుంచి కస్టడీలోకి తీసుకోనున్న ఎన్ఐఏ.. హైదరాబాద్‌కు చెందిన వారిని ఈ కోణంలోనూ ప్రశ్నించనుంది. ‘జునూద్’ చీఫ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటూ శుక్రవారం ముంబైలో అరెస్టు అయిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్‌కు ఖాలిద్‌తో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. -
రూ. 90 చోరీకి పదమూడేళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ: రూ. 90 చోరీ చేశాడన్న ఆరోపణలపై అరెస్టయి, ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించిన ‘నిందితుడి’ని ఢిల్లీ హైకోర్టు ఆదివారం విడుదల చేసింది. కేసులో దోషిని తప్పుగా గుర్తించారనే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. వివరాల్లోకెళ్తే... 2001, ఏప్రిల్ 9న ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఖాలిద్ ఖురేషీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నారు.కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు ఖాలిద్‌కు ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10 జరిమానా కూడా విధించింది. అయితే ఈ కేసు విషయమై పోలీసులు ఎటువంటి దర్యాప్తు జరపలేదని, ఖాలిద్‌కు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం కూడా చెప్పలేదని హైకోర్టు గుర్తించింది. నిజానికి చోరీ జరిగిన సమయంలో కాకుండా రెండు మూడు గంటల తర్వాత ఖాలిద్‌ను అరెస్టు చేశారు. దీంతో తప్పుడు వ్యక్తిని దోషిగా నిర్ధారించారే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని హైకోర్టు న్యాయమూర్తి ఎస్పీ గార్గ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఖురేషీ తన అనుచరుడు జీతుతో కలిసి పురణ్సింగ్, జగన్నాత్ల వద్ద రూ. 50, రూ. 40 చోరీ చేశారు. జీతుపై పోలీసులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో ట్ర యల్ కోర్టు అతణ్ని విడుదల చేసింది. బాధితుడు పురణ్సింగ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జగన్నాథ్, తాను మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు తమను దోచుకున్నారని, పట్టుకునేందుకు ప్రయత్నించేలోగానే వారు అడవిలోకి పారిపోయారని చెప్పాడు. దీతో తాము పనిచేస్తున్న ఇంటి సెక్యూరిటీ గార్డులకు అడవిలోకి వెళ్లాల్సిందిగా చెప్పడంతో వారు ఖాలిద్‌ను పట్టుకున్నారని తెలిపాడు. జీతూ తర్వాత అరెస్టయ్యాడన్నారు. అయితే ఈ కేసులో జీతూ, ఖాలిద్, పోలీసులు ఇచ్చిన వాంగ్మూలాలు దేనికది భిన్నంగా ఉందని, ఖాలిద్‌ను కూడా తప్పుగా కేసులో ఇరికించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.